శీలం - స్త్రీ గౌరవం, వ్యక్తి మాన మర్యాదల విషయంలో.... నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గాల మనోవికారాలు ఎంతటి వంటే - వేశ్యాపుత్రుడు తొలితరం నకిలీ కణికుడైనందున, ఆ మనోవికారాలనీ, లజ్జా రాహిత్యాన్నీ ఒక సిద్దాంతమనే స్థాయికి మార్చి, తర్వాతి తరాలకి, అనుచర వర్గాలకి తీవ్రస్థాయిలో సంక్రమింప చేసేంతగా! వీళ్ళు.... ఒక స్త్రీకి ఒకే పురుషుడు అనుకునే సీతమ్మలనీ, ఒక పురుషుడికి ఒకే స్త్రీ అనుకునే రామయ్యలని చూసి ఓర్చలేరు.

అంతే కాదు, ఏ దేశమైనా, ఏ కాలంలో అయినా [350 ఏళ్ళనుండి] స్త్రీని అగౌరవ పరచనిదీ, మలిన పరచనిదీ నకిలీ కణిక అనువంశీయులకి మనశ్శాంతి ఉండదు. అందుకే నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ స్త్రీ లోలుడికే ఎక్కువగా సీన్ ఇస్తుంది. స్త్రీని ఉపయోగించే [ఉంపుడుగత్తె గానో, కుదరకపోతే వివాహం ఎరగా వేసో] వెన్నుపోటు పొడుస్తుంది. నమ్మించి ద్రోహం చేయించటానికి కూడా, ఎక్కువగా, స్త్రీనీ, వివాహేతర సంబంధాలనీ వాడుతుంటుంది.

ఈ విషయంలో నెం.5 వర్గపు దృక్పధమూ, పనితీరూ కూడా చాలా స్పష్టం! వివరంగా చెప్పాలంటే -

వ్యక్తులంతా కలిసి ఒక దేశపు గౌరవాన్ని, ఒక జాతి గౌరవాన్ని కాపాడగలరు. అంతే కాని, ఒక దేశం [లేదా ఒక జాతి] తరుపున ఒక వర్గం, దేశంలోని వ్యక్తులందరి గౌరవాలని కాపాడలేదు. కాపాడవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే - మనం జన్మించినంత మాత్రానా ఈ దేశాన్ని ఉద్దరించినట్లు కాదు. ఈ దేశం మనకి ఋణపడీ లేదు. సంస్కృతి వారసత్త్వాన్ని, జీవితాన్ని ఇచ్చినందుకు ఈ గడ్డకే మనం ఋణపడి ఉన్నాము. ఏ విధంగా అయితే, జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకి ఋణపడి ఉన్నామో, విద్యాబుద్దులు చెప్పినందుకు గురువులకు ఋణపడి ఉన్నామో, అదే విధంగా, జీవితాలనిచ్చినందుకు మాతృ దేశానికి ఎవరైనా ఋణ పడి ఉండవలసిందే!

1980 వ దశకంలో, అప్పట్లో ప్రముఖ రచయిత్రి ఉరఫ్ కలల బేహారిణి, యుద్దనపూడి సులోచనా రాణి ఒక నవల వ్రాసింది. ’ఈ దేశం నాకేమిచ్చింది’ అన్న పేరుతో. మీడియా దానికి విపరీత ప్రచారం కూడా ఇచ్చింది. అందులో నాయకుడు ఓ పోలీసు ఇన్ స్పెక్టర్ లెండి. కథ విషయానికంటే ఆ పేరుకే ప్రచారం ఎక్కువ వచ్చింది. కాలేజీ విద్యార్ధులలో అది పెద్ద చర్చ కూడా అయ్యింది.

నిజానికి ’ఈ దేశం నాకు [అంటే మనకి] ఏదయినా ఎందుకివ్వాలి? బ్రతికేందుకు ఇంత చోటు నిచ్చింది, చాలదూ! గొప్ప సంస్కృతికి వారసుల్ని చేసింది. అది చాలదా? అందుకు మనమే దేశానికి ఏమయినా ఇచ్చే స్థితిలో ఉండాలి గానీ, దేశం నాకేమిచ్చిందనటం ఏమిటి?’ - ఈ వాదనకి ఆ రోజు ఏ మైకూ ఇవ్వబడలేదు. కన్న వాళ్ళని పట్టుకుని "ఏమిచ్చారు మాకు? జన్మ నివ్వమని మేము ఏడ్చామా? ఫలానా వాళ్ళు తమ పిల్లలకి కార్లూ బంగళాలూ ఇచ్చారు. మీరేమిచ్చారు మాకు మట్టి తప్ప!" అంటూ, తల్లిదండ్రులని కండ కావరంతో కూడిన కారు కూతలు కూయటానికి, కొందరు యువతీ యువకులకి, ఇలాంటి భావజాల బీజాలు ప్రోత్సహించాయి. నిజానికి తల్లిదండ్రుల నుండి ఆస్థులు ఆశిస్తున్నారంటేనే, ఆ పిల్లలకు బ్రతకలేమన్న భయం ఉందన్న మాటే కదా! అలాగే, ఆ మాటలు అన్పించుకున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రులుగా విఫలమయినట్లే కదా! ఇది వ్యక్తికయినా, దేశానికయినా వర్తిస్తుంది.

ఇక సదరు రచయిత్రిని కలల బేహరిణి అనటం ఎందుకంటే - ఈమె వ్రాసిన గిరిజా కళ్యాణం, సెక్రటరీ గట్రా ప్రఖ్యాత నవలల్లో, పేదింటి అమ్మాయికి [అత్మాభిమానం ఉండటం షరా మామూలు లెండి] ధనికుడైన యువకుడో, లేక అతడి తాతా/బామ్మ గట్రాలో తారసపడటం, కొంత సాగుడు డ్రామా తర్వాత పేదింటి అమ్మాయి కాస్తా సంపన్నుల ఇంటి కోడలై పోవటం - ఇదే కథాంశంతో బోలెడు బొచ్చెడు నవలల్ని పుంఖానుపుంఖాలుగా వ్రాసింది. నాటి టీనేజ్ అమ్మాయిలని అవాస్తవ కలల ప్రపంచంలో విహరింప చేస్తూ, మహా జోరు వ్యాపారం నడిపించబడింది. సాహిత్యం ద్వారా ప్రజా దృక్పధాన్ని ప్రభావపరచిన నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గాల కుట్రలో ఇలాంటి రచయిత్రీ/రచయితలది ప్రముఖ పాత్రే! సామాజిక స్పృహతో రచనలు చేసిన మాదిరెడ్డి సులోచన వంటి వారు, ప్రమాదవశాత్తు[?] మంటల పాలై మరణించారు. ఇది ఇక్కడ ఆపి మళ్ళీ వృక్తి గౌరవం, స్త్రీ మర్యాద దగ్గరికి తిరిగి వద్దాం.

జీవితాలనిచ్చినందుకు మాతృ దేశానికి ఎవరైనా ఋణ పడి ఉండవలసిన చోట.... దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని కాపాడటం వ్యక్తులందరి బాధ్యత కదా! వ్యక్తి తన గౌరవాన్ని తాను కాపాడుకున్న నాడు, జాతి గౌరవం దానంతట అదే కాపాడబడుతుంది. ప్రతీ వ్యక్తి తనని తాను గౌరవించుకున్నప్పుడు, ఆత్మగౌరవం గల జాతి, దేశం, తలెత్తుకు నిలబడుతుంది. ప్రతి యువకుడూ ఒక రాముడై, తన సతిని తప్ప పరాయి ఆడవాళ్ళను మాతృసమానంగా భావిస్తే.... రావణుడు ఎక్కడా ఉండడు. ప్రతి స్త్రీ అదే క్రమశిక్షణని చూపిస్తే సీతలే తప్ప శూర్పణఖలుండరు. పురుషులైన రామ లక్ష్మణులని కామించి, కామం తీరని క్రోధంతో, రావణుణ్ణి రెచ్చగొట్టిన శూర్పణఖ, రామాయణంలో అసలు విలన్!

ధర్మహీనులు, నీతి బాహ్యులు దేన్నీ ఎదురించలేరు, ఎవరిని నిలదీయలేరు. కాబట్టి ప్రజలని అనైతికత వైపు తరమటమే అజెండాగా పెట్టుకుంది నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ. 1992 నాటికి నెం.5 వర్గానికి, నకిలీ కణిక వ్యవస్థ ఉనికితో పాటే వాళ్ల అజెండా కూడా మరింతగా స్పష్టమయ్యింది. అప్పటికే, ఒక్క భారతదేశమే కాదు, యావత్ర్పపంచమూ అదే దిశలో అమిత వేగంతో పరుగెడుతూ ఉంది. దాన్ని ఆపటం కంటే.... అప్పటి వరకూ ఆపటానికి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఆపివేయటమే సరైన పరిష్కారంగా నెం.5 వర్గం భావించింది. ఇక్కడ.... పీవీజీ మేధస్సు, హిందూ ధర్మం పట్ల ఆయన కున్న అపార అవగాహన స్పష్టంగా కన్పిస్తాయి.

కామి కాని వాడు మోక్ష కామి కాడు అంటారు. గుప్పిలి మూసి ఉన్నంత సేపు అదో తపన, అదో యాతన. కామం వెంట పరుగెత్తనిస్తే.... ఉబలాటం తీరాకనైనా ’హద్దులు లేని కామం జీవితాలని శిధిలం చేస్తుందన్న’ సత్యం బోధపడుతుంది. క్రమశిక్షణ గల కుటుంబజీవితం, మమతలతో కూడిన భార్యభర్తల బంధం, చెబితే అర్ధం కానిది. అనుభవంతో మాత్రమే తెలిసేది. ఒక్క శారీరక వాంఛ విషయంలోనే కాదు, ఏ భోగలాలస విషయంలోనైనా ఇంతే!

వివేకానంద స్వామి అంటారు - "నువ్వు దుష్టుడివైతే మరింత దుష్టుడివికా! ఏదో నాడు నీవు వెనుదిరుగుతావు" అని! అదే సూత్రాన్ని పాటిస్తూ నెం.5 వర్గం, అప్పటి వరకూ ఆ విషయంలో నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ వ్యతిరేకిస్తున్న, తమ స్థాయిలో పోరాడుతున్న మంచి వారిని కూడా ప్రక్కకి తప్పించింది. బారికేడ్లు తొలగించింది. ఫలితం.... పరుగు పర్వత శిఖరాగ్రం చేరుతుంది. అప్పటికైనా స్పృహ కలిగితే వెనుదిరిగి రావాలి, లేదా.....? శిఖరాగ్రం తర్వాత ఉండేది లోయలోకి దూకటమే!

అదే ఈ సమస్యకు పరిష్కారం! కాబట్టే విచ్చల విడి శృంగారానికి వచ్చే ఎయిడ్స్ వంటి రోగాలకి మందులు కనిపెట్టబడలేదు. అలాగే విపరీతంగా తాగి జనం చనిపోయినా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే తన మీద తనకే శ్రద్దా బాధ్యతలు లేని వ్యక్తుల వల్ల వ్యవస్థకి గాని, దేశానికి గాని ఏం ప్రయోజనం?

అందుకనే సెన్సార్ వంటి నామామాత్రపు పనులు కూడా మరింత నామ మాత్రం చేయబడ్డాయి. అటువంటి అసైన్ మెంట్లని మొదట్లో నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ ఆత్మహత్యాసదృశ్యంగా గుర్తించనందున, అది తమ గెలుపుగా, నెం.5 వర్గపు ఓటమిగా తలచింది. ఉత్సాహంగా అమలు చేసింది. ఓటమే స్ట్రాటజీ కాబట్టి నెం.5 వర్గమూ అదే నడవనిచ్చింది.

దాంతో.... చూశాం కదా? ప్రియమణులు, నయన తారలు, ప్రియాంకా కోఠారీలు - ఇంకా పేర్లు చెప్ప సాధ్యం కాని సినిమా సుబ్బమ్మల జాబితా చాంతాడంత ఉంటుంది. పొట్టి నిక్కర్లు కూడా, మరికొంత క్రిందికి లాగి లోదుస్తులని ప్రదర్శిస్తూ సినిమా స్త్రీ నటుల నిలువెత్తు ఫోటోలతో ఈనాడు, సాక్షి గట్రా అన్ని దిన వార మాస పత్రికలు ప్రజలకి కనువిందునో, కడుపు మంటనో కలిగిస్తున్నాయి. స్త్రీలతో సమానంగా అర్ధనగ్న శరీరాలని ప్రదర్శిస్తూ జాన్ అబ్రహంల వంటి సినిమా సుబ్బయ్యలకూ కొదవ లేకుండా పోయింది.

సరే! రక్తమాంసాల స్త్రీ పురుష శరీరాలని దుస్తుల్లేకుండా చూసి ఎంత చొంగ కారుస్తారో కార్చనీయండి. శేరో అర్ధ శేరో చొంగ కార్చాక నయినా వెగటు పుట్టదా? ఊరువులు ఎడంగా పెట్టి, పృష్థ భాగాన్ని, వక్ష స్థలాన్ని ఊపుతూ,అసభ్యకర విన్యాసాలని నృత్యాల పేరుతో [ఆంగ్లంలో దాన్ని కొరియోగ్రఫీ అంటారట] చూసి ’మాస్ యువతరం’ అనుకుంటూ, ఎందరు, ఎంత కాలం ఈలలు లేస్తారో వేయనీ! ఎప్పటికైనా దవడలు నొప్పి పుట్టవా?

ఆ ’యావ’ తీరాక నయినా "ఓర్నాయనో! ఇదేమిటీ" అనిపించదా? అనిపించక పోతే.... ఆ వెగటు పుట్టేదాకా ఇది కొనసాగుతుంది. కాబట్టే, సినిమాలలో లంగా సైజు తగ్గి తగ్గి, చివరికి చిన్న గుడ్డ ముక్కలు శరీరానికి కప్పేస్థితికి వచ్చాయి. ఇప్పటికే నట్టింట దెయ్యంలా కూర్చున్న టీవీ! ప్రైవేటు ఛానెళ్ళలో లెక్కలేనన్ని అవకాశాలు!... ఇప్పుడు సినిమా నటీనటుల పృష్ఠ వక్ష భాగాల ఊపుళ్ళనే నృత్యాలనుకొని కేరింతలు కొడుతున్న వారు, ఆ మోజులో పడి ఉరుకుతున్న కొందరు తల్లిదండ్రులూ, పసిపిల్లలకు కూడా ఆ అరగొర గోచీ పాతలు [క్రింది చిన్న నిక్కరు, పైన ఓ రిబ్బను ముక్క] వేసి, డాన్సు బేబీ డాన్సు అనో క్రేజీ కియారే అనో మరో తొక్క అనో గెంతులు వేయిస్తోంటే, చూడలేక తలలూ గుండెలూ బాదుకుంటున్న వాళ్లు ఎందరో ఉన్నారు. ఎంతగా తలదించుకు పోదామనుకుంటూ, తిట్టుకుంటూ, రాజీపడుతూ బ్రతికినా, చివరికి ప్రతిఘటించక తప్పని స్థితి వస్తోంది. ఈ రోజు చొంగకారుస్తున్న వాళ్ళకైనా ఏదో ఒక నాడు ఇలా ప్రతిఘటించే స్థితి రాక తప్పదు.

ఒక్క టీవీ ల్లోనూ, సినిమాల్లోనే కాదు.... గడ్డం గీచుకునే బ్లేడు దగ్గరి నుండి ప్రతి వస్తువుకీ అర్ధనగ్న స్త్రీ చిత్రాలలో నడిచే వాణిజ్య ప్రకటనలు, [ఫలానా Body Spray వాడితే మూకుమ్మడిగా అమ్మాయిలంతా గుంపుగా వచ్చి మీద పడిపోతారనే లాంటివి ], క్రీడారంగంలో కురచ దుస్తులు వేసుకుని ఫ్లాస్టిక్ చెత్త చేత్తో పట్టుకుని చిందులు వేసే ఛీర్ గర్ల్స్... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే! ఇటీవల రాజకీయ నాయకులు సైతం భరించలేక ఛీర్ గర్ల్స్ నీ, బీచ్ వాలీబాల్ వాళ్ళనీ చీదరించుకున్నారంటే... అదీ పరిస్థితి తీవ్రత. అంత తీవ్రదశకు చేరాకనైనా చలించక తప్పదు కదా!?

ఇక వ్యక్తుల జీవితాలలో అనైతికత ప్రభావం ఎంతగా అంటే - ఉంపుడుగత్తెలు కాస్తా రెండవ, మూడవ భార్యలుగా పిలవబడుతున్నారట[?] 2008 లో ఆర్దిక మాంద్యం బాహాటంగా తలబయటకి పెట్టే దాకా.... మీడియా "జేబులు పట్టనంత జీతాలు, వీకెండ్ పబ్బుల్లో చిందులూ" అన్నది. ’తాగితే తప్పేమిటి? వేదాల్లోనూ ఉందంటూ’ సమాధానాలూ విన్పించాయి. మంచైనా చెడైనా... ఏది ఆచరించే అవకాశమైనా ప్రతీ మనిషికీ ఉంది. అది ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలని బట్టీ, విచక్షణని బట్టీ ఉంటుంది.

బలవంతంగా ఎవరు ఏం చేయించగలరు? అందునా వ్యక్తుల్ని భయపెట్టో, బెదిరించో, బలప్రయోగం చేసో, చెడుని చేయింపగలరేమో, ఇప్పటి దాకా నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ చేయించినట్లుగా! వ్యక్తుల చేత బలవంతంగా చెడుచేయించినట్లుగా మంచి చేయించలేము. ఎందుకంటే - వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా చేయించటమంటేనే చెడు! ఇక చెడుతో మంచిని ఎలా చేయించగలం? అదే చెడు అయి కూర్చుంటుంది కదా! సునిశితమైన ద్వంద్వం ఇది. విత్తుముందా చెట్టుముందా లాగా!

కాబట్టి.... మంచి పనిని, మంచి ఆలోచనని, వ్యక్తులు వాళ్ళంతట వాళ్ళే స్వచ్చందంగా చేయాలి. ఈ విషయమై వ్యక్తులని చట్టాలు గానీ, ప్రభుత్వాలు గానీ నియంత్రించలేవు. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసికెళ్ళ గలం గానీ నీళ్ళు తాగించలేమని చెప్పేది ఇలాంటి సందర్భాల గురించే! మత విశ్వాసాలు, విలువలు, ధర్మం పట్ల నమ్మకాలు మాత్రమే నియంత్రించగలవు. వాటినే నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ తమ మీడియా బలంతో, ధనంతో, పదార్ధ వాద ప్రచారంతో ధ్వంసం చేసింది.

నెం.5 వర్గం తాలూకూ ఈ ప్రయత్నం కొంత ఫలించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే - ఎన్ని మాయపొరలూ, మోజుల తెరలూ కప్పినా.... భారతీయుల రక్తంలోని వారసత్వం, ఎండి మోడు వారిన బీడులో సైతం వాన చినుకు పడగానే పుడమి చీల్చుకు వచ్చే అంకురం లాగా, మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటుంది. ఇప్పటికీ... కథలో అంతర్లీనంగా కన్పించే ’దుష్టుడి బారిన పడి వెతలు పాలయిన యువతిని కాపాడే యువకుడు నాయకుడిగా ఉన్న కథలే’ సినిమాలలో, మిగిలిన వాటికంటే అనూహ్యమైన భారీ విజయాన్ని నమోదు చేయటం దాన్నే సూచిస్తోంది.

ఉదాహరణలు చెప్పాలంటే ’ఒక్కడు, పోకిరి, వర్షం, సింహాద్రి’ గట్రాలు.... అదే ఎంత భారీ తారాగణం ఉన్నా, నాయిక, డబ్బుకోసం ప్రతీనాయకుణ్ణి ప్రేమించడం అనే కాన్సెప్టులున్న సినిమాలు డబ్బాతిరిగాయి. ’సైనికుడు’ లాగా! చివర్లో హీరోయిన్ హీరోని ప్రేమించానన్నా సరే! అలాగే సినిమాలకి ఎన్ని మిర్చిమసలాలు కలిపినా, హీరోయిన్ ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి అందాలు ఆరబోసినా [అదేమైనా పిండా ఆరబోసేందుకు! మీడియా అదే పదం ఉపయోగిస్తుంది గనక ఉటంకించాను.] సినిమా కాసులు కురిపించలేదని ఇటీవల దర్శక నిర్మాతలు వాపోవటం కూడా జరుగుతోంది. ఇక హైస్కూలు లాంటి చెత్తల్ని అయితే ప్రజలే న్యాయచర్య తీసుకొని ఆపించారు. కాబట్టి కూడా, ఈ విషయంలో నెం.5 వర్గం, ’ప్రజలకి అనుభవంతోనే తత్త్వం బోధపరుచుకోనీ’ అనుకొంది.

ఇక్కడ మీకు ఒక చారిత్రక అంశాన్ని వివరిస్తాను. మీడియా ఏమాత్రమూ ప్రచారించని విశేషం ఇది. ఒకప్పుడు బుర్రకథా రూపంలో, పద్యనాటక రూపంలో ప్రజా బాహుళ్యంలో ప్రచారంలో ఉండి.....కళారూపాలన్నిటినీ అణిచివేస్తూ సినిమా ఏకైక కళారూపంగా అవతరించడంతో, ప్రజల జ్ఞాపకాల నుండి కూడా మాయమైన అంశం! ఒకప్పుడు శతక కావ్యంగా కూడా కీర్తించబడిన ’శ్రీకాకుళాంధ్ర దేవుని చరిత్ర!’

శ్రీకాకుళాంధ్ర దేవుడంటే ఇదేదో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కథ కాదు. శ్రీకాకుళం అనే గ్రామంగా మిగిలిపోయిన ప్రదేశానికి సంబంధించినది. నాకు గుర్తుండి కృష్ణా జిల్లాలో ఉందీ గ్రామం. చిన్నప్పుడు ఏపీ దర్శన్ టూరులో భాగంగా, శ్రీకాకుళాంధ్ర దేవుని గుడిని కూడా దర్శించాను.

గిరిజన తండాల ఆసరాతో, గ్రామాలపై దోపిడిలూ, ఆరాచకాలు సృష్టిస్తున్న మూకలని నిర్మూలించడం.... స్వల్ప సైన్యం, అరకొర ఆర్దిక బలం ఉన్న, శ్రీకాకుళాంధ్రులుగా పిలవబడిన రాజులకి సాధ్యపడలేదు. ప్రజలు కూడా ’అన్నీ ప్రభుత్వమే చేయాలి’ అనే అలసత్వ స్థితికి చేరి ఉంటారు. అలాంటి స్థితిలో ప్రజలని చైతన్యవంతుల్ని చేయడానికి, స్త్రీల మాన ప్రాణాలని, ప్రజల ఆస్తి పాస్తుల్ని కాపాడటానికి, శ్రీకాకుళాంధ్ర రాజు ఓ నిర్ణయం తీసుకుంటాడు.

అదేమిటంటే - రాజ్యాన్ని దేవుడికి అర్పించటం! ఇక రాజంటూ లేడు. రాజు కూడా దేవుని సైనికుడే! అలాగే ఆ రాజ్యంలోని ప్రతి పౌరుడూ దేవుడి సైనికుడే! అప్పటి వరకూ రాజ సైనికులుగా ఉన్న వాళ్ళు, గ్రామ గ్రామానికీ వెళ్ళి యువకులకి యుద్దవిద్యలు నేర్పుతారు. ప్రతి వ్యక్తినీ ఒక యోధుడిగా మారుస్తారు. అందరూ కలిసి అరాచకం సృష్టిస్తున్న ముష్కరులని మట్టుబెడతారు. ముష్కర మూకలు గ్రామాల మీద పడినప్పుడు ప్రజలు ప్రభుత్వసాయం కోసమూ, రాజ సైనికుల రక్షణ కోసమూ ఎదురు చూడరు. పౌరుషంతో, పరాక్రమంతో, తామే అపర వీరభద్రులై అరాచకం చేస్తున్న ముష్కరులని ఎదుర్కొంటారు.

అప్పటి నుండి శ్రీకాకుళాంధ్ర రాజులు ’శ్రీకాకుళాంధ్ర దేవుల’ వంశంగా పిలవబడతారు. అందుకు గుర్తుగా శ్రీకాకుళ గ్రామంలో ఆంధ్ర దేవుని ఆలయం నిర్మించారు. ఆ గుడిలో విష్ణు రూపమే ఉంటుంది. ఈ కథని సినిమాగా మలచినపుడు ఎన్టీఆర్, జమున, ఎస్వీఆర్ వంటి గొప్ప నటీనటులతో, చక్కని సంగీతం, స్ర్కిప్టులతో అద్భుతంగా నిర్మించారు. సహజంగానే సాంకేతిక విలువలతో నిండిన సినిమా, కథా, కళా విలువలూ తోడై జానపద కళారూపాలని తోసి రాజన్నది. దాంతో క్రమంగా బుర్ర కథ, పద్య నాటకాలకి ఆదరణ తగ్గింది. ఆ తర్వాత మెల్లిగా ’శ్రీకాకుళాంధ్ర దేవుని కథ’ సినిమా, సినిమా తీరుగానే ప్రక్కకి వెళ్ళిపోయింది.

ఆ నిశ్శబ్దంలో నుండి.... స్ఫూర్తిదాయకమైన ఆంధ్రుల స్థానిక చరిత్ర మౌనంగా అంతర్థానమయ్యింది. అందునా సినిమాగా మలచేటప్పుడు, ముష్కర మూకల నాయకుడికీ, ఆంధ్ర దేవుల యువరాజుకీ మధ్య హృధ్యమైన వైరాన్ని, అతడి కుమార్తెకీ యువరాజుకీ మధ్య రమ్యమైన ప్రణయాన్ని జత చేసి, ముష్కర మూకల ఆగడాలకు మంత్రి + తదితరులు కారణంగా చూపెడుతూ, మూల కథకు మార్పు చేర్పులు చేశారు. ఏతావాతా అసలు స్ఫూర్తినీ, చారిత్రక నిజాన్ని , చాలా పకడ్బందీగా మూసేసారు.

రూపుమాసిన ఆ మూల కథనే, ఇప్పుడు నెం.5 వర్గం.... భారతదేశానికే కాదు, యావత్ర్పపంచానికీ పునరావృతం చేయిస్తోంది. అదే '300' సినిమాగా మరోసారి ప్రపంచం ముందుకు వచ్చింది. స్పార్టన్లకు సంబంధించిన ఆ కథలో చారిత్రక వాస్తవాలు ఎంతో తెలియదు గానీ, కాన్సెప్టు మాత్రం.... ప్రతీ పౌరుడు ఒక సైనికుడై దేశ స్వాతంత్రాన్ని, జాతి గౌరవాన్ని కాపాడుకోవలసి ఉండటమే! నిజానికి ’300’ అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన సినిమా!

అందులో....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

Great article madam. I am expecting one article on Swamijies from you. I want know your explanation on all fake swamijies coming out one by one.

అజ్ఞాత గారు : గత టపాలలో చెప్పానండి.

>> ఎందుకంటే తన మీద తనకే శ్రద్దా బాధ్యతలు లేని వ్యక్తుల వల్ల వ్యవస్థకి గాని, దేశానికి గాని ఏం ప్రయోజనం?

ఒహ్ ... అద్భుతమైన విశ్లేషన ఇది నా మనస్తత్వానికి దగ్గరగా ఉంది - శ్రద్ద, బాధ్యతలు, క్రమశిక్షణ లేనివాడు వ్యవస్త, దేశానికే గాదు తనకూ తన కుటుంబానికి కూడా పనికి రాడు. పాన్ పరాగులు ,గుట్ఖాలు, మందు,సిగిరెట్లు లాంటి దుర్వ్యసనాలు గల వ్యక్తుల ముఖాలను చూస్తే కళావిహీనంగా ఉంటాయి . అటువంటి వ్యక్తులు ఈ దేశానికి ఏ విధంగా సహాయపడగలరు ? కనీసం వీళ్ళు ఆరోగ్యవంతమైన జాతిని నిర్మించగలరా ? 300Knights సినిమలో ఇదికూడా ఒక పాయింట్. అందులో తమను తాము రక్షించుకోవాడానికి వాళ్ళు (స్పార్టన్స్) ఒక తెలివైన, ఆరోగ్యవంతమైన జాతిని లేదా తరాన్ని నిర్మించుకోవడమొక్కాటే మార్గమని ఆ దిశగా అడుగులు వేస్తారు. అందుకు వాళ్ళు పాటించే పద్దతులు చాలా కఠినంగా ఉంటాయి

రెండవ అజ్ఞాత గారు : మా విశ్లేషణ మీ మనస్తత్వానికి దగ్గరగా ఉందో లేదో మాకు తెలియదు, మీరెవరో పేరూ ఊరూ తెలియదు గనుక. మా అభిప్రాయంలో వ్యసన పరుడి కంటే కూడా పిరికి వాడు మరింత నిష్ప్రయోజకుడు. చక్కని అభిప్రాయాలని వ్యక్తీకరించిన మీరు అజ్ఞాతలుగా ఉండటం పిరికితనమేననుకుంటా! ఆలోచించండి. :)

సిరివెన్నల గారి పాట "తల ఎత్తి జీవించు తమ్ముడా" లొ ప్రస్థావిచిన
శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి.. అన్న వాక్యం నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. Thank You Amma garu.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu