ఇక ఇస్కాన్ లోపలికి వెళ్తే, గర్భాలయంలో దేవుడు [శ్రీకృష్ణుడు] ఉండడు. రాధికా సమేత శ్రీకృష్ణుడు, గోపికాపరివేష్ఠితుడై పెద్ద స్టేజ్ మీద అర్ధవృత్తాకారంలో నిలువెత్తు శిల్పాల రూపంలో ఉంటాడు. దుస్తులూ, నగలూ అలంకరించబడి, స్టేజ్ మీద నర్తిస్తున్న కళాకారుల్ని తలపిస్తూ ఉంటాయి, అక్కడ పూజలందుకునే దేవతా విగ్రహాలు! శ్వేతజాతీయ పూజారి అంటే బ్రహ్మచారి హారతి ఇస్తుంటాడు. వింజామర సేవ, దీపహారతి, ధూపహారతి, నైవేద్య సమర్పణ అన్నీ శ్వేత జాతీయులే నిర్వహిస్తారు. తదుపరి కృష్ణతత్త్వం గురించి శ్వేతజాతీయ బ్రహ్మచారి లేదా మహారాజ్ ఉపన్యసిస్తాడు. అక్కడ మేం బస చేసిన కొద్దిరోజులూ క్రమం తప్పకుండా ఇవన్నీ పరిశీలించాము. బ్రహ్మచారి లేదా మహారాజ్ ఉపన్యసిస్తున్నప్పుడు[ఇంగ్లీషులోనే లెండి] ఓ సన్యాసిని ఊలు స్వెట్టర్ అల్లూకుంటూ విరాగిణిలా మధ్యమధ్యలో నవ్వుతూ ఉండేది. అదెంత నాటకీయంగా ఉండేదంటే దాదాపు పాతిక, ముప్పైయేళ్ళ అందమైన ఈ శ్వేతజాతి సన్యాసిని ఒక క్రమ కాలవ్యవధిలో నవ్వుతూ ఉండేది. ఈవిడ వైరాగ్యపూరిత నవ్వులకీ, అక్కడ అప్పుడు నడుస్తున్న ఉపన్యాసానికీ అసలు పొంతన ఉందా అన్పించింది.

అదొక్కటే కాదు, అక్కడ భగవంతుణ్ణి ప్రతిష్ఠించిన తీరూ, పూజించే విధానమూ కూడా ఒక వేళాకోళంతోనూ, ఎకసెక్కంగానూ ఉన్నట్లే ఉండేది. ధూపహారతి పేరిట వాళ్ళిచ్చే హారితి పొగలో నల్లమందు వంటి మాదకదవ్వాలేవో కలుపుతారనీ, ఆ మత్తుకి కొందరు భక్తులు స్పృహ తప్పిపోవడమూ ఉండేదని స్థానికులు చెప్పారు. [అలా పడిపోవటాన్ని ఇస్కాన్ వాళ్ళైతే మధురభక్తి తో స్పృతి కోల్పోవటం అంటారు.] అదీ భయం భయంగానే లెండి. ఎందుకంత భయం అంటే – తొలినాళ్ళలో ఇస్కాన్ ఆవరణలో కొన్ని హత్యలు కూడా జరిగియాట. గ్రామీణుల పశువులు ఇస్కాన్ వారి పొలాల్లోకి వచ్చి మేసాయన్న నెపంతో స్థానికుల్ని, తొలినాళ్ళలో తుపాకితో కాల్చిచంపారట. పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టటానికి భయపడేంతగా ఈ పరంపర నడిచిందట. ఇప్పటికీ అక్కడి గ్రామస్థులు ఇస్కాన్ పట్ల ఎంతో భయంతో మెలుగుతారు. ఈ ధూపహారతిలోని గంజాయి, నల్లమందుల వినియోగం గురించివిని, ఇటీవల మరణించిన పాప్ రారాజు మైకేల్ జాక్సన్ ప్రదర్శనలలో కూడా ప్రేక్షకులు మూకుమ్మడిగా స్పృహ కోల్పోవటం, అలాంటి వాళ్ళని స్ట్రెచ్చర్ల మీద మోసుకెళ్ళటం టీవీలో చూసి, ‘కొంపదీసి ఆ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం ఉపయోగించే లైట్లూ, పొగలలో కూడా ఇలాంటివి ఉపయోగించటం లేదు కదా’ అనుకున్నాము.

ఇక ఇస్కాన్ భోజన వైభోగం గురించి చెప్పకపోతే ప్రధాన విషయం చెప్పనట్లే! మాయాపూర్ ఇస్కాన్ లో పేదలకి ప్రతీరోజూ మధ్యాహ్నాం ఓపూట అన్నదానం చేస్తారు. అందులో అన్నం, పప్పు, రెండు కూరలూ, ఓ స్వీటు, పెరుగూ గట్రా ఉంటాయి. ఇస్కాన్ ప్రాంగణం వెలుపలి గోడను ఆనుకొని ఆ భోజనశాల ఉంటుంది. భక్తులకి, ఇస్కాన్ వసతి గదుల్లో బసచేసిన వారికీ మరొక భోజన శాలలో భోజనం పెడతారు. అదెంతో విశాలంగా, ఆకర్షణీయంగా, ఎంతో రిచ్ ఇంటీరియర్ డెకరేషన్ తో ఉంటుంది. కాకపోతే క్రింద కూర్చొబెట్టి భోజనం వడ్డిస్తారు. ఒకేసారి వేలమంది భోజనం చేయవచ్చు. అచ్చంగా నేతిలో వేయించిన పూరీలు, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన మిఠాయిలతో భోజనం మహారాజుల భోజనంలా ఉంటుంది. దాదాపు 17-20 రకాల భక్ష్యభోజ్య చూహ్యలేహ్యలతో వడ్డిస్తారు. అన్నం కూరలతో సహా! ఒక్క పెరుగుతోనే రెండుమూడు రకాల భక్ష్యపదార్ధాలుంటాయి. భోజనం మధ్యలో [మధ్యేమధ్యే పానీయం సమర్పయామి అన్న చందాన] తాగడానికి మూడు మట్టిగ్లాసుల్లో నిమ్మరసంతో చేసిన షర్పత్, సుగంధపాలు, మంచినీళ్ళు ఉంటాయి. గది అద్దె కూడా భోజన సదుపాయంతో కలిపి భారీగానే ఉంటాయి. గౌడీయమఠపు ప్రధాన శాఖలో భోజనశాల మహా అయితే వందమంది ఒకేసారి భోజనం చేయగలిగేటంత ఉంటుంది. భోజనము సాధరణంగానూ, సాత్వికంగానూ ఉంటుంది. వాళ్ళు భక్తులకి ఇచ్చేటందుకు మహా అయితే ఓ ఇరవై గదులుంటాయేమో. అదీ నామమాత్రపు అద్దె. భోజనంతో కలిపి రోజుకి యాభైరూపాయలు అనుకుంటా. అదే ఇస్కాన్ లో అయితే [డీలక్స్, సూపర్ లెవల్] గదులలో రకాలుంటాయి. తదనుగుణంగా అద్దెలుంటాయి.

ఇక శ్రీకృష్ణుడికి కేకులూ గట్రా కూడా నైవేద్యంగా పెట్టేవాళ్ళు. ప్రసాదపు కౌంటర్లలో అలాంటివే అమ్ముతారు. వారి పూజారులకీ [బ్రహ్మచారులకీ] ఇవ్వబడిన నివాస గదుల్లో, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూడటానికి వచ్చిన గుమాస్తాలూ ఉండేవాళ్ళు. అయితే ఈ కార్యాలయ సిబ్బంది [ఆఫీసు స్టాఫ్] కుటుంబసహితంగా ఉండేవాళ్ళు. భార్యభర్తలు, పిల్లలూ అంతానన్నమాట. తమాషా ఏమిటంటే వాళ్ళందరూ కూడా శ్వేత జాతీయులే. అందరూ కాషాయాంబరధారులే. చిన్నపిల్లలు కూడా కాషాయం ధరించి, మగపిల్లలు గుండు పిలకలతో చూడటానికి బాల సన్యాసులు/బాల సన్యాసినులులాగా ఉండేవాళ్ళు. మొత్తంగా ఎవరు ఆఫీసు స్టాఫో, ఎవరు సన్యాసించిన వాళ్ళో, చూడటానికి వెళ్ళేవాళ్ళకి మాత్రం అర్ధం కాదు. ఇక్కడ మిషనరీలలో నన్స్ కు, వేరే ప్రాంతాలలో సంసారులు ఉంటాయని, గుంటూరు జిల్లాలో చాలా మిషనరీలలో నాకు తెలిసినవాళ్ళు చెప్పిన విషయం. అలా ఈ ఇస్కాన్ సన్యాసులకు కూడా సంసారాలు అక్కడే పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు.

ఇక ఇస్కాన్ స్థాపించిన తొలినాళ్ళలో – రాధమ్మకు కృష్ణుని పైని గల గాఢానురక్తినీ, మధుర భక్తినీ ప్రభోదించిన కృష్ణచైతన్యుడి మధురభక్తి ప్రబోధం కాస్తా ఇస్కాన్ చేతుల్లోకి, శ్రీల ప్రభుపాదుడి చేతుల్లోకి చేరేసరికి ‘హరేకృష్ణ ఉద్యమంగా’ పేరుపెట్టుకుంది. చివరికది ’హిప్పీ’లుగా విపరీత ప్రాచుర్యంలోకి వచ్చింది. జుట్టుని పెంచుకుని, గంజాయి పీలుస్తూ, ’హరేరామ హరేరామ రామ రామ హరే హరే! హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే! ’ అన్న భగవన్నామ సంకీర్తన ’దమ్ మారో దమ్, మిట్టిజాయే హమ్ బోలో శుభషామ్. హరేకృష్ణ హరేరామ్’ అని పాడేదాకా పోయింది. గంజాయి మత్తులో సామూహిక రేప్ లూ నడిచాయని ఆనాటి వార్తల్లో పొక్కిందట.

ఈ నేపధ్యంలోనే ’హరేరామ హరేకృష్ణ’ పేరుతో బాలీవుడ్ నటుడు దేవానంద్ సినిమా తీసాడు. జీనత్ అమన్ దేవానంద్ లు నటించారు. [సదరు హీరో దేవానంద్ కూడా దేశవిభజన నాడు పాక్ నుండి భారత్ కు వలసవచ్చిన వాడే. అక్కడి నుండి వలసవచ్చిన వారే తదనంతరం భారత్ లో అగ్రస్థాయికి వచ్చిన నూరుమందిలో 99మంది ఉండగా, ఇక్కడి నుండి పాక్ కి వలసపోయిన వారిలో తదనంతరం పాక్ లో అగ్రస్థాయికి వచ్చిన నూరుమందిలో ఒక్కరుంటే [ముషారఫ్ లాగా] ఎక్కువన్న మాట.] ఇక ఈ సినిమా హిట్ కావడం కోసం కోర్టులో కేసు వేయబడటం, తగినంత సంచలనమూ, ప్రచారము వచ్చాక, కోర్టు అడ్డంకులు తొలగిపోయి సినిమా రిలీజ్ కావటమూ, ’రామ్ కా నామ్ బద్ నాం నా కరో’ అంటూ హీరో ప్రబోధించడం షరా మామూలే! సినిమా ఎంత హిట్టో, దమ్ మారో దమ్ పాట మరెంత హిట్టో, ఇప్పుడు పాతికేళ్ళున్న వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా 45 ఏళ్ళ వయస్సున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇప్పుడంటే సినిమా హిట్లు కోసం వివాదాలు సృష్టింపబడతాయని, రాఖీ సావంత్ లూ, మై నేమ్ ఈజ్ ఖాన్ కోసం షారూఖ్ ఖాన్ లూ నిరూపించారు గాని, అప్పట్లో ఆ టెక్నిక్ ప్రజలకే మాత్రం తెలియదయ్యె.

అయితే ప్రజల దృష్టిలో చూస్తే, మతాన్నీ పైముసుగుగా వేసుకున్న ఇస్కాన్ గురించి ప్రజలకి తెలియకపోయినా ఆనాటి ప్రభుత్వానికి తెలుసు. అందునా చైనా యుద్ధపు ఓటమి తర్వాత, కుట్ర ఆస్థిత్వం అర్ధం చేసుకున్న ముందటి తరం, ఇందిరాగాంధీ వంటి తరువాతి తరాన్ని హెచ్చరించిన నేపధ్యంలోనూ, నాటి ప్రభుత్వానికి బాగా తెలుసు. కానీ ఇస్కాన్ వేసుకున్నది మతపు ముసుగు! శ్రీకృష్ణుని పట్ల హఠాత్తుగా అమెరికన్లందరికీ విపరీత భక్తి పుట్టుకొస్తే ఏ ఋజువు చూపెట్టి ఇందిరాగాంధీ “ఇది భక్తి కాదు, గూఢచర్యం అనగలదు?" అంటే మాత్రం? అంతర్జాతీయ మీడియా ఊరుకుంటుందా? మూకుమ్మడిగా కోడై కూస్తుంది.

నాటి భారత ప్రభుత్వం దృష్టికి, ఇస్కాన్, మతపు ముసుగు వేసుకున్న అమెరికా గూఢచార సంస్థ సి.ఐ.ఏ.! అయితే ‘ఆ రెండు ముసుగుల అడుగునా ఉన్నది, నకిలీ కణిక వ్యవస్థ’ అన్న విషయం పీవీజీ విశ్లేషించి, బహిర్గతపు బాటలో నడపటం నేటి గూఢచర్య తంత్రం. మెదళ్ళతో యుద్ధంలో ఓ పార్శ్వం.

కోర్టుల సహాయంతో, మతపు ముసుగు వేసుకుని, శ్రీల ప్రభుపాదుడనే ఓ భారతీయుణ్ణి అడ్డం పెట్టుకుని, సి.ఐ.ఏ., ఇస్కాన్ పేరిట గూఢచర్యం నిర్వహిస్తోందని నాటి ప్రభుత్వానికి తెలిసినా నిస్సహాయంగా చూడటం, వీలయినంతగా ఎదురుపోరాడ్డం మినహా ఏమీ చెయ్యలేకపోయారు. ఆ సువర్ణముఖినే అనుభవిస్తూ, ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలక వ్యక్తులైన రామోజీరావులూ, అద్వానీలు తమ నెట్ వర్కు క్రమంగా కుప్పకూలిపోవడాన్ని నిస్సహాయంగా చూడాల్సి వస్తోంది. తనపేరు చెప్పుకుని గూఢచర్యం చెయ్యడాన్ని, తీవ్రవాదం చెయ్యడాన్ని, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడాన్ని భగవంతుడు, ఆయా వ్యక్తుల పాపం పండేవరకో లేక సువర్ణముఖి పరిపక్వత చెందే వరకూ మాత్రమే ఊరుకుంటాడు. దాని ఫలితమే 1992 తరువాత సంవత్సరాలలో ఇస్కాన్ చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలు. అంతేకాని వారికై వారికి పుట్టిన మంచి బుద్ధైతే 1966 నుండి 1992 లోపల 26 సంవత్సరాలలో ఎందుకు చేయనట్లు? అప్పుడు ఇంతకంటే మరింత పేదరికం కూడా ఉంది.

1992 కు ముందర ఇస్కాన్ ప్రధాన కేంద్రం మాయాపూర్ లోనూ, ప్రక్కనే గల గంగ నదికి మరో ఒడ్డున ఉన్న నవద్వీప్ లోనూ, మాయాపూర్ ఉన్న 24 పరగణాల జిల్లాలోనూ పేదరికం తాండవిస్తూనే ఉంది. సాక్షాత్తూ ఇస్కాన్ చుట్టూ కూడా పేదప్రజలూ, బాలలూ ఉన్నారు. అయినా ఇస్కాన్, రోజుకు పదిలక్షల మందికి కాదు కదా, కనీసం పదివేల మందికి కూడా అన్నదానం చేసేది కాదు. అలాంటిది, ఇప్పుడు అక్షయపాత్ర పేరుతో బెంగుళూరు కేంద్రంగా రోజుకి పదిలక్షల మంది బాలలకి అన్నదానం చేస్తోందంటే కారణం – సి.ఐ.ఏ. మరియు ఇస్కాన్ ల సువర్ణ్ ముఖి, కన్నా? కాలా? స్ట్రాటజీ! వివరంగా చెబుతాను.

ఇలాంటి సేవ కార్యక్రమాలని ఇస్కాన్ 1992 తర్వాతే చేపట్టింది. అంతేకాదు అంతకు ముందు నామమాత్రంగా నడిపిన చాల కార్యక్రమాలని విస్తరించింది. ఇస్కాన్, ఎప్పుడు ఏ శాఖలు ప్రారంభించిందో, ఏ కార్యక్రమాల ప్రారంభ తేదీలు ఏవో, ఏశాఖలో ఎప్పుడు బాగా విస్తరించారో, ఏ కార్యక్రమాలని ఎప్పుడు ఎక్కడ నుండి విస్తరించిందో, పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమౌతుంది. ‘అక్షయ పాత్ర’ పేరుతో అన్నదానం అనుకోండి పదేళ్ళ క్రితం అంటే 1992 లో కేవలం రోజుకి 1500 మందికి అన్నదానం చేయటంతో ప్రారంభించబడిందట. మరి శ్రీలప్రభుపాదుడు, ఎప్పుడు, ఏ ఇస్కాన్ శాఖలోని తన గదిలో కూర్చొని చదువుకుంటుండగా ఎంగిలి విస్తళ్ళ కోసం కుక్కలతో కలబడి పోరాడుతున్న వీధిబాలల్ని చూసి “ఇస్కాన్ చుట్టుప్రక్కల ఎవరూ ఆకలితో బాధపడకూడదు. వారికి కడుపు నిండా అన్నం పెట్టండి” అన్నారో? మాయాపూర్ లోని ఇస్కాన్ మందిరం, నివాస భవనాలు, విశాలమైన ప్రాంగణంలో ఉంటాయి. భవనాల చుట్టు తోట, ఎతైన ప్రహారీ గోడ ఉంటాయి. కిటికీలో నుండి బయటి దృశ్యాలు కనబడే అవకాశమే లేదు. ఇక, ఇస్కాన్ ఎంగిలి ఆకుల్ని కూడా సేంద్రియ ఎరువుగా మార్చి తోటలోని కూరపాదులకీ, పూలమొక్కలకీ వాడుతుంది. కాబట్టి బయటపారవేసే అవకాశమూ లేదు. వాటికోసం కుక్కలతో కలబడే పేదబాలల్ని చూసే అవకాశం అంతకంటే లేదు. ఇస్కాన్ ఇతర శాఖలు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే, శ్రీల ప్రభుపాదుడు తన 81 ఏట, అంటే 1977 ల్లో మరణించాడు. అతడు బ్రతికున్న రోజుల్లో పేదబాలల ఆకలి తీర్చమని ఆదేశిస్తే, అతడి మరణానంతరం 22 ఏళ్ళ తర్వాత 1999 లో అక్షయపాత్ర ప్రారంభించబడిందన్న మాట. ఈ వార్తాంశంలోనే ఉన్న ఇన్ని లొసుగులు చూశాక స్పష్టమయ్యేది ఏమిటంటే – 1992 తర్వాత, తమకి విధింపబడిన ఆత్మహత్యసదృశ్య Assignments అయిన అన్నదానాది ప్రజాహిత కార్యక్రమాలకి [తమకి డబ్బులూడగొట్టేవి ఆత్మహత్యసదృశ్యం గాక ప్రియమైన Assignments కావు కదా?] పైకారణంగా [over leaf reason గా] ’శ్రీల ప్రభుపాదుడి ఆజ్ఞా, ఆదేశాలు’ వాడుకోబడుతున్నాయి. ఎటూ తొలినాళ్ళలో ‘శ్రీల ప్రభుపాదుడు’ బొమ్మని నిలబెట్టి ఇస్కాన్ ని నడిపింది శ్వేతజాతీయులైన సి.ఐ.ఏ. నే కదా? అంచేత, ఇప్పుడూ, ఈ ప్రజాహిత కార్యక్రమాలకీ, అదే పేరునీ, అదేబొమ్మనీ పైకారణంగా నిలబెట్టవలసి వచ్చింది. ఇదీ సువర్ణముఖిలోని ఓ విశిష్టతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

ఇస్కాన్ గురించి కళ్ళకు కట్టేలా వివరించారు. ముంబై లో ఈ ఇస్కాన్ గుడి జుహు అనబడే ఒక అత్యంత ధనిక వాడలో ఉంది. బీచ్ కు కనుచూపు దూరంలో. నన్నక్కడ తీసుకెళ్ళినది ఒక ఐ. ఐ. టీ అబ్బాయి. అక్కడ మీరు చెప్పిన మృష్టాన్న భోజనం నేనూ రుచి చూశాను. అయితే తినడానికి మాత్రం ఏవో కొన్ని నియమాలు ఉన్నవి. అక్కడ ఐ.ఐ.టీ విద్యార్థులందరూ ఇస్కాన్ భక్తులట. ఓ ఐ.ఐ.టీ అబ్బాయి హరేకృష్ణ నామస్మరణ చేస్తూ కాసేపు బాహ్యస్మృతికోల్పోవడమూ చూశాను.

తిరిగి అదే అబ్బాయి బెంగళూరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఇస్కాన్ కు వెళ్ళాము. బెంగళూరులో పిజ్జాలు కూడా ప్రసాదమే. (ప్రసాదం ఎప్పుడూ సాత్వికాహారం అయి ఉండాలని మా తాతయ్య వివరించి చెప్పారు నాకు చిన్నప్పుడు). హారతి ఇస్తున్నప్పుడు భక్తులు నృత్యం చేయటమూ, మీరు చెప్పిన పాశ్చాత్యులు, వారి నవ్వులు చాలా కృతకంగా ఉన్నాయి. సేవాభావం humility తో రావాలి. అర్భాటంగా కాదు. అయితే ఏదో చేస్తున్నారు, సరే అని సరిపెట్టుకున్నాను.

ఇంకోసారి బెంగళూరు ఇస్కాన్ కు వెళితే, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు ఏదో కోర్సుట. అందులో చేరమని అడిగారు. మా కజిన్ చేరాడు. అదీ విపరీతమైన ఆర్భాటపు తంతు అని తెలుసుకున్నాము.

ప్రసాదంలో మత్తుపదార్థాల విషయం నేనూ ఎక్కడో చూచాయగా విన్నాను.

మీ జీవితమంతా ఇతరుల కుట్రలను బయట పెట్టడానికే సరిపొయేలా ఉంది. పేద పిల్లలకు అన్నం పెట్టే(అదీ విరాళాలతో నడుస్తూ)ఒక కార్య క్రమాన్ని కూడా అవహేళన చేస్తున్నారంటే మీ mental status ఏమిటో తెలుస్తోంది.!

pichandi meeku

atleast she is tellling that boldly.
if you have enough dare ness leave out your mask of anonymous and tell the same thing. and show that this is not true
(ఇంకా చెప్పాలంటే, శ్రీల ప్రభుపాదుడు తన 81 ఏట, అంటే 1977 ల్లో మరణించాడు. అతడు బ్రతికున్న రోజుల్లో పేదబాలల ఆకలి తీర్చమని ఆదేశిస్తే, అతడి మరణానంతరం 22 ఏళ్ళ తర్వాత 1999 లో అక్షయపాత్ర ప్రారంభించబడిందన్న మాట. ఈ వార్తాంశంలోనే ఉన్న ఇన్ని లొసుగులు చూశాక స్పష్టమయ్యేది ఏమిటంటే – 1992 తర్వాత, తమకి విధింపబడిన )

you cant tell it,
shall i say why?
because deep the heart you know what she is saying is having a meaning. and an observation.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu