2009 సెప్టెంబరు 2వ తేదీ హెలికాప్టరు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి వై.యస్.ఆర్. మరణించాడు. అయితే సెప్టెంబరు 2 వ తేదీన జరిగిన హెలికాప్టర్ అదృశ్యం, 24 గంటల నాటకీయ జాప్యం తర్వాత, సెప్టెంబరు 3 వ తేదీ ఉదయం బయటి ప్రపంచానికి తెలిసింది. మధ్యాహ్నం అధికారికంగా ధృవీకరింపబడింది.

ఆ రోజే రష్యన్ పత్రిక/టాబ్లాయిడ్ ఎగ్జైల్డ్ అతడి మరణం వెనక కుట్ర జరిగిందనీ, అందులో అంబానీ సోదరుల ప్రమేయం ఉందనీ ప్రచారించింది[ట]. ఇక్కడ నల్లమల అడవుల్లో పావురాల గుట్ట[రుద్రకొండ సమీపంలో] పై కుప్పకూలిన హెలికాప్టరు, ఆ ప్రమాదంలో అయిదుగురి మరణ వార్త బయటికొచ్చాక, ఎగ్జైల్డ్ వెబ్ సైట్ వ్రాసిందా? ముందే వ్రాసిందా? సెప్టెంబరు 3 వ తేదీనే రెండు సంఘటనలూ జరిగినా, భారత కాలమానం ప్రకారం ఏది ముందు, ఏది వెనకా జరిగాయో ఇప్పటి వరకూ ఎవరూ, చెప్పలేదు.

సదరు రష్యన్ టాబ్లాయిడ్ ఎగ్జైల్డ్ ఆశ్లీల పత్రిక, అవిశ్వాస భూయిష్టం అని ఎలుగెత్తి అరుస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి గానీ… సదరు టాబ్లాయిడ్ పరిశోధనాత్మకమైనదంటూ, అది ప్రచురించిన ఊహాగానపు కథనాన్ని ఉటంకిస్తూ సంచలనాలని ప్రచారించిన TV5, N TV, సాక్షి టీవీ [ఆపైన i NEWS కూడానట] గానీ… ఏ సంఘటన ముందో స్పష్టం చేయలేదు.

మొత్తానికి నాలుగునెలల తర్వాత, అప్పటి కథనాన్ని ఉటంకిస్తూ ఇప్పుడు ఇక్కడ టీవీలు హోరెత్తించాయి. ఆపైన విధ్యంసం షరా మామూలుగా జరిగింది.

సహజంగానే ఈనాడు, దాని అనుచర వార్త సంస్థలు ’ఎగ్జైల్డ్’ పరమ బూతు పత్రిక అంటే, వాళ్ళ వ్యతిరేక శిబిరం వాళ్ళు అది పరిశోధనాత్మక పత్రిక అంటున్నారు.

ఎగ్జైల్డ్ కథనం అతుకుల బొంతగా ఉందనీ, ప్రతిపేజీలో అదే వాక్యాన్ని, తిప్పితిప్పి పదేపదే వ్రాసిన ఈనాడు, వై.యస్. మరణం విషయంలో ఎన్నో పరస్పర విరుద్ద కథనాలని, అతుకుల బొంతలని, ఒకే తేదీన విభిన్న పేజీలలో, విభిన్న పేరాలలో, విభిన్న శీర్షికల క్రింద ఎలా ప్రచురించిందో, నా బ్లాగులో విపులంగా, దృష్టాంతపూరితంగా సెప్టెంబరు లో ప్రచురించిన టపాల మాలికలో వివరించాను.

వై.యస్. ఆకస్మిక మరణం తర్వాత, ఈనాడు రామోజీరావు, వై.యస్.ని అర్జంటుగా దేవుణ్ణి చేసే ప్రయత్నంలోని ’అతి’ని నేను సెప్టెంబరు 14, 15 తేదీలలో టపాలుగా వ్రాసాను. తర్వాత వై.యస్. మరణం వెనుక మతలబులు గురించి టపాల మాలిక[11] గా వ్రాసాను.

ఇక… నిన్న[Jan.08] ఈనాడు పత్రిక ప్రచురించిన ప్రధాన వార్త...’గాలి కథనాల అడ్డగోలు ప్రసారం చెలరేగిన విధ్యంసం’ శీర్షిక, 2 వ పేజీలో కొనసాగింపుని వ్రాస్తూ...

>>>తామరతంపర వెబ్ సైట్లలో, బ్లాగుల్లో వచ్చే సమాచారాన్నే గనక ప్రామాణికంగా తీసుకుంటే వీరువారని లేకుండా దేశంలోని ప్రముఖులందరకీ ఏదో కుంభకోణం బురద అంటుకోవటం ఖాయం. అందుకే ఆన్ లైన్ సమాచారం విషయంలో ఆచితూచి వ్యవహారించాలన్నది నేటి పాత్రికేయ ప్రాధమిక సూత్రం. ఒక నాయకుడి మరణంపై కూడా ఆషామాషీగా కథనం రాసేసిన ’ఎగ్జైల్’ స్థాయి ఏమిటో ఆ కథనం చూస్తేనే తెలుస్తుంది. దాన్నిండా పొంతన లేని వ్యాఖ్యలే. ఎక్కడో అమెరికా వైట్ హౌస్ ప్రముఖుడు లారీ సమర్స్ కూ, అంబానీల ఆస్తుల వివాదాలకూ, వై.ఎస్. హెలికాప్టర్ దుర్ఖటనకూ లింకులు పెడుతూ ప్రచురించిన ఈ కథనంలో ఎక్కడా సాక్ష్యాధారాల ప్రస్తావన గానీ, సమాచారం గానీ లేకపోగా తార్కికత మచ్చుకు కూడా కనబడటం లేదు.

వాస్తవానికి ఏ వార్తా సంస్థ అయినా వార్తా సేకరణకు తనదైన యంత్రాంగం మీద ఆధారపడుతుంది. లేదంటే మరో ప్రామాణికమైన, నిబద్దమైన పత్రిక నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది. ఉదాహరణకు ద టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజిల్స్ టైమ్స్, గార్డియన్ వంటి విఖ్యాత పత్రికలు గానీ, టైమ్స్, న్యూస్ వీక్ వంటి మ్యాగజైన్లు గానీ దశాబ్ధాలుగా విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడ్డాయి. నిబద్దతే బలంగా ఎంతో ప్రతిష్ఠను సంపాదించుకున్నాయి. అటువంటి అంతర్జాతీయ స్థాయి పత్రికలు ఏదైనా ప్రచురిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చుగానీ... గాలి రాతలు రాసే వెబ్ సైట్లను నమ్మకూడదన్నది మౌలికమైన పాత్రికేయ సూత్రం. ఈ ప్రాధమికమైన అంశాలు కూడా పట్టించుకోకుండా 3 ఛానెళ్ళు ప్రసారం చేసిన తీరు విద్వేషాగ్నులు రెచ్చగొడుతూ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించేదిగా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎంతో గొప్పగా, గురివిందగింజలాగా ’ఈనాడు’ పాత్రికేయ నీతుల్ని, విలువల్నీ చెబుతుంది.

>>>తామరతంపర వెబ్ సైట్లలో, బ్లాగుల్లో వచ్చే సమాచారాన్నే గనక ప్రామాణికంగా తీసుకుంటే వీరువారని లేకుండా దేశంలోని ప్రముఖులందరకీ ఏదో కుంభకోణం బురద అంటుకోవటం ఖాయం.

మీడియా కింగుగా ’తను తన పత్రికలో వ్రాస్తే నిజం, బ్లాగుల్లో వ్రాస్తే అబద్దమూ ’ అన్నట్లు వ్రాసింది. డబ్బుంది కాబట్టి వాళ్ళది పత్రిక. సామాన్యులు వ్రాస్తే అది బ్లాగు. అంతే కదా వ్యత్యాసం?ఈనాడే చెప్పినట్లు [>>>’వాస్తవానికి ఏ వార్తా సంస్థ అయినా వార్తా సేకరణకు తనదైన యంత్రాంగం మీద ఆధారపడుతుంది. లేదంటే మరో ప్రామాణికమైన, నిబద్దమైన పత్రిక నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది.’] విశ్వసనీయమైన పత్రిక ప్రచురించిన సమాచారాన్ని విశ్లేషించటం ద్వారా నిజాన్ని రాబట్టవచ్చు కదా? అదే బ్లాగుల్లో వ్రాయనూ వచ్చు కదా? పత్రికల్లో ఈరోజు ఏపాటి నిజాలు వ్రాస్తున్నారో, నిష్పక్షపాతంగా వ్రాస్తున్నారో, వాళ్ళు వీళ్ళు అనకుండా అన్ని వార్తాసంస్థలూ నిరూపించుకున్నాయి.

>>>వాస్తవానికి ఏ వార్తా సంస్థ అయినా వార్తా సేకరణకు తనదైన యంత్రాంగం మీద ఆధారపడుతుంది. లేదంటే మరో ప్రామాణికమైన, నిబద్దమైన పత్రిక నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది. ఉదాహరణకు ద టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజిల్స్ టైమ్స్, గార్డియన్ వంటి విఖ్యాత పత్రికలు గానీ, టైమ్స్, న్యూస్ వీక్ వంటి మ్యాగజైన్లు గానీ దశాబ్ధాలుగా విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడ్డాయి. నిబద్దతే బలంగా ఎంతో ప్రతిష్ఠను సంపాదించుకున్నాయి. అటువంటి అంతర్జాతీయ స్థాయి పత్రికలు ఏదైనా ప్రచురిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చుగానీ... గాలి రాతలు రాసే వెబ్ సైట్లను నమ్మకూడదన్నది మౌలికమైన పాత్రికేయ సూత్రం.

ఈనాడు ఉటంకించిన ఆయా దేశాల్లోని, ఆయా ప్రముఖ వార్తాసంస్థలూ, పత్రికల విశ్వసనీయత సంగతి తరువాత విషయం, ఈనాడు కూడా ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాలుగా ఉన్న పత్రికే! దాని విశ్వసనీయత ఏమిటో, ఈనాడు అధినేత నీతినిజాయితీ లేమిటో ఇప్పుడు కదా వెలుగులోకి వస్తోంది? స్వయంగా వ్రాతలతోనూ, చేతలతోనూ కూడా, రామోజీరావే స్వయంగా నిరూపించుకుంటున్నాడు కూడా!

అలాంటప్పుడు… దశాబ్దాలుగా మార్కెట్ లో ఉన్నారు కాబట్టి, లేదా డబ్బులున్నాయి కాబట్టి పత్రికల్లో వాళ్ళు చెప్పిందంతా సత్యమూ, బ్లాగుల్లో చెప్పేదంతా అబద్దమూ అవుతుందా?

తాము వ్రాస్తే ఎంత కుతర్కమైనా, కుయుక్తి అయినా అతుకుల బొంత కాదా? తార్కికంగానూ, దృష్టాంతపూర్వకంగానూ, కార్యకారణ సంబంధాలతో సహా పూర్తి ఆధారాలతోనూ వ్రాసినా, అలాంటి వాటి గురించి మాత్రం, నిజాల కోసం, ప్రజల కోసం, అహరహమూ తహతహలాడతామనే మీడియా కిమ్మనదేం ?

ఎన్నికల సమయంలో, ప్రియాంక వాద్రా మామ మరణం వెనక మిస్టరీని, వార్తను, ఆ ’రెండుపత్రికలు’ రెండు రకాలుగా ప్రచురించాయి. Times of India మరింత వివరంగా వ్రాసింది. మరి అప్పుడు తెలియలేదా ఆ రెండు పత్రికలకి వాటిలో ఏది సరైనదో? అందలేదా మరిన్ని వివరాలు? అందునా ఈనాడు పత్రిక కాంగ్రెస్ కు పరమ వ్యతిరేకి కూడా! మరెందుకు ఆ మరణం వెనక మిస్టరీని చేదించలేదు, సరికదా ప్రశ్నించను కూడా ప్రశ్నించలేదు? పైగా పత్రికలు మాత్రమే నిజాలు చెబుతాయట, బ్లాగులు వ్రాసేవి ప్రామాణికంగా తీసుకోకూడదట.


ఇక నిన్న[08 Jan.2010] ఈనాడు, రెండో పేజీలో, ’దాడులకు దిగితే కఠిన చర్యలు’ శీర్షిక క్రింద డీజీపీ ఫోటోతో సహా ప్రచురించిన వార్తలో, డీజీపీ గిరీష్ కుమార్ అన్నట్లుగా వ్రాస్తూ,

>>>ప్రస్తుత తరుణంలో దీన్ని ప్రసారం చేయడం వెనుక ఏదైనా కుట్రదాగి ఉందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని అన్నారు. బ్లాగును నిలిపివేయడాన్ని పరిశీలిస్తామన్నారు.

డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి బ్లాగుకీ, వెబ్ సైటుకీ తేడా తెలియదని గానీ, రష్యన్ వెబ్ సైట్ అమెరికా నుండి నడపబడుతున్న ఎగ్జైల్డ్ ని తాము మూయించలేమనీ గానీ, తెలియదను కోలేము. ఇదే వార్త, ’డీజీపీ టీవీ ఛానెళ్ళ మీద చర్యలు తీసుకుంటామని’ అన్నట్లుగా మిగిలిన పత్రికల్లో వచ్చింది. ఈనాడులో మాత్రం ’బ్లాగుని నిలిపివేయడాన్ని పరిశీలిస్తామని’ వచ్చింది.

ఇంత అవకతవకలుగా వార్తలు వ్రాస్తూ… ఈనాడు ఎవరికి ఏం చెప్పాలనుకుంటోంది?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

9 comments:

aMte kada mari...
gurivinda ginja ku tana nalupu teliyadu kadaaa,

ఏ ఇన్వెస్టిగేషన్ ఆదారం గా అంతా హడావిడిగా ఈనాడు వారు ఎక్ష్జెల్ వెబ్ సైట్ ని అశ్లీల పనికమాలిన వెబ్ సైట్ గా నిర్ణయించారు ?వారి న్యూస్ ఛానెల్ లో వెంటనే ఖండనలు యేది బేస్ చేస్కుని మొదలుపెట్టారు ?రిలయన్స్ వారి మీద ఈగ వాలనీయకుండా వెనువెంటనే ప్రచారం యెందుకు మొదలు పెట్టారు?వెబ్ సైట్ వారినీ, వార్తా ఛానెల్స్ని ప్రజల్లో చీప్ గా చూపించే తమదైన రామోజీ జర్నలిశాన్ని,ఏదట వారి మీద దాడిని రాత్రికి రాత్రే యెందుకు ప్రారంబించారు?8 వ తేదీ ఈనాడు చదివిన వారికి యెవ్వరికైనా ఈనాడు వారు రిలయన్స్ ని వెనకేసుకు వస్తూ మిగిలిన వాళ్ళ పై బురదజల్లుడు మొదలుపెట్టింది అని ఈసీగా అర్దం అవుతుంది .,

Chaala baaga chepparu Lakshmi gaaru

మీరన్నట్టు
ఒక్కవేళ ఈనాడు అబద్దపు పత్రీక అయితే ఇన్ని రోజుల నుంచి మేదటి స్ధానం లో ఏలా కోనసాగుతుంది..
పుర్తిగా స్వంత డబ్బకోటుకుంటున్నా జగాన్ సాక్షి పత్రిక కన్న వేల రేట్లు ఈనాడు మరియు రామెజిరావు గారు ఏంతో నయం.
ప్రజల డబ్బుని ఏవరు వృధ చేస్తున్నారు ,రామెజి రావు మాత్రమే మీకి ఎందుకు కనిపిస్తునారు..

మీకు ఈనాడుపై ఉన్న వ్యతిరేకత ఏంటో, ఎందుకు ఈనాడుని విమర్శించడానికే ఈ బ్లాగును రాస్తున్నారో నాకయితే అర్ధం కాలేదు కానీ, ఈ టపా అంత అసంబద్ధమైన వాదన నేనెక్కడా చూల్లేదు.

ఒక పత్రిక తన సొంత పరిశొధనతో ఏదైనా వార్త రాస్తే అప్పుడు ఆ వార్త నిబద్దతకి తాము బాధ్యత తీసుకుంటారు. అలా కాకుండా వేరే సంస్థ వార్తను వాడుకున్నప్పుడు ఒక స్థాయిని పాటించాలి. అంతే గానీ మీలాగా నాలాగా బ్లాగులో రాసినదాన్ని తీసుకుని తమ టీవీ చానెల్లో చూపించడం ఒక భాధ్యథ కల చానెల్ చేయదు. అసత్యానికి సాక్షి అయిన సాక్షికే అది చెల్లింది.

ఇక ఈ వార్త అంతా కూడా ముందే రాసుకున్న వ్యూహం ప్రకారం టీవీ చానెల్సూ, జగన్ యువసేన కలిసి చేసాయనేది వార్త వచ్చిన పదిహేను నిముషాలకే అటక్స్ జరగడం చెబుతుంది. దాన్ని మీరు సమర్ధించే తీరు మీ పక్షపాత ధోరణిని చూపిస్తుంది.

తమ సొంత డబ్బా కొట్టుకోవడానికి, ఎదుటి పత్రికలమీద, తమ వ్యతిరేకుల మీద బురద చల్లడానికి మాత్రమే ఒక టీవీ చానెల్, ఒక న్యూస్ పేపర్ నడుపుతుంది ప్రపంచంలో ఒక్క జగన్ మాత్రమే అయ్యుంటాడు.

ఇనుప గనుల్లో తేరగా వస్తున్న డబ్బుని మీడియాలోకి మల్లించి తనకు తనే దబ్బా కొట్టుకుని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. ఇదొ పెద్ద విష వలయంలా ఉంది.

పవన్ గారు, కరన్ కుంభ్ గారు,

ఈనాడును, రామోజీరావును విమర్శించానంటే సాక్షిని, జగన్ ను సమర్ధించినట్లు కాదన్నది గమనించగలరు. నా టపాలన్ని చదివితే మీకు ఆ విషయం అర్ధంకాగలదు. ఆపై మీ ఓపిక.

ఈ పొస్టు మాత్రమె కాదు..ఈ బ్లాగ్లులొ వున్న మిగతా పొస్ట్లు ఒకర్ని సపొర్ట్ చెయ్యడానికొ, లేక మరొకరిమీద అక్కసుతొ దుష్ప్రచారం సాగించాడానికొ వుద్దెసించినవి కావు..
మన చిన్నప్పటినుండి ఒకే పత్రిక చదివి...ఒకెవైపునుండే అలొచిస్తూ ఒక రకమయిన హిప్నటిజానికి గురైన మనకి వెరే కొణం లొంచి లాజికల్ గా అలొచింపచెసే విధం గా ఈ పొస్ట్లు వుంటున్నాయ్.. పైన్ కామెంటివారికి.. ఒక సారి పాత పొస్ట్లు చదివితే ఆ బ్లాగు ఆబ్జెక్టివ్ తెలుస్తుంది.. You will definitely like it..

మంచుపల్లకీ గారు,

ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu