ఉన్న కార్లు సొట్టలు పడి, కొత్తకార్లు కొనటం సంగతి దేవుడెరుగు, సొట్టల కార్లకి రిపేర్లే చేయించడం లేదనుకొండి! ఏమనుకుంటాం? ‘తొందర్లో ఈ కార్లూ మూలన పడేయటమో, అమ్ముకోవడమో జరుగుతుంది’ అనుకుంటాం.

ఇది దేశాలకైనా, కార్పోరేట్ కంపెనీలకైనా వర్తిస్తుంది. అదే బ్రిటన్ లోని హిత్రూ విమానాశ్రయంలో కన్పిస్తోంది.
అన్ని దేశాల్లో, కార్పోరేట్ రంగంలో… ఆ గడబిడనే ప్రస్తుతం మనం చూస్తున్నాం!

ఇలాంటి ఆర్ధిక నేపధ్యంలో… ప్రభుత్వ మద్దతుతో, నానా గల్లంతులూ చేసి మరీ, మార్కెట్లు నిలబెట్టుకునే పెనుగులాటనే మనం కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం.

బంగారు నిల్వలు అడుగంటే పరిస్థితి వస్తే… అసలా ఊహే వాళ్ళ వెన్నుల్లో చలి పుట్టోస్తోంది. ఆ గాభరానే అన్ని చోట్లా కనబడుతోంది. ఎందుకంటే – ఏ కలవరం లేదా కల్లోలం జరిగినా… ‘ఇందులకేదో నిమిత్తం ఉండి ఉండవలయును’ అనే పంచతంత్రం కథ దానికి పునాదిగా ఉంటుంది గనుక!

ప్రభుత్వం, ప్రత్యేకంగా మనదేశంలో అయితే (ఏ దేశమూ ఇందుకు మినహాయింపు కాదను కొండి.) ఇంత భారీగా అవకతవకల్లో అవినీతిలో కూరుకుపోయి కన్పిస్తోంది కూడా ఇందుకే! ఎంత డబ్బు సమకూర్చుకుంటే… కుప్పకూలుతున్న కాగితపు స్తంభాలని నిలబెట్టుకోగలరు? ఎంతగా సమాచారం కొనుక్కుంటే గానీ, ఎంతగా ఏజంట్లను తృప్తి పరిస్తే గానీ, తమకి అనుకూలంగా పరిస్థితులు కొంత మేరనైనా మలుచుకోలేరు. ఎందుకంటే…‘ఏదైనా డబ్బుతోనే! డబ్బు తప్ప ఇతర మానవ విలువలేవీ లేవు’ అన్నది ‘వాళ్ళు నేర్పిన పాఠమే’ ప్రతి వారికీ! (తమ ఏజంట్లకి కూడా!)

ఇక వ్యాపారం పేరుతో డబ్బు దోచుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు పన్నుతారో మరోసారి పరిశీలించండి.

1]. >>> 23/11
లైట్‌గా రెడ్‌వైన్ కొడితే షుగర్‌తో తంటాలుండవు
లండన్, నవంబర్ 22 : మీరు మందు బాబులా? అయి తే.. మీకు ఇక షుగర్ వచ్చినా భయం లేదేమో? మీ టేస్ట్ కొద్దిగా మార్చుకుని రెడ్ వైన్ క్రమం తప్పకుండా రోజుకింతని కొట్టేయండి. ఆప్పుడు మధుమేహం కూడా తగ్గిపోతుందట. రెడ్‌వైన్‌లో శరీరంలో గల చక్కెర నిల్వలను నియంత్రించే రసాయనాలు ఉన్నాయని వియన్నాలోని యూనివర్సిటీ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అండ్ అప్లైడ్ లైఫ్ సెన్సెస్ పరిశోధకులు కనుగొన్నారు. ఒక పరిమితిలో ఉంటూ మద్యం తాగే వారికి మధుమేహం రాదని లేదా నియంత్రణలో ఉంటుందని గతంలో జరిగిన అధ్యయనాల్లో తేలింది.

Pasted from https://www.andhrajyothy.com/worldnewsshow.asp?qry=2010/nov/23/world/23world3&more=2010/nov/23/world/worldmain&date=23/11/2010

ప్రపంచంలో 600 పై చిలుకు కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో సగానికి అటూ ఇటూగా మధుమేహ వ్యాధి పీడితులుంటారు. (ఈ మధ్య మధుమేహ వ్యాధిగ్రస్తులను గందరగోళ పరచటానికి టైప్ – 1, టైప్ – 2 లంటూ వాళ్లని వర్గీకరించారు. అంతేగాక కొన్ని సార్లు ఏదైనా ఆరోగ్యసమస్యతో డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు ఒకసారి మధుమేహ వ్యాధి ఉండటం, మరోసారి వీళ్ళే వేరే చోట్ల పరీక్షించుకుంటే ఆ వ్యాధి లేకపోవటం జరిగినట్లు చాలాసార్లు మనం వినటం కద్దు!)

ఇక వారిలో మద్యప్రియుల సంఖ్యా చెప్పుకోదగినంత గానే ఉంటుంది. వారికీ వార్త ఎంతో ప్రియంగా ఉంటుంది. మద్యప్రియులు కాని వారినీ, అప్పుడప్పుడూ మాత్రమే మద్యం పుచ్చుకునే వారికీ కూడా ‘కొద్దిగా రెడ్ వైన్ పుచ్చుకుంటే షుగర్ పేషంట్లుకి మేలు కలుగుతుందన్న’ వార్త ఆకర్షణ కలిగిస్తుంది.

మద్యం అలవాటు లేని వారికి కూడా ‘అవునా? అయితే ప్రయత్నిద్దామా?’ అన్పిస్తుంది. ఇక ఎంతగా వ్యాపారానికి కట్టలు తెగుతాయో ఎవరూ లెక్కలు వెయ్యలేరు.

శాస్త్ర పరిశోధనలింతే చెప్పాయంటే ఎవరు కాదనగలరు?

2]. మరో ఉదాహరణ,…
>>> 23/11

గూడు.. గోడు!
సొంత ఇంటి కలకు ఒక్క జీవోతో బ్రేకు
రియల్టర్లతో అధికారుల కుమ్మక్కు!
ఇంటికంటే ప్లాట్లు పదిలమనేలా నిబంధనలు
పర్యావరణం పేరిట అసాధ్యమైన ఆంక్షలు
పది శాతం సెట్‌బ్యాక్, పది శాంతం తనఖా!
120 చదరపు మీటర్లలో సింగిల్ బెడ్‌రూమ్ కట్టలేం

హైదరాబాద్, నవంబర్ 22 : మహేశ్‌కు నగరంలో 120 చదరపు మీటర్ల స్థలం ఉంది. అంతకుమించి కొనలేకపోయాడు! మధ్య తరగతి జీవితం మరి! స్థలం కొని చాలా రోజులే అయ్యింది. ఇప్పుడు అందులో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఆర్కిటెక్ట్ వద్దకు వెళ్లి ప్లాన్ గీయమన్నాడు.

ఆర్కిటెక్ట్ పెన్సిల్ తీసుకుని... 120 చదరపు మీటర్ల స్థలం మధ్యలో ఒకే ఒక్క చదరం గీశారు. ఇదే మీ బిల్డింగ్ ప్లాన్ అని మహేశ్‌కు చెప్పాడు. 'ఇది హాలు ఓకే! మరి బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్ ఎక్కడ?' అని మహేశ్ ప్రశ్నించాడు.

అప్పుడు ఆర్కిటెక్ చకచకా అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు. "ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ప్రకారం... మీ 120 చదరపు మీటర్ల స్థలంలో 49 శాతం సెట్‌బ్యాక్స్ కింద వదిలేయాలి. అంటే... 58 చదరపు మీటర్లు ఖాళీగా పెట్టాలి. మిగిలింది 62 చదరపు మీటర్లు. అందులో... పది శాతం సర్కారుకు తనఖా పెట్టాలి. అది కూడా తీసేస్తే... 55.8 చదరపు మీటర్లు. ఈ స్థలంలో ఎవరైనా, ఇంతకంటే బెటర్ ప్లాన్ ఇవ్వలేరు!'' అంటూ ఆర్కిటెక్ట్ తేల్చి చెప్పారు. అంతే... మహేశ్‌కు మతిపోయినంత పనైంది.

120 చదరపు మీటర్ల ఖాళీ స్థలంలో కట్టుకోడానికి మిగిలేది 55.8 చదరపు మీటర్లు మాత్రమే. అంటే... 504 చదరపు అడుగులు. ఇందులో కనాకష్టంగా సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు మాత్రమే కట్టుకునే అవకాశముంటుంది. స్థలం, ఇంటి నిర్మాణం ఖర్చు కలిసి కనీసం రూ.20 లక్షలు అవుతుంది. ఇంకో మూడు నాలుగు లక్షలు అదనంగా పెడితే ఎంచక్కా డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ వస్తుందిగా!... అని మహేశ్ అనుకున్నాడు. సరిగ్గా ఇక్కడే సవరించిన జీవో నెంబర్ 86 'అసలు' ఉద్దేశం నెరవేరింది.

బిల్డర్ల బల ప్రదర్శన ఆర్థిక మాంద్యం ఫలితమో... తెలంగాణ ఉద్యమమో! నగరంలో ఒకటి రెండేళ్లుగా ఫ్లాట్ల అమ్మకాలు నిలిచిపోయాయి. నిజాంపేట, ప్రగతినగర్, మణికొండ, మాదాపూర్, ఉప్పల్... ఇలా అనేక ప్రాంతాల్లో వేలకొద్దీ ఫ్లాట్లు విక్రయానికి నోచుకోలేదు. ఇప్పుడు... ఆర్థిక మాంద్యం మబ్బులు మెల్ల మెల్లగా వీడుతున్నాయి. 'రియల్'లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో వేలాదిగా మిగిలిపోయిన ఫ్లాట్లను అమ్ముకునేందుకు కొందరు బడా రియల్టర్లు పావులు కదిపారు.

మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి చెందిన వారు సొంత ఇల్లు (ఇండివిడ్యువల్ హౌస్) కట్టుకునే ఆలోచన కూడా చేయకుండా కొందరు అధికారులతో కలిసి కుట్ర పన్నినట్లు బలమైన ఆరోపణలున్నాయి. దీని ఫలితంగానే జీవో 86కు సవరణ జారీ అయినట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుకూల 'గ్రీన్ హౌస్' పేరిట విచక్షణను మరిచి మరీ సెట్‌బ్యాక్స్ నిబంధనలు విధించారు.

ఇందులో భాగంగానే... వెయ్యి చదరపు మీటర్లు కొనగలిగే బడా బాబులకూ, నూటొక్క చదరపు మీటర్ల స్థలంలో మాత్రమే ఇల్లు కట్టుకోగలిగే సామాన్యులకూ ఒకే రకం నిబంధన విధించారు. సెట్‌బ్యాక్స్‌ను 49 శాతంగా నిర్ణయించారు. జనంతో కిటకిటలాడుతూ, కాంక్రీట్ అరణ్యాన్ని తలపించే హైదరాబాద్‌కు మాత్రమే కాదు... రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, చివరికి మున్సిపాలిటీలకు కూడా ఇవే నిబంధనలను వర్తింపజేశారు.

ఎక్కడా లేని చిత్రమిది...

దేశంలో మరెక్కడాలేని విధంగా పర్యావరణ భవంతులు అంటూ ప్రభుత్వం సామాన్యులపై నిబంధనల ఉచ్చు బిగించింది. 'ఇల్లు కొంచెం, చుట్టూ స్థలం ఘనం' అనే నిబంధన పర్యావరణ పరిరక్షణ నిమిత్తమే అంటోంది. నిజానికి... కేవలం సెట్‌బ్యాక్స్ వదిలేసినంత మాత్రాన అది 'పర్యావరణ భవంతి' అయిపోదు. తీసే పునాదుల నుంచి వేసే రంగుల వరకు... ప్రతి దశలో ప్రత్యేకమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. సిమెంటుకు బదులు ఒండ్రు మట్టిని ఉపయోగించాలి.

స్టీల్‌ను తక్కువగా, శాస్త్రీయ విధానం ప్రకారం వాడాలి. ఇసుక, ఇటుకల వినియోగంలోనూ నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. గాలీ వెలుతురు పుష్కలంగా వచ్చేలా బిల్డింగ్‌ను డిజైన్ చేయాలి. అలాగే... మామూలు విద్యుత్తును కాకుండా, సౌర విద్యుత్తును మాత్రమే అధికశాతం ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే... అది పూర్తిస్థాయిలో పర్యావరణ భవంతి అవుతుంది. కానీ... ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా కేవలం సెట్‌బ్యాక్స్ వదిలేస్తే చాలు, అదే గ్రీన్‌హౌస్ అయిపోతుందనేలా నిబంధనలు విధించింది.

ఏవిధంగా చూసినా 120 చదరపు మీటర్ల స్థలంలో గ్రీన్‌హౌస్ ఇంటిని కట్టుకోవడం అసాధ్యం. ఇంకా చెప్పాలంటే... గ్రీన్ సిటీగా, గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరులోనే ఇలాంటి ఆంక్షలు లేవు. అక్కడ భవనం ఎత్తును ప్రామాణికంగా తీసుకుని సెట్‌బ్యాక్స్ వదలాల్సి ఉంటుంది. ఉదాహరణకు 11.5 మీటర్ల ఎత్తులో నిర్మించే భవనానికి నాలుగు వైపులా 5 మీటర్ల సెట్‌బ్యాక్ వదిలితే చాలు.

ఆపైన అదనంగా నిర్మించే ప్రతి అంతస్తుకు సెట్‌బ్యాక్‌ను నాలుగు వైపులా ఒక్కో మీటరు చొప్పున పెంచాల్సి ఉంటుందని బెంగళూరు మహానగర పాలిక అడిషనల్ టౌన్‌ప్లానింగ్ అధికారి తిరుకన్ గౌడ తెలిపారు. కానీ... మన హైదరాబాద్‌లో 120 చదరపు మీటర్ల స్థలానికే నాలుగు వైపులా 10 మీటర్ల సెట్‌బ్యాక్‌ను వదలాలంటూ నిబంధనలు విధించడం గమనార్హం. ఇప్పటికే కట్టి ఖాళీగా ఉన్నా, మున్ముందు కట్టబోతున్న అపార్ట్‌మెంట్లలో విక్రయాలు పెంచుకోవడానికి రియల్టర్లు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది.

Pasted from https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/nov/23/main/23main14&more=2010/nov/23/main/main&date=23/11/2010

గ్రీన్ హౌస్ పేరిట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాలు, పట్టణాలలో ఇళ్ళ నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ఒక జీవో జారీ చేసింది.

120 గజాల స్థలంలో ఓ సగటు మానవుడు ఓ చిన్న స్వంత కొంప కట్టుకుందామని ఉబలాటపడితే… సదరు జీవో నియమ నిబంధనల ప్రకారం, చుట్టూ స్థలం వదిలేస్తే మిగిలేది 55 గజాలు మాత్రమే! అందులో ఓ గది వేసుకుని ముడుక్కుని బతికేయాలి. లేదంటే నోరు మూసుకుని సింగిల్ బెడ్ రూమ్ లేదా డబుల్ బెడ్ రూం ప్లాట్ కనుక్కోవాలి.

చూడండి, ఎంత కాలిక్యులేట్డ్ దోపిడినో ఇది! ఓ సామాన్యుడు ఓ 120 గజాల స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే తమకి (అంటే ప్రభుత్వాధికారంలో ఉన్నవారికి) వచ్చేదేం ఉండదు. అదే అపార్ట్ మెంట్లు కట్టి అమ్ముకునే బిల్డర్స్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండయితే… భారీ మొత్తాల్లో డబ్బు, బహుమతులుగా, లంచాలుగా అందుతుంది.

కాబట్టి ఇన్ని నియమనిబంధనలు! చుట్టూ స్థలం వదిలి పెట్టకుండా, మొక్కా మోడు పెంచకుండా, అగ్గిపెట్టెలు పేర్చినట్లుగా, ఇరుకిరుగ్గా ఇళ్ళు కట్టుకొని, సామాన్యులు భూగోళాన్ని వేడెక్కిచ్చేస్తున్నారనే పైకారణం (over leaf reason) తో గ్రీన్ హౌస్ జీవో జారీ చేసేసింది శ్రీమాన్ ప్రభుత్వం!

అప్పుడు ఈ గోలంతటి కంటే ఓ అపార్ట్ మెంట్ కొనుక్కోవటమే మేలనిపిస్తుంది. అక్కడికి తీసి కెళ్ళాలన్నదే ప్రభుత్వ యోచన! ఎందుకంటే ఎవరికి వారు చిన్న ఇల్లు కట్టుకునే మామూలు మనిషి నుండి తమకి రాలేదేం లేదు, అదే భారీగా అపార్ట్ మెంట్లు వ్యాపారం చేసే వారి నుండైతే కాసులు బాగానే రాలుతాయి మరి!

3]. మరో ఉదాహరణ…

ఒకప్పుడు మన దేశపు రోడ్లు అధ్వాన్నంగా ఉండేవి. ఇప్పుడూ చాలా చోట్ల అలాగే ఉన్నాయి లెండి. ప్రయాణం అసౌకర్యంగా ఉండటం మాత్రమే మనం గమనిస్తాం. కానీ గతుకుల రోడ్ల మీద ప్రయాణిస్తే… పెట్రోలు డీజిలు వంటి ఇంథన వినియోగం చాలా ఎక్కువ. తద్వారా చమురు సంస్థలకి, రిలయన్స్ ల వంటి కార్పోరేట్లకి (ఇటీవలే ప్రపంచ చమురు వ్యాపారంలో 2% తమదేనని గొప్పగా ప్రకటించుకున్నాడు ముఖేష్ అంబానీ!) ఒపెక్ దేశాలకి ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం!

అదొక్కటే కాదు… వాహనాల టైర్ల మన్నిక గణనీయంగా తగ్గిపోతుంది. టైర్ల జీవన కాలం సగానికి సగం పడిపోతుంది. ఇక రబ్బరు, టైర్ల ఉత్పత్తి సంస్థల వ్యాపారం ఎన్ని వేల లక్షల కోట్లల్లో ఉంటుందో ఏ పత్రికా లెక్కలు చెప్పదు.

ఇంధనమూ, టైర్లే కాదు! కమాను కట్టల నుండి ఆటోమోబైల్ రంగంలో వాహనాల విడివిభాగాల ఉత్పత్తి సంస్థలకీ, మొత్తంగా లారీ బస్సులు గట్రా వాహనాల ఉత్పత్తిదారులైన టాటా, ఆశోక్ లేలాండ్ ల వంటి వారికి…? ఊహాకి అందనంత వ్యాపారం!

అందుకే… ఇష్టాపూర్వకంగా, అవినీతి మహారాజ పోషణ మాదిరిగా నడిపించబడుతుంది. ఈ అవినీతి పందిరికి… కాంట్రాక్టర్లూ, అధికారులూ, రాజకీయ నాయకులు కనబడే గుంజలైతే, కార్పోరేట్ కంపెనీలు కనబడని గుంజ వంటివి.

ఇలాంటి దోపిడీలు, ఆర్ధిక మోసాలు లెక్కకు మిక్కిలి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

$ ఆదిలక్ష్మి గారు

చాలా లోతైన విశ్లేషణ ఉదాహరణలతో కలిపి, నెసర్లు.

మొదటి ఉదాహరణలో మీరు చెప్పిన "రెడ్ వైన్" లాంటి మోసాలు చాలా చూస్తుంటాము. వస్తూత్పత్తి పెంచుకోవడానికి శాస్త్ర పరిశొధనాసంస్థలతో కలిసి కొందరు ఆడే జూదమిది.

ఇక రెండో ఉ.హ లో మీరు చెప్పేదాక నాకూ తెలియదు. మీరు చెప్పిన కింది మాటలు అక్షరాలా నిజం.

"
కేవలం సెట్‌బ్యాక్స్ వదిలేసినంత మాత్రాన అది 'పర్యావరణ భవంతి' అయిపోదు. తీసే పునాదుల నుంచి వేసే రంగుల వరకు... ప్రతి దశలో ప్రత్యేకమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. సిమెంటుకు బదులు ఒండ్రు మట్టిని ఉపయోగించాలి. స్టీల్‌ను తక్కువగా, శాస్త్రీయ విధానం ప్రకారం వాడాలి. ఇసుక, ఇటుకల వినియోగంలోనూ నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. గాలీ వెలుతురు పుష్కలంగా వచ్చేలా...

"

అమూల్యమైన విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu