పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, హాయి[భీతి] గొలిపే ఈ బ్లాగులోకంలో, అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా, ప్రతిసారీ టపాభంగం[పూర్తి కాకపోవడం] కలుగుతున్నా, మరింత పట్టుదలతో కార్యసాధనకు పూనుకోవడంలో నువ్వు కనబరుస్తూన్న ఓర్పూ, దీక్షలను మెచ్చుకోవలసిందే. కాని, ఇంతకూ నువ్వు సాధించదలచిన కార్యం లేక పరిష్కరించ చూస్తున్న సమస్యా, ఏమైవుంటుందో తెలియటం లేదు. జరిగిన, జరుగుతున్న విషయం ఒకటి చెబుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు.

గతటపాలో వివరించిన అవనీ రాజ్యంలో వార్తా సంస్థలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఈనాడు పత్రికది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు, ఈనాడు ట్రెండ్ సెట్టర్. తెలుగునాట కొత్త ఒరవడికి సృష్టికర్త. వేకువజామున తెలుగువాడు కళ్ళు నులుముకుంటూ నిద్రలేచేప్పటికే, గడపలో నిలబడి నవ్వుతూ పలకరించేది ఈనాడు. అంతర్జాతీయ వార్తల దగ్గరినుండి, ప్రాంతీయ, ప్రక్కగ్రామపు వార్తల దాకా, వివరంగా విస్తృతంగా అందించేది. అందరికంటే ముందూ అందించేది. ఆకర్షణీయమైన రంగుల్లో, శీర్షికలతో, ప్రాసపదాలతో ఆసక్తిగా చదివేలా ప్రజంటేషన్ ఉండేది.

తర్వాత్తర్వాత 11 భాషల్లో టీవీ ఛానెళ్ళు ప్రారంభించిన ఈనాడు అధినేత కూడా... అప్పుడెప్పుడో... ’రామోజీరావు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ’ అంటూ తనని తాను అభివర్ణించుకున్నాడు.

అయితే విచిత్రం ఏమిటంటే - రాను రాను సమాచార మార్పిడి మరింత వేగవంతం అయ్యాక, ఎవరైనా మరింత ముందుకు వెళతారు. కానీ ఈనాడు పత్రిక మాత్రం, ఎందుకో గానీ, వెనకకు పోవటం మొదలెట్టింది. ఒకప్పుడు ’భూభ్రమణం’ పేరుతో, సంపాదకీయం వ్రాసే పేజీలో, అంతర్జాతీయ వార్తలు ప్రచురించేది. ఇప్పుడు అంతర్జాతీయ వార్తల శీర్షిక మచ్చుకైనా లేదు. ఒకటీ రెండు వార్తలు, అదీ సింగిల్ కాలమ్ లోనో, మల్టీ బాక్సుల్లోనో, అప్రధాన వార్తగానో వ్రాసి, ’మేమూ అంతర్జాతీయ వార్తలు వ్రాసాము’ అన్నట్లు చేతులు దులుపుకుంటోంది.

సమాచార రంగంలో ఇంత విప్లవాత్మక మార్పుల వచ్చాక, ’ఈనాడు’కి అంతర్జాతీయ వార్తలు అందకుండా పోయాయి. మహా అయితే... అమెరికా ప్రెసెడెంట్ ఒబామా సతీమతి మిషల్ గురించీ, లేదా ఒబామా కుటుంబపు సినిమా షికార్ల గురించి వార్తలు వ్రాస్తుంటుంది. అప్పుడప్పుడూ, ఏ జపాన్ ప్రధానో, పదీ జనపథ్ కి వెళ్ళాడని వ్రాస్తుంటుంది. దాదాపు అంతర్జాతీయ స్థాయి నుండి, ఢిల్లీ స్థాయికి కూడా గాకుండా, గల్లీ స్థాయికి ప్రయాణిచింది.

ఓ నాలుగు నెలల క్రితం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆ నేపధ్యంలో, ఈనాడు అన్ని పత్రికల కంటే బాగా ఎక్కువ మోతాదులో అతణ్ణి దేవుణ్ణి చేసేసింది. ఆ సందర్భంలో, హెలికాప్టర్ ప్రమాదం గురించిన కాలం, స్థలం, సాంకేతిక వివరాల గురించి రకరకాల కథనాలు వ్రాసింది. దానిని ’అమ్మఒడి బ్లాగు’ ఎత్తి చూపి, దొరికించింది.

ఆ తర్వాత గమనిస్తే, ఈనాడు పత్రిక... వార్తలకు తేదీ వివరాలు, స్థల వివరాలు, వ్యక్తుల వివరాలలో స్పష్టత లేకుండా ’తెలిసింది - సమాచారం’ రకపు వార్తలు పెంచేసింది. ఎవరు చెప్పారో, ఎప్పుడు చెప్పారో, ఎక్కడ చెప్పారో ఎవరికీ తెలియదు. చివరికి వార్త వ్రాసిన విలేఖరికి కూడా! అంతేకాదు, వీలైతే కొన్ని వార్తలు, అన్ని పత్రికలలో ఫాలోయింగ్ వస్తున్నా, ఈనాడు ఆ వార్తల్ని మొక్కుబడిగా ఒకసారో రెండుసార్లో ప్రచురించి వదిలేస్తుంది. ఫాలోయింగ్ రాస్తే వై.యస్. హెలికాప్టర్ ప్రమాద వార్తల విషయంలో లాగా దొరికిపోతానని భయం కాబోలు!

జాతీయ వార్తలు... ఆనాటికి ప్రభుత్వ ప్రకటన/హోంమంత్రి లేదా కేంద్రమంత్రి ప్రకటన వంటి ప్రధాన వార్త తప్ప, ఇక అన్నీ అప్రధాన వార్తలై పోయాయి. ప్రక్కరాష్ట్రాల్లో ఏం జరుగుతుందో దాదాపుగా వ్రాయటం మానేసింది. వ్రాసినా ఏ అయిదో పదో పేజీలో, ఓ మూల వ్రాస్తోంది. రాష్ట్రపు వార్తలూ, అరగొరగా కవర్ చేయటమే!

ఉదాహరణలు కోకొల్లలు! ముంబైదాడుల సంబంధంలో పట్టుబడిన హెడ్లీ గురించి, దూరదర్శన్ కి సైతం ప్రధాన వార్త అయిన హెడ్లీ వివరాలు, ఈనాడుకి అందనే లేదు. చివరికి PTI అందజేసే వార్తలు కూడా ఈనాడుకు చేరటం లేదు కాబోలు! మిగిలిన పత్రికలూ, వార్తా సంస్థలూ ప్రచారించాక, ఇక తప్పదన్నట్లు సింగిల్/డబుల్ కాలమ్ వార్త, లోపలి పేజీల్లో ప్రచురించి సరిపెట్టింది. అందునా సంచలనాలకు పెట్టింది పేరైన ఈనాడు! హెడ్లీకి బాలీవుడ్ భామలతో, పెద్దలతో ఉన్న సంబంధాలు గురించి కూడా మౌనం పాటించింది. అన్ని పత్రికలు హెడ్లీ గురించిన వార్తలు ఫాలోయింగ్ వ్రాస్తుంటే, ఈనాడు మాత్రం ముక్తసరిగా వ్రాసి ముగించింది.

అంతేకాదు ఇటలీ నియంత ముస్సోలినీ బ్రిటన్ గూఢచారి అన్న వార్తాంశం, క్యూబా అధినేత క్యాస్ట్రో చెల్లెలు జువానిత్ క్యాస్ట్రో సిఐఏ ఏజంట్ అన్న వార్తాంశం, భారత్ కు బ్రిటన్ ముంబై కేసులో సహాయనిరాకరణ చేస్తున్న వార్తాంశం, అదే బ్రిటన్ పాక్ కే ప్రాధాన్యత ఇవ్వడం గురించిన వార్తాంశాలు, నక్సల్స్ కు చైనా గన్నులు అందుతున్న విషయం మచ్చుకైనా ప్రచురించలేదు. ఉగ్రవాదుల అడ్డాగా బ్రిటన్ మారిందని, దానికి బ్రిటన్ బదులుగా ’లండనిస్థాన్ ’ అని సిఐఏ పేరు పెట్టిందన్న వార్తాంశాలు కూడా ప్రచురించలేదు. ఇక ఇలాంటివి ఎన్నయినా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ వార్తలే కాదు, జాతీయ వార్తలలోనూ ఇదే తీరు!

మొన్నటికి మొన్న... రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్.డి.తివారీ రాజభవన్ లోనే కామక్రీడలు వెలగబెట్టినా, అది దుర్గంధం వెదజల్లుతూ సంచలనంగా బయటికొచ్చినా, తనకి ఆగర్భశత్రువు కాంగ్రెస్ ఇరుక్కున్నాకూడా, ఈనాడు ఆపధ్దర్మ అంధత్వం పాటించింది. రాజీనామా వార్తలో ఏకవాక్యం వ్రాసి సరిపెట్టింది. తదనంతర పరిణామాలు సైతం, రెండు/మూడు వార్తలతో పూర్తి చేసింది. [చిత్రంగా మీడియా మొత్తం, ఆ విషయంలో అప్రకటిత సంఘీభావం ప్రకటించి క్రమంగా గమ్మున ఉందిలెండి.]

ఇక నిన్న... ముంబై, చెంబూరు శివార్లలోన మాఫీయా డాన్ ఛోటా షకీల్ అనుచరుడు, ఓ క్లబ్ లో ఇచ్చిన నూతన సంవత్సర పార్టీ వేడుకల్లో, మందేసి చిందేసి దొరికిపోయిన మరాఠా పోలీసుల గురించి, మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయటం గురించి కూడా... అదే మౌనం!

ఢిల్లీలో రోటిన్ వైద్య పరీక్షల నిమిత్తం ముగ్గురు పాక్ తీవ్రవాదుల్ని[ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో] తీసుకు వస్తుండగా పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నారు. ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులని సైతం సస్పెండ్ చేసింది. అది కూడా ఈనాడులో కనబడలేదు.

నిన్నటి తెలంగాణా గర్జనలో... తెలంగాణా జాక్ నేతలు ’రామోజీ వ్యూహాలూ మానుకో!’ అన్నారట. అది వ్రాసుకోలేదు. తనమీద నిందలు తాను వ్రాసుకోలేదు అనుకుందాం. అయితే, తెలంగాణా జాక్ నేతలు, సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం, లగడపాటి ధనబలం, జగన్ భుజబలంతో జరుగుతున్నాయన్నారట. అది మాత్రం వ్రాసుకున్నాడు. రెండో వ్యాఖ్య వదిలేసి మొదటి వ్యాఖ్యని సాక్షి వ్రాసుకుంది. మొత్తానికీ... ’అన్ని పత్రికలు ఒకటే! వాళ్ళకిష్టమైనవీ, వాళ్ళకి అనుకూలమైనవీ వ్రాసుకుంటాయి’ అని నిరూపించుకున్నారు.

ఇటు చూస్తే... సీమాంధ్ర జేఏసీ నేతలు, ఇటీవల, తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో ఒకరైన మధుయాష్కీ పేరిట న్యాయవాదులకు విడుదలైన లేఖని ప్రస్తావిస్తూ, అందులో - నవంబరు 29 నుండి కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తాడనీ, తదుపరి కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందనీ’రాహుల్ గాంధీ మధుయాష్కీకి చెప్పాడని, ’రాహుల్ గాంధీ సీమాంధ్ర నేతలను ఆసహ్యించుకుంటున్నాడని’ ఉటంకించబడిందట.

ఆ లేఖ నిజమా, నకిలీనా? నకిలీ అయితే ఎవరు దాన్ని సృష్టించారు, ఎందుకు సృష్టించారు? లేఖ నిజమైనదే అయితే, అందులో ఉటంకించిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజమా, అబద్దమా? ఈ మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు జరిపించమని సీమాంధ్ర జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది. ఈనాడు మాత్రం గమ్మునుంది.

ఇలా... రోజు రోజూ... ఎన్నో వార్తల గురించి ఈనాడు ఎందుకు మౌనం పాటిస్తోంది?

అంతర్జాతీయ వార్తల్ని సైతం అలవోకగా అందించే స్థాయి నుండి, ఈనాడు పత్రిక స్థాయి, గల్లీ స్థాయికి ఎందుకు పడిపోయింది? గత సంవత్సరంలో ’అమ్మఒడి బ్లాగు’లో అంతర్జాతీయంగా గూఢచార వలయాన్ని నడుపుతున్న ’నకిలీ కణిక వ్యవస్థ’లో, ఈనాడు రామోజీరావు కీలక వ్యక్తి అని ఉటంకించబడింది.

చిత్రంగా.... ఆ తర్వాత... ఈనాడు పత్రిక స్థాయి... ఎందుకు కుదించుకు పోతోంది?

ఓ విక్రమార్క మహారాజా!

ఈనాడు పురోగమిస్తోందా? తిరోగమిస్తోందా?

రామోజీరావు అంతర్జాతీయ స్థాయి వ్యక్తా? గల్లీ స్థాయి వ్యక్తా? తెలిసీ జవాబు చెప్పకపోయావో నీతల వేయి వక్కలౌతుంది" అన్నాడు భేతాళుడు.

విక్రమార్కుడు చిరునవ్వుతో, "భేతాళా! గతటపాలలో నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేక పోయాను. దానితో నువ్వు నాకు బంటువై పోయావు. అయినా గానీ తిరిగి చెట్టేక్కేసావు. ఇక్కడా నువ్వు చేయాలనుకున్నదే చేసావు. పైగా మరికొన్ని చిక్కుప్రశ్నలు వేస్తున్నాను. అయినా అడిగావు కాబట్టి, నాకు తెలిసింది చెబుతాను విను!నువ్వు వేసిన ప్రశ్నలకి సరైన జవాబు చెప్పగల వ్యక్తి రామోజీరావు మాత్రమే!

పరిస్థితి ఇలాగే పోతే... ఈనాడు, స్థాయి గల్లీ నుండి కూడా కుదించుకుపోయి, సోమాజీగూడా చుట్టుప్రక్కల వార్తలు, రామోజీ ఫిల్మ్ సిటి చుట్టుప్రక్కల జరిగే విషయాలు మాత్రమే వ్రాస్తుందేమో! అంతర్జాతీయ, జాతీయ వార్తాల్ని అందరి కంటే ముందుగా అందించిన ప్రాంతీయ పత్రిక స్థాయి నుండి... ఈనాడు పత్రిక, అంతర్జాలంలోని తెలుగు బ్లాగ్లోకంలో ఓ బ్లాగు స్థాయికి వచ్చినా, ఆశ్చర్యపోనక్కర లేదని నాకనిపిస్తోంది.

ఇక నీ రెండో ప్రశ్న... రామోజీరావు ’నాది అంతర్జాతీయ స్థాయి కాదు, గల్లీ స్థాయే’ అని అన్పించుకోవటానికే, తన ఈనాడు పత్రిక స్థాయి కుదించుకుంటున్నాడు" అన్నాడు.

భేతాళుడు "విక్రమార్క మహారాజా! నీకు తెలిసింది చెప్పావే గానీ, నా ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. నీ మౌనభంగం అయింది కాబట్టి నేను తిరిగి చెట్టేక్కిస్తున్నాను" అనేసి చక్కాపోయాడు.

బ్లాగు మిత్రులారా! మీరు జవాబు చెప్పగలరా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

laksmigaru mi blog nneu follow avthunannadi.mi post smabnadam lekapoyina oka chinna vishyam baga kalchivesindi.miru rajaseskhar reddy gurinchi chala vishyalu mi gata tapaloo vivarincharu.kani ninna vidyarthigarjana perutho vidhyardhle kani,mandakrishna madigakani,varvaraolanti vallu,profeesor inthamandi adhavayram lo andhar avllanu hechairnche paristhithe kahcitnaga tesukuvache vade kadu.entha avnithi vunna ippudu mana paristhi penam midanunchi poyyalo paddate kada. ee vishyam patala oka citizenga prekshaka patra ennalu vahinchalo artham avkaunda cheshtuna e kutra mirannatlu nakli kanika vyavasthlo kelakmina aa italy madam gari daya.1 year back anukunta paperlo china mantrulo okaru bhartadessani mukkalu mukkaluga cheste dani development addukovachu ani statemnet ichadanta.daniki idi modati mettu anukunta.jargedi jargaaka maanadu ani vedantam vallinchadam tappa manamem cheylemu . naku kaligina avedana valla miku pedda comment ayyinaatu vundi.

Mussolini is dictator of italy, not germany.
Please correct the mistake.

అజ్ఞాత గారు,
మీ అవేదన అర్ధం అయ్యిందండి, నిరాశ వీడి, ఆలోచించండి. నెనర్లు!
~~~~~
అజ్ఞాత గారు,
అవునండి గమనించుకోలేదు. పొరపాటు సరిదిద్దాను. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu