ఇంద్రయ్యాల్లాంటి రాజకీయ నాయకులని... తమ వాదనని చెప్పుకోనిచ్చి, కౌన్సిల్ చేసి, మంచి బుద్ది తెచ్చుకోమంటే వింటారా? ఇంకా పైగా తమ వాదనలు ఎంతగా వినిపిస్తారంటే.....

౧. తాము రామోజీరావుని గాక ఏ సీఐఏ నో చూశామంటారు.

"దాని బలం ముందు మేమెంత? ఎదిరించి నిలబడ గలమా? అనుకున్నాం".

"ఎదిరిస్తే, పెళ్ళాం బిడ్డలతో సహా కుటుంబం రోడ్డున పడుతుంది అని భయపడ్దాం"

"చెప్పినట్లు వినకపోతే మట్టి గొట్టుకు పోతాం. అందుకే ఏం చెబితే అది చేశాం" అంటారు.

రాజకీయ నాయకులైతే ‘పదవి ఊడుతుందని భయపడ్డామంటారు.’

ఉన్నతాధికారులు ‘ఉద్యోగాలూడతాయని భయపడ్డామంటారు’.

కార్పోరేట్, బడా వ్యాపారవేత్తలు ‘కంపెనీలు దివాళా తీస్తాయని భయపడ్డామంటారు’.

వెరసి కెరియర్ పోతుందని భయపడ్డామంటారు.

అంతే తప్ప, చెప్పింది చేస్తే... కెరీర్ లో పైకి వస్తామని ఆశపడ్డామనరు. చెప్పిన అసైన్ మెంట్లనల్లా నిర్వహించినందుకు, ఇబ్బడిముబ్బడిగా... నలుగురిలో మంచి ఇమేజ్, పరపతితో పాటు పైసలూ, కెరీర్ లో అదృష్టం తలుపు తట్టడాలూ... వంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందామని ఒప్పుకోరు.

మొత్తంగా... "సీఐఏ లేదా కేజీబీ లేదా ఐఎస్ ఐ [ఏదో ఒక విదేశీ గూఢచార ఏజన్సీ] బలాన్ని చూసి భయపడ్డాం" అంటారు. అప్పట్లో స్వదేశీ ప్రభుత్వమూ, స్వదేశీ నిఘా వ్యవస్థ, పరమ అసమర్దంగా కనబడ్డాయి మరి!

ఈ విధంగా చెప్పనిస్తే... తాము ప్రజాద్రోహం, దేశ ద్రోహం చెయ్యటానికి వందల కారణాలు చెప్పగలరు, కానీ.... నిజాయితీగా, ధర్మబద్దంగా, దేశం పట్ల నిబద్దతతో ఉండటానికి, వీళ్ళకి ఒక్క కారణం కూడా కనబడదు.

ఇలాంటి వాదనలని వినిపించే - పరవంచనా శిల్పులకీ, ఆత్మవంచనా ప్రపూర్ణులకీ.... ఎవరైనా సరే, ఏం చెప్పి, మంచి బుద్ది తెచ్చుకునేలా కౌన్సిల్ చేయగలరు?

కాబట్టి కూడా... నెం.5 వర్గం ‘చర్చలూ- వాదనలూ-మాటలూ’ వంటి వాటికి అవకాశం ఇవ్వటం లేదు.

వీళ్ళు చెప్పే సొల్లు వాదనలకి ఒకటే జవాబు -

"సరే! అప్పుడు అధర్మ పరులదీ, సిఐఏ లేదా కేజీబీ లేదా మరో దేశపు xyz లది బలం అనుకుని, వాటిని obey చేశావు కదా? ఇప్పుదు మాది బలం అనుకుని ‘సువర్ణ ముఖీ, శిక్షా’ అనుభవించు. అంతే! ఇక వాదనెందుకు?"

౨. "అందితే జుట్టు అందకపోతే కాళ్ళు" అన్న దాన్నే తొలి పాఠాలుగా నేర్చుకున్న, నకిలీ కణిక వ్యవస్థ ఏజంట్లు, ఇంద్రయ్యల్లాంటి రాజకీయ నాయకులు చెప్పే, మరో వాదన ఏమిటంటే....

"ఇంత పెద్ద విషయం అనుకోలేదు. ఏదో... చెప్పింది చేస్తే డబ్బూ, కెరీర్, పేరూ వస్తాయనుకున్నాం తప్పితే, పెద్దగా ఆలోచించలేదు. అందరూ చేస్తున్నదేగా అనుకున్నామే గానీ, అది ఇంత పెద్ద నేరం అవుతుందనుకోలేదు. అందరూ చేస్తుండగా, మనం ఒక్కళ్ళం మడిగట్టుకు కూర్చున్నంత మాత్రాన ఏమవుతుంది? మనం గాకపోతే మరొకళ్ళు చేసి పెడతారు. అదేదో మనమే చేస్తే... డబ్బూ, పేరూ, కెరీర్, అన్నీ వస్తాయనుకున్నామే గానీ, అది దేశ ద్రోహం, ప్రజాద్రోహం గట్రా లంత పెద్ద పదాలు, పాపాలు అనుకోలేదు."

చెప్పనిస్తే.... దీన్నే తిప్పించి తిప్పించి, ఈనాడు వార్తలు వ్రాసినట్లు, కోర్టుల్లో లాయర్లు సుదీర్ఘంగా వాదించినట్లు... పదే పదే అదే సొల్లు చెప్పగలరు.

నిజానికి... ఏం తెలియదూ? ఎంత పెద్ద విషయమో తెలియనీ తెలియక పోనీ, తాము చేస్తోంది తప్పో ఒప్పో తెలియలేదా? అంతరాత్మ చెప్పలేదా? చేసిన అసైన్ మెంట్ కి ప్రతిఫలం పుచ్చుకునేటప్పుడు, తెలియలేదా అది కిరాయితనం అని? డబ్బు పుచ్చుకుని కిరాయికి హత్యలూ, దొమ్మీలు చేసే గూండా గాళ్లకీ, ఈ రాజకీయ కిరాయి గాళ్ళకీ... తేడా ఏమిటి? నిజానికి చాలా మంది నేపధ్యం అదే!

ఇలాంటి కిరాయి నేరగాళ్ళు... ఒక్క రాజకీయ రంగంలోనే కాదు, ఐఎఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికార వర్గాల్లోనూ, కార్పోరేట్ రంగంలోనూ, ఇంకా సినిమా రంగం గట్రాల్లోనూ ఉన్నారు.

ఆయా రంగాలలో ఉన్న అందరూ, ఇలాంటి వాళ్ళే ననను. అదే అయితే, ఈ పాటికి దశాబ్దాల క్రితమే, భారతదేశం, ప్రపంచపటం నుండి కనుమరుగు అయి ఉండేది. అందరూ కాదుగానీ, అధిక శాతంలోనే కిరాయి నేరగాళ్ళు, డిప్లోమాటిక్ గా, ఆయా రంగాలలో ఒదిగి పోయి ఉన్నారు.

అలాంటి వాళ్ళకి... తాము లంచంగా ‘డబ్బూ, మకారత్రయాలు, కెరీర్ పరంగా అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు, నలుగురిలో పరపతి’ వంటి ప్రయోజనాలు పొంది, వాటికి ప్రతిఫలంగా తాము చేసిపెట్టిన పనులు.... తప్పో ఒప్పో తెలియదా?

౩. ఇక వీళ్ళు చెప్పగల మరో వాదన ఏమిటంటే - "ఏదో కక్కుర్తి పడి చేశాం. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాం. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా? మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం పొందిన వాడు ఉత్తమ గతినే పొందుతాడని, అదిగో, భాగవతంలో చెప్పబడింది. లేదా మరో xyz గ్రంధంలో చెప్పబడింది, కాబట్టి మమ్మల్ని శిక్షింపకూడదు."

ఈ వాదన ని ఎంత తేలిగ్గా చెబుతారంటే - మావోయిస్టులు గనుక, ప్రజలని చంపి పాతరెయ్యటాలు ఓ ప్రక్క చేస్తూనే, మరో ప్రక్క క్షమాపణలు కోరినంత తేలిగ్గా, "నేను ఆత్మపరిశీలన చేసుకుంటున్నాను కామ్రేడ్" అన్నంత తేలిగ్గా!

నిజంగా చేసిన తప్పులకు పశ్చాత్తాప పడుతున్నదే నిజమైతే... ఇప్పుడు ఎదురౌతున్న సువర్ణముఖిలని కూడా, మనసా వాచా కర్మణా "ఇది తమకి తగిన గతే!" అని అంగీకరించి మరీ, అనుభవిస్తారు. "చేసుకున్న ‘కర్మ’ని అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా సద్బుద్ది కలిగి, ప్రజలతో సహా ఎవరికీ ద్రోహం చెయ్యకూడదు" అనుకుంటారు. ఇంతకంటే అనుకోవడానికీ, అవటానికీ మాత్రం ఏముంటుంది?

నిజానికి... చెప్పనిస్తే, ఇలాంటి వాదనలనే ఇంద్రయ్యలంతా వైన వైనాలుగా చెయ్యగలరు.

చెప్పనిస్తే... ఇలాంటి వాదనలని, చంద్రబాబు, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ ల కంటే నైపుణ్యంగా, నయగారంగా... శ్రీశైలంలో మమ్మల్ని వేధించిన, మా ఇంటి క్రింది అంతస్థులోని కాంట్రాక్టు లేబరు, అటెండర్ రమణయ్య కూడా చెప్పగలడు.

‘శ్రీశైలపు డిప్యూటీ ఈవో కృష్ణయ్యని కాదని, ఏదైనా తానెలా చెయ్యగలననీ, కృష్ణయ్య చెప్పినట్లు వినకపోతే తన కాంట్రాక్టు అటెండరు ఉద్యోగం ఊడిపోతుందనీ, కేటాయించిన గది రద్దయి పోతుందనీ, దాంతో కుటుంబం రోడ్డున పడుతుందని భయపడ్డాననీ’ చెబుతాడు.

అయినా ఇంత పెద్ద విషయం అనుకోలేదంటాడు. చేసిన దానికి ఇప్పుడు చెంపలేసు కుంటున్నానంటాడు.

అతడి కీ... తనకు ఏమాత్రం కీడు చెయ్యని, తనకు ఏ విధంగానూ శతృవులం కానీ, మమ్మల్ని వేధించడం తప్పని తెలుసు. అయినా కృష్ణయ్య వంటి పైవాళ్ళు ఇచ్చే ‘లాభాలు’ తప్పొప్పుల్నీ చూడనివ్వలేదు.

అలాగే ఈ రాజకీయ ఇంద్రయ్యలకీ, తమకు ఇవ్వబడుతున్న ‘లాభాల’ ముందు ఉచ్ఛనీచాలు తెలియలేదు.

ఇక్కడ మీకు ఓ వాస్తవ సంఘటన చెబుతాను, మా జీవితం లోంచే!

సూర్యాపేటలోని మా ఇంటి నుండి, కట్టుబట్టలతో వెళ్ళ గొట్ట బడ్డాక, ఆ పంచనా, ఈ పంచనా కొన్ని నెలలు గడిపాక, చివరికి హైదరాబాద్ మొహీదీ పట్నంలో, నానల్ నగర్ అనే బస్తీలో, ఒక రేకుల గదిలో అద్దెకి చేరాము. అద్దె నెలకి 700/- రూ. నాలుగు వాటాలు ఉండేవి. ఇంటికి నలుగురైదుగురు వ్యక్తులుండేవాళ్ళు. ఒకే బాత్ రూమ్, టాయిలెట్ ఉండేవి. కామన్ బాత్ రూం కష్టాలతో చుక్కలు కనబడేవి.

ఆ రోజుల్లో, మా ప్రక్క నున్న మరో రేకుల గదిలో, ఒక పని మనిషి అద్దెకి ఉండేది. ఆమెకు ముగ్గురు పిల్లలు! భర్త లేడు. హాస్పటల్ లో పనిచేసేది. దాంతో బాటు వ్యభిచారం కూడా చేసేదని చుట్టు ప్రక్కల వాళ్ళ అనేవాళ్ళు. ఆమె ఇంటికి, ఒక బేల్డారీ కూలీ వాడు వచ్చీపోయేవాడు. అతడి కామె ఉంపుడు గత్తె! అలాంటి చోట ఇల్లు చూసి పెట్టి, మా పెద్దతమ్ముడు నాకు చేసింది సహాయమో, వేధింపు మరో పార్శమో, అప్పుడు మేమున్న సమస్యల సముద్రంలో, ఆలోచించేంత వెసుకు బాటు ఉండేది కాదు.

ఇక, ఆ పని మనిషి, మమ్మల్నెంత వేధించేదంటే... ముఖ్యంగా నన్ను! ఈమె నాకు జాతర బొమ్మ కావాలన్న మానసిక పెనుగులాట నడిచేది. అప్పట్లో, ఎస్.ఆర్.నగర్ లోని ఓ ట్యుటోరియల్ కాలేజీలో ఫిజిక్సు క్లాసులు తీసుకునే దాన్ని. సరిగ్గా నాకు కాలేజీ టైముకి, నేను స్నానానికి వెళ్ళే సమయానికి, బాత్ రూం కి పోటీ రావటం దగ్గర నుండీ... నీళ్ళూ, నిప్పులూ అన్నిటికీ చీదర బెట్టేది.

మా ఇంటికి వెనక ఉన్న వీధిలో, పశుమాంసం అమ్మే దుకాణం ఉండేది. అక్కడ అప్పట్లో, పది రూపాయలకి పావు కేజీ ఎద్దుమాంసం ఇస్తారు. దుకాణం బయట ధరల పట్టిక ఉండేది లెండి.

ఈ పనిమనిషికి, ఆమె ప్రియుడు, ఉదయాన్నే పావు కేజీ ఎద్దు మాంసం పంపేవాడు. అది చూడగానే ఆమె ముఖం వెలిగిపోయేది. కొన్నిరోజులు ఆమెని పరిశీలించంగా... ఆమెకి పది రూపాయలకు పావుకేజీ పశుమాంసం పంపించిన నాడల్లా, ఆమె రెట్టించిన ఉత్సాహంతో నన్ను వేధించడం అర్దమైంది. మిగిలిన రోజుల్లోనూ వేధించినా, ఆ రోజుల్లో, ఇనుమడించిన ఉత్సాహంతో చీదర పెట్టేది. రాన్రానూ, ఆమెకి మాంసపు పాలీధినీ ప్యాకెట్టు పంపబడగానే, మాకు అర్దమైపోయేది, ఆ రోజామె నన్ను మరింతగా విసిగించ బోతోందని!

ఇతరత్రా ఏమైనా ఇచ్చినా, అవీ పెద్ద విలువైన ప్రయోజనాలు కాదు. అంతకంటే ఎక్కువ వసూలు చేసుకునేందుకు, ఆమెకి తను చేస్తున్నవి అసైన్ మెంట్లని కూడా తెలియదు. అవగాహన లేదు.

అప్పట్లో, అంటే 2001 లో, అదంత బాగా అర్దం గాకపోయినా, 2005 తర్వాత అన్నీ గుర్తు తెచ్చుకుని, విశ్లేషించు కునేటప్పుడు, మాకు బాగానే అవగాహన కలిగింది.

2005 తర్వాత ఆలోచిస్తూ మేము "నానల్ నగర్ లో మన ఇంటి ప్రక్క పనిమనిషి, పది రూపాయలకు పావుకేజీ పశుమాంసం ఇస్తే, ఆనందంగా అసైన్ మెంట్ నిర్వహించింది. [మమ్మల్ని వేధించటం అనే అసైన్ మెంట్] అదే చంద్రబాబు లాంటి వాళ్ళయితే... వందల కోట్లో, ప్రధాని పదవులో ఇస్తామంటే.... ఆశగా, ఆనందంగా ఏ అసైన్ మెంట్ నిర్వహించడానికైనా వెనుదీయరు. మన లాంటి వారి పట్లే కాదు, దేశం పట్లనైనా అంతే!" అనుకున్నాము.

కాబట్టి - విషయం పది రూపాయల పశుమాంసంలోనో, ప్రధాని పదవిలోనో లేదు. అందుకు ఆశపడే మనుష్యుల స్వార్ధం లోనే ఉంది. పాప పుణ్యాల పట్ల భయపడటం, మంచీ చెడుల గురించి విచక్షణ కలిగి ఉండటమే ప్రధానం తప్ప, ఆయా వ్యక్తులు డబ్బున్న వాళ్ళా, డబ్బుల్లేని వాళ్ళా అన్నది ముఖ్యం కాదు.

అందుకే అన్నాడేమో మహాకవి గురజాడ "మంచి చెడుగులు రెండే కులములు, ఎంచి చూడగ లోకమందున" అని!

మరొక విషయం చెప్పి, ఈ టపాల మాలిక ముగిస్తాను.

‘లవకుశ’ చిత్రం మనకున్న గొప్ప పౌరాణిక మణిపూస. ఘంటసాల స్వరపరచగా, రామ కధా గానం లీల, పి.సుశీల గాత్రంలో ఇంటింటా మారు మ్రోగిన చిత్రమది!

అందులో... శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించాడని విని, సీతా దేవి, పత్నీ విహీనుడు యజ్ఞం చేసే అర్హత కలిగి ఉండడు కాబట్టి, శ్రీరాముడు పునర్వివాహం చేసుకుని ఉంటాడని సందేహిస్తుంది. విహ్వల చిత్తయై స్మృతి కోల్పోతుంది.

ఆమెని ఊరడించే సన్నివేశంలో, వాల్మీకి మహర్షి పాడినట్లుగా, ఘంటసాల పాట "సందేహించకు మమ్మ! రఘ రాము ప్రేమను సీతమ్మా!" ఉంటుంది.

అందులో వాల్మీకి మహర్షి "రఘు కులేశుడే ధర్మము వీడి,
మరో భామతో కూడిన నాడు.
నాదు జపమూ తపమూ,
నా కావ్యమ్మె వృధ యగు నమ్మా!" అంటాడు.

తాను జీవిత కాలం జపించి, తపించి, జీవన సాఫల్యంగా శ్రీరామ కథను గానం చేశాడు. శ్రీరాముడు సచ్చరితుడనీ, సత్య వాక్పరిపాలకుడనీ, ఏక పత్నీవ్రతుడనీ నమ్మి, శ్రీరాముడి జీవితాన్ని కావ్యంగా వ్రాసాడు.

అలాంటి చోట... తన నమ్మకాన్ని వమ్ము చేస్తూ శ్రీరాముడే మరో భామని చేపడితే, తన జీవితమే వృధా గాక మరేముంటుంది? కాబట్టే మహాపురుషులు సత్య, ధర్మాల కోసం దేన్నైనా వదులుకోవటానికి సిద్దపడేవాళ్ళు. ఎన్ని కష్టాల్నైనా ఎదుర్కొనేవాళ్ళు.

కాబట్టే... ‘నమ్మిన వాళ్ళని వంచించటం ఘోర పాపం’ అంటారు మన పెద్దలు.

అలాంటి చోట... ‘నమ్మకద్రోహమే’ ప్రధాన వనరుగా, కుట్రలు పన్నిన నకిలీ కణిక వ్యవస్థ! తెలిసో, తెలియకో, నకిలీ కణిక అనువంశీయులకి, పనులు నిర్వహించి పెట్టిన ఇంద్రయ్యల వంటి రాజకీయ నాయకులనీ ఏమనాలి?

ఒక్కసారైనా "అరే! ప్రజలు మనల్ని నమ్మి మనకి ఓట్లు వేసారు. తమ కేదో మేలు చేస్తాం అని ఆశతో, నమ్మి, ఎదురు చూస్తున్నారు. జనం సొమ్ము దోచుకుని, వాళ్ళని మోసగించటం పాపకార్యం" అని ఆలోచించలేదే ఈ రాజకీయ రాక్షసులెవ్వరూ? ‘అసలు పాపపుణ్యాలనే ఆలోచనలే తొక్క’ అనుకునే ప్రాక్టికల్ వాదులు మరి!

ఇలాంటి నమ్మక ద్రోహులకి... కోర్టులూ... వాదనలూ... సరియైనవి కావు!

ఈ కలి కాలానికి ‘ఖడ్గం చేపట్టిన కల్కి’ మాత్రమే సరియైన పరిష్కారం!
కాకపోతే ఆ ఖడ్గం జ్ఞాన ఖడ్గం.
‘కల్కి’ ఒక వ్యక్తిగాక, సామూహిక శక్తై, నెం.5 వర్గం కావటమే ఇక్కడ విశేషం!

దాని ప్రారంభకుడు... నిష్కాముడై నిష్కమించిన పీవీజీ కావటం వాస్తవం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~~~~~~

3 comments:

ఏవో సంస్కృతశ్లోకాలకై వెదికి మీ బ్లాగు మీదకు అనుద్ధేశపూర్వకంగా వచ్చాను। ఇక్కడ మీరు అవగ్రహకు బదులు రెండు అంకెను వాడడం చూసి బాధవేసింది।
రెండు అంకె - ౨
తెలుగు అవగ్రహం - ఽ (మీకు డబ్బా కనబడితే మీ గణనిలో ఇంకా అధునాతనీకరించవలసివుంది - మంటనక్కతో పోతన ఖతి వాడితే కాస్త తాత్కాలిక ఉపశమనం వుంటుంది)
లేదా దేవనగరి అవగ్రహం వాడవచ్చు - ऽ

పూర్తివివరాలకు ఈ చర్చాహారము చూడండి

రాకేశ్వర రావు గారు: మీ సూచనకు కృతజ్ఞతలండి. సవరించే ప్రయత్నం చేస్తాను.

మీరు వ్రాసె విషయాల వెనుక చాలా emotions విన్నట్లు అనిపిస్తుంది.

ఎందరొ ఎందరెందరొ బ్లాగులు (in Telugu) వ్రాస్తున్నారు. కొంతమంది తమాషా కొసము, కొంతమంది పేరు కొసము, ఇంకొంతమంది వారికి తెలియదు ఎందుకు రాస్తున్నారొ.

It looks like the words "Corruption", "Congress", "anti-nationalism", "Nepotism" and "Minority Appeasement" (may be it is minority rule) are synonyms.

కుల, ప్రాంత, భాష ముసుగులొ కొట్టుకుంటున్న వారిని చైతన్య వంతం చెయడం అంత సులువు కాదెమొ.

Example: Chiranjeevi.

ఇంత confused వ్యక్తిని ఇంతవరకు చూడలెదు. He want to provide solutions to the present problems of Corruption, Caste-ism, Nepotism, Political Dynasty. What he did. He failed miserably at the ballot box.

Whom he wanted to defeat by entering politics, he did a favor to those same people (RS Reddy) to get elected 2nd term. He is constantly fighting with opposition parties instead of fighting with ruling Congress. With 18 MLA's he is acting as a side kick of Congress.

He bring more Caste-ism and corruption into politics.

It looks like people want to see what they like to see and ignore everything else. And this (like/dislike) constantly changes. And they switch sides/arguments accordingly. No exceptions to this rule.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu