ఒకసారి క్రింది వార్తాంశాలని పరిశీలించండి.

ఇది సహించరాని వైఫల్యం:

సీఐఏకు ముతలబ్‌ గురించి అతడు విమానం పేలుడుకు ప్రయత్నించకముందే తెలిసినా ఇతర ప్రభుత్వ సంస్థలను అప్రమత్తం చేయకపోవడంపై బరాక్‌ ఒబామా మండిపడ్డారు. ముతలబ్‌ ఉదంతంపై ఒబామా, విమానం పేల్చివేత యత్నానికి ముందే సీఐఏకు ముతలబ్‌ గురించి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం. ముతలబ్‌ను రిక్రూట్‌ చేసుకున్న అల్‌కాయిదా లండన్‌ శాఖ:'టైమ్స్‌' వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏకు ముతలబ్‌ గురించి అతడు విమానం పేలుడుకు ప్రయత్నించకముందే తెలిసినా ఇతర ప్రభుత్వ సంస్థలను అప్రమత్తం చేయకపోవడంపై ఆ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా మండిపడ్డారు. ఇది తీవ్ర మానవ తప్పిదమని, అన్ని స్థాయిల్లో జరిగిన వ్యవస్థాగత లోపమని విరుచుకుపడ్డారు. 'దీన్ని ఎంతమాత్రం సహించలేం. తెలిసిన ఉగ్రవాది గురించి మనకు సమాచారమున్నా దాన్ని ఇతర సంస్థలతో పంచుకోకపోవడం, అవసరమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల వ్యవస్థాగత వైఫల్యం చోటుచేసుకుంది.

ఓ ఉగ్రవాది దాదాపు 300 మందిని ప్రాణాలను బలితీసుకునే పేలుడు పదార్థాలతో విమానంలో ప్రయాణించాడు.. దీన్ని నేనసలు అంగీకరించను. విచారణల్లో ఏదో ఒకటి తెలుస్తుంది. కానీ ఇప్పటికే మానవ, వ్యవస్థాగత వైఫల్యాలు కలిసిపోవడంతో భారీ స్థాయిలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఈ మొత్తం ఉదంతంపై గురువారం నాటికి ప్రాథమిక నివేదిక అందించాలి' అని ఒబామా మంగళవారం హవాయి నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

నైజీరియాకు చెందిన అనుమానిత అల్‌కాయిదా ఉగ్రవాది ఉమర్‌ ఫరూక్‌ అబ్దుల్‌ముతలబ్‌ ఈ నెల 25న ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి డెట్రాయిట్‌కు వెళ్తున్న అమెరికా విమానం పేల్చివేతకు యత్నించడం తెలిసిందే. తమ వద్దగల అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో అతని పేరు ఉందని సీఐఏకు ఈ సంఘటకు ముందే తెలుసని మీడియా తెలిపింది. ముతలబ్‌లో ఇటీవల తీవ్రవాద లక్షణాలు కనిపిస్తున్నట్లు అతని తండ్రి ఉమరూ ఓ సీఐఏ అధికారికి చెప్పాడని సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ తెలిపింది. ఉమరూ ఇచ్చిన సమాచారం సీఐఏ కేంద్ర కార్యాలయానికి కూడా అందిందని వెల్లడించింది. అయితే దీన్ని ఇతర నిఘా వర్గాలకు అందించకపోవడంతో భద్రతపై రాజీపడినట్లు తేలిందని పేర్కొంది. సీఐఏ నిర్లక్ష్యంపై మీడియాలో వచ్చిన వార్తలపై ఒబామా తన ప్రకటనలో ప్రస్తావించారు. 'ఈ ఉదంతం నుంచి మనం గుణపాఠం నేర్చుకుని వెంటనే లోపాలు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మన భద్రత ప్రమాదంలో పడింది. మన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది' అని పేర్కొన్నారు.

ముతలబ్‌ గురించి అందిన సమాచారాన్ని సరిగ్గా పంచుకుని ఉంటే అమెరికా విమానాల్లో ప్రయాణించకుండా అతనిపై నిషేధం విధించే అవకాశముండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. విమానం పేల్చివేత యత్నానికి ముందే తమ వద్ద.. ఓ నైజీరియన్‌తో అల్‌ కాయిదాకు సంబంధమున్నట్లు తెలిపే అరకొర సమాచారం ఉండిన విషయం వెలుగు చూసిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అల్‌ కాయిదా కుట్రలు, సెలవు రోజుల్లో భారీ దాడుల గురించిన వివరాలు అందులో ఉన్నాయని ఓ నిఘా అధికారి చెప్పాడు. ఇదిలా ఉండగా, ముతలబ్‌ను లండన్‌లోని అల్‌ కాయిదా నెట్‌వర్క్‌ రిక్రూట్‌ చేసుకుని, యెమెన్‌లో ఉగ్రవాద శిక్షణ ఇప్పించిందని నిఘా వర్గాలను ఉటంకిస్తూ 'ద టైమ్స్‌' పత్రిక తెలిపింది. ముతలబ్‌ ఉదంతం నేపథ్యంలో షికాగోలోని ఒహేర్‌ విమానాశ్రయంలో వచ్చే ఏడాదిలో ప్రయాణికులను పూర్తిస్థాయిలో తనిఖే చేసే యంత్రాలను(బాడీ స్కానర్లు) ఏర్పాటు చేయనున్నారు.

యెమెన్‌లోని అల్‌ కాయిదా ఉగ్రవాదులపై దాడికి అమెరికా సన్నాహం:

విమానం పేల్చివేత యత్నం యెమెన్‌లోని అల్‌ కాయిదా శాఖ పనేనని తేలడంతో అమెరికా ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది. యెమన్‌లోని అల్‌ కాయిదా స్థావరాలపై దాడులు చేయడానికి అమెరికా ఆ దేశ ప్రభుత్వంతో కలిసి ప్రణాళికలు రచిస్తోందని అధికారులను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ తెలిపింది.

ఇది నిఘా వైఫల్యమే, ముతలబ్‌ ఉదంతంపై ఒబామా:

వాషింగ్టన్‌: అమెరికా నిఘా వ్యవస్థల్లో కొన్ని పొరబాట్లు జరుగుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒప్పుకున్నారు. అమెరికా విమానం పేల్చివేతకు విఫలయత్నం చేసిన అల్‌ కాయిదా కుట్ర గురించి సమాచారమున్నా దాన్ని ఛేదించకపోవడం వ్యవస్థాగత వైఫల్యమేనని అంగీకరించారు. ఇకపై ఇలాంటి పొరబాట్లకు ఉన్నతాధికారులు బాధ్యులను చేస్తామన్నారు. క్రిస్మస్‌ రోజున విమానం పేల్చివేతకు అల్‌ కాయిదా ఉగ్రవాది ముతలబ్‌ చేసిన యత్నంపై రెండు నివేదికలను ఒబామా శుక్రవారం వైట్‌హౌస్‌లో విడుదల చేశారు.

ఆ సందర్భంగా మాట్లాడుతూ 'విమానం పేల్చివేత కు అరేబియన్‌ ద్వీపకల్పంలోని అల్‌ కాయిదా విభాగం పన్నిన కుట్రపై మన నిఘా వర్గాలు సరిగ్గా స్పందించలేదు. ఇది వ్యవస్థాగత వైఫల్యం' అని అన్నారు. తాను ఎవరినీ నిందించాలనుకోవడం లేదని, జరిగిన పొరబాట్లను సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నానని అన్నారు. అరేబియా ద్వీపకల్పం లోని అల్‌ కాయిదా ఉగ్రవాదులను నిర్మూలించడంలో తమ గూఢచర్య సంస్థ సీఐఏ చురుగ్గా వ్యవహరించలేదని విమర్శించారు.


2009, క్రిస్మస్ రోజున అమెరికా విమాన పేల్చివేత ప్రయత్నసంఘటన వ్యవహారంలో అమెరికా ఇంటలిజెన్స్ విభాగాలు విఫలమైయ్యాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పై వార్తాంశాల నుండి తెలుస్తోన్న విషయం ఏమిటంటే - సిఐఏ అమెరికా పట్ల నిబద్దతతో పని చేయటం లేదని! అమెరికా, అమెరికనుల శ్రేయస్సు కోసమూ సిఐఏ పనిచేయటం లేదు.

మరైతే... సిఐఏ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

మీరన్నట్టు
ఒక్కవేళ ఈనాడు అబద్దపు పత్రీక అయితే ఇన్ని రోజుల నుంచి మేదటి స్ధానం లో ఏలా కోనసాగుతుంది..
పుర్తిగా స్వంత డబ్బకోటుకుంటున్నా జగాన్ సాక్షి పత్రిక కన్న వేల రేట్లు ఈనాడు మరియు రామెజిరావు గారు ఏంతో నయం.
ప్రజల డబ్బుని ఏవరు వృధ చేస్తున్నారు ,రామెజి రావు మాత్రమే మీకి ఎందుకు కనిపిస్తునారు..

Click here to watch all telugu channels free online , no software , registration needed .total free
http://www.tamil10tv.com/2010/01/watch-telugu-movie-channels-free-online.html

పవన్ గారు,

ఈనాడును, రామోజీరావును విమర్శించానంటే సాక్షిని, జగన్ ను సమర్ధించినట్లు కాదన్నది గమనించగలరు. నా టపాలన్ని చదివితే మీకు ఆ విషయం అర్ధంకాగలదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu