పీవీజీ, ఆయన చేత సమీకరించబడిన నెం.5 వర్గమూ.... తమ వారసులుగా, సైనికులుగా సామాన్యులనే ఎంచుకుంది. దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా!

నెం.5 వర్గం.... మీడియా, రాజకీయ, సినిమా, గట్రా రంగాల ద్వారా, ఇప్పటి వరకూ నకిలీ కణిక వ్యవస్థ, సామాన్యులలో నూరిపోసిన పిరికితనాన్ని, అనవగాహనని, తామసాన్ని తరిమివేసి.... ధైర్యాన్ని, జ్ఞానాన్ని, రజో గుణాన్ని రగల్చటమే లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

కాబట్టే
‘ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృతి పుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ’
అని నిక్కచ్చిగా నిర్ద్వంద్వంగా చెప్పాడు పీవీజీ. సామాన్యులు లేకుండా ప్రపంచం లేదు కదా! ఏ దేశమైనా.... దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే కదా! జనాలు కలిస్తేనే కదా మహి [అంటే ధరిత్రి]?

ఇక, దుష్ట శిక్షణకి నెం.5 వర్గానికి సైనికులు అవసరం లేదు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని ఏజంట్లని, జాతర బొమ్మలని ప్రయోగించి, ‘బహిర్గతాలు - సువర్ణముఖి’లతో కూలిస్తే....పందిరి గుంజలు కూలితే, కుప్ప కూలిపోయే పందిరి లాగా.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల గూఢచర్య వలయం తుత్తునియలై పోతుంది.

శిష్ట రక్షణకీ, దేశరక్షణకీ.... నెం.5 వర్గానికి సైనికులు అవసరం. ఆ సైనికులుగానే సామాన్యులని ఎంచుకున్నది!

దీన్ని చిన్నపరిమాణంలో వివరిస్తాను. ఉదాహరణకి మా కేసునే తీసుకుంటాను. మమ్మల్ని వేధించటానికి నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు ప్రత్యక్షంగా రాలేదు. మా చుట్టూ ఉన్న సామాన్యులనే ఎంచుకున్నాడు. అలాగే మాకు సహాయం చేసేందుకైనా, మద్దతిచ్చేందుకైనా నెం.5 వర్గమూ ప్రత్యక్షంగా దిగలేదు. మా చుట్టూ ఉన్న సామాన్యులనీ, మా బంధు మిత్రులూ, ఇతర పరిచయస్థులైనా సామాన్యులనే ఎంచుకుంది.

అయితే నకిలీ కణిక వ్యవస్థ, నెం.5 వర్గపు పనితీరుకీ, నెం.5 వర్గపు పనితీరుకీ చాలా వ్యత్యాసం ఉంది!

మమ్మల్ని వేధించేందుకు.... నకిలీ కణిక వ్యవస్థ, మా చుట్టూ ఉన్నవారిలో, సంబంధిత అధికారులలో, రాజకీయ నాయకులలో.... చెడ్డవారిని ఎంచుకుంది. డబ్బుకి, పదవికీ, దేనికి లొంగే వారికి అది ఎరగా వేసింది. పాపం పుణ్యం అనుకున్నా, సాయం చెయ్యాలని అనుకున్నా, ‘ఇలా వేధించటం తప్పు’ అని సంకోచపడినా... అలాంటి వారి జోలికి, నకిలీ కణిక వ్యవస్థ వెళ్ళకుండా, నెం.5 వర్గం అడ్డుపడింది. వాళ్ళు స్వేచ్ఛగా ఉండే వెసులు బాటు కల్పించింది. కాకపోతే నకిలీ కణిక వ్యవస్థ, ఇలా సాయం చేయాలనుకునే వాళ్ళపై ఇన్ డైరెక్ట్ గా సామ దాన బేధాలు ఉపయోగిస్తుంది.

డబ్బు, ఇతరత్రా ప్రయోజనాలకి ఆశపడి, మమ్మల్ని వేధించేందుకు, నకిలీ కణిక వ్యవస్థకి ఎక్కువమంది సామాన్యులు దొరికారు. ప్రజా జీవనంలో అవినీతి పెరిగిపోయినందున, వాళ్ళకి సైనికులకి కొరత రాలేదు. ఇబ్బడిముబ్బడిగా దొరికారు. కాబట్టే మమ్మల్ని వేధించటం వాళ్ళకి సులువయ్యింది.[2000 - 01 సంవత్సరాలలో, మా ఫిర్యాదుల పరంపర నడుస్తున్న రోజుల్లో, చంద్ర బాబు నాయుడు ‘ప్రజా జీవితంలో అవినీతి’పై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తానని కూడా ప్రకటనలిచ్చాడు. మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత, మళ్ళీ దాని ఊసే ఎత్తలేదు. ]

అలాగే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులు రామోజీరావుల, సోనియాల అండదండలుండటంతో, చంద్రబాబు, వై.యస్.ల వంటి ప్రభుత్వాధినేతలు దళపతులై నిలబడ్డారు. వాళ్ళ అండతో అదికారులు చెలరేగారు. [వై.యస్. తన హయాంలోనే ‘ప్రభుత్వోద్యోగులు ఆరోపణలతో సస్పెండయితే, ఒకటిన్నర సంవత్సరాలలో కోర్టులో కేసు తేలకపోతే, ఆటోమాటిక్ గా అతడి ఉద్యోగం అతడికి వచ్చేస్తుంది’ అని రూల్స్ మార్చి వేసాడు. కోర్టులో కేసులు ఎప్పుడు తేలతాయో మనందరికి తెలుసు కదా!?]

మరోవైపు, మాకు సహాయం చేయటానికి గానీ, మద్దతివ్వడానికి గానీ తక్కువమంది ఉండేవాళ్ళు. కాబట్టే ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ కేసు.... సాక్ష్యాలుగా పత్రాలు రూపొందటానికీ, దృష్టాంతపూరితంగా నిరూపించబడటానికీ.... ఇంతకాలం పట్టింది, ఇంత క్లిష్టతరమైందీ, కష్ట సాధ్యమైంది.

ఒకప్పుడు దేశమ్మీదా, దేశ ప్రయోజనాల పట్ల నిబద్దతా, నిజాయితీ గల నాయకుల మీదా, ప్రయోగించిన స్ట్రాటజీలు, వేధింపులూ, అన్నీ మా మీద ప్రయోగింపబడ్డాయి. ఆవిధంగా నకిలీ కణిక వ్యవస్థ స్ట్రాటజీలు మాకు అర్ధమయ్యాయి. అలాగే నూరు శాతం రామోజీరావు ప్రమేయం నిరూపించబడింది.

ఒకప్పుడు[1992కు ముందు] off record లో చేసిన వాటిని, మళ్ళీ on record లో చేసే విధంగా, ఆత్మహత్యాసదృశ్య అసైన్ మెంట్లతో మరీ.... ఈ ప్రక్రియనంతా నిర్వహించాల్సి వచ్చింది.

ఇందుకోసం నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికి ప్రజా జీవనంలో అవినీతి పెరిగిన రీత్యా, ఎక్కువమంది సామాన్యులు సైనికులుగా లభ్యమైతే... నెం.5 వర్గానికి, మంచి వాళ్ళ లభ్యత తక్కువగా ఉండింది.

ఇందుకు మరికొన్ని కారణాలున్నాయి.
ఒకటొకటిగా...
1]. మేమెక్కడ ఉంటే అక్కడ.... మా చుట్టూ పరిసరాలలో, పరిచయస్తులలో... అత్యాశగల వాళ్ళనీ, చెడు చేయటానికి సంకోచించని వాళ్ళనీ, అవినీతి పరులనీ.... నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు ఎంచుకున్నారు. ముందుగా ఆయా పరిధుల్లో అధికారులనీ, సామాజికంగా పరపతి గల వాళ్ళనీ, ధనవంతులనీ ఎంచుకున్నారు. అందరిలోకి టాపర్ లని ఎంచుకుంటే, క్రింది వాళ్ళనంతా నియంత్రించటం సులువు కదా!

డబ్బు, పరపతి, కెరీర్.... ఇలా దేనికి లొంగేవాళ్ళకి అది ఆశగా చూపి, బహుమతులుగా ఇచ్చి ’వేధింపు ప్రక్రియ షురూ’ చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళతో సంభాషణా, సంబంధమూ కూడా ప్రత్యక్షంగానే నన్నమాట. కాకపోతే ’ఆర్ధిక’ మాధ్యమంలో!

2]. డబ్బుకి, అవినీతికీ లొంగని రకం అనుకోండి. ఎంతో కొంత విలువలు పాటించే వాళ్ళని మాకు సహాయపడకుండా.... కుటుంబమిత్రుల ద్వారా, పై అధికారుల ద్వారా, ఇంటి యజమానులూ, ఉద్యోగ దాతలూ గట్రాల ద్వారా భయపెట్టచూస్తారు. "నీకెందుకొచ్చింది? ఇలాంటి వాటిల్లో తలదూరిస్తే మట్టిగొట్టుకు పోతావు" అని చెప్పబడుతుంది. [ఇవన్నీ సాక్షాత్తు మాకే చెప్పబడ్డాయి.]

3]. "ఎదుటి వాళ్ళు [అంటే మేము] మంచి వాళ్ళే కావచ్చు గానీ, మనకెందుకు?" అనుకొమ్మని చెప్పబడుతుంది.

4]. అప్పటికీ వినలేదనుకొండి. దెబ్బలబ్బాయిల గురించి చెప్పబడుతుంది. ‘ఫలానా వాళ్ళు ఇలాగే ఎవరికో [మాలాంటి వాళ్ళు ఎవరో] సాయం చేయబోతే ఇలా కొరివితో తలగోక్కున్నట్లుయ్యిందట. తస్మాత్ జాగ్రత్త’ అని చెప్పబడుతుంది.

5]. మేము, మా లక్ష్యం ఏమిటో, అసలు రామోజీరావు మీద మేము 1992 లో పెట్టిన ఫిర్యాదు ఏమిటో కూడా, ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు. ఒకవేళ ఎవరికైనా తెలిసి మాకు సాయ పడేందుకు ముందుకొచ్చినా, "ఆ! ఈ రోజుల్లో దేశం, ధర్మం, తొక్క అంటే మట్టిగొట్టుకు పోతారండి. వాళ్ళకదో పిచ్చి! వాళ్ళకి సాయం చేయబోతే మనమూ అదే ఊబిలో పడతాం. వాళ్ళలాగా ఫుట్ ఫాత్ మీద నిలబడతామా ఏమిటి?" అంటూనో....

వాళ్ళు "దేశం, ధర్మం అంటూ ఏవో పెద్దమాటలు చెబుతారండి మనకెందుకు?" అంటూనో.... వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడానికి ఎవరో ఒకళ్ళు [మాటకారి వాళ్ళన్న మాట] ప్రయోగింపబడతారు. ఆ మాటకారి ప్రయోగించే సామదాన భేదం [దెబ్బలబ్బాయిలు]లు దాటి ఆలోచించటం, గూఢచర్యం తెలియని సామాన్యులకి కష్ట సాధ్యమే! ఇలా [indirect] పరోక్షంగా బ్రెయిన్ వాష్ చేయటాన్ని Tune చేయటం అనవచ్చు.

6]. అప్పటికీ ఎవరైనా, మంచితనం మీద నమ్మకంతో, మాకు సహాయం చేయటానికి నిలబడినా, మా వెన్నంటి ఉండడానికి, సహాయ సహాకారాలందించటానికి పూనుకున్నా.... ఇక అప్పుడు చేసే బ్రెయిన్ వాష్ మరోలా ఉంటుంది. "ఇది చాలా పెద్ద వ్యవహారం. మనకు అర్ధం కాదు" అని చెప్పబడుతుంది.

7]. ఒకోసారి డబ్బు కెరీర్ ల మీద ఆశకొద్దీ, మొదట మాకు కీడు చేయటానికి సిద్దపడినా, మధ్యలో భయం వేసి డ్రాప్ అయిపోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే, అలాంటప్పుడు, "ఇది ఒక సంకేత భాష! మనకు తెలియదు. చెప్పినట్లు చేయటం మేలు" అంటూ కాస్త అధికారం జోడించి మరీ చెబుతారు. "నీ పీక పిసుకుతూ ఇది ఒక సంకేత భాష. నీకు అర్ధం కాదు" అనటమే ఇది! లేకపోతే.... ’మంచేదో, చేడేదో, మనం చేసే పని మంచికి సాయం చేస్తుందో, చెడుకు చేయూత ఇస్తోందో తెలుసుకోవటానికి ఏ సంకేత భాష ఉంటుంది? అంతరాత్మ చాలదూ?’

[విచిత్రం ఏమిటంటే - ఇవన్నీ మా చెవికి చేరేటట్లు ఎవరో ఒకరు లీక్ చేసే వాళ్ళు. ‘అంతా ఫలానా అధికారి చేసాడు. అతడు చేయమంటేనే ఫలానా వాళ్ళు చేసారట, వాళ్ళు ఇప్పుడు బాధ పడుతున్నారు’ ఎవరో చెప్పారంటూ మాకు సమాచారం చేరేది. దాంతో, ఏ విధంగా ట్యూన్ చేస్తారో కూడా మాకు అవగాహనకి వచ్చింది.]

అప్పటికీ ఎవరైనా నిలబడితే, అప్పుడు "అబ్బే! అదేం కాదు. ఇదంతా శిక్షణలో ఓ భాగం" అని చెబుతారేమోనని మా అనుమానం.

ఇన్ని తంత్రాలూ.... మా మీద ప్రయోగించారు కాబట్టే, స్వానుభావం రీత్యా స్పష్టంగా చెప్పగలుగుతున్నాము.

కాకపోతే మా స్థానంలో పీవీజీ, నెం.5 వర్గం ఉంటే.... మాకు సాయం చేయాలనుకున్న సామాన్యుల స్థానంలో మేము ఉన్నాము. నెం.5 వర్గం కోసం మేము పనిచేయవద్దనీ, డ్రాప్ అయిపోమ్మనీ, అయిపోయి అప్పటి వరకూ మాకు తెలిసినదంతా తమకు చెప్పమనీ, మా మీద ఒత్తిడి నడిచింది. అదే - వేధింపు కేసుగా అడ్మినిస్టేషన్ లో రూపుదిద్దుకొంది. ఇందులో.... నెం.10 వర్గం అనుకుంటే భయపడమంటూ కొన్ని స్ట్రాటజీలనీ, నెం.5 వర్గం అనుకుంటే భ్రమపడమంటూ మరికొన్ని స్ట్రాటజీలనీ ప్రయోగించారు.

దీన్నే మరింత క్లుప్తంగా చెప్పాలంటే - నెం.10 వర్గం ముఖంపెట్టి భయపెడుతూ, నెం.5 వర్గం ముఖం పెట్టి భ్రమపడమంటూ.... మమ్మల్ని ఒత్తిడి చేసింది.... పీవీజీ స్థానంలో సోనియాని, సోనియా స్థానంలో పీవీజీని ప్రతిష్టించమని! పీవీజీ, రామోజీరావుతో కుమ్మక్కు అయిపోయి, 1992 నుండి 1996 వరకూ కూడా [అందులో 1993 నుండి 1995 వరకూ గుడిసెలో ఉంచింది పతాక స్థితి అన్నమాట] వేధించాడట. తదుపరి ఆ పాత్ర చంద్రబాబు తీసుకున్నాడట. తాము 1998 లో పార్టీ పగ్గాలు పట్టి, 2004 లో అధికారం చేపట్టి, వీరనారిలా పోరాడి.... పార్టీని, దేశాన్ని, మమ్మల్ని కాపాడేస్తున్నారట!

అందుచేత ‘పీవీజీ దేశద్రోహి, సోనియా గొప్ప తల్లి’ అని ఒప్పుకోవాలన్న మాట! ఇదే వత్తిడి మా మీద! దీన్ని ప్రయోగించేందుకే మాచుట్టూ ఉన్న సామాన్యుల నుండే, అవినీతికి లొంగే వారిని తమ తొత్తులుగా ఎంచుకున్నారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తులు.

చెడు చేయించటానికి ఆశ, ప్రలోభాలు చూపటం, సామదాన బేధ దండోపాయలు ప్రయోగించటం వంటి చెడు.... నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు ప్రయోగిస్తారు. కానీ మంచి చేయటానికి అలాంటి బలవంతపు ప్రయోగాలు నెం.5 వర్గం చేయదు. అలా చేస్తే అదే చెడు అవుతుంది కదా! చెడుతో మంచిని ఎలా చేయించగలం? మంచి గానీ, చెడు గానీ వ్యక్తి తన సంకల్పం మాత్రంతోనే చేయగలడు.

కాబట్టే మమ్మల్ని వేధించడం కానివ్వండి, దేశానికి కీడు చేయడం కానివ్వండి.... చేసే దుష్ట సంకల్పం, ఏ వ్యక్తికైనా ఉంటేనే, నకిలీ కణిక వ్యవస్థ చూపించే, భయ ప్రలోభాలకి పడతారు. ‘ధర్మగ్లాని చెయ్యకూడదూ, దేశద్రోహం చెయ్యకూడదు, చేయగలిగినంత మంచే చేయాలి’ అనే సత్సంకల్పం ఏ వ్యక్తికైనా ఉంటేనే.... దేవుడైనా, నెం.5 వర్గమైనా, మంచి చేసే అవకాశాన్ని సదరు వ్యక్తికి ఇస్తారు. అందుకే అది దైవేచ్ఛ అని వ్రాసాను.

ఏ విషయంలోనైనా ‘మంచి - చెడు’ ఏ దారిలో నడవాలన్నది వ్యక్తి సంకల్పమే! నిర్ధయం తీసుకున్నాకే నడక మొదలౌతుందీ, దారి విస్తరిస్తుంది. చెడు దారిన పోయే వారికి నకిలీ కణిక వ్యవస్థ చేయూత నిస్తుంది. నెం.5 వర్గం సువర్ణముఖి నిస్తుంది.

మంచి దారిన పోయే వారికి నెం.5 వర్గం చేయూత నిస్తుంది, నకిలీ కణిక వ్యవస్థ ప్రతీ అడుగులోనూ, ఆశా ప్రలోభాలని, భేద దండాలని ప్రయోగిస్తుంది. ఇది మా స్వానుభవం.

అందుకే "ఏమనిషైనా మారీచుడే! ‘రాముడి చేతిలో చావాలా? రావణుడి చేతిలో చావాలా?’ అన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి" అని వ్రాసాను గతటపాలలో. ఎందుకంటే ఏ దారిలో నడిచినా.... లాభనష్టాలుంటాయి, కష్ట సుఖాలుంటాయి. ఏది ఎక్కువ, ఎంత సుదీర్ఘం అన్నది, మంచి చెడుల్ని బట్టీ, పాప పుణ్యాలని బట్టీ ఉంటుంది. కాబట్టే నెం.5 వర్గం మా ప్రాణాలు కాపాడుతుందనుకున్నా, వేధింపు నుండి రక్షణకైనా, ప్రాణ రక్షణకైనా, మేము దైవాన్నే నమ్ముతాము. గీతలో చెప్పినట్లు ’యోగ క్షేమం మహామ్యహం’ శ్లోకాన్ని సదా మననంలో ఉంచుకుంటాము.

ఎందుకంటే మా చుట్టూ ఉండే సామాన్యులలో ఏ సంకల్పం కలగాలన్నా అది దైవేచ్ఛ ప్రకారమే కదా ఉంటుంది? బుద్ది కర్మానుసారిణి అనే లోకోక్తి ప్రకారం, మన గత జన్మ కర్మఫలాలని బట్టే మన బుద్ది, బుద్దిని బట్టే సంకల్పమూ, ఉండ వచ్చు గాక.... అన్నీ దైవేచ్ఛ ప్రకారమే నడుస్తాయి అనుకుంటే భద్రతగా అన్పిస్తుంది. అమ్మఒడిలో ఉన్నంత భద్రతగా!

కాబట్టే ఈశావాస్యోపనిషత్తు శాంతిమంత్రం గురించి వ్రాస్తూ, భగవంతుణ్ణి ’సున్న’తో పోల్చాను. ఎప్పుడు దైవం మీద నమ్మకం కోల్పోతే, పరిస్థితులని చూసి బెంగపడితే, అప్పుడు మాకు అన్నీశూన్యంగా అన్పిస్తాయి. చుట్టూ చీకటి తప్ప ఇంకేం లేదనిపించేంత నిరాశా నిస్పృహలు ఆవరిస్తాయి.

ఎప్పుడు తిరిగి మనస్సుని ధృఢ పరుచుకుంటామో, అప్పుడు అన్నీ వెలుగుతో నిండిపోతాయి. భగవంతుడు పరిపుర్ణుడై మా చుట్టూ పరుచుకొని ఉన్నట్లనిపిస్తుంది. అలాగే మా సమస్యలకీ ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది.

ఇందుకోసమేనేమో, 1993 నుండి 1995 వరకూ శ్రీశైలంలో గుడిసెలో బ్రతికిన రోజుల్లో, పీవీజీ మాకు ’ఎవ్వరి మీదా ఆధారపడని తనాన్ని నేర్పాడు" అనుకుంటూ ఉంటాము. అప్పట్లో దేవుడి మీద తప్ప ఎవరి మీదైనా.... మానసికంగానో, ఆర్ధికంగానో ఆధారపడితే, మరుక్షణం ఆ వ్యక్తితో మా సంబంధాలు తెగిపోయేవి.

బహుశః దాన్నే అనుకరిస్తూ రామోజీరావు.... 1996 తర్వాత, 2005 లో వెనుదిరిగి చూసుకుంటే, మేము ఎవరి గురించైనా ’మంచి’ అనుకుంటే... ఎవరి మీదనైనా పాజిటివ్ గా అబిప్రాయపడితే... మరుక్షణం వాళ్ళ నుండి చెడు ఎదురై తీరేటట్లుగా సంఘటనలు నిర్వహించాడు.

చివరికి ఫిర్యాదులలో సైతం, ఒకసారి మా ఫిర్యాదులకి సానుకూలంగా స్పందించిన వ్యక్తి, మరోసారికి వ్యతిరేక స్పందన చూపేవాడు. "వీళ్ళు నీ సమస్య పరిష్కరిస్తారనుకున్నావా?వీళ్ళు చేయరు" అన్నట్లుగా ఇది పరిణమించి, చివరకు రామోజీరావు తన ఏజంట్లతో సహా నిరూపించబడ్డాడు.

ఇప్పుడిప్పుడు, ఖచ్చితంగా చెప్పాలంటే బ్లాగులో మొత్తం విషయాన్ని బద్దలు కొడుతూ వ్రాస్తున్న తర్వాతే... పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అయినా గానీ, ఇప్పటికీ మా బ్లాగులో వ్యాఖ్యలు చూసినా.... నేను గత టపాలోనూ, ఈ టపాలోనూ వివరించిన స్ట్రాటజీలన్నీ ప్రయోగింపబడటం మీకు స్పష్టంగానే అర్దమౌతుంది.

పెయిడ్ పీపుల్ తో ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినా, స్పామ్ అయిపోయే కౌంటర్ తో క్లిక్కులు పడిపోయినా... ఇంద్రజిత్తు మాయా యుద్దం మాకు తెలుసు. మాపైన వ్యతిరేకత చూపుతూ కొన్ని వ్యాఖ్యలు, "మీరంటే మాకు అభిమానమమ్మా! ప్లీజమ్మ, దయ చేసి వ్రాయ వద్దమ్మా!" అంటూ కొన్ని వ్యాఖ్యలు వస్తుంటాయి.

ఇంతగా ఇప్పుడు మామీద దయా వర్షమో, సానుభూతి వరదో కురిపించే సహృదయలు, ఏడాదిన్నరగా వ్రాస్తున్న ఈ బ్లాగులో, కనీసం నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, నెం.5 వర్గం, గూఢచర్యం గట్రా పదాలు ఉదహరింపబడని మామూలు టపాలకు కూడా స్పందించిన వారు కారు. కనీసం నెం.10 వర్గం, నెం.5 వర్గాలని ఉటంకించక ముందు, సరిగ్గా ఏడాది క్రితం, కేవలం ‘పీవీజీ - రామోజీరావు - మా కథ’ వ్రాసిన టపాలలో కూడా, ఏ ఒక్కదానికీ కనీసం మాకు నైతిక మద్దతు చెబుతూ కూడా వ్యాఖ్య వ్రాసిన పాపాన పోలేదు.

ఇప్పుడు.... ఎవరికి నొప్పి కలిగిందో - అప్పుడు వచ్చి.... పప్ఫూ, నెయ్యి పెడతామంటూ జాలి కురిపించారు. నిజానికి ఇది నాకు వార్త ఉపసంపాదకుడు ఇంతకంటే స్పష్టంగానే చెప్పాడు. ఇవేవీ కాకుండా మేము సామాజిక స్పృహతో పైపై వార్తలు, కంటి తుడుపుగా గిరిజనలపై ప్రేమ, వారి అభివృద్ది కోసం వ్రాస్తే తాము ఇతోధికంగా గుర్తింపు ఇస్తామని! సన్మానాలు, సంపదకి కూడా కొరతేం రాదు మరి!

అదే మా బ్లాగులోనూ ’మీ విశ్లేషణాశక్తితో ఇవి గాకుండా ఇతరత్రా రాజకీయ విశ్లేషణలు చేయండి. లేదా కథలు వ్రాయండి’ అంటూ సలహాలు ఇస్తుంటారు. మూలాన్ని వదిలి, ఎప్పుడోకప్పుడు మామూలుగానే రాలిపడే ఆకులకి చికిత్స చేయమన్నట్లుగా!

రాజకీయ విశ్లేషణలంటే - సీపిఐ నారాయణ చికెన్ తింటాడా, మానేస్తాడా?, చిరంజీవి సినిమాల్లో నటిస్తాడా, మానేస్తాడా అనా? ఆ పాటి దానికి అంతర్జాలమెందుకు మాఇంటి ఆరుగు చాలదూ?

ఇది ఎలాంటిదంటే - ఇండో పాక్ యుద్దంలో, పాక్ ఓడిపోగానే రంగంలోకి దిగి శాస్త్రీజిని చర్చలకు తాష్కెంటుకు ఆహ్వానించిన రష్యా స్నేహపు స్ట్రాటజీ వంటిది. పాక్ కి నొప్పికలిగినపుడు రంగంలోకి దిగటం వంటిది. లేనట్లయితే వ్రాయవద్దని, నవ్వుకుంటున్నారని, మమ్మల్ని బ్రతిమాలవలసిన అవసరం ఎవరికీ ఉండదు. అంత అభిమానం ఉంటే ఇన్నాళ్ళు నిష్ర్కియాపరంగా ఉండరు.

ఎందుకంటే ఈ బ్లాగ్లోకంలో నన్ను ‘అక్కా’ అని నోరార పిలిచిన వాళ్ళున్నారు. ‘అమ్మా’ అని ఆత్మీయత పంచిన వాళ్ళున్నారు. ‘మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేనున్నానని మరిచిపోకండి’ అన్న వాళ్ళున్నారు. "నాయనా! నాకిది కావాలి?" అంటే మరుక్షణం చేసిన వాళ్ళున్నారు. మాట మాత్రం చెప్పకుండానే అమ్మఒడి.కామ్ ని డిజైన్ చేసి ప్రారంభించిన వాళ్ళున్నారు. "ఇది మీ పనే కాదు, మా పని కూడా!" అనే వాళ్ళున్నారు! "ఇదే దినచర్యగా మా కోసం ఇన్ని విషయాలు వ్రాస్తున్నారు. మీరు Born Tough అయితే నేను Born Soft. ఇది మీతో పాటూ మా పని కూడా!" అంటూ ముక్కూ ముఖం తెలియకపోయినా మాకు సహాయాన్ని అందించిన వారున్నారు.

మాకు సహాయం చేసిన వాళ్ళు - [అమ్మఒడి.కామ్ తో సహా] నలుగురే కావచ్చు గాక! మనం పోతే మోయటానికి నలుగురు కావాలంటారు పెద్దలు! నమ్మకాలు నిలబెట్టటానికి కూడా ’ఆ నలుగురు’ సరిపోతారు.

‘వట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్’ అన్న గుఱజాడ వారి మాటలు ఈనాటికీ నిజం చేస్తూ, రక్త సంబంధం కన్నా భావ సంబంధం గొప్పదని నిరూపించిన, నా తోటి సైనికులకి ఏమని కృతజ్ఞతలు చెప్పను? కన్నీళ్ళు చిప్పిల్లిన కళ్ళతో, మరోసారి అదే తెలుగు పదాన్ని ’కృతజ్ఞతలు’ అని వ్రాయడం తప్ప!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

రేపు నకిలీ కణిక వ్యవస్త వలన కెరియర్ పొందిన / ఏజెంట్ ల పేర్లను రాస్తాను

స్వర్గీయ పి. వి. నరసింహారావు గారు మీ బ్లాగులన్నీ చదవగలిగితే. . . . .

పి.వి. తాత ఢిల్లీలో ఉన్న కాలంలోనే - కంప్యూటర్ లో తెలుగు టైపింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించిన వైనాన్ని అప్పటి పత్రిక (పేరు గుర్తు లేదు) ప్రచురించింది.
ఆయనకు బాగా పరిచయమున్న తెలుగు పాత్రికేయులందరితోనూ రెగ్యులర్ గా follow-up చేసినట్టు ఆ వ్యాసకర్నూతెలిపారు.

కాబట్టి - తాతే బ్రతికుంటే, "అమ్మ ఒడి" తోబాటు "తాత - ఒడి / బడి" కూడా చదువుకునేవాళ్ళమనుకోవచ్చా?...

అమ్మా, మీరేమంటారు?.

నరసింహా [వేదుల బాలకృష్ణమూర్తి]గారు: మీరు వ్రాసిన ఈ వ్యాఖ్యలో మీ అనుభూతి లోతు నాకు అర్ధమైందండి. కొన్ని భావాలని మాటల కంటే మౌనమే బాగా ప్రకటిస్తుంది.

chanda-mama గారు: తాత ఎప్పటికీ సజీవుడే! కుట్రలన్నీ బహిర్గత పరచి ఒక్కొక్కళ్ళ తాట తీస్తున్నాడు. మనమే స్లో!:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu