చంద్రబాబు ‘సువర్ణముఖి’ని రెండు రకాలుగా అనుభవిస్తున్నాడు.

ఒకటి - మాకు చేసిన కర్మల ఫలంగా!

మరొకటి - ఈ దేశానికి, రాష్ట్రప్రజలకి చేసిన కర్మల ఫలంగా!

వాటి గురించి వివరించే ముందు ఒక పోలిక చెబుతాను.

మనం ఒక చిన్న పిల్లవాడికి "నాయనా! ప్రతిరోజూ సూర్యుడు ఒక దిక్కునే ఉదయిస్తాడు. ఆ దిక్కుని తూర్పు అంటాం" అనో, లేక "నాయనా! ప్రతి రోజూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు" అనో, చెప్పామనుకోండి!

దాన్ని నమ్మడానికి ఆ పిల్లవాడు నాలుగు రోజులో, నలభై రోజులో సూర్యోదయాన్ని పరిశీలిస్తే చాలు, నిర్దారించుకోగలుగుతాడు. నమ్మకాన్ని స్థిర పరుచుకోగలుగు తాడు. ఎందుకంటే - అది చర్మ చక్షువులకి కనబడే దృశ్యం!

అదే ఒక వ్యక్తికి, "నాయనా! ధర్మోరక్షితి రక్షితః అంటారు పెద్దలు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది" అనో, లేక "నాయనా! మనం చేసుకున్న కర్మఫలం మనమే అనుభవిస్తాం. అంచేత సత్కర్మలే చెయ్యాలి" అనో, చెప్పామనుకొండి.

దాన్ని నమ్మడానికి, ఆ వ్యక్తి, నాలుగు రోజుల్లోనో, నలభై రోజుల్లోనో పరిశీలనలూ, నిర్దారణలూ చేసుకోలేడు. దాన్ని పరిశీలించడానికి ఒకోసారి జీవిత కాలం పడుతుంది. అదీగాక అది భౌతిక దృష్టికి స్పష్టపడటం అరుదుగా జరుగుతుంది. అంతశ్చక్షువులతో, జ్ఞాన దృష్టితో గ్రహించవలసి వస్తుంది.

వేల సంవత్సరాల క్రితం, ఈ గడ్డమీద జన్మనెత్తిన వారు, ఎక్కువగా ఈ నమ్మకాలని కలిగి ఉండేవాళ్ళు. ‘చేసుకున్న కర్మ అనుభవించక తీరదు!’ ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!’ వంటి పెద్దల మాటలు, సూక్తులు, తత్వాలు, ఇతిహాసాలు, మత విశ్వాసాలు, ప్రజలని ఈ విషయమై నిత్య జాగరూకులని చేసేవి.

నమ్మకాలు సడలిపోయి, సంస్కృతీ సంప్రదాయాలు మరిచిపోయి, ‘డబ్బూ అధికారాలతో ఏమైనా చేసేయ వచ్చు’ అనుకునే పదార్ద వాదం పెరిగిపోయాక.... సత్యాలను చూడగల కన్నూ, గ్రహించగల బుద్దీ చాలా మందిలో కరువయ్యాయి.

అయితే, ఒక్కసారి, మన మీద పరచుకున్న కృత్రిమ ప్రచారాల మాయ అనే తెరలని తొలగించి చూస్తే, ‘ఎవరైనా సరే, చేసుకున్న కర్మఫలం అనుభవించే తీరతారు’ అన్న సత్యం మన కళ్ళముందే ఉంది.


అలాంటి వాటిల్లో ఒకటి ‘చంద్రబాబు ని, అతని బృందాన్ని మరాఠా పోలీసులు కుళ్ళ బొడవటం’.

ఇక మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి ని వివరించే ముందు....

‘హలో బ్రదర్’ సినిమాలోని రెండు హాస్య సన్నివేశాల్ని చెబుతాను.

నాగార్జున ద్విపాత్రిభినయం చేసిన ఆ సినిమాలోని తొలి సీన్లలో.... దొంగ అయిన నాగార్జున, అతడి అనుచరుడు & కమేడియన్ బ్రహ్మనందం జైలు నుండి పారిపోయి, పోలీసుల జీపుని చేజిక్కుంచుకొని, బ్యాంకు నుండి వస్తున్న గిరిబాబు క్యాష్ బ్యాగు కొట్టేసిన దొంగ [రమ్యకృష్ణ] వెంట బడతారు. జీపులో డ్యాష్ కొట్టి, క్రిందబడిన ఆ మోటర్ సైకిలిస్ట్ తో, నాగార్జున...

"ఏరా! పవిత్ర భారత దేశంలో పుట్టేసి, నెత్తిన హెల్మెట్ పెట్టేసి, దొంగతనం చేస్తావా?" అంటాడు.

వెంటనే బ్రహ్మానందం... "గుర్రంలా ఉన్నావ్! గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతకక, పిల్లిలా దొంగతనం చేస్తావా?" అంటాడు.

అంతలో ఆ ‘మోటార్ సైకిలిస్ట్ కమ్ దొంగా’ మగవాడు కాదనీ, ఆడ లేడీస్ అనీ అర్దమయ్యాక, వాళ్ళు పండించే హాస్యానికి మనం నవ్వుకుంటాం.

అయితే తదుపరి కథలో, ఈ సీన్ కి కొనసాగింపు ఉంటుంది. నాగార్జున, బ్రహ్మానందాలు, బంగారు నగల తాకట్టు దుకాణానికి వెళ్ళి, సేటు [జెన్ని] కి ఠోకరా ఇచ్చి, అతడి నగలు వీళ్ళు చేతుల్లోకి, వీళ్ళ కత్తి అతడి చేతిలోకి వచ్చేటట్లుగా ట్రాప్ చేస్తారు. "నాకీ నగలు నాకీ ఇవ్వండి" అనే సేటుని, ‘తమ నగలు కాజెయ్యాలని సేటు తమని కత్తితో బెదిరించాలని చూస్తున్నాడంటూ’ బనాయిస్తారు. న్యాయం చెప్పమని చుట్టూ ఉన్న వారి నడుగుతారు. ఇంతలో పోలీసు వేషంలో వచ్చిన హీరోయిన్ [రమ్యకృష్ణ]....

"నేను చెబుతాను. పవిత్ర భారత దేశంలో పుట్టీ, అమాయకుల జేబుల్లో బీడీలు పెట్టి, కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా!" అంటుంది. డైలాగ్ కొనసాగిస్తూ "నత్తల్లా ఉన్నారు. పీతల్లా పని చేసుకుని, బాతుల్లా బతకక, కోతుల్లా దొంగతనం చేస్తారా, రౌడీల్లారా!?" అంటుంది. అది విన్న బ్రహ్మానందం సాలోచనగా "ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందే?" అంటాడు.

అప్పటికే తత్తర చూపులు చూస్తున్న నాగార్జున "విన్నట్లు కాదు, అన్నట్లుంది!" అంటాడు.

సరిగ్గా అదే పరిస్థితి... బాబ్లీ యాత్రలో చంద్రబాబుది!

ఏ విధంగా అంటే....

1995 సెప్టెంబరు లో చంద్రబాబు, మామ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటికి మేము మా బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నాము.. మా నాన్న గారప్పటికి స్వర్గస్తులయ్యారు. అమ్మా చెల్లీ, తమ్ముళ్ళు [ఈ పోరాటం తమ వల్ల కాదని] హైదరాబాద్ వెళ్ళిపోయారు.

1992లో నేదురుమల్లి జనార్దన రెడ్డి ప్రభుత్వం దిగిపోయి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ప్రభుత్వం ఎక్కే సమయంలో మా ఫ్యాక్టరీ సీజ్ చేసిన APSFC అధికారులు, 1995 వరకూ తిరిగి చూడలేదు గానీ, మా అమ్మా, చెల్లీ,తమ్ముళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాక, 1995 అక్టోబరులో వచ్చి, ఫ్యాక్టరీ ఖాళీ చెయ్యమన్నారు.

మేం మకాం నంబూరు పల్లెకు మార్చాము. అప్పటి వివరాలన్నీ నా గత టపాలు ‘పీవీజీ-రామోజీరావు-మా కథ’ అనే లేబుల్ లో ఉంచాను. 1995 ద్వితీయార్దంలో, నంబూరులోని మా ఇంటి క్రింది వాటాల వాళ్ళు, మమ్మల్ని మంచీనీళ్ళు పట్టుకోనిచ్చే వాళ్ళు కాదు. బావి నీళ్ళ మోటారు మీద నీళ్ళు పోసి, చీటికి మాటికి కాల్చేసేవాళ్ళు. మంచినీళ్ళు, కొళ్ళాయి వస్తున్నంత సేపూ వాళ్ళే పట్టుకునేవాళ్ళు. పైవాటాలో ఉండి నీళ్ళు మోసుకోవటం అంటే చాలా కష్టంగా ఉండేది.

దీనికి అదనంగా కరెంటు వేధింపులూ ఉండేవి గానీ, ప్రస్తుతానికి నీటి వేధింపు గురించి చెబుతాను. [ఈ నీళ్ళూ, కరెంటు వేధింపులు మా మీద 2007 దాకా ప్రయోగింపబడుతూ ఉన్నదే లెండి.] ఈ వేధింపుల నేపధ్యంలో 1997 మార్చిలో, నంబూరులో మా వారి మీద భౌతిక దాడి జరిగింది. మా వారి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. అందరూ చూస్తూ ఉన్నారే గానీ, ఒక్కరూ సాయం రాలేదు. కనీసం మాట సాయం కూడా!

మేము పోలీసు కేసు పెట్టడానికి వెళ్తే, పోలీసులు "ముందుగా వాళ్ళే మీ మీద కేసు పెట్టారు" అన్నారు.

అప్పట్లో రాజీవ్ త్రివేది అనే ఐపీఎస్ అధికారి, గుంటూరుకు ఎస్పీగా ఉండేవాడు. అతణ్ణి కలిసి ఫిర్యాదు చేస్తే "మీరు చదువుకున్నారు. వాళ్ళు ఇల్లిటిరేటెడ్. ఏమో! మీరే వాళ్ళ మీద కేసు బనాయిస్తున్నారేమో?" అన్నాడు. అక్కడ వ్యక్తుల [మాతో సహా] మోటివ్స్ గానీ, కెరీర్ & ప్రీవియస్ రికార్డు గానీ పట్టించుకోలేదు. ఇక అనవసరం అనుకొని, నంబూరు నుండి గుంటూరుకు మకాం మార్చుకున్నాము.

ఇదే మాటను, ఇదే ట్రిట్ మెంట్ నూ, మేము సూర్యాపేటలోనూ ఎదుర్కొన్నాము. ఆ వివరాలన్నీ నేను నా గత టపాలు [వ్యవస్థీకృత వేధింపు] లలో ఉంచినవే!

వెరసి నంబూరు గ్రామంలో ‘నీళ్ళు’ అన్న పైకారణం [over leaf reason]తో మా మీద భౌతిక దాడి చేయటం, బూతులు తిట్టటం, మా కంటే ముందే వాళ్ళే కేసులు పెట్టడం, మేము క్రిందే ఉంచిన ఇనప సామానులు దొంగతనం చేయటం గట్రాలు చేసారు. అంతేగాక మా విద్యార్ది తల్లిదండ్రులే గాక, ఊరి వాళ్ళు కూడా ఎవ్వరూ సహాయం చేయటానికి రాలేదు.

ఇలాగే, సూర్యాపేటలో... మా ఇంటి ఓనరు భాగ్యలక్ష్మి! గతంలో ఆ ఊరిలో ఉన్న ఒక సంపన్నుడి ఇంటిలో పనిమనిషిగా ఉంటూ, తన స్త్రీత్వాన్ని ఎర వేసి, ఉచ్చు బిగించి, యాగీ [బ్లాక్ మెయిల్] చేసి ఆస్థి వ్రాయించుకున్న రికార్డు కలది. ఆమె భర్త అంతకు ముందు టైలరు. తర్వాత చికెన్ కొట్టు యజమానులయ్యారు, పెద్ద ఇల్లు కట్టారు.

ఇదంతా ఆ ఇంటిలో దిగక ముందు మాకు తెలియదు. ముందుగా మాట్లాడుకున్న నియమాలన్నిటినీ ఉల్లంఘించీ, ఆమే మమ్మల్ని... నీళ్ళు, కరెంటు గట్రా అన్ని విధాలుగా వేధించింది. ఉన్న ఫళంగా ఇల్లు ఖాళీ చేయమంటుంది. ఊళ్ళో మరెవ్వరూ ఇల్లివ్వ మంటారు.

ఈ నేపధ్యంలో ఆమె మమ్మల్ని బండబూతులు తిట్టింది. పోలీసులు ఎంత రఫ్ డీల్ చేశారంటే, ఓ రోజు ఓ హోంగార్డు వచ్చి "ఎస్.ఐ.గారు పిలుచుకురమ్మన్నారు మిమ్మల్ని! ఏడీ నీ మొగుణ్ణి బయటకు పిలు!" అన్నాడు. ఎంసెట్ ర్యాంకుల అవకతవకలపై ఫిర్యాదు ఇచ్చినందుకు, మేము ఎదుర్కొన్న వ్యవస్థీకృత వేధింపు అది!

ఇంటికి తాళం వేయటం, పాల వాణ్ణి సైతం రానివ్వక పోవటం గట్రా వేధింపులతో బాటు, నిరంతరం బూతులు తిట్టేది. అద్దె తీసుకోవటానికి తిరస్కరించింది. పోలీసులతో "మేము గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాము. ఎంసెట్ మీద ఫిర్యాదు ఇచ్చిన లెక్చరర్ ని, ఇలా 420 లా డీల్ చేయటం సరికాదు" అని ఆక్రోశంతో వాదించాను.

మా ఇంటి ఓనరు "చావగొట్టి నట్టింట పాతేసినా అడిగే దిక్కులేదు. ఏం చూసుకుని ఇంత పొగరు" అని మమ్మల్ని ఉద్దేశించి అనేది.

గుంటూరు ఎస్పీ రాజీవ్ త్రివేది లాగానే, నల్గొండ ఎఎస్పీ శివానంద రెడ్డి ఐపీఎస్, "మీరు చదువుకున్న వాళ్ళు. వాళ్ళు చదువు రానివాళ్ళు. మీరే వాళ్ళని harass చేయటం లేదని గ్యారంటీ ఏమిటి?" అన్నాడు.

వెరసి ఎంసెట్ ర్యాంకుల ఫిక్సింగ్, ఇంటర్ పేపర్ లింకుల మీద ఫిర్యాదు చేసినందుకు ‘ఇల్లు ఖాళీ చేయటం’ అన్న పైకారణం [over leaf reason]తో పోలీసులు, అన్నిపార్టీల రాజకీయ నాయకులు, మా విద్యార్దుల తల్లిదండ్రులతో సహా సహాయం చేయకుండా, అందరూ కలిసి వ్యవస్థీకృతంగా వేధించారు.

సూర్యాపేట లో సాయం కోసం మేము అన్ని పార్టీ నాయకులు దగ్గరికి వెళ్ళాము. వేధింపు మరింత పెరగటమే గానీ, ఒక్కరూ పైకారణంగా ఉన్న ఇంటి సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇంటికి దాదాపు 47వేల రూపాయల కరెంట్ బిల్లు ఇచ్చారు. అదీ వేధింపు స్థాయి! సూర్యాపేట లోనే... ‘Increase of expenditure and Decrease of income' అన్న స్ట్రాటజీ మాకు చూపించబడింది.

వీటన్నింటిని తర్వాత, ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్ట బడితే, కొన్ని నెలలపాటు, ఆ పంచనా ఈ పంచనా ఉన్నాం. చంద్రబాబు నాయుడి కొడుకుతో స్నేహం చేస్తున్న మా తమ్ముడు, తన వంతు సాయంగా, నానల్ నగర్ లో ఒక రేకుల గది చూసాడు. అక్కడ కామన్ బాత్ రూం, కామన్ టాయ్ లెట్ ఉండేవి.

వీధి కార్పోరేషన్ బోరు పంపు దగ్గర నీళ్ళు పట్టుకునేటప్పుడు, ఆ పంపు ఎదురు ఇంటి అతను తాగి వచ్చి మావారితో కావాలని గొడవ పెట్టుకుని చొక్కా పట్టుకున్నాడు. మా తమ్ముడు డబ్బులు పంపుతుండగా గడిపేవాళ్ళం. చివరికి ఫోన్ కీ కూడా అందుబాటులో ఉండకుండా, డబ్బులు పంపలేదు. చివరికి పస్తులండవలసి వచ్చింది. మా తమ్ముడితో కట్ అయ్యింది. తరువాత వేరే స్నేహితుడి నుండి అప్పు తీసుకొని, చివరికి శ్రీశైలం చేరి స్కూల్ పెట్టుకున్నాం.

ఈ మొత్తం వ్యవస్థీకృత వేధింపు వెనక ఉన్నది.... రామోజీరావు, చంద్రబాబు నాయుడులే! చాలా వరకు ఫిర్యాదు చేసాము. కొన్నింటిని ఊరుకుండి పోయాము.

నంబూరు, సూర్యాపేట, హైదరాబాద్ నానల్ నగర్ లో, మేం పడిన వ్యవస్థీకృత వేధింపు... కొన్ని నెలలు, సంవత్సరాలు సాగితే... చంద్రబాబు బాబ్లీయాత్ర... అయిదు రోజులు సాగింది.

మమ్మల్ని మానసికంగా ‘బ్రేక్’ చెయ్యటం అన్నదే టార్గెట్ గా... చంద్రబాబు, రామోజీరావులు వెనక నడిపించటాన్నే, మా కేసులో సాక్ష్యాధార పత్రాల సహితంగా, దృష్టాంత పూరితంగా నిరూపించాము. ఆ వివరాలన్నీ గత టపాలలో పొందుపరిచిన విషయం మీకు తెలిసిందే!

మేం కొన్ని నెలలు పాటు భరించిన వేధింపుని, బాబ్లీ [నీళ్ళు] అనే పైకారణంతో [over leaf reasonతో] అయిదు రోజులు భరించే సరికే చంద్రబాబు బేర్ మన్నాడు. అసలు మూడు రోజులకే కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

తమను పోలీసులు బూతులు తిట్టారనీ, తిండీ నీళ్ళు ఇవ్వలేదనీ, 70 మందికి ఒకే బాత్ రూమ్, టాయిలెట్ ఉండటంతో నరకం చూశామని, ఔరంగాబాద్ ప్రయాణం 8 గంటలలో మూత్ర విసర్జనకి కూడా బస్సులాపలేదని, రెండు చపాతీలు ఇచ్చారనీ, ఈడ్చుకు వెళ్ళారనీ, కోపం వచ్చిన పోలీసల్లా లాఠీలతో కుళ్ళబొడిచారని, తమ గొలుసులు, డబ్బు, సెల్ ఫోన్ లాక్కున్నారని.... కష్టాలన్నీ వెళ్ళబోసుకుని ఏడ్చాడు.

మేము అందుకున్న వ్యాఖ్యల్ని అతడూ అందుకున్నాడు. వీళ్ళని కొట్టి, ఆపైన మరాఠా పోలీసులే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అచ్చం నంబూరులో మా క్రింది వాటాల వాళ్ళు, తామే మా వారిని కొట్టి, మళ్ళీ ముందుగా తామే మా మీద కేసులు పెట్ట ప్రయత్నించినట్లుగానే....

"వాళ్ళే మమ్మల్ని కొట్టారు. తలలు గోడకేసి కొట్టబోయారు" అన్నారు మరాఠా పోలీసు అధికారులు.

"వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు" అని కూడా అన్నారు.

చంద్రబాబు కూడా... "అడిగే వాళ్ళు లేరు కదా అని, మమ్మల్ని అక్కడే చంపేయాలని కుట్ర పన్నారు" అన్నాడు.

"మేం గౌరవనీయమైన ప్రజా ప్రతినిధులం. మమ్మల్నింత అమర్యాదగా చూస్తారా?" అని దుఃఖ పడ్డాడు.

ఆ విధంగా... ఆ డైలాగులు [హలో బ్రదర్ సినిమాలో లాగా...] అతడికి విన్నట్లో, చదివినట్లో అన్పించక తప్పింది కాదు.

ఒక్క మాటలో చెప్పాలంటే - మాకు చేసిన ‘వేధింపు కర్మలలో’ కొన్నింటిని, చంద్రబాబు యధాతధంగా అనుభవించాడు.

నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, అంత నీచమైన స్థితి సంభవిస్తుందని ఎవ్వరూ ఊహించరు. ఎంత ప్రక్క రాష్ట్రపు పోలీసులైనా, ఐపీఎస్ అధికారుల కన్నా ఒక ‘భయం’ ఉంటుంది.

"ఏమో! ప్రక్క రాష్ట్రానికి ఒకప్పటి ముఖ్యమంత్రి. మళ్ళీ ముఖ్యమంత్రి అయినా, మనం డెప్యూటేషన్ మీద అక్కడికి పోయినా, ఎందుకొచ్చిన ఉపద్రవం!" అనుకుంటారు.

అదీగాక "ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి. ఒకవేళ మళ్ళీ పరిస్థితులు మారి ఇతడికి హవా నడిస్తే... అప్పుడు మనం రిస్క్ లో పడతాం" అనుకునైనా.... రాజకీయ నాయకుల పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు. ‘ఎంత రాజకీయ కారణాలైనా సరే, ప్రాక్టికల్ గా ఫీల్డ్ మీద, ఆయా ఆపరేషన్లని నిర్వహిస్తోంది మనం!’ అనే జాగ్రత్త తీసుకుంటారు.

అలాంటిది, ఎలాంటి జంకూ గొంకూ గానీ, సందేహ భయాలు కానీ లేకుండా, మామూలు జేబు దొంగలకి చూపించినట్లుగా ధర్డ్ డిగ్రీ చంద్రబాబుకి చూపించటం ఎవ్వరూ ఊహించనైనా ఊహించనిది. అతడి మాటల్లోనే చెప్పాలంటే... "70 మంది మీదికి, దాదాపు మూడు నాలుగు వేల మంది పోలీసులు... తలుపులు విరగ్గొట్టి వచ్చారు. బస్సుల దగ్గరికి వచ్చేలోగా, దాదాపు 200 మీటర్ల దూరం, ఎవరికి కోపం వచ్చినా తన్నటమే" అనేంత స్థితి రాదు గాక రాదు.

చేసుకున్న కర్మ అనుభవించవలసి నందునే అంతటి అనూహ్య స్థితి వచ్చి ఎదురుగా కూర్చొంది. మాకు చేసిన కర్మలలో కొన్నిటి సువర్ణముఖి అతడు అందుకున్నాడు. ఒంటరి కావటంతో సహా! చంద్రబాబుని, అతడి బృందాన్ని కొట్టటాన్ని అన్నిపార్టీల నాయకులు, జాతీయ పార్టీ నాయకులు నామమాత్రంగా మాట్లాడి ఊరుకున్నారు.

ఇతడే కాదు, మమ్మల్ని వేధించిన వాళ్ళలో చాలామంది, తరువాత కాలంలో ‘వాళ్ళ సువర్ణముఖి వాళ్ళు అనుభవించటం’ జరిగింది. కాకపోతే ఆ విషయాలు మాకు చాలా కాలం తరువాత తెలిసేవి. ఎందుకంటే - వాళ్ళు వాళ్ళ సువర్ణముఖిలు అనుభవించే రోజుల్లో... మేము వేరే విషయాల్లో, సమస్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉండేవాళ్ళం. [అదీగాక మా జీవితంలో గూఢచర్యపు ప్రమేయాన్ని గుర్తించనందునా మేము కూడా మా సమస్యలు తప్ప, మిగిలినవేవి పట్టించుకునే వాళ్ళం కాదు.]

ఇక మా సమస్యలు ఆర్దిక పరమైనవి లేదా కెరీర్ పరమైనవి, లేదా ఆ స్థలం నుండి బయటకు వచ్చేయటం వంటివి అయి ఉండేవి. కొన్ని సంవత్సరాల తరువాత, నాటకీయంగా, ఆ ఊరిలోని వ్యక్తులు కలిసి, ఆయా సంఘటనలు మాకు తెలియజేసేవారు. మొత్తంగా ‘వాళ్ళ సువర్ణముఖి వాళ్ళు అనుభవించారు’ అన్న విషయం మా కర్ధమయ్యేది. [2005 తరువాత మా జీవితాల్లో గూఢచర్య ప్రమేయం అర్దమయ్యాక, ఈ విషయమై మరింత అవగాహన కలిగింది.]

చంద్రబాబు తన సువర్ణముఖి అనుభవించటం అన్నది, దాదాపు 14 సంవత్సరాల తరువాత, ఇప్పుడు స్పష్టంగా బయటకు కనిపించింది.

ఇక్కడ నేను ఒక విషయం స్పష్టం చేయ దలుచు కున్నాను. మాకు చంద్రబాబు మీద ద్వేషం లేదు. అలాగని జాలి కూడా లేదు. మేం ఒకటే అనుకుంటాం. "మనం అతడి మీద ద్వేష పడినంత మాత్రానో, జాలీ పడినంత మాత్రానో, అతడి కర్మ అతడు అనుభవించక మానడు. మనమే ముందు జన్మలలో ఏదో దుష్కర్మలు చేసి ఉంటాం. ఈ జన్మలో ఇతడి నెపాన అనుభవించాం. అంతే! ఇదే గీత సాధన! ఇలా అనుకుంటే - జన్మజన్మలుండనీ లేకపోనీ, ఆ నమ్మకపు పునాది మీద మనం మాత్రం, మన భావోద్రేకాలని దాటగలం.

అప్పుడే... మనల్ని బాధ పెట్టిన వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు, ‘అయ్యో! వాళ్ళు సుఖంగానే ఉన్నారే’ అన్న దుగ్ధ మనల్ని బాధించదు. అదే విధంగా... మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, ‘హా! వాళ్ళు నానా చావూ ఛస్తున్నారు’ అన్న కచ్చ మనల్ని కాల్చదు. అప్పుడూ, ఇప్పుడూ కూడా... ప్రశాంతంగా, హాయిగా ఉండగలం" - ఈ సాధనని మేం బాగానే నేర్చుకున్నాం. అదీ గీత మాకు చూపిన మార్గం, గురువు నేర్పిన పాఠం.

అంతే కాదు, ఆధునిక హేతు వాదుల సిద్దాంతం ప్రకారం, జన్మలు లేవనుకున్నా, ‘ఎవరి కర్మకు వారే కర్తలు’ అనుకుంటే, మనం మాత్రం సుఖంగా ఉంటాం. అలాగని ‘తప్పుచేసిన వాళ్ళకి, శిక్ష పడకూడదనీ’ అనుకోం - ఇదీ మా దృక్పధం.

ఇక ఈ వివరణని పక్కన బెడితే.... చంద్రబాబు ‘అనుభవించిన సువర్ణముఖి’ గూఢచర్యమే అయితే... దాన్ని నెం.5 వర్గం విధించాలి. గూఢచర్యాన్ని ఒప్పుకోకపోతే... భగవంతుడే ఆ శిక్షని విధించినట్లు ఒప్పుకోవాలి. నేనయితే రెండింటిని నమ్ముతాను. నెం.5 వర్గం ద్వారా భగవంతుడే ఆ శిక్షను విధించాడనుకుంటాను.

ఇకపోతే... చంద్రబాబు మా పరంగానే కాదు, జనం పరంగా కూడా.... సువర్ణముఖిని అందుకున్నాడు.

పరిశీలిస్తే...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~~~~

2 comments:

evaru chesina karma vaaru anubhavichanka...............

మీ పొస్ట్లు చదివిన తర్వాత, నాకు భగవథ్గీత మీద చాల ఘౌరవం వచింది.All these days , I used to hate somany people. Worried about somay things and people. Now I will try to change myself and will start reading భగవథ్గీత

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu