గతంలో తాము జరిపించిన ‘నమ్మకద్రోహం’ రీత్యా, అదే సువర్ణముఖిని... సోనియా, రామోజీరావులు అనుభవిస్తున్నారు. అయితే ఇందులో కేవలం ‘సువర్ణముఖ’ మాత్రమే లేదు. మరో ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన అంశం ఉంది.

దాదాపు రెండున్నర నెలల క్రితం, ఈ బ్లాగులో చెప్పబడిన "ఎవరూ చూడకపోతే ఏం చేసినా ఫర్వాలేదా?" అనే కథలోని ‘గుళికలు’ ఇందులో మిళితమై ఉన్నాయి.

నకిలీ కణిక వ్యవస్థ కీ, నెం.10 వర్గానికీ గూఢచర్య పట్టు నడుస్తున్నంత కాలం, అందులోని కీలక వ్యక్తులూ, వాళ్ళిచ్చిన ఆసరాతో వాళ్ళ ఏజంట్లూ, రాజకీయ రంగంతో సహా అన్ని రంగాలలలో ఉన్న ఏజంట్లూ, యధేచ్ఛగా వ్యవహరించారు. 1992 తర్వాత, నెం.5 వర్గానికి.... అన్నీ అర్దమయ్యాక కూడా, ఓటమి స్ట్రాటజీ ని అనుసరించటంతో, తమకు నడుస్తున్నదనుకొని కొంతా, పట్టు పెంచుకోవాలని మరికొంతా, అవసరమూ అనివార్యమూ అవ్వటంతో మరింతగా ‘ఎవరూ చూడకపోతే ఏం చేసినా ఫర్వాలేదు’ తరహా పనులు నిర్వహించారు.

పైకారణాలు [over leaf reasons] పటిష్టంగా ఉన్నాయో లేవో చూసుకునేంత వెసులు బాటు లేకపోవటంతోనూ, పటిష్టతని పెద్దగా చూసుకోకపోవటంతోనూ, ‘గూఢచర్య తంత్రాలని ఏ విధంగానూ బయటపెట్టలేరులే!’ అన్న భరోసాతోనూ, ‘ద్వంద్వాలని ఎలా దాటతారులే!’... అనుకునీ... వ్యవహారాలు నడిపారు.

‘మెదళ్ళతో యుద్దం’లో భాగమైన ‘ఓటమే స్ట్రాటజీ!’ అర్దంగాక కూడా... అప్పటి పరిస్థితులని బట్టి, అసైన్ మెంట్లని బట్టీ నడిచారు. ఎటూ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు వంటి వాళ్ళకి తెలిసింది... రిమోట్ కంట్రోలుతో డీవీడీని ఆపరేట్ చేయటం వంటి గూఢచర్యమే! తెలిసింది పది స్ట్రాటజీలే! అందులోనూ రెండే ముఖ్యమైనవి ‘ఆడదీ - ఆకలి’ ప్రయోగించటం, లేదా ‘అహాన్ని దెబ్బకొట్టటం - అహం సంతృప్తి పరచటం’.

కాబట్టే - డీవీడీని తయారు చేయటం వంటి నెం.5 వర్గపు గూఢచర్యాన్ని తెలుసుకోలేక పోయారు. అలవాటైన భరోసాతో బాగానే చర్లాట లాడారు. సత్యం, ధర్మం లతోనే కాదు, మానవత్వంతోనూ కూడా చర్లాట లాడారు.

ఇప్పుడు నెం.5 వర్గం... వీళ్ళ ఎదుట ఉంచిన స్థితి... "ఎవరూ చూడకపోతే ఏం చేసినా ఫర్వాలేదు - అనుకుని చేసినవి చెప్పక తప్పదు. తిన్నది కక్కకా తప్పదు."

గత టపాలలో, కథేమిటంటే -

అనగా అనగా....

ధరణి కోట ఓ మోస్తరు గ్రామం. ఒకనాడా ఊరికి ఒక వంటరివాడు బ్రతుకు దెరువుకై వచ్చాడు. వాడి పేరు ఇంద్రయ్య. వాడికి ఊరి చివర ఒక పాడు బడిన పెంకుటిల్లు కనబడింది. విచారిస్తే అది పెదకాపుదని తెలిసింది. నేరుగా పెదకాపు దగ్గరికి వెళ్ళి "అయ్యా! నా పేరు ఇంద్రయ్య! పని పాటు చేసి పొట్ట పోసుకుందామని ఈ ఊరు వచ్చాను. ఊరి చివర నున్న మీ పెంకుటిల్లు నాకు బాడుగకు ఇస్తే అందులో ఉంటాను" అన్నాడు.

పెద్దకాపు వాణ్ణి ఎగాదిగా చూసి "ఆ పెంకుటింట్లో దెయ్యాలున్నాయని అందులో ఎవరూ దిగటం లేదు. నువ్వు కొత్తవాడివి కాబట్టి వచ్చావు. నీకేం భయం లేకపోతే అందులో ఉండవచ్చు. నాకు బాడుగ కూడా ఇవ్వక్కర్లేదు" అన్నాడు.

"పెళ్ళాం బిడ్డలు లేని ఒంటరి గాణ్ణి. నాకేం భయం?" అంటూ ఇంద్రయ్య, పెద్దకాపుకి కృతజ్ఞతలు తెలిపి పెంకుటింటికి చేరాడు.

నాలుగు గదుల ఇల్లు. చుట్టూ ఖాళీ స్థలం. విశాలమైన పెరట్లో పేద్ద చింత చెట్టుంది.

"విశాలమైన గదులు. ఇల్లు లక్షణంగా ఉంది. ముందు ఒక గది శుభ్రం చేసుకుని ఉంటాను. మెల్లిగా ఇల్లంతా శుభ్రం చేయవచ్చు" అనుకుని, ఇంద్రయ్య చీపురుతో ఓ గది బూజులు దులిపి శుభ్రం చేసుకున్నాడు. పొయ్యీ గియ్యీ ఏర్పాటు చేసుకుని వండుకు తిన్నాడు. నులక మంచం తెచ్చుకుని పెరట్లో వేసుకు పడుకున్నాడు. ’నిజంగా ఈ ఇంట్లో దెయ్యాలుండి ఉంటాయా?’ అని ఆలోచిస్తూ, అలాగే నిద్రలోకి జారిపోయాడు.

హఠాత్తుగా అర్ధరాత్రి మెలకువ వచ్చింది ఇంద్రయ్యకి. ‘ఎందుకు మెలకువ వచ్చిందా?’ అని చుట్టూ చూస్తే.... ఎదురుగా గుడ్లురుముతూ నిలబడి ఉందొక దెయ్యం. ఒక్క క్షణం భయం వేసినా, దెయ్యం తనని చూడగానే సతాయించకుండా, నెమ్మదిగా నిద్ర లేపినందుకు కొంత కుదుట పడ్డాడు, మరికొంత ధైర్యం తెచ్చుకున్నాడు.

"ఏమిటి విషయం? నన్నెందుకు నిద్రలేపావు?" అన్నాడు.

"ఇది నా ఇల్లు! ఈ చింత చెట్టు మీద ఏ చప్పుళ్ళు విన్పించకుండా, హాయిగా నిశ్శబ్ధాన్ని ఆనందిస్తూ ఇన్నాళ్ళూ గడిపాను. ఇప్పుడు నువ్వొచ్చావు. వెంటనే ఈ ఇల్లొదిలి ఫో" అంది దెయ్యం హుంకరిస్తూ!

ఇంద్రయ్య రాజీ కోరుతున్న గొంతుతో "చూడూ! నేనా ఒంటరిగాణ్ణి. పగలంతా ఏదో పనీపాటు చేసుకోవటానికి ఊళ్ళోకి పోతాను. సాయంత్రానికి వస్తే నీకు కొంచెం కాలక్షేపంగా ఉంటాను. ఊళ్ళో విశేషాలు నీకు చెప్తాను. నీ నిశ్శబ్ధానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు కదా?" అన్నాడు.

ఆ ప్రతిపాదన దెయ్యానికీ నచ్చింది. "సరే! ఇంతకీ నీ పేరేమిటి?" అంది దెయ్యం. "ఇంద్రయ్య" అన్నాడు.

కొన్ని రోజుల గడిచాయి. రోజూ సాయంత్రానికి దెయ్యం చెట్టుదిగి వచ్చేది. ఇంద్రయ్య వంట చేసుకుంటూ, స్నానపానాలు కానిచ్చి తింటూ, పడుకునే దాకా దెయ్యానికి కబుర్లు చెప్పేవాడు. ఊళ్ళో విశేషాలన్నీ వింటూ దెయ్యానికీ రోజులు సుఖంగా గడిచి పోతున్నట్లనిపించింది. రాను రాను దెయ్యానికి, ఇంద్రయ్య మీద ఇష్టం పెరిగి పోసాగింది.

ఓ రోజు దెయ్యం "ఇంద్రయ్యా! ఇంకా ఎన్నాళ్ళు ఈ కూలీనాలీ పనులు చేసుకుంటూ కష్టాలు పడతావు? నేను నీకొక మంత్రపు గుళిక ఇస్తాను. అది బుగ్గన పెట్టుకుంటే నువ్వు ఎవరికీ కనబడవు. అంతే కాదు, నువ్వు చేతుల్లోకి తీసుకున్న వస్తువులు కూడా ఎవరికీ కనబడవు. కాకపోతే అది నీ నోట్లో ఉన్నంత సేపూ నువ్వు ఏమీ తినలేవు, తాగ లేవు, నిద్రపోలేవు. చివరికి మలమూత్ర విసర్జన కూడా చేయలేవు. అది నోట్లో ఉండగా... ఎవరితోనైనా మాట్లాడితే, మనిషి కనబడకుండా మాట వినబడితే నీకే ప్రమాదం. కాబట్టి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా పని కానిచ్చుకో. అయితే ఇంటికొచ్చాక నాకు జరిగిన విశేషాలన్నీ చెప్పాలి. ఇది షరతు. ఇదిగో ఈ గుళిక బుగ్గన పెట్టుకుని నీ క్కావల్సిన వస్తువులు తెచ్చుకుని హాయిగా ఉండు" అంటూ ఓ గుళిక నిచ్చింది.

ఇంద్రయ్యకిది మొదట నమ్మశక్యం కాలేదు. గుళిక బుగ్గన పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. ఎవరూ తనని పలకరించలేదు. పని చెప్పలేదు. తను ఎదురుగా ఉన్నా పట్టించుకోలేదు. తను ఎవరికీ కనబడటం లేదన్నది ఇంద్రయ్యకి నిర్ధారణ అయిపోయింది.

‘గుళికని ఎలా ఉపయోగించుకోవాలా?’ అని ఆలోచించాడు. మొదట్లో సుబ్బిశెట్టి దుకాణం నుండి పప్పూ బియ్యం వంటి దినుసులన్నీ తెచ్చేసుకుని, ఇంటికి వచ్చి, గుళికని నోట్లో నుంచి తీసేసి వొండుకు తిన్నాడు. ‘కానీ ఏ పని చెయ్యకుండా, రోజూ తిని పడుకుంటే కొన్నాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి అనుమానాలు రావచ్చు. ఆరాలు తీయవచ్చు. ఎలాగా?’ అనుకున్నాడు. బాగా ఆలోచించాడు.

"నేను నగలు, ఇతర విలువైన వస్తువులు దొంగిలించినా దండగ. అమ్మి సొమ్ము చేసుకునేటప్పుడు పట్టుబడవచ్చు. దొంగిలించిన నగలు ఎలాగూ వేసుకు తిరగలేను. అందుచేత, డబ్బు దొంగిలించడమే సౌకర్యంగా ఉంటుంది. అదీగాక ప్రతీసారీ ఇదే ఊళ్ళో డబ్బు దోచేస్తే, ఎంత అదృశ్యంగా చేసినా, కొన్నాళ్ళకి ఊళ్ళో గగ్గోలు అవుతుంది. అందుచేత చుట్టు ప్రక్కల గ్రామాలకీ, పొరుగున ఉన్న పట్టణాలకీ, నగరాలకీ వెళ్ళడం మేలు. తడవకో చోటుకు వెళ్తే సరి!" అనుకున్నాడు.

మొదట అదృశ్యంగా వెళ్ళి, ఊళ్ళో ధనవంతులు డబ్బు దాచుకునే ఇనప్పెట్టెల దగ్గర వేచి ఉండి, వాళ్ళు డబ్బు తీసుకునేటప్పుడు తానూ దండుకునే వాడు. అలా.... సుబ్బిశెట్టి, పెద్దకాపు.... అందరిళ్ళల్లో.... అయిన కాడికి చేతివాటం చూపించాడు. కంటికి కనబడక పోవటం చేత, డబ్బు పోగొట్టుకున్న ఆసాములందరూ.... తామే పొరపాటు పడ్డామని కొందరనుకున్నారు. ఎలా దొంగతనం జరిగిందో అర్దంకాక కొందరు బుర్రబద్దలు కొట్టుకున్నారు.

ఇంద్రయ్య మాత్రం, ఊళ్ళో కనబడ్డ వాళ్ళందరికీ ‘తనకు జబ్బు చేసిందనీ, అందుచేత మునపట్లా రోజూ పనికి వెళ్ళలేక పోతున్నాననీ, పట్టణానికెళ్ళి వారానికి నాలుగు రోజులు వైద్యం చేయించుకుంటున్నానని’ చెప్పసాగాడు. అందరికీ ఇంద్రయ్య, వారంలో రెండు రోజులు పనికి వెళ్ళటం, నాలుగు రోజులు కనబడక పోవటం మామూలు విషయమై పోయింది.

ఇంద్రయ్య యధాప్రకారం.... చుట్టు ప్రక్కలున్న అన్ని ఊళ్ళలో ధనికుల ఇళ్ళల్లో, దుకాణాలలో డబ్బెత్తుకు రాసాగాడు. ఈ విధంగా మూటల కొద్దీ డబ్బు తస్కరించి పెంకుటింటికి తరలించాడు.

పెద్దమొత్తంలో డబ్బు కూడాక ‘తనకు దూరపు బంధువు ఒకాయన చావుబతుకులలో ఉన్నాడని అతని దగ్గరికి వెళ్తున్నానని’ ఊర్లోవాళ్ళందరికి చెప్పి కనపించకుండా పోయాడు. తరువాత కొన్ని రోజుల తరువాత వచ్చి ‘దూరపు బంధువు చనిపోతూ, వారసులు లేనందున తన ఆస్తినంతా తనకు దఖలు పరిచాడనీ, తాను అదంతా అమ్ముకొని తెచ్చుకున్నానని’ ఊళ్ళో వాళ్ళకి చెబుతూ, ధరణి కోటలో తానున్న పెంకుటింటిని, పెద్ద కాపు నుండి, అడిగిన ధర యిచ్చి కొనేసుకున్నాడు. ఇంకా పొలమూ, పళ్ళతోటలూ కొన్నాడు.

అదృష్టం కలిసొచ్చి, హఠాత్తుగా ధనవంతుడై పోయిన ఇంద్రయ్యని, ఊళ్ళో వాళ్ళంతా బాగా గౌరవించసాగారు. ఇంద్రయ్య మాత్రం గుళిక బుగ్గన పెట్టుకుని, ప్రక్కనున్న పట్టణాల్లో డబ్బు దొంగిలించడం కొనసాగిస్తూనే ఉన్నాడు. తడవకో ఊరు వెళ్ళటం, అదృశ్యంగా ధనం దొంగిలించుకు రావడం! మరోసారి మరో ఊరు. మధ్యమధ్యలో... పట్టణాల్లో పూటకూళ్ళ ఇళ్ళల్లో, పర్యాటక స్థలాల్లో విహారాలు చేస్తూ ఆనందించసాగాడు. "అహా! ఇంద్రభోగం అంటే ఇదేనేమో! పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. తాను చేస్తోంది ఎవరికీ కన్పించటం లేదు. ధనికుడిగా అందరూ గౌరవిస్తున్నారు. దెయ్యం ఎంత మంచిదో!" అనుకున్నాడు.

ప్రతీ సారీ తానేమేమీ చేసిందీ దెయ్యానికి చెప్పేవాడు. అది ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడు. చివరికి ‘ఎవరూ తనని చూడటం లేదు కదా’ అని ఇతరుల స్నానాల గదుల్లోకి, పడక గదుల్లోకి తొంగి చూడటం మొదలుపెట్టాడు. క్రమంగా విచ్చలవిడిగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. గుళిక బుగ్గనున్నంత వరకూ తానెవరికీ కనబడడు. ఇంతకంటే భద్రత ఏముంది?

నలుగురు కలిసి మాట్లాడుకునే చోట, అదృశ్యంగా చేరి, ఒకరి వీపు మీద మరొకరు బాదినట్లు భ్రమలు కల్పించి తగవులు పెట్టటం, ఇరుగుపొరుగు వారికి గొడవలు రేపటం గట్రా మనోవికారాలతో చెలరేగి పోయాడు. బురదకు కంపు తోడైనట్లు.... దెయ్యానికి ఇంద్రయ్య, ఇంద్రయ్యకు దెయ్యమూ తోడయ్యారు.

ఇలా ఉండగా....

ఓ రోజు ఇంద్రయ్య, ధరణి కోటకు నాలుగు క్రోసుల దూరాన ఉన్న పట్టణానికి పోయాడు. గుళిక బుగ్గనుండటంతో ఎవరికీ కనబడడయ్యె. పట్టు వస్త్రాల దుకాణానికి వెళ్ళి, యజమాని గల్లా పెట్టె తెరిచినపుడు అందులో తానూ చెయ్యి పెట్టాడు. గుప్పెటి నిండా బంగారు నాణాలు తీసుకున్నాడు.

హుషారుగా బయటకు వచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత యధాలాపనలో గుళికను మ్రింగేసాడు. రాత్రి అయ్యాక తక్కుతూ తారుతూ ఇల్లు చేరాడు. అప్పటికే దెయ్యం ఇంద్రయ్య కోసం ఎదురు చూస్తోంది. ఇంద్రయ్య వాలకం చూసి "ఏమయ్యింది?" అంది ఆదుర్దాగా!

ఆయాసంతో, ఆందోళనతో ఇంద్రయ్య "పొరబాటున గుళికని మింగేసాను. దాంతో అందరికీ కనబడి పోతున్నాను" అన్నాడు.

దెయ్యం "కొంప మునిగింది" అని కీచుగా అరిచింది.

అసలే భయంతో వణుకుతున్న ఇంద్రయ్య, మరింతగా కొయ్యబారి పోతూ "ఏమిటి? ఏమయ్యింది?" అన్నాడు.

"గుళిక బుగ్గన ఉన్నంత సేపే నువ్వు అదృశ్యంగా ఉంటావు. అది కడుపులోకి పోతే నువ్వు అందరికీ కనబడిపోతావు" అంది దెయ్యం.

ఇంద్రయ్య ఏడుపు గొంతుతో "గుళిక మింగినప్పటి నుండీ కడుపులో చిత్రమైన బాధగా ఉంది. నిల్చోలేను. కూర్చోలేను. పిచ్చెక్కినట్లుగా ఉంది" అన్నాడు.

దెయ్యం చల్లగా "అంతేనా! ఇక నుండి తినలేవు, తాగలేవు. నిద్రపోలేవు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేవు" అంది.

ప్రక్కనే మహా విస్పోటనం జరిగినట్లు ఉలిక్కిపడ్డాడు ఇంద్రయ్య. "గుళిక మింగితే ఇంత ప్రమాదం ఉంటుందని నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు?" అన్నాడు కోపంగా!

"నువ్వు అడగలేదు" అంది దెయ్యం నిర్లక్ష్యంగా!

"నీ దుంప తెగా! నువ్వు నిజంగా దెయ్యానివి" ఏడుపూ కోపమూ పెరిగిపోగా ఒక్కసారిగా దెయ్యాన్ని తిట్టేసాడు.

"ఎంత పొగర్రా నీకు? నన్నే తిడతావా?" అంది దెయ్యం గుడ్లురుముతూ!

దెబ్బకి ఇంద్రయ్యకి వాస్తవం ఇంకింది.

"దెయ్యం, దెయ్యం! నీకు దండం పెడతాను. గుళిక మింగినప్పటి నుండీ కడుపులో చిత్రమైన బాధ! భరించలేకుండా ఉన్నాను. ఈ అపాయం నుండి తప్పించవా!" అని వేడుకున్నాడు.

దెయ్యం కూడా విచారంగా తలపంకిస్తూ "ఇంద్రయ్యా! గుళిక నీ కడుపులో ఉన్నంత సేపూ ఈ నరక బాధ తప్పదు. దీనికొక్కటే పరిష్కారం ఉంది. గుళిక బుగ్గన ఉంచుకుని అదృశ్యమైనప్పుడు.... నువ్వు ఏయే పనులు చేసావో, ఎవరెవరికి కీడు చేసావో.... అదంతా, అందరికీ వినబడేటట్లు బహిరంగంగా చెప్పెయ్యాలి. అలా అన్నిటినీ బయటకు కక్కితేనే గుళిక నీ కడుపులో కరిగి జీర్లమైపోతుంది. అప్పడీ బాధంతా పోతుంది" అంది.

"ఏమిటీ? ఎవరూ చూడకుండా ఏమేం చేసానో, బహిరంగంగా అందరికీ చెప్పాలా? అంతకంటే చావటం మేలు" అన్నాడు ఇంద్రయ్య హఠం పోతూ!

"గుళిక నీ కడుపులో ఉన్నంత వరకూ, నీకు చావు కూడా రాదు" చావు కబురు చల్లగా చెప్పింది దెయ్యం!

కెవ్వుమన్నాడు ఇంద్రయ్య! ఎవరూ చూడలేరన్న ఒళ్ళుపొగరుతో తాను చాలానే చేసాడు. డబ్బు దోచుకోవటమే కాదు, తగాదాలు పెట్టటం దగ్గర నుండీ ఇంకా నీచమైన పనులు చేసాడు. ఇప్పుడవన్నీ అందరికీ చెబితే.... ఇప్పటి వరకూ ఊళ్ళో పెద్దమనిషిగా, ధనవంతుడిగా ఉన్న పరువూ మర్యాదా మంట గలిసి పోతాయి. అంతే కాదు, తన చేత భంగపడ్డ వారు, హింస పడ్డవారు, దోచుకోబడ్డ వారు, ఇప్పుడు ఊరుకుంటారా?

"ఏం చేయటం? ఏం దారి?" అంటూ దెయ్యం వైపు చూశాడు. ఏదీ దెయ్యం? ఎప్పుడో పోయింది. దెయ్యం భయం దెయ్యానిది! ఇంద్రయ్య ఇదంతా చెప్పాక, జనం తనని మాత్రం ఊరుకుంటారా? ఏ మంత్రాలో వేసి, సీసాలో బంధించి, భూస్థాపితం చేసి మరీ నాశనం చేస్తారు!" స్వీయ రక్షణలో పడ్డ దెయ్యం ఇంద్రయ్యని వాడి చావుకి వాడిని వదిలేసింది.

ఇంద్రయ్యకి ఏం చెయ్యాలో పాలు పోలేదు. ఎవరికీ కనబడనప్పుడు ఎంత తుళ్ళింతలు పడ్డాడో ఇప్పుడంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. కడుపులో నిలవనీయని బాధ!

‘ఎవరికీ కనబడనప్పుడు ఏం చేసినా ఫర్వాలేదు అనుకున్నాను. ఎవరు చూసినా చూడకపోయినా, దేవుడు చూస్తాడు అనుకోలేదు. దీన్నే పాపం పండటం అంటారేమో’ అన్న విషయం బాగానే ఇంకింది ఇంద్రయ్యకి!

చేసిన వన్నీ వెళ్ళగక్కితే జనమేం చేస్తారో నన్నది అందుబట్టని మరో బాధ అయ్యింది. కడుపులోనూ బాధే, బయటా బాధే!

ఇదీ కథ!
~~~~~

అప్పటి టపాలో నేను ఇంద్రయ్య కథ మాత్రమే వ్రాసాను. అనువర్తన వ్రాయలేదు. ఆ కథలోని ‘ఇంద్రయ్య’ ఈనాడు రామోజీరావు కాదు. అతడివ్వగా ‘గూఢచర్యం’ అనే ‘గుళికలు’ బుగ్గనేసుకుని, ‘ఎవరూ చూడకపోతే ఏం చేసినా ఫర్వాలేదు’ అనుకున్న చంద్రబాబు, శరద్ పవార్, మూలాయం, కళ్యాణ్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన ఠాక్రే, శరద్ యాదవ్ గట్రాలు, అన్ని పార్టీలలో చాలా మందే ఉన్నారు. ఇంద్రయ్యకు ఎలియాస్ లే వీళ్ళందరూ!

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు భరోసా ఇవ్వగా [అచ్చం ఆ కథలోని దెయ్యం లాగానే], పైకారణాలతో [over leaf reasons] ప్రయోగింపించగా [అచ్చం కథలోని గుళిక బుగ్గన పెట్టుకోవటం లాగా], ఇంద్రయ్యలాగా చెలరేగిపోయిన వాళ్ళే వీళ్ళంతా!

చేసినవి చెప్పకపోతే, మింగిన గుళిక కడుపులో చేరి - కూర్చోనివ్వదు, నిల్చోనివ్వదు, తిననివ్వదు, తాగ నివ్వదు. నిద్రపోనివ్వదు, మల మూత్ర విసర్జన కూడా చేసుకోనివ్వదు. చిత్రమైన బాధ! చావు కూడా రాని బాధ! కడుపులోనూ బాధే, బయటా బాధే!

సరిగ్గా అలాంటి బాధే ఈ రాజకీయ ఇంద్రయ్యలది! ‘రాజకీయలంటేనే నానా నీచం, పెద్ద నేరం’ అన్న అర్దం వచ్చేటట్లు - సదరు రాజకీయ నాయకులే... "ఫలానా విషయంలో ఫలానా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు" అనేస్తున్నారు.

అంతగా రాజకీయాలని నేరం, అవినీతి మయం చేసేశారు. అలాంటి రాజకీయాలనే దండిగా చేసేసి, జనం సొమ్ముని బాగా దండుకొని, పెట్టుబడులుగా మార్చుకుని.... పరిశ్రమలు, వ్యాపారాలూ పెట్టుకున్నారు. విదేశీ బ్యాంకులలో రహస్య ఖాతాలలో దాచుకున్నారు. అదంతా కక్కకా తప్పదు, చేసిందంతా చెప్పకా తప్పదు.

ఈ విషయమై మీకు, ఒక సుస్పష్టమైన వర్తమాన ఉదాహరణ ఇస్తాను.

నాలుగైదేళ్ళ క్రితం భాజపా అగ్రనేతల్లో ఒకడూ, భాజపాకు ఆర్దిక సమీకరణలు చేసే శక్తిమంతుడూ, యంగ్ టర్క్ గా పేరు గాంచిన వాడూ అయిన ప్రమోద్ మహాజన్ ని, అతడి సోదరుడు ప్రవీణ్ మహాజన్, తుపాకితో కాల్చి చంపాడు. [ఆ తర్వాత మొద్దుశీను హంతకుడు అనారోగ్యంతో మరణించినట్లే, ప్రవీణ్ మహాజన్ కూడా అనారోగ్యంతో మరణించాడు లెండి.]

భాజపాలో ముఖ్యనేత అయిన ప్రమోద్ మహాజన్ ది పార్టీ ఆర్దిక లావాదేవీలలో ప్రముఖ పాత్ర అనీ, మహారాష్ట్ర నుండి, ముఖ్యంగా ముంబై తెర మీది వ్యాపారుల నుండీ, తెర వెనుక గాడ్ ఫాదర్ ల నుండీ కూడా, భాజపాకి నిధులు సమకూర్చటంలో దిట్ట అనీ పేరుంది. పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ.కీ, అది నిలబెట్టిన బొమ్మ దావూద్ ఇబ్రహీంకీ ముంబైపై గట్టి ‘పట్టు’ ఉందని ఇప్పుడందరికీ తెలిసిందే!

అలాంటి ముంబై నుండి... డబ్బు సమీకరించాలంటే ప్రమోద్ మహాజన్ కి ఎవరెవరితో సంబంధాలుండాలో, ఎవరెవరి సహకారం ఉండాలో సామాన్య ప్రజలు ఊహించలేరు గానీ, భాజపా అగ్రనేతలకీ, ముఖ్యంగా అద్వానీకి బాగానే తెలుసు కదా! అలాగే అన్ని పార్టీల ముఖ్య నాయకులకూ బాగానే అర్దమవుతుంది.

అయినా గానీ, ప్రమోద్ మహజన్ ని, అతడి సోదరుడే ‘వ్యక్తిగత భావోద్రేకాలు’ అనే పైకారణంతో [over leaf reason తో] కాల్చి చంపేస్తే ఎవరూ నోరెత్తలేదు. ఎక్కడ ఏ లీకులు పొక్కాయో, తద్వారా అతడు బ్రతకటం ఎవరికి ప్రమాదకరం అనిపించిందో! అప్పుడయితే చంద్రబాబుకి, అందరి కంటే ఒక అడుగు ముందరే ‘అభద్రత’ అర్దమయ్యింది.

దెబ్బతో అప్పటి వరకూ వివాదాలున్న తమ్ముడు రామ్మూర్తి నాయుడితో రాజీ చేసుకున్నాడు. సత్సంబంధాలు నెలకొల్పుకున్నాడు. రామ్మూర్తి నాయుడి కుమారుడు నారా రోహిత్ కి ‘బాణం’ వంటి సినిమాలతో ‘కెరియర్’ తెచ్చే ప్రయత్నాలు చేసాడు. అదీ... గూఢచర్యాన్ని అవగాహన చేసుకోగల చంద్రబాబు నైపుణ్యం [Talent!]!

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే - ప్రమోద్ మహాజన్ చేసిన దేశద్రోహపు సువర్ణముఖి అతడి మరణంతో అంతరించి పోలేదు. అతడి ఆస్తిపాస్తులకి వారసుడైనట్లే, అతడి పాప పుణ్యాలకి కూడా, అతడి కుమారుడు రాహుల్ మహాజన్ వారసుడయ్యాడు. డ్రగ్స్ వాడిన కేసులలో చిక్కుకున్నాడు. మొదటి భార్యని హింసించిన కేసులూ, చెడ్డపేరూ మిగుల్చుకుని విడాకులు పొందాడు. ఇప్పుడు రెండో భార్యతోనూ అదే కథ!

అతడి తండ్రి సహచరులలో ఎవ్వరూ, అతడికి సహయ సహకారాలు అందివ్వటం లేదు సరికదా, సలహాలు కూడా ఇవ్వటం లేదు. ప్రమోద్ మహాజన్ కుమారుడి స్థాయికి, డ్రగ్ కేసులు అసలు బయటకే రాకుండా ఉండేవి. ముంబై సినిమా ప్రపంచంలో, ఇవి చాలా సాధారణమైన విషయాలు. ఒకరకంగా రాహుల్ మహాజన్, మిగతా రాజకీయ నాయకులకు దెబ్బలబ్బాయి లాంటి వాడే!

కాబట్టి - చేసేవి చేసి, చచ్చినా లాభం లేదు. తాము చేసిన ‘కర్మల ఫలం’ తమ సంతతి అనుభవించాల్సి రావటం ఇప్పుడు రామోజీరావుతో సహా ఇంద్రయ్యలందరికీ ఎదుట ఉన్న స్థితే! దాన్నే అనుభవిస్తున్నాడు వై.యస్. జగన్! మరణించిన వైయస్సార్ ‘కర్మల ఫలితమే’ ఇప్పుడు వై.యస్.జగన్ కి ఎదుట నిలిచి, కాంగ్రెస్ అధిష్టానంతో అంతర్లీన పోరు చేయిస్తోంది.

వై.యస్సార్ మరణించిన తరువాత, జగన్ Vs కాంగ్రెస్ అధిష్టానం అంతర్లీన పోరులో, ఇరు వర్గాలు తాత్కాలిక రాజీ చేసుకొన్నాయి. అధిష్టానం, జగన్ ద్వారానే సీఎల్పీ సమావేశంలో రోశయ్యని సీఎంగా ప్రతిపాదింపచేసింది. కానీ కొంత కాలం తర్వాత, అధిష్టానం వరుస క్రమంలో, అతడి ఆర్దికమూలాల మీదకి వెళ్ళక తప్పలేదు. దాని పర్యవసానంగా జగన్, అధిష్టానంతో తలపడక తప్పటం లేదు. ఈ విధంగానే రెండు వర్గాలు కొట్టుకొని, తమ అవినీతి కుంభకోణాలు చెప్పుకోక తప్పదు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం, వైయస్సార్ అవినీతి అవకతవకలు బయటపెడతానని బెదిరింపులు చేస్తున్నది కదా!

ఇలాగే కాంగ్రెస్ అధిష్టానం ముందుకే వెళ్తే, జగన్ తన చేతిలో ఉన్న ‘అధిష్టానం గుట్టుమట్లు’ గురించి ఎన్ని విషయాలు బయటపెట్టాలో!!!?

మరోసారి ఇంద్రయ్య కథ దగ్గరికి కొస్తే... కొన్నేళ్ళ క్రితమే... నెం.5 వర్గం... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తి రామోజీరావుకి ‘చేసిందంతా బహిరంగంగా ప్రజలకి చెప్పుకోక’ తప్పదని అల్టిమేటం ఇచ్చింది. చదరంగపు క్రీడ వంటి గూఢచర్యంలో ‘మెదళ్ళతో యుద్దం’తో నెం.5 వర్గం... రామోజీరావుకి అనివార్యం చేసిన స్థితి ఇది.

‘నేను రాష్ట్ర స్థాయి చిన్నపత్రికాధిపతినే అని చిన్నఛావు ఛస్తావా? లేక మొత్తం నకిలీ కణిక వ్యవస్థలోనే కీలక వ్యక్తిగా పెద్ద ఛావు ఛస్తావా?’ అన్న డీల్ కూడా ‘కన్నా?కాలా?’ వంటి స్ట్రాటజీ ద్వారా పెట్టటం గురించి, నా గత టపాలలో వివరంగా వ్రాసాను.

ఈ నేపధ్యంలో రామోజీరావు "నేను చెప్ప! చెప్పనంటే చెప్ప! అని మొండికెత్తి కూర్చుంటాను. ఏం చేస్తారు? మొండి వాడు రాజు కంటే బలవంతుడు" అనుకున్నాడు. "మొండితనం చూపిస్తున్నానని నటిస్తూ, మరో ప్రక్క నా ప్రయత్నాలు మరో రకంగా చేసుకుంటాను. పరిస్థితులు మళ్ళీ పట్టు చిక్కితే చెయ్యలేని దేమిటి?" అనే కుత్సితపు ఆలోచనలూ చేసాడు, చేస్తున్నాడు. [అందుకే ఒకప్పుడు పత్రిక నవాబుగా వెలుగొందిన రామోజీరావు ఈనాడు దినపత్రిక, నానాటికీ కునారిల్లుతూనే ఉంది.]

దానికి సమాధానంగా నెం.5 వర్గం "సరే! ఎటూ నువ్వు చేసింది చెప్పనంటున్నావ్ కదా? నువ్వు ఎవరెవరి చేతనైతే... ఏమేం చేయించావో... వాళ్ళ చేతే అవన్నీ చెప్పిస్తాము. ఎంతెంత తినిపించావో, ఏయే ప్రయోజనాలని ‘Exchange favours'గా ఇచ్చావో, అవన్నీ కూడా కక్కిస్తాము. ఒక్క రాజకీయ నాయకుల చేతే కాదు, నీ సోదరీ తుల్య సోనియాతో సహా! ఆమెకి వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేసే అహ్మద్ పటేల్ లే కాదు, గతకాలంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన విన్సెంట్ జార్జీలతో సహా!

అసలుకే వ్యక్తిగత కార్యదర్శులకి లోతట్టు సమాచారాలు చాలానే తెలుస్తాయి. నిర్వహించాల్సిందే వాళ్ళు కదా? అందుకే గదా, శిబూ సోరెన్ ల దగ్గరి నుండి చాలామంది రాజకీయ నాయకులు, తమ పూర్వపు సెక్రటరీలని హత్యలు చేసి చేయించి, కేసుల్లో ఇరుక్కున్నారు. కాబట్టి, నువ్వు [విషయాలు కక్కక పోయినా] చేసింది చెప్పకపోయినా... ముంచుకు పోయిందేమీ లేదు! వాళ్ళందరి చేత విషయాలు కక్కిస్తాం!" - అన్న హెచ్చరికే రామోజీరావుకి ఇవ్వబడుతోంది!

చంద్రబాబు వంటి ఇంద్రయ్యలు ఈ దేశం నిండా చాలామందే ఉన్నారు. నాలుగురోజులకే చంద్రబాబు ‘బేర్’ అన్నాడు! ‘బ్రేక్’ కావటం ఎంత సేపు? నాలుగు రోజులకి కాకపోతే నలభైరోజులు, అప్పటికీ కాకపోతే నాలుగు....

ఈ అందర్నీ, అన్నిరోజులూ బ్యాలెన్స్ చేసుకోవటమంటే అదే పెద్ద శిక్ష! ఇంద్రయ్యల వంటి చంద్రబాబు, మరణించిన వై.యస్. ఆస్తిపాస్తులతో పాటు అతడి పాప పుణ్యాలకు వారసుడైన జగనూ,... ఇలా ప్రతీ రాష్ట్రంలోనూ ఎందరున్నారో రామోజీరావుకి బాగానే తెలుసు! అందర్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి! ఒక్క రాజకీయ రంగమే ఇలా ఉంటే, ఆర్దిక మాంద్యపు పుట్రలో పుటం వేసికాల్చుతుంటే, అంబానీల వంటి ఆర్దిక దిగ్గజాలు ఎన్ని విషయాలని కక్క వలసి వస్తుందో! వాటన్నిటినీ, వాళ్ళందరినీ కూడా... బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే! అది వాళ్ళకీ శిక్షే! రామోజీరావు కీ శిక్షే!

ఈ శిక్షని...నిండా కన్నాలతో, ఎక్కడిక్కడి దేశాల నుండో కాపీ/పేస్ట్ చేసి తెచ్చుకున్న రాజ్యాంగమూ, ఇండియన్ పీనల్ కోడూ వెయ్యలేవు గనక వెయ్యలేవు. అసలుకే శతాబ్దాల తరబడి నెరపిన తమ గూఢచర్య వలయంలో ‘మానవత్వం’ అనే ముసుగు వేసుకొని, నేరగాళ్ళని కాపాడేటందుకు మాత్రమే ఉపయోగ పడేటట్లు తయారు చేసుకున్న రాజ్యాంగాలూ, అడ్మినిస్ట్రేషన్ లూ, కోర్టు పనితీరులూ నయ్యె!

అలాంటి చోట.. చంద్రబాబుల్లాంటి ఇంద్రయ్యలనందర్నీ... గల్లీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకూ ‘బ్యాలెన్స్’ చేసుకోవటం కంటే ‘రసవత్తరమైన శిక్ష’ నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకు మరొకటుండదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

10 ఏళ్ళ క్రితం సోనియా వ్యక్తిగత కార్యదర్శి హోదాలో జార్జి ఒక వెలుగు వెలిగాడు. ఎందుకోగానీ ఇప్పుడు కనిపించడం(వినిపించడం) లేదు. ఇకపోతే పైన మీరు చెప్పిన లిస్టులో చంద్రబాబు, శరద్ పవార్ లు తప్ప మిగతా అందరూ ఎమర్జెన్సీ సమయంలో జైలు కెళ్ళిన వాళ్ళే. అప్పటికి చంద్రబాబూ, పవార్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఎమెర్జెన్సీ సమయంలో జైలుకెళ్ళిన వాళ్ళంతా ఆ తరువాత చిత్రంగా దేశ నాయకులైపోయారు . ఎమెర్జెన్సీ లో జైలుకెళ్ళారంటే వాళ్ళూ ఇందిరకు వ్యతిరేక మని అర్ధం. లాలూ అయితే ఏకంగా తన కూతురుకి మీసా భారతి అని పేరు పెట్టాడు. లాలూ మీసా (MISA - Maintnence of internal security act ) చట్టం కింద అరెస్టయ్యి జైలుకెళ్ళిన సంధర్భంలో ఆమె పుట్టిందట. ఎమర్జెన్సీ చీకటి రాత్రులు గురించి చెప్పే లాలూ తన రాక్షస పాలనతో బీహార్ను దశాభ్దం పాటు చీకటిలో ఉంచాడు. ఎమెర్జెన్సీ చీకటి రోజులని ఈనాడు తెగ రాస్తుంటుంది . ఎవరికి చీకటి రోజులూ? ప్రజలకా లేక నాయకులుకా? పత్రికలకా ? పత్రికలు రాసేవాటిలో నిజాలెన్నో ఇప్పుడు మనందరికీ తెలుసు. ఎమర్జెన్సీలో ప్రభుత్వ ఆఫీసులన్నీ సమయానికి తెరిచేవారనీ, రవాణా వ్యవస్తలన్నీ(బస్సులూ, రైళ్ళూ వగైరా) సక్రమంగా నడిచేవనీ అందరికీ తెలుసూ. అప్పట్లో మన దేశ రవాణా వ్యవస్త మీద బోలెడు జోకులుండేవి. ఇండియాలో సమయానికి ఏదీ దొరకదని. ముఖ్యంగా రైళ్ళ రాకపోకలమీద బోలెడు జోకులూ కార్టూన్లూ అన్నీను. ఎమెర్జెన్సీలో ఒక్క సామాన్యుడు కూడా ఇబ్బంది పడలేదని అందరికీ తెలుసు .పత్రికలమీద సెన్సార్ ఉండేది. మరి ఎమెర్జెన్సీ చీకటి రోజులు ఎలా అవుతాయి. ఎమెర్జెన్సీలో జైలుకెళ్ళిన 90% మంది ఇప్పుడు నాయకులుగా చాల పెద్ద స్తాయిలో ఉన్నారు. అప్పటికి వీళ్ళంతా అనామకులు . ఎమెర్జెన్సీనే వీళ్ళకా స్తాయి కల్పించింది .కాదుకాదు నకీలీ కణిక వ్యవస్తే వీళ్లకా స్తాయి కల్పించింది. ఎందుకంటే వీళ్ళు ఇందిరను వ్యతిరేకించారు కాబట్టి. అద్వానీ, లాలూ , శరద్ యాదవ్, వాజ్పేయ్ , నితీష్ కుమార్, నరేంద్ర మోడి, ఎడ్దియూరప్ప, వెంకయ్యనాయుడు , జార్జి ఫెర్నాండెజ్ , ములాయం, మరి ఇందిరకు వ్యతిరేకులు అయిన వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ కు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? లెక్క ప్రకారం చెయ్యకూడదు కదా.

అజ్ఞాత గారు: పదునైన పరిశీలన అందించారు. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu