పివీజీ ప్రారంభించిన మెదళ్ళతో యుద్ధం పర్యవసానంగా, ‘తాను ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తున్న గూఢచార వలయం, నకిలీ కణికవ్యవస్థలో కీలక వ్యక్తిని కాదని, తాను చాలా చిన్న స్థానిక పత్రికవాణ్ణనీ’ అనే ప్రయత్నంలో భాగంగా, తానే స్వయంగా స్ర్కిప్టు ఇచ్చి మరీ, రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేత రామోజీరావు ’మహా వేధింపులూ’, కోర్టుగుమ్మాలు ఎక్కిదిగడాలూ పడ్డాడు.

నిజానికి తాను ‘చిన్నవాణ్ణి’ అన్నముసుగు రామోజీరావు ఇందిరాగాంధి హయాంలో మరింతగా వేసుకునేవాడు. పరిస్థితులన్నీ సమకూడి, సర్వజగత్తూ తమ నకిలీ కణిక వ్యవస్థ గుప్పిటలోకి తెచ్చుకునేదాకా, తమ అస్తిత్వాన్ని వెలువరించుకోకుండా ఉండేందుకు ఆ స్ట్రాటజీ అనుసరించే వాళ్ళు. అందునా అప్పటికే చైనా యుద్ధానంతరం కుట్రని అనుమానించిన భారతదేశం పట్ల నిబద్దత గల ముందటి తరం, తమ తర్వాతి తరాన్ని అప్రమత్తం చేసింది. భారత నిఘాసంస్థలు ఆ విషయమై పోరాటస్ఫూర్తితో ఉండేవి. ఆ కసికే రామోజీరావు, నకిలీ కణికవ్యవస్థా, మీడియా అప్పట్లో సి.బి.ఐ.ని అది ఏప్రిల్ 1 న స్థాపించబడిందనీ, ’All fools day’ రోజున స్థాపించ సంస్థ అనీ జోకులేసే వాళ్ళు. సిబిఐ పట్లే అంతకసి ఉందంటే, ఇక నిఘా సంస్థల మీద ఇంకెంత కసీ, కోపం ఉండి ఉంటాయో ఊహించవచ్చు. అప్పట్లో ఇందిరాగాంధీ సిబిఐ ని తనకు అనుకూలంగా ఉపయోగించుకునేదని నానా రచ్చ చేసేది మీడియా. ఇప్పుడైతే సిబిఐ అధికారంలో ఉన్నవారికి పరమ అనుకూలంగా పనిచేస్తుందనీ, వాళ్ళు చెప్పుచేతల్లో ఉంటుందన్న గగ్గోలు అందరం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రప్రభుత్వాలకి సిబిసిఐడిలు అనుకూలం, కేంద్రప్రభుత్వానికి సిబిఐ అనుకూలం. వెరసి ఎవరూ సత్యాన్ని వెలికితీయరూ, కాపాడరు. సిబిసిఐడి వ్యవహారసరళిని కృష్ణరాజ్ లు నిరూపించటం ప్రత్యక్షంగా అందరం చూసిందే! కాబట్టి ఇక ఈ సిబిసిఐడి, సిబిఐ ల ప్రహసనం వదిలేసి మళ్ళీ రామోజీరావు వ్యవహారం దగ్గరికొస్తే…. అప్పట్లో అంటే ఇందిరాగాంధీ హయాంలో తనని చాలా చిన్నవాడిగా నమ్మించేందుకు రామోజీరావు చాలా ప్రయత్నాలే చేశాడు. అతడి చేతిలో ప్రాణం పోసుకుని, కేరీర్ పెంచుకుని వెలిగిపోయిన, ఎందరో ప్రముఖుల్లో రాజకీయనాయకులూ ఉన్నారు. సాక్షాత్తు ఇందిరాగాంధీకి మెదక్ నియోజకవర్గాన్ని ఇచ్చిన చెన్నారెడ్డి కూడా ఈ వర్గానికే చెందుతాడు. ఆ నేపధ్యంలో చెన్నారెడ్డి బాగానే చెలాయించుకున్నాడనీ అంటారు. అటువంటిది – రామోజీరావు మాత్రం, ఏవో చిట్ ఫండ్, పచ్చళ్ళు, సోమా వంటి పానీయాలూ[ఒకప్పుడు ఉండేది. తర్వాత మూతపడింది] వంటి చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకున్నాడే గానీ ఇబ్బడిముబ్బడిగా డబ్బు తెచ్చిపెట్టేవి పెట్టుకోలేదు. అయితే ఈ ’చిన్నవాణ్ణి’ అనే ముసుగు 1992 తర్వాత తొలిసంవత్సరాల్లో తీసిపారేసి ’ఆఁ ప్రపంచం మొత్తాన్ని నడిపే గూఢచార వలయం, వ్యవస్థా ఉన్నాయి. అందులో కీలక స్థానాలున్న వాళ్ళమూ ఉన్నాము. అయితే ఏమిటి? ’So, what ’ అన్న బలుపూ చూపెట్టదలచి 1992 దగ్గర నుండి మరికొన్ని వేగవంతపు వ్యాపార విస్తరణలు చేపట్టాడు. 2003 నాటికే అది నడవదని అర్ధమయ్యింది. [రామోజీరావు డబ్బే సంపాదించదల్చుకుంటే, అందరిలాగే జలవిద్యుత్ కేంద్రాలు, సిమెంట్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ సంస్థలూ, మైన్స్ వంటి, డబ్బు బాగా వచ్చే వ్యాపారాలు చేసుకునేవాడు గానీ, బట్టలవ్యాపారాలు, చాకెట్ల వ్యాపారాలలో వచ్చే ఆదాయం ఎంతని?] దాంతో మళ్ళీ ’చిన్నవాణ్ణి’ అన్న ముసుగు వేసుకోదలచే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని తదుపరి తనపావుగా ఎంచుకున్నాడు. తీరా సీట్ ఎక్కాక, రాజశేఖర్ రెడ్డి తోక జాడించకుండా ఉండేందుకు, బాగా నలగేసి మరీ తన బలం ఎంతో చూపించాడు.

1992 కు ముందర, పులివెందుల నుండి ఒక S.I. ని కూడా బదిలీ చేయించుకోలేక అవస్థలు పడిన రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రిగా పదవిలోని రాకముందు బ్యాంకు ఋణాలు కోసం చెప్పులరిగేలా తిరిగిన రాజశేఖర్ రెడ్డి, 2003లో డిజైనర్ బూట్లు వేసుకుని నడిఎండల్లో పాదయాత్రలు చేయటంతోనూ, దానికి ఈనాడు చక్కని ప్రచారం ఇవ్వటంతోనూ, ముఖ్యమంత్రి అయిపోవటమే గాక తిరుగులేని శక్తి[?]గా ఎదిగిపోయాడు. అసమ్మతిని అణిచిపారేయగలిగాడు. అధిష్టానాన్ని కూడా తనకు అనుకూలంగానో, ఇంకా చెప్పాలంటే అనుచరగణంలానో మార్చుకోగలిగాడు. ఇతర పార్టీలసభ్యుల్ని ’ఆకర్ష’ అంటూ తన పార్టీలోకి లాక్కుని ప్రతిపక్షాలని నలిపిపారేయగలుగు తున్నాడు.

వీటన్నిటి కంటే ముఖ్యంగా, మీడియా సూపర్ పవర్ రామోజీరావుని ఉతికి పారేయగలిగాడు. అందుకు స్ర్కిప్టు ప్రాపర్టీ రామోజీరావే ఇచ్చి ఉండచ్చు గాక! ఆ నాటకానికి కారణం ఏమిటో, కార్యకారణ సంబంధం ఏమిటో ’గత టపాల్లో’ వివరించాను. అయితే ఈ నాటకంలో ‘ప్రధాన పాత్రధారిగా రాజశేఖర్ రెడ్డినే రామోజీరావు ఎందుకు ఎంచుకున్నాడు?’ అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. మరెవరినైనా ముఖ్యమంత్రిని చేసి, వాళ్ళ చేతిలో, తన మార్గదర్శి చావుదెబ్బలు, కోర్టుగుమ్మాలు ఎక్కిదిగడాలూ, పోలీసు స్టేషన్లకు హాజరవ్వటాలూ అనుభవించవచ్చు గదా? మరి రామోజీరావు, ఇందుకోసం ఎందుకు రాజశేఖర్ రెడ్డినే ఎంచుకుని, అతణ్ణి హీరోని చేసాడు? మరొకర్ని ఎంచుకోకుండా ఇతణ్ణే ఎంచుకోవడానికి కారణం ఏమిటి? మరో రెడ్డినో, చౌదరినో ఎంచుకుని, తన శతృవుగా నమ్మించవచ్చుగదా? రామోజీరావుకి అలాంటి అవకాశం చాలా ఉంది గదా? మరెందుకు రాజశేఖర్ రెడ్డినే ఎంచుకున్నాడు? ఈ విషయం పూర్తిగా చెప్పగలిగేది రామోజీరావు ఒక్కడే. నాకు తెలిసినంతలో వివరించటానికి ప్రయత్నిస్తాను.

చంద్రబాబునాయుడితోనో, లేక ఇతరులతోనో పోలిస్తే రాజశేఖర్ రెడ్డి గూఢచార జ్ఞానశూన్యుడు. అంతేకాదు గూఢచర్యం విషయంలో అజ్ఞాని కూడాను. తాను అనుకున్నది అక్కడ ఉంటుందనుకుంటాడు. అక్కడ ఉన్నదాన్ని తాను తెలుసుకోవాలనుకోడు. కాబట్టే 1992 కు ముందర, రామోజీరావు దృష్టిలో, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సమర్ధుడిగా తూగలేదు. కాబట్టే మర్రి చెన్నారెడ్డిని దింపడానికి ఘట్ కేసర్ రైలు దగ్ధం, పాతబస్తీ వంటి హింసాత్మక చర్యలు జరపబడ్డాక, అందులో వై.ఎస్. ప్రమేయముందనీ, చెన్నారెడ్డి తర్వాత అతడే సీట్ ఎక్కుతాడనీ అప్పట్లో అనుకున్నారు. అయితే హఠాత్తుగా రాత్రికి రాత్రి చక్రం తిప్పబడి, 1990 లో నేదురుమల్లి జనార్ధన రెడ్డి తెరపైకి వచ్చి, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నాయకత్వం కడపకి పరిమితమైపోయింది. కడపలో కాదు, చివరికి పులివెందులలో కూడా అఫ్టరాల్ ఒక ఎస్.ఐ.ని బదిలీ చేయించుకోలేక అల్లాడాడు అనటానికి నేనే ప్రత్యక్షసాక్షిని. [దీని గురించి గతటపాల్లో వివరించాను.] ఆ విధంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని ఉపయోగించుకుని, ఆనక పక్కన పారేయటం అన్నది రామోజీరావు గూఢచర్యక్రీడలో ఓ భాగం. తమకు అవసరం అయినప్పుడు పందిని నంది అనటం, అవసరం లేకపోతే నందిని పంది అనటం రామోజీరావుకి రివాజే. ’ఆ పాటి సీన్ కూడా ఇవ్వకపోయినా చేయగలిగింది ఏముంది? నోరు మూసుకుని విధేయత చూపటమే కెరీర్ కు సోపానం’ అనుకునేంత గూఢచర్య అవగాహన ఉన్నవాళ్ళు[చంద్రబాబునాయుడు, నేదురుమల్లి లాంటివాళ్ళు చాలా మందే ఉన్నారు.] విధేయత చూపిస్తూ మళ్ళీ అనుకూల సమయం వచ్చేవరకూ వేచి ఉండేవాళ్ళు. అంత గూఢచార పరిణతి లేదా అవగాహనా లేకపోవటం చేతే, రామోజీరావుకు, రాజశేఖర్ రెడ్డి 1992 కు పూర్వం తూగలేదు. అందుచేత రాజశేఖర్ రెడ్డికి రామోజీరావు మీద విద్వేషం, ఉక్రోషం ఉండేవి. తనని పట్టించుకోనందుకు విద్వేషం, ఉపయోగించుకుని వదిలేస్తున్నందుకు ఉక్రోషం! అందుచేతే 1992 మేలో నేను రామోజీరావు గూఢచార కార్యకలాపాల గురించి ఈనాడులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నా ఫ్రెండ్ నుండి సేకరించిన సమాచారంతో ’ఆ సమాచారాన్ని ప్రధాని పీవీ దృష్టికి తీసికెళ్ళేందుకు సహాయం చెయ్యమని’ అడగటానికి కడప వెళ్ళినప్పుడు, అందుకు ఏవైనా ఋజువులు ఉంటే తెచ్చిఇవ్వమని అడిగాడు. ’అప్పుడు మాత్రమే మనల్ని ఎవరైనా నమ్ముతారు’ అన్నాడు. ఒకటికి రెండుసార్లు ’సాక్ష్యాలుంటే తెండి’ అంటూ నొక్కిచెప్పాడు.

’సాక్ష్యాలుంటే అవి చేతిలో పెట్టుకుని రామోజీరావుని ఆడించవచ్చు. తనకి కెరీర్ ఇచ్చేలాగా నియంత్రించవచ్చు’ – ఇదీ రాజశేఖర్ రెడ్డి ఆలోచన. అసలు రామోజీరావుకీ, అతడి గూఢచార వ్యవస్థకీ ఎంత శక్తి ఉందో ఏమాత్రం తెలియని అనవగాహనా, అజ్ఞానం అది. ఎందుకంటే, అప్పటికే రాష్ట్రగవర్నర్ల పదవుల వరకూ, ఆలిండియా మహిళా కాంగ్రెస్ కన్వీనర్ పదవులు వరకూ ఎదిగిన కుముద్ బెన్ జోషి, ఇదే సమాచారంతోనూ, ఇదే అభ్యర్ధనతోనూ, నేను ఆవిడని ఢిల్లోలోని ఆవిడ ఇంట్లో కలిసినప్పుడు, ఎంతో కోపోద్రేకాలకీ, భయాందోళనలకీ గురయ్యింది. ’ఇలాంటివ్యవహారాల్లో తలదూరిస్తే life miserable అయిపోతుంది. వెళ్ళి బుద్దిగా నీ వ్యాపారం నువ్వు చేసుకో పొమ్మని’, నాకు హితవు చెప్పింది. ‘ఇలాంటి వ్యవహారాలు తీసుకుని మరోసారి తన దగ్గరకు రావద్దని’ తీవ్రంగా హెచ్చరించింది. కాబట్టే ‘రామోజీరావు, అతడి గూఢచార వ్యవస్థల శక్తి, విస్తారత తెలిసిన వాళ్ళు అలా ఉండగా, అది తెలియని అజ్ఞాని రాజశేఖర్ రెడ్డి’ అని అన్నాను.

ఎదుటి బలం ఎంతటిదో తెలియదు. ప్రపంచాన్ని చేతివేళ్ళ మీద నడిపిస్తున్న గూఢచర్యవలయమనీ తెలియదు. మీడియా అధిపతిగా రామోజీరావు, ఎవరికి తెరవెనుక మద్దతిస్తే వాళ్ళు వెలిగిపోవటం, ముఖ్యమంత్రులైపోవటమే తెలుసు. అందుచేతే రామోజీరావు కార్యకలాపాల గురించి సాక్ష్యాలుంటే, అవి పట్టుకుని అతణ్ణి ఒక ఆట ఆడించవచ్చు అనుకున్నాడు. దాంతో తనకు సీన్ వచ్చేలా చేసుకోవచ్చు అనుకున్నాడు. ఎదుటిబలం ఎంతటిదో తెలియకపోయినా, అది మంచికి వ్యతిరేకంగా పనిచేస్తుందనుకున్నప్పుడు, దాన్ని ఎదుర్కోవాలనుకోవడంలో స్వార్ధం లేనప్పుడు, మనకి సహజంగానే నైతికబలం వస్తుంది. దైవబలం మనకి తోడుగా ఉంటుందన్న స్థైర్యమూ, ధైర్యమూ అది. రాజశేఖర్ రెడ్డి పరిస్థితి అదికాదు. కాబట్టే ‘అక్కడ ఏం ఉందో తెలుసుకోడు, తననుకున్నది అక్కడ ఉందనుకుంటాడు. ఇదే గూఢచర్యం తాలుకూ అనవగాహన, అజ్ఞానం’ అని చెప్పాల్సివచ్చింది రాజశేఖర్ రెడ్డి గురించి!

ఏదైతేనేం? తెలియని కారణంగా అయితేనేమి, ఫ్యాక్షనిస్టు అయిన కారణంగా అయితేనేమి, ఋజువులుంటే రామోజీరావుని ఉతికి పారేయ్యాలను కున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఆ అవకాశం అతడికి, 1992 తర్వాతి కాలం ఇచ్చింది. 2004 లో అతణ్ణి సీట్ ఎక్కించేలోగా రామోజీరావు అతణ్ణి బాగా నలగేసాడు. వై.ఎస్. మనోబలం అతడి తండ్రి వై.ఎస్.రాజారెడ్డి. అతణ్ణి ఫ్యాక్షన్ కక్షల నేపధ్యంలో పైలోకాలకి పంపించాడు. బ్యాంకు ఋణాల కోసం తిరిగేలా నలగేసాడు రామోజీరావు. అంతగా నలగేసి సీట్లో కూర్చో బెట్టినా, తీరా ప్రజల్ని నమ్మిండచంలో భాగంగా, రాజశేఖర్ రెడ్డి చేత తను వేధింపబడుతున్న Assignment ని రాజశేఖర్ రెడ్డికి ఇచ్చినప్పుడు, రాజశేఖర్ రెడ్డి ఆ పాత్రకి జీవం పోసేసాడు. ఎంతో involvement తో నిర్వహించాడు. ఇప్పటికి రామోజీరావు, అతడి గూఢచార వ్యవస్థా, నెం.10 వర్గం యొక్క శక్తిసామర్ధ్యాల ఎంతటివో, విస్తారతా సాంద్రతలు ఎంతటివో అర్ధమైనా – ఒకప్పటి విద్వేషం, ఉక్రోషం మనస్సు అట్టడుగు పొరల్లో అలాగే నిక్షిప్తమై ఉండగా, ఆ ప్రకోపాలని చల్లార్చుకునే అవకాశం వచ్చినప్పుడు, చెలరేగే భావోద్రేకాల తాలుకూ involvement అది! దాన్ని గమనించినప్పుడు రామోజీరావుకి కలిగే భావోద్రేకాల ఉత్పాతం ఎంతటిదో ఊహించటం కష్టం. ఎందుకంటే, ఎంతగా తానే స్ర్కిప్టూ, ప్రాపర్టీ ఇచ్చి మరీ నాటకాన్ని రక్తి కట్టింపించినా, పధకరచన దగ్గరనుండి, పాత్రధారుల ఎంపికా, నిర్వహణ దాకా సర్వజాగ్రత్తలు తీసుకున్నా, ఆయా పాత్రధారులకి తనమీద ఉన్న భావోద్రేకాలూ, ప్రతిస్పందనలు ఇప్పుడు పనిచేస్తున్నాయన్నది అర్ధమయ్యింది. ’అలాంటప్పుడు ఎంతవరకూ, ఆయా పాత్రధారులని నమ్మగలను?’ అన్నది అతడికిప్పుడు ప్రాణాంతక సమస్య. తనని మార్గదర్శి నెపంతో ఉతికిపారేయించుకునీ, కోర్టుగుమ్మాలు ఎక్కించి దించమనీ, తానే రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన Assignment కావచ్చు గాక, కానీ దాన్ని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంతో హుషారుగా, ఆనందంగా అభినయించాడే? ఆస్వాదించినట్లు కూడా ఉన్నాడు. కాబట్టి ఎంతవరకూ నమ్మటం? గత్యంతరం లేక కొనసాగించినా, లేక అవకాశం కుదిరి ఇంటికి పంపించినా, నమ్మటం ఎంతవరకూ సరైనది?

ఇదే రామోజీరావు సువర్ణముఖి! ఒకప్పుడు ఇందిరాగాంధీ, భారతదేశం పట్ల నిబద్దత గల నిఘా సంస్థల వ్యక్తులూ, ఇతరులూ – ఈరోజు ఓ వ్యక్తినీ, సంస్థనీ నమ్మితే, తదనంతర కాలంలో పరిస్థితులన్నీ ఆయా వ్యక్తుల్నీ, సంస్థలనీ అనుమానించే విధంగా మారిపోయేవి. ఎవర్ని నమ్మాలో, ఎంతవరకూ నమ్మాలో ఎప్పుడూ అర్ధంకాని పరిస్థితే నెలకొని ఉండేది.

ఇప్పుడు అదే స్థితిని అనుభవిస్తున్నాడు రామోజీరావు, అతడి నెం.10 వర్గం కూడా! తానే ఏరికోరి, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని, ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో భాగమైన నాటకంలో, ప్రధాన పాత్రధారిగా ఎంచుకునేటప్పుడు తనకి కనబడిన పరిస్థితులు వేరు. ఇప్పుడు కనబడుతున్న పరిస్థితులు వేరు. Assignment తానే ఇచ్చి ఉండొచ్చుగాక. కానీ తానూ, తన ఎనలైజింగ్ సెంటర్ పైనా, ఇతర అనుచరులిచ్చిన రిపోర్ట్ పైనా ఆధారపడాల్సిందే. ఇప్పుడు ఎవర్ని ఎంతవరకూ నమ్మటం? ఈ నేపధ్యంలో తమ అనుచరగణం నుండి వస్తున్న సమాచారంగానీ, ఎనలైజింగ్ సెంటర్ నుండి వస్తోన్న ఆ సమాచారపు విశ్లేషణగానీ Tamper అవ్వటం లేదని భరోసా ఏమిటి? ఒకప్పుడు భారతప్రభుత్వానికి తాము చూపెట్టిన చేదు అనుభవమే కదా ఇది? ఇప్పడదే తమకి తిరిగి అనుభవంలోకి రావటం లేదని గ్యారంటీ ఏమిటి? తీరా పరిస్థితి వస్తే, లేదా పరిస్థితి అనుకూలిస్తే, ప్రతివాడు అంతక్రితం కడుపులో దాచుకున్న తనపట్లగల భావోద్రేకాలన్నిటినీ తీర్చుకుంటున్నట్లున్నాడు. అలాంటప్పుడు ఎవర్ని ఎంతవరకూ నమ్మటం? ఈ బాధ తాలుకూ సాంద్రత అనుభవించిన వాళ్ళకి మరింత బాగా అర్ధమౌతుంది. అది రామోజీరావుకి ఇప్పుడు మరింత బాగా అర్ధమౌతోంది. అయితే ఇందులో ఫలించింది రామోజీరావు సువర్ణముఖే.

ఎందుకంటే తీరా తనని వేధించమన్న Assignment ని రామోజీరావు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఇచ్చాక, అతడు ఆ పాత్రకి జీవం పోసాక, వెనక్కి తిరిగి చూసుకుంటే, రామోజీరావుకి రాజశేఖర్ రెడ్డి నాటకాన్ని రక్తి కట్టించాడో లేక కొంపదీసి ‘డబుల్ క్రాస్’ అయిపోయాడో అనిపించేంత అనుమానం కలిగేంతంగా, రాజశేఖర్ రెడ్డి తనపాత్రకి ప్రాణప్రతిష్థ చేసేసాడు. ఓ ఏజంటు గుర్తింపబడినప్పుడు, అవతలి ఏజన్సీ సదరు ఏజంటుని డబుల్ క్రాస్ చేసే అవకాశం ఉన్నందుచేత కూడా, తొలి ఏజన్సీ ఆ ఏజంటుని వదిలేసుకుంటుంది. [1992 తర్వాత రోజుల్లో డబుల్ క్రాస్ అనుకుని చాలా మందిని వదిలేసుకునే నకిలీ కణికవ్యవస్థకీ, రామోజీరావుకీ , ఇప్పుడు పరిస్థితి ఇరుకుగా తయారయ్యింది. తన ఏజంట్లని నమ్మలేడు, వదులుకోనులేడు] ఇక్కడ డబుల్ క్రాస్ చేయటం అంటే – చప్పుడు చేయకుండా అవతలి వాడి స్ట్రాటజీ ఏంటో తెలుసుకుని, ఎదుటివర్గాన్ని ఎక్కడ ఇరుకున పెట్టవచ్చో, అది అమలయైటట్లు పరిస్థితులనీ సృష్టించటం, ఆ విధంగా తమ స్ట్రాటజీని ఎదుటి వారిమీద ప్రయోగించేలా చేయటం! ఇది ఎప్పుడో చాణిక్యుడు, రాక్షసమంత్రి మీద ప్రయోగించినట్లుగా చెప్పబడుతుంది. భారత రామాయణాల్లో చర్చించబడింది.

ఆ విధంగా, తనమీద, అప్పటివరకూ ఎవరికడుపులో ఎంత వైషమ్యం, విద్వేషం ఉందో, అవకాశం వస్తే ఎవరు ఎంతగా దాన్ని వెళ్ళగ్రక్కుతారో, రామోజీరావుకి వాస్తవంగా అర్ధమయ్యింది. ఇప్పుడు ఎవర్ని ఎంతవరకూ నమ్మటం అన్నది – వాళ్ళ మీడియా భాషలోనే చెప్పాలంటే ’మిలియన్ డాలర్స్ క్వశ్చన్’ అన్నమాట. ఒకప్పుడు భారత ప్రభుత్వం, భారత నిఘా సంస్థలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఆయాదేశాల్లో తమతమ దేశాల పట్ల నిబద్ధత గలవారు పడిన ’నమ్మక – అపనమ్మకాల సంకటస్థితి’ని ఇప్పుడు రామోజీరావు, నకిలీ కణికవ్యవస్థా అనుభవిస్తున్నారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu