[ముందుగా ఓ చిన్న వివరణ –

భారతీయ ఇతిహాసాల మీద కుట్రని వివరించే క్రమంలో.... రామాయణ విషవృక్షాల వంటి రచనలూ, రంగనాయకమ్మల వంటి రచయిత్రి/రచయితలూ కుట్రకు సహకరించిన తీరు గురించి వివరించటమే తప్ప.... నాకు, సదరు రచయితలూ, రచయిత్రుల పట్ల కసీ ద్వేషాల్లాంటివి లేవు. అలాగని రంగనాయకమ్మల వంటి వారి స్థితి పట్ల జాలీ దయా కూడా లేవు. కుట్రకు సహాయంగా, వారి చర్యల ఫలితాల్నీ, తీరుతెన్నుల్నీ, పూర్వాపరాలనీ వివరించటమే నా ఉద్దేశం. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ విశ్లేషణని పరిశీలించగలరు.]

రావణ సోదరి శూర్పణఖ కథ సందర్భంలో.... రంగనాయకమ్మ, ఇంకా అలాంటి ఇతర వ్యక్తుల వాదన ఎలా ఉంటుందంటే..... సీతారామ లక్ష్మణులు పంచవటిలో నివసిస్తున్నప్పుడు శూర్పణఖ వారిని చూస్తుంది. రామ లక్ష్మణులని చూసి మోహ పడుతుంది. రాక్షస వనితగా తనకు గల కామరూప విద్యతో అందమైన మానవ కాంత రూపంలో శ్రీరాముడి దగ్గరి కొస్తుంది.

రాముడితో “ఓ సుందరాకారా! చూడు! నేను సౌందర్యవతిని. నీవు సుందరుడవు. ఈ ప్రకృతి నయన మనోహరంగా ఉంది. నాకు నీ మీద మనసయ్యింది. సమయాన్ని ఆనందంగా అనుభవిద్దాం” అంటుంది.

రాముడు తిరస్కరిస్తూ “నాకు భార్య ఉంది. మరో స్త్రీని కోరను. అదిగో నా సోదరుడు లక్ష్మణుడున్నాడు. అతడిని అడుగు” అంటాడు.

లక్ష్మణుణ్ణి చూసిన శూర్పణఖ అతడూ అందంగానే ఉన్నాడు అనుకుంటూ వెళ్ళి కోరిక వెళ్ళడిస్తుంది.

లక్ష్మణుడితో ఆమె తన కోరిక వెల్లడించినప్పుడు, అతడు “నేను శ్రీరాముడి సేవకుడను. నాతో నీవేమి సుఖించగలవు? నీవూ రాముడికి సేవిక కాగలవు. కాబట్టి వెళ్ళు” అంటాడు.

రంగనాయకమ్మ వాదన ప్రకారం..... రామ లక్ష్మణులు ఈ విధంగా శూర్పణఖతో ఆడుకున్నారు. ఆపైన ముక్కు చెవులు కోసి పరాభవించారు. ఇష్టం లేదంటే అదే చెప్పాలి గానీ ‘తమ్ముడి దగ్గరికి పో’ అని అన్న, ‘అన్న సేవకుణ్ణని’ తమ్ముడు..... ఎందుకిలా ఆడ (రాక్షసి)దానితో ఆడుకోవటం?

నిజానికి శూర్పణఖ హిపోక్రసీ లేకుండా, సూటిగా తన కోరికని చెప్పింది (అట). ఆమె హిందూ ఆర్ధడాక్స్ (సనాతన వాదుల) లాగానో, ఆర్యరాజుల లాగానో (ఆర్యుల గురించిన చారిత్రక వాదాలిక్కడ అప్రస్తుతం) గాకుండా, ఏ డొంక తిరుగుడూ లేకుండా ‘ఫ్రాంక్’గా ప్రకృతి సహజమైన తన కోరికని వెల్లడించింది(అట). ఓపెన్’గా తన వాంఛ వివరించింది(అట).

అలాంటి చోట.... రామలక్ష్మణులు ఆమె మీద ప్రాక్టికల్ జోకులు వేసారు (అట). ఆ విధంగా వాళ్ళిద్దరూ స్త్రీ పట్ల అది ఘోరమైన తప్పు చేసారు.

శూర్పణఖ దృష్ట్యా.... ఆ విధంగా కోరిక వెల్లడించటం, వివాహంతో నిమిత్తం లేకుండా నచ్చిన వారితో భోగించడం వారి జాతిలో సహజం. అదేమీ తప్పుకాదు. అలాంటి ఆచార వ్యవహారాలు రాక్షస జాతిలో సహజం. అవేవీ పట్టించుకోకుండా, రామలక్ష్మణులు శూర్పణఖని అవమానించారు. – ఇదీ సదరు విష వృక్ష వాదం.

ఎంతటి వితండ వాదమూ, కుతర్కమూ ఇది!?

ఎవరైనా ఆటవికులు.... చిక్కని అడవి నుండి వచ్చి, మన భూమిలోని చెట్లను నరికి, వాటిని తీసుకెళ్తూ, ‘తమకు నచ్చిన చెట్టును నరుక్కొని తీసుకెళ్ళటం తమ వ్యవహారాల్లో భాగమని’ అంటే – దాన్ని మనం అంగీకరిస్తామా?

అంతెందుకు? అడవిలో బ్రతికే వాడెవరైనా వచ్చి ‘అడవుల్లో మేం ఎక్కడంటే అక్కడ, మలమూత్ర విసర్జన చేస్తాం, అది మా అలవాటు’ అంటూ నగరాల్లో.... నడివీధుల్లోనో, పార్కుల్లోని పచ్చిక మీదో, మన ఇంటి ముంగిటి తోటలోనో మలమూత్రాదులు విడిస్తే...., ‘ప్రకృతి సహజంగా తమకు విసర్జనావసరం వచ్చింది, తీర్చుకున్నాం’ అంటే ఒప్పుకుంటామా?
““
‘‘సర్లే! అది వాళ్ళకి సహజం. అది వాళ్ళ జీవన శైలి’ అని సరిపెట్టుకుంటామా? వ్యతిరేకించి మన ప్రతిఘటన చూపించమా?

[ఇంత చిన్న విషయాలకే మనం వ్యతిరేకత చూపిస్తామే, అలాంటిది శ్రీరాముడంతటి వాడు శీలం విషయంలో చూపించడా?]

తప్పనిసరిగా వాళ్ళ ఆచార వ్యవహారాలనీ, అలవాట్లనీ, జీవనశైలినీ తిరస్కరిస్తాం. ఏదో విధంగానో, బలవంతానో దాన్ని వాళ్ళు మన నెత్తిన రుద్దడాన్ని ఒప్పుకోం.

అలాగాక, దాన్ని వాళ్ళు మన నెత్తిన రుద్దడాన్ని సహించి ఊరుకుంటే.... కొంతకాలం గడిచేసరికి మనం మనంగా మిగలం. మనం వాళ్ళ రూపంలో ఉంటాం. ఇప్పుడు జరిగిందీ, జరుగుతోందీ అదే!

వాస్తవానికి..... నకిలి కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల లక్ష్యం అదే, భారతీయులనీ, భావవాదులనీ, పదార్ధ వాదులుగా, పరుగుదారులుగా మార్చడం!

విషవృక్షం వంటి రచనలతో, యమగోల, సతీ సుకన్యల వంటి సినిమాలతో.... భారతీయ ఇతిహాసాల మీద సైటైర్లు, విసుర్లు, హేళనాపూరిత వ్యాఖ్యానాలూ చేసి ఆ లక్ష్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేసారు. కొంత వరకూ విజయం సాధించారు. ఇప్పుడు సమాజం, మనమూ కూడా ఆ దుష్ర్పభావాన్నీ చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. జీవితాల్లో శాంతినీ, బంధాలనీ, ఆనందాలనీ పారేసుకుని వెదుక్కుంటున్నాం.

కాబట్టే కుమార్తెల వంటి శిష్యురాళ్ళ మీద అత్యాచారాలు చేసే గురువుల్నీ, ముసలమ్మల్ని సైతం విడిచి పెట్టని తాగుబోతుల్నీ చూస్తున్నాం!

ఇక ఇప్పుడు రామాయణంలోని శూర్పణఖ అసలు కథని క్లుప్తంగా పరిశీలిద్దాం.

వనవాస దీక్షలో ఉన్న సీతారామలక్ష్మణులని చూసిన శూర్పణఖ, రాముడిపై మోహపడి, దాపుకొచ్చి తన వాంఛ వెల్లడించినప్పుడు, శ్రీరాముడామెతో “నేను భార్యతో ఉన్నవాడను. అదీగాక ఏకపత్నీ వ్రతం గలవాడిని. కాబట్టి మరో స్త్రీని కోరను. నీవంటి దానికి సవతిపోరు బాగుండదు. అదిగో నా తమ్ముడు లక్ష్మణుడున్నాడు. అతడూ ప్రియదర్శనుడు. మంచి వయస్సులో ఉన్నాడు. అతణ్ణి పొందితే ఏ బాధా ఉండదు” అన్నాడు.

‘అతడూ ప్రియదర్శనుడు అనటంలో నీకు రూపమూ, కామమూ తప్ప, మనస్సుతోనూ, ప్రేమాభిమానాతోనూ, భావాలతోనూ, పని లేనట్లయితే.... అతణ్ణి కోరు’ అనే సూచన ఉంది.

శూర్పణఖ వ్యక్తపరిచిన కోరికలోని కామానికి అది సూటి జవాబే కదా!?

లక్ష్మణుణ్ణి చూసిన శూర్పణఖ ‘అతడూ బాగున్నాడు’ అనుకొని చెంత చేరి వలపు తెలిపింది. అంతగా దేహ సౌందర్యం పట్ల కాంక్షామోహాలు గలది శూర్పణఖ! కాబట్టే రాముడు కనబడితే కాంక్షించింది. ‘రాముడు గాకపోతే లక్ష్మణుడు’ అనుకుంది. ఎవరైనా ఫర్లేదు, ఆమె కాముకత్వం తీరటమే ఆమెకు ప్రధానం.

లేకపోతే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళేదే కాదు. సుఖభోగాలను బావుకోవాలనుకునే ఆమె బుద్దికి పూర్తి విపర్యయం సీతాదేవి! ప్రాణత్యాగానికైనా సిద్దపడిందే గానీ రావణుణ్ణి అంగీకరించలేదు, ధర్మమార్గాన్ని విడిచి పెట్టనూ లేదు. శ్రీరాముడి బుద్దీ శూర్పణఖకు విపర్యయమే! సతిని తప్ప పరస్త్రీని కోరని పురుషుడు రాముడు. కంటికి నచ్చిన వారితో శృంగారం అభిలషించింది శూర్పణఖ.

ఆ విధంగా కామం తప్ప ప్రేమ తెలియని శూర్పణఖని చూసి లక్ష్మణుడు “నేను సేవకుణ్ణి. నీ వంటి స్వేచ్ఛా విహారిణి నా వంటి సేవకుడితో పొందగల సౌఖ్యమేమిటి?” అన్నాడు. శూర్పణఖ మళ్ళీ శ్రీరాముడి వైపు మళ్ళింది. సీతాదేవితో సహా రామలక్ష్మణులకి శూర్పణఖ కాముకత్వం, చంచలత్వం అర్ధమైంది. శూర్పణఖ ‘సీత ఉండబట్టే కదా రాముడు తనని నిరాకరించాడు. కాబట్టి ఈమెను తినేస్తాను” అంటూ సీతకి హాని చేయ తలపడింది.

అప్పుడు లక్ష్మణుడామె ముక్కూ, చెవులూ కోసాడు. రాక్షసి అయినా, కౄరస్వభావం కలిగినదైనా, స్త్రీ కాబట్టి ప్రాణాలతో విడుస్తున్నానంటూ పరాభవించి పంపాడు.

రంగనాయకమ్మల వంటి విష గ్రంధ రచయితల వాదన ప్రకారం....‘రాక్షసులు, మనుష్యుల్లాగా, ప్రత్యేకించి శ్రీరాముడి వంటి రాజ వంశీయుల్లాగా హిపోక్రైట్ కాదు. తమ మనస్సులోని భావాలని అరమరికలు లేకుండా వ్యక్తపరుస్తారు. ఆకలీ దాహాల్లాంటివే కామవాంఛలు కూడా! తనకి కోరిక కలిగింది. దాన్ని వ్యక్తీకరించింది శూర్పణఖ. అందునా అది వారి జీవన విధానం. వారి ఆచారాలు వాళ్ళవి. అందులో తప్పేముంది? అలాంటి చోట రామలక్ష్మణులామెతో ప్రాక్టికల్ జోకులు వేసారు. ముక్కు చెవులు కోసారు. –

ఇది సరైనదే అనుకుందామన్నా.... శూర్పణఖ అంతటితో ఆగలేదే? సీతని మింగబోయింది. ఆ విధంగా తన కోరికకు అడ్డంకిని తొలగించుకోవాలనుకుంది.

అదీగాక, ఆ విష వాదనలే సబబైతే.... శూర్పణఖ రావణుడి దగ్గరికి వెళ్ళి ప్లేటు ఫిరాయించిందేం? నచ్చిన వాడితో శృంగారాన్ని ఆనందించటం తమ ఆచారమైనప్పుడు, తాను రాముణ్ణి కుదరకపోతే లక్ష్మణుణ్ణి కామించి సీతని మింగబోవటం చేత, వాళ్ళు తన ముక్కూ చెవులూ కోసారని చెప్పుకోలేదేం?

మరెందుకు “అన్నా! దండకారుణ్యంలో రామలక్ష్మణులనే సూర్యవంశ రాజపుత్రులు నివసిస్తున్నారు. వారిలో రాముడి భార్య సీత అద్భుత సౌందర్యవతి. నీ అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ ఆమె కాలిగోటికి కూడా సరిరారు. ఆమె నీ రాణిగా ఉండటానికి అర్హురాలు. నేనామెను నీకు బహుమతిగా తెచ్చేందుకు పట్టబోగా, వారు నా ముక్కు చెవులూ కోసి పంపారు. కనీసం ఆడదాన్ననైనా చూడకుండా పరాభవించారు” అని చెప్పింది?

అందునా ఆమె స్త్ర్రీకి సహజమైన ప్రవర్తన కూడా చెయ్యలేదు. తన కోరిక వెల్లడించేటప్పుడు కాదు, సీత మీద తన శారీరక బలం చూపించేటప్పుడు, తను స్త్రీ అని భావించిందా? బలం ఉంది కాబట్టి చంపెయ్య గలను అనుకుంది. అదే తాను అన్నకు చెప్పుకునేటప్పుడైతే “రామలక్ష్మణులు తన మీద ఆడదని కూడా కనికరం చూపలేదు” అని చెప్పుకుంది. ఇలాంటి శూర్పణఖ రంగనాయకమ్మలకీ, అలాంటి రచయిత్రుల్ని ప్రోత్సహించిన నకిలీ కణిక అనువంశీయులకీ ఏమాత్రం హిపోక్రైట్ గా కనబడలేదు.

ఆ విధంగా వాళ్ళు… సమాజం మీదికి, గుడ్డి వాదనలనీ, కుతర్కాలనీ గుమ్మరిస్తూ, మంచిని చెడుగా చిత్రిస్తూ విషాలు విరజిమ్మి పారేసారు. బహుశః రంగనాయకమ్మలకీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాదులకీ వాళ్ళ కారణాలు వాళ్ళ కుండవచ్చు. అయితే మూల కారణం మాత్రం హిందూ ఇతిహాసాల మీద దుష్ప్రచారం నిర్వహించే కుట్రే! అందుకే అంతగా ‘తెలుపుని నలుప’నే అంధత్వం అందిపుచ్చుకున్నారు.

ఇక రామాయణంలో.... శూర్పణఖ ఉదంతం అనంతరం..... రావణుడు సీతని అపహరించాలనుకుంటాడు. రాముణ్ణి ఎదుర్కొని యుద్దం చేసి సీతని తీసుకుపోవాలనుకోలేదు.

వాస్తవానికి…. పరసతిని ఎత్తుకుపోవటం, లేదా ఎదుటి వాడితో యుద్ధం చేసి (అంటే తన్ని తగలేయటమన్న మాట) వాడి భార్యని తీసుకుపోవటం, రెండూ తప్పే. కాని రెండింటినీ... ఒక దానితో ఒకటి పోల్చినపుడు, దొంగిలించటం పిరికితనం కాగా యుద్ధం చేసి గెలవటం, కనీసం ‘ధైర్యం కలిగి ఉండటా’న్ని సూచిస్తుంది.

రావణుడు బహుశాస్త్ర పారంగతుడు, పండితుడు, సంగీతాది విద్యలందు ఆరితేరిన వాడు, రాజనీతిజ్ఞుడు, శివభక్తుడూ అయినప్పటికీ.... శ్రీరాముడితో తలపడేంత ధైర్యం లేక మోసాన్ని, దొంగతనాన్ని ఆశ్రయించాడు.

చివరికి శ్రీరాముడు వానర సేనని సమీకరించి లంక మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు కూడా, రావణుడు శ్రీరాముడితో చివరి దశలో గానీ యుధ్దానికి దిగలేదు. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడితో పాటు ఎంతోమంది దానవ వీరులూ, రావణపుత్రులూ యుద్ధంలో మృతి చెందాక, ఇక అనివార్యమైన స్థితిలో యుద్ధరంగానికి వస్తాడు రావణుడు.

అందుకు రావణుడి వాదనలు (లేదా రావణుడి తరపు వకాల్తా పుచ్చుకున్న విషగ్రంధ రచయితలూ/రచయిత్రుల వాదనలు) ఎలా ఉన్నా సరే.... అంత్యదశ వరకూ శ్రీరాముడితో యుధ్దానికి రావణుడు సంసిద్ధుడు కాకపోవటం మాత్రం అందరూ ఒప్పుకునేదే! (దీనికి అనువర్తన మరెప్పుడైనా!)

ఈ విధంగా రంగనాయకమ్మలు రావణుడిలో సకల సుగుణాలనీ చూడగలరు, శ్రీరాముడిలో హిపోక్రసీని, ఇంకా ఎన్నో దుర్గుణాలనీ చూడగలరు. అదీ కుట్రతీరూ, కుట్రకు మద్దతిచ్చిన తీరు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

22 comments:

$ఆదిలక్ష్మి గారు

అద్భుతమైన విశ్లేషణతో కూడిన మరో మంచి టపా!. మీ ముందుమాట/వివరణ బాగా నచ్చింది. ఈ సదరు రంగానాయకమ్మల లాంటి రచయిత్రుల రాసిన వాటి గురించి చర్చించి వారికి, వారి రచనలకి మనమంత దృశ్యం ఇవ్వబల్లేదు. అయితే కేవలం అలాంటి విషభావాలు మరింతగా ప్రవర్ధమానం కాకుండా ఉండడానికి ఇలాంటి విశ్లేషణలు ఇతోధికంగా ఉపయోగపడతాయని నా గట్టి నమ్మక౦.

#..ఇష్టం లేదంటే అదే చెప్పాలి గానీ ‘తమ్ముడి దగ్గరికి పో’ అని అన్న, ‘అన్న సేవకుణ్ణని’ తమ్ముడు..... ఎందుకిలా ఆడ (రాక్షసి)దానితో ఆడుకోవటం?..
:) పై "సుత్తి" సూత్రం చెప్పిన సదరు రంగనాయకమ్మకీ తనకి కూడా ఇదే వర్తిస్తుందని మరిచినట్లుంది. రామాయణం ఇష్టం లేకపోతే గమ్మున ఉండాలి కానీ విషవృక్షాలు రాయడం దేనికి? హిందువుల మనోభావాలతో ఆడుకోవటం ఎందుకు?

#..ఎంతటి వితండ వాదమూ, కుతర్కమూ ఇది!?..
ఇదే ఆమెకున్న ఎకైక అర్హత.

#..దాన్ని వాళ్ళు మన నెత్తిన రుద్దడాన్ని సహించి ఊరుకుంటే.... కొంతకాలం గడిచేసరికి మనం మనంగా మిగలం. మనం వాళ్ళ రూపంలో ఉంటాం. ఇప్పుడు జరిగిందీ, జరుగుతోందీ అదే!..
అవును.. క్రైసవ దాడులకు(క్రూసేడు) అంతరించిన ఎన్నో పురాతన జాతులు(రోమన్, గ్రీక్..) దీనికి ఉదాహరణలు

#రంగనాయకమ్మలు రావణుడిలో సకల సుగుణాలనీ చూడగలరు, శ్రీరాముడిలో హిపోక్రసీని, ఇంకా ఎన్నో దుర్గుణాలనీ చూడగలరు
మరి దీన్ని ఆదర్శవాదం అనాలేమో! లేక తనలాంటి వారిని బలపరుచుకోవడమో!

Excellent..

ఆ విధంగా కోరిక వెల్లడించటం, వివాహంతో నిమిత్తం లేకుండా నచ్చిన వారితో భోగించడం వారి జాతిలో సహజం. అదేమీ తప్పుకాదు.

అవును .. అది వారి జాతిలో సహజం ..

రంగనాయకమ్మ వాదన ప్రకారం..... రామ లక్ష్మణులు ఈ విధంగా శూర్పణఖతో ఆడుకున్నారు. ఆపైన ముక్కు చెవులు కోసి పరాభవించారు. ఇష్టం లేదంటే అదే చెప్పాలి గానీ ‘తమ్ముడి దగ్గరికి పో’ అని అన్న, ‘అన్న సేవకుణ్ణని’ తమ్ముడు..... ఎందుకిలా ఆడ (రాక్షసి)దానితో ఆడుకోవటం?
___________________________________________________


ఇంత కామెడీ ఉంటుంది అని తెలీక రంగనాయకమ్మ పుస్తకాలూ చదవలేదు.

ఆదిలక్ష్మి గారు. ముందుగా నా అభినందనలు అందుకొండి. మీ విశ్లేషణ , లాజిక్ ఎప్పటిలాగానే చాల బాగుంది.
ఇంతకుముందెపుడొ ఒకసారి రంగనాయకమ్మ ని ఏకవచనం తొ సంభొదించానని ఆవిడ ఫాన్స్ నా మీద గొడవకొచ్చారు. ఒక్కసారి కూడా అవిడ రచనలు చదవకుండా ఎలా ఎకవచనం తొ పిలుస్తున్నవ్ అని. ఇప్పుడు మీరు చూపించిన ఒక్క సాంపిల్ చాలు. ఎటువంటి విషపు పురుగొ.
ఈ విషపు పురుగులకి రెండు నాల్కలు ఉంటాయ్. ఒకసారి అసలు రామయణమే జరగలేదు అంటారు. ఒక్కొసారి అదే రామయాణం మీద ఇలాంటి నికృస్ట విశ్లేషణలు చెస్తారు. చెప్పుతీసుకు కొట్టేవారు లేక అలాంటి వారి ఆటలు సాగుతున్నాయి.

రంగనాయకమ్మ రామాయణాన్ని విమర్శిస్తే , మీరు ఏకంగా ఆమెనే వ్యక్తిగతంగా విమర్శించారే విష రచయితలు అని.

Interesting.
But I liked Ranganayakamma's version of the story.

Very well written. బాగానే పెట్టారుగా గడ్డి :)

Nice!
Anyway, who cares for Ranganayakamma's blabberings, except few boffoons?

ఇప్పటి వరకు ఎవరూ ఆమెకి ఈ గడ్డి పెట్టలేదా ?.. చాలా ప్రచారం ఇచ్చారు ఆమెకి... నిజమేనేమో అనుకున్నా.. చదివి ఉండాల్సింది.. ఇంకా అగ్ని ప్రవేశం పై కూడ వివరించగలరు.. కృతజ్ఞతలు

కొంచెం సమయం తీసుకొని వ్యాఖ్యలకు జవాబిస్తానండి! అన్యధా భావించవద్దు.

రాజేష్ గారు: మీ సవివరమైన వ్యాఖ్యకు నెనర్లండి!

మొదటి అజ్ఞాత గారు: నెనర్లండి!

రెండవ అజ్ఞాత గారు : అవునండి. ఏం చేస్తాం, అది వారి సహజ గుణం! నెనర్లు!

శ్రీనివాస్ గారు: తెలిసీ తెలియని వయస్సులో విషవృక్షం (రెండు వ్యాల్యూమ్ లు) చదివితే ఆవేశం తిక్క ఎక్కువై సత్యాన్ని ద్వేషిస్తాం. అదే కొంచెం పరిణతి సాధించాక చదివితే చాలా కామెడీ ఉంటుందండి. తప్పక ప్రయత్నించండి. ఆ తర్వాత మీ ఓపిక కొద్దీ మస్తు టపాలు వ్రాసుకోవచ్చు!  నెనర్లు!

మంచు పల్లకి గారు: వాళ్ళవి రెండు నాల్కలే నండి! చదవకపోతే నువ్వు చదవకుండానే ఎందుకు విమర్శిస్తున్నావు అంటారు. చదివి విమర్శిస్తే నీకు వాళ్ళని అర్ధం చేసుకోవటం రాలేదు. నీకు ఆ స్థాయి లేదు పో అంటారు. లేదా ఫలానా తొక్కతోలు సిద్ధాంతం ప్రకారం అవి కరెక్టే అంటారు. మొత్తంగా నిద్ర నటించే వాళ్ళని ఎవరూ లేపలేనట్లే కుట్రకు సహకరించే వాళ్ళ చేత నిజం ఒప్పించటం కూడా కొంత కష్ట సాధ్యమే! అసాధ్యం మాత్రం కాదండోయ్! నెనర్లండి!

చాలా బాగా గారు: నేను ఆమెను వ్యక్తిగతంగా విమర్శించలేదండి. నెనర్లు!

మిరియప్పొడి గారు: నెనర్లండి!

మలక్ పేట రౌడీ గారు: విషం చిమ్మే వాళ్ళకి గడ్డి ఏపాటి!  అంచేత నేను, వాళ్ళ రచనల్లోనూ, చర్యల్లోనూ గల కుటిలతని మాత్రమే ఎత్తి చూపాను. నెనర్లు!

Snkr గారు: రంగనాయకమ్మ లాంటి వాళ్ళని పట్టించుకోనవసరం లేదు. కానీ వాళ్ళ రచనల దుష్ప్రభావాన్ని తప్పకుండా ఎత్తి చూపాలి. లేకపోతే అభం శుభం తెలియని చిన్న వయస్సు పాఠకులు నష్ట పోతారు. దీని గురించి నా స్వానుభవం తదుపరి టపాలో వ్రాస్తాను. నెనర్లండి.

వంశీ గారు: ఆమెకి ప్రచారం కల్పించింది ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లకు ప్రచారం కల్పిస్తున్నది మీడియానే నండి! అప్పటి నేపధ్యం గురించి మరింత వివరంగా తర్వాత టపాలో వ్రాస్తాను. నెనర్లండి!

మేడమ్ కొంచెం ఆలస్యంగా చూశాను. మంచి విశ్లేషణ.

>>
రంగనాయకమ్మ లాంటి వాళ్ళని పట్టించుకోనవసరం లేదు. కానీ వాళ్ళ రచనల దుష్ప్రభావాన్ని తప్పకుండా ఎత్తి చూపాలి. లేకపోతే అభం శుభం తెలియని చిన్న వయస్సు పాఠకులు నష్ట పోతారు
>>
ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. నేను ఇలాంటి వారిని కొందరిని చూశాను.

మన మీడియాకీ డబ్బు సంపాదించడం తప్ప ఇంకేమీ తెలియదు. అందుకోసం వారు అశుధ్ధాన్నైనా తింటారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu