తత్త్వశాస్త్రంలో ఒక ఆసక్తికరమైన చర్చ ఉంటుంది. స్థల కాలాలకి సంబంధించిన చర్చ అది. తత్త్వశాస్త్ర నిర్వచనాల ప్రకారం –

ఒక వస్తువుకీ మరో వస్తువుకీ మధ్యగల అంతరాన్ని ‘స్థలం’ అంటారు.
ఒక సంఘటనకీ మరో సంఘటనకీ మధ్యగల అంతరాన్ని ‘కాలం’ అంటారు.

ఒక సూర్యోదయానికీ, తర్వాతి సూర్యోదయానికీ మధ్యగల అంతరాన్ని ’ఒకరోజు’ అంటున్నాం. కొన్నిరోజులు గడిస్తే నెల, నెలలు గడిస్తే సంవత్సరం…..ఇదే కదా కాలం?

"అంటే సంఘటనలు లేకపోతే కాలం లేనట్లేనా?" అని కొందరూ
"సంఘటనలు ఎక్కువగా ఉంటే ఎక్కువకాలం గడిచినట్లా?" అని కొందరూ…. రకరకాలుగా, తత్త్వశాస్త్ర చర్చల్లో వాదించటం పరిపాటి. ఆ విషయం ప్రక్కన పెడితే,

జీవితంలో సంఘటనలు ఎక్కువగా చూసిన వ్యక్తిని అనుభవజ్ఞుడంటాం. ఎందుకంటే – 90 ఏళ్ళు బ్రతికినా, సాదాసీదా సంఘటనలు తప్ప పెద్దగా విశేషాలు తెలియని వ్యక్తికి అవగాహన తక్కువగా ఉండటం, వయస్సు తక్కువైనా పదిప్రాంతాలు తిరిగి, పదిమందిని కలిసి, పది పుస్తకాలు చదివి, వంద సంఘటనలు చూసిన వ్యక్తికి అవగాహన ఎక్కువగా ఉండటం అందరికీ తెలిసిన విషయమే.

ఎందుకంటే ఎక్కువ సంఘటనలు ఎదుర్కొన్న వ్యక్తి అంటే ఎక్కువ అనుభవాలు తెలిసిన వాడన్నమాట. అలాంటి వారికి అనుభవజ్ఞానము, అవగాహనా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక వ్యక్తికైనా వర్తిస్తుంది, ఒక దేశానికైనా వర్తిస్తుంది. పరిశీలించి చూస్తే గతంలో [1947 నుండి 1992 వరకు] కన్నా ఇప్పుడు [1992 నుండి 2009 వరకూ] ఎక్కువ సంఘటనలు, తక్కువ కాలవ్యవధిలో జరిగాయి. దాంతో సహజంగానే ప్రజల అవగాహన పెరిగింది.

అవగాహన ఎక్కువగా ఉన్నవాడు ఎక్కువ విషయాలని అర్ధం చేసుకుంటాడు, ఎక్కువ విషయాలని పరిశీలిస్తాడు. [ఇది జరగకుండా ఉండేందుకు ఒకప్పుడు సినిమాలు, సాహిత్యం సైతం ప్రజలలో తార్కిక శక్తినీ, అవగాహనా శక్తినీ నష్టపరిచేవి.] ఈ విధంగా….. సంఘటనలతో, అనుభవంతో…… అవగాహన, తార్కికత పెరిగినట్లయితే, విషయ పరిశీలనా శక్తి, అర్ధం చేసుకునే స్థాయి కూడా పెరుగుతాయి. అప్పుడే నిజాలని పరిశీలించగలుగుతాం, అర్ధం చేసుకోగలుగుతాం, విశ్వసించగలుగుతాము.

పదిహేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎవరు, ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మని విషయాలు,
ఇప్పుడు ఎవరూ ఎవరికీ చెప్పనక్కర లేకుండానే అందరి కళ్ళెదుటా నిలువెత్తు నిజాలై నిలబడిన విషయాలు, చాలా ఉన్నాయి.

మచ్చుకి కొన్నిటిని ఇక్కడ ఉటంకిస్తున్నాను.

1]. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా, అమెరికా గూఢచార సంస్థ సి.ఐ.ఏ.కి తెలుస్తుందని, ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రచారించింది. యావత్ర్పపంచమూ దాన్ని నమ్మింది.

అదంతా వొట్టి ప్రచారమేనన్న విషయం 2001, సెప్టెంబరు 11 న WTC మీద తాలిబన్ల దాడి తర్వాత, ఇప్పుడు నమ్ముతున్నారు గానీ, అంతకు ముందైతే, ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మి ఉండేవాళ్ళు కాదు.

అదే ఇప్పుడైతే అసలు 9/11 దాడులకు సి.ఐ.ఏ.నే, అల్ ఖైదాకూ, తాలిబన్లకూ సహకరించిందనీ, ముస్లిం తీవ్రవాదులకి అమెరికా నుండే గట్టి మద్దతు ఉందనీ అందరికీ బహిరంగ రహస్యమే! ఆ విషయాన్ని, సాక్షాత్తూ ఇటు బిన్ లాడెన్ లూ, అటు అమెరికాలో కూడా అంగీకరిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఈ విధంగా, ఈ విషయాలన్నిటినీ ఎవరు బహిరంగ పరిచారు? ఇటు ముస్లింతీవ్రవాదులు గానీ, అటు అమెరికా గానీ, తమని తామే ఎలా ప్రదర్శించుకున్నారు?

2]. పాకిస్తాన్, అమెరికాని దబాయించి కూర్చోబెడుతుందనీ, అమెరికా పాకిస్తాన్ కి అణుకువ చూపిస్తుందని 1992 కు ముందర, ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు.

అమెరికాలో ఏ అధ్యక్షుడు ఉన్నా, రిపబ్లికన్లో, డెమోక్రాటులో ఎవరు అధికారంలో ఉన్నా, పాకిస్తాన్ కి తెగ ముద్దు చేస్తారు. ‘పాక్ పేదదేశం, దారిద్రాన్ని తొలగించకపోతే తీవ్రవాదం పెరిగిపోతుంది’ అంటూ సానుభూతి చూపిస్తూనో, లేక ’మేమిచ్చే మిలియన్ల డాలర్ల ఆర్ధిక సాయాన్ని, పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోంది, ముస్లిం ఉగ్రవాదులకి సాయం చేస్తోంది’ అంటూ మందలిస్తూనో, పాకిస్తాన్ కి పైలివ్వడం మాత్రం అమెరికా మానెయ్యదు. తమకి ఆర్ధిక సాయం చేయకపోతే తీవ్రవాదం మరింత పెరుగుతుంది. కాబట్టి మారు మాట్లాడకుండా డబ్బివ్వాలని, లేకుంటే ఆఫ్గాన్ మీద యుద్దానికి తమ భూభాగాన్ని వాడుకోనివ్వమనీ, తమ భూభాగం అమెరికాకీ పార్కింగ్ ప్లేస్ కాదని, పాకిస్తాన్ అమెరికాకి తెగేసి చెప్తుంటుంది.

ఈ విధంగా పాకిస్తాన్ అమెరికాని దబాయించటం, అమెరికా మారుమాట్లాడకుండా అన్నిటికీ తలూపటం ఇప్పుడైతే అందరికీ కళ్ళెదుట నిలబడిన నిలువెత్తు నిజం.

ఎవరు ఈ వ్యవహారాన్నంతా బహిరంగం చేసారు? భారత్ స్వాతంత్రం పొంది, పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా, దశాబ్ధాలపాటూ ‘భారత్ కు కళ్ళెం వెయ్యటం’ లాంటి పైకారణాలతో[over leaf reasons] పాక్ ని అమెరికా entertain చేస్తుండేది. అప్పుడంతా గప్ చుప్ గా నడిచిపోయిన ఈ వ్యవహారాన్ని ఇప్పుడెందుకు పాకిస్తాన్, అమెరికా కూడా బయటపెట్టుకున్నాయి?

3]. ఇరాక్ మీదకీ, ఆఫ్గన్ మీదికీ, ఒంటికాలి మీద పైకి లేచిన అమెరికా…. అదే బిన్ లాడెన్, అదే తాలిబాన్లు పాకిస్తాన్ లో ఉన్నారన్నా గమ్మున ఉంటుందని, 2001 లో WTC పై దాడి జరిగిన మొదటిరోజులలో….. ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పడది అందరికీ ప్రత్యక్ష నిదర్శనం. ఎవరు ఈ విషయాన్ని ఇలా బహిరంగ పరిచారు?

4]. ముస్లిం తీవ్రవాదం, మతమౌఢ్యం, తాలిబన్ల రూపంలోకి అవతరించింది. గాలిపటాలెగరేస్తే తప్పు, బురఖా వేసుకోకపోతే తప్పు! టీవీ చూస్తే తప్పు. ప్రపంచం మొత్తాన్నీ అల్లా సామ్రాజ్యంగా మార్చేస్తామంటూ తాలిబాన్లూ, ముస్లిం తీవ్రవాదులూ బాంబుదాడులు జరుపుతున్నారు. ఎన్నోదేశాలు క్రమంగా ముస్లిందేశాలయిపోయాయి. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ, ఏది ఎలా పోయినా, పెట్రో ఉత్పత్తుల మీదే ఏకమొత్తంగా ఆధారపడేలా నడుస్తుంది. పెద్దగా ఎవరి దృష్టి పడకుండానే, గల్ఫ్ దేశాల పెట్రో వ్యాపారం మాత్రం ఇబ్బడిముబ్బడిగా ఉంటుంది. దాదాపు ప్రపంచదేశాలన్ని ఆ ’ఇరుసు’ మీదే తిరుగుతాయి. ఈ విధంగా ముస్లింలకూ, ముస్లిం దేశాలకూ ప్రపంచవ్యాప్తంగా హవా నడుస్తుందని 1992 కు ముందర, ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పడది అందరికీ తెలిసిన సత్యం. ఎవరు ఈ విషయాలని ఇలా బహిర్గతం చేసారు?

5]. ప్రపంచవ్యాప్తంగా, మీడియా ’నంది అంటే నంది. పంది అంటే పంది’. క్రమంగా ఈ విషయం బాగా బహిరంగ పడింది. మీడియా సంస్థలు పరమ స్వార్ధపరమైనవనీ, తమ స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచారిస్తాయనీ ప్రపంచవ్యాప్తంగా మీడియా ఇచ్చే రేటింగులూ, ర్యాంకింగులలో చాలా వ్యవహారాలు నడుస్తాయనీ 1992 కు ముందర, ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పుడది అందరికీ నిరూపిత సత్యం. ఎవరు ఇదంతా బహిరంగ పరిచారు?

6]. అమెరికా, చైనాలకి పడదు. అయినా ఇద్దరికీ ఇస్లామాబాద్ ఇష్టసఖే. ‘శతృవు యొక్క మిత్రుడు కూడా శతృవు అవుతాడు’ అనే సహజ సూత్రం ఇక్కడ పని చేయదు. ఇతోధికంగా అమెరికా, చైనాలిద్దరూ పాకిస్తాన్ కి పైసలో, ఆయుధాలో, ఆయుధ సాంకేతికతలో సహాయంగా ఇస్తాయి. ఇంతగా ఇస్లామాబాద్ కి పట్టుందని 1992 కు ముందర ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పుడది అందరికీ చాలా మామూలు విషయం. ఎవరు ఇదంతా బహిరంగ పరిచారు?

7]. అంతర్జాతీయ క్రీడల్లో మ్యాచ్ ఫిక్సింగులుంటాయనీ, బుకీలుంటారనీ క్రానే చెప్పేవరకూ, ఎవరికీ తెలియదు. ఇక డోపింగ్ సంగతైతే ఊహక్కూడా తెలియదు. డోపింగులతో, క్రీడల పోటిల్లో, ఇతరుల్ని అదరగొట్టేయ వచ్చన్న ఊహే తెలియదు.

అంతర్జాతీయ క్రీడల్లో, లోతట్టున నమ్మకంగా నడిచే ఈ మ్యాచ్ ఫిక్సింగులనీ, డోపింగ్ భాగోతాలని ఎవరు ఇంతగా బహిరంగ పరిచారు?

8]. అదొక్కటేనా? ఒకప్పుడు ఆస్కార్, నోబెల్ వంటి అవార్డులూ, ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఇచ్చే ర్యాంకింగులంటే ’అబ్బో! చాలా గొప్ప’ అనుకునే వాళ్ళం! అంటే తొలి ప్రభావ శీల మహిళల్లో ఫలానా వారికి ఫలానా ర్యాంకు, సక్సెస్ ఐకాన్ ఫలానా వాళ్ళు, యూత్ ఐకాన్ ఫలానా వాళ్ళు గట్రాలన్నమాట. ఇప్పుడంటే అవన్నీ లాబీయింగ్ తో సాధ్యమని తెలుసు గానీ 1992 కు ముందరైతే, ఈ విషయం ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు.

9]. ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్ రంగం మోసాలతో నిండి ఉంటుంది. ఇది 1992 కు ముందు కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ’ మోసం’ అత్యంత లోతుగా ఉంటుందనీ, షేర్ల ధరలు పెంచుకోవటానికి, కార్పోరేట్ కంపెనీలు పుకార్లు వదలటం వంటి చిన్న చర్యలు మొదలుకొని, ప్రభుత్వాల్నే కూలదోయటం వంటి పెద్దచర్యల దాకా చేస్తాయనీ, తమ షేర్లధరలు పెంచుకోవటానికి అవసరమైతే తమ ధనాన్నే విదేశీ ఇన్వెస్టర్ల పేరుతోనో, కుదరకపోతే స్వదేశీ ఇన్వెస్టర్ల పేరుతోనో ప్రవహింపజేస్తాయనీ, తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వాలని ప్రభావపరచి, దేశాలకి దేశాలనే దివాళా తీయిస్తాయని ఇప్పుడైతే బహిరంగమే గానీ, 1992 కు ముందరైతే, ఈ విషయం ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు.

10]. ఒకప్పుడు, భారతదేశం అంతర్జాతీయ వేదికలపై అంతగా ప్రాముఖ్యం లేనిది. భారతప్రధానికి ఇచ్చిన అపాయింట్ మెంట్ ని పక్కకి పెట్టి, శ్వేతసౌధంలో వేచి ఉండేలా చేసేంతగా చులకన చేసేవారు. ఒంటరినీ చేసేవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే 1992 తర్వాత భారత్ కి ఎంతగా ప్రాముఖ్యం ఏర్పడిందో అందరికీ తెలిసిన విషయమే. ఇది 1992 కు ముందరైతే, ఈ విషయం ఎవరు, ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు.

11]. ఇక, ప్రపంచవ్యాప్తంగా….. మత, రాజకీయ సిద్దాంతాలతో సంబంధం లేకుండా, తీవ్రవాద సంస్థలు ఒకదానికొకటి సహకరించుకుంటాయి. ఆయుధాలు సమకూర్చటం దగ్గరి నుండి తీవ్రవాదులకు శిక్షణ నివ్వటం దాకా, అంతా పకడ్బందీగా జరుగుతుంది. LTTE కి లిబియా ముస్లిం తీవ్రవాదులు శిక్షణ నిచ్చినట్లున్న మాట! ముస్లిం తీవ్రవాదులకి, మావోయిస్టులకి సంబంధాలు గట్రాలన్నమాట. ఎక్కడ వేర్పాటువాదం మొదలైనా స్థానికంగా ఉద్యోగావకాశాలూ, లేదా భాషా, లేదా సంస్కృతి అణిచివేత అన్న పైకారణాలతో[over leaf reasons] మొదలౌతుంది. వాస్తవంలో మాత్రం, ప్రజల ఆస్థుల ధ్వంసం, హింసోన్మాదం, బాంబులతో హత్యల వంటివే ఉంటాయి. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సంస్థల మధ్యన అల్లుకున్న అనుబంధాలు, అందరికీ కళ్ళెదుటే కదలాడుతున్న సత్యాలు. 1992 కు ముందర, ఈ విషయాలని ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మలేరు. ఎవరు దీన్నంతా బహిరంగం చేసారు? అంతకు ముందు, దశాబ్దాల తరబడి, ఇదంతా బహిరంగం కాకుండా, మామూలుగా నడిచిపోయేవి కదా?

12]. ప్రపంచవ్యాప్తంగా, ఆర్దిక సిద్దాంతాలు ఎంత డొల్లగా ఉంటాయో, ఎంత అసత్యపూరితాలో 1992 ముందర, ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మలేరు. అదే ఇప్పుడైతే ద్రవ్యోల్పణ సూచీ పెరిగినా, తరిగినా, దానికి నిత్యావసరాల ధరలతో సంబంధం ఉండదనీ, అభివృద్దీ సూచీ కేవలం కార్పోరేట్ కంపెనీలకి, సంస్థలకీ తప్ప, సామాన్యులకి చెందదనీ, అందరికీ సంఘటానాత్మకంగా ఋజువయ్యింది. ఎవరు దీన్నంతా బహిరంగం చేసారు? [1992-1996 లో ఈ ప్రధాని మన్మోహన్ సింగే ఆర్దికమంత్రిగా ఉన్నప్పుడు, ద్రవ్యోల్పణం పెరిగినా, వస్తువుల రేట్లు తగ్గాయి. ఈ మన్మోహన్ సింగే ప్రధానిగా ఉండగా, ఇప్పుడు, ద్రవ్యోల్పణం తగ్గినా, మైనస్ దాకా వెళ్ళినా, ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అదీ ఇక్కడ గమనించవలసిన తేడా! ఇంతకీ ఈ తేడా పరిపాలనలో ఉందా? లేక వ్యక్తి అవినీతిలో ఉందా? లేక ఆర్ధికశాస్త్రంలో ఉందా?]

13]. చైనాలో కమ్యూనిజం అయినా, అమెరికాలో పెట్టుబడిదారీ విధానమైనా, జపాన్ లో పని సంస్కృతి అయినా…. ఎక్కడ ఏ ఇజమైనా అందులో నిజం లేదు. చివరికి ప్రజాస్వామ్యం అని చెప్పేదానిలోనూ ఉన్నది ఒట్టి బూటకమే! ఏ పేరుతో దేశాల పాలన ఉన్నా, ఏ దేశంలో ఏ పార్టీలు పరిపాలన చేసినా, జరుగుతోంది మాత్రం కార్పోరేట్ వ్యాపారమే! ప్రజల శ్రమదోపిడి మాత్రమే కాదు, వారి శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు వారి జీవితాలే కార్పోరేటు కంపెనీలకు వ్యాపార వస్తువులై పోయాయి. ఇప్పుడైతే ఇదంతా అందరికీ అర్ధమైంది గానీ, ఒకప్పుడైతే, ఎవరు చెప్పినా నమ్మేవారు కొద్దిమంది మాత్రమే ఉండేవారు.

14]. గతంలో, ఇందిరాగాంధీ ‘భారతదేశం మీద విదేశీ కుట్ర జరుగుతోందనీ, దేశంలో జరుగుతున్న వివిధ వ్యవహారాలలో విదేశీ హస్తం ఉందనీ’ అంటే, దాని మీద అప్పట్లోనే పచ్చి, బండ జోకులు వేసారు. తరువాత కాలంలో విదేశీ జోక్యం ఉందని ఒప్పుకునే వారు కూడా, అది సి.ఐ.ఏ. ప్రమేయం అనుకునేవాళ్ళు. అదే 1992 తర్వాత అయితే, 1993 ముంభై వరుస బాంబు పేలుళ్ళ దగ్గర నుండి, వివిధ నగరాల్లో నేడు జరుగుతున్న వరస బాంబుదాడుల దాకా, 11/26 [ముంభై ముట్టడి] దాకా అన్నిటిలోనూ, నకిలీ కరెన్సీ ముద్రణ, నకిలీ స్టాంపులు ఇత్యాది ఆర్ధిక నేరాలలో కూడా ఐ.ఎస్.ఐ. హస్తం ఉందనీ, ఐ.ఎస్.ఐ.కి బంగ్లాదేశ్ ఇతోధికంగా సహాయ సహకారాలిస్తుందనీ, ఈ రెండింటికీ లింకు హైదరాబాద్ పాతబస్తీలోనే ఉందనీ అందరికీ పలుమార్లు ఋజువయ్యింది. దక్కన్ ముజాహిదీన్ లూ, దక్కన్ కాన్ దాన్ లూ, పూర్వపు నిజాం పాలనని మళ్ళీ తేవాలని ప్రయత్నించటం గురించి 1992 కు ముందర, ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పుడు అందరికీ తెలుసు. ఎవరు ఇదంతా బహిరంగ పరిచారు?

15]. నిజాం సైన్యాధికారి రజ్వీ నుండి, వారసత్వపు పగ్గాలు అందుకున్న ఒవైసీలు, భారత పతాకానికి సెల్యూట్ చేయమనేంతగా కరడుగట్టిన భారత వ్యతిరేకులని 1992 కు ముందర ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మలేరు [మహా అయితే కొద్దిమందికి మాత్రమే తెలుసు]. అదే ఇప్పుడు ఆ విజువల్స్, వార్తలు కూడా బయటికొచ్చాక ఒవైసీలు గురించి అందరికీ తెలిసింది. ఎవరు ఇదంతా బహిరంగ పరిచారు?

16]. మరోప్రక్క భాజపా, ఆర్.ఎస్.ఎస్.ల వంటి హిందూత్వ ముసుగు వేసుకున్న పార్టీలు, సంస్థలూ…. నిజానికి హిందూ మత శ్రేయస్సుని కోరేవారు కాదని, రామమందిర నిర్మాణం పేరుతో మతఘర్షణలు రేపటమే వారి లక్ష్య మనీ, అధికారం వస్తే అధికారం కోసం కొట్టుకుంటారనీ, వాళ్ళు నిజంగా జిన్నాభక్తులు, పాకిస్తాన్ ప్రేమికులూ తప్ప భారతీయత పట్ల నిబద్దత గలవారు కాదనీ, 1992 కు ముందర ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు. ఓటు రాజకీయాల పేరుతో వాళ్ళు చేయబూనిన మతరాజకీయాలు, రామసేతు మొదలు మసీదులు కూల్చడాలు వరకూ, ’వాళ్ళేదో హిందూమతాన్ని ఉన్నతిలోనికి తెస్తారని నమ్మిన అట్టడుగు అమాయక కార్యకర్తలకి’ అసలు అర్ధం అయ్యేది కాదు. అదే ఇప్పుడైతే ఆ బండారం అందరికీ బహిరంగమయ్యింది. ఎవరు ఇదంతా బయటికి తీసారు?

17]. సోనియాగాంధీ త్యాగనిరతిని కాంగ్రెస్ లోని అధిష్టాన బానిసలు, భక్తులూ తెగ పొగుడుతూ ఉంటారు. అయితే ఆమె మాత్రం, పప్పెట్ వంటి ప్రధానమంత్రిని సీట్ లో కూర్చోపెట్టి, రిమోట్ తో అధికారం చెలాయిస్తోంది. [సీతరామ్ కేసరి వంటి పప్పెట్ ని AICC ప్రెసిడెంట్ గా పెట్టి, తరువాత తానే ఆ సీటుని అధిష్టించింది.] ఈ నిజాన్ని ప్రధానితో సహా ఇతర మంత్రులంతా ప్రత్యక్షంగా నిరూపించారు.

నవంబరు 26,2008 లో జరిగిన ముంభై ముట్టడి నేపధ్యంలో, ఓప్రక్క ప్రజలు టెర్రరిజం కారణంగా ఆప్తుల్ని పోగొట్టుకుని ఆక్రోశిస్తుంటే, నాటి హోంమంత్రి శివరాజ్ పాటిల్, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పలుమార్లు క్రాపు సరిదిద్దుకుంటూ, ఒక్కరోజులో మూడు సూట్లు మార్చి ప్రెస్ మీట్ లిచ్చాడు. అదేమంటే ‘తనకు అధిష్టానం అయిన సోనియాగాంధీ ఆశీస్సులున్నాయి కాబట్టి తను ఎవరికీ జవాబుదారి కాదు’ పొమ్మన్నాడు. అదీ ఆమె అధికార లాలస Vs త్యాగనిరతి.

అంతేకాదు. ఈ దేశ పర్యటనకి వచ్చే విదేశీ ప్రముఖలలో, దాదాపు అందరూ, ప్రధానితోపాటు, అధికార పార్టీ అధ్యక్షురాలు అయిన ఈమెతో కూడా ’ములాకత్’ అవుతారు. [ప్రభుత్వ కుర్చీవ్యక్తి పదవి రాజ్యాంగ బద్దం కాదు కదా?] అదీ ఈమె లాబీయింగ్ మహిమ! అధికార పార్టీ అధ్యక్షురాలు కనుక ఆవిడని కలుస్తున్నారు అనేటట్లయితే, మరి భాజపా అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ని కలవరు. అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అద్వానీని కలుస్తారు. అది అద్వానీ లాబీయింగ్ మరి! ఇతర దేశాల్లో కూడా ఇలాగే పర్యటన కొచ్చిన ప్రముఖులూ, ఆయాదేశాల ప్రధానులు, ప్రెసిడెంటులతో పాటు పార్టీ ప్రెసిడెంట్లని కూడా వారి ఇళ్ళకెళ్ళి కలుస్తుంటారేమో మరి!

మహాత్మాగాంధీ గురించి, ఈ ఇటలీ గాంధీ, అంతర్జాతీయ వేదికల మీద ఉపన్యసించగలదు. ఇటలీ లో స్కూలు ఫైనలు దాటని ఈ మహిళ, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన తొలి వందమంది మహిళలలో ఒకరు. జీజింగ్ వంటి నగరాలలో జరిగే అంతర్జాతీయ క్రీడోత్సవాలకీ, ప్రక్కదేశాలలో జరిగే రాజు పట్టాభిషేక మహోత్సవాలకీ, భారతదేశం తరుపున అధికారికంగా పాల్గొంటుంది. అదీ ఈమె అధికార దాహం Vs త్యాగనిరతి. ఈమె మూడుసార్లు లేదా నాలుగుసార్లు ప్రధాని పదవిని త్యాగం చేసిందట. అధికారాన్ని త్యాగం చేయలేదు కదా! ఈమె భక్తులంతా చిడతలు తీసుకు మరీ భజన చేస్తుంటారు.

ఈమె అవినీతి రాష్ట్రముఖ్యమంత్రుల నుండి వాటాలు పుచ్చుకునేటంత! ఈమె అధికార దాహం EVM లని Tamper చేసి, తనని ఎదురించిన లాలూ, మాయావతి గట్రాలందరిని మట్టి కలిపేసేంత! అందుకోసం తనకి అనుకూలురైన నవీన్ చావ్లాలని, మధుకర్ గుప్తాలని కావాలసిన పదవుల్లోకి ప్రమోట్ చేస్తుంది.

ఖత్రోచి మీద కేసులను ఉపసంహరించుకుంటుంది, లేదా వీగి పోయేటట్లు సిబిఐని ప్రభావపరుస్తుంది. జగదీష్ టైటర్లనీ, నళినీలని క్షమించేస్తుంది. ఇంటిగడప దాటని ఇల్లాలు, మాజీ ప్రధాని భార్య, మరో మాజీ ప్రధాని కోడలు అయిన ఈ ఇటలీ సోనియాగాంధీ అధికార దాహం, అవినీతి, బంధుప్రీతి గురించి 1992 కు ముందర, ఎవరు ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పుడో! ఇది అందరి ఎదుటా 70MM లో నిలుచున్న సత్యం. ఎవరు దీన్నంతా బహిరంగం చేసారు?
18]. ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రతిరంగం ఎంత అవినీతిమయమో నిరూపితమైంది. మీడియా, రాజకీయ, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ, న్యాయస్థానాలు, కార్పోరేట్ సంస్థలు…. ఇలా ప్రతిరంగంలోని అవినీతి బహిర్గతమైంది.. ఇంత అవినీతి 1992 ముందర ఎవరు ఎవరికి చెప్పినా ఎవరు నమ్ములేరు. మరి ఇదంతా ఎవరు బహిరంగ పరిచారు?

మరో విషయం పరిశీలించండి. ఒకపని జరిగిందంటే, దాన్ని నిర్వహించిన వాళ్ళు ఉండాలి కదా! ఒక కర్మ జరిగిందంటే దానికి కర్త ఉండి తీరాలి! ఎందుకంటే – ఒక నిర్మాణం జరిగిందంటే, దాని నిర్మాత ఖచ్చితంగా ఉండి తీరాలి కాబట్టి. ఆ నిర్మాత ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు. ఆ వ్యవస్థ ‘మనకి తెలిసిందేనా, కాదా’ అన్నది వేరే విషయం. మనకి తెలియనంత మాత్రాన అది నిజం కాదు అనలేం కదా? ఎందుకంటే, భూమ్యాకర్షణ శక్తి గురించి న్యూటన్ చెప్పకముందు నుండీ భూమికి ఆకర్షణ శక్తి ఉండటం సత్యం. దాన్ని తర్వాతే మనం తెలుసుకున్నాం. అంతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

ఎంతో శ్రమతీసుకొని మా కెన్నెన్నో విషయాలను ఎంతో గొప్పగా వివరిస్తున్నందులకు మిమ్మల్నెలా అభినందించాలో తెలియటం లేదు. మీకు మరీ మరీ నా కృతజ్ఞతలు.

వేదుల బాలకృష్ణమూర్తి గారు,

మీ అభిమానానికి కృతజ్ఞతలండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu