ముందుగా ఒక సూచన. ఈ టపాలో వ్రాసిన అంశాలు ఒక సంఘటనతో నిర్దారణకు వచ్చినవి కావు. కొన్ని వందల సంఘటనలు పరిశీలించి, నిర్దారించుకున్న తరువాతే వ్రాస్తున్నాను.

శ్రీశైలంలో ఉండగా 2003 లో దేవస్థానం వారి గ్యాస్ ఏజన్సీ నుండి మాకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది. అది ఇచ్చేటప్పుడే, అక్కడి నుండి బయటకి బదిలీ చేయబడదు అని చెప్పి ఇచ్చారు. ఇతర ఉద్యోగులకి బదిలీ అవుతుందట గానీ ప్రైవేటు వ్యక్తులకి అలా బదిలీ కాదన్నారు. శ్రీశైలం నుండి బయటకి వెళ్ళే ఉద్దేశం లేదు గనక మేం, ’ఫర్వాలేదు’ అనుకున్నాము. ఇక 2007 లో మా గది కాన్సిల్ చేశాక, మేం శ్రీశైలం నుండి నంద్యాలకు మకాం మార్చేటప్పుడు, అప్పటికే దేవస్థానపు ఉపకార్యనిర్వహిణాధికారి + ఇతర ఉద్యోగులతో అన్నిగొడవలు జరిగాక, ఇక గ్యాస్ కనెక్షన్ బదిలీ గురించి అడగటం కూడా దండగ అనుకున్నాము. సిలిండర్లు, అక్కడ ఇచ్చి డిపాజిట్ వెనక్కి తీసుకుందామన్నా, దేవస్థానంతో లావాదేవీలు కాబట్టి రెడ్ టేపిజంతో తిప్పుకుంటారని తెలుసు. అంతేకాక సిలిండర్లు విలువైనవి, అలభ్యమైనవి. అందుచేత సిలిండర్లు వెంట తెచ్చుకున్నాము. తెలిసిన వాళ్ళ దగ్గర గ్యాస్ తెచ్చుకుంటే పనినడుస్తుంది కదా అన్నది మా అభిప్రాయం. కనెక్షన్ కొనుక్కుంటే సిలిండర్లు అదనంగా ఉపయోగపడతాయి కదా!

2007 లో, నంద్యాలలో ఇల్లు అద్దెకు తీసుకునే లోపల, మా కుటుంబమిత్రుడు ఖాసీం [భయ్యా అని పిలిచేదాన్ని] ఇంట్లో ఉన్నాము. అప్పట్లో, ఓ రోజు సున్నిపెంట గ్యాస్ డీలర్ ఖాసీం ఇంటికి వచ్చాడు. అతణ్ణి ఖాసిం గ్యాస్ కనెక్షన్ల గురించి అడిగాడు. అతడు కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పాడు. మా కోసం తీసుకోమని ఖాసీంని అడిగాము. అప్పుడు మా దగ్గర డబ్బు ఉన్నందున వెంటనే తీసుకుందామని వత్తిడి చేశాము. ఇవాళా రేపూ అంటు వాయిదా వేసాడే గానీ ఆరునెలలైనా తీసుకోలేదు. ఎప్పుడు అడిగినా “ఇప్పుడు మీకు ఇబ్బంది ఏముంది? ఎప్పుడు సిలిండర్ అయిపోతే అప్పుడు మా ఇంటి నుండి తెచ్చేసుకొండి” అనేవాడు.

అప్పటికే అతణ్ణి పరిశీలిస్తున్నాము. శ్రీశైలంలో ఉండగా ఎవరితో ఏం మాట్లాడామో పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. అలాగే మాకు ఎదురయ్యే అనుభవాలని కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళం కాదు. అదీగాక, స్కూలులో మా బిజీ షెడ్యూలురీత్యా అంతగా తీరిక కూడా ఉండేది కాదు. అయితే ఆరునెలలు ఏకధాటిగా, అప్పటికి మిగిలిన ఏకైక స్నేహితులు ఖాసీం కుటుంబాన్ని పరిశీలించటంతో, వాళ్ళు మానుండి సమాచారాన్ని సేకరించటమే గాక, మోటివ్స్ తెలుసుకోవటం, డబ్బు ఖర్చు పెట్టించాలన్న మోటివ్ వంటి చాలాపనులతో పాటు, తమ మీద ఆధారపడేటట్లు చేసుకోవటం కూడా చేస్తున్నారని అర్ధమైంది. ఆ వివరాలలో కొన్నిటిని మీరు గతటపాలలో చదివి ఉన్నారు.

ఈ నేపధ్యంలో 2007 డిసెంబరు ఆఖరి వారంలో ఖాసీం కుటుంబంతో స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్నాము. ఆ ’ఎరా’లో దాదాపు వారానికి రెండుసార్లయినా, ఈనాడు ప్రధాన పేజీలో [లేదా లోపలి పేజీలోనైనా] పెద్దపెద్ద అక్షరాలతో గ్యాస్ సిలిండర్లు అక్రమ, వాణిజ్య అవసరాల కోసం వాడటాన్ని అరికట్టడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పధకాలు అమలులోకి తెస్తుందన్న వార్తలొచ్చాయి. నెంబర్లు వేయటం, తనిఖీలు నిర్వహించటం, కొత్తకనెక్షన్లు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపి వేయటం….. గట్రా. ఇక మా నంద్యాల, కర్నూలు జిల్లా ఎడిషన్ లో అయితే, అది దాదాపుగా రోజు విడిచి రోజు ప్రధాన వార్త అయిపోయింది. నంద్యాల స్థానిక ఆర్డివో ఇంటింటా తనిఖీ కూడా నిర్వహించనున్నారని వార్తలొచ్చాయి. అక్రమ సిలిండర్లని పట్టుకుని సీజ్ చేయటం కూడా జరిగింది.

ఏదేమైనా గ్యాస్ వినియోగదారులు అయోమయానికి గురవ్వడాన్ని గురించి కూడా ప్రధానంగా వార్తలొచ్చాయి. అదే సమయంలో, దాదాపు సంవత్సరంపాటు, ఈనాడు ‘వసుంధర’లో వ్యక్తిత్వ వికాస నిపుణులూ, మామూలు ఫీచర్ రచయితలూ, తరచుగా, స్నేహితులతో ఎలా మెలగాలి, ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కోపంతోనో, ఆవేశంతోనో స్నేహితులతో దెబ్బలాడితే వాళ్ళ స్నేహన్ని ఎలా పునరుద్దించుకోవాలి….. మొదలైన వివరాల గురించి ’టిప్స్’ చెబుతూ ఫీచర్స్ వచ్చేవి. ఒకప్పుడు ఎంతో స్నేహంగా మెలిగి, ఏ కారణంగానైనా అంతరాయం ఏర్పడితే, తిరిగి ఆ స్నేహితులకి చిరునవ్వుతో ఓ ’సారీ’ చెప్పేయాలని, లేదా ఓ పూల గుచ్ఛమో ఓ మిఠాయి డబ్బానో ’సారీ’ తో జోడించి పంపాలని, లేదా వాళ్ళు ఎదురైనప్పుడు ఓ చిరునవ్వు నవ్వాలనీ….. అలా చేస్తే మళ్ళీ మనం వాళ్ళ స్నేహాన్ని స్వాగతిస్తూన్నామని వాళ్ళకు అర్ధమౌతుందనీ, దాంతో వాళ్ళు ఎంతో ఇష్టంగా మనతో మళ్ళీ స్నేహం చేస్తారనీ, స్నేహం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడని ఆస్థి అనీ….. ఇలాగన్న మాట.

నాటకీయంగా…. అలాంటి వార్తాంశాలూ, శీర్షికలూ ఈనాడులో వచ్చిన రోజున, మేము ఏదైనా పని మీద బయటకి వెళ్ళగానే, మా మాజీ కుటుంబ మిత్రుడు ఖాసీం, మేం చిరునవ్వు నవ్వితే వెంటనే స్పందించడానికి అందుబాటులో ఉండేవాడు. నిజం చెప్పాలంటే, ఈనాడు వ్రాతలకీ, మా మాజీ కుటుంబ మిత్రుడి ప్రవర్తనకీ ఉన్న లంకె చూసాకే, మాకు, ఖాసీం అనబడే మా మాజీ మిత్రుడు, రామోజీరావుకీ చాలా విలువైన వాడన్న విషయం అర్ధమయ్యింది. అంతేకాదు, అతడు ఈనాడు విలేఖరి కూడా! ఇక్కడ ఒక కిటుకు ఏమిటంటే అతడు, రామోజీరావు గురించి మాత్రం మాట్లాడే వాడు కాదు. మా ఇష్టాఇష్టాలు, భవిష్యత్తు ఆలోచనలు గట్రా మాత్రం మాట్లాడే వాడు. ఆ కోణంలో పరిశీలించాకే ఖాసీం మాతో చేసిన స్నేహంలోని విశేషాలన్నీ మాకు స్పష్టపడ్డాయి. ఆ విధంగా కూడా గూఢచర్యపు పనితీరు మీద బాగా అవగాహన వచ్చింది. అలాగే ఈనాడు మాతో సంభాషించడమూ అర్ధమయ్యింది.

ఇదెలాగంటే – మనం రోడ్ మీద వెళ్తున్నామనుకొండి. దానిలో మనదృష్టిని ఆకర్షిస్తూ వ్యక్తిగానీ, బొమ్మగానీ మరో ఆంశం గానీ ఉందను కొండి. ప్రక్కనున్న వ్యక్తి దానిని దీక్షగా చూస్తున్నాడనుకొండి. మనం ఓ రోజు పట్టించుకోం. ప్రతీసారి జరిగినా ఓ పదిసార్లు పట్టించుకోం. అదే ఏకంగా పదుల సంఖ్యలో జరిగిందనుకొండి. అనివార్యంగా అది మనం పట్టించుకుంటాం. అప్పుడు ఆ విషయం మనకు అర్ధమౌతుంది గదా! అలాగన్న మాట.

నిజానికి ఈనాడు రామోజీరావు మాతో ఇలా మాట్లాడం ఒక్క పేపరు తోనే కాదు, వ్యక్తుల రూపంలో కూడా ఉంటుంది. సూర్యాపేటలోని మా ఇంటి ఓనరు “నువ్వు చదువుకున్నావు గానీ, తెలివిలేదు. కేసులు పెట్టుకుంటారా, అట్లా కాదు ఇట్లా అని మాట్లాడుకోవాలి కాని…..” [దీని గురించి గత టపాలలో వ్రాసాను] అన్నప్పుడు కూడా మాకు అర్ధం కాలేదు. అప్పటికి మేం స్థానిక కాలేజీ వాళ్ళే ఆమె వెనక, స్థానిక పోలీసు అధికారుల వెనకా ఉన్నారనుకున్నాం.

2005 తర్వాతే మాకివన్నీ బాగా అర్ధమయ్యాయి. 2006 లో ది హిందూ ఎన్.రామ్ ఈనాడు తొలిపేజీలో వై.యస్.ని ఉద్దేశించి, మార్గదర్శి వివాదాల నేపధ్యంలో, "“రామోజీరావు మంచివ్యక్తి. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఏమైనా కావలసి ఉంటే వెళ్ళి మాట్లాడుకోవచ్చు. రామోజీరావు అర్ధం చేసుకుంటారు. అంతేగానీ ఇలా వేధించటం సరికాదు. సమస్యల్ని పరిష్కరించుకునే తీరు ఇదికాదు” అన్నాడు. ఇది చదివిన రోజున మేం ఆశ్చర్యపోయాము. ‘వై.యస్.కి ఉద్దేశించే ఎన్.రామ్ అంటున్నట్లయితే, ఆ సందేశాన్ని గుట్టు చప్పుడు కాకుండా, స్వయంగా కలిసి గానీ, దూతల ద్వారా గానీ చెప్పుకుంటారు గానీ పత్రికా ముఖంగా చెప్పుకోరు కదా?’ అనుకున్నాము. అయితే ఇదే విషయాన్ని మా చుట్టూ ఉండే వారిలో ఎవరో under line చేసారు. ఆ తర్వాత రోజుల్లో…. ’స్వయంగా కలవలేని వారికెవరికో చెప్పుకుంటున్నారన్న మాట’ అనుకున్నాము.

అయితే…. ఈనాడు రామోజీరావు, వై.యస్. [అతడు బ్రతికి ఉన్న రోజుల్లో లెండి] దూరదర్శన్ వార్తల్లోనూ మాకేం చెప్పదలుచుకున్నారో తర్వాత్తర్వాత మాకు బాగా అవగాహన వచ్చింది.

ఎలాగంటే….. వై.యస్. మంత్రులతోనో, ఉన్నతాధికారులతోనో, సచివాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు టీవీ కెమెరా ప్రత్యేకంగా అతడి నల్లని చెప్పులని క్లోజప్ లో చూపేది. [మాకు దూరదర్శన్ మాత్రమే వస్తుంది. దాన్ని రిఫర్ చేస్తున్నాను] ఒకోసారి బహిరంగ సభల్లో, వేదిక మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చొని చెప్పు ఊపుతుండే వాడు. ఓసారి అతడి ప్రక్కన కూర్చున్న మరో రాజకీయనాయకుడు, వంగి, వై.యస్.కి ఏదో చెబుతుండగా, ఇతడు వేసుకున్న కాలు మీద కాలు, సదరు రాజకీయ నాయకుడి ముఖం మీదికి వచ్చింది. అయినా వై.యస్. చెప్పు ఊపటం మానకపోగా విశాలంగా, చిరునవ్వు నవ్వుతున్నాడు. అది మాకు చాలా odd గా అన్పించింది. చిత్రమేమిటంటే ఆ ఫోటోలు తర్వాత ఈనాడులో ప్రచురింపబడేవి.

ఇలాంటి విజువల్స్ పదేపదే చూడగా, హఠాత్తుగా ఓరోజు ఫ్లాష్ అయ్యిందేమిటంటే, చెప్పులు చూపించి ’చెప్పు చెప్పు’[tell me] అంటున్నారని! అప్పటికి మేం ముమ్మరంగా బ్లాగింగ్ చేస్తున్నాం. మొదట్లో అంత స్పష్టంగా అర్ధం కాకపోయినా…. క్రమంగా, ’వాళ్ళ’intuition మాకు అర్ధమయ్యింది. మరోమాటలో చెప్పాలంటే అది మాకు అర్ధమయ్యేదాకా continue చెయ్యబడుతుంది. Repeat చెయ్యబడుతుంది.

మరి మాకు అర్ధమయ్యిందో లేదో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మాకు ప్రక్కనున్న వారు దానిమీద మాట్లాడితే మన అభిప్రాయం చెబుతాం. ఆ విధంగా అది మాకు under line చేయబడుతుంది. అంతేగాక మా అభిప్రాయం కూడా తమకి తెలుస్తుంది. దాన్ని బట్టి తరువాత కంటిన్యూ చేయవలసిన విషయాలు ఉంటాయి. ఇలాంటివి చేయటానికి పొరుగు వాళ్ళో , ఖాసీం లాంటి స్నేహితులో, రామోజీరావుకు ఉపయోగపడతారు.

మరో విధంగా చెప్పాలంటే….. ఒక గదిలో పాము ఉందనుకుందాం. అది బయటికి పోవటానికి దారి వెతుక్కుంటుంది. ఏ దారీ లేదనుకొండి. మనం ఏ తలుపు తెరిస్తే అటునుండే బయటకి పోతుంది. అలాగే…. మా ఉద్యోగ ప్రయత్నాలో, మా ఉపాధి ప్రయత్నాలో ‘అడ్డం గొట్టటం’ ద్వారా దారులన్ని మూసివేస్తారు. వాళ్ళు తెరచిన ద్వారం నుండి మాత్రమే బయటికి రావాలి. లేదా ఆకలితో ఉండాల్సిందే. ఈ విధంగా ఆకలి తంత్రం ఉపయోగిస్తారు. ఈ విధంగా ఒక మనిషిని పరోక్షంగా, తమకి అనుకూలమైనట్లు నడపవచ్చు.

నిజానికి ఈ రకపు భాష మాకు అర్ధమయ్యాకే, అదే ‘కీ’ తో లేదా ‘పాస్ వర్డ్’ తో…. వై.యస్.కీ, ఈనాడు రామోజీరావుకీ మధ్య నడిచిన రాజరామోజీల యుద్ధ నాటకాన్ని విశ్లేషించగలిగాము. ఇప్పుడు నడుస్తున్న, ఈనాడు – సాక్షిల పరస్పర ఆరోపణల యుద్ధాన్ని పరిశీలించగలుగుతున్నాము.

ఇలా ’చెప్పు చెప్పు’ అంటు చెప్పు చూపిన వై.యస్., ఏ కాలి చెప్పు చూపిస్తూ ఆ సంకేతాన్నిచ్చాడో, సరిగ్గా అదే కాలు, సెప్టెంబరు 2, 2009 నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తెగి, చెట్టుదుంగపై పడింది. ఆ ఫోటో ఈనాడు, వార్త పత్రికలలో బాక్సుకట్టి ప్రచురించాయి.

ఈ సందర్భంలో మరో విషయం కూడా చెప్పాలి. 2000 సంవత్సరం ద్వితీయార్ధంలో….. అప్పటికి మేం ఎంసెట్ కుంభకోణం మీద చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు ఇచ్చి ఉన్నాము. ఓరోజు ఈనాడులో, ప్రధాన పేజీ పతాక శీర్షికలో, నెహ్రు జువాజికల్ పార్కులో ’సాకీ’ అనే చిరుతపులికి, బ్రతికి ఉండగానే తోలు వలవబడిందన్న వార్త వచ్చింది. అది రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దాదాపు 10 రోజుల పాటు ఈనాడు, ఆ వార్త మీద రకరకాల శీర్షికలతో, అనేక విశేషాలు వ్రాసింది. అచ్చం మొన్న వై.యస్. మరణించినప్పుడు అనేక రకాలుగా అతణ్ణి ‘దేవుణ్ణి’ చేసినట్లన్న మాట!

నిజానికి అప్పటికి మాకు, మా జీవితాల్లో గూఢచర్యం నిండి ఉందనీ తెలీదు. రామోజీరావు ప్రమేయాన్నే ఊహించలేని చోట నెం.10 వర్గాన్ని గానీ, నెం.5 వర్గాన్ని గానీ ఏం ఊహించగలం? మెదళ్ళతో యుద్ధం గురించి ఇంకేం ఊహించగలం? అయితే, అప్పటికి మాత్రం విపరీతమైన ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే – జూలో క్యూరేటర్ నివాసభవనం ఉంటుంది. ఎన్నో అరుదైన జంతువులని ఉంచుతారు గనక, జూ చుట్టూ ఎత్తైన గోడ, దానిపైన సెక్యూరిటీ టవర్సు ఉన్నాయి. రాత్రిపూట సైతం గస్తీ ఉంటుంది. పైగా పులి గాండ్రింపు దాదాపు 5 మైళ్ళు వినిపిస్తుంది. అటువంటిది, బ్రతికి ఉండగా పులి చర్మం వలుస్తుంటే, అది చూసి మిగిలిన పులులూ అరుస్తుంటే లోపలే నివసించే క్యూరేటర్ కి గానీ, సెక్యూరిటీ గార్డులకి గానీ దృష్టికి రాదా? అందునా అంత భీభత్సాన్ని చూసిన మిగిలిన పులులు, బెంగతో కొన్ని రోజులపాటు ఆహారం స్వీకరించలేదని కూడా, ఈనాడు ఆ తర్వాత వారంరోజుల లోపల వ్రాసింది.

అంత సంచలనం కలిగించిన ఆ వార్త, తర్వాత రోజుల్లో చాలా మామూలుగా మాసిపోయింది. ఏ ఎంక్వయిరీ లేదు. ఏ నిజమూ వెలుగులోకి రాలేదు. ఎవరు ’సాకీ’కి తోలు వలిచారో, ఎందుకు వలిచారో…. ఏదీ ఎవరికీ తెలీదు. చాలా మామూలుగా….. దేశ ప్రధానుల హత్యలు ఎంత సంచలనం కలిగించినా ఎంతో మామూలుగా ఆరిపోయినట్లు….. ఇదీ అలాగే అయిపోయింది. అప్పట్లో అది మాకసలు అర్ధం కాలేదు గానీ, తర్వాతి కాలంలో మాకు అర్ధం చేసింది ఏమిటంటే – పులి మనదేశ జాతీయ జంతువు. బ్రతికి ఉండగానే దాని చర్మం వలిచినట్లు – మాకో , దేశభక్తి కలిగిన మాలాంటి వారికో, ఈనాడు రామోజీరావు, చంద్రబాబూ ’తాట వొలుస్తామని’ హెచ్చరిక అన్నమాట. అప్పటికి నెం.5 వర్గం మాకు తెలియదు గానీ, అందులోని వారికెవరికో కూడా [పీవీజీతో సహా] ఇలాంటి హెచ్చరికలు ఇచ్చి ఉంటారని తర్వాత అనుకున్నాము.

దాని ’సువర్ణముఖి’ అన్నట్లు, పాపం, తమ గూఢచర్యపు పైకారణాలు [over leaf reasons] అన్నీ నిష్ఫలం అయిపోయి, వారి అసలు రూపాలు బయటపడుతున్నాయి. నోరులేని మృగాలని, పశుపక్షుల్నీ, ప్రకృతినీ వెతల పాలు చేస్తున్నందుకే…. వాళ్ళు మనిషికి శతృవులు కాదు, మానవత్వానికే శతృవులన్నాను.

ఇక “బ్లాగు డిలీట్ చేయ్. ఢిల్లీ వెళ్ళి సోనియాని కలిసి, మీ దగ్గర ఇంకా ఏమేమి సమాచారం ఉందో అదంతా చెప్పెయ్!” అన్న వత్తిడి మామీద ఎలా తెస్తారో చెప్పాలంటే – ఓ సంఘటన వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

!!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu