2009 ఎన్నికలకు ముందు, రాష్ట్రముఖ్యమంత్రి 2009 జనవరి, ఫిబ్రవరి నెలల్లో, క్రమంగా సన్నబియ్యం ధరలు ఊపందుకుంటున్న సమయంలో, ఆ విషయమై గగ్గోలు రేగుతున్న సమయంలో… ఇదే విషయమై ప్రశ్నించిన విలేఖర్లతోనూ, ఇదే విషయాన్ని దృష్టికి తెచ్చిన ఇతరులతోనూ సన్నబియ్యంధర 20/- రూ.లకి మించి ఎక్కడా లేదని, కావాలంటే తాను ఏ దుకాణంలోనైనా ఇప్పిస్తానని పదేపదే ఉద్ఘాటించాడు. [అచ్చం ఈరోజు దుడ్డుబియ్యం ధర కేజీ 20/- రూ. లు ఉందని తోటి మంత్రులు అంటే సూరీడుని పిలిపించి ’కృష్ణ నగర్ లోని దుకాణం నుంచి కేజీ. 16.50 చెప్పి 15.50 రూ.కి ఇచ్చారని’ చెప్పించినట్లుగానే! కావాలంటే ఈ మంత్రులందర్నీ అదే దుకాణం తీసికెళ్ళి కొనిపించమన్నట్లుగానే] సదరు ముఖ్యమంత్రే కాదు, నాటి పౌరసరఫరాల మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా పదేపదే సన్నబియ్యం ధర 20/-రూ. కి మించి లేదని ఢంకా భజాయించేవాడు.

సరే ఏమంటారు! సాక్షాత్తూ జనం అప్పటిదాకా సన్నబియ్యం కేజీ 27,28 రూపాయలకు కొంటున్నా, మొండిగా ముఖ్యమంత్రి ధర 20/-రూ. మించి లేదంటే నోర్మూసుకుని ఊర్కున్నారు. ఇక ఇప్పుడు వంతు దుడ్డుబియ్యం దగ్గరికి వచ్చింది. అయితే ఇందులో ఓ ’పచ్చినిజం’ ఉంది. అప్పుడు కేజీ సన్నబియ్యం 18 నుండి 28 కి పాకగా ముఖ్యమంత్రి “ఠాఠ్! అంతా అబద్ధం. ఆ రెండు పత్రికలూ, ప్రతిపక్షాలూ పనిగట్టుకుని అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని ప్రక్కదారి పట్టిస్తున్నాయి. భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. సన్నబియ్యం ధర కేజీ 20/- రూ. మించి ఎక్కడా లేదు” అని గర్జించడం లేదా “సన్నబియ్యం కేజీ 20/- కి మించి అమ్మితే ఊరుకోం” అంటూ గద్దించటం చేశాడు.

అదే వ్యక్తి ఇప్పుడు సన్నబియ్యం ధర 35/- రూ. లు దాటిందన్న విషయం మౌనంగా అంగీకరిస్తూ, “దుడ్డుబియ్యం తినండి. రాగి చంకట చక్కని పౌష్ఠిక ఆహారం. అది తినండి. ఖర్చు తగ్గుతుంది” అంటూ సలహాలిస్తున్నాడు. పైగా ఎలా వంటచెయ్యలో కూడా నేర్పుతున్నాడు. తాను వారానికి ఓ రోజు తింటాడట. రుచిగా ఉంటుందట. రోజూ తినమనండి. [మేము కొన్ని సంత్సరాల పాటు తిన్న అనుభవంతో చెప్తూన్నాము. దుడ్డుబియ్యం అన్నపురుచి, సన్నబియ్యపు అన్నపు రుచితో పోల్చి మాట్లాడమనండి.]

ఈ జనవరి, ఫిబ్రవరిల్లో సన్నబియ్యం ధర 20/- రూ. కి మించి 28/- రూ. దగ్గర ఉందంటే ‘ఠాఠ్!’ అన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు గమ్మున దొడ్డుబియ్యం తినండి. ధర 15.50 పైసలే అంటున్నాడు. అయితే మరి సన్నబియ్యం ధర ఎంత ఉందని ఒప్పుకుంటున్నట్లు? బ్లాక్ మార్కెట్ ని చావతన్ని, ధరల్ని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే, ప్రజల్ని సర్ధుకుపొమ్మని, దుడ్దుబియ్యం తినమని, కందిపప్పు బదులు అలసందలూ, ఉలవలూ తినమని చెబుతున్నాడు. తోటకూర పప్పుని కందిపప్పుతో గాక అలసందలతో చేసుకోవాలన్న మాట. అన్నప్రాసన తదనంతరం, పసిపాపలంతా తినేది పప్పన్నమే. అది అలసందలతోనో లేక బఠాణీలతోనో పెట్టాలన్న మాట. తల్లిపాలకు ప్రత్నామ్నాయంగా డబ్బాపాలు ఎప్పుడు, ఎలా పరిణమించాయో తెలియదు గానీ, ఇందిరాగాంధీ హయాంలో “ఓ స్త్రీ పరిపాలనలో పసిపిల్లల పాలడబ్బాలకూ కరువొచ్చింది” అంటూ పత్రికలన్నీ తెగ దుమ్మెత్తిపోసాయి. మరి ఇప్పుడు, చిన్నారులకి పప్పన్నం కరువయ్యే పరిస్థితులు ఎదురైతే, ప్రభుత్వాన్ని ముద్దుముద్దుగా ఎండగడుతున్న పత్రికలన్నీ, ఏకవ్యక్తిగా ఇందిరాగాంధీని బాధ్యురాలిని చేసినట్లు, రాజశేఖర్ రెడ్డినో లేక సోనియాగాంధీనో లేకపోతే హీనపక్షం మన్మోహన్ సింగ్ నో ఎందుకు ఏకవ్యక్తిగా బాధ్యుల్ని చేయటం లేదు? ఎందుకంటే, ఆనాటి ఇందిరాగాంధీ కుట్రకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలయ్యె. ఈనాటి సోనియాగాంధీ, రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగులు కుట్రకు మద్దతుగా సహకరిస్తున్న అనుచరులయ్యె.

ఇక ఈ రాజశేఖర్ రెడ్డి 2009 జనవరిలో సన్నబియ్యం ధర ఎక్కువ ఉందంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒప్పుకుంటూ, దుడ్డుబియ్యం తినమంటున్నాడు. రేపెప్పుడో దుడ్డుబియ్యం ధరా ఎక్కువే ఉంది. కాబట్టి ఒకపూట ఉపవాసం[పస్తులు] ఉండమంటాడు. ‘నేను ఉంటున్నాను. మా పిల్లలని ఉండమంటున్నాను’ అంటాడు. ‘ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బులకు డబ్బులు ఆదా!’ అంటాడు. ‘ఏకాదశికి ఉపవాసం ఉండటం లేదా, రంజాన్ కు ఉండటం లేదా?’ అన్నా ఆశ్చర్యం లేదు. ఇంకా ముదిరితే ‘ఆకలి చావులు సోమాలియాలో లేవా?, ఆఫ్రికాలో లేవా?. ఇది ప్రపంచమంతా ఉన్న సమస్య. ఇప్పటికిప్పుడు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది?’ అన్నా ఆశ్చర్యం లేదు.

ఒకపోలిక గమనించండి. ఆధునిక సాంకేతిక పరికరాలు, జ్ఞానమూ, పోలీసుల కంటే టెర్రరిస్టులకి ఎక్కువ అందుబాటులో ఉంటాయి. కాబట్టే బాంబుదాడుల్ని ముందుగా పసికట్టి ఆరికట్టలేని పోలీసు యంత్రాంగం, బాంబులు పేలాక, క్షతగాత్రుల్నీ ఆసుపత్రులకీ, మరణించిన వారిని మార్చురీకి తరలించడంలో తలమునకలౌతూ ఉంటుంది. అంతగా పోలీసు వ్యవస్థ కంటే టెర్రరిస్టులు ఓ పది అడుగులు ముందుంటారు. కాబట్టే టెర్రరిస్టుల వెనుక మాఫీయా ఉందంటాం. ఐ.ఎస్.ఐ. వంటి విదేశీ వ్యవస్థలున్నాయంటాం. పాకిస్తాన్ వంటి టెర్రరిస్టు దేశాలున్నాయంటాం.

అలాగే ప్రభుత్వ నిఘా అధికారులు, పౌరసరఫరాల శాఖ ఇన్స్ స్పెక్టర్లు, వీరందరి కంటే నల్లబజారు వ్యాపారులకి ముందుస్థుగా సమాచారం తెలుస్తోంది. ప్రక్కరాష్ట్రాల్లో సైతం లక్షలాది టన్నుల పప్పులూ, ఇతర సరుకులూ నిల్వచేయగల ’ముందు జాగ్రత్తలు’ పడుతున్నారు. వారిని అధికార యంత్రాంగం గానీ, రాష్ట్రప్రభుత్వం గానీ ఏమాత్రం నిరోధించలేక పోతోంది, నియంత్రించలేక పోతోంది. అంటే అర్ధం ఈ నల్లబజారు వ్యాపారుల వెనుకా మాఫియా వంటిది ఉందనేగా?

అలాగాక, నల్లబజారు వ్యాపారులు, ప్రభుత్వం కంటే సమర్ధులై, పకడ్భందీగా, యధేచ్ఛగా ధరల పెరుగుదల సృష్టిస్తున్నారంటే ప్రభుత్వం విఫలమయిందనాలి కదా? లేదా నల్లబజారు వెనుకా మాఫియా వంటి వ్యవస్థ ఉందనాలి? లేక అసలు రెండింటినీ నడుపుతోంది ఒకటే మాఫియా వ్యవస్థ అనాలా? ఇక్కడో మెరుపు తునక ఏమిటంటే 2009 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ముఖ్యమంత్రితో జరిపిన మీటింగ్ లో అధికారులు కొందరు ’సన్నబియ్యం కిలో 25/-రూ. లుంటే పెద్దధరేం కాదు. కొనుక్కోవచ్చు’ అని ముఖ్యమంత్రికి అప్పట్లో సలహాలిచ్చినట్లు పత్రికలన్నీ వ్రాసాయి.

ఈరోజు ధరలు తగ్గించలేని, తగ్గంచని ముఖ్యమంత్రి సన్నబియ్యం బదులు దుడ్డుబియ్యం, కందిపప్పు బదులు బఠాణీలు తినమంటున్నాడు. రేపు మంచినీళ్ళు కొనలేక పోతే ఉప్పునీళ్ళు తాగమంటాడు. EVM లు చేతుల్లో ఉండగా తొక్కలో జనం ఏంచేయగలరన్న ధీమా కాబోలు!

నిజానికి పైకి ఎంతో సరళంగా కనబడుతున్న EVM విషయంలో, లోతుగా పరిశీలిస్తే ఎంతో సంక్లిష్టత కనబడుతుంది. అయితే ఇది ఎంత సంక్లిష్టమైనదో అంత ఆసక్తికరమైనది కూడా! ఈ ఉపోద్ఘాతం కట్టిపెట్టి సూటిగా విషయం వివరిస్తాను. 2009 ఎన్నికలకు ముందు [దాదాపు కొన్ని నెలలకు ముందు] రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఓటమి ఖాయం అన్న అభిప్రాయానికి వచ్చేసింది. పైకి ఎన్ని డాంభికాలు పోయినా, మాటల్లో ఎంత అతిశయం చూపించినా ’ఓటమికి సిద్దపడినతనం’ చేతల్లో ప్రస్ఫుటంగానే ప్రకటిత మయ్యింది. అదే 2009 జనవరి, ఫిబ్రవరిల్లో అధికధరల గురించి బండగా మొండిగా వాదించేందుకు సంకోచపడకుండా చేసింది. ‘ప్రతిపక్షాలు అబద్ధమంటాయి తాము నిజమంటారు. లేదా ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల పత్రికలు అవునంటాయి. తామూ, తమ పత్రికలూ కాదంటారు. అంతే. ఎంతో చక్కని ద్వంద్వం సృష్టించి ఎంచక్కా ఆడుకోవచ్చు. అదే బ్రహ్మాండమైన ఎన్నికల స్టంటు’ అనుకున్నారు. దాంతో అటు కేంద్రప్రభుత్వమూ అలాగే చేతులు దులిపేసింది. ‘ధరలు రాత్రికి రాత్రి తగ్గించటానికి తన చేతిలో మంత్రదండమేదీ లేదని’, ఆనాటి కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం తెగేసి చెప్పాడు. అంతేకాదు ‘ప్రపంచమంతా ధరలు పెరిగాయి. అదేదో మనదేశంలో మాత్రమే జరిగిన దారుణం అన్నట్లు గగ్గోలు చేస్తారేమిటంటూ’ చికాకు కూడా పడ్డాడు. అదే బాటలో రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ఆర్ధిక మంత్రి రోశయ్యా కూడా నడిచారు.

ఇక రాష్ట్రంలో అయితే ’ఖచ్చితంగా తాము తిరిగి అధికారంలోకి రాము. రాబోము’ అన్నధీమాతో, వచ్చేవాడి చావు వచ్చేవాడు ఛస్తాడన్నట్లు ఇబ్బడిముబ్బడిగా తెల్లరేషన్ కార్డులూ, ఆరోగ్యశ్రీ కార్డులూ, ఇందిరమ్మ ఇళ్ళు అవకతవకలతో సహా, భారీసంఖ్యలో జారీ చేసారు. అంతేకాదు ధరల నియంత్రణ గురించి కనీసం పట్టించుకోను కూడా లేదు. మామూలుగా పప్పులూ, ఇతర దినుసుల ధర నియంత్రించుకునేందుకు ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసి నిల్వచేస్తుంది. ధరలు పెరిగినప్పుడు మార్కెట్లోకి విడుదల చేసి ధరలు దిగివచ్చేటట్లు చేస్తుంది. ఎటూ ఓడిపోవటం ఖాయం అన్న అభిప్రాయంతో, అప్పుడు రాజశేఖర్ రెడ్డి బేఫీకర్ గా మార్కెఫెడ్ ని కొనుగోలు చెయ్యమని ఆదేశించలేదు.

దానికి తగ్గట్లుగానే 2009 మార్చి 19 వరకూ రకరకాల స్ట్రాటజీలు నడిచాయి. సి.ఐ.ఏ. ఛీప్ భారత్ పర్యటన తర్వాత హఠాత్తుగా సీన్ మారిపోయి అందరూ కాంగ్రెస్ ని ఏకాకిని చేసారు. దాని అధినేత్రి సోనియాగాంధీని ధిక్కరించి చూపారు. అయినా అప్పటికి EVM లని Tamper చెయ్యటం అన్న Assignment తమకి వస్తుందని గానీ, తిరిగి తామే అధికారంలోకి వస్తామని గానీ, కేంద్రనుండి రాష్ట్రందాకా అధికార పక్షంలోని వారెవరికీ ఊహ కూడా లేదు. తీరా ఎన్నికలప్పుడు అదే Assignment [అది ఎంత ఆత్మహత్యా సదృశ్యమో కాలం ఇంకా పరిపూర్ణంగా నిరూపించగలదు] వచ్చేసి గెలిచి కూర్చున్నారు.

పూర్తిగా గూఢచర్యం మొత్తం, నకిలీ కణిక వ్యవస్థ మాత్రమే నడుపుతున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వ్యవహారమంతా నల్లేరుబండి మీద నడకలా ఉండింది. కాబట్టే దశాబ్ధాల ముందుగానే పధకరచనలు చెయ్యగలిగారు, వెంట్రుక వాసి తేడా లేకుండా అమలూ చేయగలిగారు. వివిధ దేశాధ్యక్షుల, దేశ ప్రధానుల హత్యల వరకూ నిరాఘాటంగా చెయ్యగలిగారు. ఎప్పుడైతే నకిలీ కణిక వ్యవస్థని గుర్తించి నెం.5 వర్గం ఏర్పడిందో, ఎప్పుడైతే ఆయుధాలతో గాక మెదళ్ళతో యుద్ధం చెయ్యటం మొదలయ్యిందో, అప్పటి నుండి పాపం, నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ, నెం.10 వర్గానికి కాలమాన పరిస్థితులని బట్టి ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మార్చుకోవటం తప్పలేదు. కాబట్టే భారత్ లో 2009 ఎన్నికలలో EVM ల Tamper అన్న Assignment అమలుచేయవలసి వచ్చింది. గెలిచి అధికారంలోకి రావలసి వచ్చింది. దాంతో, రాష్ట్రంలో ఇక ఇప్పుడు బోగస్ కార్డుల ఏరివేత పేరుతో బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా! ఏవీ ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రసంగాల్లో ఆరోగ్యశ్రీని ఉటంకిస్తూ “కుయ్ కుయ్ కుయ్” మంటూ 108 వాహనాలు వస్తోన్నాయన్న అభినయాలు?

అంతేకాదు, గెలవబోమన్న అభిప్రాయంతో ధరల సమస్యని పట్టించుకోలేదు. గెలిచాక గూఢచార సమాచారాన్ని కొనుగోలులు చేసుకోవటానికి డబ్బే అవసరమో లేక సెజ్ ల వంటి అక్రమ రాబడి మార్గాలు అడుగంటాయి గనుక బకాసుర ఆకలికి జనం నోటిదగ్గర కందిపప్పూ, చింతపండే కనబడ్డాయో గానీ, ఇక బ్లాక్ మార్కెట్ కి ‘శ్రీరాజరక్ష’ లభించింది.

ఈ నేపధ్యంలో ఇది ప్రభుత్వమనీ, ఇంకా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందనీ అంటున్న వారూ, రాజ్యాంగ భక్తులమంటున్న వారూ తమని తాము కాపాడు కోవలసిందే!

’అంతర్జాతీయంగా అన్నీచోట్ల అన్ని వస్తువుల ధరలూ పెరిగాయి. ఏంచేస్తాం!’ అంటూ చేతులు దులిపేస్తున్న ప్రభుత్వం, పండుగ సీజన్లలో స్పెషల్ బస్సుల పేరిట సిటిబస్సుల్ని సైతం దూరప్రాంతాలకు తిప్పుతూ బస్సు ఛార్జిలతో మోత మోగించే ప్రభుత్వం, సెజ్ ల పేరున భూముల్ని, మరో పేరుతో ప్రభుత్వరంగ సంస్థలనీ, ఇతర ఆస్థుల్ని అమ్ముకోగలిగిన రోజుల్లో ధరల్ని కొంచెం చూసీ చూడనట్లూరుకుంది. ఇప్పుడిక జనం నోటి దగ్గరి తిండి కూడా లాక్కోకపోతే మరి డబ్బెలా కూడబెట్టటం? ఎంతగా కూడబెట్టి, చక్రం తిప్పకపోతే, స్విస్ బ్యాంకులు ‘ఖాతదారుల పేర్లు వెల్లడించటం కుదరదు’ అని తేగేసి చెప్పగలుగుతాయి?

ఈ నేపధ్యంలో ఒకే దేశం, ఒకే చట్టం కావాలి అంటూ కలలు కంటూ, కలవరిస్తూ బ్రతకగల అవకాశం ఉందా? ఆనాడు బ్రిటీషు వాళ్ళ దోపిడికి వ్యతిరేకంగా పోరాడమంటూ బాపూజీ ‘Do or Die’[’పోరాడు లేదా మరణించు’] అన్నాడు. చూడబోతే సరిగ్గా ఇప్పుడు మనము అదే స్థితిలో ఉన్నట్లున్నాము. పేరుకు మాత్రం ప్రజాస్వామ్యం! నడుస్తోంది ఆనాటి దోపిడే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

అమ్మ ఒడి గారు, బయట కన్పించే పరిస్థితుల్ని, వెనుక జరిగే కుట్రలను, ప్రజాస్వామ్యయుతంగా గెలిచామని విర్రవీగేవారు ప్రజలకు చేస్తున్న మోసాలను తలుచుకుంటే అసహ్యమేస్తోంది. చాలా వాస్తవిక దృక్కోణంలో రాస్తున్నారు. ధన్యవాదాలు.

వై ఎస్ కథ సమాప్తం ;;
నీ పాపం పండెను నేడు డడ్డ డాయ్..వై ఎస్ హెలీక్యాఫర్ పేలిపోయి చచ్చాడంట. నాయాలు.

What u said 1000% correct madam

@నల్లమోతు శ్రీధర్ గారు,

చాలా రోజుల తరువాత వ్యాఖ్య వ్రాసారు. నెనర్లు.

***
@అజ్ఞాత గారు,

అప్పుడే, వై.యస్. పోయాడని నిర్ణయించేసారా? అయినా ఒకవ్యక్తి చచ్చిపోతే అతడి కథ సమాప్తం అవుతుంది గానీ, సమస్య సమాప్తం కాదు కదండి!

***
@స్నేహితుడు గారు,

వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు.

మీరు చెప్పింది కరక్ట్ అండి.

ఇంతకీ నెం.5 వర్గం ఎవరంటారు ?

well written

eagerly waiting for next post

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu