లేకపోతే… ఆర్ధికవేత్త, మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నట్లు – “అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితికి లేమన్ బ్రదర్స్ సంస్థ విఫలమయ్యే పరిస్థితులు ఏర్పడటమే కారణమన్నారు. ఆర్ధికసంస్థలను ఆదుపులో ఉంచాల్సిన నియంత్రణ వ్యవస్థలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. అదే విధంగా మార్కెట్ వాస్తవ పరిస్థితిని సరైన అంచనా వేయకుండా రేటింగ్ ఏజన్సీలు ఇచ్ఛానుసారం రేటింగ్ లు ఇవ్వడంతో ఒక్కసారిగా బూమ్ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.”….[పైవార్త ఈనాడు, 24/06/09 నుండి యధాతధంగా గ్రహించడమైనది]

రేటింగ్ సంస్థలు ఇచ్చిన ర్యాంకింగ్ తో, లేమాన్ బ్రదర్స్ వంటి కంపెనీలు తమ లొసుగులు కప్పిపుచ్చుకుంటూ కొంతకాలం మనగలిగినాయి. దాంతో అవి కుప్పకూలాకా మొత్తంగా ప్రపంచమే ఆర్ధికమాంద్యంలోకి కూరుకుపోయింది. ఇది ఎలా సంభవం? ప్రపంచవ్యాప్తంగా వినియమ వస్తువులకు కలిగించిన కృత్రిమ డిమాండ్, అదేవిధంగా ఇల్లు, భూమి వంటి వాటికి సృష్టించిన కృత్రిమ ధరలు, వాటి పెరుగుదల, ‘వాస్తవాన్ని మరుగుపరుస్తూ, ప్రభావ పరుస్తూ కాగితాల మీద విపరీతంగా పెంచుకుపోయిన కంపెనీలు షేర్ల [వాటాల] ధరలూ’ ఆర్ధికమాంద్యానికి దారితీసాయన్న విశ్లేషణలు సైతం వింటున్నాం. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – కంపెనీల వాటాల ధరలని బట్టి బ్యాంకులలో వాటి క్రెడిబిలిటీ లిమిట్స్ ఉంటాయి. వాటా ధరలు పెరిగితే, కంపెనీల ఆస్థి విలువలు పెరిగినట్లు పరిగణించి, బ్యాంకులు, ఆయా కంపెనీలకి అప్పులు ఇస్తాయి. అందుకోసం కృత్రిమంగా, ’బుల్’ల సహాయసహకారాలతో, కంపెనీలు ‘తమ వాటాలని తామే అధికధరలకు కొనటం’ వంటి మోసాలకు పాల్పడుతుంటాయి. ఆ విధంగా షేర్ మార్కెట్లలో నడిచే కుంభకోణాల్లో 99.99% కంపెనీల ప్రమేయంతో నడిచేవే. అటువంటిది, ‘షేర్ మార్కెట్లలో ఫలానా కంపెనీ షేర్లు, ఫలానారోజు, అధికధర పలకడానికి, సెంటిమెంట్ లేదా పుకార్లు లేదా ఫలానా వార్త దోహదం చేసింది’ అన్న వార్తలు మనం వింటున్నాం, సంఘటనలు చూస్తున్నాం. అంటే అర్ధం ఏమిటి? పుకార్లనీ, వార్తల్ని, సెంట్ మెంట్ ని ప్రచారించగలిగింది ఎవరు, మీడియా గాక? అంటే షేర్ మార్కెట్లని నడుపుతోంది ఎవరు? మీడియానే కదా? అంటే నకిలీ కణిక వ్యవస్థలోని ప్రధాన రంగమే కదా ఇది కూడా?

‘లోభత్వానికి దాతృత్వమే పరిష్కారం’ అని పెద్దలంటారు. అంటే ఏ వస్తువు పట్లనైనా మనకి లోభత్వం అన్పిస్తే, వెంటనే దాన్ని దానం చేయాలట. అప్పుడు ఆ లోభగుణాన్ని మనం దాటగలుగుతామన్న మాట. ఇది అనుభవ సత్యం. అలాగే ప్రతీ అరిషడ్వర్గానికీ పరిష్కారాన్ని చెబుతారు మన పెద్దలు. ‘అసత్యవాదికి అవమానమే పరిష్కారం’ అంటారు. అంటే నిత్యం అబద్దాలాడే వాడిని అగౌరవించటం, హేళన చేయటం ద్వారా, లజ్జాపూరితుల్ని చేసి, వారిలో మార్పుతేవచ్చు అంటారు. అయితే ఈ వ్యూహం ఇప్పుడు ఫలించటం లేదులెండి. ఎందుకంటే వేశ్వాపుత్రుడు తొలితరం నకిలీ కణికుడైనందునా, దాసీ సంతతే నకిలీ కణికవంశంగా పరిణామం చెందినందునా, లజ్జారాహిత్యాన్నే[అంటే సిగ్గులేని తనాన్ని] ఓ గొప్ప అర్హతగా [క్యాలిఫీకేషన్ గా] ప్రచారం చేయటం ప్రస్తుత సమాజంలో ఉంది. పరిశీలించి చూడండి – మోసం చేస్తూ పట్టుబడినా, కుంభకోణంలో ఉన్న ప్రమేయం సాక్ష్యాధారాలతో సహా దొరికినా, ఏ రాజకీయ నాయకుడూ సిగ్గు పడటం లేదు. [లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుండి వందలూ, వేలల్లో ఉంది ఇలాంటి వారి సంఖ్య] మోసం చేస్తూ పట్టుబడిన వ్యాపారులూ సిగ్గుపడటం లేదు. ACB దాడుల్లో అక్రమార్జనలు వందలకోట్లు బయల్పడుతున్నా, చిన్నా చితక ఉద్యోగి దగ్గర నుండి ఉన్నతోద్యోగి వరకూ ఏ ప్రభుత్వ ఉద్యోగీ సిగ్గుపడటం లేదు. మీదుమిక్కిలి ’ఇన్ని వ్యవహారాలు నడుపుతున్నప్పుడు అప్పుడప్పుడు పట్టుబడతాం. అవన్నీ పట్టించుకోకూడదు. సిగ్గూ లజ్జా అంటే చిప్పెత్తు కోవాల్సిందే! పైకిరావాలంటే అవన్నీ ఆలోచించకోడదు’ అన్న ’సిద్దాంతం’ కూడా వింటున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని సృష్టిస్తున్న, నడుపుతున్న, నకిలీ కణికవ్యవస్థకీ ’లజ్జారాహిత్యం’ అన్నది ఆది నుండీ ఉన్న లక్షణం గనుక!

ఈ సందర్భంలో మరోమాట కూడా చెప్పుకోవాలి. ‘అహంకారికి తృణీకారమే పరిష్కారం’ అంటారు పెద్దలు. అంటే అహంకారంతో విర్రవిగే వాడికి, ఏ తర్కం చెప్పినా, ఏ సత్యం చెప్పినా, చూపినా, ఏ జ్ఞానం చెప్పినా తలకెక్కదు. అసలే అహంకారం జ్ఞానం విలోమానుపాతంలో ఉంటాయయ్యె. అటువంటి వాడికి, అంటే అహంకారికి, ఏం చెప్పి ఒప్పించగలం? అంచేత అలాంటి వాళ్ళని పట్టించుకోకపోవటమే సరైన మందని పెద్దలంటారు.

అలాగే గూఢచారిని బహిర్గత పరచటమే పరిష్కారం. గూఢచారి అంటేనే గూఢంగా చరించే వాడు అని అర్ధం. రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించటం, నిగూఢంగా ప్రవర్తించటం గూఢచారి లక్షణాలు. కాబట్టి గూఢచారికి, గూఢచర్యానికి వాటిని బహిర్గతపరచటమే, expose చేయటమే సరైన మందు. కాబట్టే పీవీజీ ఇదే మార్గంగా ఎంచుకున్నారు. అదే నెం.5 వర్గం, ప్రపంచవ్యాప్తంగా, ఇన్ని సంవత్సరాలుగా అంటే 17 ఏళ్ళుగా చేస్తోంది.

ఇక్కడ గమనార్హం ఏమిటంటే నకిలీ కణిక-7 కి, అతడి నెం.10 వర్గానికి, తమ హయాం వచ్చేనాటికీ పటిష్ఠంగా నిర్మింపబడిన, full pledged గా assemble చేయబడిన డి.వి.డి. వంటి గూఢచార నెట్ వర్క్ ని ప్రయోగించటమే వచ్చు. రిమోట్ ఉపయోగించి ఆపరేట్ చేయడాన్నే గొప్ప గూఢచర్యంగా భావించి విర్రవీగడం వచ్చు. భూగోళాన్నంతా తన చిటికిన వేలిమీద తిప్పుతున్నానన్న పెర్వెర్షన్ తో, నకిలీ కణిక-7, ఓ విధమైన ఉన్మదానందాన్ని కూడా పొందేవాడు. అన్నట్లు ఇతడికి ఇలాంటి సైకోపాత్ లన్నా, సైకో ఉదంతాలన్న చాలా ఇష్టం కూడాను. ప్రపంచవ్యాప్తంగా, అన్ని భాషల్లో, వరుసహత్యలు చేసే సైకో పాత్ లని హీరోలుగా చూపే కథలతో ఎన్నో సినిమాలను ఈ నకిలీ కణిక వ్యవస్థ ప్రోత్సహించింది. తాము చిన్నతనంలో ఓ ఆడదాని చేతిలో లేదా కొందరు ఆడవాళ్ళ కారణంగా దగాపడ్డారట. దాంతో పెద్దయ్యాక వరుసగా ఆడవాళ్ళని హత్యలు చేస్తుంటారు. లేదా మగవాళ్ళని వరుసగా హత్యచేసే స్త్రీ హంతకులు హీరో/హీరోయిన్ గా సినిమాలు వచ్చేవి. అదేదో, తమ భావోద్రేకాలన్నిటినీ పారవేయటానికి సమాజం తమ చెత్తకుండీ[Dust Bin] అయినట్లు! తమకి అన్యాయం జరిగితే అమాయకుల మీదెందుకు ప్రతీకారం తీర్చుకోవటం? ఇలాంటి ఉన్మాద కథలూ, ఉదంతాలు నకిలీ కణిక-7 కీ, అతడి నెం.10 వర్గానికి చాలా ఇష్టం. ఇలాంటి ఈ నకిలీ కణిక-7 కి ఎదురుదెబ్బ తగిలితే ఏం చెయ్యాలో, అందుకు తగిన కొత్త గూఢచర్యాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలియదు.

అయితే పీవీజీ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్ని, పురాణ ఐతిహాసిక వేదాంతసారాన్ని, అర్ధం చేసుకున్న జ్ఞాని. గూఢచార జ్ఞానానికి మూలాలు తెలిసిన రాజనీతిజ్ఞుడు. కాబట్టి నెం.5 వర్గాన్ని, నకిలీ కణికుడి గూఢచార వలయాన్ని తుత్తునియలు చేయగల ప్రతి వలయాన్ని నిర్మించాడు. క్రమంగా నెం.10 వర్గంలో…. ఎవరు ఎవరో, ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారో, ఎవరికీ అర్ధం గాకుండా పోయింది. తమ వలయంలోకి ఎందరు ’officer under cover’ లాంటి ఏజంట్లు, వ్యక్తులు చేరారో తెలియదు. తాము అంతవరకూ గుప్తంగా దాచుకుని, ఉపయోగించుకుంటున్న సమాచార సాంకేతికత, ప్రపంచపునట్టింట ప్రతిష్ఠింపబడింది. ప్రతీ ముంగిట్లోకి, ఇంకా చెప్పాలంటే ప్రతీ అరచేతిలోకీ అందుబాటులోకి వచ్చేసింది.

ఇక్కడ ఓ పోలిక చెబుతాను. కొంతకాలం క్రితం మణిరత్నం[తిరుడా తిరుడా] ’దొంగా దొంగా’ అన్న సినిమా తీసాడు. అందులో రిజర్వ్ బ్యాంకు నుండి తీసుకు రాబడిన కొత్త కరెన్సీ నోట్లతో[డబ్బుతో] నిండిన కంటైనర్ దొంగతనానికి గురవుతుంది. దాన్ని గురించి శోధించడానికి వచ్చిన సి.బి.ఐ. ఉన్నతాధికారి[ఎస్.పి.బాల సుబ్రమణ్యం ఈ పాత్ర పోషించాడు], కంటైనర్ కనబడిందన్న సమాచారాన్ని అనుసరిస్తూ ఓ ఊరు చేరతాడు. అక్కడ అతడు ‘డబ్బుతో నిండిన కంటైనర్ ఆ ప్రాంతంలో ఎక్కడో ఉందని’ ప్రజలందరికీ తెలిసీపోయేలా, విషయాన్ని బహిరంగం చేస్తాడు. చేస్తూ “ఇక ఆ కంటైనర్ ఈ ఊరు దాటి పోలేదు. ప్రజలే కాపలా కాసి మరీ పట్టుకుంటారు” అంటాడు. ఇక్కడ నకిలీ కణిక-7 కు సంబంధించిన గూఢచార వలయం, అతడి నెం.10 వర్గం, అందులోని ఏజంట్ల విషయం ఇలాంటిదే!

ఈ విధంగా నకిలీ కణికుడి గూఢచార వలయాన్ని, వారి ఏజంట్ల కార్యకలాపాలని బహిరంగపరచడం, ఈ 17 ఏళ్ళుగా అనుశృతంగా నడుస్తోంది. ఇందులో మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆత్మహత్యా సదృశ్య కర్తవ్యాలు[suicidal Assignments]. గూఢచర్యంలో ఏ ఏజంట్ అయినా తనకి వచ్చిన Assignments తాను నిర్వహించకుండా, వ్యతిరేకించినా, తాత్సారం చేసినా, గునిసినా, మరింతగా అతడి పరిస్థితి క్షీణిస్తుంది. అంటే ఏదైనా Assignments తనకి అప్పటికి disadvantage గా అన్పించి, నిర్వహించడానికి తిరస్కరించడం లేదా తాత్సారం చేయటం లేదా నసగటం చేసాడనుకొండి. అతడి పరిస్థితి మరింతగా రోడ్డుకి ఈడ్వబడుతుంది. మరింతగా పెనం మీద నుండి పొయ్యిలోకి పడతాడన్న మాట. అందుచేతనే ఏ ఏజంట్ అయినా తనకి ఇవ్వబడిన Assignments అప్పటికి తనకి disadvantage గా అన్పించినా ’ఇప్పటికి disadvantage గా కన్పించినా పరిణామక్రమంలో advantage అవుతుంది’ అని సరిపెట్టుకుంటాడు. లేదా ’ఏంజరుగుతుందో, ఎలా జరిపించాలో బాస్ కి లేదా ఏజన్సీకి తెలుసు. చెప్పిన పని/assignment నిర్వహించటం. విధేయత చూపిస్తే ఏరోజునైనా ఫలితం ఉంటుంది’ అనుకుంటాడు. లేదా ’ఒకవేళ ఇప్పుడు ఏజన్సీ నన్ను డ్రాప్ చేయటానికే ఈ Assignment ఇచ్చింది అనుకున్నా, నేను చేయగలిగింది ఏముంది? కాదన్నా తొక్కేస్తారు. ఇప్పటి వరకూ ఇంత ’సీన్’ అన్నా ఇచ్చారు. ఇదే ఇవ్వకపోయి ఉంటే ఫలానా నాతోటి వాడిలాగే నేనూ పడుండేవాణ్ణి కదా! కాబట్టి ఇచ్చిన assignment నిర్వహించటమే సేఫ్. లేక పోతే క్రితంలో ఇరుక్కున్న లొసుగుల్నీ, చేసిన తప్పుల్నీ బయటపెట్టి నామారూపాల్లేకుండా చేస్తారు’ అనుకుంటాడు.

అందుచేత – నోరు మూసుకుని, ఒళ్ళుదగ్గర పెట్టుకుని ఇచ్చిన Assignment నిర్వహిస్తాడు. ఒకోసారి అది Assignment అన్న విషయం కూడా తెలుసుకోలేనంతగా అటువైపు డ్రైవ్ చెయ్యబడతాడు.

ఇక్కడ ఓ జోక్ చెబుతాను. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ’సింహాద్రి’ సినిమాలో, కేరళలోని ప్రకృతి చికిత్సా కేంద్రానికి హీరో జూ.ఎన్టీఆర్, అతడి అనుచరుడు కమేడియన్ బ్రహ్మానందం వెళతారు. అక్కడ మరో కమెడియన్ వేణుమాధవ్, అప్పటికే కాళ్ళు చచ్చుబడిపోయాయనే వంకతో చేరి, ఎంచక్కా జీడిపప్పు, పాలు వంటి రుచికరమైన బలవర్థకమైన ఆహారం ఆస్వాదిస్తూ, తైల మర్ధనలు చేయించుకుంటూ ఉంటాడు. హీరో కూడా దొంగరోగం చెప్పి అక్కడ చేరటం తెలుసుకున్న వేణుమాధవ్, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఆ సందర్భంలో అతడు బ్రహ్మానందాన్ని ’మళ్ళీ మాట్లాడా వంటే గొంతుమీద కాలేసి తొక్కుతాను. ఓహ్! నాకు కాళ్ళు పనిచేయవు కదా! అయితే ఓ పని చెయ్యరా! నీ గొంతు మీద నువ్వే కాలేసుకుని తొక్కుకో!” అంటాడు. ఆ డైలాగ్ ని అతడన్న తీరుకీ, అది విని బ్రహ్మానందం పెట్టిన ఎక్స్ ప్రెషన్ చూసీ, మనకి విరగ నవ్వొస్తుంది.

నిజజీవితంలో ఎవరికి వారు ‘తమ గొంతు మీద తామే కాలేసుకుని తొక్కుకోవటం’ సాధ్యం కాదు గానీ, గూఢచర్యంలో అది సాధ్యమే. వాటినే suicidal assignments గానూ, ఆత్మహత్యా సదృశ్య కర్తవ్యాలు గానూ వర్ణించాను. ఆ స్ట్రాటజీనే అద్వానీ పాకిస్తాన్ వెళ్ళి ‘జిన్నా జిందాబాద్’ అంటూ జిన్నా మీద గౌరవం ప్రకటించటంలోనూ, చాలా సార్లు, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాననటంలోనూ మనం చూస్తున్నాం. 2009 ఎన్నికల ముందు, పొత్తుల వ్యవహారంలో ప్రతిపక్షాల మధ్య, అధికార కాంగ్రెస్ వ్యవహారంలోనూ చూసాం. ఇంకా వీటి జాబితా చెప్పాలంటే అది సుదీర్ఘమైనది. అయినా పరిశీలించదగినది.

స్పష్టంగా చెప్పాలంటే ఈ జాబితా ఇప్పటివరకూ నేను మీకు వివరించిన నకిలీ కణికులూ, వారి వ్యవస్థ గురించిన ప్రతిపాదనలకి దృష్టాంతాల వంటిది. నకిలీ కణికుడి ఏజంట్లు, ఏ స్థాయిలో ఉన్నవారైనా కానివ్వండి, ప్రపంచస్థాయి నాయకుల దగ్గర నుండి, ఢిల్లీలో ప్రధాని పీఠంలో కూర్చొని ఉన్న వ్యక్తి దగ్గర నుండి, దిగువస్థాయి రాజకీయ నాయకుని వరకూ, బడా పారిశ్రామికవేత్త నుండి విదేశీ మాఫీయా లీడరు వరకూ, అందరికీ ఇవ్వబడుతున్న ఈ ఆత్మహత్య సదృశ్య అసైన్ మెంట్లు కారణంగానే కుట్రలో వారి ప్రమేయమూ, కుట్ర స్వరూపమూ స్పష్టంగా బహిర్గతమౌతున్నాయి. ఈ దృష్టాంతాల జాబితా[circumstantial] చెప్పేముందు మరి కొన్ని విషయాలు చెప్పాలి. ఈ స్ట్రాటజీలో ఉన్న భారతీయ తత్త్వ చింతన గురించి చెప్పాలి.

నకిలీ కణికుడు, అతడి వ్యవస్థ, అతడి ఏజంట్లు, ప్రస్తుతం ఈడుస్తున్న దినదిన గండం నూరేళ్ళు ఆయుష్షుని గానీ, జారిపోతున్న వారి పట్టుని [గ్రిప్] గానీ, బహిర్గతమౌతున్న వాళ్ళ స్ట్రాటజీని గానీ, ఆ ఏజంట్ల సర్కస్ ఫీట్లు వంటి విన్యాసాలు గానీ, వాళ్ళ [suicidal assignments] ఆత్మహత్య సదృశ్య స్వయంకృతాలు గానీ అర్ధం చేసుకోవాలంటే, ముందుగా భారతీయ తత్త్వ చింతనని గుర్తుకు తెచ్చుకోవలసి ఉంటుంది. ‘అనుభవమైతే గానీ తత్త్వం బోధ పడదంటారు’ పెద్దలు. అలాగే ‘తత్త్వం బోధపడితే గానీ సత్యం కళ్ళకు కనబడదు’. అందుకే గతటపాలో నకిలీ కణికుడు, అతడి వ్యవస్థా, ఆ ఏజంట్ల ప్రస్తుత పరిస్థితులు అర్ధం చేసుకోవాలంటే, దాని పూర్వాపరాలు ముందు తెలుసుకోవాలని వ్రాసాను. నిజానికి అవి పూర్వాపరాలు కాదు, పునాదులు.

అందుచేత ముందుగా ఆ పునాదుల గురించి చెబుతాను.

భారతీయులుగా మనం వేలసంవత్సరాల నుండి భగవద్గీతని నమ్ముతాం. భగవంతుడి శక్తిని, సత్యాన్ని నమ్ముతాం. కొన్ని నమ్మకాల పునాదుల మీద జీవన రమ్యహర్య్మాన్ని నిర్మించుకుంటాం. భారతీయుల రక్తంలో ఉంది ఈ నమ్మకాలతో కూడిన దృక్పధమే. అది చేటవంటిది. ప్రతిదానిలో చెడుని వదిలేసి మంచిని గ్రహించేటటువంటి బుద్ది. ఇలాంటి దృక్పధాన్ని, పురాణేతిహాసాలు, పండగలు, జీవన సరళి క్షణక్షణం సమాజానికి, వ్యక్తులకి నూరిపోసేవి. కాబట్టే ఆ రోజుల్లో సర్వసంగ పరిత్యాగులు ఏంచెప్పినా ప్రజలు నమ్మేవాళ్ళు. అలాగే యోగులూ సామాజిక హితవు చెప్పేవాళ్ళు. ’సంసారమే త్యజించిన వారికి స్వార్ధం ఉండదు కదా! అందునా యోగి! ఇతడు మన హితవు కోరి చెబుతాడు. సత్యమే చెబుతాడు. మనం తిరగని ప్రాంతాలు ఇతడు తిరిగాడు. కాబట్టి మనకంటే ఇతడికి ఎక్కువ తెలుసు’ – ఇదీ యోగులని విశ్వసించటంలో ప్రజల దృక్పధం. అయితే క్రమంగా ఆ స్థానాన్ని మీడియా ఆక్రమించాక, మంచి స్థానే చెడు ఎలా ఆక్రమించిందో, అదే నకిలీ కణికుడికి ఎలా మూలబలం అయ్యిందో తెలుసుకోవాలంటే – ఆ మీడియా మరుగుపరచిన భారతీయ తత్త్వ చింతనని, తాత్త్విక మూలాలని, నమ్మకాల పునాదులని ఒకసారి పునః పరిశీలించాలి, జప్తికి తెచ్చుకోవాలి.

’చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు’, ’చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!’ అంటారు పెద్దలు. అంటే మనమేం చేస్తే ఆ ఫలితమే పొందుతామని దాని అర్ధం. మంచికి మంచి, చెడుకి చెడూ! మనకున్న ప్రసిద్ధ పుణ్యకేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. ధూర్జటికవి పుణ్యమా అని శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహాత్మ్యమూ అలా నిలిచి ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రం దగ్గర సువర్ణ ముఖి నది ప్రవహిస్తోంది. ఇప్పుడంటే నీళ్ళు లేక, ఇసుక పర్రలతో కన్పిస్తోంది గాని, ఒకప్పుడు నీటిగలగలలతో శ్రవణపేయంగా ఉండేది. ఆ నదికి, ఆ గుడికి సంబంధించిన [విశేషం] కథ ఇది –

సర్పం, ఏనుగుల భక్తి పోరాటంతో ప్రసిద్దమైన ఈ ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు, వేలాదిగా శిల్పులూ, కూలీలు, ప్రజలు కూడా ఆ నిర్మాణ పనుల్లో పాలుపంచుకునేవారట. సూర్యాస్తమయ వేళ, పనులు ముగించి, నదిలో కాళ్ళు చేతులూ కడుగుకొని, దోసిలిలో నీళ్ళు తీస్తే, ఆ దోసిట్లో తాము ఆ రోజు పడిన శ్రమకు తగిన కూలీ, బంగారు నాణాల రూపేణా దొరికేదట. ఎవరెంత పనిచేస్తే అంతగా! ఎక్కువపని చేసిన వారికి ఎక్కువ నాణాలు, తక్కువ పనిచేసిన వారికి తక్కువ నాణాలు. అందుకే ఆ నదికి ’సువర్ణముఖి’ అన్న పేరు వచ్చిందట. పనిచెయ్యకుండా… చేసినట్లు నటిస్తే, లేదా మేస్త్రీ[పైఅధికారి]కి కాకా కొడితే పైఅధికారి డబ్బు ఇస్తాడేమో గానీ భగవంతుడివ్వడుగా![పైఅధికారి ఇచ్చింది కూడా వచ్చిన దారిలోనే పోవడం కద్దు. ఈ వైచిత్రి చూడగల కళ్ళుండాలి అంతే!] అంచేత ఈ పైరవీలన్నీ సువర్ణముఖి నది దగ్గర చెల్లేవి కాదన్నమాట.

ఈ కథ[విశేషం] చెబుతూ పెద్దలు “ఎవరు చూసినా చూడకపోయినా మనమేం చేస్తున్నామో భగవంతుడు చూస్తాడు. ఇవ్వాల్సిందే ఇస్తాడు. తస్మాత్ జాగ్రత్త!” అని చెప్పేవారు. కాబట్టే మనం చేసిన మంచి, తరతరాలు మన పిల్లాపాపల్ని కాపాడుతుంది. చేసుకున్న చెడు భావితరాలని కూడా కట్టికుడుపుతుంది. అందుకే పాపభీతి, దైవభక్తి, పుణ్యప్రీతి ఉండాలి అనుకునేవాళ్ళు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు – దీన్ని తమ జీవితాల్లోనూ, చుట్టూ అందరి జీవితాల్లోనూ పరిశీలించగలిగినా లేకపోయినా, ఇది సత్యం. సోదాహరణంగా కనబడినప్పుడయినా, దీన్ని నమ్మకతప్పదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

పిల్లలకు పాఠాలు చెప్పడంలో నిమగ్నమయి టపాలు తగ్గినట్లున్నాయనుకుంటా !

అవునండి, మీ పరిశీలన నిజమే. ఈ మధ్య కాలేజీలో లెక్చరర్ గా చేరాను. కొంచెం పని ఒత్తిడి పెరిగింది. అంచేత టపాలు తగ్గాయి. పెంచే ప్రయత్నం చేస్తాను. మీ బ్లాగుకు సంవత్సరం నిండిన సందర్భంగా మీకు జేజేలు. మీ చిన్నికృష్ణుడంటే మాకూ చాలా ఇష్టం. కళాఖండాలు, చక్కని చిత్రాలతో బాగా ఆలరించారు. నెనర్లు.

తెలిసిన వాడు ఎప్పుడైనా, ఎవడో ఒక్కడైనా మంచి చెప్తుంటాడు. అందుకే వినే వాళ్ళు లేకుండా చేయడం అనే పనిని సమర్ధం గా నిర్వహిస్తోంది మన మీడియా. పైకి మాత్రం తెలుగు వెలుగు, అంతర్యానం అంటూ తామూ భారతీయ అధ్యాత్మిక వాదానికి ఇతోధికంగా తోడ్పడుతున్నాం అంటారు. కానీ మీరన్నట్టు అది ఇంకా ఎంతమంది దీనిగురించి అలోచిస్తున్నారు అని తెలుసుకోవడానికే అన్నట్టు ఉంటుంది.రోజూ భక్తి టివిలో రాత్రి తొమ్మిదింటికి రామయణం ప్రవచనం వస్తుంది. అదే టైమ్ కి జీ తెలుగు లో ఆట కార్యక్రమం వస్తుంది(సోమ, మంగళ వారాల్లో). ఆ ఆట ప్రోగ్రామ్ చూస్తే కొన్ని కొన్ని సార్లు ఒళ్ళంతా కంపరం పుడుతుంది. చిన్న చిన్న పిల్లలకి కూడా జానాబెత్తెడు డ్రెస్సులు వేసి డాన్సులు వేపిస్తుంటారు. ఎంత కృతకంగా ఉంటుందో. నా చిన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రాం వస్తే ఇంటిల్లిపాదీ కలిసి చూడటానికి కొంచెం జంకేవారు.కానీ మీరు చెప్పిన స్ట్రాటజీ(ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం) పుణ్యమా అని ఇప్పుడు సాయంత్రమైతే ఢీ, ఆట..(పేరేదైతేనేం లెండి). ఎప్పుడైనా కాలం కలిసి వస్తే(కలిసి వస్తేనా, పోయే కాలం వస్తేనా) , తమ పిల్లల్ని కూడా పంపాలని చూస్తున్నవారే ఎక్కువ. ఇంతకు ముందు నాట్యం అంటే ఒక ఆరంగేట్రం, ఆరాధనోత్సవాలలో,పండుగలలో నాట్యం చెయ్యడం ఉండేవి, మరి ఇప్పుడో ఒక్క రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేస్తే రాష్ట్రం అంతా మన పిల్లల పేరు మారు మోగిపోతుంది అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇంకా కొన్ని ఇళ్ళలో "నువ్వూ ఉన్నావ్ ఎందుకూ, నీ వయసు వాళ్ళు చూడు ఎలా డాన్స్ చేస్తున్నారో" అని అనడం కూడా నాకు తెలుసు.
యధా రాజా తధా ప్రజా అన్నట్టు ముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చూస్తారో పిల్లలు కూడా అదే చే(చూ)స్తారు. చాలామంది పిల్లలు మా ఇంట్లో మా నాన్నే చెయ్యడు , నేనెందుకు చెయ్యాలి అనడం నేనెరుగుదును. అదే ఆ తండ్రి రోజూ రామాయణం చూస్తాడనుకోండి, చిన్నప్పుడు పిల్లవాడూ చూస్తాడు. వాడికి రామాయణం గొప్పతనం తెలుస్తుంది, ఒకవేళ తెలియకపోయినా ఒక అవగాహన వస్తుంది. తెలుసుకోవాలనే జిజ్ఙాస పెరుగుతుంది,ఫలితంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన జిజ్ఙాసువు దశకు చేరుకుంటాడు. ఆ తండ్రి కుదిరినప్పుడు పిల్లవాడిని వొళ్ళో కూర్చోపెట్టుకుని రామాయణంలో సగరుల కధ చెప్తే పిల్లలకి తొందరపాటు ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది. గంగావతరణం చెప్తే భగీరధుడు ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది, ఒక పని అనుకుంటే ఎంత కష్టపడి అయినా చెయ్యాలి అనే సామర్ధ్యం వస్తుంది. అలాగే విశ్వామిత్రుడి కధ చెప్తే ఒక మనిషి భాదకి కారణం ఎదుటివారు కాదని, అరిషడ్వర్గాలే అని, వాటిని జయించగలిగితే అదే పరబ్రహ్మ లో ఐక్యం అవ్వడం అని తెలుస్తుంది. ఒక అగస్త్యుడి గురించి, దేవతలే ఆయన అశ్రమానికి వచ్చి తపస్సు చేసుకునే వారని చెప్తే ఉపాసన బలం, తపస్సు అంటే ఏంటో తెలుస్తాయి. కబంధుడి గురించి చెప్తే శక్తిని దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. సంపాతిని గురించి చెప్తే అసలు ఓపిక అంటే ఏంటో తెలుస్తుంది,తోడబుట్టిన వాడిమీద ఏలాంటి ప్రేమ ఉండాలో తెలుస్తుంది. తమ్ముడిని రక్షించ్చాలని సూర్యుడికి అడ్డుగా వెళ్ళి తన రెక్కలు కాల్చుకున్నాడు సంపాతి. నిశాకర మహర్షి ఎప్పటికో రామ కార్యమ్ మీద వానరులు వస్తారు వారికి సహాయమ్ చేస్తే నీ రెక్కలు వస్తాయి అని చెప్తే అప్పటినుండి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. కొడుకు తీసుకువచ్చే తిండి, ఎగరలేని తనం , పైన ఎన్నాళ్ళు వెయిట్ చెయ్యాలో తెలియదు, ఐనా సంపాతి వెయిట్ చేశాడు. ఇలాంటి కధ చెప్తే పిల్లలకి ఓర్పు అనే దానిమీద అవగాహన రాదా, కొంతమందికి చాలా గర్వం వాళ్ళ పిల్లలు అసలు వెయిట్ చెయ్యలేరని,"మా వాడికి బ్రేక్ ఫాస్ట్ కొంచెం లేటయితే చాలు ప్లేట్లన్నీ కలగాపులగం చేసేస్తాడండీ" అని ఒక్కొక్క తల్లీ,తండ్రీ ఎంత గొప్పగా చెప్పుకుంటారో, ఏమిటి దీనిలో గొప్ప.
ఒక్క రామాయణం లోనే ఇలాంటి కధలు కోకొల్లలు.ఇక సుందరకాండ గురించి ఎంత గొప్పగా చెప్పవచ్చు మీరే అలోచించండి. సుఖాల వల్ల వచ్చే మరుపు,(మైనాకం). బాధల వల్ల వచ్చే దుఃఖం(సీతమ్మ కనపడక హనుమ ప్రాయోపవేశం చేద్దామనుకోవడం), తర్వాత హనుమకు సీతమ్మ కనపడటం, ఈ మధ్యలో రావణుడినీ, సీతనీ, హనుమనీ, రాముడినీ అడ్డుపెట్టుకొని వాల్మీకి మహర్షి చెప్పిన జీవిత సూత్రాలు, ఎలా బతకాలో, ఎలా బతికితే ఎలా ఉంటామో కళ్ళముందు కనిపిస్తాయి. ఇవ్వాళ్టి రోజున పిల్లలు , ముఖ్యంగా యువత పాడైపోతుందని గగ్గోలు పెట్టేవాళ్ళంతా ఈ విషయాలమీద ఎందుకు కాంసట్రేట్ చెయ్యరు?
ఒక్క అయోధ్యకాండ, అరణ్యకాండ సరిగ్గా అర్ధమయ్యేలా చెప్పగలిగితే ఆడైనా,మగైనా గృహస్థాశ్రమంలోకి వెళ్తే ఎలా ప్రవర్తించాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, వారిని ఎలా గౌరవించాలి. భర్తను అనుసరించడం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇన్ని తెలిసిన వాడురేపు పొద్దున్న పెళ్ళి చేసుకున్నాక ఏదన్నా సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకొవాలో సమర్ధవంతంగా ఆలోచించగలడు/దు. కాదంటారా? రామాయణ , భారత పురాణ ఇతిహాసాదులు మనిషిని సన్మార్గం వైపు నడిపించడానికి, మన జీవితాలని చక్కదిద్దుకోవడానికే గాని ఏదో కధల్లాగా చదివి ఊరుకోవడానికి కాదు.

manohar garu
comment raadamani vasthe rendu post lu chadivela chesesaru
oka manchi post ni endukandi ila comment ga raasesaru mee istam

మనోహర్ గారు,

మీరు చక్కగా చెప్పారు. రామాయణ, భారత, భాగవతం, భగవద్గీతలు మనం ఎన్ని సార్లు చదివితే, ప్రతీసారి విభిన్నమైన ఆలోచనలు వస్తాయి. మన ప్రతీ సమస్యకు పరిష్కారాలు కన్పిస్తాయి కూడా. నాదో విన్నపం మీరు వ్రాసిన వ్యాఖ్యను మరింత విపులంగా, టపా వ్రాస్తే బాగుంటుంది. ఆపై మీఇష్టం. నెనర్లు.

ఇదే ఏదో అలా వచ్చేసింది. రామాయణం మీద బ్బ్లాగు రాద్దామనుకున్నాను కానీ కుదరలేదు. అనుకోకుండా మీబ్లాగు దానికి వేదికైంది. విడిగా ఒక బ్లాగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu