మరో ఆసక్తికరమైన అంశం రాహుల్ గాంధీ ది.

15]. చెన్నైలో రాహుల్ గాంధీ ’జగన్ సమర్ధుడు. అతడు సాధించిన విజయాలని తక్కువగా చూడకూడదు’ అంటూ జగన్ అనుకూల ప్రకటన చేసినట్లు Sep.16,2009 వార్తాపత్రికల్లో వచ్చింది. తర్వాత, ఢిల్లీ వెళ్ళాక ఇక సైలెంటయి పోయాడు సదరు యువనేత! అసలుకే ఆ ఇటలీ అమ్మ చేతిలో పెరిగిన ఈ యువ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శికి అవగాహనా శక్తి తక్కువ. కాబట్టి పరిస్థితులు గమనించుకోకుండా ప్రకటనలు ఇచ్చేసాడన్న మాట. ఢిల్లీ చేరి అమ్మ శిక్షణ తీసుకున్నాక గమ్మునున్నాడన్న మాట. ఇది కూడా రోజురోజుకీ అధిష్టానం పోకడ మారటం అన్న ప్రక్రియనే సూచిస్తుంది. క్షణ క్షణముల్ అధిష్టాన చిత్తముల్ అన్నట్లు, రోజురోజుకీ పరిస్థితులు మారిపోవటానికి కారణం ప్రత్యర్ధి వర్గమైన నెం.5 వర్గపు ఎత్తుగడలూ, వ్యూహాలను బట్టి, తమ ఎత్తుగడలూ, వ్యూహాలూ మార్చుకోవలసి రావటమే!

దీనికి నిదర్శనమే ఖమ్మంలో, డిసిసి సమావేశంలో, శుక్రవారం అంటే Sep.26,2009 న జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో, రేణుకా చౌదరితో పాటు సోనియా గాంధీ ఉన్న ఫ్లెక్సీని ’జగన్ యువసేన’ పేరుతో కొందరు చించిపారేసి, ’జగన్’ని సీ.యం.ని చేయాలని నినాదాలు చేస్తే….. ఆ విషయం అప్పుడే ఫోటోలు కూడా తీయబడితే…. దాని మీద దుమారం, వివాదం ఆదివారం నాడు తెరమీదకు రావటం! శుక్రవారం జరిగిన సంఘటన. ఆదివారం నాడు కార్చిచ్చు అంటుకొని అధిష్టానం సీరియస్ అయ్యింది. అధిష్టానానికి ఆ సంఘటన ఆలస్యంగా తెలిసిందనుకున్నా, రాష్ట్రంలోని వి.హెచ్., కే.కే., డి.ఎస్. గట్రాగట్రా అధిష్టాన భక్తులకు వెంటనే తెలుసు కదా? అందునా, జరిగింది టెలీ కాన్ఫరెస్ నిర్వహిస్తుండగా నయ్యె!

ఇక రోశయ్య పాత్రా, మిగిలిన మంత్రుల వ్యవహార సరళి గురించిన అంశాలు చాలా ఉన్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలోని అంశాలపై దర్యాప్తు, సివిఆర్ విశ్లేషణ గట్రాల గురించి కూడా మీడియా రోజుకో కథ చెబుతూనే ఉంది. పరస్పర విరుద్ధమైన ఈ కథనాలను మీడియా ఎందుకు ప్రచారించింది? ఇప్పటికీ – ‘ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు’ ’విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది’ గట్రాగట్రా విశేషణాలతో అసందిగ్ధ, లేదా సందేహాపూరితంగా వార్తల్ని ఎందుకు ప్రచారిస్తోంది? నిర్ధిష్టంగా నిజాలని ఎందుకు చెప్పటం లేదు?

ఎందుకంటే – ప్రత్యర్ధి వర్గం అంటే నెం.5 ఎత్తుగడలనీ, వ్యూహాలనీ బట్టి తాము ఎత్తుగడలూ, వ్యూహాలు రచించుకోవాలి కాబట్టి. అంతేకాదు. వై.యస్. మరణించినప్పుడు కూడా పత్రికలూ, టీవీలు మొత్తం మీడియా అంతా కోరస్ గా ఎందుకు వై.యస్.ని దేవుణ్ణి చేసింది? కొన్ని మీడియా సంస్థలు అతనికి అనుకూలమైతే కొన్నైనా అతడికి వ్యతిరేకం ఉండాలి కదా? ఉంటాయి కదా! అలాగ్గాక ఏకమొత్తంగా అందరూ ఒకటే పాట ఎలా పాడారు? ఎవరు ఈ నియంత్రణ చేసారు? దాన్ని బట్టి తెలియటం లేదా యజమాన్యాలు వేరైనా మీడియాని మొత్తంగా నడిపించేది ఒకే వ్యవస్థ, ఒకే వర్గమూ అని?

ఇక హెలికాప్టర్ ప్రమాదంలోని సాంకేతికత, పరిశోధనతీరు, ప్రతిపక్షాల స్పందన, నాగం జనార్ధన రెడ్డి వంటి వారు కేవిపి కి పెట్టిన గురి…. ఇలా రోజురోజుకీ మారిపోతున్న రాజకీయరంగ నేపధ్యంలో Establish అయిన, అవుతున్న Circumstantial ని వివరించాలంటే…..

16. సెప్టెంబరు 4 వ తేదీన ఈనాడు వై.యస్. మృతివార్తతో ప్రచురించిన ప్రశంసల కుంభవృష్టి ఓసారి పరికించండి.
జలమిత్రా, జననేతా, ఆపద్బంధూ,
రాజకీయ వినీలాకాశంలో జగజ్జేయమానంగా ప్రకాశించిన ధ్రువతార నేలరాలింది,
జనమహాసంద్రంలోఉవ్వెత్తున ఎగిసిన కెరటం కుప్పకూలింది,
సాహసమే ఊపిరిగా, ప్రజాశ్రేయమే ఊపిరిగా,
ప్రజాశ్రేయమే లక్ష్యంగా సాగిన ప్రస్ధానం ముగిసింది,
జన హృదిని దోచిన ఆత్మబంధు గుండెచప్పుడు ఆగింది,
తెలుగింటి ముద్దుబిడ్డ, ఆయనో ధ్రువతార,
జనహృదయ విజేత, ఆంధ్రావని కలిపెంచిన రైతుబిడ్ద,
మాటకోసం.. పేదకోసం మడమ తిప్పని పోరు సిపాయి,
విజయమాయన చిరునామా, విశ్వాసానికి వీలునామా,
పేదల గుండె అతను, గుడిసె’గుడి’లో దేవుడయ్యాడు,
తడిసే నేలకు బిందువయ్యాడు, పల్లెబాటకు పాదులేశాడు,
రాచరికపు పాదులేశాడు, ఇంటింటికీ వైద్యుడయ్యాడు,
అమ్మలందరికీ అన్న అయ్యాడు, చెల్లి నుదుట తిలకమయ్యాడు,
అనాధలకు పూజ్యుడయ్యాడు. జన మహారాజు,
ఆగిన పేదల గుండె, స్ఫూర్తి ప్రదాత,
నాయకత్వ రారాజు, కార్యోన్మోకుడు, రాజకీయాల్లో సాహసి వై.యస్.,
ఆడపడుచుల ఆత్మబంధువు, మహిళా పక్షపాతి,
చెల్లెళ్ళకు పెద్దన్నయ్యే, మోజు లేని రాజు,
వై.యస్. అపర భగీరధుడు, అన్నీ తానై.. అందరివాడై,
నిత్య పారి’శ్రామికుడు’, పాదయాత్రలో ప్రచండభానుడు,
క్రీడా శేఖరుడు, లిప్టర్ రాజా…... గట్రాగట్రా బిరుదులతో ఈనాడు విరగ పొగిడేసింది.

17]. ఇంకా సి.ఎం. మిస్సింగ్ అన్న వార్త తప్ప, ఇంకా ఏ వివరాలూ తెలియక ముందే, ముఖ్యమంత్రి అదృశ్యం వార్తతో కృష్ణాలో గుండె ఆగి కార్యకర్త మృతి చెందాడు. చిత్తూరులో కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఖైరతాబాద్ మత్స గణపతి వద్ద బుధవారం[Sep.2] సాయంత్రం ఓ అభిమాని బ్లేడుతో చేయికోసుకున్నాడు. ఈ వార్తలన్నీ సెప్టెంబరు 3న వచ్చాయి. సీ.ఎం. క్షేమంగా ఉన్నాడో, లేక ప్రమాదానికి గురయ్యాడో కూడా ఇంకా ఆచూకీ తెలియకముందే, అందరూ ఉత్కంఠతో టీవీల ఎదురుగా కూర్చొని ఉండగా, అప్పటికే నిరాశా నిస్పృహలతో లేదా ఆందోళనలకు గురై ఆత్మహత్యా యత్నాలూ, గుండె ఆగడాలూ జరుగుతాయా?

వాటితో పాటు నల్లమల ఎంత కీకారణ్యమో, నల్లమలలో వర్షం ఎంత భీభత్సమో ఈనాడు వ్రాసింది. బయటపడేందుకు 30 గంటలు కూడా పట్టవచ్చంటూ గ్రౌహేండ్స్ అనుభవాలని జోడించి, ఆచూకీకి సమయం పట్టొచ్చన్న వార్తలూ అదేరోజున వచ్చాయి. ప్రపంచానికి ఇంకా వై.యస్. మరణ వార్త తెలియకముందే ’నల్లమల భీకరారణ్యం’ అంటూ గాలింపు చర్యల్లోని జాగును సమర్ధించుకునే ప్రయత్నం ఎందుకు చేసినట్లు?

మరణ వార్త కూడా ఇంకా వెలువడక ముందే ఆత్మహత్యలూ, గుండెలాగి అభిమానులు మరణించడాలూ అన్న సంచలన ప్రక్రియ ఎందుకు ప్రారంభమైనట్లు? ఎవరైనా గుండెలాగి మరణించినా, మీడియా వెంటనే దాన్ని వై.యస్. అభిమానానికి ఎలా లెక్కలోకి వేసినట్లు? అప్పటిదాకా తొక్కిపట్టిన వై.యస్. మరణ ప్రకటన తర్వాత మొదలుపెట్టబోయే అంకానికి, ఈ విధమైన వార్తలతో ముందే నాందీ ప్రస్తావనలు వేసుకున్నారు. అందుకే ’హెలికాప్టర్ కూలిన రోజే సోనియా, చిదంబరంలకి తెలుసా’ అన్న వార్తలూ వచ్చాయి.

సీ.ఎం. అదృశ్యవార్తకే గుండెలాగి మరణించిన వార్తలు సెప్టెంబరు 3 వ తేదీ ఈనాడులో వచ్చాయి. అంటే సెప్టెంబరు 2 వ తేదీ రాత్రి 12 గంటల[News dead line time] లోపునే ఇది పత్రికలో ప్రచురణకు పంపబడాలి. అప్పటికి, బయటి ప్రపంచానికి వై.యస్. ఏమయ్యాడో తెలియదు. అభిమానులకు అభిమానం ఎంత ఉంటుందో, తమ అభిమాన నాయకుడు క్షేమంగా తిరిగి వస్తాడేమోననే ఆశకూడా అంతే ఉంటుంది కదా! అంతేగాక, అందరూ ఏమవుతుందో అన్న ఉత్కంఠతో టీవీల ముందు కూర్చున్నట్లే, సదరు అభిమానులు కూడా ఉత్కంఠతో టీవీల ముందు కూర్చుని ఉంటారు కదా! అభిమానంతో గుండె ఆగే మరణించారో లేక సహజ మరణం పొందారో గానీ, ఆ మరణాలని అభిమానుల మరణాలుగా నమోదు చెయ్యాలన్న ఆలోచన మాత్రం, అప్పటికి జగన్ గానీ, కేవిపి గానీ లేక వై.యస్. అనుకూల శిబిరం లోని రాజకీయనాయకులు గానీ చేయలేరు.

ఎందుకంటే, అప్పటికి ఇంకా వై.యస్. ఏమయ్యాడోనన్న అతృతే వారికి ఎక్కువ. భవిష్యత్ వ్యూహ రచన కంటే కూడా అప్పటి ఆతృతా, ఆందోళనలే ఎక్కువుగా ఉంటాయి. ఇంకా సెప్టెంబరు 3 వ తేదీ కన్నా అయితే [ఆ తరువాతయినా], అప్పటికి ఎటూ ఈనాడు [మీడియా], ఆ ట్రెండ్ ప్రారంభించింది గనక, అదేబాటలో పోతూ, అన్నీ మరణాలనీ అభిమానుల మరణాలు అనేసారనుకోవచ్చు. అది సెప్టెంబరు 2వ తేదీనే, ఇంకా వై.యస్.కి ఏమయ్యిందో కూడా తెలియక ముందే, అంత కీడునే ఊహించలేని స్థితిలో ఉంటారు గానీ తరువాత Further plan up లో ఉండరు కదా?

మిగిలిన అందరూ, వై.యస్. కుటుంబీకులూ, ఆప్తులూ, అనుచరులూ కూడా ఇంకా షాక్ లోనే ఉండగా, ఏంజరుగుతోందో ఇంకా అర్ధం కూడా కానిస్థితిలో ఉండగా, ’అభిమానుల మరణాలనే’ ట్రెండుని ఈనాడు ఎందుకు ప్రారంభించింది? ఆ విధంగా సంచలనాలకి నాంది పలకటం వెనుక గల స్ట్రాటజీ, అందరి దృష్టినీ హైజాక్ చేయటం తద్వారా Time gain and Self Protection చేసుకోవటమే!

18]. ఇక వై.యస్. ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదం విషయంలో కూడా, మీడియా, ప్రత్యేకంగా ఈనాడు, వ్రాసిన వార్తల్లోని అసంబద్దతని గమనిస్తే, నకిలీ కణిక వర్గం, నెం.10, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, ఎన్ని విన్యాసాలు చేసారో అర్దమౌతుంది.
i. సెప్టెంబరు 4 వ తేదీ శుక్రవారం నాటి ఈనాడు పత్రికలో, 11 వ పేజీలో ’కాక్ పిట్ వాయిస్ రికార్డర్ కీలకం’ శీర్షిక క్రింద వ్రాసిన వార్తలో, ఘటనాస్థలికి కర్నూలు ఎస్.పి. శ్రీకాంత్ సెప్టెంబరు 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కల్లా వెళ్ళగలిగారనీ, ఆయనతో పాటుగా న్యూస్ టుడే విలేఖరి, ఫోటో గ్రాఫర్ కూడా వెళ్ళగలిగారనీ వ్రాసారు.

ii. కాబట్టే తెగిపడిన వై.యస్. కాలినీ, వేలినీ కూడా ఫోటోలు వేయగలిగారు.

iii. అయితే 2 వ పేజీలో ’ఉంగరాల ఆధారంగా గుర్తింపు’ అన్న వార్త లో ‘ఇద్దరు పైలెట్లు సీట్లలోనే బెల్టులతో సహా ఉండిపోయారనీ, ముందు సీట్లలో కూర్చున్న పైలెట్, కోపైలెట్ లను వారి చెవులకు ఉన్న హెడ్ ఫోన్ల ఆధారంతో గుర్తించారనీ’ వ్రాసారు. ‘అందరి శరీరాలు 60% మేర దెబ్బతిన్నట్లు’, అక్కడి పరిస్థితిని చూసిన ఎస్.ఐ. ఒకరు తెలిపారని వ్రాసారు.

నిజానికి సెప్టెంబరు 3 వ తేదీ [గురువారమే], ప్రమాదస్థలిని గుర్తించిన స్వల్ప వ్యవధిలోనే, ఎస్.పి. శ్రీకాంత్ తో పాటు, న్యూస్ టుడే[ఈనాడు] విలేఖరి, ఫోటోగ్రాఫర్ లు కూడా ఘటనా స్థలికి చేరుకోగలిగారు’ అని ఈనాడే వ్రాసింది. అదేరోజు, అదే పత్రిక, మళ్ళీ మృతుల వివరాల గురించి ఒక ఎస్.ఐ. చెప్పారని వ్రాసింది. స్వయంగా అక్కడికి చేరుకున్న విలేఖరి, ఫోటో గ్రాఫర్ కు మరొకరెవరో[ఎస్.ఐ. అయినా సరే] చెప్పాల్సిన పనేముంది? తామూ స్వయంగా చూసిందే, ఫోటోలు తీసిందే కదా! మామూలుగా విలేఖర్లు తమలో తాము సమాచారాన్ని, ఫోటోలని ఇచ్చిపుచ్చుకుంటారు. అంటే ముందుగా సమాచారాన్ని సేకరించిన వారు, మిగిలిన మిత్రులకూ దాన్ని పంచుతారు. ఆ విధంగా ఫోటోలు ఈనాడుకు చేరాయనుకోనవసరం లేకుండా, స్వయంగా ఈనాడే 11 పేజీలో తమ విలేఖర్లు అక్కడికి చేరుకున్నారంది. అలాంటప్పుడు ఎవరో ఎస్.ఐ. చెప్పగా వ్రాయటం ఏమిటి? సరే, అలాగే జరిగిందనుకున్నా, ఎస్.ఐ.గానీ, సి.ఐ.గానీ, చివరికి పోలీసు కానిస్టేబుల్ అయినా, వారి యునిఫాం మీద [Name Badge] పేరు ఉన్న బాడ్జి ఉంటుంది. మరి పేరు తెలియలేదా? ప్రజలకి వార్తలని పారదర్శకంగా అందించటమే తమ ఆశయంగా చెప్పుకునే విలేఖర్లు, పత్రికాధిపతులకు సదరు వార్త చెప్పిన ఎస్.ఐ. పేరు తెలియకుండా ఉంటుందా? మరెందుకు ’ఒకరు చెప్పారు, విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అధిష్టాన వర్గాలు తెలిపాయి’…. గట్రా విశేషణాలతో వ్రాస్తారు? 1992కు ముందరైతే ’కర్ణ పిశాచి భోగట్టా’ అన్న పదప్రయోగమూ ఉండేది.

iv. ఇక ఇదే రోజు [Sep.4, పేజీ నెం.2, ‘ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు!’ శీర్షిక] పత్రికలో మరో వార్త చూడండి.
హెలికాప్టర్ పేలిపోవడానికి ముందు ముఖ్యమంత్రి దాదాపు 3 ఫోన్ కాల్స్ హెలికాప్టర్ 300, 800, 1000 రేంజ్ లలో ఉండగా మాట్లాడినట్లు ప్రమాదస్థలిలో లభ్యమైన సెల్ లో ఉన్న వివరాల ఆధారంగా పోలీసులు చెబుతున్నారని వ్రాసారు.

ఆ వివరాలు తేటతెల్లం అయితే అసలు ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందన్నది తేలిపోతుందిగా? ఇంతకీ ఎవరికి సి.ఎం. ఫోన్లు చేసినట్లు? 9.15 కు ఏటిసీతో సంబంధాలు తెగిపోయినట్లు చెప్పారు. మరి సి.ఎం. 9.24 కు బండి ఆత్మకూరు మండల పరిధిలోని నెట్ వర్క్ పరిధిలో మొబైల్ ఫోన్లో మాట్లాడారు. అనంతరం 80 డిగ్రీల రేంజిలో ప్రయాణిస్తుండగా 9.26 కు ఆత్మకూరు నెట్ వర్క్ పరిధిలో ఫోన్లో మాట్లాడారు. 100 డిగ్రీల రేంజిలో కూడా తరువాత మరో సెల్ కు ఫోన్ చేసినట్లు వ్రాసారు. 9.29 కు హెలికాప్టర్ కూలిపోయింది. అలాంటప్పుడు ప్రమాదం గురించి సి.ఎం. ఎవరికో చెప్పే ఉండాలి కదా?

సరే దీనికి విరుద్దమైన వార్త [Sep.10, పేజీ నెం.13లో ఉంది] మరొకటి చూద్దాం!

>>>>సంఘటన స్థలంలో ఇప్పటి వరకూ నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు డీజిపి కి వివరించారు. వాటిని సిఐడి పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. మూడు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండగా.. వెస్లీ ఉపయోగించిన ఫోన్ మాత్రం ఆన్ లో ఉన్నట్లు సమాచారం ఆ సెల్ ఫోన్ కు వచ్చిన SMS ద్వారానే హెలికాప్టర్ ఆచూకీ తెలిసినట్లు చెబుతున్నారు. హెలికాప్టర్ బయలుదేరే ముందు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలని పైలెట్ సూచించటంతో అందరూ స్వీచ్ ఆఫ్ చేసి ఉంటారని, ప్రమాద సమయంలో ఆ విషయాన్ని ఎవరికైనా తెలియచేయడానికి వెస్లీ ఫోన్ ఆన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ జాబితాను తెప్పించనున్నారు. పైలెట్ భాటియా మృతదేహం ఫ్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ మాత్రం కాలిపోయి ముద్దగా మారిపోయిందని డాక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు.

ప్రమాదం జరుగుతుందని అనుకున్నప్పుడు వెస్లీ ఫోన్ చేస్తూ ఉంటే మిగతావారు సెల్ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. అందరు కలిసి ఎవరి ప్రయత్నాలు వారే చేస్తారు కదా? అంతేకాక 9.26 వరకు సి.ఎం. తన ఫోన్ లో రెండు కాల్స్ చేసినవాడు, తరువాత కూడా ఫోన్ మాట్లాడిన సి.ఎం., తరువాత స్విచ్ ఆఫ్ చేసుకుని ఎందుకు ఉన్నట్లు? ఒక్క వెస్లీ ఫోన్ కాల్ ఆధారంగా పాముల పాడు టవర్ లో రికార్డ్ అయ్యింది కాబట్టి, దానిని ఆధారం చేసుకుని ప్రమాదస్థలం గుర్తించినట్లు చెప్పారు. మరి సి.ఎం. ఫోన్ కాల్ రికార్డు చేసిన టవర్ గురించి తరువాత ఎందుకు ప్రస్తావించలేదు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

ప్చ్, మీరేంటో.. ఈనాడులో వై.యస్ గురించి వ్రాసిన కవితలే ఉదహరించారు. అలాగే బ్లాగుల్లో మేం వ్రాసుకున్నవి ఒక్కటికూడా మాటవరుసకన్నా ఉదహరించలేదు. ఈ పార్షియాలిటీ కి వ్యతిరేకంగా మేం వాకౌట్ చేస్తున్నాం :)

నిజమే సుమా, మర్చిపోయాను:)

మంచి విశ్లేషణ ....ఆసక్తికరంగా వుంది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu