ఇప్పటికే సినిమారంగం దగ్గరి నుండి ఏరంగంలోనైనా – ’నీ ప్రతిభని నేను మార్కెటింగ్ చేసుకుంటాను. నీకు కొంత పడేస్తాను. నోర్మూసుకుని Obey అవ్వు!’ ఇదే హుకుం! ఇది ఎంత బలమైన నెట్ వర్క్ అయ్యిందంటే, చివరికి సత్తుబేడలని కూడా చెల్లించేటంత! అలాగ్గాక “నా ప్రతిభ నాకు తెలుసు! నన్ను నేను ఋజువు చేసుకోగలను. నాకు నేనుగా రాణించగలను” అన్నా కుదరదు. అప్పుడు ఇంటి కెళ్ళాల్సిందే! ఇంకా కుదరక పోతే ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే!

దాంతో ప్రతిభ ఉన్న వాళ్ళయినా సరే, గాడ్ ఫాదర్ లకీ [అంటే నకిలీ కణికుడి ఏజంట్లకి] మోకరిల్లిక తప్పని స్థితి నెలకొంది. చివరికి వాళ్ళ దయాదాక్షిణ్యాల కోసం….ప్రతిభతోనూ, శక్తిసామర్ధ్యాలతోనూ సంబంధం లేకుండా, ’లాబీయింగ్’ పేరిట అంగలార్చవలసి వస్తోంది.


"ఇదంతా నాకొద్దులే! పోనీ మామూలుగానైనా బ్రతికేస్తాను” అనుకున్నా కుదరదు. “నీకంటూ ప్రతిభ ఉన్నాక అది నకిలీ కణికులకి పైసలు సంపాదించి పెట్టాలి. ప్రయోజనాలు సమకూర్చి పెట్టాలి. అందుకు నువ్వు ఒప్పకోకపోతే నటి సావిత్రిలాగా కోమాలో కూడా కృశించి మరణించాల్సి వస్తుంది. లేదా ఆత్మహత్యే గతి!” ఈ హెచ్చరిక పరోక్షంగా సదరు వ్యక్తులకు చెప్పబడుతుంది.

ప్రతిభంటూ ఉన్నాక ఎవరికైనా గుర్తింపు కావాలన్న కోరిక ఉంటుంది. పైగా మీడియా ప్రచారం ఊరిస్తుంది. కాబట్టి ఎవరైనా తమ ప్రతిభని ప్రదర్శించుకుని మేలైన జీవితాన్ని పొందాలనే ప్రయత్నం ప్రారంభిస్తారు. తద్వారా నకిలీ కణికుల కళ్ళబడతారు.

ఇది తొలితరం నకిలీ కణికుడి బుర్రలోంచి పుట్టిందే అని ఎందుకు అన్నానంటే ‘కంచెర్ల గోపన్న Vs తానీషా’ కాలం నాడే దీనికి బీజం పడింది గనుక!

కంచెర్ల గోపన్న శ్రీరామదాసుడై రామమందిర నిర్మాణం కోసం, తన భక్తి గీతాలతో ప్రజల ఆత్మలను తట్టి, విరాళాలు అడిగితే ప్రజలు ఉవ్వెత్తున స్పందించారు గనుక, ఆ ప్రజా సమ్మోహన శక్తిని, శ్రీరాముడి కోసం గాక, నవాబు ఖజానా నింపడానికి ఉపయోగించమన్న నిర్భంధం, గోపన్నని 12 ఏళ్ళపాటు చెరసాలలో బంధించి, చిత్రహింసలతో పాటు, ఆకలికి గురి చేయటం గురించి గత టపాలలో మీరు చదివిందే! ఆకలికి కూడా లొంగని రామదాసులు అరుదుగా ఉంటారు గానీ, అందరూ అలా ఉండలేరు గదా? కాబట్టి తమపని తేలికగానే అయిపోతుంది.


నిజానికి అప్పటి వరకూ తమ దేశ భద్రత కొరకూ, శతృదేశాల, పొరుగుదేశాల గుట్లూ, లోటుపాట్లు తెలుసుకోవటం కొరకూ రాజులు ఉపయోగించిన గూఢచర్యం, ప్రభుత్వాలు తమ ప్రజల మీదే ఉపయోగించటానికి నాందీ ప్రస్తావనలు వేసింది తొలితరం నకిలీ కణికుడే. తానీషా ’రామోజీ’కలకు దర్శకుడు అతడే!


శ్రీరాముడి మీదా, శీలవంతుల మీదా తొలితరం నకిలీ కణికుడికి ఉన్న ఓర్వలేనితనపు మనోవికారమే తానీషా కలలోకి ప్రవేశపెట్టబడ్డ శ్రీరాముడు తన పేరుని ’రామోజీ’గా చెప్పుకోవటం అన్న స్ర్కిప్టుని రచించింది.

అదే పేరు ‘ఈనాడు రామోజీరావు’కి, అతడి సాధారణ రైతు తల్లిదండ్రులు పెట్టటం నిజంగా ఆశ్చర్యకరమే!

ఈ విధంగా మనిషి ఆకలి మీద ఆడుకోవటం లేదా స్త్రీని అడ్డం పెట్టుకోవటం నకిలీ కణికుల ప్రధాన స్ట్రాటజీలు! పైకి ఎన్నిరకాలుగా కనబడినా స్థూలంగా చూస్తే ఇంతే! ఆడది – ఆకలి. లేదా ఆహం తృప్తి పరచటం/అహాన్ని రెచ్చగొట్టటం. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మమూ అరిషడ్వర్గాలని జయించమనీ, అహాన్ని త్వజించమనీ చెబుతాయి. నకిలీ కణికుల స్ట్రాటజీ దీనికి విపర్యయం. ఏ విధంగా విదురనీతి, నారద నీతిలకి విపర్యయమే నకిలీ కణిక స్ట్రాటజీనో, అదే విధంగానన్నమాట.

అంతేకాదు, హిందూమతం, సనాతన ధర్మం సాటి మనిషికే కాదు, సాటిప్రాణి ఆకలిని కూడా పరిగణిస్తుంది. ఆన్నార్తికి ఆకలి తీర్చటం కంటే పరమధర్మం మరొకటి లేదంటుంది. బిక్షుకులని సైతం దైవ స్వరూపంగా, వారికి దానం చేయటం దైవకార్యంగా భావిస్తుంది. ఏకాదశి ఉపవాసం తర్వాత అతిధులకు భోజనం పెట్టి ద్వాదశి పారణ చేయటం ఆచారం. ప్రతీరోజూ కనీసం ఇందరికి భోజనం పెట్టాక గానీ తాము భుజించక పోవటం గృహస్తు ఆచారంగా ఉండటం ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉండేది.

అతిధి ఆభ్యాగతులకే కాదు, సమాజంలో తమ తోటి బ్రతుకుతున్న, తమకు ఉపయోగపడుతున్న ఇతర ప్రాణుల ఆకలినీ అలాగే గుర్తించేవారు. దాశరధి రంగాచార్య గారు తన జీవన వేదంలో చెప్పినట్లుగా, గ్రామీణులు తము తింటూ ఓ రెండు ముద్దలు తమ వెంట పొలందాకా తోడు వచ్చే కుక్కలకీ, ఓ గుప్పెడు కోళ్ళకీ విసరటం అలవోకగా, అనాలోచితంగా చేసేపని. తినబోయే ముందు కాకికి ఓ ముద్ద అన్నం పెట్టటం చాలామంది ఆచరిస్తూ ఉంటారు. కోర్ల పౌర్ణమి పేరుతో కుక్కలకి కుడుములు పెట్టటం, కనుమ పేరుతో పాడిపశువుల్ని పూజించటం అందరికీ తెలిసినవే!

అంతేకాదు, మా చిన్నప్పటి దాకా కూడా, పల్లెల్లో బిక్షకి వచ్చే జంగమ దేవరని సాక్షాత్తూ పరమశివుని అవతారంగా భావించి, బియ్యం అతడి జోలెలో వేసి విభూతిని పిల్లల నుదుట పెట్టింపించటం భక్తిగా చేసేవాళ్ళు. బుడబుడకల వారితోనూ ఇదే విధంగా ప్రవర్తించే వాళ్ళు. గంగిరెద్దుల వాళ్ళనీ, దాసరి వాళ్ళనీ శుభసూచకంగానూ, వారిపట్ల అనుచితంగా ప్రవర్తించటం భగవదపచారంగానూ భావించేవాళ్ళు. సోదమ్మి సాక్షాత్తూ వెంకటేశ్వరుని దూతే! పుణ్యం అన్న concept తో అయినా అక్కడ పరిగణింపబడుతోంది మాత్రం ఎదుటివారి ఆకలే! ఎదుటి వ్యక్తిని గౌరవించటం.

అలాంటి కులవృత్తుల గురించి అవమానం, లజ్జ అన్న భావన లేవీ ఉండేవి కావు. ధనికులుగానీ దరిద్రులు గానీ, ధర్మబద్దంగా వివాహితులైన తల్లిదండ్రుల కడుపున పుట్టిన జన్మ లజ్జాపూరితమైనది ఎందుకవుతుంది? అదే ఇప్పుడు సినీనటుల పుత్రపుత్రికా రత్నాలు, రాజకీయ నాయకుల వారసులు తల్లిదండ్రుల వృత్తిలోకీ వస్తే అది గౌరవప్రదమయ్యింది. మరి ఒకనాడు పల్లెల్లో ఉన్న చేతివృత్తుల వారినీ, కుల వృత్తుల వారినీ ’అవమానం’ పేరుతో ఎలా కకావికలు చేసినట్లు? ఫలాన వృత్తిని పాటించే కుటుంబంలో పుట్టటం అవమానకరమా? అక్రమ సంతానం అయితే తప్ప, వివాహిత అయిన ఓ తల్లికడుపున పుట్టటం అవమానకరం ఎందుకవుతుంది? ఆ తల్లిదండ్రులు ఏ వృత్తిని పాటించనీయండి, లేక ఏ వర్గంగా పిలవబడనీయండి, అది అవమానం ఎందుకయ్యింది? దీనిపై పూర్తి వివరాలని Coup on Indian life style, Coup on Hindu Religion లో వ్రాసాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.

అయితే కులవృత్తి అవమానకరమంటూ వ్యతిరేక భావనలని ఈ 50 సంవత్సరాలలో, సమాజంలోకి చొప్పించిందీ నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ గూఢచర్య తంత్రమే! విభజించి పాలించమన్న కణిక నీతినే ఇక్కడా ప్రయోగించాను. వెరసి ఇందులోనూ ఉన్నది అహాపు తృప్తి లేదా అహాన్ని రెచ్చగొట్టటమే! అదే మూసపద్దతి! మా విద్యార్ధి దాక్కున్నే పది చోట్లు లాగానే! [ఈ ప్రక్రియని మేం ముద్దుగా ’జగదీష్ చిన్నకొడుకులాగా!’ అని పిలుచుకునే వాళ్ళం]

ఇక ఈ విషయాంతరం వదిలేసి మళ్ళీ నకిలీ కణికుల స్ట్రాటజీలే మూలాలైన ఆడది – ఆకలి లోని రెండో అంశం ’ఆకలి’ దగ్గరికి వద్దాం.

’ఆకలి’ అనే ఈ ప్రక్రియని, విన్యాసాన్ని నకిలీ కణికులు వ్యక్తుల మీదే కాదు, దేశాల మీద కూడా ప్రయోగిస్తారని ఇంతకు ముందే వ్రాసాను. ఉదాహరణకి మనదేశాన్ని తీసుకొండి!

రాజకీయలబ్ధి కోసం సంక్షేమ కార్యక్రమాల పేరిట, జనాకర్షక పధకాల సాకుతోనూ, వ్యవసాయరంగాన్ని నాశనం చేస్తునూ, దేశపు ఆర్ధికస్థోమతని కుదిస్తూ పోయారు. 1989 ఎన్నికల్లో 10 వేల రూపాయల లోపు ఋణాలని రద్దు చేస్తామన్న ఎన్నికల హామీతో వీపీ సింగ్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆనక అప్పలన్నీ దేశవ్యాప్తంగా మాఫీ చేసింది. తదుపరి పరిణామాలలో పదవిలోకి వచ్చిన చంద్రశేఖర్ [తర్వాత సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి గత ఏడాదిలో మరణించాడు. వీపీ సింగు దీ ఇదే కథ] ప్రపంచ విఫణిలో బంగారాన్ని తనఖా పెట్టాడు. తర్వాత పదవిలోకి వచ్చిన పీవీజీ అనావార్యమైన స్థితిలో సరళీకృత ఆర్ధిక విధానాలకి తెరదీసాడు. అప్పటికీ సరళీ కృత విధానాల వేగం కంటే దశే తనకి ప్రధానమని పీవీజీ తెగేసి చెప్పాడు. [I’m not particular about the speed of Economical Reforms; I’m particular its Phase – Interview with Vivek Dube on DD in Sep. or Oct. 1992]


తర్వాత జరిగిన గూఢచర్యంతో కలగలసిన రాజకీయపు పోరులో, మెదళ్ళతో నడిచిన యుద్ధంలోని ఎత్తుపైఎత్తులలో, పీవీజీ 1996 తర్వాత పక్కకి తప్పించబడ్డాడు. తర్వాత గద్దెనెక్కిన అన్ని ప్రభుత్వాలూ [దేవెగౌడ నుండి మన్మోహన్ సింగ్ వరకూ] నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ అనుకూలమైనవేనని ఇప్పటికే దృష్టాంతపూరితంగా నిరూపితమైనదే కదా! ఈ విధమైన నకిలీ కణికుల అనుచర వర్గంలోని సభ్యులతో కూడిన ప్రభుత్వాలు, పార్టీలకి అతీతంగా….. దేశాన్ని, చట్టాలని, కార్పోరేట్ కంపెనీలకీ, రాజకీయ వ్యాపారవేత్తలకీ అనుకూలంగా చక్కదిద్దటం, సెజ్ ల పేరుతో దేశాన్ని అన్యాక్రాంతం చెయ్యటమూ మనం రోజూ చూస్తున్నదే! ఏ ప్రజా వ్యతిరేక చట్టాల గురించి, రూల్స్ గురించి అయినా మాట్లాడాల్సి వస్తే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, సదరు చట్టాల గురించి గతప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదని చెప్తుంది.

విత్తనాలు, పురుగు మందుల కంపెనీలతో రైతుల ఖర్చులను పెంచారు. రైతుల ఉత్పత్తులకు, దళారి వ్యవస్థతో ధర లేకుండా వారిని పీల్చి పిప్పి చేసారు. ఇక్కడ ప్రయోగింపబడిన స్ట్రాటజీ ‘Increasing of Expenditure, decreasing of income.’ దానితో రైతులు కుదేలయిపోయారు.

తరువాత దశలో, పచ్చని పొలాలని సైతం, రైతుల్ని లాఠీలతో తన్నీ, తుపాకి గుళ్ళతో చెదరగొట్టి లాక్కొవటమూ, వ్యవసాయరంగాన్ని దుంపనాశనం చేసి, రైతుల్ని ఆత్మహత్యల దగ్గరికి తరిమిగొట్టి చావగొట్టటమూ చూస్తున్నదే! ఇన్నీ చేసి, ఇప్పుడు తీరిగ్గా, ఆహార భద్రతకి ముప్పు రాబోతుందంటూ గోల మొదలు పెడుతున్నారు. ఆహార భద్రతకి ముప్పు వాటిల్లాక, ఆకలి బారిన పడేది సామాన్య, మధ్యతరగతి ప్రజలే. ఇప్పటికే బియ్యం 40/ - రూ., పప్పు 80/- రూ. లతో ’దిశ’ అటువైపే ఉంది.

ఇక సెజ్ ల పేరుతో రైతుల్ని కుదేలు చేయటంలో ’ఆకలి’ కోణమే గాక, మరో ప్రధానాంశమూ ఉంది. అదేమిటంటే ఇంకా ఎంతో కొంతైనా భారతీయ ఆత్మ మిగిలి ఉందంటే అది పల్లెల్లోనే ఉంది. నగరపు కాగితాల తళతళలలో, ఆంగ్లమాధ్యమపు బానిసత్వపు చదువులలో, భారతీయ ఆత్మ, భావవాదపు ఆర్ధ్రత, ఉంటే గింటే, అతికొద్దీమందిలో కొడగట్టే దీపమై తపతపలాడుతోంది.

ఎందుకిలా అంటున్నానంటే – మీరే గమనించి చూడండి. పట్టణాల్లో, నగరాల్లో ప్రజలు ఓమంత్రి/ఎం.పి./ఎం.ఎల్.ఏ. దగ్గరికి వెళ్ళినా లేదా సదరు నాయకుడే ప్రజల దగ్గరికి వచ్చినా, ప్రజల్లో నాయకుల పట్ల ఓ విధేయత ఉంటుంది. మనస్సులో “వీడుత్త దొంగ!” అన్న భావన ఉన్నా, పైకి మాత్రం…. మన్ననా, మర్యాదా తగ్గవు. అందులో వినయం ఎంత ఉంటుందో, అంతే మోతాదులో “ఎందుకొచ్చిన గొడవ! వీడితో పెట్టుకుంటే ఎక్కడో చోట విసిగిస్తాడు” అన్న రాజీధోరణి కూడా ఉంటుంది. దీనికే ‘లౌక్యం’ అని పేరుపెట్టుకుంటారు. కాబట్టే పట్టణాల్లో, నగరాల్లోనూ ప్రజలు రాజకీయ నాయకులనీ, ఉన్నతాధికారులనీ నిలదీయటం తక్కువ.

అదే గ్రామీణులు, పల్లెప్రజలూ, ఆంగ్ల చదువులు రాని ఓటర్లూ, నిర్మొహమాటంగా రాజకీయ నాయకులని పట్టుకుని దులిపేస్తారు. ఇదే మొన్న కర్నూలు వరదల సమయంలో ప్రస్ఫుటంగా కనిపించింది. పంచలింగాలలో, కర్నూలు బస్తీలో ముఖ్యమంత్రిని సహనం కోల్పోయోలా చేసి ’నిజంగా రోషయ్యే’ అన్పించేలా చేసింది. ఈ ఒక్క సంఘటనే కాదు, చాలాసార్లు గ్రామీణులే రాజకీయనాయకుల్ని అవినీతి గురించో, మరొక విషయం గురించో నిలదీయగలుగుతుంటారు.

నిజానికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ కూడా ఈ కారణంగానే, గ్రామాలపై, రైతులపై, ’మెడమీద కత్తి’ సెజ్ ల రూపంలో పెట్టింది. ఎందుకంటే కార్పోరేట్ వ్యవసాయాన్ని తీసుకురావాలి. ఆకలికి అల్లాడి అయినా రైతులు కూలీలుగా మారాలి. అందుకు ఏ పేరైనా పెడతారు. సెజ్ లంటారు. లేదా సామూహిక వ్యవసాయం లేదా సహకార వ్యవసాయం అంటారు. ఏ పేరైనా ఒకటే! ఇంకా ఇప్పుడు ’ఆహార భద్రతకు ముప్పు ఏర్పడటానికి కారణం చిన్నకమతాలే’ అని కూడా సెలవిస్తున్నారు.

ఎందుకంతగా గ్రామాలపై గురిపెట్టటం అంటే – భారతీయ ఆత్మ ఇంకా అక్కడ ఎంతో కొంత సజీవంగా ఉండటమే కారణం.

అంతేగాక, చిన్న తరహా పరిశ్రమలకు భవిష్యత్తులేకుండా చేసారు. పట్టణ పరిధిలో దాదాపుగా అందరిని ఉద్యోగపరిధిలోకి తెచ్చారు. చిన్న వ్యాపారాలకి గురిపెట్టటం ప్రారంభమైనది. అలాగే గ్రామీణులను కూడా ఉద్యోగపరిధిలోకి తీసుకు వస్తే మొత్తంగా కార్పోరేట్ రంగం చేతిలోకి అందరి జీవితాలు తరలించబడతాయి. అప్పుడు అందరి ‘ఆకలి’ తమ చేతిలో ఉంటుంది. పర్యవసానం, దేశాన్ని పూర్తిగా తమ అదుపాజ్ఞాలలో ఉంచవచ్చు. అమెరికా తదితర దేశాలలో కార్పోరేట్ కంపెనీలు ప్రభుత్వాలని నియంత్రించటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అంబానీలు ప్రభుత్వాలని తమకు అనుకూలంగా మార్చుకోవటం మనం చూసాం! రాష్ట్రాలలో గాలి జనార్ధన రెడ్డి లాంటి వాళ్ళు నియంత్రించటం నిన్న కర్ణాటకలో చూసాం.

ఆకలి మంత్రంతో దేశాలని ’గ్రిప్’ చేశాక, ఇప్పుడు పాకిస్తాన్ లో లాగా ఉగ్రవాదులను తయారు చేయవచ్చు. ఆఫ్గాన్ లో లాగా గంజాయి లాంటి మత్తుమందుల ఉత్పత్తి కేంద్రాలుగా తయారుచేసుకోవచ్చు. కొలంబియా లాగా మాఫియా కేంద్రాలను తయారు చేసుకోవచ్చు. సోమాలియా లలో, ఆకలి బాధతో చనిపోయిన వాళ్ళు పోగా చోటు ఖాళీ అయ్యింది. అలాంటి దేశాలని సముద్రపు దొంగలుగా మార్చుకోవచ్చు. నౌకలు పట్టుకుని Ransome లు రాబట్టుకోవచ్చు. జపాన్ లలోని ప్రజలని పనిబానిసలు [work holic] గా మార్చి, నిరంతర ఉత్పత్తులు సాధించుకోవచ్చు. జీవితంలో పిల్లాపాపల్ని కనేంత ఆసక్తి కూడా లేనంతగా యాంత్రిక పనిబానిసలు 24x7 పాటు పనిచేస్తారు కదా!

ఇంత లోతుగానూ, సుదీర్ఘ కాలంగానూ గూఢచర్య తంత్రలు ప్రయోగింపబడతాయి. ఈ ’ఆకలి’ స్ట్రాటజీకి ఆధారభూతమైన చీమల పుట్ట Concept గురించి తర్వాతి టపాలలో వ్రాస్తాను. దేశాల మీద అయితే ఆకలి స్ట్రాటజీ ఇలా ప్రయోగింపబడుతుంది.

వ్యక్తుల మీద …….

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

వేదన కలిగించే విషయాలండీ ఇవన్నీనూ! నా దేశం ఏమైపోతోందీ అని! తాడేపల్లివారు అన్నట్టుగా సున్నితత్వాన్ని కోల్పోతున్నాం! :(

రాఘవ గారు,

వేదన కలిగించే విషయాలేనండి. శోకం నుండి శ్లోకం పుట్టినట్లు, ఈ వేదన నుండే విశ్వశ్రేయస్సు పుట్టాలండి. నెనర్లు!

అమ్మఒడి గారు, మీరే ఎన్నొ సార్లు అన్నట్టు ,మీరు వ్రాస్తున్న విషయాలు నిజం కాదని కోరుకుందాం!

మీకు వీలుంటే, ఎప్పుడైనా భావి ప్రధానిగా చిత్రీకరించబడుతున్న రాహుల్ గురించి వ్రాయగలరా?
I read about him getting caught in boston airport in 2001 along with his girlfriend carrying large amount of cash. Rumors are that Brijesh Mishra (who is closed to Sonia's italian family) helped him through, plus then BJP Govt!

I wonder why no body talk about it?

అప్పుడప్పుడు అనిపిస్తుంది, పివి గారు తన "లోపలి మనిషి " ని అర్థాంతరంగా ఆపేశారని! కొంచెం కొనసాగించి తన పదవీకాలం ముగిసిన వరకు జరిగిన పరిస్థితుల గురించి వ్యాఖ్యానించి ఉంటే మనకు చాలా విషయాలు చూచాయగ నైనా తెలిసి ఉండేవి! ప్చ్ !

-ఫ్రవీణ్ రంగినేని

ప్రవీణ్ రంగినేని గారు,

>>>అమ్మఒడి గారు, మీరే ఎన్నొ సార్లు అన్నట్టు ,మీరు వ్రాస్తున్న విషయాలు నిజం కాదని కోరుకుందాం!

నేనెప్పుడూ నేను వ్రాస్తున్న విషయాలు నిజం కాదని అనలేదండి. ఎందుకంటే నేను వ్రాసిన, వ్రాస్తున్న ప్రతిఅక్షరమూ సత్యం. పూర్తి నిర్దారణతోనే వ్రాస్తున్నాను. ఇక రాహుల్ గురించి గత టపాలలో వ్రాసాను. పీవీజీ లోపలి మనిషి రెండో భాగం ఉందని విన్నానండి. పూర్తి వివరాలయితే నాకు తెలియదు. నెనర్లు!

నిన్న[Nov.18, 2009] సాక్షిలో ప్రచురించబడిన 'రాజగురువింద' కథనం లింక్ గానీ, వార్తాంశం గానీ ఎవరయినా నా మెయిల్ కి పంపగలరా? నెనర్లు!

అమ్మఒడి గారు,
క్షమించాలి..!
నేనన్నది ఈ ఒక్క context లోనే
“నేను తెచ్చిన విషయము నిజం కాకపోతే అంతకంటే ఆనందం లేదు. ఒకవేళ నిజమే అయితే? నిజం కాదనుకొని పట్టించుకోకపోతే, అది దేశానికి ఎంత ప్రమాదకరం?" అని హెచ్చరించాను."(http://ammaodi.blogspot.com/2009/03/48.html)

మిగిలిన విషయాలు మీరెంతో పరిశోధన చేసే వ్రాసి వుంటారు, నిజం కాదని నేనెలా అనగలను?

The Insider కి Part 2 ఉందా? గూగులమ్మ ని అడిగి చూద్దాం!
I can't resist but quote PV, while reading your post!

ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగ్రుతి పుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ !

మీ సంకల్ప బలమే మీకు రక్ష.

-ప్రవీణ్

ఇది 18 వ తేదీ సాక్షి e-paper మొదటి పేజీ లింకు. మిగతా కథనం రెండవ పేజీలో ఉంది.

http://epaper.sakshi.com/epapermain.aspx?queryed=1&eddate=11/18/2009&%20edcode=1

ఫ్రవీన్ రంగినేని గారు,

మీరిచ్చిన ప్రోత్సాహానికీ, సహ అనుభూతి[సానుభూతి కాదు సుమా!:)]కీ కృతజ్ఞతలు. నా గతటపాలోని విషయం ’పీవీజీ కి నేనిచ్చిన ఫిర్యాదులోని వాక్యం’ quote చేసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. మరోసారి కృతజ్ఞతలు.

~~~~~~
సిరిసిరిమువ్వగారు,

లింక్ పంపినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu