మామూలుగా అందరిలాగే, చంద్రబాబు కూడా ‘రామోజీరావు కాంగ్రెస్ కి వ్యతిరేకం, తెదేపాకి అనుకూలం’ అనుకున్నాడు కొంతకాలం పాటు! వై.యస్. పాదయాత్రకు పూర్తి కవరేజి, అతడికి ఇమేజి ఇచ్చి సీఎం ని చేస్తున్నప్పుడు దుఃఖ పడ్డాడు. అంతకు ముందు సీటు దిగనని మొరాయించాడు. అలిపిరి దాడితో దెబ్బకు దిగి వచ్చాడు.

అయితే ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ వంటి రాజకీయ పైకారణాలతో, రామోజీరావు ‘ఓసారి తెదేపాని, మరోసారి కాంగ్రెస్ ని పైకెత్తటం [కుర్చీలాటలో లాగా] తెలిసిందే కదా’ అని సరిపెట్టుకున్నాడు. 1989 లో చెన్నారెడ్డి, 1990లో జనార్దన రెడ్డిల మాదిరిగా వై.యస్. కూడా అనుకున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళల్లో కొందరికి సీన్ ఇచ్చినా, కేంద్రంలో కాంగ్రెస్ కి మాత్రం రామోజీరావు వ్యతిరేకేనని నమ్మాడు.

2004 లో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఇందిరాగాంధీకి వ్యతిరేకి అయిన రామోజీరావు, సోనియాకీ, అంత స్థాయిలో వ్యతిరేకి కాకపోయినా... సంపూర్ణ అనుకూలుడని మాత్రం, ఊహించలేక పోయాడు. గూఢచర్య జ్ఞానాన్ని గ్రహించటంలో ఎంత నేర్పరికైనా, తన చుట్టూ కప్పబడే ఇనుప తెర, చూపించబడిన వర్ణ చిత్రాన్ని దాటి చూడటం అసాధ్యం కూడా!

మార్గదర్శి పేరిట ‘రాజ రామోజీ రావుల యుద్దం’ నడుస్తున్న రోజుల్లో కూడా ‘ఎందుకో ఇద్దరికీ ప్రస్తుతం చెడినట్లుంది’ అనుకున్నాడే గానీ, కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానమూ, రామోజీరావు, వై.యస్. కలిసి నాటకం ఆడుతున్నారనుకోలేదు. అనుమానం వచ్చినా ఎవరు తీర్చగలరు? అలాంటి చోట... వై.యస్. ఆడిన సందట్లో సడేమియా నాటకం, గారెల వంట గూఢచర్యం [చంద్రబాబు] ఎలా గ్రహించగలడు!

కాబట్టే, 2009 ఎన్నికలలో తనకి తప్పకుండా అవకాశం వస్తుందని ఆశపడ్డాడు. కాంగ్రెసేతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడేందుకు పెనుగులాడాడు. అదే డిస్ అడ్వాంటేజ్ అయ్యి, తెరాస కేసీఆర్, సీట్ల సర్ధుబాటు విషయంలో, పుణ్యకాలం కాస్తా కరిగించాడు. వెరసి, నెలకి రెండు వేల రూపాయలు నగదు బదిలీ పధకం చేపట్టినా, వైఫల్యం చెందక తప్పలేదు.

ఎన్నికల ప్రచార సరళిలో మీడియా వైఖరి, అతడి ఆశలకి ఆదిలోనే గండి కొట్టింది. కుటుంబాన్ని ఒక తాటి మీదకు తెచ్చుకున్నా ఫలితం లేక పోయింది. జూనియర్ ఎన్టీఆర్ కి ఈనాడు ఇచ్చిన కవరేజిలో ఆశలు రెప రెప లాడినా, త్వరలోనే నీరు గారి పోయాయి. ఫలితాలు జావ గారి పోయాయి.

ఆ గందర గోళంలో, పరిస్థితులను గూర్చిన అయోమయంలో అతడుండగానే, వై.యస్. దారుణ మరణాన్ని పొందాడు. తర్వాతే చంద్రబాబుకు పరిస్థితుల పట్ల ఓ స్పష్టత వచ్చింది. ‘వై.యస్. జగనూ, కాంగ్రెస్ అధిష్టానాల అంతర్లీన పోరు’ నేపధ్యంలో, రాజకీయ వర్గాల్లో లోతట్టున షికార్లు చేసే సమాచారం, అతడి అవగాహనకి మరింత బలాన్ని సమకూర్చింది. అప్పటికి... అతడికి, ‘రామోజీరావుకీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య ఉన్న సంబంధం’లోని నిగూఢ గాఢత బాగా అర్దమైంది.

ఈ నేపధ్యంలోనే, అతడు, తన గూఢచర్యపు అవగాహనని సమగ్రీకరించుకొని, తన పరిధిలోని వారికి పంపకం మొదలు పెట్టాడు. అప్పటి నుండీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాల గురి చంద్రబాబు మీదికి తిరిగింది.

అప్పుడే - తోక ఝాడిస్తున్న జగనూ, చంద్రబాబూ వగైరా రాష్ట్ర రాజకీయ నాయకులే గాక, జాతీయ నాయకులకు కూడా ‘మధు కోడా’ దెబ్బలబ్బాయిగా చూపెట్టబడ్డాడు. ‘రాజకీయాల్లో అక్రమార్జన చేసి, దాచుకున్న నిల్వలన్నిటికీ కన్నాలు పెట్టీ, ఐటీ దాడులతో కొడతాను జాగ్రత్త!’ అన్న హెచ్చరిక అది. దెబ్బతో చిరంజీవి లాంటి రాజకీయ కమేడియన్లు, కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళ మీద పడ్డారు. [చిరంజీవికైతే పైరసీ దెబ్బకూడా చూపెట్టారు. మగధీర సినిమా పైరసీ సీడి, సినిమా విడుదలకు ముందురోజే వచ్చేసింది.]

జగన్ కి కూడా... అధిష్టానంతో రాజీ పడి, సందుగొందుల్లో తిరిగినా, కొన్ని నెలల అనంతరమైనా రహదారి ఎక్కి, ఎదురు పోరాటం తప్పలేదు. రాజకీయంలోనూ, గూఢచర్య అవగాహన లోనూ, జగన్ కంటే చంద్రబాబుది సుదీర్ఘ అనుభవం. అందుచేత ఇతడు ‘సందుగొందుల్లోకి ప్రయాణించినా నిష్ఫలం’ అన్న సంగతి ముందే గ్రహించాడు. ‘ముందుకు పోవటమే బెటర్’ అనుకున్నాడు. అందుచేత, తన గూఢచర్య అవగాహనని అందరికీ పంచటం ఆపలేదు.

ఇదే సమయంలో తెలంగాణా రచ్చ మొదలైంది. అప్పుడు కూడా, కేసీఆర్, కాంగ్రెస్ మీద గాకుండా, తెదేపా మీదే గురిపెట్టుకు తిట్టటం, విమర్శించటం వంటివి చేశాడు.

‘గూఢచర్య సమాచార పంపిణీ’ అనే కార్యక్రమంలో, చంద్రబాబుకి సహకరిస్తున్నందున, తెదేపాలోని కొందరు నాయకుల మీద కూడా టార్గెట్ చేయబడింది.

ఇందులో భాగమే, నాగం జనార్దన రెడ్డికి ఓయూలో తన్నటం! కిరాయి రౌడీలే ఈ పని చేసారని, ఓయూ విద్యార్దుల ప్రమేయ మందులో లేదనీ తర్వాత వార్తలొచ్చాయి.[అది, మరో కోణంలో చంద్రబాబుకి హెచ్చరిక కూడా!] అంతగా భౌతిక దాడి జరిగినా... చంద్రబాబు గానీ, అతడి అనుచరులు గానీ, ‘లోతట్టు సమాచారాల సేకరణ, విశ్లేషణ, ఆపైన తమ గూఢచర్య అవగాహనల పంపకం’ చేయటం మానలేదు. [అది మరి వాళ్ళ ఎదుట ఉన్న ‘కన్నా? కాలా?’ స్ట్రాటజీ! ‘చంపు లేదా ఛస్తావు, దెబ్బకొట్టు లేదా దెబ్బతింటావు’ అనే విధంగా, ఎదుట నిలబడిన, అనివార్య ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్ల వంటివి.]

ఇది ఎంతగా కొనసాగిందంటే - ఓయూలో నాగం జనార్దన రెడ్డిని స్పృహ తప్పేలా కొట్టినా సరే.... తదుపరి జరిగిన తెలంగాణా జేఎసీ సమావేశాలకి హాజరైన నాగం బృందం, తెరాస, తెలంగాణా కాంగ్రెస్ నాయకులని మాటలతో కెలికి, లోగుట్లు తెలుసుకు పోవటం ఆపలేదు. తర్వాత్తర్వాత, జేఏసీ మీటింగ్ లకి నాగం బృందం హాజరవ్వటం, అప్పటి వరకూ అందులో రెగ్యులర్ గా పాల్గొంటూ వస్తున్న తెరాస నాయకులు , మరి కొందరు కాంగ్రెస్ వాళ్ళు కూడా,గైర్హాజరయ్యారు. ఆ జేఏసీని నీర్చుగార్చటం మొదలు పెట్టారు. ఆ తర్వాత, జేఏసీ లోంచి తెదేపా బయటకు ‘వచ్చింది.’

క్రమంగా ‘గూఢచర్య అవగాహనా పంపిణీ’ కార్యక్రమాన్ని, జాతీయ స్థాయిలో... లాలూ, పవార్, శరద్ యాదవ్ గట్రాలకి కూడా చంద్రబాబు విస్తరించాడు. తనకి తక్షణ ఫలితం రాకున్నా, ఎదిరి వర్గానికి [రామోజీరావు+సోనియాలకి] ఇరుకు సృష్టింపబడటం, పరిస్థితుల మీద మరింత అవగాహన కలగటం, తన అనుభవానికి తెలుస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే... కాంగ్రెస్ అధిష్టానమూ, మీడియా రాజకీయమూ, చంద్రబాబుకి నయానా భయానా చాలానే చెప్పజూసింది. అధిష్టానం ‘ఐటీ దాడులనీ, సాధారణ నాకా బంధీలలో పట్టుబడ్డ నల్లడబ్బుల్నీ’ చూపించింది. ‘ఆ సమాచార పంపిణీ ఆపకపోతే డబ్బులన్నీ కరిగిస్తా!’ అన్న హెచ్చరిక అది.

మీడియా, చంద్రబాబుని వీలైనన్ని రకాలుగా ఏకాకిని చేసింది, ఇబ్బందుల పాలు చేసింది. ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు అతడి మీద పడ్డాయి. చదువరులకది సొల్లులాగా ఉంటుంది. కానీ, అనుభవించే చంద్రబాబుకి అది చాలా బాధ పెడుతుంది. ఎలాగంటే - పార్టీ సీనియర్లు పార్టీని వీడబోతున్నారని ప్రచారం. దాన్ని ఎదుర్కొని, సరిదిద్దుకునే సరికి, చంద్రబాబుకు తల ప్రాణం తోకకి వస్తుంది. ‘హయ్మయ్య’ అనుకునేంత లో, కుటుంబంలోనే "ఇదిగో బాలకృష్ణ పార్టీని చేతిలోకి తీసుకోబోతున్నాడట" అనే వార్తాంశం షికారు మొదలు పెడుతుంది.

నిజానికి దీని వెనుక స్ట్రాటజీ ఏమిటంటే - ఒక దశలో బాలకృష్ణ తాను ‘సీఎం పదవికి నేను రెడీ’ అని ప్రకటించాడు కూడా! అంటే ఒక వేళ చంద్రబాబు కాల్షీటు ముగించినా, తదుపరి పగ్గాలు తాను చేపట్టి, చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న పనిని కొనసాగిస్తానన్న హెచ్చరిక, బాలకృష్ణ+చంద్రబాబులు, ఆ విధంగా బయటకు ఇచ్చారన్న మాట.

తరువాత చంద్రబాబు ‘ఇలాంటివి నాలుగు రోజులు ప్రచారంలో ఉండి ఆరిపోతాయి. వాటిని పట్టించుకోనక్కర లేదు’ అన్నాడు. ఆ తరువాత బాలకృష్ణ ‘తమ నాయకుడు చంద్రబాబేనని, ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని’ ప్రకటించటంతో, ఆ సమస్య మీడియాలో చల్లారింది. ఇలా ప్రకటించటం, నెం.5 వర్గానికీ, నెం.10 వర్గానికీ తమ గొంతు వినిపించటం కోసమే!

కాని, ఈ సంఘటనల కాలంలో మాత్రం, చంద్రబాబు బయట దొరికాడో, విలేఖర్లు ఈగల్లా ముసురుకుని, దోమల్లా కుట్టడం ప్రారంభించారు. చికాకు తప్పించుకునేందుకు బయటకు రాకపోతే, "చంద్రబాబు లోపల దాక్కున్నాడేం? బయటకు రాడెందుకని?" అంటూ కేసీఆర్ లూ, రాంరెడ్డి దామోదర రెడ్డిలు నోరు చేసుకున్నారు. ఏం చేసినా డిజ్ అడ్వాంటేజే!

ఇలాంటి చికాకులనీ, ఇక్కట్లనీ తప్పించుకోవాలంటే... చాలా సహనం, సంయమనం అవసరం. ఈ మొత్తం వ్యవహారం సద్దుమణిగే దాకా, ఇలాంటి ‘పంటి క్రింద రాయి, చెవిలోని జోరిగ, చెప్పులోని రాయి, ఇంటిలోని పోరు’ చంద్రబాబుకి చుక్కలు చూపెట్టాయి. [అదే కాంగ్రెస్ అధిష్టానం సోనియా అయితే ఎప్పుడూ బయటకు రాదు, విలేఖర్లకు దొరకదు. అయినా గానీ ఎవ్వరూ విమర్శించరు. అదే చిత్రం ఇక్కడ! కాని అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రతిచర్య వెనుక సోనియానే ఉంటుందని. గతంలో ఇందిరాగాంధీ కూడా చంద్రబాబుల్లాగే విలేఖరుల ‘ఈగా,దోమ’ సమస్యలు ఎదుర్కుంది.]

ఇక ఆ క్రమంలో... చంద్రబాబు, కుటుంబ సభ్యులకీ, బంధు కుటుంబాలకీ [పురంధరేశ్వరి, లక్ష్మీ పార్వతీలతో సహా] సమాచారాన్ని పారదర్శకంగా అందించి, ‘ఐకమత్యంగా ఉండకపోతే, ఏ పార్టీలో ఉన్నా మట్టి కలవటం ఖాయమనీ, రామోజీరావు ఎవరినైనా ఉపయోగించుకొని, ఆనక కూరలో కరివేపాకులా తీసి పారేస్తాడనీ’ సోదాహరణంగా తన జీవిత విశేషాలతో సహా వివరించాడు. దాంతో కొన్ని చికాకులు తగ్గాయి.

క్రమంగా బయట సమస్యలు పెరిగాయి. ప్రజలలో ఇమేజి తెచ్చుకోవాలంటే, మీడియా కవరేజి ఇస్తే సరిపోతుంది. లేనట్లయితే... సభలూ, ర్యాలీలు.... అంటూ ఏదో అలజడి చేయాలి. జనాన్ని సమీకరించటం దగ్గరి నుండి, సభా నిర్వహణల దాకా అన్ని ఖర్చుతో కూడుకున్నవే! ఇంతా చేసినా, మీడియా కవరేజి ఇవ్వకపోతే దండగే! కవరేజి ఇచ్చినా ‘శల్య సారధ్యం’ లాగా ఇస్తే వొరిగేదేం లేదు.

ఈ పరిస్థితుల్లో.... చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడిన ఎలుక లాంటిదే! కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు పెద్దలు. అధికారం లేకపోతే ఆదాయం లేదు. వార్తల్లో, రాజకీయాల్లో లైవ్ గా ఉండకపోతే, కొన్నాళ్ళకి పార్టీ డెడ్ అయిపోతుంది. దాంతో ‘ఖర్చులు పెరగటం, ఆదాయం తరగటం’ అనే పెనం మీద ఉన్నట్లయ్యింది అతడి పరిస్థితి! [increase of Expendature, Decrease of Income అన్నది ఒక స్ట్రాటజీ!]

తాత్కాలిక రాజీలు పడినా, రాణించేదేమీ లేదన్నది జగన్ ఉదంతం నిరూపించింది. దాంతో ‘లోతట్టు సమాచార సేకరణ - విశ్లేషణ, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకున్న తన గూఢచర్య అవగాహన’ని పంపిణీ చేయటం ఆపలేదు సరికదా, మరింత పెంచాడు.

ఎన్ని బెదిరింపులు బెదిరించినా, 7కోట్లు నల్లడబ్బుని హుహ్ కాకీ అనిపించినా[7కోట్లు అన్నవి ఒక నెపం మాత్రమే], ఆగని చంద్రబాబుని "ఆగకపోతే ఎంతకైనా వెళ్తాం! కుళ్ళ బొడవ గలం! బూతులు తిట్టించి, కొట్టించగలం! ‘ఆ ఊ’ అన్నావంటే, పక్కా పైకారణాలు చూపెట్టి శాల్తీలని గల్లంతు చేయగలం! ఖబడ్డార్!!" అనటానికే, బాబ్లీ యాత్ర కెళ్ళిన బాబుని ‘చితక్కొట్టి, విమానంలో పడేసి పంపించటం’గా పరిణమించింది.

బాబు బాబ్లీ యాత్రకి వెళ్తానన్నప్పుడే... రోశయ్యా, అతడి మంత్రులూ, [ఎర్రపార్టీల వాళ్ళతో సహా] చంద్రబాబుకి వెళ్ళవద్దని హితవు చెప్పారు. అన్యాపదేశంగా, "వెనక్కి తగ్గు, లేకపోతే అవమాన పడతావు" అన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. [ఇదే హెచ్చరిక కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపడతానన్నప్పుడు, ప్రధానితో సహా, చాలామంది జాతీయ నాయకులు చెప్పారు.]

"ఎంతైనా రాజకీయ నాయకుణ్ణి. తొమ్మిదేళ్ళు రాష్ట్ర సీఎంగా ఉన్నవాణ్ణి! ఎంతగా ఎదురు దెబ్బ తినాల్సి వస్తుందనుకున్నా, ఎంత చేస్తారులే!" అనుకున్నాడు. ‘చొక్కా పట్టుకు లాగటం, చింపి పాతరెయ్యటం, మెడపట్టుకు తోయటం, తిట్టి, తన్ని తగలెయ్యటం’ వంటివి ఊహించనైనా లేదు. అటు జగన్ శిబిరానికీ, లోలోన తోక ఝాడించాలనుకుంటున్న లాలూ గట్రాలకి, మాయవతిల దగ్గర నుండి చాలామందికీ, ఈ దెబ్బలబ్బాయిని ‘మహా’ కిరాతకంగా చూపెట్టారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు సోనియా, రామోజీరావులు.

"ఎంతకైనా తెగిస్తాం. మక్కెలిరగ్గొట్టటమే కాదు, కాల్పులు జరిపి, పైకారణాలు ప్రచారిస్తాం" అనేంత తీవ్రమైన హెచ్చరిక అది. [ఇందిరాగాంధీ ని హత్య చేసి ఆపరేషన్ బ్లూస్టార్ నీ, రాజీవ్ గాంధీని హత్య చేసి ఎల్టీటీఈనీ చూపించినట్లుగానే!]

చంద్రబాబుని, ముందుగా బాబ్లీ చూపిస్తాం రమ్మని తీసికెళ్ళి, ధర్మాబాద్ ఐటీఐలో నిర్బధించారు. కటిక నేల మీద కూర్చోబెట్టటం, తిండీ నీళ్ళూ ఇవ్వకపోవటం, కరెంటు లేకుండా కూర్చోబెట్టటం, మానసికంగా ‘బ్రేక్’ చెయ్యటమే లక్ష్యంగా సాగిన ప్రహసనం అది! ప్రాణ భయం కూడా సరిపడినంతగా పెట్టామనుకున్నాకే, విమానంలో కూలేసి వెనక్కి పంపారు. ఒంటరిని చేయ ప్రయత్నించటమూ మానసిక తంత్రమే!

క్రమంగా, బాబ్లీ యాత్రలో బాబు మీద దాడి తీవ్రత, పెంచుతూ పోయారు. ఒంటరిగా అయితే "నా చుట్టూ నా వాళ్ళుంటే ఇంత జరగక పోను!" అనే భావం చంద్రబాబుకి మిగలకుండా, బృందంతో సహా, అందునా ఆడవారిపై కూడా... అమర్యాద, జులుం చూపెట్టి వదిలారు. అంతేగాక, జాతీయ స్థాయిలో ఏ నాయకులు, చంద్రబాబు గురించి అగ్గగ్గలాడకపోవటం చూపెట్టం ద్వారా ‘నీకోసం ఎవరూ రారు సుమా!’ అన్నట్లుగా, మొత్తం తమ గ్రిప్ ని చూపించారు.

తెదేపా, రాష్ట్రంలో [19 జూలై] ఒక రోజు బంద్ చేయించారు. ఆ తర్వాతే చంద్రబాబునీ, అతడి బృందాన్ని మరాఠా పోలీసులు కుళ్ళ బొడిచారు.

"నీ చుట్టూ ‘మందిబలం’ ఉన్నా ఏం లాభం లేదు. జనాలు వచ్చినా లాభం లేదు" అన్న దాన్ని, ఆ విధంగా అతడికి ఇంకించే ప్రయత్నం చేసారు. ఎన్ని రోజులని బందులకు పిలుపివ్వగలరు? ఓ ప్రక్క కోర్టులు ఊరుకోవు. మరో ప్రక్క, చీటికి మాటికి బందులంటే ప్రజలూ ఊరుకోరు. [ఇదే హెచ్చరిక వై.యస్. జగన్ కి, అతడి వర్గానికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది.]

ఆనాటి ఎన్టీఆర్ బర్తరఫ్ [నాదెండ్ల భాస్కర రావుతో] రోజుల్లోలా జనాలు ఉర్రూత లూగి, మద్దతుగా వచ్చేందుకు... మీడియా, ఆ విధంగా జనాలని ట్యూన్ చేయటం లేదు కదా! ఒక రోజు కూలీ ఇచ్చి జనాలని.... సభలకీ, ధర్నాలకీ, ర్యాలీలకీ సమకూర్చు కోవాలంటే, బాగా ఖర్చు అవుతుంది. ఎటూ ‘ఖర్చులు పెంచటం, ఆదాయానికి గండి కొట్టటం’ తమ మీద అమలు పరుస్తున్న తంత్రమేనయ్యే! మరి ఎలా తమని తాము రక్షించుకోవటం?

ఆ అగచాట్లే ఇప్పుడు చంద్రబాబువి!

అయితే.... రామోజీరావు దర్శకత్వంలో, కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన "బాబు బాబ్లీ యాత్ర కెళ్తే, కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టటం" లో మరో విభిన్న కోణం ఉంది.

అది చంద్రబాబు సువర్ణముఖి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

[ఇందిరాగాంధీ ని హత్య చేసి ఆపరేషన్ బ్లూస్టార్ నీ, రాజీవ్ గాంధీని హత్య చేసి ఎల్టీటీఈనీ చూపించినట్లుగానే!]
I couldn't follow this. Op Bluestar was firt, later IG was killed.

బాగు౦ది మీ విశ్లేషణ. ఇందులో రామోజీ పాత్ర గురి౦చి మరి౦త విపుల౦గా వు౦టే బాగుణ్ణు.

అజ్ఞాత గారు: ఇందిరాగాంధీ హత్య విషయంలో ఆపరేషన్ బ్లూస్టార్ అన్న పైకారణంతో సిక్కు గార్డులు చంపారన్నదే నా ఉద్దేశం. దీని కార్యకారణాలను నా పాత టపాలలో చదవగలరు.

సామాన్యుడు గారు: తదుపరి టపాలలో మరింత వివరిస్తానండి.

మీరెక్కడో లాజిక్ మిస్సయినట్టున్నారు... కొద్దిగా ఆలోచించండిసారూ, మార్గదర్శి ఇష్యూ రామోజీ+రాజశే+సోనియా కలిసి కుట్రా?
అదేమీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బంద్ పిలుపు కాదు. రామోజీరావు పునాదులు కూలిపోయే ఇష్యూ. అందుకు రామోజీ ఒప్పుకుంటాడనుకోవడం వెర్రితనం.

బాలు గారు: క్రింది లింక్ ను చదవగలరు. మీరు కొత్తగా నా బ్లాగులోకి వచ్చినట్లున్నారు. రాజ, రామోజీల యుద్దం నిజమా, నాటకమా?
http://ammaodi.blogspot.com/2009/01/blog-post_10.html

meeku raayadam lo manchi talent undi ani nenu oppukoka tappadu, kaani meeru raase daantlo vishayam ledu ani entha amaayakudu chadivina artham avuthadi, ekkado chadivanu mee mundu post anukunta meeru vipareethanga kashtalu face chesharu ani akkada ikkada rentuku unnamrani anthaloney mee tammudu chandrababu naidu kodukutjo sneham ani....ramoji sonia kalisi chandrababu nu adukuntunnarani.....ivanni chaduvuthunte meeru chadivey vaallanu pichollanu chesthunnattuga unnavi..i think you got some mental problem

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu