20 జనవరి, 2011 తేదీన ‘ఈనాడు’ పత్రిక… ‘నలుపు ఊబి’ శీర్షికతో స్విస్ బ్యాంకు, ఇతర విదేశీ బ్యాంకుల్లో దాచబడిన లక్షల కోట్ల డాలర్ల గురించి వ్యాసం ప్రచురించింది. ‘న్యూస్టుడే ప్రత్యేక విభాగం’ పేరిట వ్రాయబడిన ఈ వ్యాసంలో ‘ఎంత ఉండొచ్చు? ట్యాక్స్ హెవెన్స్, కానరాని తెల్లదారి, చీకటి దారులు, వికీలీక్సే శరణ్యం’ గట్రా ఉపశీర్షికలున్నాయి.


ఇందులో ట్యాక్స్ హెవెన్స్ ని ఒకసారి గమనించండి.
>>>

ఇప్పుడు సర్వనామాలతో చెబుతోన్న అమెరికా, బ్రిటన్ చుట్టుప్రక్కల గల చాలా దీవులతో సహా, 40 దేశాలు, ఎటువంటి బెడద లేకుండా… గోప్యంగా డబ్బు దాచిపెడతామని ప్రచారం చేసుకుంటున్న టాక్స్ హెవెన్స్ అట. అదే సమయంలో, వీటిల్లో చాలా దీవులు పర్యాటక హెవెన్స్ కూడా! ఎంచక్కా టాక్స్ హెవెన్స్ లోని బ్యాంకుల్లో దాచుకున్న నల్లసొమ్ము తాలూకూ కార్డ్సు గోక్కుని, అక్కడ ‘ఒళ్ళు పట్టించుకోవటం’ దగ్గరి నుండి చాలా సుఖాలే పొందవచ్చు.


వాటిల్లో చాలా పర్యాటక కేంద్రాల గురించి… ఈ పత్రికలూ, మీడియానే ఎన్నోసార్లు, ఊరిస్తూ కధనాలు వ్రాసి, ప్రచారం చేసి ఉన్నాయి. అయితే ఒక్కసారంటే ఒక్కసారి కూడా…అక్కడగల ఈ ‘నల్లసొమ్ము లభ్యత’ గురించి వ్రాయలేదు. ఇప్పుడు వికీలీక్స్ వంటి [వాటి పాలిటి] ఉపద్రవాల కారణంగా, ఈ పాటి అయినా వ్రాయడం జరుగుతోంది.


ఇక్కడో విషయం గమనించండి. ఆయాదేశాలు ‘ఎటువంటి బాదరబంది లేకుండా గోప్యంగా డబ్బు దాచిపెడతామని’ ప్రచారించేటప్పుడు… ఈ మీడియాకి తెలియదా, అది దొంగతనంగానూ, అక్రమంగానూ దండుకున్న సొమ్మేనని? మీడియా పనే ఇలాంటి ‘దారుణాల’ని బయటపెట్టటం కదా? మరి దశాబ్దాలుగా ఆ ‘హెవెన్’లని వేలెత్తి చూపెట్టలేదేం?


ఇంకా పైగా, అలాంటి దేశాలతో ఒప్పందాల కారణంగా, డబ్బుదాచిన పెద్ద దొంగల వివరాలు, తమ దగ్గరున్నా బయటపెట్టలేమంటున్నారు, యూపీఏ ప్రభుత్వం+ఆర్ధిక వేత్త అయిన ప్రధానీ! దొంగలు దొంగలు ఊళ్ళుపంచుకున్నారన్నట్లుగా లేదూ ఇది!?


తమ దోపిడికి అనుకూలంగా తాము చేసుకున్న ఒప్పందాలు!


ఏ దేశంలోనైనా… ప్రపంచవ్యాప్తంగా… సామాన్యుణ్ణి బక్కవాణ్ణి చేసి…దోచుకున్న సొమ్ము, దాచుకున్న సొమ్ము! దాని వివరాలు బయటపెట్టమని ఒప్పందాలు చేసుకున్న వాడూ తోడు దొంగే కాదా? ఇంతకీ ఆ ఒప్పందాలు, ఎవరు, ఎప్పుడు, ఏనాటి ప్రభుత్వము తరుపున చేసుకున్నారో… మీడియా ఇప్పటికీ స్పృశించటం లేదు.


నిజంగా మీడియాకి నిజాయితీ, అక్రమాలని బయట పెట్టాలనే సంకల్పమే ఉంటే, ఇప్పటి వికీలీక్స్ చేస్తున్న పనిని, దశాబ్దాల క్రితమే మీడియా చేసి ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థల్లో…‘ఈనాడు’ గొప్పగా ప్రచారించుకునే ‘ఫోర్డ్స్’, ‘న్యూయార్క్ టైమ్స్’, మరో xyzలలో…ఒక్కటంటే ఒక్కటన్నా!


కానీ ఇంతవరకూ ఎవరూ ఆ పని చెయ్యలేదు. ఎందుకంటే – ఇవన్నీ నడుపుతోంది ఒకే గూఢచర్య సంస్థ కాబట్టి! అది నకిలీ కణిక వ్యవస్థ కాబట్టి! శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అల్లుకున్న గూఢచర్య వలయం కాబట్టే, ఇంత పకడ్బందీగా నిర్వహించుకోగలిగాయి.


అలాంటి చోట… నెం.5 వర్గపు పనితీరు కారణంగా, ఇప్పుడు వాళ్ళకి ‘కానికాలం’ వచ్చి, వెలుగు చూస్తున్న నిర్వాకాలు, వెల్లడౌతున్న గూఢచర్య స్ట్రాటజీలలో ‘నల్లడబ్బు వ్యవహారం బహిరంగమౌతూ, చర్చలకి దారి తీయటం’ ఒకటి.


అలాంటి చోట, ఇలాంటి ఎన్నో వ్యవహారాలని బయట పెడుతున్న వీకీలీక్స్ గురించి, అసాంజె వంటి వ్యక్తి గురించి… ‘ఈనాడు’ ఉటంకింపుని మరోసారి పరిశీలించండి.
>>>


హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో, వ్యక్తుల వివాదాల్లో సెటిల్ మెంట్లు, దందాలు చేసే రౌడీల గురించి, మనకి తెలుసు. చివరికి సినిమాల్లో కూడా చూసి ఉన్నాం. [అందులో వినోదపు మిళాయింపుకి నవ్వుకునీ ఉన్నాం.]


చిన్నప్పుడు చదువుకున్న ‘రెండు పిల్లులూ – రొట్టెముక్క – కోతి కథ’లో లాగా…


ఓ సారి ఓ నల్లపిల్లి, ఓ తెల్లపిల్లి, తిండి కోసం వెదకసాగాయి. వాటికి ఓ ఇంట్లో రొట్టె కనిపించింది. నల్లపిల్లి మనుషులు వస్తే హెచ్చరించేందుకు కాపలాగా ఉంది. తెల్లపిల్లి రొట్టె దొంగిలించుకు వచ్చింది. తీరా తినబోతే పంచుకునే దగ్గర పేచీ వచ్చింది. కావలి ఉంది తను కాబట్టి తనకి పెద్ద ముక్క రావాలంది నల్లపిల్లి. కొట్టుకొచ్చింది తను కాబట్టి తనకే పెద్ద వాటా అంది తెల్లపిల్లి.


కొట్లాడుకుని కోతిని తీర్పు చెప్పమన్నాయి. తక్కెడ తెమ్మంది కోతి. తెచ్చాయి పిల్లులు. పంచుతానంటూ రొట్టెని రెండు ముక్కలు చేసి, తక్కెడ రెండు పళ్ళాలలో ఉంచింది కోతి. ‘ఇటెక్కువుందే!’ అంటూ ఓ ముక్కలోంచి కొంత తినేసింది. ‘అటెక్కువుంది!’ అంటూ మరో వైపులోంచీ కొంత తినేసింది. అలా…అలా…మొత్తం తినేసి చక్కాపోయింది.


పిల్లలకి చెప్పే ఈ కథలోని ‘వివాదాలు పడవద్దు’ అనే నీతిని కాసేపు పక్కన బెడితే…


ఈ కథలోని కోతిలా, వివాదపడ్డ ఇరుపక్షాల నుండీ డబ్బు దండుకొని, అందులో ఎవరు తమకి ఎక్కువ ముట్టచెబితే, లేదా ఎవరి పరపతి నుండి తమకి ఎక్కువ ప్రయోజనమో, (ఎక్కువ exchange favours ఉన్నాయో) వాళ్ళకి ప్రయోజనం చేకూరుస్తూ… రౌడీలు సెటిల్ మెంట్లు చేస్తారు. (కాలక్రమేణా వాళ్ళే రాజకీయ నాయకులై పోవటమూ కద్దు.)


ఇలాంటి రౌడీలు మరికొంత ముదిరి…ఏ డబ్బునా వాడికో, సెలబ్రిటీలకో లేదా అలాంటి పరపతి గలవాడికో… వాళ్ళకి నచ్చిన స్థలమో, పొలమో మరో ఆస్థో కనబడితే…సదరు రౌడీని చేరి…‘ఫలానా ఏరియాలో ఫలానా సర్వేనంబరులో ఉన్న స్థలం లేదా పొలం నాకు చేసిపెట్టు’ అంటే చాలు!


ఈ రౌడీలు రంగంలోకి దిగి, ఆ స్థలం లేదా పొలం యజమానిని బెదిరించో, చావదన్నో…రిజిస్ట్రేషన్ తో సహా చట్ట పూర్వకంగా ఆస్థి లాగేసుకుంటారు. కాగితాల ప్రకారం… సజావుగా…సదరు యజమాని, ఈ రౌడీ గారిని ఆశ్రయించిన ప్రముఖుడికి తన ఆస్థిని అమ్మినట్లు ఉంటుంది. రౌడీలకి ప్రముఖుడి నుండి భారీ మొత్తం ముడుతుంది. అదీ వీళ్ళు నడిపే దందా?


అలాంటి రౌడీతో అసాంజ్ (వీకీలీక్స్) కు పోలికెలా పెట్టినట్లు?


రౌడీ గాళ్ళు చేసేది దందా! ఆ సొమ్ముతో చేసేది జల్సా! స్వలాభం కోసం, స్వసుఖం కోసం… దౌర్జన్యాలు , హింసా కూడా చేసే వాడు రౌడీ! అక్రమాల రహస్యాలనీ, గూఢచర్యం గుట్టుముట్లనీ వెల్లడిస్తున్నవాడు వికీలీక్స్ అసాంజె! మాన ప్రాణాలకు ప్రమాదం ఉన్నా లెక్క చెయ్యకుండా…దేశాల పెద్దలు చేసిన అక్రమాల గురించీ బయట పెట్టిన వాడు వీకీలీక్స్ అసాంజె! అతడికి రౌడితో పోలికా?


అసాంజె దీ, అలాంటి ఇతరులదీ… న్యాయం కోసం పోరాటం!


సమాజ హితం కోసం పోరాటం!


ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై దోపిడికి వ్యతిరేకంగా పోరాటం!


దేశాల కతీతంగా బడాదొంగలకి వ్యతిరేకంగా పోరాటం!


కాబట్టే… అతడి మీద ‘ఆకలి, ఆడది’ ప్రయోగింపబడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులకు లోనై అసాంజ్ జైలుపాలయిన సంగతీ, షరతులతో విడుదలైన సంగతీ తెలిసిందే! అతడి ‘ఆకలి గురించీ, ఆర్ధిక ఇబ్బందుల గురించీ, ఇల్లూ వాకిలి లేకుండా దేశాల దిమ్మరిలాగా నలుగుతున్న విషయాలు గురించీ’ తెలిసిందే!


అలాంటి చోట …రౌడీలతో అసాంజ్ కు పోలికా?


వివాదాలు పడ్డవాళ్ళ మధ్య రౌడీలు సెటిల్ మెంట్లు చేయగలరు (అందులో వాళ్ళ దందా, స్వలాభం సంగతి పక్కనుంచినా!) అయితే అసాంజ్!? స్విస్ బ్యాంకులూ, లీక్టైన్ స్టైన్ వంటి టాక్స్ హెవెన్లలో దాచబడిన నల్లసొమ్ముని వెనక్కి రప్పించలేడు కదా!?


అలా డబ్బు వెనక్కి రప్పించగల ఈ దేశపు ప్రధాని (ఏ దేశపు వాడైనా ఇంతే చేస్తాడనుకోండి) నిస్సిగ్గుగా సాక్షాత్తూ సుప్రీం కోర్టుకీ, మంత్రివర్గ సహచరులకీ, ప్రజలకీ కూడా ‘విదేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా, అసలు నల్లడబ్బు దాచిన ఘరానా దొంగలు వివరాలు కూడా బయటపెట్టలే’నంటున్నాడు. తమ దగ్గర ఆ వివరాలు ఉన్నా సరే! ఇక ఆ డబ్బు వెనక్కి తెప్పించేదెక్కడ? అంతగా తాము ప్రజలకు వ్యతిరేకమనీ, దోపిడి గాళ్ళకు అనుకూలమైన సహదోపిడి గాళ్ళమనీ నిరూపించుకుంటున్నాడు.


అలాంటి చోట…అసాంజ్…సమాచారాన్ని బయట పెడుతున్నాడు. ఆ విధంగా రహస్యాలు వెల్లడి కావటమే ఈ గూఢచారులకి మృత్యుశయ్య కావచ్చు గాక! రౌడీల్లాగా ‘డబ్బు సెటిల్ మెంట్’లు మాత్రం అసాంజ్ చెయ్యలేడు.


మరెలా అసాంజ్ ను రౌడీలతో పోల్చినట్లు, ఈనాడు ప్రత్యేక విభాగం? సదరు మీడియా అధిపతి రామోజీరావుకీ, అతడి కుమారులకీ ఉన్న దుగ్ధే తప్ప… ఆ పోలికలో ఔచిత్యం ఏ కొంచెమైనా ఉందా!?


ఎంతగా భావాలని కలుష పరచటం ఇది?


తెలంగాణా నాయకుడూ, పచ్చి తాగుబోతూ, పరమ వదరబోతూ అయిన కేసీఆర్ ని… డిసెంబర్ 10, 2009న ‘తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ’ ప్రకటన నేపధ్యంలో ‘బక్క మహాత్ముడనీ’, ముఖేష్ అంబానీని ‘వ్యాపార మహాత్ముడనీ’ పొగడటం, ఎంతగా భావాలని కలుషి పరచటమో, రౌడీలతో అసాంజ్ ని పోల్చడం కూడా అంతగా భావాలని కలుషపరచటమే!


బిన్ లాడెన్ నీ, బిల్ గేట్స్ నీ ఒకే గాటన కట్టేసినట్లు?


అసాంజ్ కు రౌడీలతో సారూప్యత చెప్పి, మరోసారి…‘ఈనాడు’, దాని అధిపతి రామోజీరావు, తమకు మంచిపట్ల గల వ్యతిరేకతని మరోమారు నిరూపించుకున్నారు.


మరోమాటగా చెప్పాలంటే నకిలీ కణిక వ్యవస్థకి మరో దృష్టాంతం ఇది. మరింతగా స్పష్టపడుతున్న, పడనున్న దృష్టాంతం కూడా!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

నల్లధనం గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్టు ఆయన ప్రకటించాలా? చెందడంలేదని ఎవరన్నారు? ఎటొచ్చీ జర్మనీలోని ‘లీటెన్‌స్టీన్’ బ్యాంకులో నల్లడబ్బు దాచిన ఇరవై ఆరుమంది భారతీయుల పేర్లను రహస్యంగా ఎందుకు ఉంచాలో ముఖర్జీ స్పీష్టీకరణ తరువాత కూడా స్పష్టం కాలేదు! అంతర్జాతీయ అంగీకారాలను గౌరవించడం, వాటికి కట్టుబడి ఉండడం ప్రభుత్వం బాధ్యత అంటూ ఈ కట్టుబాటుకు బద్ధులైనందున ప్రభుత్వం వారు అక్రమ ధన నిక్షేపకుల ఆరాను బహిరంగపరచడం లేదట! ఇదే మాట 19వ తేదీ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. దాన్ని ముఖర్జీ మంగళవారం పునరుద్ఘాటించారు! ఇలా వెల్లడి చేయకుండా అడ్డుపడుతున్న రెండు ఒప్పందాలను ఆయన ఉటంకించారు! మొదటిది- రెండుసార్లు పన్ను విధించడాన్ని నిరోధించే ఒప్పందం-డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్! రెండవది , ఆదాయం పన్ను సమాచార వినిమయానికి సంబంధించిన ఒప్పందం-ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ టాక్స్ ఇన్‌ఫర్‌మేషన్ అగ్రిమెంట్! అరవై ఐదు దేశాలతో ఈ ఒప్పందాలు దాదాపు కుదిరాయట. మరో పదిహేను దేశాలతో ఈ ఒప్పందాల కోసం ప్రయత్నం జరుగుతోందట! మనదేశంలో ఆదాయ పన్ను కట్టినవారు సంబంధిత ఆదాయాన్ని విదేశాలలోని బ్యాంకులలో జమకడితే దానిపైన ఆయా దేశాలలో మళ్లీ పన్ను వేయకుండా ఉండడానికి మొదటి ఒప్పందం సహాయపడుతుంది! కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఆదాయం పన్నును విధించడమే లేదట! మరికొన్ని దేశాలలో నామమాత్రంగా నాలుగు శాతం వరకూ ఆదాయం పన్ను వసూలు చేస్తున్నారట! ఇలాంటి దేశాల విషయంలో మొదటి ఒప్పందం అవసరమే లేదట! అలాంటి దేశాలతో రెండవ ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చిందని ముఖర్జీ వివరించారు! కానీ ఈరెండు చట్టాలు కూడా ఆయా దేశాలలోని మన నల్లడబ్బు వివరాలు బయటకి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాయన్నది మంత్రి చెప్పలేదు! సమాచారం రాబట్టడానికి ఉపకరించవలసింది పోయి సమాచార నిరోధానికి ఈ అంగీకారాలు దోహదం చేయడం విడ్డూరం. మరి ఈ గుదిబండ ఒప్పందాలు ఎందుకు? 2001లో నల్లధనం వెలికితీతకు రూపొందిన కార్యాచరణ వ్యవస్థలో లోపాలున్నాయట! దాదాపు పదేళ్లుగా ఎందుకని లోపాలు సవరించుకోలేదు?
జర్మనీ బ్యాంక్‌కు సంబంధించిన ఇరవై ఆరుమంది అక్రమ ఖాతాదారుల వివరాలు మూతవేసిన కాగితపు సంచి-సీల్డ్ కవర్- లో ఉంచి సుప్రీంకోర్టుకు నివేదించారు! ఆ పేర్ల వివరాలు ఆదాయం పన్ను శాఖ కార్యాచరణ - ఎన్‌ఫోర్స్‌మెంట్- విభాగం వారికి మాత్రమే తెలుసునట! తమకుకూడా ఆ పేర్లు జాబితాల వివరాలు తెలియవన్నది మంత్రి చెప్పిన మరో రహస్యం! ఆ పేర్లను బయటపెడితే అంతర్జాతీయ సమాజంలోని ఏ దేశ ప్రభుత్వం కూడా ఇకపై మన ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందచేయదట! అందుకని ఆ పేర్లను రహస్యంగా ఉంచడం అనివార్యమన్నది ప్రభుత్వం సుప్రీంకోర్టులోను, బయటా ఆవిష్కరిస్తున్న మహా విషయం! మరి ఆ సీల్డు కవరు జర్మనీనుంచి అలాగే వచ్చిందా? లేక వివరాలతో కూడిన పత్రాన్ని ఇక్కడ సీలు చేశారా? ఆ కవరును సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా విప్పి చూడవచ్చునా? చూడకూడదా? చూడకూడని పక్షంలో ఆ సీల్డు కవర్‌ను సమర్పించినందువల్ల ఏం ప్రయోజనం? ఆ కవర్‌లో పేర్లున్న పత్రం ఉందా? లేక ఖాళీ కాగితం ఉందా? - అన్న విషయం విప్పి చూసినప్పుడే కదా వెల్లడయ్యేది! వెల్లడి చేయడం అసంభవం అంటున్న ప్రణబ్ ముఖర్జీ సీల్డ్ కవర్‌లోని పేర్లకు సంబంధించిన అక్రమ ఖాతాదారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వారు కేసులు పెట్టనున్నట్టు చెప్పారు. కేసులు దాఖలైన తరువాత ఎలాగూ ఆ పేర్లు వెల్లడైపోతాయని ఆయన తేల్చేశారు! మరి అలా వెల్లడైనప్పుడు జర్మనీ ప్రభుత్వం ఏమంటుంది? యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ -యుబిఎస్- వారు అమెరికా ప్రభుత్వానికి అమెరికా పౌరుల నల్లధనం వివరాలను వెల్లడించారు. కానీ స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించలేదన్నది ముఖర్జీ వాదం! మన ప్రభుత్వం మాత్రం ఎందుకని స్విట్జర్లాండ్ బ్యాంకుల తో సంప్రదించి ‘నల్ల సమాచారం’ రాబట్టరాదు?

మరెలా అసాంజ్ ను రౌడీలతో పోల్చినట్లు, ఈనాడు ప్రత్యేక విభాగం? సదరు మీడియా అధిపతి రామోజీరావుకీ, అతడి కుమారులకీ ఉన్న దుగ్ధే తప్ప… ఆ పోలికలో ఔచిత్యం ఏ కొంచెమైనా ఉందా!?
100% true

@అజ్ఞాత: అసలు ఇలాంటి double taxation ఒప్పందాన్నెందుకు కుదుర్చుకోవలసివచ్చిందన్నది అసలు ప్రశ్న కాదంటారా? దీనివల్ల ఆ దాచుకొనేవాళ్ళాకు తప్ప మరింకెవరికైనా లాభం వుందా? మీ ప్రశ్నలకి బహుశా సమాధానాలు ప్రభుత్వం ఇవ్వలేదనుకుంటా.

1st Anonymous have valid questions. Good Job.

Whom they(PM and that Italian) are protecting from exposure?

People must vote out those corrupt people who are currently ruling the country.

One way to control huge masses is to appoint own people in key positions. Such as PM, CEC, Supreme Court Judges, Military Commanders, CMs and MPs.

It happened in Rome in the 4th century. A small cult from West Asia able to defeat mighty Romans by infiltrating (capturing) key positions in the government (Military Generals, Government Officials, Senators, etc)

The history is repeating in India it seems.

Read the following. Italian Sonia is appointing her Missionary Chri* as CEC. So she can rig elections and rule India for ever.

http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm

Maa'm,sorry for putting an irrelevant comment.Your story in this month's chandamama is good.

మొదటి అజ్ఞాత గారు: మంచి ప్రశ్నలు లేవనెత్తారు. ఇండియన్ మినర్వా గారన్నట్లు ప్రశ్నలకు జవాబులే రావడం లేదు ప్రభుత్వం నుండి. చూద్దాం ఏం జరుగుతుందో!

astrojoyd గారు : నా టపాను సరిగ్గా క్యాచ్ చేసారండి. నెనర్లు!

ఇండియన్ మినర్వా గారు: మీరన్నది పచ్చి నిజం.నెనర్లు!

రెండవ అజ్ఞాత గారు: నెనర్లండి.

మూడవ అజ్ఞాత గారు: మంచి చర్చ చేసారు. నెనర్లు!

రెడ్డి గారు: నా కథ మీకు నచ్చినందుకు సంతోషమండి. :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu