నిజానికి విద్య అన్నది ఉప్ప ప్యాకెట్టో, బిస్కట్ ప్యాకెట్టో కాదు. సూపర్ మార్కెట్ కు వెళ్ళి, లేదా వీధి చివరికి చిల్లర కొట్టుకొళ్ళి, పది రూపాయలిచ్చి ఓ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ విద్య అలాంటి వస్తువు కాదు, డబ్బిచ్చి పొందేందుకు! దుకాణదారుకి డబ్బు ఇవ్వటం, దుకాణపు యజమాని మనకి ఉప్ప ప్యాకెట్ ఇవ్వటంతో ఇక్కడ వ్యవహారం [deal] పూర్తయిపోతుంది.

కానీ విద్య విషయంలో అలా కాదు. పాఠశాలలో ఫీజు కట్టి చేరడంతో డీల్ మొదలౌతుంది. ఇక్కడ డబ్బుకి అతీతమైన సంబంధం - విద్యార్ది, ఉపాధ్యాయుల మధ్య ఉంటుంది. విద్యార్ధికి తమ టీచర్ పట్ల గౌరవం ఉండాలి. టీచర్ కి తమ విద్యార్ధుల పట్ల ప్రేమా, వాత్సల్యం ఉండాలి. [ఆవుదూడని వత్స అంటారు. గోమాతకి తన బిడ్డ పట్ల ఉండే ప్రేమని వాత్సల్యం అంటారు.] అప్పుడే టీచర్ చెప్పింది పిల్లల బుర్రలకి పడుతుంది.

కానీ చాలామంది తల్లిదండ్రుల దృష్టి ‘ఫీజు డబ్బు కట్టటంతో తమ కర్తవ్యం పూర్తయ్యింది’ అన్నట్లు ఉంటుంది. దాంతో మొత్తం భారం పాఠశాలల మీద పడుతుంది. పాఠశాలల యాజమాన్యాలు, ఆ భారాన్ని పూర్తిగా తమ ఉద్యోగులైన ఉపాధ్యాయుల మీదికి జారుస్థాయి. దాంతో ఈ మొత్తం జంఝటాన్ని - పాఠశాలలు, ఉపాధ్యాయులతో సహా... కష్టపడి పిల్లలకి చదువు నేర్పించి గాక, పైసలు ఉపయోగించి... మాస్ కాపీయింగ్, మార్కులు వేయించటం, ర్యాంకులు కొనటం వంటి ప్రక్కదారి మార్గాలలో వదిలించుకుంటున్నారు.

పిల్లలకి చదువు నేర్పటం, క్రమశిక్షణాది మంచి లక్షణాలు నేర్పటం.... అందుకోసం మంచి, సమర్ధులైన ఉపాధ్యాయులని సమీకరించటం, వాళ్లకి ఎక్కువెక్కువ జీతాలు చెల్లించటం.... ఇదంతా జంఝటమే! ఇంతకంటే తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ఫలితాలని సంపాదించవచ్చు.

కష్టపడి పిల్లలకి చదువు చెప్పటం, నయానో భయానో క్రమశిక్షణ నేర్పటం, కష్టపడి చదువుకునే తత్త్వం నేర్పటం - వీటన్నిటి కంటే.... ప్రశ్నాపత్రాలు లీక్ చెయ్యటం, మాస్ కాపీయింగ్ చేయించటం, వంటి పనులకు టీచర్లు పాల్పడుతుంటారు. స్వయంగా టీచర్లే బిట్స్ డిక్టేట్ చేయటం, కాపీలందించటం మొన్నటి పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో కూడా చూశాను. ఇంటర్నల్ పరీక్షల్లో సైతం, కొన్ని పాఠశాలల్లో, కొందరు ఉపాధ్యాయులు ఇదే పద్దతి నడపటం, నడవనివ్వటం మేము స్వయంగా పరిశీలించివే!

ఇక పాఠశాలలు యాజమాన్యాలు... డబ్బూ, పరపతి ఉపయోగించి, తమ విద్యార్దులుకి మార్కులు వేయించటం, ర్యాంకులు కొనటం సర్వ సాధారణం. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, ఫలానా పాఠశాల విద్యార్ధులు ఎవరెవరు తమ గదిలో పరీక్ష వ్రాస్తున్నారో విచారించి మరీ మాస్ కాపీయింగ్ కి సహకరించటం కూడా మొన్నటి పదవ తరగతి పరీక్షల్లో చూశాను.

ఇన్ని రకాలుగా, డబ్బుతో ఫలితాలని కొనవలసిన రావటంతో కూడా, యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు అంతంత మాత్రంగా ఇస్తుంటాయి. వాక్ ఇన్ ఇంటర్యూ అంటూ కార్పోరేట్ పాఠశాలలు, జిల్లా స్థాయిలో నెంబర్ వన్ విద్యాసంస్థలు కూడా, టీచర్లకు[IIT ఫౌండేషన్ శిక్షణ ఇచ్చేవారికి సైతం] పాతిక వేల దాకా జీతపు స్థాయి ప్రకటిస్తారు. అది కేవలం వాణిజ్య ప్రకటన మాత్రమే. తీరా చూస్తే... ఉదయం నుండి సాయంత్రం వరకూ ఏడెనిమిది పీరియడ్లు చెప్పించుకుని, పది పన్నెండు వేలు చేతిలో పెట్టటమూ నాకు తెలుసు.

పత్రికా ప్రకటనలలో మాత్రం, నెలకు పాతిక ముప్పై వేలు టీచర్లకు చెల్లిస్తున్నట్లు చెప్పుకుంటారు, అందులో సగం వాస్తవంగా చెల్లిస్తారు. టీచర్లను సైతం అలాంటి అబద్దాలనే చెప్పుకొమ్మంటుంది యాజమాన్యం. నిజం బయటపడితే ఉద్యోగం Fire out.

నిజాని కిది రంగు మారిన వాణిజ్య ప్రకటనే, ఉద్యోగ ప్రకటన కానే కాదు. ఆ విధమైన ప్రకటన ఇవ్వటం ద్వారా ‘ఫలానా పాఠశాల వారు నెలకు పాతిక వేలు చెల్లించి మరీ సమర్ధులైన టీచర్లతో చదువు చెప్పిస్తారు!’ అనుకొని, తల్లిదండ్రులు పాతిక వేల నుండి ఏభైవేల దాకా, సంవత్సరపు ఫీజులు తమకు చెల్లించాలన్నది ఇక్కడ వ్యూహం! అదే జరుగుతోంది రాష్ట్రస్థాయి ర్యాంకులు పొందిన విద్యా సంస్థలలో కూడా!

నిజం చెప్పాల్సి వస్తే - ఈ ఫలితాల అవకతవకలకు కూడా తక్కువేం ఖర్చవ్వదు. మంచి టీచర్ల చేత, తగినంత జీతభత్యాలిచ్చి, నిజాయితీగా చదువు చెప్పించినా ఇంతా ఖర్చవుతుంది. అలాంటప్పుడు ‘అదే ఖర్చుపెట్టి నిజాయితీగా ఫలితాలు సాధించవచ్చుగా?’ అనే అనుమానం మనకు వస్తుంది. సరిగ్గా ఇక్కడే కుట్ర కోణం బలంగానూ, అప్రకటితంగానూ పని చేస్తుంది.

నిజాయితీగా, సమర్ధులైన టీచర్లని పెట్టి చదువు చెప్పించినా, పిల్లలు కష్టపడి చదివినా.... ఫలితాలు అంత నిజాయితీగా రావు. ప్రభుత్వమో మరో అధికారామో నియంత్రిస్తే తప్ప! నూటికి ఒక విద్యాసంస్థ, నిజాయితీ దారిలో వెళ్తే పరాజయం పాలు కావాల్సిందే! పైనున్న కార్పోరేట్ సంస్థలు, ఫలితాలని హైజాక్ చేసి తొక్కేస్తాయి. కాబట్టి కూడా విద్యా వైద్యాలు ప్రైవేటీ కరించబడ కూడదు. అందుకే ఇందిరాగాంధీ హయాంలోని గత ప్రభుత్వాలు, అందుకోసం ఒడ్డి పోరాడాయి. గూఢచర్యపు పట్టు అప్పట్లో లేక ఓడిపోయాయి.

ఇక ఈ ఫలితాలని నిర్వహించే [organaise చేసే] తీరు, వాటి తాలూకూ నెట్ వర్క్, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకోసం పెద్ద కార్పోరేట్ విద్యాసంస్థలు కొందరు మధ్యవర్తులని [లైజాన్ ఆఫీసర్లు]ని నియమించుకుంటుంది. సంవత్సరమంతా ఉన్నతోద్యోగులకి, ఎం.ఎల్.ఏ., మంత్రుల వంటి రాజకీయులకి అందుబాటులో ఉంటూ, అవసరాలు[?] తీరుస్తూ, సత్సంబంధాలు కొనసాగించటమే సదరు ఉద్యోగుల/డైరక్టర్ల పని!

ఇవి ఫలితాల సాధన విషయంలో అయితే, ఇక విద్యార్ధుల సమీకరణ గురించిన నెట్ వర్క్, మరింత ఆసక్తి కరమైనది. కార్పోరేట్ విద్యాసంస్థలే కాదు, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ కూడా... విద్యార్ధులని సమీకరించేందుకు తమ తమ PRO లని ఆయాప్రాంతాల్లో అప్రకటితంగా అపాయింట్ చేసుకుంటాయి. మాటకారి వారిని, వ్యాపార నైపుణ్యం, ఎదుటి వారికి నచ్చచెప్పి ఒప్పించగల ఓపిక ఉన్నవారిని చూసుకుని, తమ దగ్గరికి ఎంత మంది విద్యార్ధులని పంపితే అంతగా, తలకు ఇంతని కమీషన్ ముట్టచెబుతాయి.

ఇందుకోసం కొన్ని కాలేజీలు, పాఠశాలలు తమ బోధనా సిబ్బందినీ ఉపయోగిస్తుంది. యాడ్ కాంపైన్ పేరుతో, ఆడియో వీడియోలతో సహా కరపత్రాలూ, బ్రోషర్స్ తో, ఆకర్షణీయమైన స్కీములతో... వేసవి సెలవులంతా ఇదే పని! ఎంతగా ఆశలు పెడతారంటే - తల్లిదండ్రులకి, ముఖ్యంగా అంతగా చదువుకోని గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకి, ఏకంగా అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు.

చిన్న ఉదాహరణ చెబుతాను. మాకు తెలిసిన ఒక అమ్మాయికి పదవ తరగతిలో 541 మార్కులు వచ్చాయి. ఆ అమ్మాయికి లెక్కలంటే ఇష్టం. బాగా చేస్తుంది. కప్ప, బొద్దింకలని చూసినా, ఒక్కసారిగా చీమల కుప్పల్ని చూసినా, ఆ పిల్లకి ఒళ్ళు జలదరిస్తుంది. జంతువుల పట్ల చాలా అయిష్టత. ఆమెకి MPC ఇష్టం.

స్థానిక కాలేజీ వాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులకి "మీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పిస్తే, ఫ్రీగా చదువు చెబుతాం. Bi.PC ఇప్పించండి. బాగా చదువుచెబుతాం. పూర్తిగా ఆమె మీద కాన్ సెంట్రేషన్ చేస్తాం. ఆమె గనుక మెడిసిన్ ర్యాంకు సాధిస్తే, రెండు తులాల బంగారు గొలుసు బహుమతిగా ఇస్తాం" అంటూ ఊదర పెట్టారు.

గత సంవత్సరం మా ప్రక్కింటి అమ్మాయికి 574 మార్కులు వచ్చాయి. ఆమె ఐఐటీ, ఎంసెట్ అంటూ ఉంటే, ఇదే కాలేజీ వాళ్ళు ఇదే ప్రపోజల్ తో "నువ్వు మా పాలిట లక్ష్మీదేవివి తల్లీ! సరస్వతీ దేవి కటాక్షం నీకుంది. ఏదో నీలాంటి వాళ్ళు మా కాలేజీలో ఉండి బాగా చదివి ర్యాంకు తెచ్చుకుంటే మాకు పేరు వస్తుందని మా ఆశ! Bi.P.C. తీసుకో, రానుపోనూ మేమే ఆటో కూడా ఏర్పాటు చేస్తాం" అంటూ ఇంటి చుట్టూ తిరగటం ప్రత్యక్షంగా చూశాము మేము. అదే తంతు ఈ సంవత్సరం ఈ అమ్మాయిది కూడా!

తల్లిదండ్రులకి ఆశ కలగటం సహజం. రెండు తులాల బంగారం అంటే 40 వేలు. ‘తమ పిల్ల చదివేసి మెడిసిన్ సీటు తెచ్చేసుకుంటే...?’ అని ఆశ! అదెంత కష్టమో, ఏపాటి సంభవమో తెలియదు. పదవ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంది కాబట్టి, మెడిసిన్ ర్యాంకూ తెచ్చేసుకుంటుంది అనుకుంటారు.

ఇక ఇలా ఆశపెట్టే కాలేజీ వాళ్లకి కూడా మెడిసిన్ ర్యాంకు ఎలా వస్తుందో తెలియదు. అసలిక్కడ ఎంసెట్ అన్నదే ఓ పెద్ద ఫార్సు! కాబట్టి, ఎంసెట్ లో ఈ అమ్మాయికే కాదు, ఏ విద్యార్ధికీ మెడిసిన్ ర్యాంకు తెచ్చుకునేంత శిక్షణా తామివ్వలేమని సదరు కాలేజీ వాళ్ళకీ తెలుసు. కానీ ఇవాళా రేపూ, ఇంజనీరింగ్ ర్యాంకులకి విలువ లేదు. ఐఐటీ తాము అందుకోలేరు. చదవగల విద్యార్ధులని సమీకరిస్తే, ఆశపెడితే, వాళ్ళు చదివి ఎలాగోలా ఒక్క మెడిసిన్ సీటు తెచ్చుకున్నా, అది తమకి కాసులు పండిస్తుంది.

ఒక వేళ మెడిసిన్ ర్యాంకు రాకపోయినా ఇంటర్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అవి ప్రచారస్త్రంగా ఉపయోగపడతాయి. ఈ ఆశ కంటే వాస్తవికతా తెలియదు. ఇంటర్ తమ దగ్గర చదివి, లాంగ్ టర్మ్ లో మెడిసిన్ ర్యాంకులు తెచ్చుకున విద్యార్ధుల వివరాలతో, ప్రచారాలు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఆశ వాళ్ళది!

ఇవేవీ తెలియని తల్లిదండ్రుల ఆశ తల్లిదండ్రులది. దాంతో లెక్కలంటే ఇష్టమో, జువాలజీ అంటే కష్టమో ఉన్న అమ్మాయిని Bi.P.C. లో చేరమన్న ఒత్తిడితో, ఆ బుడ్డిది బేర్ మంటోంది. ఏం చేస్తాం? అందుకే నిన్నటి టపాలో.... పిల్లలు విద్యాసంస్థలకీ, తల్లిదండ్రులకీ కూడా ఆదాయ వనరులుగా మాత్రమే కనబడుతున్నారని వ్రాసాను.

ఈ విషయం ప్రక్కన బెడితే.... PROల సాయంతో విద్యాసంస్థలు, విద్యార్ధులని సమీకరించుకునే ప్రక్రియలో.... అచ్చంగా ఎవరి మార్కెట్ సర్వే వారికుంటుంది. ఏ ప్రాంతంలో ఏయే వయస్సు పిల్లలు, ఏఏ తరగతుల్లో చేరేందుకు, ఎంతమంది ఉన్నారన్న వివరాలతో సహా, తల్లిదండ్రుల ఆర్ధిక స్థాయిల గురించి కూడా సమాచారం సేకరిస్తారు. ఆయా ప్రాంతాల్లో, ఏ విద్యార్ధుల తల్లిదండ్రులకి ఎంతెంత పలుకుబడి ఉందీ, ప్రభావపరచగల సత్తా ఏమాత్రం ఉందీ.... లాంటి వివరాలూ పరిశీలిస్తారు. దాన్ని బట్టి ఫలితాల పంపకం ఉంటుంది.

ఎవరి పిల్లలకి మంచి మార్కులూ, ర్యాంకులూ కట్టబెడితే, ఆయా ప్రాంతాల నుండి తదుపరి సంవత్సరం తమకు ఎంతమంది విద్యార్ధులు రవాణా అవుతారో చూసుకుని, దాన్నిబట్టి ఫలితాలని మేనేజ్ చేస్తారన్న మాట! ఇదంతా గమనించినప్పుడు, ఇంత శ్రమా, శ్రద్దా, సమయమూ... విద్యార్ధుల జ్ఞానాన్ని పెంపొందించటానికీ, వారి వ్యక్తిత్వాన్ని నిర్మించటానికీ ఉపయోగిస్తే.... ‘ఈ దేశపు యువత, ఎంత ధృఢతరంగా, సుసంపన్నంగా తయారౌతారో కదా!’ అన్పిస్తుంది.

ఈ విధమైన ఫలితాల అవకతవకల గురించి రాజకీయ రంగం ద్వారా భారతీయత మీద సుదీర్ఘ కుట్ర అనే టపాల మాలికలో ఎంసెట్ అవకతవకల మీద వ్రాసిన టపాలలో వివరించాను.

2000 సంవత్సరం ఫలితాల మీద మేము ఫిర్యాదు చేసిన తరువాత నుండి, ఇంటర్ ఫలితాలలోనూ, ఎంసెట్ ఫలితాలలోనూ, ఈ మధ్య కాలంలో ఐఐటీలోనూ, ‘మట్టిలోని మాణిక్యాలు’, ‘పేదింట విద్యాకుసుమాలు’ అంటూ శీర్షికలతో మార్కులూ, ర్యాంకులలో కొన్నింటిని, డబ్బూ పరపతి, ప్రభావశీలతా గల తల్లిదండ్రుల పిల్లలకి గాక, సామాన్యులకి కూడా రానిస్తున్నారు.

ఎందుకంటే - క్రమంగా ర్యాంకు ఫిక్సింగులూ, మార్కుల అవకతవకలూ బహిరంగ పడుతున్నాయి కదా!? జారిపోయే నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, కొంత సహజత్వాన్ని అద్దేందుకు, ఇలాంటి చర్యలు చేపట్టారన్న మాట. ఇవే మట్టిలోని మాణిక్యాలు 2000 సంవత్సరానికి ముందు స్టేట్ ర్యాంకుల జాబితాలో లేకపోవటం గమనార్హం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

భారతీయుల మీద విద్యారంగం ద్వారా కుట్రకు సమాంతరంగా.... గ్రంధాలయాలు, ప్రజలలో పిల్లలలో పఠనాసక్తి, శిధిలం చేయబడ్డాయి. లైబ్రేరియన్ నియామకాలు మూలపడ్డాయి. గ్రంధాలయాలకు నిధులు రద్దయ్యాయి. క్రమంగా గ్రంధాలయాలు అంతరించాయి. క్రికెట్టూ, టీవీలతో [ముఖ్యంగా ప్రైవేటు ఛానెళ్ళు వచ్చాక], జనాల్లో మిగిలి ఉన్న పఠనాసక్తి కూడా అడుగంటి పోయింది. ఇప్పుడు నిర్వహించబడుతున్న గ్రంధాలయాలలో కేవలం జి.కే.పుస్తకాలు, ఉద్యోగపోటీలలో విజయ సోపానాలు, టిప్స్ తో నిండిన వ్యక్తిత్వ నిర్మాణ పుస్తకాలు మాత్రమే ఉన్నాయి.

దశాబ్దాల తరబడి [తీవ్రదశలో] అమలు చేయబడిన ఈ కుట్రలో, ఆయా కాలాల్లో ఆయా స్థాయిలలో తదనుగుణమైన వ్యూహాలు[స్ట్రాటజీలు] అమలు చేయబడ్డాయి. ఉన్నతాధికారులలోనూ, రాజకీయ నాయకులలోనూ, డబ్బు కెరీర్ కు లొంగే అవినీతి పరులని, వాటితోనే సంతృప్తి పరచి లోబరుచుకున్నారు. ‘దూరదృష్టితో చూస్తే ఇలాంటి విద్యావిధానాలు, పాఠ్యాంశాలు, గ్రంధాలయ నిర్మూలనలు సమాజానికి నష్టదాయకం’ అని అడ్డుకునే ప్రయత్నం చేసిన నిజాయితీపరులనీ, నిబద్దత గల వారినీ, విధుల్నుండి తప్పించడం, వేధించటం చేశారు. గురిపెట్టుకుని విసిగించారు.

ప్రభుత్వంలో కీలక స్థాయిల్లో ఉన్న అలాంటి వారిని విసిగించటం, వేధించటం సాధ్యం గాకపోతే.... ఇక అప్పుడు నల్లమేక - నలుగురు దొంగలు కథలోని దొంగల్లా, పదే పదే అదే చెప్పి కన్విన్స్ చేసారు. ఫలానా సమస్యకి ఇది తప్ప మరో పరిష్కార మార్గం లేదంటూ, పదే పదే, మేధావులంటూ మీడియా ప్రచారించిన వాళ్ళూ, కమీటిల నిపుణులుగా ప్రభుత్వం నియమించిన వాళ్ళూ చెవినిల్లు కట్టుకు పోరితే.... వినగా వినగా ‘అంతేనేమో’ అన్పించటమే ఇక్కడ విన్యాసం!

ఈ విధంగా, సామదాన దండోపాయాలే కాదు, ప్రభావపరచటం, ఏమార్చటం, భ్రమపరచటం, నమ్మించటం గట్రా మానసిక తంత్రాలు కూడా ప్రయోగింపబడ్డాయి. కాబట్టే ఒక్క విద్యారంగమే కాదు, రాను రాను అన్ని రంగాలూ అధ్వాన్నంగా, అవినీతి ఊబిగా ఉత్పన్నం చెందాయి. ఇందుకోసం, భారతంలో ధృతరాష్ట్రునికి, కణుకుడు చెప్పిన కూటనీతిని అమలు చేశారు. కణిక నీతిని వివరించే కథనీ, కూటనీతినీ మరో సారి ఇక్కడ చదువుకోవచ్చు.


చేదుగా ఉన్నా, నిజమే చెప్పాల్సి వస్తే..... ఈ రోజు సమాజంలో, తల్లిదండ్రులలో అత్యధికులు, పిల్లల పెంపకం విషయంలో విఫలమయ్యారు, అవుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో మరిచిపోయారు, లేదా వాళ్ళకిది అసలు తెలియదు. మొన్నటి తరం పెద్దల్ని గురించి ఈ మాట నేను ఆనటం లేదు. ఈ తరం తల్లిదండ్రుల్ని , నిన్నటి తరం తల్లిదండ్రుల్లో కొందరిని చూసి, ఈ మాట చెబుతున్నాను.

అలాంటి చాలామంది తల్ల్లిదండ్రులకి పిల్లల్ని ఏవిధంగా క్రమశిక్షణా యుతుల్ని చేయాలో తెలియదు. పిల్లల్లో కుతూహలాన్ని, ఆసక్తిని, తార్కికతనీ, ఆలోచనా శక్తిని ఎలా పెంపొందించాలో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా పిల్లల్ని అతిగా ముద్దు చెయ్యటమే! వాళ్ళ దృష్టిలో పిల్లలు కోరిందల్లా ఇవ్వటంతో తమ బాధ్యత తీరినట్లే! పిల్లలు అడిగినంత డబ్బివ్వటం, కోరిన వస్తువులు కొనివ్వటం... ఇవే పిల్లల పట్ల తమ కర్తవ్వం అనుకునే తల్లిదండ్రుల్ని నేను చాలా మందిని చూశాను.

నిజానికి ఈ రకపు ’గారాం’తో పిల్లల్లో ఎంత అహం పెరుగుతుందో ఆ తల్లిదండ్రులకు అవగాహన లేదు. పేద ధనిక తారతమ్యం లేకుండా అన్ని వర్గాల తల్లిదండ్రుల్లోనూ, వారి వారి ఆర్ధిక స్థాయిలకు తగినంతగా, ఈ ‘గారాబపు అహంకారం’ అనే ప్రక్రియ నడుస్తోంది.

ఇక ఇలాంటి స్థితిలో.... ‘పిల్లల్ని దండిస్తే చట్ట పరంగా పిల్లలు పెద్దల మీద కేసులు పెట్టవచ్చు’ అంటే పరిస్థితి ఏమిటి? అసలుకే ఓప్రక్క, తల్లిదండ్రులకి తమ పిల్లల్ని గట్టిగా కోప్పడాలంటేనే భయం. నొచ్చుకుంటారనో, ఏడ్చి ఇల్లు పీకి పంది రేస్తారనో భయం. ఇక టీవీలు, నేరాలూ - ఘోరాలు, లేనిపొని కొత్త ఆలోచనలని పిల్లలకి రేకెత్తిస్తున్నాయయ్యె! గట్టిగా తిట్టినా, రెండు దెబ్బలు కొట్టినా.... ఇంట్లోంచి పారిపోవడమో, ఆత్మహత్య చేస్కోటమో చిన్నపిల్లల విషయంలోనూ వింటున్నాం, చూస్తున్నాం.

అలాంటప్పుడు భయం లేకుండా ఎలా ఉంటుంది? అదే పరిస్థితి పాఠశాలలదీ, అక్కడి ఉపాధ్యాయులదీ కూడా! చదవలేదనో, క్రమశిక్షణా రాహిత్యమనో పిల్లల మీద కాస్త తీవ్రచర్యలు తీసుకుంటే... దానికి ఆ పిల్లలు కాస్తా అతిగా స్పందిస్తే[ఇల్లు విడిచి పారిపోవటం, ఎలుకల మందు మింగటం గట్రా] ఆపైన కేసులు, పోలీసు స్టేషన్లూ, కోర్టులూ, తిప్పలూ! ‘ఎందికొచ్చిన గొడవ?’ అని ఉపాధ్యాయులూ అనుకుంటున్నారు, స్కూళ్ళదీ అదే పరిస్థితి!


"సార్! మా వాడు బాగుపడితే చాలు! రెండు పీకినా ఏమీ అనుకోం?" అనే తల్లిదండ్రులు సైతం, తీరా బిడ్డ వంటి మీద దెబ్బలు చూడగానే ఆవేశంతో ఊగిపోవటమూ సహజమే! పిల్లల ప్రవర్తనకి విసిగిన ఉపాధ్యాయుల ఆగ్రహం హద్దులు దాటటమూ సర్వసాధారణమే! ఎందుకంటే పెద్దలలోనే భావోద్రేకాలని నియంత్రించుకునే శక్తి సన్నగిల్లిన చోట, పిల్లల్లో అదెక్కడి నుండి వస్తుంది? వెరసి అంతటా అదే మానసిక అస్థిరత [imbalance] ఉంది. ఫలితమే ఘర్షణ!

ఇలాంటి స్థితిలో, మండే జ్వాలలో మరింత పెట్రోలు పోయటానికి.... చట్టాలూ, మానవహక్కులూ కూడా తోడయ్యాయి. ఇక్కడ మరో విన్యాసం ఏమిటంటే - ప్రస్తుత విద్యావిధానంలో, పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్ధుల తల్లిదండ్రులూ కూడా, విద్యార్ధులకు సంబంధించిన అన్ని వ్యవహారాలకు ఉపాధ్యాయులనే బాధ్యుల్ని చెయ్యటం! అంతేగాక అసలు పిల్లల విద్యాభివృద్దిని కేవలం మార్కులతో మాత్రమే కొలవటం అన్నది సర్వత్రా జరుగుతోంది. పిల్లల ఎదుగుదల అంటే మార్కులూ ర్యాంకులే!

ఆటల పోటీలలోనూ ఇతరత్రా ప్రతిభాపాటవాల విషయంలోనూ కూడా బహుమతుల లెక్కలే! ఎన్ని కప్పులూ, ఎన్ని పతకాలూ! ఇదే జాతర! ‘ఎంతగా పిల్లల్లో నైపుణ్యాలు పెరిగాయి?’ అన్నది ఎవరికీ పట్టనిదై పోయింది. క్రమంగా కార్పోరేట్ విద్యాసంస్థల దగ్గరి నుండి సాధారణ విద్యాసంస్థల దాకా, ఎవరి స్థాయిని బట్టి వారు నాసా గుర్తింపులూ, గణిత ఒలెంపియాడ్ లూ, ఫలానా ఫలానా పోటీల్లో నారాయణ హవా, శ్రీచైతన్య పెను హవా! అంటూ వ్యాపార ప్రకటనల స్థాయికి ఎదిగిపోయింది[?].

ఈ మొత్తం వ్యవహారంలో.... పిల్లలు, పాఠశాలలకు పైసలూ, ఇమేజ్ తెచ్చిపెట్టే మోడళ్ళు గానూ, తల్లిదండ్రులకి పరపతి మోజులని తీర్చే వనరులు గానూ మిగిలిపోయారు. ఎందుకు నేర్చుకుంటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో వారికేం తెలీదు. చదువులు కాని ఇతరత్రా పోటీలలోనూ, యాజమాన్యాల లాబీయింగ్ లని బట్టే బహుమతి పంపకాలైన చోట, విద్యార్ధులు అందులో సమిధలే తప్ప, సదరు పోటీలు పిల్లల్లో మానసిక వికాసాన్ని తెస్తోందేమీ లేదూ, మానసిక వత్తిడులని తప్ప!

తల్లిదండ్రులకి కూడా, పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, మానసిక వికాసాం, వ్యక్తిత్వ నిర్మాణాం ఏవిధంగా ఉందో పట్టించుకునే తీరిక లేదు. ఆయా లక్షణాలు పిల్లల్లో పెంపొందించాలనే అవగాహన కూడా చాలా తక్కువమంది తల్లిదండ్రుల్లో ఉంది. మార్కులూ, ర్యాంకులే కొలబద్దలై పోయాయి. జి.కే. బట్టీ వేస్తే తెలివైన వాళ్ళయిపోతారనేంత గుడ్డినమ్మకం ఉన్న తల్లిదండ్రుల్ని కూడా చూశాను. "రామాయణ భారతాలని గురించి ఇంట్లో అమ్మదగ్గర చెప్పించుకు రామ్మా!" అంటే.... "టీచర్! మా మమ్మీ ఆవేవీ అవసరం లేదులే అంది" అని చెప్పిన పిల్లల్ని చూశాను.

కొందరు తల్లిదండ్రులకి - ‘పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే, చదువుతో పాటు వ్యవహార జ్ఞానం కూడా కలిగించబడాలి. కథలు, పుస్తక పఠనంతో పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం కలిగించవచ్చు’ అని తెలిసినా, అందుకోసం తమ సమయాన్ని పిల్లలకి కేటాయించగల స్థితిలో లేరు. ఎవరి బిజీ వారిది. ఎవరి పని ఒత్తిడి వారిది. మొత్తంగా జీవితాలే ఉరుకులూ పరుగులతో, సూర్యాగమనాన్ని మించిన వేగంలో మునిగి పోయినప్పుడు ఎవరేం చెయ్యగలరు? ఎందుకంటే అందరూ ఒక్కటై పరిష్కరించుకోవలసిందే గానీ, ఒక్కరుగా పరిష్కరించుకోలేని సమస్య ఇది!

ఇంకా కొందరు తల్లిదండ్రుల అభిప్రాయంలో, పాఠశాలకు ఫీజులు కట్టటంలో తమ బాధ్యత తీరిపోయినట్లే! ఫీజులూ, పుస్తకాలు, యూనిఫాంలూ, బూట్లూ, సూట్లూ.... అన్ని ఖర్చులూ పెట్టి ‘పిల్లల్ని బళ్ళో పెట్టేస్తే’ సరి! ఇక కొందరు తల్లులకైతే ప్రతీ రోజూ, తామూ పిల్లల్తో కుస్తీ పట్టి, వాళ్ళ చేత హోం వర్కు చేయిస్తే, ఆ రోజుటికి తమ పని గడిచినట్లే! ఒక యజ్ఞం పూర్తయినట్లు ఓ నిట్టూర్పు కూడా విడుస్తారు. నిజానికి మొరాయించే పిల్లల చేత హోం వర్కు చేయించటం చాలా కష్టమైన పనే! మొరాయించని పిల్లలకి కూడా ‘బొచ్చెడంత హోం వర్క్’ ఉంటే అది నడ్డి విరిగేంత పని! ‘పిల్లలకి పరీక్షలు మాకు అగ్నిపరీక్షలు’ అనే తల్లిదండ్రులని బోలెడు మందిని గమనించాకే ఇవి చెబుతున్నాను.

ఇక ఈ తల నొప్పంతా భరించలేక, ఉదయం నుండీ బడిలో ఉండి వచ్చిన పిల్లల్ని, ట్యూషన్ కి తరిమేసే తల్లిదండ్రులు మరి కొందరు. దాంతో తల్లిదండ్రుల కర్తవ్య నిర్వహణ, బాధ్యతా పూర్తయినట్లే!

వెరసి పిల్లల అందమైన బాల్యం, ఆనందంగా గడవాల్సిన బాల్యం.... జ్ఞానపు తోటలో, చదువు‘కునే’ బడిలో కాదు, చదువు ‘కొనే’ జైలులో తెల్లారి పోతోంది! ఒక చిట్టి పిచుకనో, చిన్ని చిలుకనో గమనించే తీరిక లేదు.

శ్రీశ్రీ కాంక్షించినట్లు.... ‘మంచుకురిస్తే, వాన వెలిస్తే, ఆకాసాన హరివిల్లు విరిస్తే, అది మా కోసమే’ అనుకునే బాల్యం పిల్లలకి అందుబాటులో లేదు. ‘సముద్రపు అలల మీది తేలి వచ్చే నురగలలో ఆడుకుంటూ పిల్లలు పాడుకుంటున్నారు. కాగితపు పడవలు వదలి వాటి వయ్యారాలు చూసి సంబరంగా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు. వాళ్ళకి చేపలు పట్టటం రాదు!’ అంటూ రవీంద్రుడు పాడిన బాల్యం, ఇప్పుడు పిల్లల దగ్గర లేదు. అలారం.... స్కూలు బస్సు హరన్... లంచ్ బెల్... లాంగ్ బెల్... బస్సు హారన్.. డేట్ మారింది. అంతే! సెలవులొస్తే అప్పుడే ఊపిరి పీల్చుకోవాలి. మరి వీక్ టెస్టో?

చిదిమితే పాలు గారే పసిపాపలకి, రేపటి భవిష్యత్తు కోసం అంటూ, ఇంత ఒత్తిడి ఈ రోజు.... అవసరమా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!


ఇప్పటికే ప్రభుత్వ పనితీరులో, రాజకీయ నాయకుల, బ్యూరాక్రాట్ల వ్యవహార సరళిలో రెడ్ టేపిజం  పేరిట అవినీతి, అవకతవకలు, విధుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం ఎలా జరుగుతుందో పలుమార్లు పరిశీలించినా....
                మరో స్పష్టమైన దృష్టాంతాన్ని గమనించండి. ముందుగా మే 19, 2010 న ఈనాడులో ప్రచురింపబడిన దిగువ వార్త పరిశీలించండి.
>>>అఫ్జల్ గురు ఫైల్ పై కదలిక:
గవర్నర్ కు పంపిన ఢిల్లీ ప్రభుత్వం!
నాలుగేళ్ళ తర్వాత చలనం!
పరిస్థితులను సమీక్షించాకే శిక్ష అంటూ మెలిక!

నాలుగేళ్ళుగా కదలకుండా పడి ఉన్న అఫ్జల్ గురు ఫైల్ పై ఢిల్లీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఫైల్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజిందర్ ఖన్నాకు మంగళవారం పంపించింది. గవర్నర్ నుండి తిరిగి వచ్చాక కేంద్ర హోంశాఖకు అందజేయనుంది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయాల్సిందే కానీ, శిక్షను అమలు పరిచే ముందు శాంతిభద్రతల పరిస్థితులనూ క్షుణ్ణంగా పరిశీలించాలిఅంటూ ఢిల్లీ ప్రభుత్వం ఫైల్ లో పేర్కొన్నట్లు సమాచారం. పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టే విషయంలో ఢిల్లీ అభిప్రాయం కోరుతూ కేంద్ర హోంశాఖ దాదాపు నాలుగేళ్ల క్రితం ఫైల్ ను పంపించింది. ఆ తర్వాత ప్రతీ మూడు నెలలకోసారి రిమైండర్లు జారీ చేస్తూనే ఉంది. ఇప్పటికి 16 రిమైండర్లు జారీ అయ్యాయి. ముంబై దాడుల కేసులో కసబ్ కు ఉరిశిక్ష పడటంతో అఫ్జల్ గురు విషయం తెరపైకి వచ్చింది. అఫ్జల్ క్షమాభిక్ష ఫైలు ఢిల్లీ ప్రభుత్వం వద్ద ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ సర్కార్ అఫ్జల్ ను టెర్రరిస్టుగా కాకుండా టూరిస్ట్ గా చూస్తోందంటూ ప్రతిపక్ష భాజపా ఆరోపించింది. ఈ నేపధ్యంలో, ఢిల్లీ ప్రభుత్వ అసాధారణ జాప్యాన్ని తప్పుబడుతూ తీవ్రపదజాలంతో కేంద్ర హోంశాఖ ఇటీవల లేఖ రాసింది. దీంతో అఫ్జల్ ఫైలుపై ప్రభుత్వంలో చలనం వచ్చింది. మరో వైపు కేంద్రహోంశాఖకు ప్రత్యుత్తరం పంపించామంటూ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళ వారం తెలిపారు.
 పరిణామక్రమం:
13డిసెంబర్, 2001- పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి.
18డిసెంబర్, 2002 - దాడికి కుట్ర పన్నిన అఫ్జల్ గురుకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధింపు.
29అక్టోబర్, 2003 - ఉరిశిక్షకు ఢిల్లీ హైకోర్టు ఆమోదం.
4ఆగస్టు 2005 - అఫ్జల్ అప్పీల్ కు సుప్రీంకోర్టు తిరస్కరణ.
20అక్టోబరు 2006 - తిహార్ జైలులో ఉరి అమలుకు సెషన్స్ కోర్టు తేదీ ఖరారు.
రాష్ట్రపతి క్షమాభిక్షను వేడుకుంటూ అఫ్జల్ గురు 2006 లో విజ్ఞప్తి దాఖలు చేసాడు. నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రపతి ఆ విజ్ఞప్తిని పరిశీలన కోసం కేంద్రహోంశాఖకు పంపించారు. అక్కడి నుండి ఫైలు ఢిల్లీ హోంశాఖకు చేరుకుంది.
                ~~~~~~~~~
పార్లమెంటు పై దాడి జరిగి 8 ½  సంవత్సరాలైంది. సదరు కుట్రదారుడికి ఉరిశిక్ష విధించి 7 ½  సంవత్సరాలైంది. ఫైల్ నింపాదిగా, నిబంధనల ప్రకారం ప్రయాణం చేస్తోంది. కారాగారంలో నేరగాణ్ణి మేపడానికి, రక్షించడానికి కోట్లాది రూపాయలు ఖర్చయ్యి ఉంటుంది.
                ఇంత పకడ్బందీగా నిబంధనల ప్రకారం ఫైలుని నడిపిస్తున్నాయి కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు! నేరం జరిగింది భాజపా హయంలో! వీళ్ళంతా ఇంతగా నిబంధనలు పాటిస్తున్నారే, మరి ఏ నిబంధనలు పాటిస్తూ ఆ ముస్లిం ఉగ్రవాదులూ, పాక్ కుట్రదారులూ, పాక్ ప్రేరేపిత నేరగాళ్ళు భారత పార్లమెంటుపై దాడి చేసారట? ఆ దాడిలో దేశపు పరువు కాపాడేందుకు అసువులు బాసిన పోలీసు, సైనిక వీరుల కుటుంబాలని, ఏ నిబంధనల ప్రకారం గాలికి వదిలేసారట? 14 డిసెంబరు, 2007మీ సంతాపాలు ఎవరికి కావాలి?’ అంటూ ఆ కుటుంబాల వాళ్ళు ఆక్రోశించారు కూడా! ఈ తిలా పాపాన్ని తలా గుప్పెడు.... ఎన్డీయే, యూపీయే లు రెండూ కుమ్ముకున్నాయి.
                ఇంకా.... షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిత్వాన గల ఢిల్లీ ప్రభుత్వం అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయాల్సిందే గానీ, శిక్షను అమలు పరిచే ముందు శాంతి భద్రతల పరిస్థితులనూ క్షుణ్ణంగా పరిశీలించాలంటూమెలిక పెట్టిందట!
                అంత శాంతి భద్రతలను పరిరక్షించలేనప్పుడు, ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడం ఎందుకు? అందునా సదరు షీలా దీక్షిత్ ఎంతో సమర్ధనారి! 1991, మే 21న రాజీవ్ గాంధీ శ్రీపెరుబుదూర్ లో హత్యకు గురికావడానికి ముందు [ఒకటి లేదా రెండు రోజులు ], ఒడిషాలో ఎన్నికల ప్రచార యాత్రలలో సోనియాకి నమ్మకంగా, రాజీవ్ వెంట ఉండి మరి మృత్యుముఖానికి సాగనంపినంత సమర్ధురాలు. అప్పట్లో ఎన్నికల ప్రచార యాత్రలలో రాజీవ్ గాంధీ తిండితిప్పల బాధ్యత ఈవిడదే లెండి. చల్లారిన బజ్జీల దగ్గర నుండి సమయానికి భోజనం చేసేటట్లు, దగ్గరుండి మరీ చూసుకుంది![ఈ విషయం గురించి వివరంగా భారత రాజకీయ రంగంపై కుట్రఅనే లేబుల్ లో వ్రాసాను.]
                మరి అంతటి సమర్ధ నాయకురాలికి, రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సీనియర్ నాయకురాలికి, అఫ్జల్ గురుకి ఉరి తీస్తే శాంతి భద్రతలని పరిరక్షించే సామర్ధ్యం లేదటనా? అఫ్జల్ గురు ఉరిశిక్ష సాగదీసిందీ, అఫ్జల్ గురు ఉరిశిక్ష ఫైలుకి నాలుగేళ్ళు తొక్కిపెట్టి ఉంచిందీ షీలా దీక్షిత్ ప్రభుత్వం!? వెంటనే ఫార్వర్డ్ చేయనిది పాక్ కి ఆగ్రహం కలుగుతుందనా లేక అధిష్టానానికి ఆగ్రహం కలుగుతుందనా?
                నిజంగా భారత దేశ ముస్లింలు అఫ్జల్ గురుని ఉరి తీస్తే శాంతిభద్ర్రతలకి విఘాతం కలిగిస్తారా? మరి పార్లమెంట్ పై దాడిని "పోన్లే పాపం!" అనుకుంటారా? ఈ దేశపు పార్లమెంటు ముస్లింలది కాదటనా? ఈ దేశం, దేశపు పరువు మర్యాదలు ఈ దేశ ముస్లింలకు పట్టదటనా? దేశం కంటే మతమే తమకు ముఖ్యం అనుకున్నప్పుడు, మత ప్రాతిపదికన దేశ విభజన జరిగిన నాడు ఇక్కడెందుకు ఉండిపోయినట్లు? అటు పాకిస్తాన్ కో, ఇటు బంగ్లాదేశ్ కో పోవలసింది కదా?
                 దేశం కంటే మతమే ముఖ్యం అనుకుంటే, అలాంటి వాళ్ళని.... ముస్లింలైతే అరేబియా సముద్రంలోకి దించి, పడవెక్కించి పాకిస్తాన్ కీ, హిందువులైతే హిందూ మహా సముద్రంలోకి దించి దిక్కున్న చోటికీ, పొమ్మనటం మేలు.
                అసలైనా ఈ దేశపు ముస్లింలు గానీ, హిందువులు గానీ, ఏ ఇతరులు గానీ అఫ్జల్ గురుని ఉరిశిక్ష వేయవద్దంటున్నారా? పాక్ కి అనుకూల ఎన్డీయే, యూపీఏ నాయకులూ, మీడియా తప్ప, మరెవ్వరూ ఆ వాదనకు మద్దతు ఇవ్వటం లేదు! లేకపోతే ఈ రెడ్ టేపిజం మీద మీడియా, ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి కదా!
                సామాన్య ముస్లింలని, కూరలమ్మే వాళ్ళ దగ్గరి నుండి కాసేట్లమ్మే వాళ్ళ దాకా, ఎవరిని కదిపినా, పెరిగిన పప్పూబియ్యాల ధరల పట్ల అదురూ, మరోసారి పెరగనున్న పెట్రో ధరల పట్ల బెదురూ తప్ప, అఫ్జల్ గురు లాంటి నేరగాడికి ఉరిశిక్ష వేస్తే ఊరుకోం అనే హుంకరింపు ఎవరిలోనూ కనబడదు. మరి పాత బస్తీలో వాళ్ళంతా హుంకరిస్తూ ఊగిపోతున్నారేమో! అలాంటి వాళ్ళని చూసి షీలా దీక్షిత్ లూ, సోనియాలూ, చిదంబరంలూ, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కలవర పడుతున్నారేమో’! ఇదీ గూఢచర్యం!

ఇందులో రెడ్ టేపిజం ఏమిటంటే - మచ్చుకి పరిశీలించండి.
నాలుగేళ్ళగా 16 రిమైండర్లు జారీ అయినా ఢిల్లీ హోంశాఖ నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా కూర్చొంది. ఎవరు ఆదేశిస్తే అలా గమ్మున కూర్చొంది? ఎవరూ నియంత్రించక పోతే, ఢిల్లీ హోంశాఖ ఉద్యోగులే ఫైలు తమ సొరుగులో పెట్టుకుని చోద్యం చూస్తారా?
                ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను. 1992 ప్రధమార్దంలో.... అప్పట్లో నేను APS RTC కి బ్యాటరీలు సరఫరా చేసేదాన్ని! ఆర్టీసీ వాళ్ళ వాడకంలో కనీసం 10% రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని నియమం ఉండేది. అయితే ఆర్టీసీలో డైరెక్టరు స్థాయి అధికారి ఒకరికి, బినామీగా బ్యాటరీ తయారీ యూనిట్ ఉండటంతో, అతడు కాగితాల మీదే కొత్త బ్యాటరీల కొనుగోలు, పాత బ్యాటరీల[scrap] అమ్మకమూ కొనసాగిస్తూ, పోటీదారులైన నాలాంటి వారికి ఆర్డర్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు.
                నేను Gowell పేరుతో నడుస్తున్న ఆ యూనిట్ చిరునామా సంపాదించి అక్కడికి వెళ్ళాను. చూస్తే అది ఓ అద్దె ఇంటిలో[రెండు గదులు] కేవలం బ్యాటరీలు అసెంబుల్ చేస్తున్నది.[ఈ మొత్తం వ్యవహారం కార్మికుల యూనియన్ లకు  తెలుసు. వాళ్ళ వాటాలు వాళ్ళకి వస్తాయి. అందుకే వాళ్ళు నోరు మెదపరు. ఆర్టీసీ నష్టాలకు ఇది కూడా ఒక కారణం.]
                నేర్పుగా వాళ్ళ నుండి డాక్యుమెంట్ల కాపీలు సంపాదించాను. పరిశీలిస్తే ఏముంది! డైరెక్టర్ కే గాక, మెటీరియల్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతాధికారికి కూడా అందులో వాటా ఉన్నది. వాళ్ళ భార్యల పేరిట ఉన్న భాగస్వామ్య డీడ్ సంపాదించాను. ఈ మొత్తం వ్యవహారం మీద అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేసాను. [ఆ నేపధ్యంలోనే ఈనాడులో ఉపసంపాదకురాలిగా పనిచేసే నా మిత్రురాలి ఇంట కొన్నిరోజులు ఉన్నాను. రామోజీరావు గూఢచర్య కార్యకలాపాలు నా దృష్టికి వచ్చింది అప్పుడే!]
                నా ఫిర్యాదు దరిమిలా ఆర్టీసీలో ఎంక్వయిరీ జరిగింది. ఆ సమయంలో నా ఫైలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు, మరుక్షణం దాని మీద రిమార్క్ వ్రాసేసి తర్వాతి టేబుల్ మీదికి తోసేసారు. ఫైలుని బాంబుని చూసినట్లు చూసారని, ‘తమ దగ్గరుండగా ఎక్కడ పేలుతుందో, ఎందుకొచ్చిన గొడవ?! అన్నట్లు ఎవరికి వాళ్ళు పక్క టేబుల్ మీదికి ఉరికించారనీ, అప్పట్లో జోకులేసుకున్నాను. ఎందుకంటే తేడా వస్తే ఉద్యోగాలు పోతాయని భయం ఉండేది అప్పట్లో! ఆ విషయమై గుమాస్తా స్థాయి ఉద్యోగి నాతో "ఉద్యోగం పోతే ఏముంది మేడం! అడుక్కుతినటానికి కూడా పనికి రాము!" అంటూ తమ భయాన్ని సమర్ధించుకుంటూ వ్యాఖ్యానించాడు.
                ప్రమాదకరమైన వ్యవహారం అనుకున్నప్పుడు ఉద్యోగులు తీరు ఇలాగే ఉంటుంది.
                APSFC హెడ్ ఆఫీసులో నా ఫ్యాక్టరీ పైలు, ఈ రాష్ట్రంలో తొలి పబ్ ఫైలు ఒకేసారి ప్రయాణం ప్రారంభించాయి. నా సంస్థ లాంటి చిన్న తరహా ఉత్పత్తి సంస్థలను ఉద్యోగులు తొక్కేస్తే, పబ్ లు ప్రతీ చోటా పరుగులు పెడుతున్నాయి. ప్రతీ సినిమాలోనూ కనీసం ఒకటి రెండన్నా సీన్లుండే పబ్ లు మరి! తాగి చిందులేసే పబ్ లని ప్రభుత్వమూ, సినీ పరిశ్రమ ప్రోత్సాహించటం, చిన్న కుటీర పరిశ్రమలను ప్రభుత్వమూ, కార్పోరేట్ కంపెనీలు నలిపివేయటమూ కుట్రలో భాగం కదా!
               ఇంతకీ చెప్ప వచ్చేందేమిటంటే - ఏ ఫైలునైనా తాము ఉరికించదలుచుకుంటే ఆఘమేఘాల మీద వ్యవహారం నడుస్తుంది. ముఖేష్ అంబానీకి మేలు చేయాలంటే మూడురోజుల్లో జీవోలూ, చట్ట సవరణలూ కూడా సాధ్యమే! అదే తాము ఏ ఫైలునైనా తొక్కి పట్ట దలుచుకుంటే, నాలుగేళ్ళలో 16 రిమైండర్లూ వచ్చినా ఉలుకూ పలుకూ ఉండదు. వ్రాతపూర్వకంగా రిమైండరు పంపుతూ నోటి పూర్వకంగా స్పందించ వద్దని చెప్పబడుతుందన్న మాట.
                కాబట్టే నోటి పూర్వకంగా చెప్పబడిన వ్యక్తిని ఎప్పటికీ నిరూపించ లేము. తాము నోటి పూర్వకంగా చెబితే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి శ్రద్దా సక్తులతో చేయాలంటే, తాము నిలిపిన బొమ్మైయితే సరి! ఆ వ్యక్తులు రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్ లు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు!
                ఎప్పుడో ఇక తప్పదన్నప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అసాధారణ జాప్యాన్ని తప్పబడుతూతీవ్ర పదజాలంతో లేఖ వ్రాసినట్లు, ఓ స్టంట్ నడిచి, తర్వాత మెల్లిగా ఫైలు నడక మొదలౌతుంది. మళ్ళీ ఎక్కడ బ్రేక్ పడుతుందో ఎవరూ చెప్పలేనట్లుగా!
                ఇది రెడ్ టేపిజం! నిజం చెప్పాల్సి వస్తే.... గూఢచర్యమే, దిగువ స్థాయికి వస్తే, ఉద్యోగులు స్థాయికొస్తే రెడ్ టేపిజం గా పిలవబడతుంది. బ్యూరాక్రాట్ల స్థాయిలోనూ, అగ్ర రాజకీయ నాయకుల స్థాయిలోనూ, ప్రభుత్వాధినేతల స్థాయిలోనూ ఉంటే, అప్పుడూ రెడ్ టేపిజం అనే పిలవబడినా, గూఢచర్యం అన్నది నిశ్శబ్దంగా పలకబడుతుంది.
                వెరసి రెడ్ టేపిజం పేరుతో గూఢచర్యం చాలా మామూలుగా అట్టడుగు స్థాయి ప్రజల వరకూ పాకి గవర్నమెంటులో పనులంటే, ఏళ్ళూపూళ్ళూ పడుతుందిఅనే నిర్లక్ష్యపు వ్యాఖ్యతో స్టాంపు కొట్టబడి చెలామణి అయిపోతోంది. ఈ రెడ్ టేపిజం వలన భారత ప్రభుత్వపు సొమ్ము దోచుకోబడటమే గాక, భారత రాజ్యాంగం పట్ల నమ్మకమూ దోచుకోబడుతుంది.  ఇదే ఇక్కడ గూఢచర్యపు విన్యాసము. అందుకే గూఢచర్యానికి మరో పర్యాయపదమే  రెడ్ టేపిజం అన్నది.
                నిజానికి రెడ్ టేపిజం అంటే పనులలో అలక్ష్యమూ కాదు, అవినీతీ కాదు. అవి పైపొరలు[over leaf reasons] మాత్రమే! లోపలి పొర గూఢచర్యమే! పైస్థాయి వాళ్ళకి, అంటే సోనియాలకీ, చిదంబరాలకీ, షీలా దీక్షిత్ లకీ, రోశయ్యలకీ, ఇంకా అలాంటి వాళ్ళకి రెడ్ టేపిజం అంటే గూఢచర్యానికి పర్యాయపదం అని తెలుసు.
                మన ఊళ్ళో మునిసిపాలిటి ఉద్యోగులకి తెలియదు. వాళ్ళకి సంబంధించి రెడ్ టేపిజంఅంటే కాసులు కురిపించే ప్రభుత్వ ప్రక్రియ అని మాత్రమే తెలుసు! తెలిసినా తెలియక పోయినా.... రెడ్ టేపిజం పేరిట వాళ్ళంతా చేస్తోంది మాత్రం దగా! నిలువునా దేశాన్ని, అవినీతి పేరుతో ముంచేసే దగా!

కొసమెరుపు ఏమిటంటే ఉరి కన్నా దాని కోసం ఎదురు చూడటమే పెద్దశిక్షఅని చిదంబరం అభిప్రాయ పడ్డాడు. కాని, కాందహార్ విమాన హైజాక్ సంఘటన లాంటిది ఒక్కటి జరిగినా ఈ ఖైదీలు చాలా మామూలుగా విడుదల చేయబడతారు. ఈ విషయాలు తెలియకుండానే చిదంబరం కేంద్ర హోంమంత్రి పదవిలోకి వచ్చాడా!?

మరిన్ని  విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.               
              సర్వేజనా సుఖినో భవంతు!

మహా భారతంలోని యవక్రీతుడి కథ నైనా, వాస్తవాన్నైనా పరిశీలిస్తే....శ్రమించకుండా ఏ విద్యనీ అభ్యసించలేమన్న సత్యం బోధ పడుతుంది. ఒక చిన్న బిడ్డ మంట పట్ల ఆకర్షణతో, నిప్పుతో ఆడుకోవాలని ప్రయత్నిస్తూ, దరి చేరాడనుకొండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? "వద్దు తండ్రీ! అది నిప్పు! తాకితే కాలుతుంది" అని నచ్చజెపుతారు. అయినా పిల్లవాడు వినలేదనుకొండి. అప్పుడు? రెండు పీకుతారు. నిప్పుతో చెలగాటమాడి ఒళ్ళు కాల్చుకోవటంతో పోలిస్తే, అమ్మానాన్నలు వేసే రెండు దెబ్బలు భద్రమైనవే!

పిల్లల్లో క్రమశిక్షణారాహిత్యం, నిప్పుతో ఒళ్ళుకాలడం కంటే మరింత ప్రమాదకరం. నిప్పు కేవలం పిల్లల చేతినో, కాలినో కాలుస్తుంది తప్ప జీవితాన్ని కాదు. కానీ క్రమశిక్షణా రాహిత్యం, మొత్తంగా పిల్లవాడి భవిష్యత్తునే కాల్చి పారేస్తుంది. నిప్పుతో కాలిన ప్రమాదం క్షణాల్లో మన కళ్ళెదుట కనబడుతుంది. క్రమ శిక్షణా రాహిత్యం తాలూకూ ప్రమాదం, మనకి అనుభవానికి రావటానికి సుదీర్ఘసమయం తీసుకుంటుంది. అప్పటికి జీవితం తగలబడి ఉంటుంది. కాపాడుకునేందుకు మిగిలి ఉండేది ఏమీ ఉండదు.

అలాంటి చోట.... ‘తల్లిదండ్రులూ, గురువులూ పిల్లల్ని దండించటం చట్ట విరుద్దం’ అంటూ చట్టాలు ఎందుకు? ప్రజలకు మేలు చేసే చట్టాలు కేవలం కాగితాల మీదే ఉంటాయి. ఆచరణలో అమలు కావు. అయితే మానవాళికి కీడు కలిగించే ఇలాంటి చట్టాలు మాత్రం, చాలా పకడ్బందీగా అమలు చేయబడతాయి. అదే విచిత్రం ఇక్కడ! తల్లిదండ్రులు తమ స్వంత బిడ్డల మీదా, గురువులు తమ చిన్నారి శిష్యుల మీదా ప్రేమ, వాత్సల్యం లేకుండా ఉంటారా?

అక్రమ సంబంధాల కోసం స్వంత పిల్లల్ని హత్యలు చేసే తల్లిదండ్రులనీ, ఇతరుల మీద కోపతాపాలని పసి పిల్లల మీద చూపించే రాక్షస గురువులనీ ఇక్కడ నేను ఉద్దేశించటం లేదు. అలాంటి వాళ్ళని ఏ చట్టాలూ ఆపలేవు, సంస్కరించ లేవు. అసలలా పసిబిడ్డల మీద పైశాచికత్వం చూపించే పెద్దలెవరైనా, వాళ్ళ బాల్యంలోనూ, ఎదిగిన తర్వాత కూడా క్రమశిక్షణా రహితులే అయి ఉంటారు.

నిజానికి పిల్లలపై హింసని నివారించేందుకు నిజాయితీగా పని చేసే చట్టాలు గానీ, ఉద్యోగులు గానీ, వ్యవస్థ గానీ ఉంటే, అలాంటి వాటి గురించి నేను ఈ మాటలు వ్రాయటం లేదు. అలాగ్గాక, తల్లిదండ్రులు తమ పిల్లల్ని, గురువులు తమ శిష్యులని, అవసరమైనప్పుడు దండిస్తే, సదరు పిల్లలు పోలీసు ఠాణాలకి ఎక్కి కేసులు పెట్ట వచ్చు - అనే చట్టం ఇప్పటికే విదేశాలలో దుష్పలితాలనివ్వడం గురించి తెలిసిందే! అలాంటి నేపధ్యంలో అవే చట్టాలను ఇక్కడ అందుబాటులోకి తేవడం ఎందుకు జరిగినట్లు? దానికి విద్యార్ది సంఘలూ, సదరు సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షాది విద్యార్ది నాయకులూ ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు?

నిజానికి ఈ విద్యార్ధి సంఘలూ, వాటి నాయకులూ, వారిని నడిపే రాజకీయ నాయకులూ కూడా, విద్యా సంవత్సర ప్రారంభంలో చేసే ‘సీజనల్ వ్యాపారం’ ఇది. అధిక ఫీజులూ, పుస్తకాల ధరలూ, మోతలూ, ఇలాంటి చట్టాలూ, విద్యా సంస్థల నాణ్యతలూ గట్రాల గురించి, తగినంత ఆందోళనలు జరిపి సంవత్సర చందాలు, సీజనల్ దందాలు పుచ్చుకొని ఆనక అన్నీ మామూలు చేస్తారు. వీళ్ళకి ప్రైవేటు విద్యాసంస్థలు ఇచ్చే డబ్బూ, మందుపార్టీలు గట్రా ఖుషీల ముందు, విద్యార్ధుల శ్రేయస్సు అస్సలు పట్టదు. ‘విద్య ప్రైవేటీకరించబడకూడదు’ అన్న విషయం ఈ విధంగా కూడా నిరూపితమౌతోంది.

ఇవన్నీ చూసినా కూడా విద్యారంగం మీదే కాదు, ఆ రూపేణా మొత్తం మానవత్వం మీదా, మానవ జాతి మీదా కుట్ర జరుగుతోందనవచ్చు. మానవజాతిని వారి బాల్యం నుండీ బానిసలుగా, మర బొమ్మలుగా మార్చే కుట్ర ఇది. మరబొమ్మలు ఆలోచించలేవు. రిమోట్ కంట్రోలుతో నియంత్రించబడినట్లు ఈ బానిసలు కూడా పడి ఉంటారు.

‘ఎందుకిలా?’ అని ఆలోచిస్తే జవాబు ఆసక్తి కరమే కాదు, నమ్మశక్యం కానట్టిది. ఎందుకంటే - భావవాదం సమాజంలో వ్యాప్తి లోనూ, ఆదరణ లోనూ ఉంటే, జనాలందరూ డబ్బుతో పెద్దగా అవసరం లేని ప్రకృతినీ, అనుబంధాలనీ, అనుభూతులనీ ఆస్వాదిస్తూ బ్రతికేస్తారు. అప్పుడు జనాలంతగా ’లక్జరీ’లుగా ప్రచారింపబడే వస్తు వ్యామోహం వెంట, కుహనా మోజుల వెంట పరుగులు తీయరు. వస్తు వినిమయాన్ని కూడా సహేతుకంగా, పరిమితుల మేరా ఆనందిస్తారు. ‘లక్జరీ’ లని, అంటే సౌఖ్యాలని కూడా, కొంత నిలకడగా ఆనందిస్తారు. బ్రాండ్ మోజులూ, మోడల్ మోజులూ అంటూ అర్ధరూపాయని అయిదు రూపాయలకి కొనరు. అప్పుడు కార్పోరేట్ వ్యాపారం ఏం కాను?

ఇందుకోసం సుదీర్ఘకాలంగా [తీవ్ర స్థాయిలో దశాబ్దాలుగా] విద్యారంగం మీద, చాపక్రింద నీరు వంటి ఈ కుట్రని అమలు చేస్తున్నారు. ఎందుకంటే పొలం నుండి వచ్చే పంట వంటిది కాదు గదా, ఒక్క సంవత్సరంలో చేతికందేందుకు? దీని వెనుక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థే! పైపైన సిఐఏ ముసుగు వేసుకోనివ్వండి, ఐఎస్ ఐ ముసుగు వేసుకొనివ్వండి. గతంలో బ్రిటీషు ముసుగు వేసుకున్నా, ఇప్పుడు శ్రీ చైతన్యల వంటి కార్పోరేట్ ముసుగు వేసుకున్నా.... అన్నిటికి రూపకర్త మాత్రం నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యమే!

ఒక్కసారి, ఈ కుట్ర మూల స్వరూపాన్ని పరిశీలిస్తే.... మన రాష్ట్రంలో దీని అమలు తీరు పరిశీలిద్దాం. దశాబ్దాలుగా.... ఎంతో నైపుణ్యంతో, రాజకీయుల అండదండలతో అమలులోకి వచ్చిన, మెల్లిగా పుంజుకుని జడలు విరబోసుకున్న కుట్ర ఇది.

దాదాపు 35 నుండి 40 ఏళ్ళక్రితం, డిటెన్షన్ విద్యావిధానం అమలులో ఉండేది. విద్యార్ధులు ఏ తరగతికి ఆ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైతేనే పై తరగతిలోకి పంపబడేవారు. ఉన్నవన్నీ ప్రభుత్వ పాఠశాలలే! నిరుద్యోగులు నడుపుకునే వీధిబడులు కొన్ని ఉన్నా.... పరీక్షలు గట్రా నిర్వహించలేరు గనుక, అంతిమంగా అందరూ ప్రభుత్వ పాఠశాలలకే చేరేవారు. అక్షరాస్యతా శాతం పెంచడం అనే పైకారణం చూపిస్తూ, ఆ డిటెన్షన్ విద్యా విధానం ఎత్తి వేయబడింది. హాజరు ఉంటే చాలు, విద్యార్ధులు పైతరగతికి పంపబడతారు. దీన్ని ప్రవేశపెట్టిన ఘనుడు కాసు బ్రహ్మనంద రెడ్డి. [మరి ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో దాదాపుగా అందరూ అప్రకటిత డిటెన్షన్ విధానమే అమలు చేస్తున్నారు కదా!]

పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేని విద్యార్ధులు, అందులోనూ పేదవారు, అసలు బడికి హాజరు కావటమే మానేస్తున్నారట. కాబట్టి అక్షరాస్యతా శాతం పెరగటం లేదట. కాబట్టి హాజరు ఉంటే పైతరగతికి వెళ్తారంటే, అలాంటి పేద వెనుకబడిన [చదువుల్లోనూ, ఆధికంగానూ కూడా] విద్యార్ధులందరూ బడికి వెళ్తారట. దాంతో అక్షరాస్యతా శాతం పెరుగుతుందట. ఈ పైకారణంతో అదంతా చేయబడింది.

అక్షరాస్యతా శాతం పెరిగి ఉండవచ్చు. గానీ మానవీయ విలువలు, విద్యా ప్రమాణాలు పెరిగాయా? పరీక్ష తప్పినా, మరు సంవత్సరం అదే తరగతిలో కొనసాగవలసి వచ్చినా, విద్యార్ధులకి అధిక భారం ఏదీ లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువు ఉచితం గనుక! కానీ ఆ నెపంతో అన్ని తరగతులకీ పరీక్షలు రద్దు చేసి, పదవ తరగతికి మాత్రం పరీక్షలు పెట్టటంలో,[వచ్చే సంవత్సరం నుండి వాటినీ రద్దు చేస్తారట!] విద్యార్ధులలోనూ టీచర్లల్లోనూ నిర్లక్ష్యం పెరిగిపోవటమూ, అవినీతి అంతకంతకూ అవధులు మీరి పోవటమూ ఇప్పుడందరూ చూస్తున్నదే!

నిజానికి కాసు బ్రహ్మానంద రెడ్డి అనబడే ఆనాటి నకిలీ కణిక ఏజంట్ పాపమా అని .... ఆనాడు అంటే 35 - 40 ఏళ్ళ క్రితం పరీక్షా విధానం, డిటెన్షన్ పద్దతి రద్దు చేయబడి, తరగతులు దాటుకుంటూ వచ్చిన తరంలోని వారే, ఇప్పుడు అత్యధికంగా అన్నిరంగాలలో కీలక స్థానాలలో, తగిన స్థానాలలో ఉన్నారు. ప్రభుత్వంలోనూ, ప్రైవేట్ రంగంలోనూ, పాలిటిక్సులోనూ కూడా! [ఇతడు 1992 నాటికి మహారాష్ట్రకు గవర్నర్ గా ఉన్నాడు. తన గవర్నరు గిరిని పొడిగించమని 1992 తర్వాత పీవీజీకి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఫలించక పోయే సరికి ‘బుద్ది ఉన్నవాడెవడూ గవర్నర్ పదవి కోరుకోడంటూ’ రుసరుసలాడాడు.]

ఎవరైతే... కష్టపడి చదివి పరీక్ష వ్రాసి పాసయ్యి పైక్లాసులకి ప్రమోట్ అవటం కాకుండా, కేవలం బడికి హాజరయేతే చాలు ఉత్తీర్ణులవ్వటమే ననే సులభ మార్గాలని అలవాటు పడ్డారో... ఆ తరం, అదే సులభమార్గాలని అటుపైన పదో తరగతికీ, ఆపైన తరగతులకీ అమలు చేయటమే గాక, అన్నీ పూర్తయి ఉపాధి రంగాలలోకి వచ్చాక కూడా, అవే సులభ మార్గాలని అమలు చేస్తున్నది!

కాబట్టే అలాంటి వాళ్ళు అవకాశం దొరకటమే విషయం తప్ప, ‘ఎలా సంపాదించాం అన్నది అనవసరం, సంపాదించామా లేదా అన్నదే ముఖ్యం’ అనే సిద్దాంతాన్ని అన్నిటా అమలు చేస్తున్నారు. మరి వాళ్ళు నేర్చిన విద్య అదేగా మరి! దాన్నే డబ్బుకీ, కెరీర్ కీ కూడా అనువర్తించారు. కాబట్టే అవకతవకలు నిర్వహించగలగటమే సామర్ధ్యానికి పర్యాయ పదం అయిపోయింది. లంచాలు ఇవ్వటం, పుచ్చుకోవటం, ఇంకా అవసరమైతే మకార త్రయానికి ముందడుగు వేయటం - ఇవే అర్హతలైపోయాయి.

ఓ ఉదాహరణ చెబుతాను. సూర్యాపేటలో వ్యవస్థీకృత వేధింపు ఎదుర్కొంటున్న రోజుల్లో.... మా ఇంటి యజమానురాలు [ఈవిడ చికెన్ కొట్టునడుపుతుంది. గతంలో ఆదే ఊళ్ళో పనిమనిషిగా కెరీర్ ప్రారంభించింది. ‘ప్రక్క’దారి పద్దతుల్లో ఆస్థికూడ బెట్టిన చరిత్ర కలిగిన మనిషి.] మమ్మల్ని వేధిస్తున్నదనీ, మరింకెవ్వరూ ఇల్లు బాడుగకూ కూడా ఇవ్వనంతగా మేము వేధింపుకి ఎదుర్కొంటున్నామనీ, వ్రాత పూర్వక ఫిర్యాదులతో నల్గొండ ఎస్.పి. శివధర్ రెడ్డిని నాలుగైదు సార్లు కలిసాము.

సదరు ఐ.పి.ఎస్. అధికారి, తాను గతంలో ‘లా’ చదివి Advocate గా ప్రాక్టీసు కూడా చేసాననీ, ఆ అనుభవంతో చెబుతున్నాననీ అంటూ, మాకు ఓ సలహా చెప్పాడు. అదేమిటంటే ఈ వ్యవహారాన్ని ప్రైవేట్ పంచాయితీ [అంటే చట్టానికి ఆవల]లో పరిష్కరించుకొమ్మని. అదీ ఒక ఐపిఎస్ అధికారి క్యారెక్టర్!

[అప్పటికి అతడి సలహా మాకు మింగుడు పడకపోయినా, స్థానిక కాలేజీనే అదంతా చేస్తున్నారనుకొని, దాన్ని ప్రైవేటు పంచాయితీలో పరిష్కరించుకునే ప్రయత్నం చేసాం. ఫలించలేదు. ఆ వివరాలన్నీ ‘మా కథ’లో వ్రాసాను. 2005 తర్వాత అర్ధం అయ్యింది, అతడు ప్రైవేటు పంచాయతీ అని చెప్పింది "ఇలా ఫిర్యాదులు పెట్టటం కాదు. రామోజీరావు తో రాజీ పడండి" అని! అప్పటికి మా జీవితాల్లో రామోజీరావు గూఢచర్యపు ప్రమేయాన్ని గుర్తించనందున అది మాకు అర్ధం కాలేదు.]

ఇక, బాపూ ‘సత్య శోధన’లో, లండన్ లో, బారిస్టర్ చదువుల పరీక్షా విధానాలలో మందు పార్టీల ప్రస్తావన చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అసలలాంటి పార్టీల అవసరం ఏమిటో బాపూకి అర్దం కాలేదని వ్రాసారు. వాళ్ళు చెప్పిన కారణం సబబుగా లేదని కూడా వ్రాసారు. తాను మద్యం సేవించడు గనక, అందరూ తమ జట్టులోకి అత్యంత ప్రేమతో ఆహ్వానించేవారట. అది తన మీద ప్రేమ కాదనీ, తన వంతు ‘మద్యం’ మీద ప్రేమ అనీ బాపూ చమత్కరించాడు.

అప్పటి ఆ బ్రిటీషు వాడి అవినీతి చదువు, ఇప్పుడు ప్రపంచపు నలుమూలలా పాకి, ఊడల మర్రిలా, ఒక విష వృక్షంలా విస్తరించింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఎవరూ చూడకపోతే ఏం చేసినా ఫర్వాలేదా? ఈ విషయమై ముందుగా ఒక పాత కథని చదవండి.

అనగా అనగా....

ఒకానొక అడవిలో ఒక మునీశ్వరుడుండేవాడు. వేదవిద్యని అభ్యసించడానికి, ఆయన దగ్గర కొందరు శిష్యులుండేవారు. ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ, శిష్యులు గురువు దగ్గర విద్యనభ్యసిస్తుండేవాళ్ళు.

అలాంటి శిష్యులలో ఓ పదిమందిని పిలిచి, గురువు "నాయనలారా! మీ విద్యాభ్యాసం పూర్తికావచ్చింది. మీకు చివరి పాఠం చెప్పి పంపిస్తాను. ముందుగా ఈ అరటి పండు తినండి" అంటూ తలా ఒక పండు ఇచ్చాడు.

అంతలోనే మళ్ళీ "నాయనలారా! ఈ అరటి పండుని మీరు, ఎవరూ లేని చోటికి వెళ్ళి, ఎవరూ చూడకుండా తినేసి రండి" అన్నాడు. శిష్యులంతా తమకిచ్చిన పండు తీసుకొని, ఆశ్రమం చుట్టూ ఉన్న అడవిలోకి తలో దిక్కుకూ వెళ్ళారు. ఎవరికి తోచిన చోట వాళ్ళు, పొదలమాటుకూ, చెట్టుమానుల చాటుకూ పోయి అరటి పండు తిన్నారు.

తిరిగి గురువు దగ్గరికి వచ్చారు. "ఏమర్రా! అరటి పండు తిన్నారా?" అన్నాడు గురువు.

"తిన్నాం గురువు గారూ" అన్నారు శిష్యులు.

"ఎవరూ లేని చోట, ఎవరూ చూడకుండా తిన్నారు కదా?" అడిగాడు గురువు.

"అలాగే తిన్నాం గురువు గారూ!" అన్నారు శిష్యులు.

అయితే ఒక్క శిష్యుడు మాత్రం తలవొంచుకుని, అరటి పండు తెచ్చి గురువు గారి ముందు పెట్టాడు.

"ఏం నాయనా? పండు తినలేదా?" అని అడిగాడు గురువు. శిష్యుడు లేదన్నట్లు తల అడ్డంగా అడించాడు.

"ఎందుకని?" చిరునవ్వు నవ్వుతూ అడిగాడు గురువు.

"స్వామీ! నన్ను మన్నించండి! ఎక్కడికి వెళ్ళినా ఆ చోటులో ఎవరూ లేక పోవచ్చు గానీ, దేవుడున్నాడనిపించింది. ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనిపించింది. అందుకే అరటి పండు తిరిగి తెచ్చేసాను" నెమ్మదిగా చెప్పాడు శిష్యుడు.

గురువు సంతోషంతో ఆ శిష్యుడి వెన్నునిమిరాడు. మార్ధవంగా నవ్వుతూ "అవును నాయనా!? దేవుడు లేని చోటు లేదు. దేవుడు చూడని కార్యం లేదు. ‘ఎవరు చూసినా చూడకపోయినా, దేవుడు చూస్తాడు’ అన్న స్పృహ కలిగి ఉండాలి. ఇదే మీకు నేను చెప్పదలుచుకున్న పాఠం. ఈ ఎఱుక ఎప్పుడూ కలిగి ఉండండి" అని శిష్యుల్ని దీవించి పంపించాడు.

ఇదీ... పాత కథ!

ఇక కొత్త కథ చదవండి.

అనగా అనగా....

ధరణి కోట ఓ మోస్తరు గ్రామం. ఒకనాడా ఊరికి ఒక వంటరివాడు బ్రతుకు దెరువుకై వచ్చాడు. వాడి పేరు ఇంద్రయ్య. వాడికి ఊరి చివర ఒక పాడు బడిన పెంకుటిల్లు కనబడింది. విచారిస్తే అది పెదకాపుదని తెలిసింది. నేరుగా పెదకాపు దగ్గరికి వెళ్ళి "అయ్యా! నా పేరు ఇంద్రయ్య! పని పాటు చేసి పొట్ట పోసుకుందామని ఈ ఊరు వచ్చాను. ఊరి చివర నున్న మీ పెంకుటిల్లు నాకు బాడుగకు ఇస్తే అందులో ఉంటాను" అన్నాడు.

పెద్దకాపు వాణ్ణి ఎగాదిగా చూసి "ఆ పెంకుటింట్లో దెయ్యాలున్నాయని అందులో ఎవరూ దిగటం లేదు. నువ్వు కొత్తవాడివి కాబట్టి వచ్చావు. నీకేం భయం లేకపోతే అందులో ఉండవచ్చు. నాకు బాడుగ కూడా ఇవ్వక్కర్లేదు" అన్నాడు.

"పెళ్ళాం బిడ్డలు లేని ఒంటరి గాణ్ణి. నాకేం భయం?" అంటూ ఇంద్రయ్య, పెద్దకాపుకి కృతజ్ఞతలు తెలిపి పెంకుటింటికి చేరాడు.

నాలుగు గదుల ఇల్లు. చుట్టూ ఖాళీ స్థలం. విశాలమైన పెరట్లో పేద్ద చింత చెట్టుంది.

"విశాలమైన గదులు. ఇల్లు లక్షణంగా ఉంది. ముందు ఒక గది శుభ్రం చేసుకుని ఉంటాను. మెల్లిగా ఇల్లంతా శుభ్రం చేయవచ్చు" అనుకుని, ఇంద్రయ్య చీపురుతో ఓ గది బూజులు దులిపి శుభ్రం చేసుకున్నాడు. పొయ్యీ గియ్యీ ఏర్పాటు చేసుకుని వండుకు తిన్నాడు. నులక మంచం తెచ్చుకుని పెరట్లో వేసుకు పడుకున్నాడు. ’నిజంగా ఈ ఇంట్లో దెయ్యాలుండి ఉంటాయా?’ అని ఆలోచిస్తూ, అలాగే నిద్రలోకి జారిపోయాడు.

హఠాత్తుగా అర్ధరాత్రి మెలకువ వచ్చింది ఇంద్రయ్యకి. ‘ఎందుకు మెలకువ వచ్చిందా?’ అని చుట్టూ చూస్తే.... ఎదురుగా గుడ్లురుముతూ నిలబడి ఉందొక దెయ్యం. ఒక్క క్షణం భయం వేసినా, దెయ్యం తనని చూడగానే సతాయించకుండా, నెమ్మదిగా నిద్ర లేపినందుకు కొంత కుదుట పడ్డాడు, మరికొంత ధైర్యం తెచ్చుకున్నాడు.

"ఏమిటి విషయం? నన్నెందుకు నిద్రలేపావు?" అన్నాడు.

"ఇది నా ఇల్లు! ఈ చింత చెట్టు మీద ఏ చప్పుళ్ళు విన్పించకుండా, హాయిగా నిశ్శబ్ధాన్ని ఆనందిస్తూ ఇన్నాళ్ళూ గడిపాను. ఇప్పుడు నువ్వొచ్చావు. వెంటనే ఈ ఇల్లొదిలి ఫో" అంది దెయ్యం హుంకరిస్తూ!

ఇంద్రయ్య రాజీ కోరుతున్న గొంతుతో "చూడూ! నేనా ఒంటరిగాణ్ణి. పగలంతా ఏదో పనీపాటు చేసుకోవటానికి ఊళ్ళోకి పోతాను. సాయంత్రానికి వస్తే నీకు కొంచెం కాలక్షేపంగా ఉంటాను. ఊళ్ళో విశేషాలు నీకు చెప్తాను. నీ నిశ్శబ్ధానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు కదా?" అన్నాడు.

ఆ ప్రతిపాదన దెయ్యానికీ నచ్చింది. "సరే! ఇంతకీ నీ పేరేమిటి?" అంది దెయ్యం. "ఇంద్రయ్య" అన్నాడు.

కొన్ని రోజుల గడిచాయి. రోజూ సాయంత్రానికి దెయ్యం చెట్టుదిగి వచ్చేది. ఇంద్రయ్య వంట చేసుకుంటూ, స్నానపానాలు కానిచ్చి తింటూ, పడుకునే దాకా దెయ్యానికి కబుర్లు చెప్పేవాడు. ఊళ్ళో విశేషాలన్నీ వింటూ దెయ్యానికీ రోజులు సుఖంగా గడిచి పోతున్నట్లనిపించింది. రాను రాను దెయ్యానికి, ఇంద్రయ్య మీద ఇష్టం పెరిగి పోసాగింది.

ఓ రోజు దెయ్యం "ఇంద్రయ్యా! ఇంకా ఎన్నాళ్ళు ఈ కూలీనాలీ పనులు చేసుకుంటూ కష్టాలు పడతావు? నేను నీకొక మంత్రపు గుళిక ఇస్తాను. అది బుగ్గన పెట్టుకుంటే నువ్వు ఎవరికీ కనబడవు. అంతే కాదు, నువ్వు చేతుల్లోకి తీసుకున్న వస్తువులు కూడా ఎవరికీ కనబడవు. కాకపోతే అది నీ నోట్లో ఉన్నంత సేపూ నువ్వు ఏమీ తినలేవు, తాగ లేవు, నిద్రపోలేవు. చివరికి మలమూత్ర విసర్జన కూడా చేయలేవు. అది నోట్లో ఉండగా... ఎవరితోనైనా మాట్లాడితే, మనిషి కనబడకుండా మాట వినబడితే నీకే ప్రమాదం. కాబట్టి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా పని కానిచ్చుకో. అయితే ఇంటికొచ్చాక నాకు జరిగిన విశేషాలన్నీ చెప్పాలి. ఇది షరతు. ఇదిగో ఈ గుళిక బుగ్గన పెట్టుకుని నీ క్కావల్సిన వస్తువులు తెచ్చుకుని హాయిగా ఉండు" అంటూ ఓ గుళిక నిచ్చింది.

ఇంద్రయ్యకిది మొదట నమ్మశక్యం కాలేదు. గుళిక బుగ్గన పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. ఎవరూ తనని పలకరించలేదు. పని చెప్పలేదు. తను ఎదురుగా ఉన్నా పట్టించుకోలేదు. తను ఎవరికీ కనబడటం లేదన్నది ఇంద్రయ్యకి నిర్ధారణ అయిపోయింది.

‘గుళికని ఎలా ఉపయోగించుకోవాలా?’ అని ఆలోచించాడు. మొదట్లో సుబ్బిశెట్టి దుకాణం నుండి పప్పూ బియ్యం వంటి దినుసులన్నీ తెచ్చేసుకుని, ఇంటికి వచ్చి, గుళికని నోట్లో నుంచి తీసేసి వొండుకు తిన్నాడు. ‘కానీ ఏ పని చెయ్యకుండా, రోజూ తిని పడుకుంటే కొన్నాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి అనుమానాలు రావచ్చు. ఆరాలు తీయవచ్చు. ఎలాగా?’ అనుకున్నాడు. బాగా ఆలోచించాడు.

"నేను నగలు, ఇతర విలువైన వస్తువులు దొంగిలించినా దండగ. అమ్మి సొమ్ము చేసుకునేటప్పుడు పట్టుబడవచ్చు. దొంగిలించిన నగలు ఎలాగూ వేసుకు తిరగలేను. అందుచేత, డబ్బు దొంగిలించడమే సౌకర్యంగా ఉంటుంది. అదీగాక ప్రతీసారీ ఇదే ఊళ్ళో డబ్బు దోచేస్తే, ఎంత అదృశ్యంగా చేసినా, కొన్నాళ్ళకి ఊళ్ళో గగ్గోలు అవుతుంది. అందుచేత చుట్టు ప్రక్కల గ్రామాలకీ, పొరుగున ఉన్న పట్టణాలకీ, నగరాలకీ వెళ్ళడం మేలు. తడవకో చోటుకు వెళ్తే సరి!" అనుకున్నాడు.

మొదట అదృశ్యంగా వెళ్ళి, ఊళ్ళో ధనవంతులు డబ్బు దాచుకునే ఇనప్పెట్టెల దగ్గర వేచి ఉండి, వాళ్ళు డబ్బు తీసుకునేటప్పుడు తానూ దండుకునే వాడు. అలా.... సుబ్బిశెట్టి, పెద్దకాపు.... అందరిళ్ళల్లో.... అయిన కాడికి చేతివాటం చూపించాడు. కంటికి కనబడక పోవటం చేత, డబ్బు పోగొట్టుకున్న ఆసాములందరూ.... తామే పొరపాటు పడ్డామని కొందరనుకున్నారు. ఎలా దొంగతనం జరిగిందో అర్దంకాక కొందరు బుర్రబద్దలు కొట్టుకున్నారు.

ఇంద్రయ్య మాత్రం, ఊళ్ళో కనబడ్డ వాళ్ళందరికీ ‘తనకు జబ్బు చేసిందనీ, అందుచేత మునపట్లా రోజూ పనికి వెళ్ళలేక పోతున్నాననీ, పట్టణానికెళ్ళి వారానికి నాలుగు రోజులు వైద్యం చేయించుకుంటున్నానని’ చెప్పసాగాడు. అందరికీ ఇంద్రయ్య, వారంలో రెండు రోజులు పనికి వెళ్ళటం, నాలుగు రోజులు కనబడక పోవటం మామూలు విషయమై పోయింది.

ఇంద్రయ్య యధాప్రకారం.... చుట్టు ప్రక్కలున్న అన్ని ఊళ్ళలో ధనికుల ఇళ్ళల్లో, దుకాణాలలో డబ్బెత్తుకు రాసాగాడు. ఈ విధంగా మూటల కొద్దీ డబ్బు తస్కరించి పెంకుటింటికి తరలించాడు.

పెద్దమొత్తంలో డబ్బు కూడాక ‘తనకు దూరపు బంధువు ఒకాయన చావుబతుకులలో ఉన్నాడని అతని దగ్గరికి వెళ్తున్నానని’ ఊర్లోవాళ్ళందరికి చెప్పి కనపించకుండా పోయాడు. తరువాత కొన్ని రోజుల తరువాత వచ్చి ‘దూరపు బంధువు చనిపోతూ, వారసులు లేనందున తన ఆస్తినంతా తనకు దఖలు పరిచాడనీ, తాను అదంతా అమ్ముకొని తెచ్చుకున్నానని’ ఊళ్ళో వాళ్ళకి చెబుతూ, ధరణి కోటలో తానున్న పెంకుటింటిని, పెద్ద కాపు నుండి, అడిగిన ధర యిచ్చి కొనేసుకున్నాడు. ఇంకా పొలమూ, పళ్ళతోటలూ కొన్నాడు.

అదృష్టం కలిసొచ్చి, హఠాత్తుగా ధనవంతుడై పోయిన ఇంద్రయ్యని, ఊళ్ళో వాళ్ళంతా బాగా గౌరవించసాగారు. ఇంద్రయ్య మాత్రం గుళిక బుగ్గన పెట్టుకుని, ప్రక్కనున్న పట్టణాల్లో డబ్బు దొంగిలించడం కొనసాగిస్తూనే ఉన్నాడు. తడవకో ఊరు వెళ్ళటం, అదృశ్యంగా ధనం దొంగిలించుకు రావడం! మరోసారి మరో ఊరు. మధ్యమధ్యలో... పట్టణాల్లో పూటకూళ్ళ ఇళ్ళల్లో, పర్యాటక స్థలాల్లో విహారాలు చేస్తూ ఆనందించసాగాడు. "అహా! ఇంద్రభోగం అంటే ఇదేనేమో! పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. తాను చేస్తోంది ఎవరికీ కన్పించటం లేదు. ధనికుడిగా అందరూ గౌరవిస్తున్నారు. దెయ్యం ఎంత మంచిదో!" అనుకున్నాడు.

ప్రతీ సారీ తానేమేమీ చేసిందీ దెయ్యానికి చెప్పేవాడు. అది ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడు. చివరికి ‘ఎవరూ తనని చూడటం లేదు కదా’ అని ఇతరుల స్నానాల గదుల్లోకి, పడక గదుల్లోకి తొంగి చూడటం మొదలుపెట్టాడు. క్రమంగా విచ్చలవిడిగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. గుళిక బుగ్గనున్నంత వరకూ తానెవరికీ కనబడడు. ఇంతకంటే భద్రత ఏముంది?

నలుగురు కలిసి మాట్లాడుకునే చోట, అదృశ్యంగా చేరి, ఒకరి వీపు మీద మరొకరు బాదినట్లు భ్రమలు కల్పించి తగవులు పెట్టటం, ఇరుగుపొరుగు వారికి గొడవలు రేపటం గట్రా మనోవికారాలతో చెలరేగి పోయాడు. బురదకు కంపు తోడైనట్లు.... దెయ్యానికి ఇంద్రయ్య, ఇంద్రయ్యకు దెయ్యమూ తోడయ్యారు.

ఇలా ఉండగా....

ఓ రోజు ఇంద్రయ్య, ధరణి కోటకు నాలుగు క్రోసుల దూరాన ఉన్న పట్టణానికి పోయాడు. గుళిక బుగ్గనుండటంతో ఎవరికీ కనబడడయ్యె. పట్టు వస్త్రాల దుకాణానికి వెళ్ళి, యజమాని గల్లా పెట్టె తెరిచినపుడు అందులో తానూ చెయ్యి పెట్టాడు. గుప్పెటి నిండా బంగారు నాణాలు తీసుకున్నాడు.

హుషారుగా బయటకు వచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత యధాలాపనలో గుళికను మ్రింగేసాడు. రాత్రి అయ్యాక తక్కుతూ తారుతూ ఇల్లు చేరాడు. అప్పటికే దెయ్యం ఇంద్రయ్య కోసం ఎదురు చూస్తోంది. ఇంద్రయ్య వాలకం చూసి "ఏమయ్యింది?" అంది ఆదుర్దాగా!

ఆయాసంతో, ఆందోళనతో ఇంద్రయ్య "పొరబాటున గుళికని మింగేసాను. దాంతో అందరికీ కనబడి పోతున్నాను" అన్నాడు.

దెయ్యం "కొంప మునిగింది" అని కీచుగా అరిచింది.

అసలే భయంతో వణుకుతున్న ఇంద్రయ్య, మరింతగా కొయ్యబారి పోతూ "ఏమిటి? ఏమయ్యింది?" అన్నాడు.

"గుళిక బుగ్గన ఉన్నంత సేపే నువ్వు అదృశ్యంగా ఉంటావు. అది కడుపులోకి పోతే నువ్వు అందరికీ కనబడిపోతావు" అంది దెయ్యం.

ఇంద్రయ్య ఏడుపు గొంతుతో "గుళిక మింగినప్పటి నుండీ కడుపులో చిత్రమైన బాధగా ఉంది. నిల్చోలేను. కూర్చోలేను. పిచ్చెక్కినట్లుగా ఉంది" అన్నాడు.

దెయ్యం చల్లగా "అంతేనా! ఇక నుండి తినలేవు, తాగలేవు. నిద్రపోలేవు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేవు" అంది.

ప్రక్కనే మహా విస్పోటనం జరిగినట్లు ఉలిక్కిపడ్డాడు ఇంద్రయ్య. "గుళిక మింగితే ఇంత ప్రమాదం ఉంటుందని నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు?" అన్నాడు కోపంగా!

"నువ్వు అడగలేదు" అంది దెయ్యం నిర్లక్ష్యంగా!

"నీ దుంప తెగా! నువ్వు నిజంగా దెయ్యానివి" ఏడుపూ కోపమూ పెరిగిపోగా ఒక్కసారిగా దెయ్యాన్ని తిట్టేసాడు.

"ఎంత పొగర్రా నీకు? నన్నే తిడతావా?" అంది దెయ్యం గుడ్లురుముతూ!

దెబ్బకి ఇంద్రయ్యకి వాస్తవం ఇంకింది.

"దెయ్యం, దెయ్యం! నీకు దండం పెడతాను. గుళిక మింగినప్పటి నుండీ కడుపులో చిత్రమైన బాధ! భరించలేకుండా ఉన్నాను. ఈ అపాయం నుండి తప్పించవా!" అని వేడుకున్నాడు.

దెయ్యం కూడా విచారంగా తలపంకిస్తూ "ఇంద్రయ్యా! గుళిక నీ కడుపులో ఉన్నంత సేపూ ఈ నరక బాధ తప్పదు. దీనికొక్కటే పరిష్కారం ఉంది. గుళిక బుగ్గన ఉంచుకుని అదృశ్యమైనప్పుడు.... నువ్వు ఏయే పనులు చేసావో, ఎవరెవరికి కీడు చేసావో.... అదంతా, అందరికీ వినబడేటట్లు బహిరంగంగా చెప్పెయ్యాలి. అలా అన్నిటినీ బయటకు కక్కితేనే గుళిక నీ కడుపులో కరిగి జీర్లమైపోతుంది. అప్పడీ బాధంతా పోతుంది" అంది.

"ఏమిటీ? ఎవరూ చూడకుండా ఏమేం చేసానో, బహిరంగంగా అందరికీ చెప్పాలా? అంతకంటే చావటం మేలు" అన్నాడు ఇంద్రయ్య హఠం పోతూ!

"గుళిక నీ కడుపులో ఉన్నంత వరకూ, నీకు చావు కూడా రాదు" చావు కబురు చల్లగా చెప్పింది దెయ్యం!

కెవ్వుమన్నాడు ఇంద్రయ్య! ఎవరూ చూడలేరన్న ఒళ్ళుపొగరుతో తాను చాలానే చేసాడు. డబ్బు దోచుకోవటమే కాదు, తగాదాలు పెట్టటం దగ్గర నుండీ ఇంకా నీచమైన పనులు చేసాడు. ఇప్పుడవన్నీ అందరికీ చెబితే.... ఇప్పటి వరకూ ఊళ్ళో పెద్దమనిషిగా, ధనవంతుడిగా ఉన్న పరువూ మర్యాదా మంట గలిసి పోతాయి. అంతే కాదు, తన చేత భంగపడ్డ వారు, హింస పడ్డవారు, దోచుకోబడ్డ వారు, ఇప్పుడు ఊరుకుంటారా?

"ఏం చేయటం? ఏం దారి?" అంటూ దెయ్యం వైపు చూశాడు. ఏదీ దెయ్యం? ఎప్పుడో పోయింది. దెయ్యం భయం దెయ్యానిది! ఇంద్రయ్య ఇదంతా చెప్పాక, జనం తనని మాత్రం ఊరుకుంటారా? ఏ మంత్రాలో వేసి, సీసాలో బంధించి, భూస్థాపితం చేసి మరీ నాశనం చేస్తారు!" స్వీయ రక్షణలో పడ్డ దెయ్యం ఇంద్రయ్యని వాడి చావుకి వాడిని వదిలేసింది.

ఇంద్రయ్యకి ఏం చెయ్యాలో పాలు పోలేదు. ఎవరికీ కనబడనప్పుడు ఎంత తుళ్ళింతలు పడ్డాడో ఇప్పుడంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. కడుపులో నిలవనీయని బాధ!

‘ఎవరికీ కనబడనప్పుడు ఏం చేసినా ఫర్వాలేదు అనుకున్నాను. ఎవరు చూసినా చూడకపోయినా, దేవుడు చూస్తాడు అనుకోలేదు. దీన్నే పాపం పండటం అంటారేమో’ అన్న విషయం బాగానే ఇంకింది ఇంద్రయ్యకి!

చేసిన వన్నీ వెళ్ళగక్కితే జనమేం చేస్తారో నన్నది అందుబట్టని మరో బాధ అయ్యింది. కడుపులోనూ బాధే, బయటా బాధే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

విద్యగురు ముఖతః నేర్చుకోవాలి అంటుంది మహాభారతం. ఇందుకు నిదర్శనంగా భారతంలోని ఈ చిన్న కథ చదవండి! ఈ కథ అరణ్యపర్వంలోనిది. ఉషశ్రీ రచన నుండి యధాతధంగా గ్రహించి ప్రచురిస్తున్నాను.

పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణ స్నేహితుడు రైభ్యుడు. వారిరువూరూ, సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి, నదీస్నానం చేసి, నిర్మల చిత్తంతో పరబ్రహ్మధ్యానం చేసుకుంటూ, ఆడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవాడు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీతుడనే కుమారుడు కలిగాడు.

రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని యిద్దరు కుమారులు పుట్టారు. వారు పెరిగి పెద్దవారయ్యారు.

భరద్వాజుడు ఎప్పుడూ ధ్యానసమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు.

రైభ్యుడు తన కుమారులిద్దరినీ విద్యాంసులుగా తీర్చి దిద్దుకున్నాడు.

వారుభయులూ వివిధప్రాంతాలలో పర్యటించి తమ విద్యతో అందరి ప్రశంసలూ పొందుతున్నారు.

ఇది చూసిన యవక్రీతునికి విచారం కలిగి, వారి వలె తాను కూడా విద్యావంతుడై విశేష ఖ్యాతి సంపాదించాలనుకున్నాడు. అదే ఉహతో తపస్సు ప్రారంభించాడు. యవక్రీతుని తీవ్రనిష్ఠను గ్రహించి దేవేంద్రుడు వచ్చి "స్వామీ! విద్య అనేది గురుముఖతః అధ్యయనం చెయ్యక తప్పదు. అప్పుడు కాని వేద వేదాంగ విజ్ఞానంతో మనస్సు పరిపక్వం కాదు. ఈ ప్రయత్నం మాని ఉత్తమ గురువును ఆశ్రయించు" అన్నాడు.

ఆ మాట యవక్రీతునికి నచ్చలేదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఉచిత రీతిని వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి, గుప్పిలితో యిసక తీసి నదిలో పోస్తున్నాడు. యవక్రీతుడు నదీ స్నానానికి వచ్చి "ఏమిటీ పని? ఎందుకు ఇలా చేస్తున్నావు?" అని అడిగాడు.

వృద్దుడు నవ్వతూ "ఈ నదికి అడ్డంగా గోడ కడుతున్నాను" అన్నాడు.

యవక్రీతుడు నవ్వి "ఇంతటి నదికి గుప్పెడు గుప్పెడు యిసకతో గోడకట్టటం యీ జీవితంలో సాధ్యమా?" అన్నాడు.

అప్పుడావృద్దుడు - "నాయనా! గురువు శుశ్రూష లేకుండా వేదవిద్య అంతా నేర్చుకోవాలనుకోవడం కంటె, నేను చేసేది అవివేకం కాదు" అని జవాబిచ్చాడు.

యవక్రీతుడు "ఓహో సురపతీ! మీరు ఎలా అయినా సరే, నాకు వేదవిద్య అనుగ్రహించి విశేష ఖ్యాతి కలిగించాలి" అని ప్రార్ధించాడు.

ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని, ఇంద్రుడు అనుగ్రహించాడు. యవక్రీతుడు సర్వవేద శాస్త్ర విద్యావిదుడయ్యాడు. మరుక్షణంలో తపోదీక్ష విడిచి, తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు.

అప్పుడు భరద్వాజుడు "నాయనా! ఈ విధంగా విద్య సాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది. అహంకారం ఆత్మవినాశన కారణం నాయనా! ఇంత చిన్న వయస్సులో తీవ్రతపస్సు చేసి వరాలు పొందడం మరింత అహంకార హేతువవుతుంది. అయినా ఒక మాట విను. నువ్వు ఎప్పుడూ రైభ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్ళబోకు. ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు" అన్నాడు.

యవక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు. [విద్యావేత్తగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు.] అలా ఉండగా ఒకనాడు - అది వసంత మాసం. అరణ్యమంతా పూలవాసనలతో, ప్రకృతి అంతా పరమ రమణీయంగా, ఉల్లాసకరంగా ఉంది.

అటువంటి సమయంలో యవక్రీతుడు రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనిపించింది. యవక్రీతుని మనస్సు చెదిరింది. ఇంద్రియాలు వశం తప్పిపోగా ఆ యిల్లాలిని బలాత్కరించి భోగించి వెళ్ళిపోయాడు.

ఆశ్రమానికి వచ్చిన మహాముని, ఆది విని తీవ్రక్రోధంతో, తన శిరస్సు నుండి రెండు జటలు తీసి హోమం చేసి, ఒక సుందరాంగినీ, ఒక రాక్షసునీ సృష్టించాడు. వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యవక్రీతుని సమీపించారు.

ఆ సుందరీమణి తన కోర చూపుతో, చిరునవ్వుతో, లావణ్య దేహ ప్రదర్శనతో యవక్రీతుని లొంగదీసి, వాని చేతిలోని పవిత్ర జలపూర్ణమైన కమండలువు తీసుకు వెళ్ళిపోయింది.

అంతతో వాని శక్తి నశించగా, ఆ రాక్షసుడు తన శూలంతో యవక్రీతుని తరిమి పొడవబోయాడు. సరిగ్గా భరద్వాజుని ఆశ్రమద్వారం దగ్గరే, ఆ రాక్షసుడు యవక్రీతుడిని సంహరించాడు.

అది చూసి భరద్వాజుడు "నాయనా! అనాయాసంగా లభించిన విద్య ఇటువంటి అనర్ధాలే తెస్తుందని చెప్పినా విన్నావు కావు" అని గోలుగోలున విలపించి, ఆ తీవ్ర వేదనలో రైభ్యుని శపించి, తాను కూడా అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేశాడు.[భరద్వాజుడు క్రోధాన్ని, పుత్రశోకాన్ని దాటలేకపోయాడు.]

భరద్వాజ శాపగ్రస్తుడైన రైభ్యుడు, ఆయన కుమారుని చేతులలోనే మరణించాడు.

అప్పుడు అర్వావసువు సూర్యుని ఉపాసించి తన తండ్రినీ, భరద్వాజ, యవక్రీతులనూ బ్రతికించాడు.

పునరుజ్జీవితుడైన యవక్రీతుడు, తన ఎదురుగా ఉన్న దేవతలను ఉద్దేశించి "నేను కూడా ఈ రైభ్యుని వలెనే తపస్సు చేసి, వేద వేత్తనయ్యాను కదా! అయినా ఈయన నాకంటే గొప్పవాడెలా అయ్యాడు?" అనగా వారు,

"నాయనా! ఆయన గురు శుశ్రూష క్లేశాలతో వేదవిద్యను సాధించాడు. కనుక అంత శక్తిశాలి అయ్యాడు. అది లేకుండా నువ్వు సాధించావు. ఆ శక్తి నీకు రాదు. విద్య గురు ముఖతః నేర్చుకోవాలి నాయనా!" అని వారు వెళ్ళారు.

ఇది భారతంలోని కథ!

యవక్రీతుడు తపస్సుతో సాధించిన విద్య, ర్యాంక్ ఫిక్సింగులతోనో, కాపీలతోనో, లంచాలతో సీట్లు కొనో.... చదివి, సర్టిఫీకేటు సంపాదించడం వంటిదే! యవక్రీతుడి విద్యాశక్తి, అతడి మనస్సుకి గాక అతడి చేతిలోని కమండలువులో ఉంది. మనస్సు దుష్టపూరితంగా ఉంది గనుక, రైభ్యుని కోడలిని బలాత్కరించాడు. శక్తి కమండలువులో ఉంది గనుకా, అతడి మనస్సు కామపూరితం గనుకా.... రైభ్యుడు సృష్టించిన సౌందర్యవతి, తన హోయలతో యవక్రీతుణ్ణి ఆకర్షించి కమండాలన్ని హరించింది. సర్టిఫీకేటులో తప్పితే బుర్రలో సబ్జెక్టులేని వారిలా, కమండలాన్ని పోగొట్టుకుంటే యవక్రీతుడు శక్తి హీనుడయ్యాడు. పిదప రైభ్యుడు సృష్టించిన రాక్షసుడి చేతిలో మరణించాడు.

అందుచేతనే దేవతలు యవక్రీతుడికి విద్య గురుశుశ్రూషతో, కష్టపడి నేర్చుకోవాలని చెబుతారు. గురు శుశ్రూషాది క్లేశాలు అనడంలో విశేషార్ధముంది. విద్య ఇన్ స్టంట్ ఆహార పదార్ధం కాదు. ‘పాకెట్ చింపడం - తినేయడం’ వంటిది అసలే కాదు. మేధస్సుతో మధించవలసింది.

మహాభారతాన్ని వ్రాసేటప్పుడు వేదవ్యాసుణ్ణి, విష్నేశ్వరుడు "నా ఘంటం ఆగకుండా మీరు శ్లోకాలు చెప్పేటట్లయితేనే నేను వ్రాస్తాను"అన్నాడట. దానికి వేదవ్యాసుడు "అలాగే! కాకపోతే నేను చెప్పిన శ్లోకపు అర్ధ తాత్పర్యాలు అర్ధమయ్యాకనే నువ్వు వ్రాయవలసి ఉంటుంది" అన్నాడట. ఎందుకంటే విద్య, జ్ఞానం మేధస్సుతో ముడిపడినవి.

ఇక్కడ మరో ఉదాహరణ చెబుతాను.

పిల్లలు నడక నేర్చే వయస్సులో.... తప్పటడుగులు వేస్తారు. ఆ క్రమంలో క్రిందపడి మోకాళ్ళకు దెబ్బలు తాకించు కుంటారు. పై పళ్ళు గుచ్చుకుని క్రింది పెదవి చిట్లించుకుంటారు. మనం కుయ్యొ మొర్రో మంటాం. కానీ.... ఆ దశలో భూమ్యాకర్షణ గురించి పిల్లల మెదడు facts ని record చేసుకుంటుంది.

అచ్చంగా మనం, నీళ్ళున్నాయనుకొని చెంబు పైకెత్తుతాం చూడండి! తీరా అది ఖాళీదైనప్పుడు తెలుస్తుంది, మనం ఎక్కువ బలాన్ని ప్రయోగించామని! ఇది మనం ఆలోచించి చేయం. అలవోకగా చేస్తాం. మన మెదడులో.... చెంబు ఖాళీదైతే ఎంత బలాన్ని చేతలలో ప్రయోగించాలి, నిండుదైతే ఎంత బలాన్ని ప్రయోగించాలి.... అన్న సమాచారం ఎప్పుడో నిక్షిప్తమై ఉంటుంది.

అలాంటిదే తప్పటడుగులు వేసేటప్పుడు, పిల్లల మెదడులో జరిగే ప్రక్రియలు కూడా! మనం walker లు ఉపయోగించి, సహజమైన ఆ ప్రక్రియని భంగపరుస్తున్నాం. తల్లిపాలు తాగని పిల్లలకి అది జీవిత పర్యంతం చేటు తెస్తుందంటారు పెద్దలు. ఇప్పుడు శాస్త్రవేత్తలూ అది నిజమేనంటున్నారు. పప్పు బద్దలు విరిచేస్తే చిన్న చిక్కుడు మొక్క, లేత దశలోనే బలహీనపడుతుంది.

అలాగే ఈ ప్రకృతి సహజ ప్రక్రియలు కూడా! వాకర్ లాగా గురుత్వాకర్షణ గురించిన ప్రాధమిక అవగాహనని నివారించే వస్తుసాధనాలు పెద్దవాళ్ళ భౌతిక శ్రమని [పిల్లల్ని అటెండ్ చేసే శ్రమ] తగ్గించవచ్చుగాక, కానీ పిల్లలకి మాత్రం, ఆ వయస్సులో మెదడులో నిక్షిప్తం కావాల్సిన భూమ్యాకర్షణ తాలూకూ అవగాహనని శాశ్వతంగా దూరం చేస్తున్నాయి.

‘కష్టపడక పోవటం, కష్టపడ కూడదను కోవటం’ చేసే అపకారం ఇది! తప్పటడుగులతో నేర్చే నడక వంటిదే గురుముఖతః విద్య!

అటువంటి నేపధ్యంలో.... కష్టపడకుండా, పరిశ్రమించకుండా, విద్య నేర్వాలను కోవటం ఏపాటి సబబు? ఏపాటి సాధ్యం?

గురుముఖతః విద్య నేర్చుకోవటం అనే ప్రక్రియలో....

గురువు తాను ఎలా విద్య నేర్చుకున్నాడో, అదే పద్దతిలో శిష్యులకు విద్యగరుపుతాడు. తనకు వాక్యాలు, వ్యాసాలు, వ్యాకరణాలు వచ్చు కదా అని, పిల్లలకి ముందుగా అవన్నీ నేర్పడు. మొదట అక్షరమాల తోనే ప్రారంభిస్తాడు. తర్వాత గుణింతాలు, వత్తులు, పదాలు.... తానెలా నేర్చుకున్నాడో అలా! నేర్చుకునేటప్పుడు తాను పడిన ఒత్తిడులు, మనో భావనలతో సహా! కాబట్టే, విద్యార్ధులు ఎలా నేర్చుకుంటున్నారో గురువు తెలుసుకోగలడు.

ఇది మా స్వానుభవం కూడా! గూఢచర్యం గురించి తెలుసు కదా అని పీవీజీ, మాకు అక్షరమాల నేర్పకుండా వ్యాకరణం దగ్గరికి తీసుకెళ్ళలేదు. అలాగే మేమూ, తెలుసు కదా అని ప్రాధమిక అంశాలు వివరించకుండా, విశ్లేషంచకుండా.... క్లిష్టాంశాల దగ్గరికీ, కీలకాంశాల దగ్గరికీ వెళ్ళలేదు. అదీగాక మా అవగాహన సైతం నిరంతరం పెంచుకోవలసిన ప్రక్రియే! అది ఎవరికైనా, తప్పనిది కదా!

ఇది ఏ సబ్జెక్టుకైనా, ఏ విద్యకైనా వర్తిస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

పిల్లల్లో శ్రమించే తత్త్వం నేర్పడం గురించి చిన్నకథ!...

అనగా అనగా....

ఒక రాజు గారుండే వాడు. అతడికి ఒక్కడే కుమారుడు. అతి గారాబం వల్ల ఆ పిల్లవాడు వట్టి సోమరిపోతు అయ్యాడని రాజుకి అర్ధమయ్యింది. అందువల్లే దాదాపు పదిహేనేళ్ళు వచ్చినా, పిల్లవాడు ఒక్క మంచిలక్షణమూ, ఒక్క విద్యా నేర్వలేదు. రాజుకి చాలా విచారం కలిగింది. ఇప్పటికైనా యువరాజులో బద్దకాన్ని తొలగించాలనుకున్నాడు. ఏం చేయటమా అని ఆలోచించాడు.

మర్నాటి ఉదయమే యువరాజుని పిలిచి ‘సూర్యాస్తమయం లోపల స్వయం కృషితో రెండు వెండి నాణాలు సంపాదించుకు రావాలనీ, అప్పుడే రాజోచిత ఆహారాన్ని పొందగలడనీ, లేకపోతే సాధారణ భోజనం చేయాల్సి ఉంటుందనీ’ చెప్పాడు. రాత్రి భోజనం వేళ యువరాజుని "డబ్బెక్కడ?" అనడిగాడు.

పిల్లవాడు రెండు వెండి నాణాలు తీసి తండ్రి చేతిలో పెట్టాడు. రాజు వాటిని అటు ఇటూ తిరగేసి చూసి నిప్పల్లోకి విసిరాడు. యువరాజు మాట్లాడలేదు. రాజు సేవకులతో పిల్లవాడికి మామూలు భోజనం పెట్టమన్నాడు. తండ్రి అన్నంత పనీ చేయడులే అని భరోసా పడిన యువరాజు చిన్నబుచ్చుకున్నాడు. చేసేది లేక భోజనం చేసి పోయాడు. రాజు తన వేగుల ద్వారా పిల్లవాడు ఆ నాణాలు తల్లినడిగి తీసుకున్నది విని ఉన్నాడు.

రాజు మర్నాడూ అదే విధంగా ఆదేశించాడు. ఈ సారి యువరాజు మంత్రినడిగి డబ్బు తెచ్చాడు. రాజు మళ్ళీ వాటిని నిప్పల్లో వేసాడు. పిల్లవాడు మాట్లాడలేదు. అయిష్టంగా మామూలు భోజనం చేసి వెళ్ళాడు.

రాజు అదే కొనసాగించాడు. రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలయ్యాయి. చివరికి యువరాజు రాజద్యోగులని కూడా అడిగి వెండి నాణాలు తెచ్చాడు. రాజు ఎక్కడా ఎవరినీ యువరాజుకి డబ్బివ్వ వద్దని లేదు. అలాగని ఇచ్చిన మంత్రీ రాజద్యోగులని మెచ్చలేదు. రాణీతో సహా ఎవ్వరు యువరాజుకు వెండి నాణేలిచ్చినా రాజు వారితో ముభావంగా ఉన్నాడు. అయిష్టత ప్రకటించాడు. దాంతో క్రమంగా యువరాజుకి వెండి నాణాలిచ్చేవాళ్ళు తగ్గారు. యువరాజు కనబడగానే మోహం చాటేయటం, తప్పుకుపోవటం చేయసాగారు.

రాను రాను యువరాజుకిది బాధాకరంగా తోచింది. మామూలు భోజనం చేయటం కష్టంగా అన్పించినా సర్ధుకుపోయే వాడేమో గానీ, తాను అందరికీ చులకన అవుతున్నాడన్న భావం యువరాజుకి క్రమంగా అర్ధం కాసాగింది. చివరికో రోజు విసుగెత్తి రాజభవనం దాటి వీధుల్లో కెళ్ళాడు.

ఒక కమ్మరి దుకాణం దగ్గరికెళ్ళి పని ఇమ్మని అడిగాడు. కమ్మరి వాడు సమ్మెట కొట్టే పని ఇచ్చాడు. యువరాజుకి అది కష్టంగా తోచింది. అయినా అందరూ తనని నీచంగా చూస్తున్నారన్న కసి కొద్దీ, చెమట చిందించి పని చేసాడు. మధ్యాహ్నం కమ్మరి వాడు పెట్టిన పచ్చడి మెతుకులు రోజూ మధ్యాహ్నం తాను తినే పరమాన్నం కన్నా పరమ రుచిగా అన్పించింది. సాయంత్రం దాకా పని చేస్తే కమ్మరి వాడు రెండు వెండి నాణేలిచ్చాడు.

యువరాజుకి అవి అందుకున్నప్పుడు సంతృప్తిగా, ఒకింత గర్వంగా తోచింది. ఉప్పొంగిన ఛాతీతో ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి భోజనాల వేళ తండ్రి అడిగితే రెండు నాణేలు ఇచ్చాడు. ఇస్తోన్న ఆ చేతుల్లో చిన్న అలజడి! రాజు ఇదంతా ఏం పట్టించుకోనట్లు ఆ నాణాల్ని రోజులాగానే నిప్పల్లోకి గిరాటు వేసాడు.

యువరాజు ఒక్క క్షణంలో అక్కడికి గెంతి, నిప్పల్లోంచి నాణాలని కట్టెతో బయటకి లాగాడు. చప్పన నీళ్ళల్లో వేసి చల్లార్చి చేతుల్లోకి తీసుకున్నాడు. అపురూపంగా వాటిని ఎత్తిపట్టుకుని, కోపం దిగమింగుతూ తండ్రి వైపు చూశాడు. స్పుటంగా "ఎంత తేలిగ్గా వాటిని నిప్పల్లోకి గిరాటు వేసారు? ఉదయం నుండి సాయంత్రం దాకా నడ్డి విరుచుకుంటే వచ్చాయవి!" అన్నాడు.

రాజు చిరునవ్వు నవ్వుతూ "నాయనా! అన్ని వస్తువులూ అంతే! ఎంతో కష్టపడితే తప్పరావు. కష్టపడగా వచ్చిన దాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆ తృప్తీ ఆనందమూ కలుగుతాయి. సోమరిగా తిని పడుకోవటం జీవితాన్ని వృధా చేసుకోవటమే. ఏ పనీ చేయనప్పుడు నిజమైన ఆనందాన్ని కూడా అనుభవించలేవు" అన్నాడు.

యువరాజుకి సత్యం బోధపడింది. ఆ రాత్రి వేళ రాజోచిత భోజనం కూడా బాగుందనిపించింది. కమ్మరి వాడిచ్చిన పచ్చడి మెతుకుల రుచి కూడా పదే పదే గుర్తుకు వచ్చింది. శ్రమలోని సంతోషాన్ని పిల్లవాడు గుర్తించాడు. కష్టపడి విద్యలు నేర్చాడు. పెరిగి పెద్దవాడై, చక్కగా రాజ్యం పాలించి, మంచి వాడన్న పేరు తెచ్చుకున్నాడు.

ఇదండీ కథ!

మా స్వానుభవం నుండి మరో చిన్న ఉదాహరణ చెబుతాను.

మా స్కూలులో పిల్లలకి, వర్క్ చక్కగా చేసిన వాళ్ళకి, ఒక చాక్లెట్ బహుమతిగా ఇచ్చేవాళ్ళం. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి రోజూ ఫైవ్ స్టార్ చాక్ లెట్లు వంటివి కొనిస్తారు. మేం ఇచ్చేది పావలా ఆశా చాక్లెట్. అయినా సరే, అది తను కష్టపడి చదివి సంపాదించుకున్న చాక్లెట్, తమకి స్కూలు ఇచ్చిన చాక్లెట్. అది వాళ్ళకి ఎంతో అపురూపం. కొందరు చాక్లెట్లని అలాగే దాచేస్తే, కొందరు వాటి ర్యాపర్స్ దాచుకునేవారు. నాకు ఇన్ని చాక్లెట్లు వచ్చాయంటే నాకు ఇన్ని అని పోటీలు పడి చదవటం, వ్రాయటం నేర్చేవారు.

నర్సరీ పిల్లలకైతే అక్షరం ఒకటి నేర్చుకుంటే ఒక్కచాక్లెట్ ఇచ్చేవాళ్ళం. కొంతమంది 26 అక్షరాలకు 26 చాక్లెట్స్ సంపాదించుకునేవాళ్ళు. కొంతమంది ఇంకా చాలా తక్కువవ్యవధిలో నేర్చుకునేవాళ్ళు. అలాగే అంకెలు నేర్చుకున్నా, అంకెకు ఒకటి చొప్పున చాక్లెట్ వచ్చేది. ఓ సారి ఓ నర్సరీ బుజ్జిగాడికి ఎలర్జీ ఉందనీ, చాక్లెట్లు ఇవ్వవద్దని వాళ్ళ అమ్మ చెప్పింది. సరేనని మేమూ వాడు కొత్త అక్షరం నేర్చుకున్నా incentive ఇవ్వలేదు. ఓ వారం రోజులు పోయేసరికి వాడు, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళడానికి వస్తే గోడకి అతుక్కుపోయి “రేపట్నుండి నేను స్కూలుకి రానే! నేను బాగా రాసినా సారు నాకు చాక్లెట్టు ఇవ్వటం లేదు” అని కంప్లయింట్ చేశాడు. వాడి భంగిమ, ఆ బుంగమూతి, చెప్పిన తీరుకి అందరం బాగా నవ్వాము. ‘తన శ్రమకి గుర్తింపు లేనప్పుడు ఎందుకు స్కూలుకి రావాలి?’ అన్న రోషం వాడిది. ఎంత ముచ్చట వేసిందో! వాడికి మూడేళ్ళు ఉంటాయంతే.

ఏ వస్తువైనా, ధనమైనా, ఒక పని ఫలితమైనా, విద్య అయినా, సమాజంలో ఒక హోదా అయినా, దాన్ని కష్టపడి పొందితేనే.... అది సదరు వ్యక్తులకి కూడా విలువైనదీ, గొప్పదీ అవుతుంది. అప్పుడు దాన్ని శ్రద్దగా కాపాడుకుంటూ, జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. అదే కష్టపడకుండా, అడ్డదారుల్లో, తేరగా పొందారనుకొండి.... అప్పడవి వారికి కూడా గొప్పవై ఉండవు. శ్రద్దాసక్తులతో ఉపయోగింపబడవు కూడా!

దేన్నైనా తేరగా పొందిన వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది, ఏ విలువలూ పాటించకుండా, ఎవరి పట్లనైనా నిర్లక్ష్యంగా! తాము పొందిన వస్తువులూ, ధనం, హోదాల వంటి వాటి పట్లే నిర్లక్ష్యం ఉండే వ్యక్తులకి, ప్రక్కవారి పట్ల మాత్రం, నిర్లక్ష్యం గాక మరో భావం ఎలా ఉంటుంది చెప్పండి? అంతిమంగా అవినీతి గమ్యం ఈ స్థితే!

చుట్టూ సమాజంలో పరిశీలించి చూడండి. కష్టపడి గాకుండా, అన్యాయంగానో, అక్రమ మార్గాల ద్వారానో డబ్బు సంపాదించిన వారి ఖర్చు హద్దులు మించి ఉంటుంది. [దాన్నే సినిమాలలోనూ గొప్పగా చూపిస్తుంటారు!] ఇదంతా చూసి, అంతగా డబ్బు సంపాదించలేని వారు, దాన్ని అనుకరించాలని ప్రయత్నిస్తారు. సాధ్యమైనా గాకపోయినా, ఈర్ష్య పడటం మానరు. పర్యవసానంగా అధికశాతం ప్రజలు విలువల్ని, అనుభూతుల్ని చెత్తకుండీల్లో పారేసి మరీ ఎండమావులు వెంటబడి ఉరుకులూ పరుగులూ పెడుతున్నారు.

ఈ ప్రక్రియ చిన్నవయస్సుల్లోనే.... విద్యార్ధుల పరీక్షా ఫలితాల్లో కాపీయింగ్, ఫలితాల గోల్ మాల్స్ గట్రాలతో పిల్లలకి అనుభవంలోకి వస్తున్నాయి. మొన్న మార్చిలో మా పాప పదవతరగతి పరీక్షలు వ్రాసింది. ఆ సందర్భంలో.... తారసిల్లిన ప్రభుత్వ ఉపాధ్యాయులలో చాలామంది "అరే! ముందుగా తెలిసి ఉంటే ఎగ్జామ్ సెంటర్ లో ఏదైనా చేసేవాళ్ళం కదా?" అన్నారు. "మార్కుల్ని బట్టి పిల్లల సామర్ధ్యాలని మేము లెక్కించము. ఆమె వ్రాసిన దానికి ఎన్ని మార్కులు వస్తే అన్నే వస్తాయి అనుకుంటాము" అన్నామో, ‘అక్కడికి మేమేదో నీతి కోవిదులం, తమని అవినీతి కుప్పలు’ అంటున్నామన్నట్లు మొహం పెడతారు. అందుకే ఏమీ అనకుండా నవ్వేసి ఊర్కోటం, తప్పకపోతే సున్నితంగా ఏదో చెప్పేయటం చేస్తున్నాము.

ఆ టీచర్లనీ తప్పుబట్టేందుకేం లేదు. వాళ్ళకి తారసిల్లిన తల్లిదండ్రులంతా "సార్! మా వాడికి ఫలానా సెంటర్ పడింది. కాస్త చూసీ చూడనట్లుంటే ఏదో మా వాడు 90% మార్కులు తెచ్చుకుంటాడు. ఏదో కాలేజీ వాళ్ళు ఫ్రీగానో, ఫీజు రాయితీనో ఇస్తారు" అనటమే వాళ్ళకీ తెల్సుమరి!

ఇదంతా చూస్తున్నా ఎవరు స్పందించరు. తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, విద్యాసంస్థలూ, ఉన్నతాధికారులూ, ప్రభుత్వాధినేతలూ.... ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. తిలా పాపం తలా పిడికిడు అయినప్పుడు పరిస్థితి ఇలాగ్గాక మరోలా ఉండదు కదా!

నిజానికి డబ్బు విషయంలో అక్రమార్జన కంటే, విద్యా విషయంలో అక్రమార్జాన [చదువులో సబ్జెక్ట్, ప్రవర్తనలో చదువు తాలూకూ ప్రభావమూ లేకుండా, కాగితాల మీద మార్కులూ, ర్యాంకులూ, గ్రేడులూ ఉండటం] మరింత ప్రమాదకరమైనది. విద్యార్ది దశలో ర్యాగింగ్ కీ, ఆనక ఇంటాబయటా హింసకీ పాల్పడటం, మద్య మాదక పదార్ధాలకి బానిసలు కావటం, ప్రేమోన్మాదమంటూ ఇతరుల మీద దాడి చేయటం గట్రా మనో వికారాలన్నీ.... ఇలాంటి ప్రక్కదారి [విద్యతో సహా] సంపాదన పర్యవసానాలే!

ఇందుకు నిదర్శనంగా భారతంలోని ఈ చిన్నకథ చదవండి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఈ మధ్య ‘యుగానికొక్కడు’[తమిళ] అనువాద చిత్రాన్ని చూశాను. తమిళ ప్రముఖ హీరో సూర్యా సోదరుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం. రీమా సేన్ తప్ప ఇతర నటీనటుల పేర్లు, సాంకేతిక నిపుణుల పేర్లు, కథా స్ర్కీన్ ప్లే రచయితలూ, దర్శకుడూ గట్రా వివరాలు.... తెర మీద తమిళ అక్షరాలలో ఉండటంతో తెలియలేదు.

ఇందులో చెప్పుకోవటానికి పెద్ద విశేషాలేం లేవు, ఒక్క అంశం తప్ప!

ఈ సినిమాని సాంకేతిక పరంగా చూస్తే....

ఎంతో ఖరీదుగా, వ్యయ ప్రయాసలతో నిర్మించిన సినిమా! హాలీవుడ్ సాంకేతికత, భారీదనంతో పోటీపడుతూ నిర్మించిన చిత్రం. ఒక దీవినీ, అరణ్యాలనీ, సముద్రాలనీ, ప్రమాదాలనీ ధ్వని పరంగానూ, దృశ్యపరంగానూ భారీగా, కొంత భయానకంగా చూపించారు. మొత్తానికీ ఆ దృశ్యాలు చూస్తుంటే ’మజా’ వచ్చింది.

ముఖ్యంగా... టైటానిక్, క్వీన్ విక్టోరియాల కంటే కూడా ఈ సినిమాలోని నౌక గొప్పగా కనబడింది. క్లోజప్ లో,సముద్రంలో ఒయ్యారంగా కదులుతున్న ప్రేం చాలా బాగుంది. నౌక లోపలి భాగం బాగా చూపించి ఉంటే ఇంకా బాగుండేది. అందులో పాట కూడా చాలా బాగుంది. పాత సినిమా, ఎంజీఆర్ నటించిన పాట... సౌదర్య రాజన్ గొంతులో భలే హుషారుగా ఉంది. పాతకొత్తల మిక్సింగ్ తో, చాలామంది నటీనటులతో చిత్రించిన, హుషారు పుట్టించిన తమిళ పాట అది! అందునా సౌందర్యరాజన్ కంఠంలో!

ఆయన గొంతులో సంస్కృత శ్లోకాలు, తమిళ భక్తి గీతాలు నాకు చాలా ఇష్టం! అప్పుడెప్పుడో తెలుగులో ఆయన పాడిన ‘నేలపై చుక్కలు చూడు’ పాటలోని ముద్దుముద్దు యాసతో సహా! ఈ సినిమాలో మరో తమిళ పాట కూడా ఉంది. కొన్ని చోట్ల తమిళ సంభాషణలు ఉన్నాయి. వాటికి కనీసం తెలుగు కాప్షన్స్ చూపించి ఉంటే ఇంకొంచెం బాగుండేది.

సముద్రంలో రెడ్ ఫిష్ [స్టింగ్ రే ఫిష్ ?] వంటి చేపల దాడి, సర్పాలు... గట్రా దృశ్యాల్లో భీభత్సరసాన్ని నింపారు.

కళాపరంగా చూస్తే.....

కథానాయకుడు కార్తీ నటన ఫర్వాలేదు. చోళ రాజుగా పార్తీపన్.... కళ్ళలో పలికించిన భావాలు, నటుడిగా అతడి సత్తా చూపించాయి. మిగిలినదంతా చెత్త! టిక్కెట్లు తెగటం కోసం మసాలా బాగా దట్టించిన చెత్త! ముఖ్యంగా రీమాసేన్ బరితెగించిన నటన జుగుప్స కలిగించింది. అసలు మచ్చుకైనా ఆడతనం లేని పాత్ర అది.

అసలు ఇప్పటి సినిమాలలో దాదాపు హీరోయిన్లందరూ ఆడతనం అడ్రస్ లేకుండానే ఉన్నారులెండి! వేషధారణలో గానీ, సంభాషణల్లో గానీ, దేహ భాష లో గానీ! అలాంటి హీరోయిన్లని చూసి హీరో, అతడి ప్రక్కన చెంచాలు ఎలా చొంగ కారుస్తారో వాళ్ళకే తెలియాలి. అలా చొంగ కార్చేటట్లయితే కథానాయకి [హీరోయిన్] అన్న పేరుకాకుండా ’వాంప్’ అన్న పేరు పెడితే ఇంకా బాగుంటుంది కదా!
దర్శకుడు దృశ్యాల్ని చూపించటం మీద తీసుకున్న శ్రద్ద, కథ చెప్పటం మీద తీసుకోలేదనిపించింది.

కథాపరంగా చూస్తే.....

శతాబ్దాల క్రితం... రెండు రాజవంశాలు.... చోళ, పాండ్యుల వైరం గురించిన కథ ఇది! పరాజితుడైన చోళరాజు తన యువరాజుకీ, రాజగురువు కీ మరికొందరిని తోడుగా ఇచ్చి, పాండ్య రాజుల కులదైవ విగ్రహాన్ని కూడా ఇచ్చి, సుదూర దీవికి పంపుతాడు. వారిని వెంటాడుతూ వెళ్ళిన పాండ్య దళపతి ఒకడు వ్రాసిన తాళ పత్రాల వివరాలు మాత్రమే ఆధారంగా ఒక శాస్త్రవేత్త, అతడి కుమార్తె చోళుల ఆచూకీ తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తారు.

తాము దాగిన దీవి చుట్టూ, తమని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు, ఏడు ప్రమాదాలని [Traps]ని చోళులు ఏర్పాటు చేస్తారు. సాంకేతికంగా వీటిని ఎలా ఏర్పాటు చేయగలిగారో, కథా రచయిత, దర్శకుడూ చెప్పలేదు. సముద్రం, మాంసాహార చేపలు, ఆటవికులు, సర్పాలు, దాహం, ఆకలి, కామం గట్రా! నీడలో పరిగెడితే ఎడారి ఇసుక, నీడదాటితే ఇసుక ఊబి ఉండటం మరో విచిత్రం. అలా ఎందుకుంటుందో దర్శకుడు స్పష్టత ఇవ్వడు.

అలాగే చివర్లో సైనికులు హెలికాప్టర్లలో దిగితారు. అలాంటప్పుడు ‘మొదట్లోనే హెలికాప్టర్లలో గాలిస్తే చోళుల శిధిల కోటల వివరాలు తెలిసేవి కదా?’ అన్నది ప్రేక్షకుడికి మిగిలే ప్రశ్న. అక్కడ శిధిల చిహ్నలు తప్ప చోళులు సజీవంగా ఉంటారని శాస్త్రవేత్త ఊహించదు. పురాతత్త్వ శాస్త్రపరిశోధన అన్నది నెపం మాత్రమే అన్నట్లుగా ఈ రీమాసేన్ పాత్ర ఉంటుంది.

తీరా చోళుల్ని చేరాక, అక్కడో చిన్నపాటి యుద్దం! దాన్ని గెలిచేసిన హీరో! అతడి వీపునా పులి బొమ్మ ఉంటుంది. అది చోళుల గుర్తు! రీమా సేన్ వీపు మీద కనబడి మాయమయ్యే పులిబొమ్మ ఉంటుంది.

రీమా సేన్ పాండ్యుల వంశస్తురాలు. ఆమె తల్లి చిన్నప్పటి నుండి, ఆమెకి చోళుల మీద పగా ప్రతీకారాలు నూరిపోసి, యుద్ద విద్యలూ, ఇతర నైపుణ్యాలు నేర్పి పెంచిందిట. ఆమె లాగే వివిధ పదవులలో, హోదాలలో, ప్రభుత్వ ఉన్నతోద్యోగాలలో పాండ్యులు, గుట్టు చప్పుడు గాకుండా పనిచేస్తుంటారు. వాళ్ళ లక్ష్యం ఒకటే! చోళుల ఆచూకీ కనుక్కొని, వాళ్ళని నాశనం చేయాలి. వాళ్ళెత్తు కెళ్ళిన తమ కులదైవ విగ్రహాన్ని తిరిగి సంపాదించుకోవాలి.

పైకి మామూలుగా చెలామణి అయ్యే పాండ్య వంశీయులు, అంతర్గతంగా ’టచ్’లోనే ఉంటారు. వివిధ ప్రాజెక్టులూ, కార్యక్రమాలు పేర్లు చెప్పి.... ప్రభుత్వ వనరుల్ని, విమానాలు, ఆయుధాలు గట్రా సాధన సంపత్తినీ వాడుకుంటారు. ఇంకా కొన్ని మాయమంత్రాలు కూడా వచ్చి ఉంటాయి.

అలాగే చోళులూ! నేలమాళిగలో ఉన్నట్లుగా బ్రతుకుతూ, దక్షిణ భారతదేశంలో మళ్ళీ చోళ సామ్రాజ్య స్థాపనకి అనుకూల పరిస్థితులు కోసం వేచి ఉంటారు, శతాబ్దాలుగా, తరాల తరబడి! బంగారం గట్రాతో పాటు, మాయమంత్రాది శక్తులూ ఉంటాయి. రీమా సేన్ నీడని ఎత్తితే, ఆమె కూడా గాల్లోకి లేచి గిలగిల కొట్టుకుంటుంది. రామాయణం సుందరకాండలో సురస అనే సముద్ర రాకాసి లాగా!

రీమా సేన్, చోళుల్ని తనే దూతనని నమ్మించి మోసగిస్తుంది. తరువాత రాజగురువు, హీరోని దూతగా గుర్తించి తన శక్తుల్ని హీరోకి[?] ధార పోస్తాడు. పాండ్య వారసులు తుపాకులు గట్రా ఆయుధాలు ఉపయోగించగా, చోళ వారసులు బాణం, డాలు లు ఉపయోగించి యుద్దం చేస్తారు. తాగు నీటిలో రీమా సేన్ విషంతో పాటు, పగతో కూడిన తన రక్తాన్నీ కలిపేస్తుంది. ఆ కుట్రకి చోళ సైనికులు బలవుతారు. చోళ రాజు [పార్తీపన్] మరణిస్తాడు. మరో వారసుణ్ణి తీసుకుని, రాజగురువు నుండి శక్తులందుకున్న హీరో [కార్తీ] మళ్ళీ కనుమరుగు కావటంతో సినిమా ముగుస్తుంది.

మామూలుగా చూస్తే అర్ధం పర్ధం లేని కథ అన్పిస్తుంది. తార్కికంగా ఆలోచిస్తే.... నీడని లేపితె మనిషి గాల్లోకి లేవటం, అసలు నీడని లేపగలగటం ’రబ్బిష్’ గా తోస్తాయి. కానీ గూఢచర్యపరంగా అలాంటివే గాకపోయినా, నమ్మలేనంతటి అసాధారణాలు సాధ్యమే!

ఏమైనా.... ‘శతాబ్దాలుగా, తరాల తరబడి, కొన్ని వంశాలు ఒక లక్ష్యం కోసం రహస్యంగా పని చేయటం’ అనే ప్రక్రియని పరిచయం చేయటానికి మాత్రమే ఈ సినిమా పనికి వస్తుంది. ఏ విదేశీ వంశాలనో, మతపరమైన వంశాలనో చెప్పటం దేనికన్నట్లు, చరిత్రకు చెందిన హిందూరాజ వంశాలు చోళ, పాండ్యులని తీసుకున్నట్లున్నారు.

ఒక సామ్రాజ్య స్థాపనకు చోళ వంశీయులు రహస్యంగా, తమ ఉనికి ఎవరూ కనిపెట్టకుండా చుట్టూ అనేక ప్రమాదాలు[ద్వంద్వాలు వంటి Traps] ఏర్పాటు చేసుకుని ఉండగా.....

పగా ప్రతీకారాలతో, మత విశ్వాసాల కోసం, ప్రభుత్వంలో సమాజంలో పైకి మామూలుగా చెలామణి అవుతూ, అంతర్గత సంబంధం కలిగిన పాండ్య వంశీయులు ప్రభుత్వాన్ని, ప్రజా ధనాన్ని ఉపయోగించుకుంటూ, తమ వంశ ఆశయాన్ని సాధించుకో ప్రయత్నించటం....

వెరసి రెండు వంశాలనీ కలిపితే నకిలీ కణిక గూఢచర్య అనువంశీయులే!

ఇలాంటి చిత్రకథలో ఒక సినిమా రావటం ఇప్పటి వరకూ ఎప్పుడూ జరిగినట్లు తెలీదు. బహుశః ఇదే మొదటిది కావచ్చు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఒక్క తరగతి వాచక పుస్తకంలో కూడా పంచతంత్రంలోని సంభాషణలూ, పోలికలూ ఉండవు. రసం పిండిన పిప్పిలాంటి కథ మాత్రమే ఉంటుంది.

మరో ఉదాహరణ చూడండి.

నిన్న చెప్పిన కథలోనే....
పంచతంత్రం ప్రారంభ కథ అయిన దీనిలో....

విష్ణుశర్మ రాకుమారులతో "మీకు వినోదార్ధం ఒక మంచి కథ చెబుతాను. అందులో మిత్రలాభము, మిత్రబేధము, విగ్రహము, సంధి అనే నాలుగు అంశాలు ఉంటాయి. ధన సాధన సంపత్తి లేకపోయినా బుద్దిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకుని, కాక, కూర్మ, మృగ, మూషికాల వలె [కాకి, తాబేలు, జింక, ఎలుక] తమ పనులు సాధించుకుంటారు" అన్నాడు.

అది విని రాకుమారులు "కాకి, తాబేలు, జింక, ఎలుకలు ఏ కార్యాలు సాధించాయి? మాకు వివరంగా చెప్పండి" అన్నారు. [విష్ణు శర్మ, కథ గురించి ఊరిస్తూ, ఇప్పటి వాణిజ్య ప్రకటనలా, పిల్లలకి కథ గురించి పరిచయ వాక్యాలు చెప్పాడు. ఆసక్తికరంగా కథ చెప్పడంలోని నైపుణ్యం ఇది. వీటిని పరిశీలించకుండా.... కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఏ శిక్షణా సంస్థలో చేరినా వచ్చేదేమి లేదు, చెల్లించిన ఫీజులు పోవటం తప్ప.] విష్ణుశర్మ చెప్పటం ప్రారంభించాడు.

అనగా అనగా....

గోదావరీ తీరంలో గొప్ప బూరుగ వృక్షం ఉండేది. దాని మీద, నానాదిక్కుల నుండి వచ్చే పక్షులు రాత్రిపూట నివసించేవి. ఒకనాటి వేకువన లఘపతనం అనే కాకి నిద్ర లేచి, అక్కడే రెండో యముడి వలె సంచరిస్తున్న వేటగాణ్ణి చూసింది "తెల్లవారి నిద్దర లేస్తూనే ఈ కిరాతుడి మొహం చూసాను. ఈనాడు ఏ కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చిన చోట నిలువ రాదు. ఆలస్యం చేయక ఈ చోటు విడిచి పోవటం మేలు!" అనుకుంది.

అంతలో ఆ వేటగాడు, ఆ చెట్టుకి దగ్గరలో నూకలు చల్లి వల పన్నేడు. ప్రక్కనే ఉన్న పొదలో దూరి పొంచి చూడసాగాడు. ఈ లోగా కొన్ని పావురాలు ఆకాశంలో ఎగురుతూ అటుకేసి వచ్చాయి. ఆ పావురాల రాజు పేరు చిత్రగ్రీవుడు [విచిత్రమైన మెడ కలవాడు అని అర్ధం.]అతడు నేల మీది నూకలు చూసి, తోటి పావురాలతో "నిర్జనమైన ఈ అడవిలో నూకలు పడి ఉండటానికి కారణం ఏమిటి? మనం ఈ గింజల కోసం ఆశ పడకూడదు. పూర్వం ఒక బాటసారి, కంకణంకు ఆశపడి పులి చేతిబడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి" అని, ఇలా చెప్పసాగాడు.

అనగా అనగా.....

ఒక ముసలి పులి స్నానం చేసి, ధర్బలు చేతపట్టుకుని కొలని గట్టున కూర్చుంది. దారిన పోయే బాటసారులను "ఓయి! తెరువరి! ఈ పసిడి కంకణాన్ని పుచ్చుకుందువు గాని, ఇటు రా!" అని పిలవ సాగింది. ఒక పాంధుడు [బాటసారి] ఆ మాట విని "ఇది నా అదృష్టం అనుకుంటాను. సందేహించడం ఎందుకు?" అనుకున్నాడు. "ఏదీ, కంకణం చూపించు?" అని అడిగాడు. పులి చేయి పైకెత్తి "ఇదిగో హేమ కంకణం. చూడు" అని చూపించింది. సూర్య కిరణాలకి ఆ ధర్భలు బంగారం వలె మెరుస్తున్నాయి. బాటసారి భయము, ఆశ కలిగిన వాడై "నీవా కౄర జంతువువు. ఎలా నిన్ను నమ్మటం?" అన్నాడు.

ఆ మాట విని పులి, స్పుటమైన కంఠంతో "ఓరీ! పాంధా! విను. గతంలో నేను యవ్వనంలో ఉండి, మిక్కిలి దుష్టుడినై ఉన్నాను. అనేక గోవులను, సాధు జంతువులను, మనుషులను వధించి, మితిలేని పాపాలను మూట గట్టుకున్నాను. చివరికి ముసలితనంలో అందరినీ పోగొట్టుకుని ఏకాకిగా మిగిలాను. అప్పుడొక పుణ్యాత్ముడు నాకు తారసిల్లి, ‘ఇక మీదట గోవులను, మనుష్యులను చంపకు, సత్కార్యములు చేయి’ అని ఉపదేశించాడు. అది మొదలు కొని పాపకృత్యాలు మాని, మంచి పనులు చేస్తూ ఉన్నాను. వృద్దుణ్ణి, బోసి నోటి వాడిని, గోళ్ళు పోయినవి, లేవ సత్తువ లేదు. ఎందుకు నన్ను నమ్మవు? నీవు దరిద్రుడవని గమనించి,. ఇది నీకు దానం చేయాలనుకున్నాను. సందేహించక ఆ కొలనులో స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణం పుచ్చుకో" అన్నది.

బాటసారి పేరాశ కొద్ది దాని మాటలకు లోబడి, స్నానం చేయడానికి కొలనులోకి దిగాడు. అంతే! మొలలోతు బురదలో దిగబడ్డాడు. పులి అది చూసి "అయ్యోయ్యో పెను రొంపిలో దిగబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవనెత్తుతాను. భయపడకు" అంటూ మెల్లిమెల్లిగా వాడిని సమీపించి పట్టుకుంది. అప్పటికి గానీ బాటసారికి ప్రమాదం అర్ధం కాలేదు. "కౄర జంతువుని నమ్మకూడదు. ఆశ కొద్ది నమ్మి ఈ గతి తెచ్చుకున్నాను. జరిగిపోయిన దానికి ఎంత ఏడ్చి ఏమి ప్రయోజనం? విధిని తప్పించుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు" అని దుఃఖిస్తూ పులి చేత భక్షింపబడ్డాడు.

చిత్రగ్రీవుడు పావురాలకు ఈ కథ చెప్పి "కాబట్టి అన్ని విధాలా ఆలోచించకుండా ఏ పనీ చేయకూడదు. చక్కగా ఆలోచించి చేసిన పనికి ఎప్పటికీ హాని కలగదు అన్నాడు. [చూడండి కథని ఎంత చక్కగా, జీవితంలో అప్పటి తమ పరిస్థితికి అనువర్తించాడో చిత్రగ్రీవుడు!] ఇదంతా విని ఒక ముసలి పావురం గొల్లున నవ్వి ఇలా అంది "ఆ! ఇవేం మాటలు! ఒక ఇక్కట్లు వచ్చినప్పుడు వృద్దుల మాట వినవలసింది. కాబట్టి నా మాట వినండి. యుక్తాయుక్తాలు విచారించకుండా, అన్ని చోట్లా ఇలాంటి సంశయాలు పెట్టుకోకూడదు. పనికిమాలిన అనుమానాలతో భోజనం మానుకోవచ్చునా! అలా మానుకుంటే బ్రతికేదెలా! నిరంతరము... పరులను చూసి ఈర్ష్య పడేవాడు, రోత పడేవాడు, సంతోషం లేని వాడు, క్రోధము గలవాడు, శంకిస్తూ ఉండేవాడు, ఇతరుల సంపదను అనుసరించి బ్రతికేవాడు.... ఈ ఆరుగురూ ఎప్పుడూ దుఃఖాలే అనుభవిస్తారని నీతి కోవిదులు చెప్పారు" అన్నది.

ఆ మాటలకు ప్రభావపడి, నూకలకి ఆశపడి పావురాలన్ని నేల వ్రాలాయి.

"అనేక గొప్ప శాస్త్రాలు చదివి, ఎన్నో విషయాలు విని, ఇతరుల సందేహాలను తీర్చగలవారు కూడా, లోభం వల్ల వివేకం పోగొట్టుకుని కష్టాలలో పడతారు. ఆహా! లోభం ఎంత చెడ్డగుణం? అన్ని కష్టాలకు లోభమే కారణం" అంటూ విష్ణుశర్మ కథను కొనసాగించాడు. [చిత్రగ్రీవుడిని గురించి విష్ణుశర్మ ఈ మాటలు అన్నాడు.]

నేల వాలిన పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. దుఃఖంతోనూ, కోపంతోనూ పావురాలు, ముసలి పావురాన్ని చూసి "నీవు వృద్దుడివి, తెలిసిన వాడివని భ్రాంతి పడి, నీ మాటలు విని ఈ ఆపదలో పడ్డాము. ఎవడు బుద్దిమంతుడో వాడు వృద్దుడు గానీ, వయస్సు పైబడ్డంత మాత్రాన వృద్దుడా?" అని తిట్టసాగాయి.

వాటిని వారిస్తూ చిత్రగ్రీవుడు "ఇది అతని దోషం కాదు. ఆపదలు రాగలప్పుడు మంచి సైతం చెడుగా వినిపిస్తుంది. మన కాలం మంచిది కాదు. ఊరికే అతడిని ఎందుకు నిందించడం? [తను మంచి చెబితే వినలేదు. ముసలి పావురం చెప్పిన చెడు, పావురాలకి ఆకర్షణగా అనిపించింది. అయితే చిత్రగ్రీవుడు ఆ విషయమై వాటిని దెప్పలేదు. ఎందుకంటే మాటలతో వృధా పుచ్చకూడని ఆపత్కాలం అది.] ఇతడు తనకు తోచినది చెప్పాడు. అప్పుడు మన బుద్ది ఏమయింది? మనకు అతడి సలహా నచ్చే కదా చేసాము? ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని ఆలోచించాలి కానీ, యీ మాటల వల్ల ఫలమేమిటి? విపత్కాలమందు విస్మయం చెందటం [షాక్ అవ్వటం] అసమర్ధ లక్షణం. కాబట్టి, ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని పరిష్కారం ఆలోచించండి.

ఇప్పటికి నాకొకటి తోస్తున్నది. మీరందరూ పరాకు లేకుండా వినండి. ఒక్కసారిగా మనందరం వలనెత్తుకుని ఎగిరి పోదాం. ‘మనం అల్పులం, మనకీ పని సాధ్యం అవుతుందా?’ అని సందేహించవద్దు. అందరం కలిస్తే ఎంతటి పనినైనా సాధించవచ్చు. గడ్డి పరకలు సైతం తాడుగా పేనితే మదపటేనుగును కూడా బంధిస్తాయి. మీరూ ఆలోచించండి. ఇంత కంటే మంచి ఉపాయం మీ బుద్దికి తోస్తే అదే చేద్దాం అన్నది. [ఆపద సమయంలో, చిత్రగ్రీవుడు చూపిన ధైర్యం, ఆలోచన కోల్పోని తనం, తోటి వాళ్లని ఉత్తేజపరచి, పరస్పర నిందారోపణలు మాన్పించి, ఒక్కటిగా సమాయత్త పరచటం.... ఎంతో చక్కని నాయకత్వ ప్రతిభను ఈ పాత్ర చూపెడుతుంది.]

చిత్రగ్రీవుడు చెప్పిన దానికి పావురాలన్నీ ఏక కంఠంతో "మీరు చెప్పినదే బాగుంది. ఇంతకంటే మంచి సాధనం లేదు" అన్నాయి. కూడబలుక్కొని ఒక్కసారిగా వలతో సహా ఆకాశంలోకి ఎగిరాయి. దాంతో ఆ వేటగాడు ఒక్కసారిగా విభ్రాంతుడై "ఈ పక్షులన్నీ గుప్పుగుడి వలయెత్తుకొని పోతున్నాయి. అవి నేల వాలినప్పుడు పోయి పట్టుకుంటాను" అనుకుంటూ ముఖం పైకెత్తి రెప్పవేయకుండా పావురాల వైపే చూస్తూ ముళ్ళపొదల కడ్డం పడి పరిగెత్తసాగాడు. [పిల్లలకి ఈ కథ చెప్పినప్పుడు ఈ సన్నివేశంలో ఎంత హాయిగా నవ్వుతారో! అపాయంలో ఉపాయం, దుష్టుడి ఓటమి పట్ల గల ఇష్టం, ఆ కిలకిలల్లో ఉంటుంది. మానవ సహజ లక్షణం అది.]

ఈ వింత చూద్దామని లఘపతనం పావురాలని వెంబడించసాగింది. పడుతూ లేస్తూ నేల మీద పరుగెడుతున్న వేటగాడు, పావురాలు కనుమరుగయ్యే సరికి నిరాశతో వెనుదిరిగాడు.

వలతో సహా ఎగురుతున్న పావురాలు "ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి?" అని అడిగాయి. చిత్రగ్ర్రీవుడు "లోకంలో.... తల్లి, తండ్రి, స్నేహితుడు - వీళ్ళు ముగ్గురూ హితులు. తక్కిన వారందరూ ప్రయోజనాన్ని బట్టి హితులౌతారు. నాకు మిత్రుడొకడున్నాడు. అతడు హిరణ్యకుడు అనే మూషిక రాజు. గండకీ తీరంలోని విచిత్ర వనంలో అతడి నివాసం. అతడు పళ్ళబలంతో ఈ వల త్రాళ్ళు కొరికి మనల్ని ఈ ఆపద నుండి రక్షించగలడు. కాబట్టి మనం అతడి దగ్గరికి పోదాం" అన్నాడు.

పావురాలన్నీ చిత్రగ్రీవుడు చెప్పిన గుర్తుల ప్రకారం ఎగురుతూ పోయి హిరణ్యకుడి కలుగు ప్రక్కన వ్రాలాయి. ఆ సవ్వడికి భయపడిన హిరణ్యకుడు కలుగులో కదలకుండా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడు హిరణ్యకుణ్ణి ఎలుగెత్తి పిలిచాడు.

తరువాయి కథ మీరు నిన్నటి టపాలో చదివారు. ఒక కార్యం సాధించబడాలంటే అందులో ఎన్ని మెలికలు, మలుపులు ఉంటాయో ఈ కథ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అపాయాలూ, వాటిని దాటే ఉపాయాలూ అన్నీ ఉంటాయి ఈ కథల్లో!

పంచతంత్రమే కాదు, మహాత్ముల జీవిత కథల్లో సైతం, రస స్పూర్తిని వదిలేసి ’సొల్లు’తో పాఠ్యాంశాలని నింపటమే ఉంది, మన పిల్లల సిలబస్ లో! హైస్కూలు పిల్లలకి తెలుగులో, కేవలం జరద్గవం అనే గుడ్డిగ్రద్ద కథ, ‘కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు’ అనే చివరి నీతి వాక్యంతో ముగిసే కథ, దాదాపు మూడు తరగతుల పిల్లలకి సిలబస్ లో ఉంది.

ఇది ఖచ్చితంగా, కావాలని కంపైల్ చేయబడ్డ సిలబస్! ఇందుకు నేను ఆ సిలబస్ ని కంపైల్ చేసిన ప్రొఫెసర్లని [పంతులమ్మలూ, పంతులయ్యలని] నిందించటం లేదు. బహుశః వాళ్ళు తమకు తమ ’పైవారి’ నుండి వచ్చిన ఆజ్ఞాపనలు [Assignments] ప్రకారమే ఆ విధంగా కంపైల్ చేసి ఉంటారు. ఇందుకు మంత్రులనీ, రాజకీయ నాయకులనీ, సంబంధిత శాఖల కార్యదర్శిల వంటి బ్యూరాక్రాట్లనీ నిందించను. వాళ్ళు తమ ‘పైవారి’ని అనుసరించి ఉంటారు. బదులుగా కెరీర్, డబ్బు, ఖ్యాతి వంటి ప్రయోజనాలు పొందుతారు. ఇదంతా దేశ భవిష్యత్తు మీద, జనాల జీవితాల మీద కుట్ర అయినప్పుడు, ఇంతకంటే భిన్నంగా ఏమి ఉంటుంది?

అయితే, ఖచ్చితంగా పిల్లల తల్లిదండ్రులకి మాత్రం ఈ విషయమై బాధ్యత ఉందంటాను. పిల్లల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని, నిర్భాధ్యతనీ, ఆలోచనా రాహిత్యాన్ని నిందించక తప్పదు. అలాంటి సిలబస్ కారణంగా జరుగుతున్న హాని అర్ధమయ్యాక కూడా "ఏం చెయ్యగలం?" అని నిట్టూరుస్తూ, ఆపైన అంగలార్చే అలసత్వాన్ని తప్పకుండా నిందించాల్సిందే!

అంతేకాదు, పిల్లల్లో శ్రమించే తత్త్వాన్ని పెంచాలన్న విషయంలో కూడా ఏ విధమైన శ్రద్దా తీసుకోబడటం లేదు. తల్లిదండ్రులు స్వయంగా తమ పిల్లల్ని సోమరులని చేయటం నేను పరిశీలించాను. దాన్ని వాళ్ళు ’ముద్దు చేయటం’ ’గారబం’ గట్రా పేర్లతో పిలుస్తారు. అచ్చంగా సినిమా గారాబం! "ఒరే డాడీ!" అని పిలిపించుకుంటూ మురిసిపోయే తండ్రులని చూశాను. "మా పిల్లలు అటు పుల్ల తీసి ఇటు పెట్టరమ్మా" అంటూ దీర్ఘాలు తీసే తల్లుల్ని చూశాను. ఇక సెంట్రల్లీ ఏసీ, స్కూలు బస్సు ఏసీ ఉండే బడుల్లో పిల్లల్ని చేర్చటం చూస్తూనే ఉన్నాం.

"మాకు డబ్బుంది! కాబట్టి ఏసీ బడుల్లో చేరుస్తాం. మీకేం నొప్పి?" అంటే, అది వారి విజ్ఞత. ఆ డబ్బు సంపాదించాలన్నా, కష్టించి పనిచేసే తత్త్వం అలవడాలి అన్నది సత్యం. ఈ సత్యం.... ఏసీ బడుల్లో చేర్పించేందుకు కావాల్సిన డబ్బు కష్టపడకుండా వస్తే తప్ప, ఎవరూ మరిచిపోలేనిది. ఈ సంగతి పక్కన పెడితే... అందరు తల్లిదండ్రులూ, వారి పిల్లలూ ఇలాగే ఉన్నారని నేను అనను. అయితే అధికశాతం తల్లిదండ్రులూ, వాళ్ళ పిల్లలూ మాత్రం ఇలాగే ఉన్నారు. కేవలం ’మార్కులూ, ర్యాంకులే సమస్తం, వ్యక్తిత్వ నిర్మాణమా వంకాయా? అదంతా అనవసరం’ అనుకుంటూ!

పిల్లల్లో శ్రమించే తత్త్వమూ, ధైర్య సాహసాలూ, ఆసక్తి, కుతుహలం, తార్కిక ఆలోచన, విచక్షణ, మొదలైన లక్షణాలు అవసరమని కూడా గుర్తించకుండా! ఎంతగా విచక్షణ కోల్పోయారంటే - ఏమార్గంలో మార్కులూ, ర్యాంకులూ వచ్చాయో కూడా పట్టించుకోనంతగా! [మార్కులూ, ర్యాంకులూ రావటం ముఖ్యం. ఎలా సంపాదిస్తేనేం డబ్బులు సంపాదించటం ముఖ్యం అనుకున్నట్లుగా!] కాపీలతో కానివ్వండి, విద్యాసంస్థల ర్యాంకు ఫిక్సింగుల వంటి అవినీతిలో రానివ్వండి, ఎక్కువ మార్కులూ, మంచి ర్యాంకులూ రావటం ప్రతిష్ఠాత్మకం. నిజానికి ప్రక్కదారిలో సంపాదించే మార్కులూ, ర్యాంకులూ పిల్లల సామర్ధ్యానికి గీటు రాళ్ళెలా అవుతాయో, అలాంటివి తమ ప్రతిష్ఠకు సోపానానెలా అవుతాయో వాళ్ళకే తెలియాలి!

తల్లిదండ్రుల ఈ విధమైన ఆదరణ కారణంగానే స్కూళ్ళు, కాలేజీలూ.... ప్రశ్నాపత్రాల లీకులూ, కాపీయింగులూ, మూల్యాంకన అవకతవకలూ, ర్యాంకు ఫిక్సింగులూ చేయగలుగుతున్నాయి. అందుకోసం ప్రతీ ఏటా వందల కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కాబట్టే, రాజకీయ నాయకులు, మీడియా ఉద్దండులూ, ఉన్నతాధికారులూ ఈ మోసాల మీదా, అవకతవకల మీదా నిశ్శబ్దం పాటిస్తుంటారు. కాబట్టే చుక్కా రామయ్యల వంటి విద్యావేత్తలూ, లోక్ సత్తా జేపీ వంటి మేధావులూ, ఈ బహిరంగ రహస్యాన్ని మరింత రహస్యంగా ఉంచుతుంటారు.

క్రికెట్ రంగంలో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఎంసెట్ ర్యాంకుల అవకతవకల మీద మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎంతో పోరాడాం. ఈ మొత్తం అవకతవకల గురించి దృష్టాంతాలు, సాక్ష్యాధారాలతో సహా, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కీ, యూపీఏ కుర్చీ వ్యక్తి సోనియాకీ, భారత రాష్ట్రపతికీ, సింఘ్వీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా అతడికీ, లోకా యుక్తాకీ, మానవహక్కుల కమీషన్ కీ, మీడియాకీ కూడా.... అందరి దృష్టికీ తీసి కెళ్ళాము. అందరూ కూడబలుక్కున్నట్లుగా.... వ్యూహాత్మక మౌనం పాటించారు, ఒక్క భారత రాష్ట్రపతి APJ కలాం తప్ప. ఉత్తర ప్రత్యుత్తరాలతో సహా, ఆ వివరాలన్నీ మా ఆంగ్ల బ్లాగు Coups On World లోని Documentary, Evidence లో పొందుపరిచాను.

ఈ విషయాన్ని ప్రక్కన బెడితే... పిల్లల్లో శ్రమించే తత్త్వాన్ని, ఇతర మంచి లక్షణాలనీ పెంపొందించాలనే విషయాన్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులు తాము పరుగులు పెడుతూ పిల్లల్నీ పరిగెత్తిస్తున్నారు.

ఈ సందర్భంలో మరో కథ చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మరో విషయాన్ని స్పష్టీకరిస్తాను. ఇది, లోతుగా మనల్ని మనం పరిశీలించుకున్నా, మన చుట్టూ ఉన్న వారిలో పరిశీలించినా స్పష్టంగా గోచరించే యదార్ధం. అదేమిటంటే - అహంకారము, జ్ఞానము పరస్పర ద్వంద్వాలు. అవి విలోమ సంబంధం ఉన్న జంట. అంటే ఒకటి పెరిగినప్పుడు రెండోది తరుగుతుందన్నమాట. జ్ఞానం పెరిగితే అహంకారం నశిస్తుంది. అహంకారం పెరిగితే జ్ఞానం లోపిస్తుంది. అందుకే జ్ఞానాన్ని దైవీయలక్షణం గానూ అహం భావాన్ని అసుర లక్షణం గానూ పెద్దలు పరిగణిస్తారు.

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, సకల జగత్తులో జ్ఞానం అంత పవిత్ర వస్తువు మరేది లేదని, జ్ఞానిని భగవంతుడు, భగవంతుడిని జ్ఞాని దర్శించగలరని, జ్ఞాని భగవత్ స్వరూపుడని అంటాడు.

శ్లోకం:
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానినో2త్యర్ధ మహం స చ మమ ప్రియఃII

భావం:
వీళ్ళు నలుగురిలో - జ్ఞాని, యెల్లప్పుడూ నాయందే మనస్సు నిలుపుకొని, ధ్యాన యోగంతో సేవిస్తాడు కనుక, అందరికంటే అతడే శ్రేష్ఠుడు. తనకు నేనూ, నాకూ తనూ మిక్కిలి యిష్టులం.

శ్లోకం:
ఉ దారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్
ఆస్థిత స్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్II

భావం:
పై నలుగురు ఉత్తములే. కాని, జ్ఞాని మాత్రం నా ఆత్మ స్వరూపుడు. అన్ని విధాలా నన్నే పరాంగతిగా ఆశ్రయించుకొని ఉంటాడు.

మన సంస్కృత సారస్వతంలో.... వేదాలు, ఉపనిషత్తులు జ్ఞాన గనులు. కఠోపనిషత్తుకు, కేనోపనిషత్తుకు శాంతి మంత్రం అయిన, ఈ అందమైన, అర్ధవంతమైన, సత్య శోభితమైన క్రింది శ్లోకాన్ని ఒకసారి పఠించండి. హృదయరంజితమైన రాగంలో ఆలపించబడే ఈ మంత్రం, ఆత్మని తట్టి లేపి ఆనందలోకాల్లో విహరింపజేస్తుంది. విద్యాభ్యాసంలో భాగంగా గురుశిష్యులు ప్రారంభ పాఠంగా ఈ శ్లోకాన్ని పఠిస్తారు.

శ్లోకం:
ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం
కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

భావం:
గురుశిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక! ఇద్దరినీ పోషించుగాక! ఇద్దరమూ ఊర్జితశక్తితో పరిశ్రమిద్దాం గాక! మన స్వాధ్యాయం ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాక! ఎన్నడూ మన మిద్దరమూ పరస్పరం ద్వేషించుకొనకుందాం గాక!

ఈ శ్లోక భావాన్ని లోతుగా ఆవలోకిస్తే.... గురుశిష్యులు ఏకకాలంలో ఏకకంఠంగా పఠించే ఈ శ్లోకం ఎంతో అర్ఠపూర్ణమైనది. గురువు శిష్యుడి మనస్సు నుండి అహాన్ని పారదోలి, అతడి మనస్సు జ్ఞానాన్ని గ్రహించి తనలో నిక్షిప్తం చేసుకునే విధంగా మలచ ప్రయత్నిస్తున్నప్పుడు, ఖచ్చితంగా ఆ శిష్యుడు, ఆ ప్రక్రియ పట్ల వికర్షితుడవుతాడు. గురువు పట్ల ద్వేష పూరితుడూ అవుతాడు. [కుక్షి నింపే అక్షర విద్య గురించి నేనిక్కడ ప్రస్తావించట్లేదు. అదైనా కూడా, ABCDలు నేర్పబోయే టీచర్ పట్ల నర్సరీ బుడ్డీ గాడికి మొదట కోపమూ, అలక వస్తాయి. వాడికి చాక్లెట్ లు ఇచ్చి, కథలు, కబుర్లు చెప్పి మచ్చిక చేసుకోవాల్సిందే.]

ఆ వికర్షణని, విద్వేషాన్ని కూడా దాటి, అరిషడ్వర్గాలనబడే ఆరుకంతలని పూడ్చినప్పుడే ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందగలడు. [కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషడ్వర్గాలంటారు] శిష్యులు గానూ, గురువులు గానూ కూడా ఇది మా స్వానుభవం. నిశితంగా మన మనసు లోతులని పరిశీలించుకోగలిగితే, ప్రతీ వ్యక్తికీ అనుభవమయ్యే, అర్ధమయ్యే యదార్ధం ఇది.

ఒక బీరువాలో, చెత్తా చెదారం, పనికిరాని వస్తువులు, నిండుగా ఉన్నాయనుకొండి చెత్తబుట్టలో వేయాల్సిన పనికి రాని వస్తువులతో నిండిన ఆ బీరువాలో, మంచిపుస్తకాలు పెట్టేందుకు చోటు ఉండదు. అహం - జ్ఞానంల పరిస్థితి కూడా ఇదే! మన బుర్ర అనే బీరువాలో పనికిమాలిన చెత్తవంటి అహంకారంని తొలిగిస్తేనే.... జ్ఞానాన్ని, దాన్నుండి కలిగే ఆనందాన్ని బుర్రలో నింపుకోగలం.

ఎవరైనా ఒక వ్యక్తి.... గొప్ప జ్ఞానిగా కీర్తి పొంది, మరో వైపు చూస్తే మహా అహంకారి అయ్యుంటే, ఖచ్చితంగా అతడు నిజమైన జ్ఞాని కాడని, వట్టి ప్రచారం [build up] తప్ప అతడిది నిజమైన జ్ఞాని కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

గతంలో, అంటే వేల సంవత్సరాల క్రితం, భారతీయ గురుశిష్యులకి, విద్వాంసులకి, ఇప్పుడు మనం వాడుతున్న కలం కాగితాలు, కంప్యూటరు యంత్రాల వంటి పరికరాలు లేవు. తాటి ఆకుల మీద పక్షి ఈకలతో వ్రాసేవారు. అప్పటి విద్య మొత్తం మౌఖికంగా ఉండేది. వేల సంవత్సరాల పాటు, తరం నుండి తరానికి.... వేదాలు, కావ్యాలు, సాహిత్యం.... మౌఖిక అభ్యాసంతోనే బదలాయించబడింది. కొన్ని నమ్మకాలు సమాజాన్ని చీకటిలోకి లాక్కెళ్ళినా, వాటికి ఆవల, పరిణతి చెందిన పరిపూర్ణ ఆలోచనా విధానం, అప్పటి ఈశవిద్యలో గోచరిస్తుంది.

వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలతో ప్రేరేపింపబడిన మూఢాచారాలు, అంధ విశ్వాసాలలో యధార్ధంగా ఉన్నదెంతో, ప్రచారపు హోరు ఎంతో, ఇప్పుడు పరిశోధించలేం. తామే.... ప్రక్షిప్తాలనీ, ఉన్నవాటికి మరికొన్ని మూఢనమ్మకాలనీ ప్రవేశ పెట్టి, తామే మరింత అల్లరి చేయటం! ఓ ప్రక్క బాణామతి, దెయ్యాలు, ఆఘోరాల గురించి సినిమాలు, నవలలు ప్రచారిస్తూ మరో ప్రక్క విమర్శించినట్లు! సాంబారులో తానే బొద్దింక వేసి హోటల్ యజమానితో దెబ్బలాడే హాస్యనటుడి విన్యాసం కూడా నడిచిన చోట.... ఉన్నదెంతో, పెంచి పోషించింది ఎంతో ఇప్పుడెవరు చెప్పగలరు?

అదీగాక.... ఏ కాలంలో అయినా, ఏ సమాజంలో అయినా, మంచీ చెడూ రెండూ ఉంటాయి. కొన్ని అనుకూల అంశాలు, మరికొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి. అది ప్రాచీన కాలమైనా, ఆధునిక కాలమైనా! సత్యమైనవీ, వ్యక్తి ఆత్మోన్నతికీ ప్రజాహితానికీ సమాజ శ్రేయస్సుకీ తోడ్పడేవి, అనుకూల అంశాలైతే.... అందుకు విపర్యయమైనవి ప్రతికూలాంశాలు. దేనిలోనైనా మంచి గ్రహించి, చెడుని విడిచిపెట్టడమే విజ్ఞత అంటారు పెద్దలు. కాబట్టి గతమంతా మంచీ కాదు, వర్తమానమంతా చెడూ కాదు. అలాగే తాత్కాలికంగా మంచిగా అన్పించి కాలగతిలో కీడు చేసే ఏ అంశమైనా ‘మంచి’ ఎప్పటికీ కాదు.

అలాంటిదే ప్రస్తుత విద్యావిధానం! ఇప్పుడు కూడా విద్యార్ధులు, నాటి గురుశిష్యుల మాదిరిగా మౌఖిక అభ్యాసం చేస్తున్నారు. వల్లెవేసి బట్టీ వేస్తున్నారు. కాకపోతే గ్రహిస్తున్న విద్య.... వరి బియ్యం కాదు, చిట్టూ తవుడు!

వివిధ దేశాల ఎగుమతి దిగుమతుల గురించీ, త్రికోణమితి గురించీ, మాత్రికలు గురించీ నేర్చినంత మాత్రాన, పిల్లల వ్యక్తిత్వం నిర్మాణం కాదు, స్పష్టమైన ధృక్పదమూ అలవడదు. నేటి అభివృద్ది చెందిన శాస్త్ర సాంకేతికతలూ, జీవ భౌతిక రసాయన శాస్త్రాలు, గణిత, కంప్యూటర్ శాస్త్రాలు సత్యం కాదని గానీ, విద్యార్ధులకి నిరూపయోగమని గానీ, నేను అనటం లేదు.

అయితే 13 ఏళ్ళ వయస్సులోపల పిల్లలకి, అవి పాఠ్యంశాలై, అభ్యాసనాంశాలై ఉండకూడదంటున్నాను. ప్రాధమిక విద్య, పిల్లల్లో ధృఢమైన, వారిదైన స్వంత వ్యక్తిత్వాన్ని, ధృక్పధాన్ని నిర్మించాలి. పిల్లలు మానవీయ విలువలని, తార్కిక ఆలోచనా శక్తిని, పరిశీలనని, జ్ఞానాసక్తినీ పొందాలి. ఇది జయప్రదంగా పూర్తయితే.... ఎంతటి క్లిష్టమైన శాస్త్ర, గణితాలనైనా వాళ్ళు ఆలవోకగా నేర్చుకుంటారు.

13 ఏళ్ళలోపు... ‘నేర్చుకునే తత్త్వాన్ని’ నేర్పితే.... ఆపైన దేన్నైనా ఇష్టంగా, కష్టం లేకుండా నేర్చుకుంటారు. కాబట్టి ముందుగా వాళ్ళలో సద్గుణాలని, పాజిటివ్ లక్షణాలని, పాజిటివ్ ఆలోచనా విధానాన్ని నేర్పాలి.

దీన్ని కథలూ, ఆటపాటలతో నేర్పవచ్చు. ఇతిహాసాలు, చారిత్రక వ్యక్తుల, మహానుభావుల జీవిత కథలు, పిల్లల్ని ఎంతో స్ఫూర్తివంతం చేస్తాయి. జీవితం పట్ల వాళ్ళకు తెలియకుండానే స్పష్టమైన అవగాహన కలుగుతుంది. జీవిత లక్ష్యాలు తమంతట తామే నిర్దేశించుకుంటారు. మార్గదర్శకత్వం గురువు [టీచర్] వహిస్తే చాలు, పిల్లలు అల్లుకుపోతారు. నిజానికి విద్యా వ్యవస్థ ఉండాల్సింది ఇలాగే!

కానీ ఇప్పుడేం జరుగుతోంది? ఒక్కసారి.... నాలుగైదు తరగతుల సాంఘీక శాస్త్రాన్ని చూడండి. గొప్ప వ్యక్తుల జీవితగాధలుండవు. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏ సంవత్సరాల్లో ఏం చదివి, ఏ పదవులు నిర్వహించారు, ఎప్పుడు మరణించారు గట్రా టాబ్యులర్ ఫామ్ వంటి వివరాలుంటాయి. అలాంటి గణాంక వివరాలు చదవటం వలన పిల్లల్లోనే కాదు, ఎవరిలోనూ.... ఉత్తేజంగానీ, స్పూర్తి గానీ కలగదు. కాబట్టే, పిల్లలు కూడా ఎంతో యాంత్రికంగా ఆ స్టాటిస్టిక్స్ ని తాత్కాలిక జ్ఞాపకంలో పెట్టుకుని, పరీక్షల్లో కక్కేసి, మార్కులొచ్చాక మరిచి పోతుంటారు. అంతే! స్ఫూర్తి పొందేందుకో, ఉత్తేజితులయ్యేందుకో అందులో ఒక్కటన్నా జీవిత సంఘటన ఉంటేగా!

మరో సజీవ ఉదాహరణ చెబుతాను. పంచతంత్రంలో అద్భుతమైన, అందమైన కథలున్నాయి. జీవిత సత్యాలున్నాయి. రాజనీతి దగ్గరి నుండి స్నేహపు తీరుల గురించి సైతం.... వ్యూహాలు, ఉపాయాలూ ఉన్నాయి. నిజానికి ఆ గ్రంధపు మరోపేరు సంపూర్ణ నీతి చంద్రిక. మూలగ్రంధంలోని ప్రతీ కథలో, జంతువులూ, పక్షులూ ప్రధాన పాత్రలై నడిపే సంభాషణల్లో.... ఎన్నో మానవీయ కోణాలు, నైతిక సూత్రాలూ, ప్రకృతి సిద్దమైన పోలికలతో, వర్ణనలతో వివరించబడ్డాయి.

నిజానికి మానవీయ విలువలనీ, వ్యవహార జ్ఞానాన్ని చర్చంచటానికి ఆ కథలు ఉద్దేశింపబడ్డాయి, మలచబడ్డాయి. ఆ కథా పూర్వక చర్చలతోనే వినోద క్రీడా ప్రియులైన రాజకుమారులని విష్ణుశర్మ మేధోచైతన్య పూరితులని చేశాడు తప్ప కాకమ్మ - ఎలకమ్మ కథలతో కాదు. కథల నెపంతో విష్ణుశర్మ, సునిశిత ఆలోచనా పటిమనీ, ప్రాకృతిక పరిశీలననీ.... జంతువుల, పక్షుల పాత్రల సంభాషణల ద్వారా రాకుమారుల బుర్రల్లోకి ఎక్కించాడు.

మచ్చుకి ఒకటి!

చిన్నప్పటి నుండీ మనం విన్న కథ! ‘వలలో చిక్కిన పావురాలు’ వలతో సహా ఎగిరి, వేటగాడికి ఠోకరా ఇచ్చి, ఎలుక నేస్తం దగ్గరి కెళ్ళి వలబంధనం తెంచుకున్న కథ. చాలా సూటిగా, చివరలో ఒక నీతి వాక్యంతో చెప్పబడే కథ!

అదే కథ, పంచతంత్రంలో ఎలా ఉందో చూడండి. మొత్తం కథా వివరించడం సుదీర్ఘమైనందున, పావురాలు వలతో సహా ఎగిరి, పావురాల రాజైన చిత్రగ్రీవుడు, తన మిత్రుడైన హిరణ్యకుడి కలుగు దగ్గర వాలినప్పటి నుండీ వివరిస్తాను.

చిత్రగ్రీవుడు ఎలుక కలుగు దరిచేరి ఎలుగెత్తి "ఓ చెలికాడా! ఏల మాతో మాటలాడవు" అనగానే... హిరణ్యకుడామాట విని, వేగముగా కలుగు వెడలి వచ్చాడు.

స్నేహితుణ్ణి చూసిన సంతోషంతో "ఆహా! ఏమి నా భాగ్యము? ఈ రోజు నా ప్రియమిత్రుడు చిత్రగ్రీవుడు, నాకు నేత్రోత్సవము చేయనున్నాడు" అన్నది. [ఎంత చక్కని ఆహ్వాన పలకరింపులో!]

అంతలోనే వలలో చిక్కిన పావురాలను గమనించి, వెఱగుపడి ఒక్కక్షణం ఊరుకుని "చెలికాడా! ఇది ఏమి?" అని అడిగింది.

దానికి చిత్రగ్రీవుడు కొంత విచారంగా "ఇది మా పూర్వజన్మ కర్మఫలము. చేసిన కర్మమనుభవింపక తీరదు కదా!" అన్నాడు. హిరణ్యకుడు, చిత్రగ్రీవుడి బంధనాలు తెంపేటందుకై సమీపించగా, చిత్రగ్రీవుడు అభ్యంతరం చెబుతూ "చెలికాడా! చేయవలసింది ఇలా కాదు. ముందుగా నా ఆశ్రితులైన నా అనుచరుల బంధనాలు తెంచు. తర్వాత నన్ను విడిపించుదువు గాని" అన్నాడు.

అందుకు హిరణ్యకు డనే ఆ ఎలుక "నా దంతాలు కోమలమైనవి. అన్నిటి బంధాలు కరిచి తెంపలేను. పండ్ల బలిమి ఉన్నంత మేరకు నీ బంధనాలు తెంచి వేస్తాను. తర్వాత శక్తి కలిగిన పక్షంలో మిగిలిన వారి సంగతి చూడవచ్చు" అన్నాడు.

దానికి చిత్రగ్రీవుడు "అలాగే చెయ్యి. శక్తికి మీరి ఎవరైనా ఏమి చెయ్యగలరు? అయితే... ముందర యధాశక్తి వీరి నిర్భంధము తెంచి వేయి. తర్వాతే నా సంగతి చూచుకుందాం" అంది. [ఎంత చక్కగా, నిక్కచ్చిగా తన అభిప్రాయం చెప్పిందో చూడండి. స్నేహితుణ్ణీ కాదనలేదు. తన ఇచ్ఛా విడువలేదు.]

అందుకు హిరణ్యకుడు "తన గురించి తాను పట్టించుకోకుండా ఇతరులని రక్షించాలనటం నీతి కాదు. తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము గలదా?’ అని పెద్దలంటారు. తాను బ్రతికి కదా సమస్త పురుషార్ధాలు సాధించుకోవాలి? తానే పోయిన తర్వాత దేనితోనైన ఎవరి కేమి పని ఉంటుంది?" అన్నది.

అయినా చిత్రగ్రీవుడు శాంతంగా, "మిత్రుడా! నువ్వు చెప్పింది నీతి కాదనను. [చూడండి. వ్యతిరేకిస్తూ తన వాదనని ప్రారంభించలేదు.] అయినా గానీ, నా వారి దుఃఖాన్ని చూసి సహించలేను కాబట్టి ఇంత నొక్కి చెప్పాల్సి వచ్చింది. ప్రాజ్ఞుడు తన జీవితాన్ని వదులుకొని అయినా, మంచి వారికి వచ్చిన కీడు తొలిగించాలని నీతి కోవిదులు చెబుతారు. నావంటి వారు నా అనుచరులైన ఈ పావురాలు. వీరి వంటి వాడినే నేను.

ఆపదలో ఆదుకొనని నా ప్రభుత్వం వలన వీరికి రాగల ఫలితమేమున్నది? మిత్రుడా! విడువదగినదీ, ఆశాశ్వతమైనదీ అయిన నా శరీరం మీద ఆశమాని, నాకు కీర్తిని ప్రసాదించు. నా ఈ అనుచరులకు నా వలన జీతమూ బత్తెమూ ఏదీ లేదు. అయినా గానీ వీరు, సర్వకాలమూ నన్ను వదలక, నా తోడై నన్ను సేవిస్తూ ఉన్నారు. వీళ్ళ ఋణం ఎప్పుడు తీర్చుకోవలనో తెలియదు. నా బ్రతుకు ముఖ్యమని తలచకు. వీళ్ళ ప్రాణాలు రక్షించితే చాలు!

అనిత్యమైన, మలినమైన ఈ శరీరం చేత.... నిత్యమైన, నిర్మలమైన కీర్తి లభిస్తే, అంతకంటే మించిన లాభం ఉంటుందా? శరీరానికీ, గుణాలకీ మిక్కిలి వ్యత్యాసమున్నది. శరీరం క్షణభంగురం. గుణాలు కల్పాంత స్థాయిలు. ప్రళయం వచ్చే వరకూ నిలిచి ఉంటాయి. ఇలాంటి శరీరాన్ని కోరి, కీర్తిని పోగొట్టుకోవచ్చునా?" అంటాడు.

అది విని హిరణ్యకుడు సంతోషంతో పులకించి పోతాడు. చిత్రగ్రీవుణ్ణి చూసి "చెలికాడా! మేలు మేలు! నీ ఆశ్రిత వాత్సల్యాన్ని పొగడటానికి నేనెంత వాణ్ణి? ఈ గుణము చేత నీవు త్రిలోకాధిపత్యానికి తగి ఉన్నావు" అంటూ, అందరి బంధనాలు కొరికి తెంచేసాడు. అందరికీ అతిధి సత్కారాలు చేసి, చిత్రగ్రీవుణ్ణి చేరి "చిత్రగ్రీవా! చెలికాడా! ఎంతటి వారికైనా పూర్వ కర్మ మనుభవింపక తప్పదు. వలలో చిక్కుకున్నందుకు నొచ్చుకొకు. అన్నీ తెలిసిన వాడవు. నీకు నా బోటి వారు చెప్పగలిగేది లేదు" అని ఊరడించాడు. [ఎంత మార్ధవమైన ఆదరణ ఇది!]

తర్వాత హిరణ్యకుడు చిత్రగ్రీవుణ్ణి కౌగలించుకుని, వీడ్కొలు చెప్పాడు. చిత్రగ్రీవుడు తమ పరిజనులతో హిరణ్యకుడి స్నేహ శీలాన్ని, మంచి గుణాలని కొనియాడుతూ పయనమయ్యాడు.

మిత్రలాభం కంటే మించిన లాభం మరొకటి ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి బుద్దిమంతుడు ఎక్కువమంది మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఒక్క ఎలుకతో స్నేహం, పావురాలకి ఎంత మేలు చేసిందో చూడండి" అని చెప్పి విష్ణుశర్మ కొనసాగించాడు.

~~~~~~~~

మనం ఎన్నోసార్లు చదివిన, విన్న, చెప్పిన ఈ పంచతంత్రం కథలో.... ‘కట్టే కొట్టే తెచ్చే’ అనే కథ, చివరలో నీతి వాక్యం తప్పితే.... ఇంత సంభాషణా చాతుర్యం, నీతి మాటల మాలిక ఉందా? ఒకో పాత్ర, ఎదుటి వారిని మన్నించే తీరు, మర్యాదించే వైనం, సంభాషణల మర్మం, మానవీయ విలువల తోడి మెరుపు! నిజంగా అది పంచతంత్రమే కాదు నీతి చంద్రిక కూడా!

ఒక్క తరగతి వాచక పుస్తకంలో కూడా ఇదేమీ ఉండదు. బియ్యం పారబోసి, మిగుల్చుకున్న తవుడు వంటి చప్పటి కథ మాత్రమే ఉంటుంది.

ఈ కథలో ఎలుక హిరణ్యకుడూ, పావురాల రాజు చిత్రగ్రీవుడూ పరస్పర విరుద్ద వాదనలు చెబుతారు. ఎలుక ‘విపత్కర పరిస్థితుల్లో ఎవరి స్వార్ధం వారు చూసుకోవటం ముఖ్యం’ అంటుంది. పావురం ‘ఎప్పుడైనా సరే, శరీరం కంటే కీర్తిగొప్పదనీ, నిస్వార్ధంగా పరోపకారం చేయటమే మేలనీ’ అంటుంది.

ఎవరి వాదన వాళ్ళు ప్రజంట్ చేసే తీరూ, చివరికి ఒకరితో ఒకరు ఏకీభవించే తీరూ ఎంతో స్పష్టంగా చెప్పబడుతుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu