మామూలుగా, సాదా సీదాగా నడుస్తున్న వ్యవహారంలో, మరింత కీడు చేసి, అందులో కొంచెం తగ్గిస్తే - మంచి చేసినట్లే! ఇదే ‘నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేస్తే పాజిటివ్ చేసినట్లు’ అనే స్ట్రాటజీ!

అలాగే.....

మామూలుగా, సాదా సీదాగా నడుస్తున్న వ్యవహారంలో, కొంచెం పాజిటివ్ చేసి, దాన్నే తగ్గిస్తే - కీడు జరిగినట్లే! ఇది ‘పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ చేసినట్లు’ అనబడే స్ట్రాటజీ!

కొంచెం గందరగోళంగా అన్పించే ఈ స్ట్రాటజీలని వివరించడానికి రెండు చిన్న కథలు చెబుతాను.

ముందుగా నెగిటివ్ లో నెగిటివ్ గురించి!

అనగా అనగా....

ఒక ఊళ్ళో ధనపాలుడు అనే దర్జీ ఉండేవాడు. అతడి పేరులో ఉన్న ధనం, పాపం అతడి ఇంట్లో లేదు. భార్య, ముగ్గురు పిల్లలతో చిన్న ఇంట్లో ఉండేవాడు. ఇంట్లోనే కుట్టుపని చేసుకు బ్రతికేవాడు. అంతంత మాత్రపు సంపాదనతో సర్ధుకుపోలేక, అతడి భార్య అతడి మీద ఎప్పుడూ అరుస్తూ ఉండేది.

తల్లిదండ్రుల కీచులాటలతో సహజంగానే పిల్లలూ అల్లరిగా తయారయ్యారు. వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు.

ఓ రోజు ధనపాలుడు గుడికి వెళ్ళాడు. గుళ్ళో పండితుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. ధనపాలుడు అక్కడ కూర్చొని కాస్సేపు పురాణం విన్నాడు. అందరూ వెళ్ళిపోయాకా పండితుణ్ణి కలుసుకుని "స్వామీ!" అని పిలిచాడు.

"ఏం నాయనా?" అన్నాడు పండితుడు. తన బాధలన్నీ చెప్పుకుని పరిష్కారం చూపమన్నాడు ధనపాలుడు. సంతోషంగా గడపటానికి తగిన మంత్రమో తంత్రమో చెప్పమన్నాడు.

పండితుడు ఒక్కక్షణం ఆలోచించి "రేపు రా నాయనా!" అన్నాడు.

మర్నాడు ధనపాలుడు, పండితుణ్ణి కలుసుకున్నాడు. ప్రశాంతంగా గుడి ఆవరణలో కూర్చొన్న పండితుడు "మీ ఇంట్లో కోళ్ళున్నాయా?" అనడిగాడు.

ధనపాలుడు లేవన్నట్లు తల అడ్డంగా ఊపాడు.

"రేపు ఓ కోడిని కొనుక్కుని ఇంటికి వెళ్ళు. దాన్నిపెంచుకో! ఓ వారం ఆగి వచ్చి పరిస్థితేమిటో నాకు చెప్పు" అన్నాడు పండితుడు.

‘కోడిని పెంచితే తన పరిస్థితి బాగుపడుతుంది కాబోలు’ అనుకొని, ధనపాలుడు ఓ కోడిని కొనుక్కుని ఇంటికి పోయాడు.

వారం తర్వాత పండితుణ్ణి కలుసుకున్న ధనపాలుడు "స్వామీ! అసలే ఇరుకు ఇల్లు! కోడి ఇల్లంతా తిరుగుతూ రెట్టలు వేస్తోంది. అదంతా శుభ్రం చెయ్యలేక నా భార్య నన్ను నానా తిట్లూ తిడుతోంది. ఆ కోడి నా సూదులూ, దారాలూ కూడా చిందర వందర చేస్తోంది. ఈ సందట్లో నా పిల్లలు సూదులు, కత్తెర్లతో ఆడుకుంటున్నారు" అన్నాడు ఏడుపు ముఖంతో!

పండితుడు అదేం పట్టించుకోకుండా "మీ ఇంట్లో పిల్లి ఉందా?" అన్నాడు. ధనపాలుడు తెల్లబోయి "ఎందుకు స్వామీ? లేదు" అన్నాడు ప్రశ్నాజవాబు ఒకేసారి చెబుతూ!

"ఓ పిల్లిని పెంచుకో! వారం ఆగి వచ్చి కనబడు" అన్నాడు పండితుడు.

‘సరే! పిల్లిని కూడా పెంచితే మంచి జరుగుతుందేమో’ అనుకుంటూ ధనపాలుడు తెలిసిన వాళ్ళనుండి ఓ పిల్లిని తీసికెళ్ళాడు. వారం గడిచింది. పండితుణ్ణి కలుసుకున్నప్పుడు "స్వామీ! నిరంతరం పిల్లి, కోడిని తరుముతోంది. ఇల్లంతా అవి పరుగులు పెట్టడంతో కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. వాటి అరుపులతో పాటు నా భార్య కేకలతో, చెవులు చిల్లులు పడుతున్నాయి" అన్నాడు.

పండితుడు "అయితే ఈ సారి ఓ కుక్కని కూడా పెంచుకో!" అన్నాడు. ధనపాలుడు నీరసంగా సరేనన్నాడు. కుక్కనీ ఇంటికి తీసికెళ్ళాడు. వారం తర్వాత పండితుణ్ణి కలిసినపుడు లబోదిబో మన్నాడు. పండితుడు చిరునవ్వు నవ్వుతూ "ఓ గాడిదని కూడా ఇంటికి తీసుకెళ్ళు" అన్నాడు.

ఈ సారి వారం కంటే ముందే ధనపాలుడు పండితుణ్ణి కలుసుకుని బోరుమన్నాడు. అతడి ముఖం దైన్యంగా ఉంది. కళ్ళక్రింద నల్లటి చారలు ఏర్పడ్డాయి. మనిషి తిండీ నిద్రా లేనట్లు నీరసించి ఉన్నాడు.

"స్వామీ! పగలంతా కుక్కా, పిల్లీ, కోడి ఒక దాన్నొకటి తరుముకుంటూ అరుస్తున్నాయి. నా భార్య నాతో మాట్లాడటం కూడా మానేసింది. ఇక రాత్రిపూట ఇంట్లో పడుకునేందుకు కూడా చోటు లేకుండా పోయింది. వీధి ఆరుగు మీద పడుకుంటే గాడిద వెనక్కాలితో ఈడ్చి తంతోంది" అన్నాడు.

పండితుడు ప్రశాంతంగా "గాడిదని అమ్మెయ్! కుక్కనీ పిల్లినీ ఇంట్లోంచి తరిమెయ్! కోడిని వండుకు తినండి. వారం తర్వాత వచ్చి కనబడు. అప్పుడు, నీకు సంతోషంగా గడిపేందుకు తగిన మంత్రం చెబుతాను" అన్నాడు.

వారం గడిచింది. ధనపాలుడు పండితుణ్ణి కలుసుకున్నాడు. ఈ సారి ధనపాలుడి ముఖం వెలిగిపోతోంది. పెదవుల మీద చిరునవ్వు మెరుస్తోంది.

"ఎలా ఉన్నావు నాయనా?" అన్నాడు పండితుడు.

"స్వామీ! సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మా ఇంట్లో తరుముకుంటూ పరుగులెత్తే కుక్కాపిల్లీ లేవు. ఈడ్చి తన్నే గాడిదని అమ్మి పారేసాను. హాయిగా ఇంట్లో నిద్రపోతున్నాను. మా ఆవిడ కోడి కూరని అద్భుతంగా వండింది. నిజంగా అది కోడికూర కాదు, వెన్నపూసే! నోట్లో వేసుకుంటే కరిగిపోయింది" అన్నాడు ధనపాలుడు సంతోషంగా!

"అయితే ఇప్పుడు నీ ఇల్లు ఇరకటంగా, ఆలి మరకటంలా లేవా?" అడిగాడు పండితుడు.

"నాకేం స్వామీ? మా ఇల్లు చిన్నదైనా చక్కని ఇల్లు. మా ఆవిడ చాలా మంచిది. పరమ సాధ్వి. నా పిల్లలు ముగ్గురూ మూడు రత్నాలు!" అన్నాడు సంతృప్తిగా.

పండితుడు చిరునవ్వు నవ్వుతూ "అదే సంతోష రహస్యం! ఉన్నదానితో సంతృప్తి పడటమే, సంతోషంగా గడపటానికి ఉన్న మంత్రం. ఉండడానికి నీకు ఇల్లుంది. ఇల్లూ వాకిలీ లేని బికారుల కంటే నువ్వు చాలా మేలు. గయ్యాళిదే అయినా, వేళకన్నీ అమర్చి పెట్టే భార్య ఉంది. అల్లరి చేసినా ముచ్చటైన పిల్లలున్నారు. భార్యాబిడ్డలు లేని ఒంటరి వాడితో పోల్చుకుంటే నీ పరిస్థితి మెరుగైనదే! మనకి ఉన్నదానితో తృప్తి పడుతూ, లేని దాని కోసం కృషి చేస్తూ ముందుకు సాగితే జీవితం సంతోషంగా నడుస్తుంది. అభివృద్ది లోకి రావాలన్న కాంక్ష, అందుకు తగిన కృషీ ఉండాలి గానీ, ఉన్న దాని పట్ల అసంతృప్తి ఉండకూడదు. జీవితం పట్ల అసంతృప్తి ఉంటే ఆనందం మనకి ఆమడ దూరంలో ఉంటుంది" అన్నాడు.

ధనపాలుడు అంగీకార సూచనగా నవ్వుతూ "అర్ధమైంది స్వామీ!" అన్నాడు.

ఇదీ కథ!

ఈ కథలో, పండితుడు చెప్పిన నీతి విలువైనది. ఇందులో ప్రయోగించ బడ్డ స్ట్రాటజీ.... మరింత కీడు, లేదా ఇబ్బంది కలిగించి, ఆనక దాన్ని తొలగించి.... మేలు జరిగిందనటమే! అదే ‘మరింత నెగిటివ్ చేసి, అందులో కొంత కట్ చేసి పాజిటివ్ జరిగిందనే’ స్ట్రాటజీ!

పండితుణ్ణి కలిసినప్పటికీ, తర్వాతకీ ధనపాలుడి జీవితంలో మార్పేమీ లేదు, దృక్పధంలో తప్పితే! అదే ఇరుకు ఇల్లు, అదే గయ్యాళి భార్య, అదే అల్లరి పిల్లలు, అదే అంతంత మాత్రపు సంపాదన! అతడి పరిస్థితిలో ఏమార్పూ లేదు. పండితుణ్ణి కలవటానికి ముందూ, తర్వాతా కూడా! కానీ కోడీ, కుక్క, పిల్లీ, గాడిదలతో పరిస్థితి మరింత దిగజారి పోయి, తర్వాత మెరుగైనందున ధనపాలుడు ఎంతో సంతోషించాడు.

సరిగ్గా ఈ స్ట్రాటజీనే... నకిలీ కణిక వ్యవస్థ, అన్నిదేశాలలో ఆయాప్రభుత్వాల ద్వారా, ప్రజల మీద ప్రయోగిస్తుంది. మచ్చుకి మన దేశంలోని కొన్ని ఉదాహరణలు చూడండి!

ఆర్టీసీ బస్సు, గ్యాసు ధరలు అమాంతం పెంచుతుంది. జనం ఘోల్లు మంటారు. ప్రతిపక్షాలు గయ్యిమంటాయి. ఆనక పెంచిన రేట్లలో కొంచెం తగ్గిస్తుంది ప్రభుత్వం. ఏదో మేలు జరిగినట్లు ప్రజలూ నిట్టూరుస్తారు. ప్రతిపక్షాలూ, మీడియా మెల్లిగా మౌనం పాటిస్తాయి. అందుకు ఎవరి కారణాలు వాళ్ళవి. ఇందులో ఉన్నది ‘నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేస్తే పాజిటివ్’ అన్నదే!

అలాంటిదే దొడ్డు బియ్యంతో సహా బియ్యం,పప్పు ధరల విషయంలోనూ ఇదే స్ట్రాటజీ! రెండేళ్ళ క్రితం కిలో 14 నుండి 18 రూపాయలున్న సన్నబియ్యపు ధర, 35 నుండి 40 రూపాయలకు పెరిగాక, దాన్ని 29-31 కి తగ్గించి "చూశారా ధరలు నియంత్రించాం" అన్న ఫోజులు పెట్టాడు మరణించిన ముఖ్యమంత్రి వై.యస్.[కృష్ణ పట్నం రేవు నుండి దొంగ రవాణా అయిన బియ్యం గురించి మాట్లాడ లేదు.]

పప్పు ధరలైతే కిలో 25/-రూపాయలు నుండి 100/- కి పెరిగి ఇప్పుడు 65-70 కి దిగితే... అదే గొప్ప పాజిటివ్ అని చెబుతున్నాడు, ఆర్ధిక వేత్త అవతారం నుండి ప్రస్తుతం ప్రధానమంత్రి అవతారంలోకి పరకాయ ప్రవేశం చేసిన మన్మోహన్ సింగ్. ఇంకా మాట్లాడితే ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యంతో ధరలు పెరిగాయంటున్నాడు. [కాండ్లా నుండి దుబాయ్ కి దొంగ రవాణా అవుతున్న బియ్యం గురించి మాట్లాడడులెండి.]

మా జీవితంలో అయితే, రామోజీరావు ఈ స్ట్రాటజీని పలుమార్లు ప్రయోగించాడు. పరిశ్రమ అధినేత్రి స్థాయి నుండి లెక్చరర్ స్థాయికి, అక్కడి నుండి ఇల్లూ వాకిలీ లేని బికారి స్థాయికీ చంద్రబాబు మమ్మల్ని తరిమాడు. 1995 నవంబరులో మేం ఫ్యాక్టరీ వదిలి నంబూరు పల్లెకు చేరాల్సి వచ్చింది. ఆ విధంగా... ఆర్ధికస్థాయి, సాంఘీక స్థాయి, పరిశ్రమ అధిపతి స్థాయి నుండి దిగువకి జారింది.

ఆపైన వై.యస్. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక - శ్రీశైలంలో ఓ చిన్న గదిలో, 60 మంది విద్యార్ధులతో, నాలుగేళ్ళ పాటు, ఓ చిన్న బడి నడపగలగటం - అన్నది, మాకు చేసిన `గొప్ప మేలన్న' మాట. ఇదే ఊదర మాకు పెట్టటం గురించి గతటపాలలో కూడా వ్రాసాను. చంద్రబాబు, వై.యస్.ల ఇద్దరి వెనకా ఉన్నది రామోజీరావే నన్న విషయం... సాక్ష్యాధార పత్రాలూ, దృష్టాంతాలతో సహా నిరూపించి మరీ, ఇది చెబుతున్నాను.

ఈ విధంగా `నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేసి పాజిటివ్ చేశామనటం' - పరిశ్రమ అధినేత్రి స్థాయి నుండి బికారి స్థితికీ, అక్కడి నుండి బడిపంతులమ్మ స్థితికి తరమటం!

ఇలాంటి మానసిక యుద్దతంత్రాలే నకిలీ కణిక వ్యవస్థ.... ప్రజల మీదా, తాము గురిపెట్టిన వ్యక్తుల మీదా ప్రయోగిస్తుంది.

ఓపికతో పరిశీలించాలే గానీ పేద్ద జాబితా తయారౌతుంది.

ఇక పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ చేసినట్లే - ఈ స్ట్రాటజీ గురించి మరో చిన్న కథ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

ivi tappani strategies emo ?

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu