19]. ఇక పైలెట్ లిద్దరూ సీట్లో లోనే బెల్టులతో సహా ఉండిపోయారని వ్రాసారు కదా, సెప్టెంబరు 4 న? దీనికి విరుద్దమైన వార్త [సెప్టెంబరు 12, Page No.11]. ‘1900 అడుగులు క్రిందకు ఎందుకు దిగినట్లు?’ శీర్షిక క్రింద వ్రాసిన వార్తలో ’పైలట్లు క్రిందకి దూకేప్రయత్నం చేశారా?’ అన్న ఉపశీర్షిక క్రింద “హెలికాప్టర్ ఇంజన్ కు పైలట్, కో పైలట్ ల మృతదేహాలు 25 – 30 అడుగుల దూరంలో పడి ఉన్నాయనీ, వీడియా క్లిప్పింగులలో ఈ దృశ్యాలు చూసిన డిజీసిఏ బృందం, హెలికాప్టర్ రెండో చెట్టును ఢీకొట్టిన తర్వాత పైలట్లు క్రిందకు దూకే ప్రయత్నం చేశారా అన్న కోణంలోనూ పరిశీలించినట్లు సమాచారం” అని వ్రాసారు.

ఎక్కడయినా పైలట్ గానీ, కోపైలట్ గానీ తమ సీట్లకున్న బెల్టులతో సహా దూకగలరా? ఎందుకింత పరస్పర విరుద్ద వార్తలు, అధికారులు పేర్లు ఉటంకించకుండా, ‘ఎస్.ఐ. ఒకరు, ఫలనా బృందం అన్నారని తెలిసింది’ గట్రా విశేషణాలతో ఈనాడు వ్రాసింది? మీడియా అంతా ఈనాడును అనుసరించడం ఇప్పటికి దశాబ్ధాలుగా అందరికీ తెలిసిందే!

20]. ఇక ELT [Emergency Located Trans meter] గురించీ, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ [CVR] గురించి వచ్చినన్ని పరస్పర విరుద్ద వార్తలకైతే అంతే లేదు. వై.యస్. మిస్సింగ్ అయిన రోజు మొత్తం, ELT సిగ్నల్ రాలేదని, కాబట్టి ఎట్టిపరిస్థితులలోనూ హెలికాప్టర్ కూలిపోయి ఉండదని, ఎక్కడో క్షేమంగా ఎమర్జన్సీ లాడింగ్ అయిఉంటారని విపరీతంగా ప్రచారం చేసారు. ప్రతి ఒక్కరు ‘హెలికాప్టర్ క్రాష్ అయితే, ఎట్టిపరిస్థితులలోనూ ELT సిగ్నల్ ఇవ్వకుండా ఉండదు, కాబట్టి హెలికాప్టర్ కూలిపోలేదని’ ప్రచారం చేసారు.

ELT మీద విభిన్నకథనాలు ఒకసారి పరిశీలిద్దాం.

సెప్టెంబరు4, పేజీ నెం.9: ’హెలికాప్టర్ దారి మళ్ళింది’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>> ELT కొన్ని సందర్భాల్లో పనిచేయదు. ఏవియేషన్ నిపుణులు దీనిపై అధికారికంగా మాట్లాడితే బాగుంటుంది. – డీజీపీ ఎస్.ఎస్.పీ. యాదవ్.

అదే రోజు, పేజీ నెం.12: ’సంకేతాలు అందలేదు’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>హెలికాప్టర్ లో శాటిలైట్ సంకేతాలు అందించాల్సిన ELT నిర్వహణ సరిగా లేదని పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ [DGCA], రాష్ట్రప్రభుత్వానికిచ్చిన ప్రాధమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దీనివల్లే ప్రమాద సమయంలో ELT పనిచేయలేదని తెలిపారు.

అదే రోజు, పేజీ నెం.11: ’ఈ.ఎల్.టీ. పనిచేస్తోందా’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>హెలికాప్టర్ ఏదైనా ఒత్తిడికి గురైన వెంటనే అత్యవసర ఆచూకీ గుర్తింపు ట్రాన్స్ మీటర్[ఈ.ఎల్.టీ.] పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రమాదం సంభవించినా, దాని నుండి ఎలాంటి సంకేతం రాకపోవడంతో ‘అది పనిచేస్తుందా లేదా?, అందులో బ్యాటరీలు ఉన్నాయా లేవా?’, అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పనిచేయడం ప్రారంభించి ఉంటే తక్షణం బెంగుళూరులోని ఇస్రో కార్యాలయానికి సమాచారం అంది ఉండేది.

సెప్టెంబరు 8, పేజీ నెం.8: ’ప్రమాదం నివారించదగ్గదే’ అన్న శీర్షిక క్రింద.
>>> లోకసత్తా జయప్రకాష్ నారాయణ – ప్రమాద సంకేతాలు సూచించే కీలక పరికరాల నిర్వహణపై నిర్లక్ష్యం కూడదన్నారు. హెలికాప్టర్ లోని ఈఎల్ టీ నుంచి సిగ్నల్స్ రాకపోవడానికి కారణాలేమిటో ఇంతవరకూ నిర్ధిష్టంగా స్పష్టం చేయలేదన్నారు. అందులో బ్యాటరీ అయిపోవడం వల్ల పని చేయలేదని చెప్పడం కన్నా దారుణం మరొకటి ఉండదన్నారు.

వీటికి విరుద్దమైన మరో వార్త.

సెప్టెంబరు 13, పేజీ నెం.13: ’ఉన్నత స్థాయి దర్యాప్తు మొదలు’ అన్న శీర్షిక, ’ఇంజన్ క్రింద ఆధారాలు?’ అన్న ఉపశీర్షిక క్రింద వార్త.
>>> ప్రధాన కార్శదర్శి, డీజీపీ బృందం, సంఘటన స్థలంలో, వైర్లు తెగిపడి ఉన్న ఈఎల్ టీ ని పరిశీలించింది. హెలికాప్టర్ ప్రమాదంపై సంకేతాలు అందించే ఈ పరికరం, వైర్లు తెగిపోవడం వల్ల పనిచేసి ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు.

సెప్టెంబరు 15, పేజీ నెం.1, కర్నూలు సిటి ఎడిషన్, ’రాజశేఖరుడే మూగసాక్షి’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>ఈ ఎల్.టీ. పరికరానికి సిగ్నల్ ఇచ్చే వైరు కాలిందని దయాకర్ తెలిపారు. వైరింగ్ కాలకుంటే సంఘటన స్థలాన్ని నాడు త్వరగా గుర్తించే వీలుండేదన్నారు.

ఇన్ని పరస్పర విరుద్దమైన సమాధానాలు చెప్తూ, చివరికి ఈ ఎల్.టి. పనిచేయకపోవడానికి వైర్లు కాలిపోయాయని తేల్చారు. హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు, ఎట్టిపరిస్థితులలో సిగ్నల్ ఇచ్చేటట్లు కదా తయారు చేసారని మొదటి రోజు చెప్పారు? కాబట్టే క్రాష్ అవ్వలేదని, ఎక్కడో సి.ఎం. క్షేమంగా ఉండే ఉంటారని చెప్పారు. మరి వైర్లు కాలి పోయి పనిచేయక పోవటం ఏమిటి?

21]. CVR [కాక్ పిట్ వాయిస్ రికార్డర్]:

CVR అసలు దెబ్బతినదనీ, అంత ధృఢంగా తయారు చేస్తారనీ…. అయినా పాక్షికంగా దెబ్బతిన్నదనీ…. విశ్లేషణ జరిగిందనీ….. జరగలేదని…. చివరికి, విశ్లేషించేందుకు అమెరికా పంపినట్లు, నివేదిక సీల్డ్ కవర్ లో అందినట్లు వార్తలొచ్చాయి. అయితే ‘డిజీసీఏ, ఆ నివేదికని నెలన్నర తర్వాత గానీ సిబిఐ కి ఇవ్వనని కుండబద్దలు కొట్టి చెప్పిందని’ వచ్చిన వార్తలు ఇప్పటికి కడపటివి. ఇక ముందు ఇంకా ఏమేమి వార్తలొస్తాయో!

ఇంతకు డిజీసీఏ అయినా, సిబిఐ అయినా హెలికాప్టర్ ప్రమాదంలో నిజమేమిటో వెలికి తీయాలనే కదా పనిచేస్తున్నాయి? నిజం ఎవరు పరిశోధించినా ఒకటే ఉంటుంది గానీ, అనేక విధాలుగానో, పరస్పర విరుద్దంగానో ఉండదు కదా? అటువంటప్పుడు సిబిఐ కి డీజీసీఏ సహకరించినా, డిజీసీఏ కి సిబిఐ సహకరించినా, మరో ABCD కి ఇంకో XYZ సహకరించినా ఏమిటి తప్పు? ఏమిటి ముప్పు? ఎవరికి ముప్పు?

సెప్టెంబరు 4, పేజీ నెం.2: ’ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు’ లాంటి వార్తల నేపధ్యంలో హెలికాప్టర్ కి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాక, ఆ విషయం 18 నిముషాల ముందైనా, హెలికాప్టర్ లో ప్రయాణించిన సి.ఎంకి., ఇతరులకి తెలుస్తుంది కదా! అప్పుడేం మాట్లాడి ఉంటారు? కేవలం వత్తిడి, భయాందోళనలకి గురై రక్షించమన్న కేకలో, ప్రత్యామ్నాయ చర్యల గురించిన మాటలో మాట్లాడి ఉంటారు కదా! అటువంటప్పుడు, సీవీఆర్ సంభాషణాల నివేదిక గురించి ఇన్ని మతలబులు ఎందుకు జరుగుతున్నాయి? ఏఐసిసి అధిష్టాన దేవత సోనియాగాంధీకి అయినా, తమ ’దార్శినికుడు, మార్గదర్శి,’ తమ విధేయుడు, తమ పార్టీ సహచరుడు అయిన వై.యస్. మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్న విషయం పట్ల ఆతృత ఉండాలి కదా?

ఇలాంటప్పుడు, రెండునెలల వ్యవధి తర్వాతైనా డీజీసీఏ గానీ, సిబిఐ గానీ ఇందులోని నిజాలు వెలికి తీస్తాయా? లేక…. 100 కాలపరిమితి పొడిగింపులూ, కోట్లరూపాయల డబ్బు ఖర్చు, దశాబ్దాల తరబడి సాగతీత తర్వాత, మానవమాత్రులు జీవితకాలం పాటు చదవలేనన్ని అంటే 50,000 పేజీల నివేదికలని ఇచ్చే లిబర్ హాన్ కమీషన్ల మాదిరిగా, శతకోటి కమీషన్లలో ఇదీ ఒకటై కూర్చుంటుందా?

మరికొన్ని విరుద్దమైన వార్తలు పరిశీలిద్దాం!

సెప్టెంబరు 4, పేజీ నెం.11: ’కాక్ పిట్ వాయిస్ రికార్డరే కీలకం’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>ప్రతి హెలీకాప్టర్లోనూ ఈ వ్యవస్థ ఉంటుంది. గాలిలోకి ఎగిరినప్పటి నుండి దిగే వరకూ అందులో జరిగిన సంభాషణను ఇది రికార్డు చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగి హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయినా, వాయిస్ రికార్డర్ మాత్రం చెక్కు చెదరదు. ౩౦౦౦ డిగ్రీల సెలియస్ ఉష్ణోగ్రత కూడా తట్టుకునేలా దీన్ని రూపొందించారు.

అదే రోజు , పేజీ నెం.10: ’బ్లాక్ బాక్స్ పైనే ఆశలు’ అన్న క్రింద వార్త.
>>>కాక్ పిట్ వాయిస్ రికార్డర్[CVR]లో 25 గంటల వరకు హెలికాప్టర్ సంభాషణలు నమోదవుతాయి. అంటే ప్రమాదం జరగడానికి 25 గంటల ముందు నుండి హెలికాప్టర్ లో మాట్లాడుకున్న అంశాలన్నీ అందులో రికార్డు అవుతాయి. ఇందులోని అంశాలను డీకోడ్ చేసి రహస్యంగా ఉంచుతారు. సంబంధిత అధికారులు అడిగితేనే వెల్లడిస్తారు. నల్లమల ప్రమాదానికి ముందు పైలట్లు, వై.ఎస్., ఇతరులు, మాట్లాడుకొని ఉంటే సీవీఆర్ లో నమోదై ఉంటుంది. ప్రమాదం జరగబోయే ముందు ఏదైనా సమాచారాన్ని బయటి ప్రపంచానికి చెప్పాలని అనుకుంటే పైలట్లు కూడా సీవీఆర్ లో నమోదయ్యేట్లు మాట్లాడతారు.

ఇదే శీర్షికలో ’బ్లాక్ బాక్స్ ప్రత్యేకతలు’ అన్న ఉపశీర్షిక క్రింద వార్త.
>>>నారింజరంగులో ఉంటుంది. అందరికీ కనబడే విధంగా అన్నివైపులా రేడియం పట్టీలు వేస్తారు.
* హెలికాప్టర్ కూలినపుడు కూడా బ్లాక్ బాక్స్ ధ్వంసం కాకుండా టైటానియం లోహంతో దృఢంగా తయారు చేస్తారు.
* నీటిలో పడినా, మంటల్లో పడ్డా అందులోని సమాచారం దెబ్బతినకుండా తయారు చేస్తారు. 1000 డిగ్రీల సెల్సియస్ వేడినీ తట్టుకోగలదు.

‘ముందురోజు 3000డిగ్రీల సెలియస్ ఉష్ణోగ్రత వద్ద చెక్కుచెదరదు’ అన్న ఈనాడు, తరువాత రోజు [సెప్టెంబరు5 న] ‘1000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చెక్కుచెదరదని’ వ్రాసింది. సరే ఇది అంకె తప్పనుకుందాం. CVR చెక్కుచెదరదని అన్నారు కదా, దానికి విరుద్దమైన వార్తను పరిశీలించండి.

సెప్టెంబరు 9, పేజీ నెం.11: ’సీవీఆర్ విశ్లేషణ జరగలేదు’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>హెలికాప్టర్ ప్రమాదంపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సమీక్షజరిపింది. ఆనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదంలో సీవీఆర్ కొంతమేరకు దెబ్బతిన్నదని, ఈ నేపధ్యంలో దాన్ని తయారు చేసిన అమెరికా కంపెనీ ’యూనివర్సల్ ఎవాయినిక్స్ సిస్టమ్స్ కార్పొరేషన్’కు చెందిన భారతీయ ప్రతినిధులను సంప్రదించారని ప్రకటనలో తెలిపారు. విశ్లేషించడం సాధ్యంకాని పక్షంలో సీవీఆర్ ను, డీజీసిఏ అమెరికా పంపనుందన్నారు.

ఈ సీవీఆర్ దెబ్బతిన్న ఫోటోను, ఈనాడు, సెప్టెంబరు 16, పేజీ నెం.11: ‘ఒక ఇంజన్ బగానే ఉంది’ అన్న శీర్షిక క్రింద వేసారు.

ఇక్కడ చాలా చిక్కుప్రశ్నలు ఉన్నాయి. ప్రమాదం వెలికివచ్చినప్పుడు [సాక్షిలో అనుకుంటా] సీవీఆర్ డామేజ్ అయిందని, అధికారులు వాటిని ఖండించినట్లు చెప్పారు.

సెప్టెంబరు 4 వ తేదీన సీవీఆర్ ని డీజీసీఏ కి స్వాధీనపరిచారు. అప్పుడు అధికారులు గానీ, ఈనాడు గానీ సీవీఆర్ దెబ్బతిన్నదని చెప్పలేదు. [సెప్టెంబరు 4 వ తేదీనుండి సెప్టెంబరు 8 వ తేదీ వరకూ అధికారులకి గానీ, హోంమంత్రిణి గారికి గానీ సీవీఆర్ దెబ్బతిన్నదని తెలియదా?] రెండురోజులలో సీవీఆర్ విశ్లేషణ జరుపుతారని మాత్రమే చెప్పారు.

ఈక్రింది వార్తను చూడండి.
సెప్టెంబరు6, పేజీ నెం.13: ’చివరి సంభాషణ ఏమిటి?’ అన్న ఉప శీర్షిక క్రింద వార్త.
>>>ఢిల్లీకి పంపిన ఈ రికార్డర్ విశ్లేషణ, ఒకటి రెండు రోజుల్లో పూర్తి కావచ్చని భావిస్తున్నారు. ఇందులో సంభాషణలు వెల్లడయితే అసలు కారణం ఏమిటన్నది వెల్లడయ్యే అవకాశం ఉంది. సోమ, మంగళ వారాల్లో ఈ వివరాలు అందుతాయని భావిస్తున్నారు.

మంగళ వారానికల్లా సీవీఆర్ సంభాషణలు బయటికి రాలేదు గానీ, దెబ్బతిన్నదన్న విషయం వెల్లడించారు. అంతే!

ఆ దెబ్బతిన్న సీవీఆర్ ను అమెరికా పంపాలన్న నిర్ణయం అధికారులు సెప్టెంబరు 14 వ తేదీన తీసుకున్నారు. అదికూడా రెండురోజుల్లో ప్రభుత్వ అనుమతులు తీసుకుని అమెరికా పంపాలన్నది నిర్ణయం. ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నట్లు? కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వారివే కదా?

ఇంకో విరుద్దమైన వార్తను పరిశీలిద్దాం!
సెప్టెంబరు11, పేజీ నెం.2: ’హెలికాప్టర్ దారితప్పలేదా?’ అన్న శీర్షిక క్రింద, ఆఖరి అరగంట పాటే రికార్డింగ్’ అన్న ఉప శీర్షిక క్రింద వార్త.
>>> సర్వసాధారణంగా హెలికాప్టర్లలో ఉండే వాయిస్ రికార్డరులలో అరగంటపాటు సంభాషణలు రికార్డు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అది కిందికి దిగే, లేదా ప్రమాదానికి గురయ్యే చివరి అరగంట సంభాషణే దానిలో నిక్షిప్తమై ఉంటుంది. కుప్పకూలిన బెల్ హెలికాప్టర్ లో వాయిస్ రికార్డరులోనూ ఆఖరి అరగంటలో పైలట్, కో-పైలట్, ఏటీసీ మధ్య జరిగిన సంభాషణ మాత్రమే రికార్డు అయి ఉంటుందని నిపుణులు తెలిపారు.

ఇప్పటికి సీవీఆర్ లో సంభాషణ రికార్డు గురించి సెప్టెంబరు 4 న, ’ఎగిరినప్పటి నుండి దిగే వరకూ రికార్డు చేస్తుందని’ ఒకసారి, సెప్టెంబరు 5 న ’25 గంటల పాటు సంభాషణలని రికార్డు చేస్తుందని’ మరోసారి, సెప్టెంబరు 11 న, ’ఆఖరి అరగంట పాటే రికార్డింగ్’ అని చెప్పారు. ఇంతకీ ఏది నిజం?

ఇన్ని విరుద్దమైన ప్రకటనల అవసరం ప్రభుత్వానికి గానీ, ఈనాడుకి గానీ ఎందుకున్నట్లు? ఒకవేళ ప్రభుత్వమే ఇలాంటి విరుద్దమైన విషయాలు చెప్తున్నప్పుడు పత్రికలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా? అలాగాక పత్రికలే పరస్పర విరుద్ద వార్తలు ప్రచారిస్తే, ప్రభుత్వం పత్రికలని ప్రశ్నించాలి కదా? అయితే ఇక్కడ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, పత్రికలు కూడా గమ్మునున్నాయి. ఇదేమి కుమ్మక్కు?

22]. GPS వాడకం గురించి:

సెప్టెంబరు 5, పేజీ నెం.10: ’జీపీఎస్ వాడే సమయం లేదు!’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>> వై.యస్. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ[జీపీయస్] ఉందని, అయితే హఠాత్తుగా ప్రమాదం జరగడంతో దాన్ని ఉపయోగించే సమయం లేదని రాష్ట్ర విమానయాన శాఖ ప్రభుత్వానికి నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
>>> ప్రమాదం జరిగిన తర్వాత సేకరించిన ప్రాధమిక సమాచారాన్ని, ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ కు దిశా నిర్ధేశం చేసే జీపీఎస్ వ్యవస్థ ఉందని, అది చక్కగా పనిచేస్తోందని వారు అందులో పేర్కొన్నారు. అయితే బుధవారం నాటి దుర్ఖటన తీరును చూస్తే, హెలికాప్టర్ హఠాత్తుగా ప్రమాదానికి గురై, ప్రముఖులతో పాటు పైలట్లు హఠాన్మరణం పొందినట్లు తెలుస్తోందని, అందువల్ల జీపీఎస్ ను ఉపయోగించలేకపోయారని పేర్కొన్నారు. అది సంస్థాగత లోపం కాదని స్పష్టం చేసారు.

పై వార్త లో GPS ను వాడటానికి ఎంత సమయం కావాలో తెలపలేదు. క్రింది వార్తను ఒకసారి పరిశీలించండి.

సెప్టెంబరు8, పేజీ నెం.5: ’ఆ 18 నిముషాలు ఏమైనట్లు?’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>ప్రమాదం జరిగిన రోజు, అంటే గత బుధవారం ఉదయం 9.12 గంటలకు ఏటీసీతో హెలికాప్టర్ కు సంబంధాలు తెగిపోయాయి. ప్రమాద స్థలంలో లభించిన గడియారం 9.30గంటల వద్ద ఆగిపోయి ఉంది. అంటే సరిగ్గా ఈ సమయంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని, ఆ ధాటికి గడియారం ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఏటీసీ తో సంబంధాలు తెగిపోయిన 18 నిముషాల తర్వాత ప్రమాదం జరిగింది. ఈ 18 నిముషాలలో ఏమి జరిగిందన్నదే సందేహాస్పదంగా మారింది. అసలు ఏటీసీతో సంబంధాలు ఎందుకు తెగిపోయాన్నది కూడా అనుమానాస్పదంగా తయారైంది.

పై వార్తల ప్రకారం ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన తర్వాత 18 నిముషాల సమయంలో జీపీఎస్ ను ఉపయోగించటానికి పైలట్లకు సమయం సరిపోలేదా? అది వాడటానికి గంటల సమయం అవసరమా?

23]. ఏటీసీ తో సంబంధాలు తెగిపోవటం గురించి:
సెప్టెంబరు 3, పేజీ నెం.15: ’ఆరు హెలికాప్టర్లు గాలించాయి’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>> పౌరవిమానయాన శాఖ ఒక ప్రకటనలో ‘హెలికాప్టర్ నుండి 9.13గంటల సమయంలో సంకేతాలు నిలిచిపోయినట్లు’ వెల్లడించింది.

దీనికి విరుద్ధమైన వార్తలు పరిశీలిద్దాం:

అదేరోజు, పేజీ నెం.15: ’ఎలాంటి సమాచారం లేదు’ అన్న శీర్షిక క్రింద వార్త.

>>> సాయంత్రం 7 గంటలకు సచివాలయంలో రోశయ్య విలేఖరులతో మాట్లాడారు “9.30గంటలకు, గ్రౌండ్ తో మాట్లాడిన ఐదు నిమిషాల తరువాత, హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి” అని చెప్పాడు.

ఒకవైపు పౌరవిమానయాన శాఖ 9.13 కు ఏటీసీ తో సంబంధాలు తెగిపోయాయని చెప్తూంటే, రోశయ్య 9.30 కు గ్రౌండ్ తో మాట్లాడినట్లు చెప్తున్నాడు. ఇదెలా సాధ్యం? తరువాత కూడా 9.12 నిముషాలకు సంబంధాలు తెగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి అసత్యవార్తను ఎందుకు ప్రకటించినట్లు?

ఇదే గాక ’ఎంతదూరం ప్రయాణించింది?’ అన్న ఉపశీర్షికక్రింద వ్రాసిన వార్తలో 9.35గంటలకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి అని వ్రాసింది.

24]. మొదట ప్రదేశాన్ని గుర్తించటం గురించి కూడా విభిన్నమైన కథనాలు వచ్చాయి.

సెప్టెంబరు4, పేజీ నెం.2: ’జననేత మహా ప్రస్థానం’ అన్న శీర్షీకక్రింద వ్రాసిన వార్తలో 10.30కి ప్రమాదస్థలాన్ని వాయుసేన కమెండో సాగర్ భారతి గుర్తించినట్లు వ్రాసారు.

అదేరోజు, అదే పేజీ: ’24 గంటల తర్వాత ఆచూకీ’ అన్న శీర్షికలో 10 గంటలకు గుర్తించినట్లు వ్రాసారు.

అదేరోజు, అదే పేజీ: ’ప్రాణం తీసిన పావురాల గుట్ట’ అన్నశీరిక్షలో 8 గంటలకు నౌకాదళం హెలీకాప్టర్ గుర్తించింది అని వ్రాసారు.

అదేరోజు, పేజీ నెం.9: ’హెలికాప్టర్ ముక్కలైంది’ అన్న ఉపశీర్షికలో 8.25 కు గుర్తించినట్లు చీఫ్ సెక్రటరీ, రమాకాంత్ రెడ్డి తెలిపారు.

అదేరోజు, పేజీ నెం.11: ’అదృశ్యం నుండి దిగ్భ్రాంతి వరకూ...’ అన్న శీర్షికలో 8.30 గంటలకు గుర్తించినట్లు వ్రాసారు.

అదేరోజు, పేజీ నెం.12: ’ఎలా జరిగిందో ఇప్పుడే చెప్పలేం’ అన్న శీర్షికలో 8.30 గంటలకు ప్రమాదస్థలాన్ని గుర్తించినట్లు చిదంబరం తెలిపాడు.

సెప్టెంబరు12, పేజీ నెం.14: ’మొదట చేరిందీ ఇద్దరే’ అన్న శీర్షికలో, 8గంటలకే దుగ్గల్, ఐ.పి.ఎస్., హెలికాప్టర్ నుండి తాడుసాయంతో పావురాల గుట్టకు చేరినట్లు వ్రాసారు.

ఇంతకు…. ఎన్నిగంటలకు ఆ ప్రదేశాన్ని మొదట గుర్తించారు? ఎన్నిగంటలకు ఆ స్థలానికి చేరారు? ఆ విషయమై అన్ని విరుద్దమైన వార్తల ప్రచారం ఎలా జరిగినట్లు? ఒకే రోజు ఇన్ని విరుద్దమైన వార్తలు ఎలా బయటికి వచ్చినట్లు?

ఇంత పరస్పర విరుద్ద వార్తలు.
ఒక్కమాటలో చెప్పాలంటే…. మనం చదివి మరిచిపోయే వార్తలు.
పత్రికలవారు మాత్రం పరమ’జాగ్రత్త’ తీసుకుని వ్రాసిన వార్తలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

మొత్తానికి ఇప్పటికి భూత కాలంలో నుండి వర్తమానం లోకి వచ్చాను. (ఆగస్ట్ 20 నుండి ఈ రోజు వరకు అన్ని టపాలు ఈ రోజే చదివాను)

చాలా బాగా రాసారు.

"GPS" వాడడానికి పట్టే సమయం చాలా తక్కువ. మామూలు కార్ లో వాడేవే 30 సెకన్లలోపు ఆపరేట్ చెయ్యవచ్చు (30 సెకన్ల సమయం డివైస్ ఆన్ చేసి, రూట్ మాప్ సెట్ చేసుకోవడానికి)
ఇక హెలీకాఫ్టర్ లో వాడేవి ఖచ్చితంగా ఇంకా పవర్ ఫుల్ వే అయి ఉంటాయి

మంచి సమాచారం ఇచ్చావు ప్రదీప్! నెనర్లు!

కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ పైకి వెల్లిన ఏ ఒక్క యుద్ధ విమానమూ తిరిగి వచ్చె అవకాశం లేదు అని...నాకు తెలిసిన ఒక జీనియస్ చెప్పాడు.. మన వద్ద రాడార్ కి అందకుండా వెల్లగలిగే విమానాలని తయారు చెయగలిగే సాంకేథిక పరిజ్ఞానం థియరీ లో ఉన్నప్పటికీ అది ప్రాక్టికల్ లొ రూపొందనీయకుండా కుట్ర జరుగుతోందన్నాడు.

ఆ విషయం తెలిసాక..మీ ఆలోచనావిధానం సరైనదేమోనని విశ్వాసం కలుగుతోంది.. కానీ మీ కెక్కడిదీ ధైర్యం ?

రామ చంద్రన్ గారు,

మాకీ ధైర్యం భగవద్గీత నుండి వచ్చిందండి. అదెలాగో తెలియాలంటే పాత టపాలలో ’పీవీజీ - రామోజీరావు - మా కథ’ లేబుల్ లో ఉన్నవి చదవగలరు. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

ఒక నాయకుడి విషయం లోనే ఇలా జరిగితె మరి సామాన్యుల సంగతి ఎమిటి.
అసలు రాజశేఖరరెడ్డి శత్రువుల పని ఎందుకు కాకుడదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu