2005 తర్వాత అన్నిటినీ పరిశీలిస్తూ, విశ్లేషిస్తున్నప్పుడు నెం.5 వర్గానికి, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ మధ్య నడిచే భాష కూడా మాకు స్పష్టంగానే అర్ధమయ్యింది. కొన్ని ఉదాహరణలు చెబుతాను. గత టపాలలో చెప్పినట్లు.... గతంలో, ముఖ్యంగా 1992 కు ముందర, సినిమాలలో సోనియా పేరు ఏ పాత్రకూ వాడబడలేదు. సరే ’రాజకీయాల్లో ఓ వ్యక్తి ప్రముఖం అయ్యాక ఆ పేరుకు పావులారిటీ రావటం, దాంతో సినిమాలలో వాడబడటం సహజం’ అనుకుందామన్నా..... రామోజీరావు పుట్టు పుర్వోత్తరాల గురించి - ’ఇతడు కృష్ణాజిల్లా నూజీవీడు మండలానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టాడనీ, కమ్మకులస్థుడు గనుక తెదేపాని ప్రోత్సహిస్తాడనీ’ ఓ మాట ప్రచారంలో ఉంది.

ఈ నేపధ్యంలో ’అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్దారు’ అనే సినిమాలో, [రవి తేజ, కళ్యాణి నాయకా నాయికలూ నటించారు.] ఓ పాట ఉంటుంది. "నూజివీడు సోనియా. ఆడుదామా దాండియా!’ అని. అది నెం.5 వర్గం నుండి నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, సినిమాల ముఖతః నడిచిన భాషలో ఒక ఆంశం.

"గతంలో, మాకు తెలియక ముందు, ఎంతో నమ్మకంగా ప్రధాని ఇంట ప్రవేశించి, ఇందిరాగాంధీ కోడలు కాదు కూతరన్నంతగా నమ్మించి, రాజీవ్ గాంధీ జీవిత భాగస్వామినంటూ సలహాలిచ్చి బోఫోర్సు బురదలోకి దించి... చాలా ఆటలూ ఆడావు కదా? ఇప్పుడు ఆడదామా దాండియా? నమ్మించి ద్రోహం చేయటం కాదు గూఢచర్యం అంటే! అది కుట్ర మాత్రమే! మిమ్మల్ని మీచేతే బహిర్గతం చేస్తామని చెప్పే చేస్తున్నాము. ఇక కాచుకో!" - ఇదే సవాలు నెం.5 వర్గం నుండి విసరబడింది.

ఆ సినిమాలో నాయిక అసలు పేరు సోనియా కాదు, కళ్యాణి. సినిమాలో ఆమె ధరించిన పాత్ర పేరూ సోనియా కాదు, స్వాతి. ఏ మాత్రం సంబంధం లేకుండా, అసంధర్భంగా, పాడబడిన, చిత్రీకరించబడిన, dream song "నూజివీడు సోనియా! ఆడుదామా దాండియా!" - ఇది మాకు స్పురించిన [అర్ధమైన] రోజున గమ్మత్తుగా అన్పించింది. ఇలాంటివి చాలా చూసిన తరువాత మేధోపరమైన ఆట, యుద్ద కౌశలాన్ని తలపించింది.

ఇంకా గమ్మత్తేమిటంటే - ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, మా బ్లాగులో ఓ టపాలో వ్రాస్తూ "మామిడి పళ్ళలో నూజివీడు మామిడిపళ్ళు ప్రశస్తమైనవంటారు. అలాగే నకిలీ కణిక వ్యవస్థకు చెందిన ఏజంట్లలో సోనియాది ప్రశస్తమైన స్థానం" అని వ్రాసాను. బ్లాగు పాఠకులెవరైనా దాన్ని యధాలాపంగా[casual గా] చదువుతారు. ఎందుకంటే, దాని కార్యకారణ సంబంధాలేవీ తెలియవు గనక.

అయితే ఆ మర్నాడు ఈనాడులో, నూజివీడు మామిడి పళ్ళ ఎగుమతి దిగుమతుల గురించి ఓ బాక్సు ఐటం వార్తాంశంగా వచ్చింది. అందునా అది మామిడిపళ్ళ వ్యాపార సీజనూ కాదు. ఆ విధంగా కూడా రామోజీరావు, తన అక్కసు దాచుకోలేని తనంతోనూ, అరిషడ్వర్గాలతోనూ, తనకు తానే, నెం.5 కూ తమకూ మధ్య నడిచే భాష తాలూకూ అంశాన్ని నిర్దారించాడు. అచ్చంగా మొన్న మా బ్లాగులో అజ్ఞాతల పేరుతో అతడి తరుపున వ్రాయబడిన బండబూతులు, కారు కూతల మాదిరిగా నన్నమాట.

ఇలాంటిదే మరో సంఘటన ఏమిటంటే - సోనియా, కేసీఆర్ ల 2009 ఎన్నికల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా, తెలంగాణా కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష పూనటం! ఆ ప్రకారం కేసీఆర్ ని తెలంగాణా గాంధీని చేస్తూ మీడియా, కాంగ్రెస్ పార్టీ, అధిష్టానమూ కూడా అతడి సెలైన్ బాటిళ్ళ నిరాహార దీక్షని నానా రకాలుగా హైలైట్ చేసారు. ఒక సామాన్య ఎంపీ లగడపాటికి తెలిసిన పాటి కూడా తెలియనట్లుగా, కేంద్రహోంమంత్రి చిదంబరం, న్యాయమంత్రి మొయిలీ, ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సాక్షాత్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లు కూడా, డిసెంబర్ 9 న సోనియా పుట్టిన రోజు కానుకగా ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర షూరూ ప్రకటన గురించి, కేసీఆర్ ఆరోగ్యరీత్యా అప్పటి ఒత్తిళ్ళు, అలాంటి ప్రకటనకు దారి తీసాయని చెప్పుకున్నారు.

ఇందరు ఇంతగా నాటకీయత పండించగా... విజయ వాడ ఎంపీ లగడపాటి, దీనికి మరింత నాటకీయత జోడించి ఏటీఎఫ్ తో కూడిన నిరాహార దీక్ష ని నిక్షేపంగా 30 ఏళ్ళపాటు కొనసాగించ వచ్చని నిరూపించి కుండబద్దలు కొట్టాడు. అది కేసీఆర్ + సోనియా, మీడియాల నాటకానికి, లగడపాటి ద్వారా, నెం.5 వర్గం ఇచ్చిన క్లైమాక్సు అంకం. అదీ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం తాలూకూ గూఢచర్య నెట్ వర్క్ లో నుండే, రామోజీరావు అనుచరుల ద్వారా పండించిన క్లెమాక్స్. అదీ.... నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులకీ, నెం.5 వర్గానికీ మధ్య నడిచే సవాళ్ళు ప్రతిసవాళ్ళ భాష!

కావాలంటే చూడండి! తెరాస అధినేత నిరాహార దీక్ష వ్యవహారానికి ఇచ్చినంత ఇమేజ్, కవరేజ్, మీడియా... ఎలక్ట్రానిక్ కానివ్వండి, పత్రికలు కానివ్వండి, లగడపాటి నిరూపించిన ఏటీఎఫ్ నిరాహార దీక్షకి ఇవ్వలేదు. ఒక్కరోజు, తూతూమంత్రంగా నడిపేసి గప్పుచుప్పున కూర్చొన్నారు. అంతే వేగంతో తెలంగాణా కందిరీగల తుట్టెని చల్లబరుచుకోలేక, ఇప్పటికీ సతమతమౌతు, శ్రీకృష్ణ కమిటీ దశావతారం [10వ అవతారం] ఎత్తి వచ్చింది. అలాగని వాళ్ళే చెప్పుకున్నారు మరి!

కేసీఆర్, కాంగ్రెస్ ల మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ను నిరూపిస్తూ.... కాంగ్రెస్, తెలంగాణా ఐకాస నుండి బయటకు వచ్చినా, కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేయకపోయినా, ఏమీ అనని తెరాస వాళ్ళు, తెదేపా నాయకులు ఏమీ చేసినా తప్పబడుతూ ఉన్నారు. అదీ.... నెం.5 వర్గం, గూఢచర్య కుతంత్రాలను బహిర్గతం చేసే తీరు! నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం నిర్వహిస్తున్న, ప్రజలను మభ్యపరిచే ఇలాంటి చర్యలను, నెం.5 బహిర్గతం చేస్తూ.... ప్రజలలో రాజకీయచైతన్యాన్ని, రాజకీయ అవగాహనని కలిగిస్తోంది. రాజకీయనాయకులకి ప్రజల పట్ల ఎంతపాటి నిబద్దత ఉందో తెలియ చేస్తోంది. గమనించటం గమనించకపోవటం అన్నది ప్రజల విచక్షణని బట్టి ఉంటుంది.

ఇవే కాదు! ఇటీవల గోనె ప్రకాశ రావు రామోజీరావుని ఉద్దేశించి, ’అతడి ఆర్ ఎఫ్ సీ భూముల్లో నిజాం వారసుల భూమి ఉందనీ, ఎప్పటి కైనా అతడు దాన్ని వదులుకొని బయటకి రావాల్సి ఉంటుందీ’ అంటూ [23 నవంబరు, 09 న సాక్షి పేపర్ లో] " ప్రపంచంలోని ఏ దేశ అధ్యక్షులు గానీ, ప్రధానమంత్రులు గానీ రామోజీరావుని రక్షించలేరు" అన్నారు. అది రాజకీయ నాయకుల ముఖతః నడిచిన భాష! ఐబి అధికారి ద్వారా ’రామోజీరావు perfect business man' అని నెం.10 వర్గం అన్పిస్తే.... ఉండవల్లి ద్వారా ’మార్గదర్శి’ వ్యవహారాన్ని, నెం.5 వర్గం బయటకు రప్పించినట్లు!

లేకపోతే.... రికార్డుల ప్రకారం రామోజీరావు ఒక స్థానిక దినపత్రికకు అధిపతి. పచ్చళ్ళ వ్యాపారి! అతణ్ణి దేశ అధ్యక్షులో, ప్రధానమంత్రులో ఎందుకు రక్షించ ప్రయత్నిస్తారు? ’ఈ ప్రపంచంలో ఎవరూ నిన్ను కాపాడరు’ అన్న జనాంతికపు హెచ్చరిక కూడా కాదది. ప్రపంచంలో ఏ దేశాధ్యక్షులు గానీ, ప్రధానమంత్రులు గానీ కాపాడలేరన్న హెచ్చరిక!

అంతేకాదు, ఇలాంటి ప్రతి సందర్భంలోనూ, రామోజీరావు గానీ, పైకారణంగా వాళ్ళు చెప్పుకునే ’కులగజ్జి’తో కూడిన రామోజీరావు అభిమానులు గానీ, ఆనుచరులు గానీ... ఎవ్వరూ.... కనీసం పరువునష్టం దావా వేస్తామనీ, కోర్టుకెక్కుతామనీ అనలేదు. ఎవరు అన్నా , అనకపోయినా, ముందు రామోజీరావు అనాలి కదా? అనడు. ఎందుకంటే - అలా అంటే, మరికొన్ని ఆత్మహత్యాసదృశ్య అసైన్ మెంట్లు వస్తాయోమో, మరింతగా పెనం మీది నుండి పొయ్యింలోకి పడాల్సి వస్తుందేమో నన్న భయం, కొన్ని గూఢచార అనుభవాల తర్వాత కలిగిన జాగ్రత్త! అంతే కాదు, కోర్టు కెక్కి పరువునష్టం దావా వేస్తామనే సంగతి దేవుడెరుగు, కనీసం ఎదురు వాదన కూడా వినిపించరు. కిక్కురమనరు. అదీ ఇక్కడ గమనార్హమైన విషయం!

నిజానికి ఇందులో ఉన్న ఆసక్తకరమైన అంశం ఏమిటంటే - 1992 కు ముందు వరకూ నడిచిన నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ, శతాబ్దాల తరబడి నిర్వహించబడి, నిర్వహించబడుతున్న గూఢచర్యం వలయాన్ని, అనువంశీయంగా నడుపుతూ రామోజీరావుకి ఒక పెర్వర్షన్ ఉంది.

అప్పటికి అందరికీ తెలియకపోయినా [ఎప్పటికో అప్పటికి, తగిన సమయం వచ్చాక ప్రకటించుకోగలమన్న నమ్మకం ఉంది] ఈ సమస్త భూప్రపంచం తమ చిటికెన వేలి మీద తిరుగుతుందన్న పెర్వర్షన్! [ఇది గతంలో సినిమాలలో కూడా చిత్రీకరించబడింది.]

అమెరికా అధ్యక్షుల దగ్గర నుండి వివిధ దేశాధినేతల జాతకాలు, తమ చేతిలో ఉన్నాయని, తమ రిమోట్ తో తాము ఎలా ఆడిస్తే అలా.... దేశాలూ, వ్యవస్థలూ, వ్యక్తులూ.... కుప్పకూలటం దగ్గరి నుండి నిప్పులు చెరుగుతూ నిబిడాకాశంలోకి దూసుకు పోగలవన్న పెర్వర్షన్!

ఎంతటి సెలబ్రీటీ కెరీర్ అయినా.... తమ కొనగోటితో ఇలా తుంచితే తుత్తునియలు అయిపోతుందన్న పెర్వర్షన్!

ఎవరి జాతకాలైనా తమ చేతిలో ఉన్నాయన్న పెర్వర్షన్! ప్రపంచానికింకా వెల్లడి కాకున్నా తామూ అపర బ్రహ్మలమన్న పెర్వర్షన్!

అలాంటి మనోవికారాలున్న అహంకారి, సామాన్య రాజకీయనాయకుల నుండి [అందునా చోటా మోటాలు.... ఉండవల్లులు, గోనె ప్రకాశరావుల వంటి వారు], సామాన్య పత్రికాధిపతుల [సాక్షి] నుండి, సామాన్య ఐటీ సంస్థ అధినేత నుండి, అలాగే డాల్ఫిన్ అప్పారావు నుండి, పురావస్తు విభాగం నుండి, స్మగ్లింగ్, భూకబ్జా గట్రా గట్రా కేసులను ఎదుర్కొంటున్నాడు.

అలాంటి.... రామోజీరావునీ, సినీరంగంలోని గాడ్ ఫాదర్ నీ ధిక్కరించి.... రాజా, కళ్యాణ్ ల వంటి ఛోటా మోటా నటూలూ, నిర్మాతలూ నిందించటమూ, విమర్శించటమునా? మేరుపర్వతం ముందు గుండ్రాతి గెంతులు అన్నట్లుగా గాకపోతే! ఇలాంటివి అహంకారపూరితుడైన గూఢచర్య సామ్రాట్టుకు గొడ్డలి పెట్టువంటివి!

ఇవే కాదు, స్థలాల క్రయవిక్రయాలు, లీజు వ్యవహారాలలో సామాన్య ప్రజలు రామోజీరావుని విశాఖ పట్టణంలోని పోలీసు స్టేషన్ ల గడపలు కూడా ఎక్కించి దించారు. సాక్షాత్తూ అతడి బంధువులు, అతడు చైనా ఏజంటుగా పనిచేసాడని ఆరోపించటం వంటివి గతంలో అతడు ఊహించి అయినా ఉండడు. అందునా తానొక వ్యక్తి కాదు వ్యవస్థని అనుకుని, అంటూ.... విర్రవీగిన వాడు, దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని సైతం ఢీ కొట్టిన వాడు. వ్యక్తిని చూసి గాకపోయినా పదవీ అధికారాలని చూసైనా వెనక్కి తగ్గాలిగా! ప్రధాని పదవీ అధికారాల ముందూ, పత్రికాధిపతి పరపతి, అంత ఎక్కువ కాదు గదా? ఎక్కువే అయ్యేటట్లయితే.... మరి ఇప్పుడా పరపతి, రాష్ట్రముఖ్యమంత్రి దాకా అఖ్ఖర్లేదు, సాధారణ ఎంపీ, ఎంఎల్ ఏ లనూ నిలవరించలేకపోతోంది, అతడికి స్థలం లీజుకిచ్చిన సామాన్య పౌరులనీ నియంత్రించ లేకపోతోంది.

ఏ స్ట్రాటజీ రీత్యా గానివ్వండి, తనని మాటలన గలగడం, విమర్శించగలగడం, తన్ని తగలేసినంత పని చేయగలగడం! ఇంతకన్నా అతడి వంటి దురఃహంకారికి పెద్ద శిక్ష ఉండదు. దేశాధినేతల బ్రతుకులే తమ దయాదాక్షిణ్యాల మీద ఉన్నాయనుకునే వాళ్ళకి ఓ సామాన్యుడు [అందునా సామాన్యుడంటేనే వీళ్ళకి చాలా చులకన కూడా!] ఢీ కొట్టటం కంటే అవమానం, హ్యుమిలియేషన్ మరొకటి ఉండదు. ఆ శిక్షే, ఇప్పుడు రామోజీరావు అందుకుంటున్నాడు. నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ అందుకుంటున్నది. తమ సువర్ణముఖిలో, ’బహిర్గతం’లో, భాగంగా మరీ ఎదురుకుంటున్నారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

*అంతే కాదు, కోర్టు కెక్కి పరువునష్టం దావా వేస్తామనే సంగతి దేవుడెరుగు, కనీసం ఎదురు వాదన కూడా వినిపించరు. కిక్కురమనరు. అదీ ఇక్కడ గమనార్హమైన విషయం!*

I am also wondering why they did not take any legal action on your blog.

>>అమెరికా అధ్యక్షుల దగ్గర నుండి వివిధ దేశాధినేతల జాతకాలు, తమ చేతిలో ఉన్నాయని, తమ రిమోట్ తో తాము ఎలా ఆడిస్తే అలా.... దేశాలూ, వ్యవస్థలూ, వ్యక్తులూ.... కుప్పకూలటం దగ్గరి నుండి నిప్పులు చెరుగుతూ నిబిడాకాశంలోకి దూసుకు పోగలవన్న పెర్వర్షన్!
5 ఆరేళ్ళకైతం ఇటువంటి సీన్ ని నేను పియర్స్ బ్రాస్నన్ నటించిన ఒక జేంస్ బాండ్ సినిమాలో చూసాను అందులో విలన్ ఒక మీడీయా సామ్రాట్ .హీరోయిన్ మిచేల్ ఖాన్ తో .ఎప్పటికైనా ఈ ప్రపంచం నాచెప్పుచేతల్లో ఉంటుందని చాలెంజ్ చేస్తాడు . అయితే అప్పట్లో ఆ సీన్ ప్రపంచ మీడియా కింగ్ రూపర్డ్ మర్డొక్ గురించి అని నేను అనుకున్నాను , ఆ వెంటనే నాకు రామోజీ రావు కూడా గుర్తొచ్చాడూ , అయితే ఇతనికి అంత సీన్ ఉండదులే అని అప్పట్లో అనుకున్నాను , ఆ తరువాతే తన తెలివిజన్ చానళ్ళను దేశమంతా విస్తరించాడు. ఒకేసారి 12 చానెళ్ళను ప్రరంభించాడు

మొదటి అజ్ఞాత గారు : మీ ఆశ్చర్యానికి మరికొన్ని అంశాలు! మేం బ్లాగు వ్రాయటం ప్రారంభించిన మొదటి రోజుల్లో, అంటే 2009 లో, కేరళలో ఎవరి బ్లాగులోనో ఏవేవో వ్రాసారనీ, దాని మీదట బ్లాగు రచయితల మీదే గాక, ఆ బ్లాగులో వ్యాఖ్యలు వ్రాసిన వారి మీద కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఓ సంచలన ప్రచారం వచ్చింది. మన బ్లాగ్లోకంలో కూడా దాని గురించి ప్రస్తావనలు నడిచాయి.

తదుపరి ఓ లాయరు [నాకు గుర్తుండి రామారావు అన్న పేరుగల వాడు.] అదేదో వెబ్ సైట్ మీద చర్య తీసుకోవలసిందిగా హైకోర్టులో పిటిషన్ వేయబూనటం, వారం పది రోజుల్లోగా హైకోర్టు స్పందిస్తుందనీ కూడా పత్రికల్లో వార్తాంశం వచ్చింది. ఉండవల్లికి లాగే ఎప్పటికీ వారం పూర్తి కాలేదో, లేక, తదుపరి కోర్టు ప్రక్రియల గురించి మీడియా కవర్ చేయలేదో గానీ, ఇక ఏ చప్పుడూ లేదు. భయపడే వాళ్ళని భయపెట్టవచ్చు కాబట్టి.... బ్లాగు రచయితలకే కాదు, వ్యాఖ్యాతలకు కూడా రిస్క్ ఉందన్న మాట. తస్మాత్ జాగ్రత్త సుమా! :)

రెండవ అజ్ఞాత గారు : ఇర్వింగ్ వాలెస్ ఆల్ మైటీ కూడా ఇదే బాపతండి. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu