ఇటీవల పార్లమెంటులో దాదాపు ప్రతిపక్ష నాయకులందరు దేశంలో కరువు పరిస్థితి గురించి గొడవపెట్టారు. దక్షిణాదిన, ఉత్తరాదిన వర్షాభావం కారణంగా ఇంత వరకూ వ్యవసాయపనులు సరిగా ప్రారంభం కాని స్థితి గురించి పార్లమెంటు సమావేశంలో గందరగోళం చెలరేగింది. అంతే!..... సాయంత్రానికి మాయావతి Vs రీటాబహుగుణల వివాదం పతాకశీర్షికల కెక్కింది. కరువు గొడవ కాస్తా ఎక్కడికో…. వెళ్ళిపోయింది. చాలా పకడ్బందీగా… ప్రతిపక్షనాయకులు తమ బాధ్యత ప్రకారం ’కరువు’ గురించి గొడవపెట్టినట్టుగానే ఉంది. విషయం మామూలుగా ప్రక్కదారిపట్టించబడింది. [రాష్ట్రంలో కూడా ఇదే స్ట్రాటజీ ప్రయోగిస్తున్నారు. వై.ఎస్. Vs చంద్రబాబునాయుడులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత సవాళ్ళు విసురుకుంటూ, ఇలాగే ప్రజాసమస్యలను ప్రక్కదారి పట్టిస్తున్నారు.] అధికారపక్షమైన యూ.పి.ఏ.కీ, కాంగ్రెస్ కీ నిబద్దత లేదు, సరే! ప్రతిపక్షాలకైనా నిబద్దత, నిజాయితీ ఉంటే ఇద్దరు స్త్రీల గొడవతో ’కరువు’ అనే జాతీయ సమస్యనీ, ప్రజల బాధని మరిచిపోతారా?

ఈమొత్తం నాటకాన్ని పరిశీలించే ముందు అసలు ఆ ఇద్దరు స్త్రీల వివాదాన్ని పరిశీలిద్దాం. ఉత్తరప్రదేశ్ లో అత్యాచారానికి గురైన మహిళలకు నష్టపరిహారం 25,000/-రూ. లు ముట్టజెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందట. ఆ విషయాన్ని ఎద్దేవా చేస్తూ రీటా బహుగుణ [ఈవిడ యూపిలో పిసిసి అధ్యక్షురాలు] యూ.పి. ముఖ్యమంత్రి మాయావతిని వ్యక్తిగతంగా దూషించిందట. ఆ దూషణలో భాగంగా “అత్యాచారానికి గురై 25,000/-రూ. పరిహారంగా తీసుకోవలసిందిగా చెప్పబడుతున్న మహిళలు, ఆ పాతిక వేలనీ, మాయావతి ముఖాన కొట్టి ’అదే విధంగా మాయావతి తమలాగే అత్యాచారానికి గురైతే పాతిక వేలు కాదు కోటిరూపాయలు నష్టపరిహారంగా తామే ఇస్తాం’ అని చెప్పవలసింది” అన్నదట. దానికి మాయావతి మండిపడుతూ “అసలా పధకం యూపిఏ ప్రభుత్వం మొదలుపెట్టిందే. మేం కొనసాగిస్తున్నాం. అంతే.” అన్నదట. ఆపైన కోర్టు కేసు, రీటా బహుగుణ కస్టడీ, బెయిలూ, షరామామూలే!

ఇందులో ఎవరి తప్పొప్పులు ఎంత? ఓ మహిళ అత్యాచారానికి గురైతే ఆమె క్షోభనీ, గౌరవగ్లానినీ డబ్బుతో కొలుస్తారా? అత్యాచారానికి గురైతే పాతికవేల నష్టపరిహారం ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తుందా? అత్యాచారానికి గురైన మహిళ గౌరవాన్ని, శీలాన్ని, మానాన్ని వెలకట్టటం ఎంత హేయం? ఆమెతో ’అనుభవానికి’ డబ్బు చెల్లించేందుకు ఆమె వెలయాలు కాదే? స్త్రీ ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ విషయంలో, యూపిఏ ప్రభుత్వం మొదలెట్టగా యూపి ప్రభుత్వం కొనసాగిస్తుందో, ఎవరు మొదలెట్టినా ఎవరు కొనసాగించినా ఇంత బాహాటంగా నీతి బాహ్యతా? భారతదేశమేనా ఇది? శీలరక్షణకై ప్రాణత్యాగం చేసిన పతివత్రల గురించి పురాణాల్లో చదువుకోవటమేకాదు, శీల రక్షణ కోసం శరీరాన్ని దగ్ధం చేసుకున్న రాణీ పద్మిని, కర్ణావతి వంటి రాజపుత్రస్త్రీలున్నారు ఈ దేశ చరిత్రలో! [చిత్తోడ్ రాణి కర్ణావతిని జయించడానికి, గుజరాత్ రాజు సుల్తాన్ బహుదూర్ షా సేనల్ని పంపించాడు. రాణి కర్ణావతి ఢిల్లీ రాజు హుమాయూన్ కి తమకి సహాయం చేయవలసిందిగా అర్దిస్తూ, రాఖీ పంపిందట. రాఖీని అందుకున్న హుమయూన్ ఆమెను చెల్లెలిగా భావించి రాజ్యాన్ని కాపాడటం కోసం తన సేనలతో బయలుదేరి వెళ్ళాడట. [ఇదీ ఉద్దేశపూరక ఆలస్యం కావచ్చు. ఢిల్లీ సుల్తానులకు ఇమేజ్ ఇస్తూ చరిత్రను వక్రీకరించటం మనకి తెలిసిందే!]. కాని అప్పటికే చిత్తోడ్ సుల్తాన్ వశం అయిపోతుంది. రాణి కర్ణావతితో పాటు రాజ్యంలోని లక్షా ముప్పైవేల మంది స్త్రీలు ఆత్మాహుతి చేసుకున్నారు.] శీల రక్షణ కోసం ప్రాణం తీయాటానికైనా, ప్రాణం తీసుకోవటానికైనా వెనుకాడని ధీరవనితల కన్నభూమి ఇది. ‘When the rape is unavoidable, enjoy it’ అనుకోగలిగే సంస్కృతిని ఎంతగా మీడియా ప్రవేశపెట్టప్రయత్నించినా ప్రయోజనం సిద్ధించింది తక్కువే. అటువంటి సున్నితవ్యవహారాన్ని, భావోద్వేగ మిళితమైన విషయాన్ని, డబ్బుతో ముడిపెట్టటం ఎంతో నీచంగా ఉంది. ఇప్పటికే నేతకార్మికుల ఆత్మహత్యలకీ, రైతుల ఆత్మహత్యలకీ నష్టపరిహారం చెల్లిస్తూ ప్రాణాలకి విలువకట్టిన ప్రభుత్వసరళిలో, ఆ నష్టపరిహారపు చెక్కు కుటుంబసభ్యులకు చేరాలంటే, అక్కడక్కడా చేతులు తడపవలసి రావటం గురించి వింటూనే ఉన్నాం. అటువంటప్పుడు అత్యాచారానికి గురైన మహిళకు చెల్లించే నష్టపరిహారం 25,000/-Rs. చెల్లించడానికి అవినీతి అధికారులు లంచమే అడుగుతారో మరింకేమైనా అడుగుతారో? ఎటూ ఓసారి పోయిన శీలమూ, పడిన అల్లరే కదా అంటే? అసలే అవినీతికి ఎల్లలు లేనిచోట, ప్రభుత్వమే అవినీతి కీ, అవినీతి అధికారులకీ, అన్నిరకాల సహాయసహకారాలూ ఇస్తున్న చోట, అలా జరిగే అవకాశం లేదనగలమా? అత్యాచారానికి గురైన మహిళ దీనత, నిస్సహాయత, అవమానం, ఆక్రోశం…. ఇదేదీ ఎవరికీ పట్టటం లేదు. శీలానికి ఖరీదు కట్టటం, అది భారతీయ సంస్కృతికి అవమానం అన్న విషయం కూడా ఎవరికి[భాజపాకి కూడా] పట్టటం లేదు. రేపిస్టులకి ఏ శిక్షలు విధించారో ఎవరికీ తెలీదు. అది చర్చకి రావటం లేదు కానీ, బాధితురాలికి నష్టపరిహారం గురించి నానారగడా అవుతోంది. ఓ నిస్సహాయ మహిళ అత్యాచారానికి గురై, ఆపైన అల్లరి పాలైతే ’పాతికవేల రూపాయలతో’ అన్నీ సరైపోతాయనే యూపి ప్రభుత్వాధినేత మాయావతి స్త్రీకాదా? ఆవిడ గౌరవం అంత గొప్పదా? అదే ఆవిడ ఆత్యాచారానికి గురైతే, కోటిరూపాయలు నష్టపరిహారంగా ఇవ్వచ్చునన్నందుకు అంతగొడవ జరుగుతోందే? BSP పార్టీ సభ్యులూ, ఇతరులూ, అందరూ గొడవ పెట్టేస్తున్నారు. అవును, నిజమే! ఒక స్త్రీని అలాంటి మాటలతో అగౌరవపరచకూడదు. మరి ఇంతటి రగడలో అసలు విషయం… అత్యాచారానికి గురైన మహిళల గౌరవం, బాధల సంగతి ఏమిటి? వాళ్ళు స్త్రీలు కాదా? మాట అంటేనే మండిపడ్డ మాయావతి లాగే, వాళ్ళూ ఆత్మగౌరవం ఉన్న స్త్రీలే కదా? అంటే ఈ దేశంలో డబ్బులేని పేద స్త్రీలకీ, సామాన్య స్త్రీలకీ ఆత్మగౌరవాలూ, తొక్కలూ ఎక్కడనా? అసలు స్త్రీలు అత్యాచారానికి గురయ్యేంత అభద్రత సమాజంలో ఉండటం, అంతగా నేరప్రవత్తి పెరిగిపోవటం…. ఈ విషయాల మీద ఏ చర్చా జరగడం లేదు.

దాదాపు పేరున్న రాజకీయనాయకులంతా[సుష్మాస్వరాజ్ దగ్గర నుండి రాహుల్ గాంధీ తదితరుల వరకూ అందరూ] రీటాబహుగుణ అరెస్టు, మాయావతి పై విమర్శల గురించి తమ అమూల్య అభిప్రాయాలనీ, స్పందననీ తెలియచేసారు. టీవీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చిత్రీకరించి మరీ చూపెట్టారు. అధికారంలో ఉన్న స్త్రీలకీ, సామాన్య స్త్రీలకీ ఆత్మగౌరవం, శీలరక్షణ విషయాల్లో ఇంతగా అంతరం ఉంటుందని దృష్టాంతపూరితంగా నిరూపిస్తూ, రాజకీయ నాయకులూ, మీడియా, అన్నీ, అందరూ సలక్షణంగా ’కరువు’ పరిస్థితిని తెరమీది నుండి తప్పించేసారు.

నిజంగా ప్రతిపక్షాలకి ప్రజల బాధల పట్లా, కరువుపట్ల నిబద్ధత ఉంటే ’కరువు’ మీద ఏమారకుండా ఉంటారు కదా? అదేం లేదు. తామూ అందుకే ఎదురుచూస్తున్నాం అన్నట్లు, అవకాశం దొరికింది చాలన్నట్లు, హాయిగా ’కరువు’ సమస్యని ప్రక్కన పెట్టేసారు. చెప్పుకునేందుకు తమ బాధ్యత తాము నెరవేర్చాం అన్నట్లు ఓరోజు సమస్య ఎత్తారు, మరో వివాద నేపధ్యంలో ఎంచక్కా పక్కన పెట్టేసారు. ఎంతో నాటకీయంగా ఎవరి పాత్రవారు నిర్వహించేస్తున్నారు. Off course, ప్రజలు కూడా తమ ప్రేక్షక పాత్రనీ అలాగే నిర్వహిస్తున్నారనుకొండి.

ఇక ఈ రీటాబహుగుణ గొడవ తరువాత రాహుల్ గాంధీ యూపి సందర్శనకు వెళ్ళి “యూపిలో విగ్రహాలూ, ఏనుగులూ తప్ప అభివృద్ధి కనబడటం లేదు” అన్నాడు. అంతే మాయావతి కయ్యానికి కాలుదువ్వుతూ “అభివృద్ధి చూడటానికి కళ్ళుండాలి. ఆమాట కొస్తే రాజ్ ఘాట్ లో విగ్రహాలకి మీరు పెట్టిన ఖర్చుతో పోలిస్తే యూపిలో విగ్రహాల ఖర్చు చాలా తక్కువ” అన్నది. ఆవిడ రాహుల్ గాంధీని, యూపిఏ ప్రభుత్వాన్ని ఎత్తిపొడవాలనుకుంటే నేరుగా వాళ్ళనే అనవచ్చుగానీ మధ్యలో బాపూజీ గొడవెందుకు? నిజానికి బాపూజీ సమాధి ఉన్న రాజ్ ఘాట్ కీ ఈ యూపిఏ ప్రభుత్వానికీ ఏం సంబంధం ఉంది? నాటి దేశభక్తి కాంగ్రెస్ కీ, నేటి దేశద్రోహా కాంగ్రెస్ కీ అసలు పోలికే లేదయ్యె. బాపూజీ అసలు రాజకీయనాయకుడు కాదయ్యె. ఎన్నికల్లో నిలబడి, పదవుల వెంటబడిన వాడూ కాదయ్యె. ఆయన స్వాతంత్రసమరయోధుడు. భారతదేశం గౌరవించుకున్న జాతిపిత. వీళ్ళ రచ్చలో మధ్య ఆయన ఊసెందుకు? మళ్ళీ ఈ మాయావతి ఇంతగా నోరు పారేసుకుంటుందా? పెద్దగా చప్పుడు చెయ్యకుండా, మొన్న 2009 ఎన్నికల తర్వాత ‘బేషరతుగా యూపిఏ కు మద్దతులు’ వంటివి ఇచ్చేస్తుంటుంది. అదొక్కటే కాదు…. అవసరమొచ్చినప్పుడు నోరుమూసేసుకుని మరీ, ఆ ఇటలీ నాయకి సోనియాగాంధీకి అనుకూలమైన చర్యలు తెరవెనకా, తెరమీదా కూడా చేపడుతుంది. అదీ కుమ్మక్కు సాంద్రత!

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే – ఇలాంటి లజ్జాపూరితమైన పధకాన్ని యూపిఏ ప్రభుత్వం ప్రారంభిందట. యూపిఏ అధినేత్రి సోనియాగాంధీ స్త్రీయే! అదేపధకాన్ని యూపిలోని BSP ప్రభుత్వం కొనసాగిస్తుందిట. ఈప్రభుత్వ అధినేత్రి మాయావతి కూడా స్త్రీయే! ఇద్దరికే భారతీయ స్త్రీలు తమ శీలానికీ, గౌరవానికి ఎంత విలువ ఇస్తారో, గౌరవగ్లాని ఏర్పడితే, శీలరక్షణ కోసం ప్రాణాలు సైతం వదులు కుంటారని అర్ధం కాలేదు కాబోలు. ఎందుకంటే సంవత్సరం పాటు వేధించినా, రావణుడినీ, అతడి సంపదనీ తృణము కంటే హీనమన్న సీతాదేవిని ఆరాధ్యదేవతగా కొలిచే గడ్డ ఇది! పరస్త్రీలని, [తనతో కలిపి] కాముకదృష్టితో చూసినందుకు మహిషాసురుణ్ణి చీల్చి చెండాడిన దుర్గాదేవిని, జగన్మాతగా ఆరాధించే గడ్డ ఇది! అధికారాన్ని అడ్డదారిలో అనాయాసంగా అందుకునేందుకు మాయావతి కాన్షీరాంతో కొనసాగించిన అనుబంధం గురించి అతడి తల్లీ, చెల్లి కోర్టుకెక్కి, మరీ వెల్లడించారు. కాన్షీరాం అవసానదశలో ఉండగా, ఆసుపత్రిలో ఉన్న అతడిని తాము వెళ్ళి చూసేందుకు కూడా మాయావతి అడ్డుపడుతోందనీ వాళ్ళు ఆక్రోశించారు. అతడితో గల సన్నిహిత సంబంధాలతోనే ఆమె BSP లో అగ్రనాయకత్వానికి ఎదిగిందనీ, కాబట్టి అవలీలగా రాష్ట్రముఖ్యమంత్రి అయిపోయిందనీ విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సోనియాగాంధీ అయితే గురిచూసి మరీ ఓ దేశప్రధాని కుమారుడితో వివాహ సంబంధం ఒనగూడెలాగా ప్రయోగించబడింది. అంతే! మెట్టినింటి గడపతొక్కాక ఒకొక్కరినే అడ్డుతొలగించుకుంటే అనాయాసంగా దేశాధినేత అయిపోయింది. ఈ విషయం గురించి ‘విపులమైన టపా’ గతంలోనే వ్రాసాను. కెరీర్ కి వివాహసంబంధాన్నో, వివాహేతర సంబంధాన్నో సోపానంగా గ్రహించగల వాళ్ళకి శీలం విలువ తెలియటం కలలోని మాట కాబట్టే శీలానికి నష్టపరిహారంగా వెలకట్టగలిగారు.


మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

మా దగ్గర కూడా 25,000/-రూ. లు ఖర్చు పెట్ట గలిగేంత స్తోమత ఉంది. 25,000/-రూ. లు ఖర్చు పెట్టగల స్థోమత ఉన్న డబ్బున్న వాడు ఎవడైనా రేప్ చెయ్యగలడు.

మానభంగం జరిగితే పాతికవేలు ఇస్తామనడం ఒక దుష్టసంప్రదాయం. ఈ కాలపు భారతీయ స్త్రీలలో రకరకాలవాళ్ళున్నారు. మానభంగం జరిగే అవకాశమే కనిపిస్తే ఆత్మాహుతికి సైతం వెనుకాడనికి శ్రేణి ఒకటుంది. రేపిస్టుని చంపి/ చంపించి వాడి పాపాన్ని కడిగే తరహా ఒకటుంది. మూడోది - మీరన్నట్లుగా If rape is inevitable enjoy it అనుకునే అవకాశవాదపు తరహా. ఇవి కాక ఒకనాలుగో శ్రేణి కూడా ఉందంటే నమ్ముతారో లేదో ! మానభంగానికి సహకరించి ఆ తరువాత కేసు పెట్టి బెదిరించి రేపిస్టు దగ్గర్నుంచి ఆస్తో డబ్బో కొట్టెయ్యాలని చూసే తరహా అది. ఈ నష్టపరిహారాల ఏర్పాటు ఈ నాలుగో తరహాకి బాగా ఉపకరిస్తుంది.

ఈమధ్య రాజకీయపార్టీలన్నీ స్త్రీల కనుకూలంగా ఉన్నామని చెప్పుకోవడానికి బాగా తహతహలాడుతున్నాయి కనుక పాతికవేలతో మొదలైన పందేరాలు క్రమంగా లక్షల్లోకి చేరుకొని ప్రబుత్వకోశాగారాన్ని ఖాళీచేసే స్థాయికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.
ఒకసారి ఈ ఉచితాలు మొదలయ్యాయంటే వాటని రద్దు చేయించడం బ్రహ్మతరం కూడా కాదు. కొంతకాలానికి అవేవో జన్మహక్కయినట్లు మాట్లాడ్డం కూడా మొదలవుతుంది. "ఈ నాలుగేళ్ళలో ఎనిమిదిమంది చేతిలో మానభంగానికి గురయ్యాను. ప్రభుత్వం మొదటిసారికి మాత్రమే నష్టపరిహారమిచ్చి చేతులు దులుపుకుంది" అని వాపోయేవాళ్ళు బయలుదేరతారు. అందుచేత అది తొలి మానభంగమో, మలి మానభంగమో తేల్చుకోవాల్సిన అవసరం కూడా పోలీసులకి, ప్రభుత్వానికి కలుగుతుంది. ఇదంతా తల్చుకుంటే చాలా అసహ్యంగా ఉంది.

తాడేపల్లి గారు,
మీ విశ్లేషణతో నేనూ ఏకీభవిస్తానండి. ఈ రోజు సమాజం ఉన్న స్థితిలో, స్త్రీలలో, మీరు చెప్పిన నాలుగు రకాల వారూ ఉన్నారు. కడుపుకూటికోసం పడుపువృత్తిలోకి దిగిన నిస్సహాయల్నీ గమనించాను. ఆస్థుల సంపాదన కోసం డబ్బున్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకునే స్త్రీలనీ గమనించాను. మీరన్నట్లు, తామే ’అత్యాచారానికి ’ సహకరించి ఆపైన రేపిస్టు[?] పైన కేసులు బనాయించి డబ్బుగుంజే స్త్రీల గురించీ విన్నాను, చూశాను. అంతెందుకు? సూర్యాపేటలో మా ఇంటి యజమానురాలు ఈ బాపతే. తాను పనిమనిషిగా పాచిపని చేసుకుంటున్న ఇంటి యజమానితో సంబంధం పెట్టుకుని, అదను చూసి యాగీ చేసి ఆస్థి వ్రాయించుకున్నది. నా టపాలో నేను వ్రాసింది అలాంటి దుష్టసంప్రాదాయానికి ఇతోధిక ప్రోత్సాహం ఇస్తున్న నాయకురాండ్ర గురించి. సమాజంలో భద్రత లేకపోవటం, నేరప్రవృత్తి పెరగటం గురించి, [అత్యాచారాలు జరిగిన సందర్భంలో ఆయా మగవారిలో నేరప్రవృత్తి ఉంటే, అత్యాచార కేసులు బనాయించి డబ్బుగుంజాలనుకునే సందర్భంలో ఆయా స్త్రీలలో నేరప్రవృత్తి ఉంటుంది] ప్రభుత్వాలకి, వాటి అధినేత్రులకీ ఏమాత్రం పట్టకపోవటం శోచనీయం అన్నదే నా ఉద్దేశం.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu