ఈ మధ్య ‘సాక్షి’ ఫ్యామీలీ పేజీల్లో ‘డైలీ స్టోరీ – ప్రతీ రోజూ ఓ కథాపరిచయం’ పేరిట, మంచి ముత్యాల్లాంటి కథలు కొన్నిటిని పరిచయం చేస్తోంది. వాటిలో డిసెంబరు 4 వ తేదీన నాగప్ప గారి సుందర్రాజు గారు వ్రాసిన ‘మగాళ్ళు సిద్ధంగా ఉన్నారు’ కథ చదివినప్పుడు మనస్సు కలిచి వేసింది.

ఆ సమీక్ష ఓ సారి పరీక్షించదలిస్తే…


~~~~~~~

ఏ కాలంలో అయినా, ఏ సమాజంలో అయినా ఏ వర్గానికి తమ పట్టు నడిస్తే… ఆ వర్గానికి, అహం బలిసి పోవటం మానవ నైజం. అది అగ్ర వర్గాంహకారామైనా, అణగారిన వర్గాల అహంకారమైనా!

అగ్ర వర్ణాంహకారమూ, పురుషాంకారమూ కలగలిసిన… బసివిని, మాతంగి, దేవదాసి గట్రా… ఏ పేరుతో పిలిచినా, ఊరమ్మడి వేశ్యగా ఆడపిల్లల ఉసురు పోసుకున్న దురాచారాన్ని గురించిన కథ – ‘మగాళ్ళు సిద్ధంగా ఉన్నారు’.

అది చదివినప్పుడు… “శతాబ్దాలుగా… ఎందరు స్త్రీల కన్నీరు కాల్వలు కట్టి ప్రవహించిందో! ఆ నీరంతా ఒకచోట చేరిస్తే ఓ సముద్రమంత అవదూ!?” అనిపించింది.

నిజంగా… ఆ ఆడబిడ్డల కన్నవాళ్ళు గానీ, ఊళ్ళో ఉన్నవాళ్ళు గానీ… ఎవరూ వాళ్ళ గురించి తలచలేదే? దాదాపుగా, స్వాతంత్ర సమర సమయం వచ్చే వరకూ కొనసాగిన ఈ దుష్టాచారంలో… రఘపతి వెంకటరత్నం, గాడిచర్ల హరి సర్వోత్తమ రావుల వంటి వాళ్ళు గొంతులెత్తి కృషి చేసే వరకూ… ఎందరు దేశ్ ముఖ్ ల, పెద్ది రెడ్డిల, చౌదరి బాబుల, చిన్న నాయుళ్ళ చేతుల్లో, ఎందరు ‘కమ్లి’లు, ‘బోడెక్క’లూ నలిగి పోయారో!

ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు స్పందించలేదు, అడ్డగించనూ లేదు. బహుశః అసహ్యంచుకొని ఉంటారేమో! అదీ సదరు అభాగినులనే గానీ… తమ మొగుళ్ళనీ, తమ ఇంటి మగవాళ్ళనీ అయి ఉండదేమో! కొందరన్నా సానుభూతి కలిగి ఉన్నా, సాటి ఆడవాళ్ళ కన్నీరు తుడవగలిగేంత అయి ఉండదు. కాబట్టే – దేవదాసీ వ్యవస్థ అనుశృతంగా కొనసాగింది.

ఇక మగవాళ్ళు…

దున్నపోతు కూరాకు కోసం ఎగబడిన మాదిగ వాళ్ళలాగా…

ఆడపిల్ల శరీరం కోసం ఎగబడిన మగాళ్ళు!

తమ తల్లీ, చెల్లీ, కూతురు, మనవరాళ్ళ వంటిది కాదూ ఎదుటి ఆడపిల్ల!?

ఉహు! అవన్నీ ఆలోచించే అవసరమేముంది?

ఏదో బావుకుందామన్న యావ తప్ప!

ఏదేమైనా,,, ఆడా మగా, ముసలీ ముతకా… అందరూ, మొత్తంగా సమాజమే… చూస్తూ ఊరుకుంది. [ఇక్కడ పేరుకే అగ్రవర్ణం, మాదిగ కులం. గీత చెప్పే చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం అందరి ప్రవర్తన తామసమే.]

ఆ పాపమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దేశాల కతీతంగా, ప్రభుత్వాలని తోలుబొమ్మల్ని చేసి, ప్రభుత్వాధినేతల్ని తమ ఏజంట్లుగా చేసి, గూఢచార వలయమై ఆడిస్తున్న నకిలీ కణిక వ్యవస్థగా రూపుదిద్దుకుందనవచ్చు.

వేశ్యాపుత్ర వంశమై… తరతరాలుగా విస్తరించిన నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులకి స్త్రీ అంటే గౌరవం లేకపోవడానికీ, మానవతా విలువలు మృగ్యమై పోవడానికీ మూలాలు ఆ పాపంలో నుండే ఉద్భవించాయి.

ఈనాడు రాజకీయ, బ్యూరాక్రాట్ల, కార్పోరేట్ కోరల్లో నుండి వ్యాపార విషం చిమ్ముతున్న… ఈ వ్యవస్థకి ‘జాలీ దయా లేవు’ అంటే…

ఆ నాడు బసినినులో, దేవదాసిలో… వారిపట్ల, వారి సంతానం పట్లా… సమాజం చూపిన ‘జాలీ, దయా’ మాత్రం ఏమున్నాయి గనుక!?”

అందుకే భగవంతుడు గీతలో అంటాడు… ‘చేసిన మంచి చెడు కర్మల ఫలితాలని అనుభవించక తప్పదు’ అని!

వ్యక్తిగతంగా చేస్తే వ్యక్తిగతంగా…

సామూహికంగా చేస్తే సామూహికంగా…

సమాజమంతా చేస్తే సామాజికంగా…

‘చేసిన కర్మ అనుభవించక తప్పదు’ అనడానికి ఇది మరో నిదర్శనమే!

మనిషి ప్రాణానికీ, మహిళ శరీరానికీ, శీలానికీ విలువ లేక పోవటం… ఆనాటి పురుష సమాజం చూపిన స్వార్ధమూ, స్త్రీ సమాజం చూపిన ఉదాసీనతల ఫలితమే!

ఇలా ఆలోచిస్తూంటే… నకిలీ కణిక అనువంశీయుల మీద ఏహ్యత కలగదు, జాలి కలుగుతుంది.

నిజానికి ‘దుష్టుల్ని ద్వేషించకు, వారిలోని దౌష్ట్యాన్ని ద్వేషించు’ అనే మాట ఎంతో అర్ధవంతమైంది.

అయితే… ‘దౌష్ట్యాన్నే తప్ప దుష్టుల్ని ద్వేషించకపోవటం’ అంటే – ‘దుష్టుల్ని శిక్షించక పోవటం’ అనుకుంటే అది కుహనా భావవాదమే!

పైకి చూడటానికి ఇది పరస్పర ద్వంద్వం అనిపించినా… నిశితంగా పరిశీలిస్తే వడ్లగింజలో బియ్యపు గింజ వంటిదే!

ఎందుకంటే… దుష్టుల్ని శిక్షించక పోతే శిష్టుల్ని శిక్షించినట్లవు తుంది గనకా,

దుష్టుల్ని ద్వేషించక పోవడమంటే దౌష్ట్యాన్ని సహించడం కాదు గనకా!

ఈ కథ అప్పుడెప్పుడో ‘బసివిని’ దురాచారం ఉన్నప్పటి రోజుల్లోది మాత్రమే కాదు. ఇప్పటికీ అప్పుడప్పుడు పల్లెలో జరిగినట్లుగా వార్తల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలకి మాత్రమే సంబంధించిందీ కాదు.

ప్యాకింగ్ మారినా లోపలి సరుకు అదే ఉన్నట్లుగా… ఇప్పటికీ ఎల్లెడలా మన చుట్టూ ఉన్నదే!

ఒక్కసారి ఈ కథని భారతదేశపు ప్రస్తుత పరిస్థితికి అనువర్తిస్తే…

తమ తల్లి, చెల్లి, కుమార్తె, మనవరాలు… వీళ్ళందరూ స్త్రీలే అని మరిచిపోయి, పదేళ్ళ పసిపిల్ల (బోడెక్క) బసివిని కోసం ఎగబడ మగవాళ్ళలా…

ఇది మన దేశం, మనం పుట్టిన గడ్డ అని మరిచి పోయి, దోచుకునేందుకు ఎగబడుతున్న రాజకీయులు, బడా కాంట్రాక్టర్లూ, కార్పోరేట్లూ, కోట్లల్లో, పదుల లక్షల్లో … లంచాలు పుచ్చుకునే ఉన్నతోద్యోగులూ ఉంటే…

తమ ఇంటి ఆడపిల్ల, తమ జాతి ఆడపిల్ల, బలి పశువు అవుతోందన్న స్పృహ లేకుండా, దున్నపోతు కూరాకు కోసం ఎగబడిన మాదిగల్లాగా…

బ్రతికి ఉన్న తమ ఇంటి ఆడపిల్లని తీసుకుని, బదులుగా చచ్చిన దున్నపోతు శరీరాన్ని తమకి ‘కూరాకు’గా ఇచ్చారన్న స్పృహ లేకుండా…

ఓటుకి ఇచ్చే నోట్లకీ, సారా పాకెట్లకీ ఎగబడే సామాన్య ఓటర్లూ!

సంక్షేమ పధకాలతో రెండ్రూపాయలకే బియ్య మిచ్చారంటూ మురిసిపోతూ, ఆలోచించటం మానేసిన మామూలు ఓటర్లూ!

వందలూ వేల రూపాయల్లో లంచాలు పుచ్చుకునే అవకాశాలిస్తున్నారని, బాసులకి భజనలు చేస్తున్న చిన్న ఉద్యోగులూ!

తమ దగ్గర లంచాలు గుంజుకుంటేనేం, తమకీ దోచుకునే అవకాశం ఇస్తున్నందుకు చంకలు గుద్దుకునే చిన్న వ్యాపారులూ!

తమ కులస్తుడో, తమ మతస్థుడో, తమ పార్టీయో అధికారంలోకి వస్తే తమకు దోచుకునే అవకాశం వస్తుందని తమవాణ్ణి వేనకేసుకువచ్చే పార్టీ కార్యకర్తలూ, అభిమానులూ!

అచ్చంగా ప్యాకింగ్ మారిన అదే దుష్టాచారం కాదూ ఇది!
~~~~~~

ఇంతమంచి కథని ప్రచురించినందుకు సాక్షిని అభినందించ వలసిందే!

ఇక్కడ నాకు ఆసక్తికరంగా తోచిన అంశం ఏమిటంటే – ఈ కథా రచయిత నాగప్ప గారి సుందర్రాజు! సెంట్రల్ యూనివర్శిటీ స్టూడెంట్ అట. తను పుట్టి పెరిగిన కులంలోని దురాచారాన్నే కాదు, కందారప్ప పాత్రలో అలాంటి వ్యక్తి జీవితంలోని నిస్సహాయతనీ, విషాదాన్ని కూడా చిత్రించాడు. కుల పక్షపాతం కంటే సత్యావిష్కరణే ఉందా కథలో!

ఆడపిల్ల శరీరం కోసం ఎగబడిన మగాళ్ళనీ, దున్నపోతూ శరీరం కోసం ఎగబడిన మాదిగ వాళ్ళనీ… నిష్పక్షపాతంగా చూపించాడు.

నిష్కర్షగా సమాజంలోని అగ్ర, అణగారిన వర్గాల వారి లోపాలని ఎత్తి చూపాడు.

రచయిత కలంలో… సత్యం పట్ల ఆర్తి ఉంది! సత్యాన్ని ఆవిష్కరించే సత్తా ఉంది!
అయితే ఈయన దురదృష్టవశాత్తూ చిన్న వయస్సులోనే మృతి చెందాడట.

చిత్రంగా… సత్యం పట్ల ఆర్తి, సత్యావిష్కరణ చేయగల సత్తా ఉన్న రచయితలు/రచయిత్రులు, దర్శకులు, కళాకారులు, నటీనటులు… ఎవరైనా సరే… అల్పాయుష్కులై, అర్ధాంతర మరణాలని పొందారు.

ప్రమాదాలు, కాన్సర్ల వంటి అనారోగ్యాలు పైకారణాలై కనబడ్డాయి.

లేదా వ్యసనపరులై అపజయాల పాలయ్యారు.

వ్యక్తిగత బలహీనతలు పైకారణాలై కనబడ్డాయి.

మొత్తంగా మాత్రం దురదృష్టవంతులయ్యారు.

ఎవరైతే సత్యాన్ని దాచేందుకు, దేవుడు తండ్రులని (God Fathers) పొగిడేందుకు, పైవారి పాదాలు పట్టుకుని మకారత్రయాల్ని సమర్పించేందుకు సదా సంసిద్ధంగా ఉంటారో…

ఎవరైతే తాను పైవారికి జరిపించినవన్నీ తమ క్రింది వారి నుండి ఆశిస్తారో…

వాళ్ళు మాత్రం అవార్డుల మీద అవార్డులూ, కీర్తి ప్రతిష్టులూ, సర్వ సంపదలూ, విజయ పరంపరలూ పొందారు.

మొత్తంగా మాత్రం అదృష్టవంతులయ్యారు.

ఎందుకో మీకీ పాటికే అర్ధమై ఉంటుందనుకుంటా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=3&ContentId=9203

please read this.

పరాయిదేశంలో పిల్ల చేష్టలు !

Rubber-farmన్యూఢిల్లీ, మేజర్‌న్యూస్‌: అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ సహజ ప్రవృత్తికి అద్దం పట్టే తాజా సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భారత దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా రాహుల్‌ గాంధీ తన దైన శైలిలో చెట్లూ, పుట్టల వెంట కాలినడకన తిరుగుతూ..నిరు పేదల గుడిసెల్లోకి వెళ్లి అక్కడ వారితో మాటా మంతీ నెరపి..వాళ్లు పెట్టిన తిండి తిని..తానొక ఆమ్‌ ఆద్మీ అభిమానిననే ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. దేశ రాజధానిలో పుట్టి పెరిగినా..తాను ఆధునికత కంటే నిరాడంబరతనే ఇష్టపడతానని చెప్పేందుకు తన చర్యల ద్వారా తపిస్తుంటారు. సూటు, బూటు లేకుండా సాదాసీదా పైజామా, లాల్చీలోనే ఎల్లవేళలా దర్శనమిస్తుంటారు.

సెక్యూరిటీ ఆర్భాటాలంటే తనకు చికాకు అని చెప్పకనే చెబుతుంటారు. చాలా సందర్భాల్లో రాత్రిళ్లు ఎవ్వరికీ చెప్పకుండా హోటళ్లకు వెళుతుంటారు. ఇదే తరహా తన సహజ శైలిని ఆయన విదేశాల్లో కూడా ప్రదర్శిస్తుంటారా? అంటే అవుననే మలేషియా ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ఇక్కడి మాదిరే రాహుల్‌ గాంధీ మలేషియా భద్రతా సిబ్బందిని సైతం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఆయన గత ఆదివారం మలేషియా వెళ్లారు. అది అధికారిక కార్యక్రమం కాదు. సొంత పనులను చక్కబెట్టుకు నేందుకు వెళ్లినట్లు చెబుతున్నారు. అక్కడ ఆయనొక విందులో పాల్గొన్నారు. తన సన్నిహిత మిత్రులు ఆ విందు ఏర్పాటు చేశారు.

ఆ మిత్రులు మరెవరో కాదు. ఖత్రోచీతో సన్నిహిత సంబంధాలు ఉన్న మిత్ర బృందంతో కలిసి రాహుల్‌ విందు ఆరగించారు. ఖత్రోచీ ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బోఫోర్స్‌ కుంభకోణాన్ని భారత్‌లో నడిపి, రాజీవ్‌ గాంధీకి ముడుపులు అప్పగించినట్లు ఖత్రోచీ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ విందు అనంతరం రాహుల్‌ గాంధీ ఎవ్వరికీ చెప్పా చెయ్యకుండా ఎటో చెక్కేశారు. దాంతో ఇంకేముంది. భద్రతా సిబ్బంది లబోదిబో. ముందే తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఒక కారు (ప్రణవ్‌)లో రాహుల్‌ ఎక్కడికోఉడాయించారు. కొన్ని గంటల పాటు రాహుల్‌ ఆచూకీ తెలీక మలేషియా ప్రభు త్వం ఉక్కిరి బిక్కిరయింది. ఆయనలా హఠాత్తుగా మాయం కావడంతో అధికా రులు అవాక్కయ్యారు. భద్రతా అధికారులు తక్షణం రంగంలోకి దూకి అన్వే షణ సాగించారు. ఆ వ్యవహారం బటయకు పొక్కకుండా ఆద్యంతం జాగ్రత్త పడినట్లు తెలిసింది.

భద్రతా అధికారులు మరో వంక అప్పటికప్పుడు సమా వేశమై, తమ భద్రతా వైఫల్యం మీద సమీక్షించుకున్నారట.పరిస్థితి ఎటు పోయి ఏమవుతుందోనని ముందు జాగ్రత్తగా భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. తీరా కొన్ని గంటల పాటు తీవ్ర ఉత్కంఠ తర్వాత ఆయన ఒక రబ్బరు తోటలో విహారానికి వెళ్లినట్లు తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే అది ఉభయ దేశాల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణానికి దారి తీసి ఉండేదోనని మలేషియా దౌత్యాధికారులు ముక్కున వేలేసుకున్నారు. అంతే కాదు. భారత దేశానికి భావి ప్రధానిగా అందరూ చెప్పుకుంటున్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించడమేమిటని అక్కడి ప్రభుత్వాధికారులు కళ్లింత చేసుకుని చెవులు కొరుక్కున్నారు. ఏ వయస్సుకి ఆ ముచ్చట అన్నట్లు ఏ హోదాకు ఆ ప్రవర్తన అని రాహుల్‌ తెలుసుకోవాలి కదా..అని ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానించారు.

వివాహం ఒక వ్యవస్థ. వ్యభిచారం కూడా ఒక వ్యవస్థే వివాహవ్యవస్థ వెలుగనుకుంటే, వ్యభిచారం దాని నీడ. అందుచేత వివాహవ్యవస్థ ఉన్నంతకాలమూ వ్యభిచారవ్యవస్థ కూడా ఉంటుంది ఏదో ఒక రూపంలో, ఎంతోకొంత పరిమాణంలో ! అందుచేత ఇవి ఒకే నాణేనికికున్న బొమ్మా-బొరుసుల్లా పరస్పరం విడదీయరాని అనుబంధం గలవి. కాబట్టి ఒకటి ఉండాలి, రెండోది పోవాలి అంటే బహుశా అది సాధ్యం కాదు. వివాహవ్యవస్థ ఆడవాళ్ళ అవసరాల కోసమైతే అదే సమయంలో సమాంతరంగా - వ్యభిచారవ్యవస్థ మగవాళ్ల అవసరాల కోసం. వివాహవ్యవస్థలో ఉన్న ఆడదాన్ని సత్కరిస్తారు. వ్యభిచారవ్యవస్థలో ఉన్న ఆడదాన్ని ఛీత్కరిస్తారు. కానీ ఇద్దఱూ మగవాడి మీదనే ఆధారపడతారు. కనుక ఆడవాళ్ళు అసహ్యించుకున్నంతగా మగవాళ్ళు వ్యభిచారాన్ని అసహ్యించుకోరు. వ్యభిచారుల్ని కూడా అసహ్యించుకోరు. కామానికి కొన్నికొన్ని లేవు. This explains male behaviour towards basivis.

Kalidasu గారు: మీరిచ్చిన లింక్ లో వార్త చదివానండి. నెనర్లు!

తాడేపల్లి గారు : వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu