గత మూడు టపాలలో 300 సినిమా గురించిన విశ్లేషణ వ్రాసాను. ఇప్పుడు.... ఆ సినిమా నేపధ్యంలో నెం.5 వర్గానికీ, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గాలకీ మధ్య నడిచిన భాషనీ, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థానిక భాషల్లోకి అనువదింపబడిన రీత్యా, సామాన్య ప్రేక్షకులపైన ఆ సినిమా ప్రభావాన్ని గురించీ కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను.

ఈ చిత్రంలో స్పార్టాకు చెందిన లియోనైడర్స్, అతడి 300 మంది యోధులు.... ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పని చేస్తున్న, తమ మాతృ దేశాల పట్ల నిబద్దత, మానవీయ విలువల పట్ల నమ్మకమూ గల నెం.5 వర్గానికి ప్రతీకలు.

అప్పటి వరకూ.... జెక్సీస్ ఇచ్చిన లంచాలకూ, కెరీర్ ఆశలకూ లొంగిన మత పెద్దలూ, మంత్రి పుంగవులూ తమని మభ్యపెట్టటంతో, వాళ్ళ అసత్య ప్రచారాన్ని నమ్మిన స్పార్టన్లు.... ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలకి ప్రతీకలు! గూఢచర్య కుట్రలేవీ తెలియక... మత పెద్దల మాటల వంటి మీడియా వార్తల్ని నమ్ముతూ, రాజకీయ కార్పోరేట్ కంపెనీల బ్యూరాక్రాట్ల మాయా జాలాలని దాటలేక పోయిన వారు! బయటికొస్తున్న రకరకాల ప్రచారాలకీ, సంచలనాలకీ కార్యకారణ సంబంధాలు తెలియక అయోమయానికి గురైన వారు!

జెక్సీస్ బొమ్మ ముద్రించిన బంగారు నాణాలతో సహా, రెడ్ హాండెడ్ గా పట్టుబడిన మంత్రి తెరాస్ వంటి వారి అవినీతి బహిర్గతం కావటంతో నిర్ఘాంతపోయిన వారు! యుద్దరంగం నుండి వచ్చిన ప్రత్యక్ష యోధుడు ఇచ్చిన సమాచారంలోని సత్యాన్ని గ్రహించి స్ఫూర్తి పొందిన వారు! తమ స్వాతంత్రాన్ని, మానవత్వాన్నీ, ధర్మాన్నీ, దేశాన్ని రక్షించుకునేందుకు అలస్యంగానైనా స్వయంగా యుద్దరంగానికి కదిలేందుకు సిద్దపడిన వాళ్ళు!

ఏనాటి కైనా ప్రపంచ పౌరుల గమ్యం ఇదే!

ఇక జెక్సీస్ బానిసలు, దూతలు, రహస్య గూఢచారాలు.... వీళ్ళు, ప్రపంచవ్యాప్తంగా నెం.10 వర్గంలోని ఏజంట్లకు ప్రతీకలు! జెక్సీస్.... సాక్షాత్తూ నకిలీ కణిక అనువంశీయులకి ప్రతీక!

జెక్సీస్ కీ లియోనైడర్స్ కీ మధ్య నడిచిన సంభాషణలూ, జెక్సీస్ దూతలకీ స్పార్టా యోధులకీ మధ్య నడిచిన సంభాషణలూ.... నకిలీ కణిక అనువంశీయులు, నెం.10 వర్గానికీ, నెం.5 వర్గానికీ మధ్యనడిచిన భాషకు మచ్చుతునకలు. గత టపాలలో వాటి గురించి వివరించాను.

ఈ సినిమా ముఖతః ఇంత స్ట్రాటజీ ఉంది కాబట్టే.... 300 సినిమా గురించి మీడియా ఏ కవరేజ్ ఇవ్వలేదు. దాదాపుగా గమ్మునుంది. అదే స్లమ్ డాగ్ మిలియనీర్, 2012 లాంటి సినిమాలకైతే, ఆస్కార్ రావటానికి ముందుగానే, అందుకు పునాదులు వేస్తున్నట్లుగా విరగ ప్రచారం చేసేసింది. అంతే కాదు, 300 సినిమాకి పేరడీగా Meet the Sportans పేరుతో మరో సినిమా నిర్మించబడిందట. అది స్టార్ టీవీ ల వంటి వాటిల్లో ప్రసారమూ చేయబడిందట. దాన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు, నెం.10 వర్గానికి 300 సినిమా మీదా, నెం.5 వర్గం మీదా ఎంత అక్కసు ఉందో!

దీన్నే చిన్న పరిమాణంలో చెబుతాను. ఆ మధ్య లండన్ లో ఓ మహిళ తన చదువు కోసమూ, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన తన ఆర్దిక అవసరాలు కోసమూ, వేశ్యావృత్తి నెరపానంటూ, తన ఆత్మ కధని తన బ్లాగు ద్వారా వెలువరించింది. అది మీడియా ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. చివరికి మన తెలుగు బ్లాగ్లోకంలో కూడా దాని మీద సమీక్షలు, విమర్శలూ వచ్చాయి.

ఓ స్త్రీ వేశ్య నయ్యానంటూ ఆత్మకథ వ్రాస్తే.... దానికి వచ్చిన పాటి ప్రచారంలో వెయ్యో వంతు కూడా.... ఓ కుటుంబం - అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆత్మకథకు, అమ్మఒడికి రాలేదు చూడండి, అలాగన్న మాట. ఎందుకంటే ఆ మీడియాని, నెం.10 వర్గాన్ని అమ్మఒడి బహిర్గతం చేస్తుంది కాబట్టి. మరో మాటలో చెప్పాలంటే అది చెడు - ఇది మంచి కాబట్టి! అలాగే 300 యోధులు సినిమా, స్వేచ్ఛ కోసం పోరాటానికి చెందినది కాబట్టే, మీడియా దానికి ప్రచారం కల్పించలేదు. దేశభక్తియుతమైన సినిమాకు మీడియా ప్రచారం కల్పించకపోవటాన్నే, నెం.5 వర్గం expose చేసింది.

ఇది ఎలాంటిదంటే - అచ్చంగా, తన [అమితాబ్ బచ్చన్] అభిమాన నటుణ్ణీ చూడటానికి మానవ వ్యర్ధపు గుంతలోంచి దుమికిన స్లమ్ డాగ్ కథకీ, సినిమాకి వచ్చినంత ప్రచారమూ, అవార్డాలూ.... దేశ స్వాతంత్రం కోసం పోరాడిన 300 మంది యోధులు కథకీ సినిమాకీ రానట్లుగానే!

ఈ రకపు విన్యాసాలతో రామోజీరావు/నెం.10 వర్గం, మాకు చెప్ప వచ్చేదేమంటే - "చూశావా? ఎంత కష్టపడి ఎన్ని నిజాలు వ్రాస్తే మాత్రం లాభం ఏమిటి? అదే మాకు లొంగిపోతే? మేం ఎవరినైనా ఎంత పాపులర్ చేస్తామో చూడు. డబ్బుకు డబ్బూ, పేరుకు పేరు, ఏది కావాలన్నా ఇవ్వగల వాళ్ళం మేము" అని!

దీన్నే ముఖం మార్చి, మాకు చెప్ప వచ్చేదేమంటే - "చూశావా? నువ్వు ఎంత కష్టపడి ఎన్నినిజాలు వ్రాస్తే మాత్రం లాభం ఏమిటి? నువ్వు చెప్పవలసిన వేదిక ఇది కాదు. బ్లాగును డిలీట్ చెయ్యి. సోనియా నెం.10 వర్గం అని నువ్వు పొరబడుతున్నావు. నెం.5 వర్గంలోని సోనియా దగ్గరికి వెళ్ళి నీకు తెలిసిన అన్నివిషయాలు చెప్పు. లేదా ఒక సీడీకి మొత్తం విషయాలు ఎక్కించి పంపు! అప్పుడు నీ సమస్యలన్నీ తీరతాయి. అంతే గాని ఇక్కడ చెబితే మాత్రం ఉపయోగమేముంది? ఈ బ్లాగ్లోకం ఏం చెయ్యగలదు?" అని!

ఇక ఈ 300 సినిమా, మాకు ఎలా under line అయ్యిందంటే - మేము మామూలుగా సినిమాలు బాగానే చూస్తాము. కాకపోతే ధియేటర్ కి వెళ్ళేది తక్కువగానూ, సీడీలు సేకరించి ఎక్కువగానూ చూస్తుంటాం. మా పాపకి ఆమె మాష్టారొకాయన, తోటి సహాధ్యాయులు, స్నేహితులూ చెవినిల్లు కట్టుకొని 2012 సినిమా చూడమని గోలపెట్టారు. [ఈ సంవత్సరం పదవ తరగతి మా పాపని స్థానిక స్కూలులో చేర్పించాము.]

"ఆ! శతకోటి గ్రాఫిక్స్ సినిమాలలో ఇదీ ఒకటి! మన వాళ్ళు గ్రాఫిక్స్ ని భక్తి రసం చూపటానికి ఉపయోగిస్తే, పాశ్చాత్యులు దాన్ని భీభత్స రసాన్ని చూపటానికి ఉపయోగిస్తారు. అంతే కదా!" అని మేం పట్టించుకోలేదు. అయితే 2012 గురించిన సిఫార్సులు అంత కంతకూ ఎక్కువయ్యేసరికి ఓ ఆదివారం సీడీ సేకరించాము. అందులో 2012 తో పాటు 300 సినిమా ఉంది. అదీ తెలుగు డబ్బింగ్ తో! 2012 మాకు మామూలుగా నచ్చలేదు. 300 చూసి మజా వచ్చింది.

మేం సినిమా చూసాక ఆ విషయం ఎవరితోనూ చర్చించకపోయినా, ఫలానా 2012 సినిమా చూడమన్న సిఫార్సులు మాత్రం ఆగిపోయాయి. ఇలాంటివి మనసుకి పట్టినప్పుడు కూడా విషయం మరింత విశదపడుతుంది.

అయితే ఈ అంశం అక్కడితో అయిపోలేదు. అసలు ఆసక్తికరం ఇక్కడే ప్రారంభమైంది. ఎలాగంటే - మర్నాటి నుండీ ఈనాడు రామోజీరావు మాతో పత్రికాముఖంగా నడిపిన నిరంతర [వార్త] భాష స్రవంతి తో! సూటిగా చెబుతాను.

300 సినిమాలో చూపించినట్లు జెక్సీస్ [నకిలీ కణిక అనువంశీయులు] అతడి అనుచరులూ, బానిసలూ.... మన దేశం మీద కుట్రదారులే అనుకో! లియోనైడర్స్ లాగా పీవీజీ వాళ్ళ మీద పోరాడి ఓడి అసువులు బాసాడు[అట. అప్పటికి మేమింకా ఓటమి స్ట్రాటజీ గురించి మాకున్న అవగాహనని బ్లాగులో వ్రాయలేదులెండి.] ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ, బలపరుస్తూ, అందుకోసం వ్యూహాత్మకంగా, ఢిల్లీ జనపధ్ 10 రాణి సోనియా, అవినీతి పరులతో లాలూచీ పడిందట. [లేడీ పోకిరి అన్నమాట!] అవినీతిపరులని నమ్మించేందుకు తామూ కొంత మేరకు అవినీతికి పాల్పడుతుందట. ఆ విధంగా అవినీతి పరులని కూడా కలుపుకు పోయి, పోరాటానికి సాయం అందించేందుకు ప్రయత్నిస్తోందట. అందుకోసమే, ప్రస్తుతం దేశంలో, తాత్కాలికంగా అవినీతి పెచ్చరిల్లి కన్పిస్తోందట.

ఇక్కడ అవినీతిగా నేను చెబుతోంది ఆమె ఆర్ధిక రాజకీయ అవినీతుల గురించి మాత్రమే. అంతే గాని లియోనైడర్స్ భార్య రాణికి లాగా శారీరక అనైతికత గురించి ఎంతమాత్రం కాదు.

ఇంత అతుకుల బొంత కధాకథనాలని మాకు చెప్పబోవటం, ఒక్కరోజు ఈనాడుని చూసీ, ఒక్క వార్త శీర్షికని చూసి చెప్పటం లేదు సుమా! నిన్నటి పత్రిక ప్రధాన పేజీలో ’ఒట్టు మేమంతా మీ జట్టు’ వంటి వందలాది [వేలాది కావచ్చు కూడా] అంశాల సహితంగా చెబుతున్నాను. అదొక అనుశృత వార్తా స్రవంతి.

మచ్చుకి కొన్ని:

సూక్తి: అవేశాన్ని తగ్గించుకుని, ఊహాలోకంలో విహరించడం మానివేసిన వ్యక్తి తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ విజయం సాధించగలుగుతాడు. - జెరమైకోలియర్

చిలక జోస్యం కథ: క్లుప్తంగా ఈ కథ. ఈ కథలో ఒకవ్యక్తికి ’నువ్వు రాజు’వవుతావు అని చిలక జోస్యం చెబుతుంది. అస్తి నిలబెట్టుకోవటానికి ప్రయత్నించకుండా, కలలు కంటూ ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. గ్రామాలు పట్టి పోతాడు. ఒకరోజు గుడి దగ్గర ఓ వృద్ద దంపతులు "నాయనా నువ్వు అచ్చం మా అబ్బాయిలా ఉన్నావు. మా అబ్బాయి చనిపోయాడు. నీలో మా అబ్బాయిని చూసుకుంటాము. నువ్వు మాతోనే ఉండు" అంటారు. ఆ సోమరి సరేనంటాడు. తీరా వాళ్ళ ఇంటికెళ్ళెసరికి అది ఒక గుడిసె. వాళ్ళిద్దరు అడుక్కునే వాళ్ళు. ఆ వృద్దదంపతులిద్దరు "నాయనా! మన ముగ్గురం మూడు వీధులకి వెళ్ళి అడుక్కుంటే రోజులు హాయిగా గడిచిపోతాయి. మా అబ్బాయి పేరు రాజు. కాబట్టి ఈ రోజు నుండి నిన్ను ’రాజు’ అని పిలుస్తాము" అంటారు. ఆ విధంగా ఆ సోమరి రాజు అయిపోయాడు.

అనువర్తన: మమ్మల్ని ఆ సోమరితో పోలుస్తూ, ’ఏ ఉద్యోగం చేయకుండా, ఇలా బ్లాగు వ్రాస్తూ ఉంటే ఏదో గొప్పవాళ్ళు అవుతారనుకున్నారా? చివరికి అడుక్కు తినాలి సుమా’ అని హెచ్చరిక అన్నమాట.
~~~~~~~

వేమన పద్యం: మంచివో చెడ్డవో తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనించక ఇతరులను దూషించడం తగదు. అలా చేసే వాడు వ్యర్ధుడు. [మా లోపాలు గమనించుకోకుండా సోనియా బృందపు లోపాలు ఎంచుతున్నామట.]
~~~~~~~~

సూక్తి: పొదుపు చేయాల్సిన చోట ఖర్చు చేయకు. ఖర్చు చేయాల్సిన చోట పొదుపు చేయకు - మహాత్మ గాంధీ.
[ఇది ఓ మిత్రుడు అప్పుగా డబ్బు పంపిన రోజులలో, ఈనాడు చెప్పిన సూక్తి.]
~~~~~~~~

వేమన పద్యం: తొందరపాటుతో చేసిన ఏ పనీ సత్ఫలితాన్ని ఇవ్వదు. పచ్చికాయను తెచ్చి మగ్గపెడితే పండవుతుందా?

ఆషాఢభూతి కథ: కథలో శిష్యుడిలా మేం మొదట నమ్మకంగా ఉండి అన్ని విషయాలు గ్రహించి, ఇప్పుడు వాటన్నింటిని బహిర్గతం చేస్తూ నెం.5 వర్గం పనికి ఆటంకం కల్గిస్తున్నామట.

వేమన పద్యం: జ్ఞానం లేని ఎద్దుకు ఒక ఏడాది చెపితే మన మనసు తెలుసుకుని నడుచుకుంటుంది. అయితే మూర్ఖుడైన వాడికి ముప్ఫై ఏళ్ళు చెప్పినా మనం చెప్పినట్లు నడుచుకోలేడు.

సూక్తి: నీకు లేని దాని గురించి ఆలోచించకుండా ఉన్న దాన్ని ప్రతిభావంతంగా తీర్చుదిద్దుకోవటమే పాజిటివ్ ధింకింగ్. - జిడ్డు కృష్ణమూర్తి.

వేమన పద్యం: ఓడ నీళ్ళపై తిన్నగా సాగిపోతుంది. నేలపైన బారెడు కూడా నడవలేదు. స్థానం తప్పితే ఎంత నేర్పరి అయినా ఎందుకూ కొరగాడు. [బ్లాగులో చెప్పటం సరికాదు.]

వేమన పద్యం: ఎన్ని మాటలైనా చెప్పవచ్చు గానీ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల కన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది. [ఏవేవో బ్లాగులో వ్రాసేస్తున్నామట.]
~~~~~~~

సూక్తి: ప్రేమ ఉన్నచోటే శాంతి నెలకొంటుంది. - మదర్ ధెరెసా.

సూక్తి: శారీరకంగానే కాదు ఎదుటి వారిని మాటలతో బాధించిన అది హింసే అవుతుంది -మహాత్మాగాంధీ.

వేమన పద్యం: కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు. కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల సాధన సులభమవుతుంది. అందుకే శాంతమే శ్రీరామరక్ష. [సోనియా మీద కోపం కొద్దీ వ్రాస్తున్నామట.]
~~~~~~

సూక్తి: ఒకరిపై పెత్తనం చెలాయించడం కాదు, తోటి వారికి సేవ చేయడం నేర్చుకో - రామకృష్ణ పరమహంస.

సూక్తి: పరస్పర విశ్వాసం, పరస్పర సహాయం ద్వారా గొప్పపనులు, గొప్ప పరిశోధనలు జరిగాయి.

వేమన పద్యం: ఉప్పు, కర్ఫూరం రెండూ తెల్లగా ఒకే రీతిగా ఉన్నట్లు కనిపిస్తాయి. వాటి రుచులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అదే విధంగా పురుషులంతా ఒకే విధంగా కనిపించినప్పటికీ గుణాల్ని బట్టి పుణ్యాత్ములెవరో, చెడ్డవారెవరో గ్రహించవచ్చు. [సోనియానే అన్నీ నడుపుతున్నప్పుడు సామాన్యులమైన మేము ఆమెకి చెప్పేదేముంటుంది. ఆమె నెం.5 వర్గం తరుపునే పని చేస్తున్నట్లయితే రామోజీరావుపై చర్య తీసుకుంటే సరిపోతుంది కదా అని మేము బ్లాగులో వ్రాసిన నేపధ్యంలో వచ్చిన సూక్తులు ఇవి. ]
~~~~~~~

ఈ నేపధ్యంలో మాకు ఎప్పుడూ చెప్పేది అదే - ’సోనియా నెం.5 లో వ్యక్తి. లేదా నువ్వు నెం.5 వర్గాన్ని, నెం.10 వర్గమనీ, పదిని అయిదనీ పొరబాటు పడుతున్నావు. కాబట్టి సోనియాని నమ్ము. నమ్మి, బ్లాగు డిలీట్ చేసి ఢిల్లీ వెళ్ళు. వెళ్ళి, ఇప్పటి వరకూ బ్లాగులో చెప్పినవే గాక ఇంకా నీకు ఏమేమి తెలుసో, అవన్నీ చెప్పెయ్!’ - ఇదే ఒత్తిడి.

అందరికీ తెలియకుండా తమకి మాత్రమే తెలిస్తే - అది తమకు ఉపయోగం. అందరితో పాటు తమకీ తెలిస్తే ఏంప్రయోజనం? అందుకే బ్లాగు డిలిట్ చెయ్యమన్న ఒత్తిడి. ఎంతగా అంటే - దాదాపు మూడేళ్ళుగా మా ఆర్దిక మూలాలు నలిపి వేసేంత! కష్టపడి ఉద్యోగం వెదుకున్నంత సమయంలో పదో వంతు చాలు ఊడగొట్టడానికి! మరో ప్రయత్నం పలించనివ్వని ఒత్తిడి చేయడానికి!

ఉద్యోగం ఊడగొట్టాక చెప్పె భాష్యం ఏమిటంటే, "నేను 5 వర్గం తరుపున చెప్తున్నా.... నువ్వు ఉద్యోగం చెయ్యడం కాదు. ముందు బ్లాగు డిలీట్ చెయ్యి. సోనియాకి విషయం చెప్పు! నీ సమస్యలన్ని పరిష్కారమవుతాయి" అని. వై.యస్. బ్రతికున్నరోజుల్లో వై.యస్.కయినా చెప్పు అంటూ డిడి లో వై.యస్. కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ చెప్పును చూపించేవాడు. [చెప్పు అంటే tell అని అర్ధమన్న మాట. వై.యస్. చనిపోయినప్పుడు ఆ కాలు తెగి పడిపోయింది. బాక్స్ కట్టి ఫోటో వేసి మరీ చూపబడింది.]

ఓ ఉదాహరణ చెబుతాను. బ్లాగు ప్రారంభించిన తొలిరోజులోనే కొందరు అజ్ఞాతలు "నిజ జీవిత సమస్యలు తీరడానికి బ్లాగు వ్రాయటం ఎంత వరకూ ఉపయోగపడుతుంది?" అంటూ ప్రశ్నలు గుప్పించారు. ’దేని ప్రయోజనం దానికి ఉంటుంది లెమ్మని’ జవాబిచ్చాను. సింగపూర్ ట్రావెల్స్ ఏజన్సీ ఒకటి [WU Travels] మా బ్లాగుకి తమంత తామే వచ్చి వాణిజ్య ప్రకటన ఇచ్చింది. దాదాపు నాలుగు నెలలు గడిచినా దాన్నుండి మాకు ఎర్ర ఏగానీ రాలేదు. డబ్బులు రాకపోవటం కంటే, క్లిక్ కి వచ్చే డబ్బులెంత అన్న వివరాలు కూడా సరిగా ఇవ్వలేదు. ఆ విధంగా ఈ బ్లాగు నుండి నీకు దమ్మిడి రాదు అని మా బుర్రలకి బాగా ఇంకించే ప్రయత్నం చేయబడింది.

అలా ఆర్ధికంగా అన్నివైపుల నుండి వత్తిడి చేస్తూ, ఆ సమస్యలన్ని తీరాలంటే సోనియా గాంధీని కలిసి చెప్పటమే పరిష్కారమని ఉవాచ! అంతేకాదు, మా అమ్మఒడి బ్లాగుకు పట్టుమని వందక్లిక్కులు కూడా రావు. మేం మూసివేసినప్పుడు ఏ నెంబరు ఉంటుందో, తిరిగి మళ్ళీ మేం బ్లాగు తెరిచినప్పుడు అదే నెంబరు ఉంటుంది. దాంతో మాకు చెప్పేదేమంటే - "చూశావా? ఇంత కష్టపడి వ్రాసినా ఎవరికీ పట్టటం లేదు. ఎందుకీ వృధాశ్రమ? మాతో రాజీ పడు" అని.

ఒకోసారి "చూశావా? ఏ ఫలితమూ రావటం లేదు. ఎందుకంటే ఇది వ్యూహం కాదు. నువ్వు ఇలా వ్రాయటం ఆపేసి, బ్లాగు డిలీట్ చేసి పది జనపధ్ కి వెళ్ళు. వెళ్ళి అన్నీ చెప్పెయ్. అప్పుడు వ్యూహాత్మకంగా పోరాడవచ్చు" - ఇది మరో వెర్షన్ అన్నమాట.

’సోనియా దేశం కోసమే పనిచేస్తుంటే, అన్నీ తామే అయి నడుపుతున్నట్లే కదా? అలాంటి ఆమెకి, అందునా ప్రభుత్వాన్ని తిరుగులేని అధినాయకత్వంతో నడుపుతున్న ప్రభావశీల మహిళకి మేం చెప్పేది, చెప్పగలిగేది ఏమిటి? ఆమెకి తెలియనిది ఏమిటి?’.... ఇది జవాబు లేని ప్రశ్న!

సోనియా నెం.5 వర్గం తరుపున పనిచేస్తున్నట్లయితే పీవీజీ మీద పీకల దాకా కోపం ఎందుకు? - ఈ ప్రశ్నకూ జవాబుండదు.

ఇంతే కాక మేం ఎవరినయినా అప్పు అడిగామనుకోండి. అప్పుడు, ఈనాడు నిరంతర వార్తా స్రవంతిలో చెప్పబడే విషయం ఏమిటంటే - చూశావా? నువ్వు పోరాడాటానికి డబ్బులు అవసరం కదా? అలాగే అంతర్జాతీయంగా సోనియా పోరాడానికయినా కూడా డబ్బు చాలా అవసరం. కాబట్టి అవినీతి చేయకతప్పటం లేదు" - ఇది వినపింపబడేది. [వై.యస్. బ్రతికున్న రోజుల్లో అతడి అవినీతిని సమర్దిస్తూ కూడా ఇదే చెప్పబడేది.] ఇలా వాళ్ల అవినీతి సమర్ధన కోసం కూడా మా ఆర్దిక మూలాలు నలపబడేవి.

స్థూలంగా చెప్పాలంటే - ఈనాడు మాతో రెండు రకాలుగా మాట్లాడుతుంది.

1]. మేం నెం.10 వర్గమే అనుకో! చూశావా ఎంత బలవంతులమో! మమ్మల్ని కాదని ఎవరూ బ్రతకలేరు. కాబట్టి మాతో రాజీపడండి. మమ్మల్ని చూసి భయపడండి.

2]. లేదూ మేం నెం.5 వర్గం అనుకో! అయితే సోనియాని నమ్ము. వెళ్ళి నీకు తెలిసినందంతా చెప్పు. నువ్వు చేస్తున్నది వ్యూహాత్మకం కాదు. అందుకే మీకు ఉద్యోగం రానివ్వటం లేదు, ఉపాధి నడవనివ్వటం లేదు. డబ్బు అందనివ్వటం లేదు. వచ్చి మాతో చేతులు కలుపు. అప్పుడన్నీ సర్ధుకుంటాయి.

మొదటి వాదనకి భయపడినా, రెండవ వాదనని నమ్మి దగా పడినా.... తమకి ఫర్వాలేదు.

తొక్కలో మేము - భయపడినా, భ్రాంతిపడినా వాళ్ళకి ఒనగూడే ప్రయోజనమేముంది అంటారేమో!? పాతికేళ్ళ క్రితం భారతదేశమ్మీద కుట్ర జరుగుతోందని ఇందిరాగాంధీ అంటే - "తొక్కలో ఇండియా! పేద దేశం. ఏముందని, ఏమి దోచుకోవాలని ఇండియా మీద కుట్రలు చేయడానికి?" అన్నారు. అదే ఇప్పుడైతే.... ఇండియాలో దోచుకునేందుకు మానవ వనరులూ, భూగర్భ వనరులూ, విశాలమైన మార్కెట్టు వనరులూ.... శాతాబ్దాలుగా దోచుకుపోయినా కూడా ఇంకా ఎంత దోచుకోవటానికి మిగిలి ఉందో అర్ధమయ్యింది. అదీ, విదేశీ సంస్థలకి సరళీకృత ఆర్ధిక విధానాలతో తలుపులు తెరిచాక మరింతగా అర్ధమవుతోంది.

అలాగే తొక్కలో మేము! అసలు మొదటగా రాజీపడితేనో, భ్రాంతి పడితేనో కదా అర్ధమయ్యేది మాకు.... దాంతో వాళ్ళకి ఏం ఒరుగుతుందో?

నిజం చెప్పాలంటే - పై విధంగా రెండు రకాల భాషలనీ చూశాకే మాకు అసలు నెం.5 వర్గపు అస్తిత్వమూ, పనితీరూ స్పష్టంగా అర్ధమయ్యాయి. నెం.10 వర్గం నుండే నెం.5 వర్గం నడిపించే ఆత్మహత్యసదృశ్య అసైన్ మెంట్లూ, బహిర్గతాలూ, సువర్ణముఖిలూ కూడా అర్ధమయ్యాయి. అచ్చంగా మాయలోడు సినిమాలో రాజేంద్రప్రసాద్, డాక్టర్ మొహంలో నుండి కనిపించినట్లన్న మాట. ఇది ఇతరులు under line చేస్తేనే మాకు అర్దమయ్యింది. ఆ విధంగా ఏ విషయమయినా అర్ధం కాకపోతే దృశ్య రూపంలో చూపించబడుతుంది. ఈ విషయాలలో మేము నిమిత్తమాత్రులమే. మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతాయి.

మరో చిన్న ఉదాహరణ చెబుతాను. ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెత్ కావటంతో ప్రమాదంపాలైన వ్యక్తి అవయవాలని ఇతరులకి అమర్చటం గురించి వార్తలు తరుచుగా వస్తుంటాయి. కొందరు స్వచ్ఛందంగా తమ మరణానంతరం తమ అవయవాలని దానం చేయటం గురించీ చదువుతుంటాము. ఇటీవల మరణించిన జ్యోతిబసు ఇలాంటిదానాలు చేసినట్లన్న మాట.

2004 డిసెంబరులో పీవీజీ మరణించినప్పుడు కూడా, చాలాకాలంగా కోమాలో ఉన్న ఒక యువకుడి తల్లి, తన కుమారుడికి మెర్సీ కిల్లింగ్ ని అనుమతించాలనీ, అతడి అవయవాలని దానం చేయటానికీ అనుమంతిచాలనీ కోర్టుని అర్ధించింది. కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇంతలో ఆ యువకుడు మరణించాడు. అతడి తల్లి దుఃఖంతో ఆ యువకుడి అవయవాలని [వీలైనన్ని] అవసరార్ధులకి దానం చేసింది. అప్పుడదంతా మేము చాలా యధాలాపంగా చదివాము. ఎందుకంటే అప్పటికి మేం మా జీవితాల్లో రామోజీరావునీ అతడి గూఢచర్యాన్ని గుర్తించలేదు గనక!

అయితే ఆ తర్వాత, ముఖ్యంగా 2007 లో మేం శ్రీశైలం నుండి నంద్యాల చేరాక.... పీవీజీ మరణిస్తూ, తను అప్పటి వరకూ నిర్వహించిన పనులన్నీ విభజించి తన అనుచరులకి [వై.యస్., సోనియాతో సహా] అప్పగించాడనీ, అందుచేత మాకు తెలిసిన విషయాలేవో ఢిల్లీ వెళ్ళి జనపధ్ 10 అధినేత్రికి చెప్పాలనీ.... మాకు పదేపదే అర్ధమయ్యేంత వరకూ చెప్పబడింది, బడుతూనే ఉంది. ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే - ఒక దానిపై ఒకటి ఆధారపడిన పళ్ళ చక్రాల యంత్రంలో ఒక చక్రం తిరిగితే మరొకటి తిరగటం, దాంతో ఇంకొకటి - మరొకటి! ఇలా కదిలే వలయాల బొమ్మలతో సహా వార్తలు ప్రచురించి మరీ చెప్పబడుతుంది. గడియారంలో ఉండే పళ్ళచక్రాల వంటివి.

నల్లమేక నలుగురు దొంగలు కథలో నాలుగుసార్లు గాకపోతే నలభైసార్లు, అప్పటికీ కుదరకపోతే నాలుగువేల సార్లు చెప్పినట్లన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ధర్బల కంకణం చేతబూని ఊబిలోకి బాటసారిని ఆహ్వానించే పంచతంత్రంలోని వృద్ద వ్యాఘ్రం మాదిరిగా!

అయితే ’అయోధ్య’లో పీవీజీ స్పష్టంగానే తన అనుచర సభ్యుల గురించి వ్రాసారు. ’లోపలి మనిషి’లో మరింత స్పష్టంగా చెప్పారు.

ఇది మీకు మరింత స్పష్టంగా అర్ధం కావాలంటే మరి కొన్ని విషయాలు, సినిమాలు చెప్పాలి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

మీరు అర్జెంటుగా సాక్షి టి.వి. చూడండి అందులో అరుణ్ కుమార్ లైవ్ ఇంటర్వ్యు వస్తుంది . మిమ్మల్ని నమ్మించడానికి ( అంటె తాము నెం. 5 వర్గం అని రామోజీ మీద విమర్శలు గుప్పిస్తున్నాడు ) ఏదేదో వాగుతున్నాడు . అది చూసి సోనియ నెం.5 వర్గం అని మీరు నమ్మాలని నానా తంటాలు పడుతున్నాడు . విచిత్రమేమంటే మీ బ్లాగులో మీరు తరచూ వాడే " ధర్మో రక్షతి రక్షితః మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది " అని ఊదరగొడుతున్నాడు .

అజ్ఞాత గారు : మాకు డిష్ కనెక్షన్ లేదండి. దానిని కట్ చేయించి దాదాపు నాలుగేళ్ళు అవుతుంది. వార్తల కోసం మేము డిడి మీదే ఆధారపడతాము. సమాచారం ఇచ్చినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu