ఇక ఇస్కాన్ లోపలికి వెళ్తే, గర్భాలయంలో దేవుడు [శ్రీకృష్ణుడు] ఉండడు. రాధికా సమేత శ్రీకృష్ణుడు, గోపికాపరివేష్ఠితుడై పెద్ద స్టేజ్ మీద అర్ధవృత్తాకారంలో నిలువెత్తు శిల్పాల రూపంలో ఉంటాడు. దుస్తులూ, నగలూ అలంకరించబడి, స్టేజ్ మీద నర్తిస్తున్న కళాకారుల్ని తలపిస్తూ ఉంటాయి, అక్కడ పూజలందుకునే దేవతా విగ్రహాలు! శ్వేతజాతీయ పూజారి అంటే బ్రహ్మచారి హారతి ఇస్తుంటాడు. వింజామర సేవ, దీపహారతి, ధూపహారతి, నైవేద్య సమర్పణ అన్నీ శ్వేత జాతీయులే నిర్వహిస్తారు. తదుపరి కృష్ణతత్త్వం గురించి శ్వేతజాతీయ బ్రహ్మచారి లేదా మహారాజ్ ఉపన్యసిస్తాడు. అక్కడ మేం బస చేసిన కొద్దిరోజులూ క్రమం తప్పకుండా ఇవన్నీ పరిశీలించాము. బ్రహ్మచారి లేదా మహారాజ్ ఉపన్యసిస్తున్నప్పుడు[ఇంగ్లీషులోనే లెండి] ఓ సన్యాసిని ఊలు స్వెట్టర్ అల్లూకుంటూ విరాగిణిలా మధ్యమధ్యలో నవ్వుతూ ఉండేది. అదెంత నాటకీయంగా ఉండేదంటే దాదాపు పాతిక, ముప్పైయేళ్ళ అందమైన ఈ శ్వేతజాతి సన్యాసిని ఒక క్రమ కాలవ్యవధిలో నవ్వుతూ ఉండేది. ఈవిడ వైరాగ్యపూరిత నవ్వులకీ, అక్కడ అప్పుడు నడుస్తున్న ఉపన్యాసానికీ అసలు పొంతన ఉందా అన్పించింది.

అదొక్కటే కాదు, అక్కడ భగవంతుణ్ణి ప్రతిష్ఠించిన తీరూ, పూజించే విధానమూ కూడా ఒక వేళాకోళంతోనూ, ఎకసెక్కంగానూ ఉన్నట్లే ఉండేది. ధూపహారతి పేరిట వాళ్ళిచ్చే హారితి పొగలో నల్లమందు వంటి మాదకదవ్వాలేవో కలుపుతారనీ, ఆ మత్తుకి కొందరు భక్తులు స్పృహ తప్పిపోవడమూ ఉండేదని స్థానికులు చెప్పారు. [అలా పడిపోవటాన్ని ఇస్కాన్ వాళ్ళైతే మధురభక్తి తో స్పృతి కోల్పోవటం అంటారు.] అదీ భయం భయంగానే లెండి. ఎందుకంత భయం అంటే – తొలినాళ్ళలో ఇస్కాన్ ఆవరణలో కొన్ని హత్యలు కూడా జరిగియాట. గ్రామీణుల పశువులు ఇస్కాన్ వారి పొలాల్లోకి వచ్చి మేసాయన్న నెపంతో స్థానికుల్ని, తొలినాళ్ళలో తుపాకితో కాల్చిచంపారట. పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టటానికి భయపడేంతగా ఈ పరంపర నడిచిందట. ఇప్పటికీ అక్కడి గ్రామస్థులు ఇస్కాన్ పట్ల ఎంతో భయంతో మెలుగుతారు. ఈ ధూపహారతిలోని గంజాయి, నల్లమందుల వినియోగం గురించివిని, ఇటీవల మరణించిన పాప్ రారాజు మైకేల్ జాక్సన్ ప్రదర్శనలలో కూడా ప్రేక్షకులు మూకుమ్మడిగా స్పృహ కోల్పోవటం, అలాంటి వాళ్ళని స్ట్రెచ్చర్ల మీద మోసుకెళ్ళటం టీవీలో చూసి, ‘కొంపదీసి ఆ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం ఉపయోగించే లైట్లూ, పొగలలో కూడా ఇలాంటివి ఉపయోగించటం లేదు కదా’ అనుకున్నాము.

ఇక ఇస్కాన్ భోజన వైభోగం గురించి చెప్పకపోతే ప్రధాన విషయం చెప్పనట్లే! మాయాపూర్ ఇస్కాన్ లో పేదలకి ప్రతీరోజూ మధ్యాహ్నాం ఓపూట అన్నదానం చేస్తారు. అందులో అన్నం, పప్పు, రెండు కూరలూ, ఓ స్వీటు, పెరుగూ గట్రా ఉంటాయి. ఇస్కాన్ ప్రాంగణం వెలుపలి గోడను ఆనుకొని ఆ భోజనశాల ఉంటుంది. భక్తులకి, ఇస్కాన్ వసతి గదుల్లో బసచేసిన వారికీ మరొక భోజన శాలలో భోజనం పెడతారు. అదెంతో విశాలంగా, ఆకర్షణీయంగా, ఎంతో రిచ్ ఇంటీరియర్ డెకరేషన్ తో ఉంటుంది. కాకపోతే క్రింద కూర్చొబెట్టి భోజనం వడ్డిస్తారు. ఒకేసారి వేలమంది భోజనం చేయవచ్చు. అచ్చంగా నేతిలో వేయించిన పూరీలు, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన మిఠాయిలతో భోజనం మహారాజుల భోజనంలా ఉంటుంది. దాదాపు 17-20 రకాల భక్ష్యభోజ్య చూహ్యలేహ్యలతో వడ్డిస్తారు. అన్నం కూరలతో సహా! ఒక్క పెరుగుతోనే రెండుమూడు రకాల భక్ష్యపదార్ధాలుంటాయి. భోజనం మధ్యలో [మధ్యేమధ్యే పానీయం సమర్పయామి అన్న చందాన] తాగడానికి మూడు మట్టిగ్లాసుల్లో నిమ్మరసంతో చేసిన షర్పత్, సుగంధపాలు, మంచినీళ్ళు ఉంటాయి. గది అద్దె కూడా భోజన సదుపాయంతో కలిపి భారీగానే ఉంటాయి. గౌడీయమఠపు ప్రధాన శాఖలో భోజనశాల మహా అయితే వందమంది ఒకేసారి భోజనం చేయగలిగేటంత ఉంటుంది. భోజనము సాధరణంగానూ, సాత్వికంగానూ ఉంటుంది. వాళ్ళు భక్తులకి ఇచ్చేటందుకు మహా అయితే ఓ ఇరవై గదులుంటాయేమో. అదీ నామమాత్రపు అద్దె. భోజనంతో కలిపి రోజుకి యాభైరూపాయలు అనుకుంటా. అదే ఇస్కాన్ లో అయితే [డీలక్స్, సూపర్ లెవల్] గదులలో రకాలుంటాయి. తదనుగుణంగా అద్దెలుంటాయి.

ఇక శ్రీకృష్ణుడికి కేకులూ గట్రా కూడా నైవేద్యంగా పెట్టేవాళ్ళు. ప్రసాదపు కౌంటర్లలో అలాంటివే అమ్ముతారు. వారి పూజారులకీ [బ్రహ్మచారులకీ] ఇవ్వబడిన నివాస గదుల్లో, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూడటానికి వచ్చిన గుమాస్తాలూ ఉండేవాళ్ళు. అయితే ఈ కార్యాలయ సిబ్బంది [ఆఫీసు స్టాఫ్] కుటుంబసహితంగా ఉండేవాళ్ళు. భార్యభర్తలు, పిల్లలూ అంతానన్నమాట. తమాషా ఏమిటంటే వాళ్ళందరూ కూడా శ్వేత జాతీయులే. అందరూ కాషాయాంబరధారులే. చిన్నపిల్లలు కూడా కాషాయం ధరించి, మగపిల్లలు గుండు పిలకలతో చూడటానికి బాల సన్యాసులు/బాల సన్యాసినులులాగా ఉండేవాళ్ళు. మొత్తంగా ఎవరు ఆఫీసు స్టాఫో, ఎవరు సన్యాసించిన వాళ్ళో, చూడటానికి వెళ్ళేవాళ్ళకి మాత్రం అర్ధం కాదు. ఇక్కడ మిషనరీలలో నన్స్ కు, వేరే ప్రాంతాలలో సంసారులు ఉంటాయని, గుంటూరు జిల్లాలో చాలా మిషనరీలలో నాకు తెలిసినవాళ్ళు చెప్పిన విషయం. అలా ఈ ఇస్కాన్ సన్యాసులకు కూడా సంసారాలు అక్కడే పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు.

ఇక ఇస్కాన్ స్థాపించిన తొలినాళ్ళలో – రాధమ్మకు కృష్ణుని పైని గల గాఢానురక్తినీ, మధుర భక్తినీ ప్రభోదించిన కృష్ణచైతన్యుడి మధురభక్తి ప్రబోధం కాస్తా ఇస్కాన్ చేతుల్లోకి, శ్రీల ప్రభుపాదుడి చేతుల్లోకి చేరేసరికి ‘హరేకృష్ణ ఉద్యమంగా’ పేరుపెట్టుకుంది. చివరికది ’హిప్పీ’లుగా విపరీత ప్రాచుర్యంలోకి వచ్చింది. జుట్టుని పెంచుకుని, గంజాయి పీలుస్తూ, ’హరేరామ హరేరామ రామ రామ హరే హరే! హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే! ’ అన్న భగవన్నామ సంకీర్తన ’దమ్ మారో దమ్, మిట్టిజాయే హమ్ బోలో శుభషామ్. హరేకృష్ణ హరేరామ్’ అని పాడేదాకా పోయింది. గంజాయి మత్తులో సామూహిక రేప్ లూ నడిచాయని ఆనాటి వార్తల్లో పొక్కిందట.

ఈ నేపధ్యంలోనే ’హరేరామ హరేకృష్ణ’ పేరుతో బాలీవుడ్ నటుడు దేవానంద్ సినిమా తీసాడు. జీనత్ అమన్ దేవానంద్ లు నటించారు. [సదరు హీరో దేవానంద్ కూడా దేశవిభజన నాడు పాక్ నుండి భారత్ కు వలసవచ్చిన వాడే. అక్కడి నుండి వలసవచ్చిన వారే తదనంతరం భారత్ లో అగ్రస్థాయికి వచ్చిన నూరుమందిలో 99మంది ఉండగా, ఇక్కడి నుండి పాక్ కి వలసపోయిన వారిలో తదనంతరం పాక్ లో అగ్రస్థాయికి వచ్చిన నూరుమందిలో ఒక్కరుంటే [ముషారఫ్ లాగా] ఎక్కువన్న మాట.] ఇక ఈ సినిమా హిట్ కావడం కోసం కోర్టులో కేసు వేయబడటం, తగినంత సంచలనమూ, ప్రచారము వచ్చాక, కోర్టు అడ్డంకులు తొలగిపోయి సినిమా రిలీజ్ కావటమూ, ’రామ్ కా నామ్ బద్ నాం నా కరో’ అంటూ హీరో ప్రబోధించడం షరా మామూలే! సినిమా ఎంత హిట్టో, దమ్ మారో దమ్ పాట మరెంత హిట్టో, ఇప్పుడు పాతికేళ్ళున్న వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా 45 ఏళ్ళ వయస్సున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇప్పుడంటే సినిమా హిట్లు కోసం వివాదాలు సృష్టింపబడతాయని, రాఖీ సావంత్ లూ, మై నేమ్ ఈజ్ ఖాన్ కోసం షారూఖ్ ఖాన్ లూ నిరూపించారు గాని, అప్పట్లో ఆ టెక్నిక్ ప్రజలకే మాత్రం తెలియదయ్యె.

అయితే ప్రజల దృష్టిలో చూస్తే, మతాన్నీ పైముసుగుగా వేసుకున్న ఇస్కాన్ గురించి ప్రజలకి తెలియకపోయినా ఆనాటి ప్రభుత్వానికి తెలుసు. అందునా చైనా యుద్ధపు ఓటమి తర్వాత, కుట్ర ఆస్థిత్వం అర్ధం చేసుకున్న ముందటి తరం, ఇందిరాగాంధీ వంటి తరువాతి తరాన్ని హెచ్చరించిన నేపధ్యంలోనూ, నాటి ప్రభుత్వానికి బాగా తెలుసు. కానీ ఇస్కాన్ వేసుకున్నది మతపు ముసుగు! శ్రీకృష్ణుని పట్ల హఠాత్తుగా అమెరికన్లందరికీ విపరీత భక్తి పుట్టుకొస్తే ఏ ఋజువు చూపెట్టి ఇందిరాగాంధీ “ఇది భక్తి కాదు, గూఢచర్యం అనగలదు?" అంటే మాత్రం? అంతర్జాతీయ మీడియా ఊరుకుంటుందా? మూకుమ్మడిగా కోడై కూస్తుంది.

నాటి భారత ప్రభుత్వం దృష్టికి, ఇస్కాన్, మతపు ముసుగు వేసుకున్న అమెరికా గూఢచార సంస్థ సి.ఐ.ఏ.! అయితే ‘ఆ రెండు ముసుగుల అడుగునా ఉన్నది, నకిలీ కణిక వ్యవస్థ’ అన్న విషయం పీవీజీ విశ్లేషించి, బహిర్గతపు బాటలో నడపటం నేటి గూఢచర్య తంత్రం. మెదళ్ళతో యుద్ధంలో ఓ పార్శ్వం.

కోర్టుల సహాయంతో, మతపు ముసుగు వేసుకుని, శ్రీల ప్రభుపాదుడనే ఓ భారతీయుణ్ణి అడ్డం పెట్టుకుని, సి.ఐ.ఏ., ఇస్కాన్ పేరిట గూఢచర్యం నిర్వహిస్తోందని నాటి ప్రభుత్వానికి తెలిసినా నిస్సహాయంగా చూడటం, వీలయినంతగా ఎదురుపోరాడ్డం మినహా ఏమీ చెయ్యలేకపోయారు. ఆ సువర్ణముఖినే అనుభవిస్తూ, ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలక వ్యక్తులైన రామోజీరావులూ, అద్వానీలు తమ నెట్ వర్కు క్రమంగా కుప్పకూలిపోవడాన్ని నిస్సహాయంగా చూడాల్సి వస్తోంది. తనపేరు చెప్పుకుని గూఢచర్యం చెయ్యడాన్ని, తీవ్రవాదం చెయ్యడాన్ని, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడాన్ని భగవంతుడు, ఆయా వ్యక్తుల పాపం పండేవరకో లేక సువర్ణముఖి పరిపక్వత చెందే వరకూ మాత్రమే ఊరుకుంటాడు. దాని ఫలితమే 1992 తరువాత సంవత్సరాలలో ఇస్కాన్ చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలు. అంతేకాని వారికై వారికి పుట్టిన మంచి బుద్ధైతే 1966 నుండి 1992 లోపల 26 సంవత్సరాలలో ఎందుకు చేయనట్లు? అప్పుడు ఇంతకంటే మరింత పేదరికం కూడా ఉంది.

1992 కు ముందర ఇస్కాన్ ప్రధాన కేంద్రం మాయాపూర్ లోనూ, ప్రక్కనే గల గంగ నదికి మరో ఒడ్డున ఉన్న నవద్వీప్ లోనూ, మాయాపూర్ ఉన్న 24 పరగణాల జిల్లాలోనూ పేదరికం తాండవిస్తూనే ఉంది. సాక్షాత్తూ ఇస్కాన్ చుట్టూ కూడా పేదప్రజలూ, బాలలూ ఉన్నారు. అయినా ఇస్కాన్, రోజుకు పదిలక్షల మందికి కాదు కదా, కనీసం పదివేల మందికి కూడా అన్నదానం చేసేది కాదు. అలాంటిది, ఇప్పుడు అక్షయపాత్ర పేరుతో బెంగుళూరు కేంద్రంగా రోజుకి పదిలక్షల మంది బాలలకి అన్నదానం చేస్తోందంటే కారణం – సి.ఐ.ఏ. మరియు ఇస్కాన్ ల సువర్ణ్ ముఖి, కన్నా? కాలా? స్ట్రాటజీ! వివరంగా చెబుతాను.

ఇలాంటి సేవ కార్యక్రమాలని ఇస్కాన్ 1992 తర్వాతే చేపట్టింది. అంతేకాదు అంతకు ముందు నామమాత్రంగా నడిపిన చాల కార్యక్రమాలని విస్తరించింది. ఇస్కాన్, ఎప్పుడు ఏ శాఖలు ప్రారంభించిందో, ఏ కార్యక్రమాల ప్రారంభ తేదీలు ఏవో, ఏశాఖలో ఎప్పుడు బాగా విస్తరించారో, ఏ కార్యక్రమాలని ఎప్పుడు ఎక్కడ నుండి విస్తరించిందో, పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమౌతుంది. ‘అక్షయ పాత్ర’ పేరుతో అన్నదానం అనుకోండి పదేళ్ళ క్రితం అంటే 1992 లో కేవలం రోజుకి 1500 మందికి అన్నదానం చేయటంతో ప్రారంభించబడిందట. మరి శ్రీలప్రభుపాదుడు, ఎప్పుడు, ఏ ఇస్కాన్ శాఖలోని తన గదిలో కూర్చొని చదువుకుంటుండగా ఎంగిలి విస్తళ్ళ కోసం కుక్కలతో కలబడి పోరాడుతున్న వీధిబాలల్ని చూసి “ఇస్కాన్ చుట్టుప్రక్కల ఎవరూ ఆకలితో బాధపడకూడదు. వారికి కడుపు నిండా అన్నం పెట్టండి” అన్నారో? మాయాపూర్ లోని ఇస్కాన్ మందిరం, నివాస భవనాలు, విశాలమైన ప్రాంగణంలో ఉంటాయి. భవనాల చుట్టు తోట, ఎతైన ప్రహారీ గోడ ఉంటాయి. కిటికీలో నుండి బయటి దృశ్యాలు కనబడే అవకాశమే లేదు. ఇక, ఇస్కాన్ ఎంగిలి ఆకుల్ని కూడా సేంద్రియ ఎరువుగా మార్చి తోటలోని కూరపాదులకీ, పూలమొక్కలకీ వాడుతుంది. కాబట్టి బయటపారవేసే అవకాశమూ లేదు. వాటికోసం కుక్కలతో కలబడే పేదబాలల్ని చూసే అవకాశం అంతకంటే లేదు. ఇస్కాన్ ఇతర శాఖలు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే, శ్రీల ప్రభుపాదుడు తన 81 ఏట, అంటే 1977 ల్లో మరణించాడు. అతడు బ్రతికున్న రోజుల్లో పేదబాలల ఆకలి తీర్చమని ఆదేశిస్తే, అతడి మరణానంతరం 22 ఏళ్ళ తర్వాత 1999 లో అక్షయపాత్ర ప్రారంభించబడిందన్న మాట. ఈ వార్తాంశంలోనే ఉన్న ఇన్ని లొసుగులు చూశాక స్పష్టమయ్యేది ఏమిటంటే – 1992 తర్వాత, తమకి విధింపబడిన ఆత్మహత్యసదృశ్య Assignments అయిన అన్నదానాది ప్రజాహిత కార్యక్రమాలకి [తమకి డబ్బులూడగొట్టేవి ఆత్మహత్యసదృశ్యం గాక ప్రియమైన Assignments కావు కదా?] పైకారణంగా [over leaf reason గా] ’శ్రీల ప్రభుపాదుడి ఆజ్ఞా, ఆదేశాలు’ వాడుకోబడుతున్నాయి. ఎటూ తొలినాళ్ళలో ‘శ్రీల ప్రభుపాదుడు’ బొమ్మని నిలబెట్టి ఇస్కాన్ ని నడిపింది శ్వేతజాతీయులైన సి.ఐ.ఏ. నే కదా? అంచేత, ఇప్పుడూ, ఈ ప్రజాహిత కార్యక్రమాలకీ, అదే పేరునీ, అదేబొమ్మనీ పైకారణంగా నిలబెట్టవలసి వచ్చింది. ఇదీ సువర్ణముఖిలోని ఓ విశిష్టతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా శ్రీల ప్రభుపాదుడి గురించి:

ఇతడి జనన వృత్తాంతం, సంవత్సరం, స్థలం, తల్లితండ్రుల వివరాలు ప్రచురించక పోయినా, మిగిలిన వివరాలు ఇప్పటికే మీడియా పలుసార్లు శ్లాఘిస్తూ ప్రచురించింది. అయితే మీడియా ఎప్పుడూ మచ్చుకైనా ప్రచురించని విషయాలు చాలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, 24 పరగణాల జిల్లాలో, నవద్వీప్ ప్రాంతంలో, మాయాపూర్ ఓ గ్రామం. గంగ ఒడ్డున ఉన్న చిన్నగ్రామం. అక్కడే ఇస్కాన్ ప్రధాన కేంద్రం ఉంది. అక్కడే చైతన్య ప్రభువు ప్రభోదించిన భక్తి సిద్ధాంతాన్ని ప్రజలలో పరివ్యాప్తి చేయడానికి స్థాపించబడిన శ్రీ గౌడీయ మఠము ఉంది. శ్రీల ప్రభుపాదుడి పుణ్యమాని, చీలికలూ పేలికలూ అన్నట్లుగా శాఖోపశాఖలుగా చీలిన గౌడీయ మఠపు చాలా శాఖలున్నదీ ఇక్కడే! చైతన్యుడి జన్మస్థలం ఇదే!

దీనికి పూర్వరంగం ఏమంటే, ‘గౌడీయమఠం’ అన్నది కృష్ణభక్తుడూ, భక్తి సిద్ధాంత కర్త అయిన చైతన్యప్రభువు అడుగుజాడలలో స్థాపించబడింది. మధురభక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రచారించిన చైతన్యుణ్ణి [క్రీ.శ. 1485 – 1533] భక్తులు శ్రీకృష్ణుని అవతారంగా కొలుస్తారు. తెల్లగా ఉంటాడు గనుక ఆయన్ని ‘గౌరాంగుడ’ని పిలిచేవారట. వేపచెట్టు క్రింద జన్మించాడని ‘నిమాయి’ అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు రాధకి తన పట్ల గల గాఢానురక్తినీ, ప్రేమ పారవశ్యాన్ని, వేధించే విరహన్ని సైతం మధురంగా ఆస్వాదించగలిగిన రాధ మధురభక్తిని చూసి విస్మయపడ్డాడట. ఆ గాఢానురక్తినీ, మధుర భక్తినీ తాను ఆస్వాదించడానికీ, భక్తులకి మధురభక్తి మార్గాన్ని చూపడానికి, స్వయంగా శ్రీకృష్ణుడే చైతన్యుడై అవతరంచాడని భక్తులు నమ్ముతారు. మన అన్నమయ్య, త్యాగయ్యలాగా స్వయంగా కవీ, గాయకుడు అయిన చైతన్యప్రభువు వంగభాషలో ఎన్నో మధురభక్తి గీతాలు వ్రాసి ఆలపించాడు. ఆ కవితాత్మక సంగీత శృతిలో, ఆనాడు ఎందరో పండిత పామర జనులూ, స్త్రీపురుష బేధం లేకుండా కృష్ణభక్తి తత్త్వంలో మునిగి తేలారట.

భక్తి పారవశ్యంలో పాటలు పాడుతూ, చైతన్యుడు దక్షిణాపధాన్ని కూడా సందర్శించాడని అంటారు. గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల నరసింహాస్వామి గుడిమెట్ల దారిలో చైతన్యప్రభువు పాదముద్రలున్నట్లుగా చెబుతారు. అక్కడ చిన్నమందిరం కూడా ఉంది. చైతన్యప్రభువు భక్తి ఎంత పరవశంతో నిండి ఉండేదంటే, ఆ మత్తులో ఆయన బాహ్య స్పృహ తరచూ కోల్పోయే వాడట. ఓ సారి అలా పాడుకుంటూ [పూరీ క్షేత్రాన్ని దర్శించబోయినప్పుడు] సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. జాలరుల వలలకు చిక్కగా వాళ్ళు రక్షించారట. పూరీ క్షేత్రానికి వెళుతూ, అడవిదారిలో ఆయన, కృష్ణభక్తి సంకీర్తనం చేస్తూ వెళ్ళుంటే, అడవిలోని జంతువులన్నీ కౄరమృగాలూ, సాధు ప్రాణులతో సహా, జాతిబేధం మరచిపోయి కన్నీరు కారుస్తూ ఆయన వెంట అడవి చివరిదాకా వచ్చాయట. చైతన్యుని కృష్ణభక్తి సంకీర్తనం, వంగభాష రాని వారికి సైతం తన్మయుల్ని చేస్తుందన్నది మాత్రం నిజం.

గుంటూరులో నా చిన్నప్పుడు, మా ఇల్లు గుంటూరు వారి తోటలోని గౌడీయమఠం వీధిలోనే ఉండేది. గుడిలో సాయంత్రపు భజన, హారతి గంట మోగగానే పిల్లలందరం పరిగెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ సన్యసించిన పూజారులు ఉండేవారు. వాళ్ళని పిన్నవయస్సువారిని బ్రహ్మచారులనీ, కాస్త పెద్దవారిని [యతి] మహారాజ్ అనీ పిలుస్తారు. మేమైతే అందరినీ ’ప్రభూజీ’ అనే పిలిచివాళ్ళం. దక్షిణభారతదేశంలో శ్రీకృష్ణుడి మందిరాలకి అంతగా ఆదరణ ఉండదన్న సంకోచంతో గౌడీయమఠపు శాఖల్లో సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ప్రతిమలతో సహా ప్రతిష్ఠించారు. ఓవైపు రాధకృష్ణులూ, వారి ప్రక్కన చైతన్యప్రభు ప్రతిమ ఉండేది. మా వీధిలోని, పేటలోని గృహిణులలో కొందరు ప్రతిరోజు సన్నజాజులతోనూ, మల్లెలూ, విరజాజులతోనూ సీతమ్మ రాధమ్మలకు పువ్వుల జడలు కుట్టేవారు. కృష్ణాష్టమి చాలా గొప్పగా నిర్వహించేవారు. ప్రతీరోజు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చైతన్యుడి విరచిత కృష్ణభక్తి సంకీర్తన ప్రభూజీలు చేసేవాళ్ళు. భక్తులంతా వాళ్ళని అనుసరించే వాళ్ళు. దాదాపు అర్ధగంటపాటు సాగేది. వంగభాషలో పాడుతున్నా, కొన్నాళ్ళకి మాకూ కంఠస్థం వచ్చాయి. ప్రభూజీలు మెడలో డోలు, హార్మోనియం వంటివి తగిలించుకునే వాళ్ళు. మాకు తాళాలు ఇచ్చేవాళ్ళు. పిల్లలకి తమ ముందు జాగా వదిలేవాళ్ళు.

మేమంతా భజన పతాక స్థితికి చేరినప్పుడు
“శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ గదాధర .... గౌర భక్త బృంద
హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరి బోలో హరిబోలో హరిబోలో హరిబోలో ” అంటూ

మేమంతా ముక్తకంఠంతో ఆరుస్తూ పాడేవాళ్ళం. ఎంతగట్టిగా పాడేవాళ్ళమో అంత వేగంగా గంతులేసే వాళ్ళం. ఎవరెంత గట్టిగా పాడితే, ఎవరెంత బాగా చిందేస్తే, వాళ్ళకి ప్రభూజీలు అంతెక్కువ ప్రసాదం పెట్టేవాళ్ళు. పులిహోర, చక్రపొంగలి, పాయసం, తీపి ఖాజాలు, గుగ్గిళ్ళు.... ఇలా చాలా రుచికరమైన ప్రసాదం పెట్టేవాళ్ళు. ’ప్రభు ప్రభు’ అంటూ దోసిళ్ళు పట్టి ప్రభూజీల వెంటపడటం ఇప్పటికి నాకు గుర్తే. వాళ్ళు నవ్వుతూ, ప్రేమగా మరికాస్త ప్రసాదం, రెండోసారి మూడోసారి కూడా పెట్టేవాళ్ళు. మొదట్లో ప్రసాదం కోసం గొంతెత్తి పాడి, చిందులేసినా తర్వాత్తర్వాత అందులో చాలా మజా ఉందని అర్ధమైంది. ఇప్పటికీ ఘంటసాల గొంతులో నారద పాత్రలకి పాడిన భక్తిగీతాలు విన్పించినా, మంగళం పల్లి గొంతులో రామదాసు కృతి వినిపించినా, నా ఊహలోంచి, రిబ్బన్లతో పైకి బిగించికట్టిన రెండుజడలతో, గౌను వేసుకున్న నా చిన్నప్పటి రూపం బయటికొచ్చి, భజన చేస్తూ గెంతులేస్తుండటాన్ని నేను తరచూ ఆస్వాదిస్తుంటాను. అది ఒక అపురూపమైన అనుభూతి. ఆ వరాన్నిచ్చింది గౌడీయమఠమే! ఇది నేను నాస్వంత సంగతులు చెప్పడానికి వ్రాయలేదు. స్వానుభవం పంచుకోవడానికి వ్రాస్తున్నాను. చిన్నవయస్సులో భక్తినాడి గట్టిపరచాలని రామకృష్ణ పరమహంస చెప్పిన వాక్కులోని నిజం నాకు స్వానుభవమని చెప్పడానికి వ్రాస్తున్నాను.

ఓసారి కృష్ణాష్టమి వేడుకల్లో మా వీధిలోని గౌడీయమఠం ప్రభూజీలు పిల్లలకి వక్తృత్వపోటీ పెట్టారు. శ్రీకృష్ణుడి గురించి మాట్లాడమన్నారు. నాకు ప్రధమ బహుమతి వచ్చింది. భగవద్గీత, చేతిలో ఇమిడేంత చిన్నపుస్తకం బహుమతిగా ఇచ్చారు. అది నా జీవితాన్నే మార్చేసింది. అదే తొలిసారి నాకు భగవద్గీత తెలియడం! ఇక ఎవరితో మాట్లాడినా గీత గురించే! అప్పుడు నాకు ఘంటసాల పాడిన గీత గురించి తెలిసింది. ఇక ఆ పుస్తకం, ఆ క్యాసెట్టు నాజీవితంలో ఓ భాగమైపోయాయి. ఇప్పటికీ, బుడుగు భాషలో చెప్పాలంటే “బోలెడు ఎక్కువగాక పోయినా, కుంచెం గానే అయినా” కర్మఫలాసక్తినీ, కర్తృత్వాహంకారాన్ని విడిచిపెట్టి ఏపనైనా చేయగలుగుతున్నానంటే అది గౌడీయమఠం పెట్టిన భిక్షే! ఆ విధంగా నాకూ, మా కుటుంబానికి గౌడీయమఠంతో విడదీయలేని అనుబంధం ఉంది. నా ఫ్యాక్టరీని 1989 లో నాటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీ ప్రారంభించే ముందు, గౌడీయమఠం ప్రభూజీల చేత పూజ, యజ్ఞం నిర్వహించి గృహప్రవేశం చేశాము.

ఆ అనుబంధంతోనే కోల్ కతా లోని గౌడీయమఠాన్ని, మాయాపూర్ లోని వారి ప్రధాన శాఖనీ సందర్శించాము. అక్కడ కొన్నిరోజులున్నాము కూడాను. ఈ నేపధ్యంలోనే మాయాపూర్ లోని ఇస్కాన్ ని కూడా సందర్శించాము. అక్కడా కొన్నిరోజులు బస చేశాము. ఇక అసలు విషయానికి వస్తాను.

గౌడీయమఠం వారికి దశాబ్ధాల క్రితం నుండీ భక్తులు వ్రాసిచ్చిన భూములున్నాయి. అపారమైన ఆస్థే అది. పూరీ జగన్నాధుడి క్షేత్రంలో జరిపే రధయాత్రకి అనుగుణంగా వారు అక్కడ ఉత్సవాలు జరుపుతారు. ఊరందరికీ, విచ్చేసిన భక్తులందరికీ భోజనాలు పెడతారు. అందులోనే[బృందావనం శాఖలో] బ్రహ్మచారిగా చేరిన ప్రభుపాదుడు తదనంతరం విభేదాలతో బయటికొచ్చాడు.

సన్యాసులైనంత మాత్రనా అరిషడ్వర్గాలు వదలవు అన్నది నిజం. కౌపీన సంరక్షణార్ధం, సన్యాసి సంసారి అయిన కథ అందరికీ తెలిసిందే అయినా మరోసారి చెబుతాను.

అనగా అనగా…..

ఒకతనికి యవ్వనదశలో ఉండగానే వైరాగ్యం కలిగి సన్యసించాడట. గ్రామానికి దాపులనున్న అడవిలో, ఓ కుటీరం నిర్మించుకుని కాషాయాంబరధారియై జపతపాలతో జీవనం సాగిస్తున్నాడు. ప్రతీరోజు అతడి కౌపీనం [గోచీగా వాడే వస్త్రం] ఉతికి ఆరేస్తే, ఎలుక కొట్టిపోతోంది. అతడికి చిరాకు వేసింది. గ్రామానికి భిక్షకోసం వెళ్ళినప్పుడూ, గ్రామస్థులు తనకి భిక్ష ఇవ్వవచ్చినప్పుడూ అదే అంటే, ఎవరో పిల్లిని పెంచుకోమని సలహా ఇచ్చారు. సన్యాసి ఓ పిల్లి కూనని తెచ్చి పెంచడం మొదలుపెట్టాడు. ఎలుక బాధ పోయింది. దాంతో ఎంతో సంతోషించాడు. అయితే పిల్లి పాలకోసం అతని కాళ్ళుచుట్టుకి తిరుగుతోంది. గ్రామస్థులని పిల్లికూనకి పాలకోసం అర్ధించాడు. ఎవరో ఓ ఆవుని పెంచమని సలహా ఇచ్చారు. ఓ ధనికుడు ఆవుని దానంగానూ ఇచ్చాడు. సన్యాసి ఆవుని కుటీరానికి తోలుకొచ్చి మేపసాగాడు. జపతపాలు కోసం వెచ్చించాల్సిన సమయాన్ని గో పోషణ కోసం ఉపయోగించాల్సి వచ్చింది. ఆవుని పచ్చిక బయళ్ళలో మేపుకు రావటం, పేడ ఎత్తి గోశాల శుభ్రం చేయటం, పాలు పితికి కాచుకోవటం అన్నీ పనులే. దానితో ఎవరో పెళ్ళిచేసుకోమని సలహా ఇచ్చారట. సన్యాసి కాస్తా పెళ్ళి చేసుకుని సంసారి అయిపోయాడు. ఇంకెందుకు కుటీరం? అందుకే ఎంచక్కా తన స్వస్థలానికి తిరిగి వెళ్ళాడు శ్రీమతితో సహా!

ఈ కథ చెబుతూ పెద్దలు ’గోచి గుడ్డమీది వ్యామోహం సన్యాసిని సంసారిని చేసింది’ అంటారు.

అలాగే – గౌడీయమఠంలో ఉన్నది సన్యాసులే అయినా లోతుగా చూస్తే, వారిలోనూ, కొందరిలో ఈర్షాసూయలూ, ఆధిపత్యపోరాటాలు కూడా ఉన్నాయి. ఇది ఎక్కడైనా ఉంటాయనుకోండి. సరిగ్గా ఇలాంటి భావోద్రేకాలతోనే ప్రభుపాదుడు ఉండేవాడు. 1892 లో స్వామి వివేకానంద చికాగో మత మహాసభ ఉపన్యాసం తర్వాత సి.ఐ.ఏ. కన్ను ఇండియా మీద పడిందనీ, సి.ఐ.ఏ.ని భారత్ మీదకి ఉసిగొల్పడం అనువంశిక నకిలీ కణికుల పధకంలో భాగమనీ, ఇంతకు ముందు టపాలలో వ్రాసాను. ఆ రీత్యానే కాదు, స్వాతంత్ర సమరంలో సైతం, బహుముఖపాత్ర పోషించిన వారిలో అగ్రగణ్యులు వంగరాష్ట్రీయులే గనుక నకిలీ కణిక వ్యవస్థ, వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరీ వంగప్రజల దృక్పధాన్ని విషపూరితం చేసింది, చేస్తూనే ఉంది. అందులో భాగంగానే, అది, గౌడీయమఠంపై గురిపెట్టింది. ఒక్క గౌడీయమఠం అనేకాదు, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడల్లా పనిచేసింది.

కాబట్టే ఆధిపత్యపు పోరు నేపధ్యంలో వైషమ్యాలు రేపబడ్డాయి. అందులోంచి శ్రీల ప్రభుపాదుడు బయటికొచ్చాడు. చేతిలో సంచి, గొడుగుతో అమెరికా వెళ్ళాడు. అతడి ఉపన్యాసాలు అమెరికన్లని ఉర్రూతలూగించాయి. అక్కడే ఇస్కాన్[International Society for Krishna’s consciousness ] ను స్థాపించాడు. అయితే, తదనంతరం తనదీ గౌడీయమఠంలోని భాగమేనని, అందుచేత మఠపు ఈనాం భూములలోనూ, ఆస్థులలోనూ తనకీ అంటే తన సంస్థకీ వాటా రావాలనీ కోర్టులో కేసు వేసాడు. [ఈ విషయాన్ని మీడియా ఎప్పుడూ ప్రచారించదు] కుట్రలో తనపాత్ర, తాను సమర్ధంగానూ, రహస్యంగానూ పోషించే న్యాయవ్యవస్థ, న్యాయ స్థానం, కేసుని ఏళ్ళ తరబడి విచారించింది.

ఈ లోపున అమెరికా భక్తుల నుండి శ్రీల ప్రభుపాదుడికీ, అతడి ఇస్కాన్ కి తామరతంపరగా నిధులొచ్చిపడ్డాయి! మాయాపూర్ లో గౌడీయమఠపు ప్రధాన కేంద్రానికి కూతవేటు దూరంలో ఎకరాల కొద్దీ విశాల ప్రాంగణంతో ఇస్కాన్ గుడి కట్టబడింది. ఇటుప్రక్క, గౌడీయమఠం వారి ఆస్థులన్నీ కోర్టు నియంత్రణలోకి పోయాయి. సస్యశ్యామల క్షేత్రాలైన పొలాల నుండి రాబడి లేదు. తాత్కాలికంగా భక్తులిచ్చే చందాలతో మఠం నడపవలసి వచ్చింది. ఆ దశాబ్ధంలో చాలా సార్లు, అక్కడున్న బ్రహ్మచారులు [సన్యాసించిన వారు] పస్తులున్నారు. ఆకలికి తాళలేని వారిలో కొందరు, బయటకిపోయి ఇస్కాన్ లో చేరిపోయారు. కొందరు సన్యాసం వదిలేసి ఇంటికెళ్ళిపోయారు. సుదీర్ఘకాలపు న్యాయపోరాటం తర్వాత, తీర్పు శ్రీల ప్రభుపాదుడికి అనుకూలంగా వచ్చింది. గౌడీయమఠానికి, బ్రిటిషు వారి నుండి స్వాతంత్రం పొంది భారతదేశపు కేంద్రప్రభుత్వం ఏర్పడటానికి ముందు, దశాబ్ధాల క్రితం, దాతలూ, భక్తులూ దానంగా ఇచ్చిన ఆస్తులు పంపకం చేయబడ్డాయి.

ఆ ఉత్సాహంతో గౌడీయమఠంలో నుండి మరికొందరు బ్రహ్మచారులు, మహారాజ్ లు [జూనియర్ శ్రీల ప్రభుపాదులన్న మాట] పుట్టుకొచ్చారు. సీనియర్ శ్రీల ప్రభుపాదుడు తొక్కిన కోర్టుదారే తొక్కారు. వెరసి మాయాపూర్ లో గౌడీయమఠపు కొత్తకొత్తశాఖలు పుట్టుకొచ్చాయి. ఇదంతా జరగడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ఈ లోపున ఇస్కాన్ ’ఇంతింతై.... ’ అన్న చందాన పెరిగింది. దేవాలయాల పేరిట, రిసార్టులు పుట్టడం ఇస్కాన్ తోనే ప్రారంభమయ్యింది. దేవాలయానికి తల్లిదండ్రుల వెంట వెళ్ళే చిన్నారులు ఆడుకోవడానికి జారుడు బల్లలూ, మారిగో రౌండ్ లతో కూడిన చిల్డ్రన్ పార్కులు అనుసంధానించబడిన అక్షరధామ్ లకు ఇస్కాన్ మార్గదర్శి అన్నమాట.

ఇక్కడో విషయం పరిశీలించండి. శ్రీల ప్రభుపాదుడు 1965 లో అమెరికా వెళ్ళాడు, కేవలం ఒక చేతి సంచి, గొడుగు, ఆరు డాలర్లకు సరిపడినంత భారతీయ రూపాయలు, పెట్టేల కొద్దీ పుస్తకాలతో! 1966 లో న్యూయార్కులోనే ఇస్కాన్ ను స్థాపించాడు. లక్షల కొద్దీ భక్తులు పుట్టుకొచ్చారు. మిలియన్ల కొద్దీ డాలర్లు విరాళాలుగా ఇచ్చారు. అయినా శ్రీల ప్రభుపాదుడు, గౌడీయమఠపు ఆస్థుల గురించి కోర్టుకు వెళ్ళాడు. ఆస్థుల్ని కోర్టుల ద్వారా స్థంబింపచేశాడు. తనకూ, తన శిష్యకోటికీ పస్తులుండాల్సిన అగత్యం లేదు సరికదా, తన సంస్థ ఇస్కాన్ విదేశీ విరాళాలతో మూడుపువ్వులూ ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. తన పూర్వాశ్రమ సహసన్యాసులైన గౌడీయమఠవాసులు మాత్రం, ఆస్థులు కోర్టుద్వారా స్థంబింపబడి ‘పస్తులుంటున్నారు’. ఇంత దయామయ శ్రీల ప్రభుపాదుడు, ’ఇస్కాన్ చుట్టూ ఎవరూ ఆకలితో బాధపడకూడదు. వారికి కడుపునిండా అన్నం పెట్టండి’ అని వీధిబాలలని అక్కున చేర్చుకున్న శ్రీల ప్రభుపాదుడు, తన మాజీ సహ సన్యాసులని పస్తుల పాలెందుకు చేసినట్లు? తనకీ, తన సంస్థకీ ఏలోటూ లేదు. ‘పోనీ పాపం’ అనుకునైనా గౌడీయమఠాన్ని ఉపేక్షించలేదంటే అర్ధం ఏమిటి? అంతరార్ధం ఏమిటి? 'హిందూమతం మీద కుట్ర' తప్ప మరో కారణం, కాదంటే కాదు.

అసలు ఈ మధురభక్తికి ఆద్యుడు, చైతన్యుడి జన్మస్థలం మాయాపూర్ లో ఉన్నది. ఈ శ్రీల ప్రభుపాదుడి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకుర చైతన్యుడి మధురభక్తి గురించి ఇంగ్లీషులో ప్రచారించమని కోరాడు. చైతన్యుడి మధురభక్తి సిద్ధాంతం మీద ఆధారపడి ఇస్కాన్ ఇన్ని ఆస్తులు సంపాదించింది. పదేహేడు సంవత్సరాల క్రితం మేము చైతన్యుడి జన్మస్థలం[నిమాయి] చూసినప్పుడు, ఏ ఆలనాపాలనా లేక బీదబీదగా ఉంది. ఇస్కాన్ డాబు, ధంబం, దర్భంతో వెలుగుపోతుంది. మరి శ్రీల ప్రభుపాదుడికి చైతన్యుడి జన్మస్థలం ఎలా పవిత్రం కాకుండా పోయింది?

అంతేకాదు, మీరు ఎప్పుడైనా మాయాపూర్ వెళ్తే పరిశీలించండి. ఇస్కాన్ లో రిసార్ట్ టూరిస్టుల విహార భక్తీ, ఇస్కాన్ పుణ్యనా శాఖోపశాఖలుగా చీలిపోయినా సరే, వివిధ గౌడీయమఠాలలో మధురభక్తి కన్పించి తీరుతుంది. రిసార్ట్ టూరిస్టులు గాకపోతే ఇస్కాన్ దేవాలయాలకు, పాశ్చాత్యులతో సరిసమానంగా భారతీయులు సైతం షార్ట్స్, స్లీవ్ లెస్ లతో రారు కదా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

వీలు కుదిరినప్పుడల్లా మీడియా, ఇస్కాన్ గురించీ, దాని వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాదుడి గురించీ వ్రాస్తుంటుంది. మచ్చుకి ఆగస్టు9, 2009 ఈనాడు ఆదివారపు సంచిక పతాక కథనం చూడండి. [ఇలాంటివి, ఇప్పటికి వివిధ పత్రికలలో చాలానే ప్రచురింపబడ్డాయి]


ఈ మధ్య మీడియా ప్రచురించే కథనాలలో, కాలానికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ఉండటం లేదు, గమనించండి. 350 సంవత్సరాలకు పైబడిన కుట్ర స్వరూప స్వభావాలు, ఎక్కడ అంచనాకి, అవగాహనలోకి వస్తాయోనన్న భయం, రానీయకూడదన్న జాగ్రత్త అది! ఈ శ్రీల ప్రభుపాదుడు 1966 లో అమెరికాలో ఇస్కాన్ ని స్ధాపించాడు. 69 ఏళ్ళ వయస్సులో తొలిసారి అమెరికా వెళ్ళాడు, అదీ ఒక చేతి సంచి, గొడుగుతో! [అచ్చం స్వామి వివేకానంద లాగా అన్నమాట! ఇక్కడా అనుకరణే! అనుకరణ ద్వారా స్వామీ వివేకానందుడితో, శ్రీల ప్రభుపాదుడిని సామ్యం చెప్పటం!] అంటే ఇతడు 1896–97 ప్రాంతాల్లో జన్మించి ఉండాలి. తదుపరి 1966 లకు ఉపయోగకారి అయ్యాడు.

మీడియా కథనం:
>>>ఓ సారి ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుడు తన గదిలో కూర్చుని భాగవతం చదువుకుంటున్నారు. అంతలోనే బయట ఏదో అలికిడైంది. కిటికీలోంచి చూస్తే గుండెల్ని పిండేసే దృశ్యం. ఎంగిలి విస్తళ్ళ కోసం పిల్లలు వీధి కుక్కలతో పోటీపడుతున్నారు. స్వామీజీ కళ్ళు చెమర్చాయి. ’ఇస్కాన్ చుట్టుప్రక్కల ఎవరూ ఆకలితో అలమటించడానికి వీల్లేదు. కడుపునిండా అన్నం పెట్టండి’ కచ్చితంగా చెప్పేశారు ప్రభుపాదులు. అప్పటి నుండి ఇప్పటిదాకా…. ఇస్కాన్ ఆ మార్గంలోనే నడుస్తోంది. ’అది మామూలు భోజనం కాదు. భగవానునికి సమర్పించిన ప్రసాదం. దాతలు భక్తితో ఇస్తారు. వండేవారు భక్తితో వండుతారు. కృష్ణుడికి నివేదించేవారు భక్తితో నివేదిస్తారు. వడ్డించేవారు భక్తితో వడ్డిస్తారు. ఆ భోజనంలోని ఆధ్యాత్మిక శక్తి మనసు మీదా ప్రభావం చూపిస్తుంది. కృష్ణ తత్వాన్ని ఆలోచనల్లో భాగం చేస్తుంది’ అంటారు, ఇస్కాన్ సభ్యుడు వాసుదేవ.

>>>పదేళ్ళ క్రితం [అంటే 1999 లో] బెంగుళూరులో పదిహేను వందల మందితో ప్రారంభమైన ’అక్షయ పాత్ర’ రోజూ పదిలక్షల మంది బడిపిల్లల కడుపునింపుతోంది. కడుపునింపడం అన్నది చాలా చిన్నమాట! ఆ భోజనం జీవితం మీద పసిపిల్లలకున్న దృక్పధాన్నే మార్చేసింది. బతుకంటే భయాన్ని పోగొట్టింది. ఆకలితో పాటూ ఆక్రమించే నిస్సత్తువనూ, నిర్లిప్తతనూ దూరం చేసింది. ఎవరూ ప్రార్ధన సమావేశంలో నీరసంతో కళ్లు తిరిగిపడిపోవటం లేదు. శ్రద్ధగా పాఠం వింటున్నప్పుడు కడుపులో ఎలుకలు గోలపెట్టడం లేదు. పోషక విలువల్లేక కళ్లచుట్టూ నల్లచారలు రావడం లేదు. గైరుహాజరీ తగ్గిపోయింది. అవసరమైతే, పోషకవిలువల లోపాలున్న పిల్లలకు మల్టీ విటమిన్ మాత్రలిస్తున్నారు. ’విద్యా అక్షయ పాత్ర’ మెరికల్లాంటి విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పైచదువులకు పంపిస్తోంది. ఫలితాల్లో వెనకబడ్డ పాఠశాలల ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తోంది.

>>>’పుడ్ ఫర్ లైఫ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ శాఖలన్నీ నిర్భాగ్యుల ఆకలి తీరుస్తున్నాయి. హైదరాబాద్ ఇస్కాన్ ప్రతినిధులు ప్రతి ఆదివారం వృద్ధాశ్రమాలకూ, అనాధ శరణాలయాలకూ, ఆసుపత్రులకూ వెళ్ళి…. కడుపునిండా కమ్మని భోజనం వడ్డిస్తున్నారు. పాకిస్తాన్ లో భూకంపం వచ్చినప్పుడు, చెచెన్యాలో, గాజాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు, ఆగ్నేయ ఆసియాను సునామీ చుట్టుముట్టినప్పుడు... ఇస్కాన్ ఆకలి కడుపులకు అండగా నిలిచింది. ఇంత చేస్తున్నా, ’అన్ని నిధులు సమకూరుస్తున్నవాడూ అంతమంది ఆకలి తీరుస్తున్నవాడూ కృష్ణుడే! మేం నిమిత్తమాత్రులం’ అంటుంది ఇస్కాన్ వినమ్రంగా.

ఈ అన్నదానాలు, వృద్ధాశ్రమ సేవా కార్యక్రమాలు 1992 తర్వాతే ఇస్కాన్ ఇంతగా విస్తరించింది. అంతకు ముందు [అంటే 1992 ముందు] అలాంటి కార్యక్రమాలు ఏవీ ఇస్కాన్ ప్రధాన కేంద్రం [మాయాపూర్, ప.బెంగాల్]లో నేను చూడలేదు. ఆ ఊరి అభివృద్ధికి ఇస్కాన్ ఎలాంటి చర్యలు తీసుకున్నదీ లేదు. ఎందుకంటే 1992 లో పీవీజీ ప్రారంభించిన మెదళ్ళతో యుద్ధపు పరిణామాల్లో ఇదీ ఒకటి గనుక! నెం.5 Vs నెం.10 గూఢచార పోరాటంలో ఇస్కాన్ పైముసుగు జారిపోయి, ఎక్కడ అసలు రూపం బహిష్కత మౌతుందో, అంచేత ప్రజల్ని అర్జంటుగా నమ్మించటం అవసరం గనుక!

మీడియా కథనం :
>>> మనం ఏం తింటున్నామో చెబితే… మన గుణమేమిటో చెప్పవచ్చు. మనం ఏం చదువుతున్నామో చెబితే… మన ఆలోచనలేమిటో చెప్పవచ్చు. మంచి భోజనం, మంచి పుస్తకం… సమాజంలో రెండూ కరువైపోతున్నాయి.

>>>బయట కాలుపెడితే చాలు, రజోగుణాన్నీ, తమో గుణాన్నీ పెంచే ఆహారం తప్ప మరొకటి దొరకడం లేదు. ఆ వడ్డనలోనూ ప్రేమ ఉండదు. పక్కా వ్యాపారం, భోజనాన్ని ఓ ప్రసాదంలా భక్తితో వండి, ప్రేమతో వడ్డించే సంస్థలుంటే ఎంత బావుంటుంది! హోటళ్ళు కూడా దేవాలయమంత పవిత్రంగా మారిపోతాయి. ఆ ఉద్దేశంతోనే ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ’గోవిందాస్ రెస్టారెంట్స్’ను ప్రారంభించింది. రసాయన ఎరువులూ, క్రిమిసంహారకాల జాడలేని కాయగూరలతో వండిపెడతారక్కడ. అల్లం, వెల్లుల్లి నిషిద్ధం. దినుసుల నాణ్యతలో రాజీ ఉండదు. చుట్టూ కృష్ణలీలల్ని వివరించే వర్ణచిత్రాలు, వినిపించీ వినిపించనట్లు భక్తి సంగీతం… ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో భోజనం ఎక్కళ్ళేని సంతృప్తినిస్తుంది. ’ఏ హోటల్ కు వెళ్ళినా భుక్తాయాసంతో బయల్ధేరతాం. గోవిందాస్ నుంచి మాత్రం, బోలెడంత చైతన్యంతో బయటికొస్తాం’ అంటారు. బెంగుళూరులో ఉంటున్న సాఫ్ట్ వేర్ నిపుణుడు సుధీంద్ర. పుస్తకాలు మన ఆలోచనల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకే, కృష్ణ చైతన్య సాహిత్యం ప్రపంచానికంతా అందాలన్నది ప్రభుపాదుల ఆదేశం. ఇస్కాన్ శాఖల్లో ఏటా పుస్తకోత్సవాలు జరుగుతాయి. వేలాది గ్రంధాలు ఉచితంగా పంచుతారు.

>>>విశ్వ చైతన్యం:
>>>ప్రభుపాదుల ఆశయం నెరవేరుతోంది. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తమైంది. ’హరేకృష్ణ’ విశ్వమంత్రమైనది. ఏ ఇస్కాన్ శాఖ కెళ్ళినా వసుధైక కుటుంబంలాగానే అనిపిస్తుంది. భిన్నదేశాల ప్రజలు దర్శనమిస్తారు. మనకే తెలియని మన భగవద్గీతను తాత్పర్య సహితంగా చెబుతారు. భాగవతాన్ని పరవశంగా వినిపిస్తారు. కులం లేదు. మతం లేదు. జాతి లేదు. కృష్ణ చైతన్యమే అర్హత. ఆశ్చర్యం! అక్కడ యువతీ యువకులే ఎక్కువ కనిపిస్తున్నారు. ’నా వయసు కుర్రాళ్ళంతా ఏ సినిమాకో షికార్లకో వెళ్తున్న సమయంలో నేను ఇస్కాన్ లో ఉంటాను. వాళ్ళు కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృధా చేస్తున్నప్పుడు… నేను ఏ భాగవతమో భగవద్గీతో చదువుకుంటాను. వాళ్లంతా నిద్రమత్తులో జోగుతున్నప్పుడు నేను ఏశాస్త్రపాఠాలో వింటుంటాను. వాళ్లకూ నాకూ తేడా ఒక్కటే. నాకు నేనేమిటో తెలుసు. నా జీవిత లక్ష్యమేమిటో తెలుసు. వాళ్లకది తెలుయదు….’ పట్టుమని పాతికేళ్ళు కూడాలేని లోక్ పాలక్ లో ఎంత స్పష్టత ఉంది! అలా అని అతనేం చదువుల్ని నిర్లక్ష్యం చేయడం లేదు. ఈ మధ్యే మంచి మార్కులతో ఎంబీయే పాసయ్యాడు. ఉద్యోగం ఓ సమస్యే కాదు. ఆ యువకుడి మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కృష్ణ చైతన్యం… ఎంతమందిలో అయినా ప్రత్యేకంగా నిలబెడుతుంది. శ్రీల ప్రభుపాదులు ’ఇస్కాన్’ను స్ధాపించింది ఇలాంటి వ్యక్తులతో నిండిన సమాజాన్ని నిర్మించడానికే.

మన భగద్గీతని మనకే విశదీకరిస్తారు. నిజమే! ఢిల్లీ ఇస్కాన్ శాఖలో గీతా మందిరపు [షో] ప్రదర్శనలో [తలకు 50/- రూపాయలతో అదనపు టిక్కెట్టు కొనడాన్ని భక్తులెవరూ వ్యాపార దృష్టితో చూడరాదు సుమా!] ఇస్కాన్ ప్రదర్శించిన భగద్గీత నిజంగా ’అపురూపమే!’ సిమెంటు శ్రీకృష్ణార్జున శిల్పాల నడుమ లైట్ అండ్ సౌండ్ షో చూసి తీరాల్సిందే. ఆ షో చివరిలో ’మాయ’ని డిమోన్ స్ట్రేషన్ చేయటం ఎలా ఉంటుందంటే మన ఎదురుగా వందల టీవీలు ఒకదాని ప్రక్కనొకటి, ఒకదానిపైన మరొకటి పెద్దగోడలా అమర్చబడిఉంటాయి. ఒక్కో టీవీలో ఒకో దృశ్యం... బాలభారతంలో బాలభీముడు, ఐరావతాన్ని భూమికి తీసుకురావడానికి, బాల అర్జునుడు నిర్మించిన బాణాల వంతెన మీద పైకెక్కుతూ ఉండగా, ఘంటసాల తన అద్భుతగళంతో ‘మానవుడే మహానీయుడు’ అని గానం చేస్తుండగా కమాలాకర కామేశ్వరరావు గారు తెరకెక్కించిన ’అంతరిక్ష దృశ్యాలు’ వంటివి వస్తుంటాయి. అదిట ’మాయ’ అంటే… ఆ తరువాత అద్దాల గదిలో పంపిస్తారు. అక్కడ క్రింద, పైన, ప్రక్కలా, మొత్తం అద్ధాలు బిగించి ఉంటాయి. అది కూడా ’మాయ’ అట. వీటి గురించి చెప్పేవాళ్ళు గానీ, మన అనుమానాలు తీర్చేవాళ్ళు గానీ ఎవ్వరు ఉండరు. ఈ ప్రదర్శనని 2005 లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు లోకల్ ట్రిప్ లో భాగంగా తిలకించాను. [టూరిస్టులను తీసుకువచ్చినందుకు బస్సువాళ్ళకి డబ్బులు ముట్టజెప్తారు.] తిరిగి హోటల్ రూం చేరుకున్నాక పగలబడి నవ్వుకున్నాం. అతిశయోక్తి కాదు, మీరు మాస్థానంలో ఉంటే మీరైనా నవ్వుకుంటారని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఇక ఈ మీడియా అంతా కలిసికట్టుగా, ఏకగళంతో కీర్తించే ఈ ‘శ్రీల ప్రభుపాదుడు’ లేదా ‘భక్తి వేదాంత ప్రభుపాదుడి’ రెండో ముఖాన్ని, ఇస్కాన్ ముసుగు వెనక ఉన్న గూఢచర్య తంత్రాన్ని, మీకిప్పుడు విశదీకరిస్తాను. ఇది నాకెలా తెలుసో, ఇందులోని సత్యాసత్యాలు మీరెలా నిర్ధారించుకోవచ్చో కూడా వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

తొలిరోజుల్లో సినిమా రంగం మిగిలిన కళారూపాలతోనూ, కళారంగాలతోనూ పోటీ పడేందుకు తీవ్రంగా పెనుగులాడవలసి వచ్చింది. అందుచేతే పాత సినిమాలన్నీ[భారతదేశంలోని పాత సినిమాలు, ఏ భాషలోనివైన సరే] పురాణగాధలపైనా, చారిత్రక జానపద కధాంశాల పైనా ఆధారపడి ఉండేవి. నాయికా నాయకులకు త్యాగనిరతి, ధీరత్త్వం ఉండటం తప్పనిసరి. కాబట్టే అప్పటి సినిమాలు సాహిత్య సంగీత విలువలతో నిండి, ఎక్కువ ప్రదర్శనాకాలం కలిగి ఉండేవి. అప్పట్లో సాంఘిక కథలని ప్రజలు తోసిపుచ్చేవారట. “ఆఁ. ఏం కథలురా? ఓ పుణ్యమా, పురుషార్ధమా?" అనేవారట. మెల్లిగా ప్రజలు సినిమాల పట్ల ఆకర్షితులయ్యారు. మెల్లిగా సినిమా రంగంలోని సాంకేతికత, యాంత్రిక పరిజ్ఞానం తాలుకూ అడ్వాంటేజ్ లు పనిచేయటం ప్రారంభించాయి. నటీనటులకు పాడగల నైపుణ్యం లేనప్పుడు [ప్లే బ్యాక్ సింగర్స్] నేపధ్యగాయకులు అందుబాటులోకి వచ్చారు. కెమెరా పరిజ్ఞానం దృశ్యాలని, నటీనటులని అందంగా ఆకర్షణీయంగా చూపించింది. ప్రపంచంలోగల అందమైన ప్రదేశాలని, రమ్యమైన రంగుల్లో చూపించింది. సామాన్య ప్రజలూ, రైతులూ దాదాపు వెళ్ళలేని, లేదా వ్యయప్రయాసలతో మాత్రమే దర్శించగల ప్రదేశాలని చూపించింది. భూమ్మీద లేని వింతల్ని కూడా సెట్టింగ్స్ వేసి, ఇప్పుడైతే గ్రాఫిక్స్ సహాయంతోనూ చూపగలిగి ప్రేక్షకుల్ని అద్భుతలోకాల్లో విహరించేలా చేస్తోంది. ఇవన్నీ ప్రజలనెంతో ఆకర్షించాయి, ఆకర్షిస్తున్నాయి.

ఈ విధమైన ప్లస్ పాయింట్లతో ప్రజలు సినిమాలకు అలవాటు పడటంతో, క్రమంగా మిగిలిన కళారూపాలు మరుగునపడ్డాయి. అయా కళాకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మెల్లిగా వాళ్ళు మరో వృత్తుల్లోకి మళ్ళారు. కాని రక్తంలో ఉన్న సృజనాత్మకత, కళాతృష్ణ వాళ్ళని అటు పదార్ధవాద ప్రపంచంలోనూ సర్ధుకుపోనివ్వడం లేదు. ఇటు భావవాద రసమయి కళాజగత్తులో అవకాశం లేదు. వెరసి వాళ్ళ జీవితాలు, జీవిత సాఫల్యాలూ త్రిశంకు స్వర్గస్తులైనాయి.

ఈ విధంగా, క్రమంగా పోటీ అంతరించింది. దాంతో తదుపరి కాలంలో సినిమా తన విశ్వరూపాన్ని ’డామినేషన్’ అన్న ప్రక్రియతో చూపటం మొదలుపెట్టింది. వాస్తవం చెప్పాలంటే ఇది మెండెల్స్ చెప్పిన పరిణామవాదమే [Struggle for existence]. ప్రతీ జీవి, ముందు జీవన పోటీలో ఆస్తిత్వం కోసం పోరాడుతుంది. పోటీ దారులు నశించాక, గెలిచిన జీవి, పరిస్థితుల మీద ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ఒక్క జీవశాస్త్రానికే కాదు, మోనోపలిగా రూపాంతరం చెందుతున్న ప్రతీ వ్యాపార రంగంలోనూ అనువర్తించవచ్చు.

ఈ దృష్టితో చూస్తే, కళారంగంలో – గతంలో కళారూపాలన్ని పురాణగాధలపై ఆధారపడి రూపొందినవై ఉండేవి. వాటితో పోటీ పడేందుకు సినిమారంగం కూడా పురాణగాధలపైనే ఆధారపడేది. క్రమంగా సాంఘిక సినిమాలు రావటం మొదలైంది. తొలినాళ్ళలో ప్రఖ్యాత నవలలూ, ఇతర అంశాల ఆధారంగా కథా చిత్రాలు వచ్చాయి. మీరు గమనించి చూడండి, పాత సినిమాల్లో ప్రజలని ఆకర్షించేందుకు సాంఘిక చిత్రాల్లో కూడా ప్రధాన కథకు అనుసంధానిస్తూ ఏదో రూపంలో ఓ చిన్ని పురాణ లేదా ఇతిహాస అంశాన్ని జోడించేవారు. ఉదాహరణకి ‘అప్పుచేసి పప్పుకూడు’ అనే పాత సినిమాలో నాయికా నాయకుల స్వప్నం రూపంతో ’నలదమయంతి’ ఉపాఖ్యానం మలచబడింది.

క్రమంగా సినిమా, ఇతర కళారూపాల మీద పట్టు సాధించింది. కాలం గడిచే కొద్దీ డబ్బూ, వ్యాపారం ఇబ్బడిముబ్బడి అయ్యింది. మెల్లిగా గాడ్ ఫాదర్ ల వ్యవస్థ కేంద్రీకృతం అయ్యింది. నియంత్రణ మొదలయ్యింది. వీరి తెరవెనుక నియంత్రణ, మొత్తం సినిమారంగాన్ని, ఎంతగా గుప్పెటలోకి తీసుకుందంటే, కథ దగ్గర నుండి నిర్మాణంలోని ప్రతీ అంశం దాకా, [Success] సఫలత దగ్గర నుండి సాఫల్య పండగల [Success functions] దాకా! ఈ మొత్తానికి ‘డబ్బూ, వ్యాపారం’ అన్నది పైకి చెప్పబడిన పైకారణం [over leaf reason] మాత్రమే. గూఢచర్య స్ట్రాటజీ, కుట్ర, అంతర్గత కారణం. ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటానికి, సినిమా, తిరుగులేని, ఏకైక సాధనం అయ్యింది. నిజానికి ఈ సినిమా రంగపు గాడ్ ఫాదర్ లు కుట్రదారులైన నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ ఏజంట్లు లేదా భాగస్వాములే.

ఈ గాడ్ ఫాదర్ ల వ్యవస్థ కారణంగా నైపుణ్యహీనులు అద్భుతనిపుణులుగా, నిర్వీర్య నిర్వేద కథలు అద్భుతమైన, బలమైన కథలుగా ’స్టాంపు’ వేయబడ్డాయి. ఆ విధంగా ’ఫట్’ సినిమాలు కూడా ’హిట్’ సినిమాలుగా చెప్పబడేవి. [ఇప్పుడూ ఆ ఒరవడి కొంత ఉంది] అప్పట్లో అంటే 1975 నుండి 1992 దాకా ఓ బహిరంగ వ్యాఖ్య ఉండేది, ఫట్ సినిమాలని హిట్ సినిమాల పేరిట ప్రదర్శిస్తున్న ధియేటర్లు, నష్టాల్లో నడుస్తున్నాయని! తర్వాత పంపిణీ వ్యవస్థ మాయాజాలంతో అసలు ఏ సినిమాకు డబ్బూ బాగా వచ్చాయో, దేనికి నష్టాలొచ్చాయో ఎవరికీ తెలీని స్థితి ఏర్పడింది. మీడియా, సినిమా పత్రికలూ, ఇతర పత్రికలు దేన్ని హిట్ అంటే అది హిట్, ఏది ఫట్ అంటే అది ఫట్ అనిపించుకోబడింది. ఒకోసారి హిట్ సినిమా తీసిన నిర్మాణ సంస్థలూ, నిర్మాతలూ నష్టాల్లో కూరుకుపోయేవారు, పంపిణీదారులకు లాభాల పంట పండేవి. ఫట్ అయినా ‘హిట్ అన్పించుకున్న’ నిర్మాణ సంస్థలూ, నిర్మాతలూ లాభపడేవారు. క్రమంగా నిర్మాణసంస్థలకీ, నిర్మాతలకి లాభసూత్రం తెలిసిపోయింది. దాంతో గాడ్ ఫాదర్ ల నియంత్రణానుసారం, వారిచ్చిన కధాంశాలతో చిత్రనిర్మాణం సాగించటం చేశారు. దాంతో ధియేటర్లలో ఫట్ సినిమాలు హిట్ పేరుతో ప్రదర్శింపబడుతూ నష్టాలొచ్చినా సరే, 50 రోజుల లేదా 100 రోజుల పండగలు మాత్రం జరపబడేవి. కేవలం కొందరు రచయితలూ, గాయకులూ, నటులూ, నటీమణులూ, అలాగే దర్శకులూ ఇతర సాంకేతిక నిపుణులూ మాత్రమే ఖ్యాతినీ, కెరియర్ నీ పొందారు. మిగిలిన వాళ్ళు పోటీపడలేక తెరమరుగైపోయారు. క్రమంగా ’మోనోపలి’ స్థాపించబడింది. తమకి నచ్చని వ్యక్తులపైనా, లేదా తమమాట వినని వ్యక్తులపైనా [వాళ్ళెవరైనా సరే! నటీనటులు కావచ్చు, దర్శక నిర్మాతలు కావచ్చు] దుష్ర్పచారాలు, వత్తిళ్ళు నడిచాయి. ఇందులో భాగమే శ్రీమతి భానుమతీ రామకృష్ణకు మీడియా ఇచ్చిన బిరుదు ’అహంకారి’. అలాగే మహానటి సావిత్రికిచ్చిన దుష్కీర్తి తాగుబోతు. ఇందిరాగాంధీకి ప్రత్యామ్నాయంగా, ఇమేజ్ ఇచ్చి ఉపయోగించదలిస్తే సావిత్రి అంగీకరించలేదన్న కసీ,కోపం, ఆవిడపై ఒత్తిళ్ళు కలగజేసి, వ్యక్తిగత జీవితం వైఫల్యాల పాలై, వ్యసనపరురాలైందన్న ప్రచారం హోరెత్తింది. నిజంగా కూడా ఆవిడ, కెరియర్, డబ్బూ అన్నీ నష్టపోయి అవసానదశలో నరకం చవిచూసిందని పేరు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ ల పట్టు మరింతగా పెరిగిపోవటం కూడా సత్యం. తమకు అనుకూలురైన వారికి ఇమేజ్, అనుకూలం కాని వారికి డామేజ్ ఇవ్వగల సత్తా, అప్పటికి గాడ్ ఫాదర్ లూ, మీడియా వ్యవస్థీకరించుకున్నారు. మీరు 75 నుండి 92 వరకూ గల సమయాన్ని పరిశీలించనట్లయితే, సినిమా రంగానికి సంబంధించిన వివిధ విభాగాలు సంగీతం, దర్శకత్వం, నాయికా నాయకుల కెరియర్ మొదలైన విషయాల్లో ఈ స్థితి మరింతగా పెరగడం గమనించవచ్చు.

ఓ ఉదాహరణ పరిశీలించండి. 1970 లలో, 1980 కు ముందు తెలుగు సినిమా సంగీత రంగంలో కనీసం 20 మంది గాయనీగాయకులు ఉండేవాళ్ళు. ఘంటసాల, పీబీ శ్రీనివాస్, పిఠాపురం, మాధవపెద్ది సత్యం, కెబికె మోహన్ రాజు, ఎ.ఎం.రాజా, [అప్పడప్పుడూ బాలమురళీకృష్ణ, జేసుదాసులు పాడేవారు] జిక్కీ, జమునారాణి, లీల, సుశీల, రాణి, రమోలా, ఎల్.ఆర్. ఈశ్వరి మొదలైన వాళ్ళు, ఎంతోమంది ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో అంటే 1980 ల తర్వాత నుండి 1992 వరకూ గమనించండి. మొత్తం పరిశ్రమని అధిపత్యం చలాయిస్తూ గాయకుడు బాలసుబ్రమణ్యం, గాయనీమణులు సుశీలా, జానకి, చిత్రలు మాత్రమే తెలుగు సినిమా పాటల్ని పాడారు. 1990 ల తర్వాత బాలసుబ్రమణ్యం ప్రభ హిందీ సీమకి సైతం పాకింది.

ఈ విధమైన ’మోనోపలి’ని సృష్టించడం ద్వారా, మొత్తం సినిమారంగాన్ని, సినిమావ్యాపారాన్ని, నియంత్రించటం, దాన్ని డబ్బుగా మార్చుకోవటం, గాడ్ ఫాదర్ లకు సులభసాధ్యమైంది. ఎవరైతే గాడ్ ఫాదర్ లకు విధేయులో వాళ్ళు మాత్రమే సినిమారంగంలో రాణించేవారు, అవిధేయులు తెరమరుగైపోయేవారు. ఈ స్థితి నటీనటుల దగ్గర నుండీ, దర్శక నిర్మాతలూ, కథారచయితలూ, సంగీత దర్శక, గాయకుల వరకూ, ఇతరుల వరకూ ఉండేది. అంతేకాదు అన్నిభాషల చిత్రసీమల్లో ఇదే స్థితి ఉండేది.

ఈ విధంగా ఎవరినైనా, దేనినైనా Fade in or Fade out చేయగల శక్తి, అంటే హిట్ లేదా ఫట్ స్టాంపు వేయగల శక్తి, గాడ్ ఫాదర్ లకి సినిమా రంగమ్మీద 100% పట్టునిచ్చింది. పైకి కనబడటానికి ఈ గాడ్ ఫాదర్ ఒకవ్యక్తి కావచ్చు లేదా ఒక సంస్థ కావచ్చు. అయితే సదరు వ్యక్తుల లేదా సంస్థల వెనుకా ఉండేది అచ్చమైన గూఢచర్యమే. ఈ మేలి ముసుగు వేసుకుని పనిచేసింది నకిలీ కణిక వ్యవస్థే. కాబట్టే భారత దేశంలోని అన్ని భాషాచిత్రాలదీ ఇదే కథ కాగా, ప్రపంచభాషల్లోనూ పరిస్థితి తద్భిన్నమేమి కాదు. బాలీవుడ్ చిత్రసీమలో తొలినాళ్ళలో హాజీ మస్తాన్, మొదలియార్, ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఇలా పరంపర కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళ ఆశీస్సులుంటే పెట్టుబడి దగ్గర నుండి విజయోత్సవ సభ దాకా అన్నీ సజావుగా సాగిపోతాయి. లేకుంటే ఇంతే సంగతులు.

ఓ ఉదాహరణ పరిశీలిస్తే ఈ విషయం మరింత సుస్పష్టంగా కనబడుతుంది. 2000 సంవత్సరంలో ప్రముఖ పత్రికలన్నింటిలోనూ ప్రచురితమైన ఉదంతం ఇది. అప్పట్లో దావూద్ ఇబ్రహీంతో, హిందీ సినిమా నటుడు సంజయ్ దత్ [ఇతడి తండ్రీ సునిల్ దత్ కూడా, రాజ్ కపూర్ లా దేశవిభజన సమయంలో పాకిస్తాన్ నుండి భారత్ కి వచ్చినవాడే] సంభాషణ గల టేపులు, [టెలిఫోన్ ట్యాపింగ్ వట] బయటికొచ్చాయి. వాటిల్లో స్కూలుకుర్రాడు, సహవిద్యార్ధుల గురించి ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేసినట్లుగా, సంజయ్ దత్, తన సహనటీనటుల గురించి ఫిర్యాదు చేస్తున్నట్లుంది. ఆ విషయమై ఎంతో సంచలనమూ రేగింది. సందేహాస్పదమూ అయ్యింది. అదొక్కటే కాదు 2008, నవంబర్ 26న ముంబై ముట్టడి నేపధ్యంలో సైతం, ఈ నటీనటులెవ్వరూ పాక్ తీవ్రవాదాల్ని పల్లెత్తుమాట అననూ లేదు. భారతీయుల వేదనను పంచుకోనూ లేదు. ప్రాణాలు కోల్పోయిన వారిపట్లగానీ, ప్రజల ప్రాణాలని కాపాడటానికి తమ ప్రాణాలు ధారపోసిన పోలీసుసిబ్బంది, వీర జవానుల గురించి గానీ, ఒక్క సంతాపమూ చెప్పలేదు. తమిళ పరిశ్రమలో చిన్ననటులు మాత్రమే సంతాపసభ నిర్వహించారు. రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా సంతాపం తెలియజేయటానికి ఆ సభకు రాలేదు. అంతగా, కెరియర్ కోసం, గాడ్ ఫాదర్ ల పట్ల దాసులు, సదరు నటీనటులు! నకిలీ కణిక వ్యవస్థకు చెందిన గాడ్ ఫాదర్ లకు పాక్ ప్రాణసమానులు కదా మరి? పరిశీలించి చూస్తే ఇలాంటి తార్కాణాలు కోకొల్లలు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ప్రజల సువర్ణముఖిలో ఒక కోణం – ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు! రకరకాల ప్రైవేట్ టీవీ ఛానెళ్ళలో ‘డాన్స్ బేబీ డాన్స్’ వంటి నానారకాల కార్యక్రమాలు చూసి చాలామంది ఘోల్లుమంటున్నారు. ’ఇదెక్కడి విషసంస్కృతి రా బాబూ’ అని దిగ్ర్భాంతి పడుతున్నారు. చిన్నపిల్లలకి అర్ధనగ్న దుస్తులు వేసి, అసహ్యకర భంగిమలతో కూడిన సినిమా డాన్సులు చేయిస్తున్న ప్రైవేట్ టీవీ ఛానెళ్ళ కార్యక్రమ నిర్వాహకుల్ని, అందుకు ప్రోత్సహిస్తున్న కొందరు తల్లిదండ్రుల్ని చూసి నోరెళ్ళ బెడుతున్నారు.

ఇటువంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నామనో, ఆనందింపజేస్తున్నామనో, ఏకంగా ఉర్రూతలూగిస్తున్నామనో అంటున్న ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు ఇక ఎంత దూరం పోయారంటే నాట్యతారల, నటీమణుల స్వయంవరాలు [నాటకాలు, లేదా కేవలం నటనకోసం రూపొందించబడిన అంశాలకు ఆకర్షణ తగ్గిందేమో, నిజ జీవిత సంఘటనలు] వంటి కార్యక్రమాలతో టీవీ ఛానెళ్ళు అలరిస్తోన్నాయి. ఇటీవల రాఖీ సావంత్ అనే నాట్యతార, ఈ విధంగా వర పరీక్ష నిర్వహించి, వివాహ నిశ్చితార్ధం చేసుకోవటం ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ కమర్షియల్ సీరియల్ కార్యక్రమంగా ప్రసారం చేసింది. సదరు వార్త గురించి వ్రాస్తూ, స్థానిక దినపత్రిక ‘తన వరుడి ప్రక్కన సిగ్గుల మొగ్గ అయిన రాఖీ సావంత్’ అంటూ వ్రాసింది. శరీరం మీద నామమాత్రపు దుస్తులు వేసుకుని, చుట్టూ వందలమంది చూస్తుండగా వక్షస్థలాన్ని, పృష్ఠ భాగాల్ని ఊపుతూ, కాళ్ళు ఎడంగా పెట్టి శృంగార భంగిమల్ని ప్రదర్శించిన సదరు నాట్యతార, - తరచూ ముద్ధు ఇతర ఆశ్లీల సంఘటనల వివాదాలతో సంచలన వార్తాంశంగా ఉండే ఈనర్తకమణికి, ’సిగ్గు’ అనే సున్నిత భావం తెలుసో లేదో ఎవరు చెప్పగలరు? ఆ భావాన్ని అనుభూతించిన సదరు శృంగార నాట్యతారకీ లేదా ఆమె ఆ భావాల్ని అనుభూతించిందని వ్రాసిన పత్రికా విలేఖరికీ, ఇంకా ప్రచురించిన పత్రికాధిపతులకి మాత్రమే తెలియాలి.

దాదాపు పాతిక, ముప్పై సంవత్సరాల క్రితం, భారత్ లోకి ప్రైవేట్ టీవీ ఛానెళ్ళూ, ఇతర ప్రైవేటు సమాచార వ్యవస్థలకి తలుపులు తెరవాల్సిందిగా నాటి భారతకేంద్రప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ, మీడియా – ప్రైవేటు ఛానెళ్ళు వస్తే ఎంత లాభదాయకమో, విదేశాలలో టీవీ ఛానెళ్ళ స్వేచ్ఛ గురించి ఉపమానాలతో మరీ వివరించింది. ఎప్పటి వార్తలు అప్పుడే తెలుస్తాయంది. పక్షపాతరహితంగా వార్తలు ప్రజలకి చేరతాయంది. ఇందిరాగాంధీ వంటి, నాటి భారతదేశ నాయకత్వం, తమకు అనుకూలంగా, వార్తలు ఆకాశవాణి, దూరదర్శన్ [అప్పటికి ఇది ఇంకా బాలారిష్టాల దశలోనే ఉంది] ల ద్వారా ప్రచారిస్తున్నది అని మీడియా హోరెత్తించింది. ప్రైవేటు ఛానెళ్ళు వస్తే ఇందిరాగాంధీ, వగైరాల గుట్టు, బండారం బయటపడతాయనే అందుకు అడ్డుకుంటున్నారని విమర్శించింది. ఇక ప్రజల వినోదాలకు, ఆహ్లాదాలకు ఆకాశమే హద్దని ఊరించింది.

అప్పట్లో అంతగా ’ప్రయోజనకారి’ అంటూ ఎలుగెత్తి, నాటి మీడియా ప్రశంసించిన, ప్రైవేటు టీవీ ఛానెళ్ళు ఎంతగా ప్రజాసేవ చేస్తున్నాయో, ఇప్పుడు మనకి స్పష్టంగా కన్పిస్తూనే ఉంది, అనుభవానికొస్తూనే ఉంది. ఎంత ’నిజాయితీ’గా ’నిష్పక్షపాతంగా’ వార్తలు ప్రచారిస్తున్నాయో కూడా తెలుస్తూనే ఉంది.

నిజానికి విదేశాల్లో, అప్పటికే వేళ్ళూనుకున్న ఈ ప్రైవేటు ఛానెళ్ళు, అక్కడి ప్రజా దృక్పధాల్ని, జీవన సరళిని, వారి వారి సంస్కృతీ సాంప్రదాయాల్ని ఎంతగా దిగజార్చాయో, భ్రష్ఠపరిచాయో అప్పటి మన పాలకులకి తెలుసు. దేశం పట్లా, మన సంస్కృతి పట్లా, జాతీయత పట్ల నిబద్ధత గలవారు కాబట్టే, తమ వ్యక్తిగత ప్రతిష్ఠని ఫణంగా పెట్టి మరీ వ్యతిరేకించారు. అందుకు ప్రతిఫలంగా మీడియా వారికి, వారి వ్యక్తిగత ఇమేజ్, అధికారాలు కాపాడుకునేందుకే ప్రైవేట్ సమాచార వ్యవస్థల్ని, టీవీల ఛానెళ్ళనీ అడ్డుకుంటున్నారని దుమ్మెత్తి పోసింది. [వాళ్ళే గనుకా స్వార్ధపరులైతే, వ్యక్తిగతానికి విలువనిచ్చేవారైతే – ప్రైవేట్ ఛానెళ్ళనీ ఆహ్వానిస్తే, ఆ ఛానెళ్ళ వారు వెనుక తట్టున డబ్బులిస్తారు కదా? తమకి అనుకూలంగా బాకా ఊదుతారు కదా? అలాంటప్పుడు అడ్డుకోవలసిన అవసరం ఎందుకుంటుంది?] ఇవేవీ తెలియని ప్రజలు మీడియా ఊదిన నాగ స్వరానికి అనుగుణంగా పడగలూపిన పాముల చందాన ఉండిపోయారు.

ఆ కర్మ ఫలాన్నే ఇప్పుడు అంతా అనుభవిస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే ఇది ప్రజల సువర్ణముఖి! ఇందులో మరో కోణం కూడా ఉంది. అనుభవిస్తే గానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. మూసిన గుప్పిట్లో ఏదో ఉందన్న కుతుహలం ఉంటుంది. అలాగే ’నిప్పు[తప్పు] ముట్టకురా కన్నా! కాలుతుంది…. బాధపడతావు’ అని పాతతరం అంటే తెలిసీ తెలియని యువతరం ’ఎంత చక్కగా ధగధగలాడుతూ, భగభగమంటూ, ఎంత ఆకర్షణీయంగా ఉందీ నిప్పు? నేను దాన్ని ఆనందిస్తానని’ దాని ఆకర్షణకు లోనై పట్టుకుంటుంది. చేసేది లేక పాతతరం చూస్తూ ఊరుకుందనుకోండి అప్పుడు మన యువతరానికి ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటూ’ తత్త్వం బోధపరుచుకుంటారు. పెద్దలు కూడా ‘అనుభవమైంది కదా తత్త్వం బోధపడిందా?’ అని చెప్తే అప్పుడు మళ్ళీ దాని జోలికి వెళ్ళటానికి భయపడతారు.

ఏది ఏమైనా…. తెలిసి చేసినా తెలియక చేసినా, చేసిన కర్మఫలం అనుభవించక తప్పదన్నది పెద్దల మాట సాక్షాత్తూ గీత కూడా మనకు ఇదే చెబుతుంది.

కేవలం కర్మ చేయటం మాత్రమే మనవంతనీ, కర్మఫలం భగవంతునిదని నమ్మి ఆచరించే కర్మయోగి తప్ప, ఇందుకు మరెవ్వరూ అతీతులు కారు. ఈ విషయాన్నీ జ్ఞానయోగంలోని క్రింది శ్లోకాలలో భగవద్గీత స్పష్టాతిస్పష్టంగా చెబుతుంది.

శ్లోకం:
స మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా
ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న స బధ్యతే

భావం:
కర్మఫలం మీద ఆశలేనందువలన, కర్మలు నాకే మాత్రం అంటవు. ఈ తత్త్వంతో నన్నెరిగిన వాళ్ళని కూడా కర్మలు బంధించవు.

శ్లోకం:
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్

భావం:
ఇది తెలుసుకొని, ఎందరో ముముక్షువులు కూడా నిష్కామంగా కర్మలనాచరించారు. కాబట్టి, పూర్వుల రీతిగానే నువ్వుగూడా కర్మలను ఆచరించు.

శ్లోకం:
కిం కర్మ కి మకర్మేతి కవయో ప్యత్ర మోహితాః
తత్తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్ష్యసే2 శుభాత్

భావం:
ఏ కర్మలు చేయాలో, యే కర్మలు చేయకూడదో తెలుసుకోలేక, పండితులు సైతం భ్రమలలో చిక్కుకుంటున్నారు. ఏ కర్మతత్త్వాన్ని తెల్సుకుంటే ఆశుభాల నుండి నువ్వు ముక్తుడివవుతావో దాన్ని చెబుతాను విను.

శ్లోకం:
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః
ఆకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః

భావం:
కర్మ, అకర్మ, వికర్మ అనే మూడింటినీ క్షుణ్ణంగా తెల్సుకోవాలి. [ఎందుకంటే] కర్మగతి గాఢమైనది.

శ్లోకం:
కర్మణ్యకర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్

భావం:
కర్మలలో అకర్మలను, అకర్మలలో కర్మలనూ దర్శించే వాడే – బుద్ధిమంతుడు. వాడు సర్వకర్మలనూ ఆచరించినట్లే లెఖ్ఖ.

శ్లోకం:
యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః

భావం:
ఎవడు ఫలాపేక్షారహితుడో, కర్తృత్వాహంకారాన్ని జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడో, వాడే పండితుడు.

శ్లోకం:
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః
కర్మ ణ్యభిప్రవృత్తో పి నైవ కించి త్క రోతి సః

భావం:
ఫలాపేక్షలేకుండా, నిత్యతృప్తుడూ, నిరాశ్రయుడూ అయిన వాడు కర్మలు చేసినా, చేయనట్లే సుమా!

శ్లోకం:
నిరాశీ ర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్

భావం:
తృష్ణలేని వాడు, చిత్తాన్నీ ఇంద్రియాలనీ జయించిన వాడు, బ్రతుకు నిలిచేందుకు మాత్రమే వస్తుసామాగ్రిని సేకరించుకునేవాడు – పాపకూపంలో చిక్కుకోడు.

శ్లోకం:
యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
సమ సిద్ధావ సిద్దౌచ కృత్వాపి న నిబధ్యతే

భావం:
తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు, శంకారహితుడు, మాత్సర్యం లేనివాడు, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి గలవాడు – ఏ కర్మలను చేసినా బంధనాలలో చిక్కుకోడు.

[అప్పుడప్పుడు కొందరు బ్లాగు అజ్ఞాతలు మాతో ’జీవితంలో మేమేదీ సాధించలేదనీ, అనవసరంగా శ్రమపడుతున్నామనీ’ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అలాంటి వారికి మేం చెప్పే ఏకైక సమాధానం ఈ శ్లోకాలే.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

‘దాడులకు కుట్ర’ పేరుతో ఆగస్టు 18 వ తేదిన వచ్చిన ఈనాడు వార్తలో –
సోమవారం [17 Aug.2009] నాడు దేశరాజధానిలో అంతరింగిక భద్రత, కరువుపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం పలు కీలక ప్రతిపాదనలు, హెచ్చరికలు చేసింది. దేశం జాగరూకతతో ఉండాల్సిన అవశ్యకతను నొక్కిచెప్పింది. పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ప్రధాని అమలు చేశారు. “భారత్ పై తాజా దాడులకు పాకిస్తాన్ లోని తీవ్రవాద గ్రూపులు కుట్రలు పన్నుతున్నాయి. ఈ మేరకు మా వద్ద విస్పష్ట సమాచారం ఉంది. కాబట్టి దేశమంతటా అప్రమత్తంగా ఉండాల”ని హెచ్చరించారు.[ అంటే ప్రజలంతా తమని తాము కాపాడుకోవటానికి కాపలా కాసు కోవాలి కాబోలు!] తద్వారా… పాక్, అంతర్జాతీయ సమాజాలు స్పందించాలన్న సంకేతాల్ని పంపారు. ఈ ఏడాది చొరబాట్లు కూడా పెరిగాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని ప్రధాని చెప్పారు. “తీవ్రవాదుల కార్యకలాపాలు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి” అని ఆయన ముఖ్యమంత్రుల భేటీలో బహిరంగ హెచ్చరిక చేశారు. తీవ్రవాద ప్రణాళికలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం తమవద్ద ఉందని ఆయన తెలిపారు. జాలర్ల వేషంలో పాకిస్తాన్ కు చెందిన తొమ్మిదిమంది భారత్ లోకి ప్రవేశిస్తూ కచ్ తీరంలో పట్టుబడిన నేపధ్యంలో ప్రధాని ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మరో ముంబై తరహా దాడులకు తీవ్రవాదులు కుట్రపన్నుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఎన్నడూ భారత ప్రధాని ఒకరు ఇలాంటి హెచ్చరిక చేయలేదు” అని వ్రాసింది.

చాలాబాగుంది. మరి ఇన్ని తెలిసి ఉండీ, ఈ మన్మోహన్ సింగ్, ఇటీవలి ఈజిప్టు పర్యటనలో…. ముందస్తు అజెండాలో లేకపోయినా…. ఆకస్మికంగా….[వ్యక్తిగత ఆసక్తితో కాబోలు] పాక్ ప్రధాని గిలానీతో చర్చలు జరిపేసి, సంయుక్త ప్రకటన కూడా ఇచ్చేస్తూ….”బెలూచిస్తాన్ తో సహా, అన్ని విషయాలపై, ముంబైదాడుల ప్రసక్తి ప్రక్కన పెట్టి మరీ చర్చిస్తామని” ఎందుకు ప్రకటించినట్లు? ఈ విషయాన్ని పురస్కరించుకునే ప్రతిపక్షనేత యశ్వంత్ సిన్హా, సాక్షాత్తూ పార్లమెంట్ లోనే “భారత ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా పాక్ శిబిరంలో చేరిపోయారు” అన్నాడు. [అలా అన్నందుకు మూల్యం చెల్లించుకుంటున్నాడు లెండి. దృష్టాంతం కావాలంటే – ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం, యశ్వంత్ సిన్హాకు, స్వంత పార్టీ బిజేపి కూడా, పార్లమెంటు కమిటీల ఛైర్మన్ పదవుల్లో మొండిచెయ్యి చూపెట్టింది. తమ ప్రత్యర్ధి పార్టీ యూపిఏ ని అంత ఘాటుగా విమర్శించినందుకు, అలాంటి విషయాల్లో పార్టీ నాయకత్వాన్ని ఒత్తిడి చేస్తూ, ఎదిరిస్తూన్నందుకు భాజపా ఇచ్చిన బహుమతి అది. ఇక్కడ తెలియటం లేదూ భాజపా అగ్రనాయకులు అద్వానీ గట్రాలు కూడా, యూపిఏ మరియు కాంగ్రెస్ అగ్రనాయకుల్లానే నకిలీ కణిక వ్యవస్థలో సహచర సభ్యులని?]

నిజం చెప్పాలంటే యూపిఏ ప్రభుత్వం ఏవిధంగా ’సాచాటు ధోరణి,’ అనే పైముసుగులో దేశంపై టెర్రరిస్టుల దాడులు జరగనిస్తూన్నారో, అదేవిధంగా పాక్ ’భాదిత దేశం’ అనే పైముసుగులో తమ దేశపు గడ్డమీది నుంచే భారత్ పై టెర్రరిస్టు దాడులకు పధక రచన, అమలూ కూడా నిర్వహిస్తోంది.

ఈ విషయమై ఈనాడు మరో వ్యాఖ్య కూడా చేసింది. ’గతంలో ఎన్నడూ భారత ప్రధాని ఒకరు ఇలాంటి హెచ్చరిక చేయలేదు’ అని. నిజమే మరి! గత కాలంలో భారత ప్రధానులు ప్రజల పట్లా, దేశం పట్లా నిబద్ధత గలవారు. కాబట్టి ఆ దాడుల్ని ఎలా ఆపాలా, పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలా అని ప్రయత్నించేవాళ్ళు. మరి ఈ సింగ్ ఈజ్ కింగ్ కదా! అంచేత ఈయన గారు ప్రజల్ని అధికధరల విషయంలో [2008 మార్చి నాటి నుండి] లాగే ప్రజల్ని హెచ్చరించటంతో తమ బాధ్యత తీరిందంటూ చేతులు దులిపేస్తాడు.

ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. మన సింగ్ గారి దృష్టిలో పాక్ వేరు, పాక్ తీవ్రవాదులు వేరు. అక్కడికి అదేదో పాక్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ, ప్రభుత్వ నిఘా ఏజన్సీ ఐ.ఎస్.ఐ. గానీ పాక్ తీవ్రవాదుల్ని ప్రోత్సహించటం లేదన్నట్లు! ఆ విధంగా ఎంత చక్కని తోడ్పాటును పాకిస్తాన్ కు అందిస్తున్నారో, నాడు పాక్ నుండి వలస వచ్చిన నేటి భారత ప్రధాని! అంతేకాదు, ఆ విధంగా, భారత్ [ప్రజలతో సహా] వేరు, యూపిఏ ప్రభుత్వం వేరు అని కూడా నిరూపిస్తున్నారు. ఎటూ యూపిఏ ప్రభుత్వం పాక్ శిబిరంలో చేరి పోయిందన్నది తేలిపోయింది కదా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఓసారి ఈ క్రింది వార్త చూడండి. 16 Aug.,2009న ఈనాడు చివరిపేజీ వార్తగా ప్రచురించింది.

ఇస్లాం మతం స్వయంగా తమతోటివారిని, తమలో సగమైన భార్యల్ని, ఎంత కౄరదృష్టితో చూస్తుందో, చట్టాలు చేసి మరీ నిరూపించిందని పైవార్త తెలియ చేస్తుంది. దాన్ని గురించి వ్రాస్తూ, ఈనాడు, సదరు చట్టాన్ని ఏయే దేశాలు వ్యతిరేకించాయో వ్రాసిందే తప్ప, దాన్ని నిరసిస్తూ వ్యాఖ్యానాలేవీ చేయలేదు.

ఇక ఈ వార్త చూడండి. అదే రోజు షారూఖ్ ఖాన్ ని అమెరికా విమానాశ్రయంలో అవమానించారన్న వార్త నేపధ్యంలో మూడవ పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించింది.


అందులో ఇస్లాంపై పాశ్చాత్య భావాలు, పాశ్చాత్య దేశాల్లో ముస్లింలపై అభిప్రాయాలు ఎంత ‘దారుణంగా’ ఉన్నాయో సవివరంగా, ఉపమానాలతో మరీ వ్రాసింది. ఈ మధ్యకాలంలో చాలామంది ముస్లింలు సాప్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ, బాంబుపేలుళ్ళ కేసులో దొరికారు. అలాంటప్పుడు ముస్లింలను అనుమానించటం సహజం. అనుమానించేవాళ్ళని కాదు నిందించవలసింది. అలాంటి పరిస్థితులు వస్తే, తమ మతస్థులలో అమాయకులు కష్టాల పాలవుతారన్న స్పృహ, ఆ మతస్థులలో తీవ్రవాదానికి పాల్పడుతున్న వాళ్ళకి ఉండాలి. అలాగే మతపెద్దలు అలాంటి దాడులకు పాల్పడవద్దని, అలాంటివారికి సహాయం చేయవద్దని చెప్పాలి. లేకపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి.

మనలో మాట. శ్రీమాన్ షారుక్ ఖాన్ వంటి హిందీ నటులు ముంబైదాడుల నేపధ్యంలో సైతం, దాడులను ఖండించలేదు సరికదా, ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం ఒక్క దీపమైనా వెలిగించలేదు. కేరీర్ కోసం చిత్రసీమ గాడ్ ఫాదర్లయిన దావుద్ ఇబ్రహీంల పట్ల అంత విధేయత మరి! ఇలాంటి ఈ నటులని ఎందుకు అనుమానించకూడదు? ఈ నటులేమన్నా మన మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాంలా?

అయినా నాకు తెలియక అడుగుతానూ, తమ స్వంత భార్యల్నే శృంగారానికి, అంటే తమ కోరిక తీర్చడానికి ఒప్పుకోకపోతే, తిండికి మాడ్చటం తమ హక్కు అనే ఇస్లాం మతాన్ని దారుణమనక ఏమనాలి? తమ ఇంట్లోని వారి పట్లే అంత కౄరత్వం చూపగల ముస్లిం దేశాల ముస్లింలకి, ఇతర మనుషుల పట్లా, ప్రాణుల పట్లా దయ ఉంటుందని ఎలా అనుకోవటం? అదృష్టవశాత్తూ భారతీయ ముస్లింలు, ఇంకా, ఇంత బాహాటంగా, ఇలాంటి షరియత్ చట్టాలని సమర్ధించటం లేదుగానీ, లోలోపల, తెర వెనుకా, ముస్లిం ఛాందస వాదానికి సహాయం చేస్తున్న వాళ్ళు మన హైదరాబాద్ పాతబస్తీ ల్లాంటి ప్రదేశాల్లో చాలామందే ఉన్నారు. లేనిదే ఇన్ని టెర్రరిస్టు దాడులకి, పాకిస్తాన్ ఏజంట్లకి సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయి? అందిస్తూ హైదరాబాద్ ముస్లింలే ఎలా బయటికొస్తున్నారు?

ఇలాంటి ముస్లింలని అవమానిస్తున్నారంటూ, ఇస్లాంపై పాశ్చాత్య భావాలు, పాశ్చాత్య దేశాల్లో ముస్లింలపై అభిప్రాయాలు ఎంత ‘దారుణంగా’ ఉన్నాయో సవివరంగా, ఉపమానాలతో మరీ వార్తలు రాస్తున్న ఈనాడు, ఈనాడు అధిపతులు, మీడియా ముసుగేసుకున్న ఇస్లాం మద్దతుదారులని ఇక్కడ తెలియటం లేదూ?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!





మీతో ఓ ‘విచిత్రాన్ని’ పంచుకోవాలని ఈ టపా వ్రాస్తున్నాను. ’ఈనాడు’ రామోజీరావు గూఢచార కార్యకలాపాల మీద నేను 1992 లో నాటి ప్రధాని పీవీజీ కి ఇచ్చిన ఫిర్యాదు దరిమిలా ఈ 17 ఏళ్ళలో జరిగిన కథంతా…. 2008, జనవరి దాకా, నేటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు వ్రాసిన వరుస ఫిర్యాదుల వరకూ…. ఆ నేపధ్యంలో సిబిసిఐడి నుండి వచ్చిన విచారణాధికారి ఉదంతం వరకూ…. ఇంతకు ముందు టపాలలో వ్రాసి ఉన్నాను.

ఈ విద్యాసంవత్సరం తొలి రోజులలో ఉద్యోగప్రయత్నాలు ప్రారంభించి నంద్యాలలోని స్థానిక కాలేజీలో ఫీజిక్స్ ఎంసెట్ లెక్చరర్ గా చేరాను. రెండునెలల్లో అదీ ఊడింది. కథ యధాప్రకారమే. చేరేటప్పుడు ఒకరకం హామీలు, చేరాక అన్నీ చెల్లుచీటీలు, రోజుకో కొత్తరూలు. కొత్త వేధింపు. దానికి పరాకాష్ఠ ఏమిటంటే – ఈ మధ్య ఇంటి దగ్గర మేడమెట్లు దిగుతూ కాలు జారి పడిపోయాను. చిన్నపాటి ఫ్యాక్చర్ అయ్యింది. ఎడమకాలి చీలమండ వాస్తూ ఉన్నా, ఎలాగో సర్ధుకుపోతూ కాలేజీకి వెళ్తున్నాను. అయితే ఒకో క్లాసూ ఒకో అంతస్థులో వేస్తూ, ప్రతీ పీరియడ్ కి రెండంతస్థులు, ఎక్కి దిగుతూ, రోజు మొత్తంలో అయిదారుసార్లు ఎక్కి దిగాల్సి వచ్చేలా క్లాసులు వేసారు. రెస్ట్ తీసుకుందామంటే క్లాసులు ఎట్లా అంటూ ఒత్తిడి చేస్తేనే జారిపడిన మూడో రోజు నుండి క్లాసుకు వెళ్ళాను. దానికి తోడు ఎంసెట్ అన్నది నామమాత్రంగా చెప్పవలసిందని పరోక్ష, ప్రత్యక్ష ఒత్తిడి! పొమ్మన లేక పొగబెట్టటానికి ఆదివారాలూ పనిచెయ్యల్సాందే అంటూ కొత్త రూల్సు తీసారు. అదేమంటే అందరూ చేస్తున్నారట. ‘ముందు చెప్పలేదే’ అంటే జవాబుగా మాటలుండవు గానీ చేతలు మాత్రం ‘తప్పదు ఆదివారం కాలేజీకి రావలసిందే’నన్నది అల్టిమేటమ్. దాంతో కథ మామూలే!

సరే! ఈ లోపున, శ్రీశైలంలోని పాత మిత్రులూ, పాత విద్యార్ధుల తల్లిదండ్రులూ ఇచ్చిన సమాచారం ఏమిటంటే – శ్రీశైలం, చల్లా వెంకయ్య సత్రంలోని మా గది నెం.10 ని, ఇటీవల అంటే రెండునెలల క్రితం, స్థానిక దేవస్థాన ఉద్యోగి మధుసూధన రెడ్డి బంధువుకి ఎలాట్ చేసారట. అప్పట్లోనే ’ఆ గది కోసమే నీళ్ళీవ్వకుండా మమ్మల్ని వేధించి, మా రూం కాన్సిల్ చేయించారన్న’ ప్రచారం ఒకటి చేసారు. [నిజానికి నీళ్ళు మా ఒక్కరికే ఇవ్వకపోవటం కాదు, మొత్తంగా మా సత్రంలో తొలి అంతస్థులోని అందరినీ కలిపి వేధించారు. సూర్యాపేటలో మా ఒక్కరినే వేధిస్తే, శ్రీశైలంలో ఇదో పరిణామమన్న మాట] అంతలోనే స్థానిక పోలీసు సి.ఐ., యస్.ఐ.లు, మేం ఢిల్లీలో సోనియాగాంధీకి, రాష్ట్రపతికీ, ప్రధానమంత్రికి, ఈనాడు రామోజీరావు మీద 1992 లో నాటి ప్రధాని పీవీజీకి పెట్టిన ఫిర్యాదు దరిమిలా వేధింపుల మీద ఇచ్చిన ఫిర్యాదు, తమ దగ్గరికి విచారణ నిమిత్తం వచ్చిందంటూ, మమ్మల్ని పిలిపించి స్టేట్ మెంట్ల ప్రహసనం నడిపారు. ఆ నేపధ్యాన్ని పురస్కరించుకుని, అదే నిందిస్తూ అప్పటి Dy. E.O. కృష్ణయ్య మా గదిని కాన్సిల్ చేసాడు. [ఆ సమయంలో ఈ మధుసూధన్ రెడ్డి అనే దేవస్థానం ఉద్యోగి రకరకాల రూమర్స్ ప్రచారం చేసాడు. ఆ విషయం రాష్ట్రపతి నుండి స్థానిక పోలీస్ శాఖ వరకూ వ్రాసిన ఫిర్యాదులలో ఉటంకించాము.] దానిమీద మళ్ళీ ఢిల్లీ దాకా ప్రయాణించి, మేం విషయాన్ని కదపగా, దిగ్విజయ్ సింగ్, AICC జనరల్ సెక్రటరి, ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డికి సిఫార్సు లేఖ ఇచ్చాడు. దానిపైన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి స్పందిస్తూ మాటల్లో “కేసు సంగతి తర్వాత! ముందు ఉండటానికి రూం కావాలి కదా? Allotment cancelation ని recall చేస్తాను” అన్నాడు. చేతల్లో గమ్మున ఉండటంతో పాటు చాలా స్ట్రాటజీలే నడవటం గురించి గత టపాల్లో వ్రాసాను.

అలాంటి చోట, ఓ చిన్నగదిని దేవస్థానపు ఉద్యోగి [మధుసూధన్ రెడ్డి], తన బంధువుకు ఇప్పించుకోవటం కోసం, కేంద్రహోంమంత్రిత్వ శాఖ మొదలు కొని రాష్ట్రముఖ్యమంత్రి వరకూ, [ఈ విషయంలో రాష్ట్రపతి సిఫార్సుని కేంద్రమంత్రిత్వ శాఖ చెత్తబుట్ట దాఖలా చేసింది. దిగ్విజయ్ సింగ్, ఏ.ఐ.సి.సి సెక్రటరీగా, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా, ఇచ్చిన సిఫార్సుని రాష్ట్రముఖ్యమంత్రి చెత్తబుట్ట దాఖలా చేసాడు.] శాయశక్తులా, శతవిధాలా పాటుపడ్డారన్నమాట.

ఇందులో అసలు విచిత్రం ఏమిటంటే – ఈ శ్రీశైలం దేవస్థాన ఉద్యోగి మధుసూధన రెడ్డి మీద, శ్రీశైలంలో మాగది కాన్సిల్ నేపధ్యంలో, వరుస ఫిర్యాదులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలు అందరికీ చేసి ఉన్నాము. అప్పటికి అతడు యుడిసి. ఆ తర్వాత సూపరింటెండెంట్ అయ్యాడు. ఆ తర్వాత…. ఓరోజు దేవాలయ అతిధిగృహంలో మందూ, మాంసాలతో విందుచేసుకుంటుండగా ఈనాడు కెమెరా చేతికి చిక్కాడు. అతడికి మందు గ్లాసులు అందిస్తూ మా కేసులో మరో నిందితుడు, రమణయ్య [ఇతడు Dy.E.O. కు అప్పట్లో వంటవాడు] కూడా ఈనాడు కెమెరాకి దొరికిపోయాడు. కర్నూలు జిల్లా ఎడిషన్లో ఈ వార్త ప్రముఖంగా ఫోటోలతో సహా ప్రచురింపబడింది. ఆ తర్వాత డిమోషన్ మీద, మధుసూధన్ రెడ్డికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. రమణయ్య ఎటూ కాంట్రాక్టు లేబర్ లెండి. ఈ సదరు మధుసూధన్ రెడ్డి, తన బంధువూ, మరో కాంట్రాక్ట్ ఉద్యోగీ అయిన ’యోగి….రెడ్డి’ అనే వ్యక్తికి మా గదిని ఎలాట్ చేయించాడట. [పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, దేవస్థానపు ఈవోల సమక్షంలో పంచనామా అనంతరం కేటాయించారట] సదరు మధుసూధన్ రెడ్డిని, రమణయ్యని చట్టవిరుద్ధ కార్యకలాపాలు [దేవస్థాన పరిధిలో మందు, మాంసాల విందు చేసుకోవటం!అక్కడ దేవస్థానపు ఉద్యోగులు మద్యపాన మత్తులో విధులకు రావటం, భక్తులతో వాదప్రతివాదనలకు దిగటం సర్వసాధారణం. ఈ విషయమై భక్తులు ఫిర్యాదులు చేయటం కూడా పరిపాటే.] నిర్వహిస్తుండగా ఈనాడు పట్టుకున్నందున, ఈనాడు రామోజీరావుకు నా కేసులో ఏ సంబంధమూ లేదని నిరూపణ అయిపోయిందన్న మాట. [నా ఆరోపణ ప్రకారం వాళ్ళందరి వెనుక రామోజీరావు ఉన్నాడు.] తాడిచెట్టు ఎందుకెక్కావురా అంటే దూడగడ్డికోసం అన్నంత చక్కని ఎలీబీ! ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి గది ఇప్పించటానికి 60మంది పిల్లలకి చదువు చెబుతున్న స్కూలుని ఖాళీ చేయించారట. అందుకు పైనుండి క్రిందిదాకా అందరూ సాయపడ్డారట. నిజానికి, ఈరోజూ రేపూ ఈపాటి ఎత్తుగడ సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా అర్ధం అవుతోంది. మరి ఈనాడు రామోజీరావు కి ఎలా అర్ధం కాలేదో? మరీ నాసి, ఇంకా చెప్పాలంటే చెత్త ట్రిక్!

ఇందులో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉందండి. రిటైరై రెండేళ్ళు దాటిపోయినా, మాజీ ఉద్యోగి Dy.E.O. కృష్ణయ్య మాత్రం అతడి కాటేజ్ ని ఖాళీ చేయలేదు. అతడే కాదు నాతో పాటు మరికొందరికి కూడా నోటిసులు ఇచ్చారు. వాళ్ళెవరు కూడా ఖాళీ చేయలేదు. ఆ నోటిసులు అందుకున్న వారిలో దేవస్థానపు ఉద్యోగుల తాలూకు రెండు స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇతరులు శ్రీశైలంలో ఉంటున్నందున భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి గనుక మా రూం కాన్సిల్ చేసారు. ఈ వాదనతో కూడా ఒక నోటిసు అప్పట్లో ఇచ్చారు.

ఈ విధంగా విషయం మరోసారి సంఘటనాత్మకంగా ఋజువయ్యిందనుకోవచ్చు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఇంతకు ముందు టపాలలో వివరించినట్లు నకిలీ కణిక వ్యవస్థా, అందులో కీలకవ్యక్తి రామోజీరావు, వాళ్ళ నెం.10 వర్గానికీ, ప్రపంచవ్యాప్తంగా ఆయాదేశాల పట్ల నిబద్ధతా, మానవీయ విలువల పట్ల నమ్మకమూ గల నెం.5 వర్గానికీ మధ్య ఈ 17 ఏళ్ళుగా జరుగుతున్న గూఢచార పోరులో [పీవీజీ భాషలో చెప్పాలంటే మెదళ్ళతో యుద్ధం] రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. వాటిలో మొదటిది నెం.10 స్ట్రాటజీ బహిర్గతమవ్వడం! ఓ గూఢచార ఏజన్సీకి, గూఢచార సంస్థకీ, గూఢచార వ్యవస్థకీ తమ స్ట్రాటజీ బహిర్గతమవ్వడం అంటే మరణంతో సమానం. ఎందుకంటే తమ పనులు సానుకూలం చేసుకోవటానికి, తమ దోపిడి నిరాఘాటంగా జరుపుకోవడానికి స్ట్రాటజీయే వాళ్ళ ఆయుధం, పరికరం ఎక్సెట్రా. అలాంటి స్ట్రాటజీ బహిర్గతమైపోతే ఇక నిష్ఫలమే. ఇక రెండో అంశం ఏమిటంటే ఆయా గూఢచార ఏజంట్లూ, సంస్థలూ, వ్యవస్థలూ, కీలక వ్యక్తుల దగ్గరి నుండి అనామక ఏజంట్ల దాకా, తాము చేసిన కర్మ తాము అనుభవించటం. దాన్నే ‘సువర్ణముఖి’గా వర్ణించాను. ఆయా రంగాలు, దేశాలూ కూడా ఇందుకు మినహాయింపు కాదు.

అలా బహిర్గతమౌతున్న స్ట్రాటజీలని, ఆయా వ్యక్తులూ, వ్యవస్థలూ, రంగాల సువర్ణముఖిని వీలునిబట్టి వివరిస్తున్నాను.

ఈ టపాలో సినిమా రంగంలో బహిర్గతమైన స్ట్రాటజీని, అందులోని వ్యక్తులూ, వ్యవస్థలూ, అసలా రంగమే అనుభవిస్తోన్న సువర్ణముఖిని వివరిస్తాను.

సినిమా! అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. సమాజం మీద ఎంతో ప్రభావం ఉన్న మాధ్యమం. కాబట్టే సినీరంగంలో విజేతలుగా వెలిగిన హీరోలు రాజకీయనాయకులుగా రూపాంతరం చెంది దేశాధ్యక్షులూ కాగలిగారు. [రోనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడైనట్లు] రాష్ట్రగవర్నర్లు కాగలిగారు.[ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్ అయినట్లు] రాష్ట్రముఖ్యమంత్రులూ కాగలిగారు.[తమిళ నాడులో ఎం.జీ.ఆర్., జయలలిత, ఏ.పి.లో ఎన్టీఆర్] ఇప్పుడు సినీ నటుడు చిరంజీవి రాజకీయపార్టీ పెట్టడానికి, రజనీకాంత్ ఆవిషయమై ఊగిసలాడటానికి కూడా కారణం ఈ సినిమా ఇమేజే! అలాగే చాలామంది సినీనటులు ఎం.పీ., ఎం.ఎల్.ఏ.లూ కాగలిగారు.

సినిమా! గతంలో ఉన్న అనేక కళారూపాల స్థానే ఈనాడు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. ఎందుకంటే, సినిమా, విజయవంతంగా, ఒకప్పుడు సమాజంలో విస్తరించి ఉన్న అనేకమైన, భిన్నరకాలైన, అద్భుతమైన ఎన్నో కళారూపాలని పూర్తిగా అదృశ్యం చేసేసింది. ఇప్పుడు క్రమంగా సినిమాస్థానాన్ని టీవీ సీరియళ్ళతో ఎలక్ట్రానిక్ మాధ్యమం ఆక్రమిస్తోందంటున్నారు.

వాస్తవానికి సమాజం సాహిత్యం, కళారూపాలతో ప్రభావితమౌతుంది. మనదేశ చరిత్రలోనే కాదు, ఫ్రెంచి విప్లవంతో సహా ప్రపంచ చరిత్ర నిరూపించిన సత్యం ఇది. అయితే ఆశ్చర్యకరంగా అనండి లేక స్ట్రాటజీ అనుగుణంగా అనండి, సినీపండితులంతా కొత్త నిర్వచనాలు, కొత్తపాఠాలు చెప్పారు, చెబుతున్నారు. ఏమనంటే – సినిమా ప్రజలకి కేవలం వినోదాన్ని మాత్రమే ఇస్తుందట. సినిమా ప్రభావం ప్రజలమీద ఏమాత్రం ఉండదట! ఎందుకింత పచ్చి అబద్ధాన్ని పదేపదే ప్రచారించారో, సదరు సినీప్రముఖలకే తెలియాలి. ఒకవేళ దాన్ని అసత్యమని గాక సత్యమని నమ్మి ప్రచారించారనుకుంటే, ఎందుకంత గుడ్డితనం వాళ్ళకి సంప్రాప్తించిందో వాళ్ళకే తెలియాలి.

నిజంగానే ’సినిమా ప్రభావం ప్రజల మీద, సమాజం మీద శూన్యం’ అయితే సినిమాలు చూసి పిల్లలు ఎనిమిది, తొమ్మిదేళ్ళకే ప్రేమల్లో పడటాలు, ఇళ్ళల్లోంచి లేచిపోవడాలు [దీనికి కొత్తపేరు పారిపోవటం] ఎందుకు జరుగుతున్నట్లు? సినిమాల పేరుతో షర్టులు, పాంట్లూ, చీరలూ మొదలైన దుస్తులూ, బూట్లు, బెల్టులూ వంటి ఇతర యాక్సెసరీస్ లు ఎలా మార్కెట్లలో అమ్మకమవుతున్నట్లు? ’సినిమా ప్రభావం సమాజం మీద శూన్యం’ అన్నవాదన నిజమైతే కొత్త ఫ్యాషన్లు, కొత్త మోడల్ వస్తువులూ[వాహనాలతో సహా] సినిమాల ద్వారా చూపబడి ప్రజల్లో ప్రాచుర్యంలోకి ఎలా వస్తున్నట్లు? అంతేకాదు ’సినిమా ప్రభావం సమాజంమీద శూన్యం’ అన్న వాదనే నిజమైతే మరి ఈ సినీ తారలంతా కార్పోరేట్ ఉత్పత్తులకు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నట్లు? చివరికి ప్రభుత్వపధకాలకు కూడా వాళ్ళు ప్రచారకర్తలు కావటం చూస్తునే ఉన్నాం కదా! కొత్త దుస్తులు, క్రొత్త ట్రెండ్ లూ, క్రొత్త పోకడలూ, క్రొత్త ఎలక్ట్రానిక్ వస్తువుల మోడళ్ళు వంటి ఏ వస్తువులైనా ప్రజల్లోకి చేరడానికి, వ్యాపారం వూపందుకోవడానికి, ఎందుకు సినిమాలూ, సినిమాతారలే ప్రచారమాధ్యమాలుగా ఎంచుకోబడుతున్నారు? అటువంటప్పుడు ’సినిమా ప్రభావం ప్రజలమీద సమాజం మీద శూన్యం. సినిమా కేవలం వినోదార్ధం మాత్రమే’ అనటం పచ్చి అబద్ధమే కదా? అటువంటప్పుడు ఈ రకపు ప్రచారం ఆశ్చర్యకరమో లేక స్ట్రాటజీ పఠమో కావాలి కదా!

దశాబ్దాలుగా ఎన్నో ’మానరిజమ్స్’ ఎన్నో సంభాషణలు[డైలాగులూ, పిలుపులతో సహా] ప్రజల్లోకి ప్రచారించబడి, వారి జీవన సరళిలో ఓ భాగమైపోయాయి. ఎన్నో పాత్రలూ, ఎన్నో దృక్పధాలు ప్రజల్ని ప్రభావపరిచాయి, ఇప్పటికీ పరుస్తునే ఉన్నాయి. [వీటన్నింటిని నియంత్రించడానికి ప్రభుత్వం సీరియస్ గా ఎందుకు తీసుకోవటం లేదు?] నిజానికి ఏ కళారూపమైనా అటువంటి సమ్మోహన శక్తి కలిగి ఉంటుంది. అటువంటది ఓ ప్రక్క ప్రజల ఆలోచనల్ని, భావాల్ని దృక్పధాన్ని ఇంతగా కలుషితం చేస్తూ, మరోప్రక్క ’సినిమా ప్రభావం ప్రజలమీద, సమాజం మీద ఉండదని’ ప్రచారించటం కుట్ర కాదా? అందునా పదేపదే అదే అనటం! సినీ పండితులు, రచయితలు, దర్శకులూ, నటీనటులూ అందరూ కూడబలుక్కున్నట్లు మరీ అనటంలో, నిశ్చయంగా ఇది ఆశ్చర్యకరం కాదు. ఖచ్చితంగా స్ట్రాటజీ ప్రకారం, ప్రణాళిక బద్ధంగా చేస్తున్న కుట్ర ఇది.

గమనించి చూడండి. ఒకప్పుడు సినిమాలలో కూడా ’నీ సుఖమే నే కోరుకున్నా. నిను వీడి అందుకే వెళుతున్నా! మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా!’ అంటూ ప్రేమకు నిర్వచనాలు చెప్పబడ్డాయి. [పై పాట మురళీకృష్ణ సినిమా కోసం ఘంటసాల పాడింది] ప్రేమంటే మనం ప్రేమించిన వ్యక్తికి సంతోషం కలిగించటం. అటువంటిది ఇటీవల కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సినిమాలు చూడండి. ’ఆర్యా’ సినిమా! అందులో హీరో హీరోయిన్ని ప్రేమిస్తున్నానంటూ ’Feel my love’ చివరికి నన్ను తిడుతూ ఆసహ్యించుకుంటూ కూడా ‘feel my love’ అంటూ వెంటపడి విసిగించి వేధిస్తూనే ఉంటాడు. చివరకు, ‘తినగా తినగా వేము తియ్యనుండు’ అన్నట్లు ప్రేమప్రేమ అంటూ విసిగించగా చివరికి ఆ కథలో హీరోయిన్ హీరోని ప్రేమించేస్తుంది. ఇలాంటి కధే… మరో సినిమా ‘దేశముదురు’. చివరికి సన్యసించిన స్త్రీ[?]ని కూడా వదలకుండా ప్రేమ కోసం అంటూ వేధిస్తాడు హీరో. ప్రక్క పాత్రలన్నీ కూడా ఇందుకు ఎంతో కొంత సాయం చేస్తాయి. ఇందులోనూ షరా మామూలే. చివరికి హీరోయిన్ హీరోని ప్రేమించేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత పెళ్ళవుతుంది. ఇక పరుగు మరో సినిమా. అందులోనూ అదే కథ. అన్ని సినిమాలూ ఒక్క హీరోవే చెప్పాననుకోకండి. ఇలాంటివే ఇంకా చాలా సినిమాలూ ఉన్నాయి. ఏదేమైనా హీరోయిన్ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా “నేను ప్రేమించాను కాబట్టి, నాది నిజమైన ప్రేమ అయితే నువ్వు నన్ను ప్రేమించి తీరాలి. ప్రేమిస్తావు” అంటాడు హీరో. వెంటపడి విసిగించి వేధిస్తాడు. చివరాఖరికి అమ్మాయి ప్రేమించేస్తుంది. ఈ కథాంశాలతో సినిమాలు చూసిన, తెలిసీ తెలియని వయస్సులోని యువతరం ప్రేమోన్మాదానికి అమ్మాయిల కుత్తుకలు కోయడం చూస్తునే ఉన్నాం. యాసిడ్ దాడులు, గొంతుకోయటం లాంటివి ఈమధ్య కాలంలో చాలా తరచుగా జరుగుతున్నవి. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా రాజకీయనాయకులు గానీ, మహిళసంఘాలు గానీ ఈకథలతో వచ్చిన సినిమాలను బ్యాన్ చేయాలని గాని, ఇలాంటి కథలను నిషేధించాలని గాని ఒక్క మాట అనలేదు. ఇందులో స్ట్రాటజీ ఏమిటంటే ఇలాంటి కథలతో స్వంత సినిమాలు తీసిన నిర్మాతలు, నటులు, ప్రజాసేవ చేస్తామంటూ రాజకీయ పార్టీలు పెట్టటం! ఇక చిన్నప్పుడే ప్రేమలు మొదలవ్వటం లాంటి ఖుషీలు, బుజ్జిగాడు, మనసంతా నువ్వే ననే తూనీగలూ కోకొల్లలు. ఇలాంటి నేపధ్యంలో సినిమా కేవలం వినోదం కోసమే ప్రజలు చూస్తారు. దాని ప్రభావం ప్రజలమీద ఉండదు అనటం ఖచ్చితంగా కుట్రే! నిశితంగా సినిమారంగాన్ని, తెరమీద, తెర వెనుకా, పరిశీలిస్తే ఈ పచ్చినిజం పరమ అద్భుతంగా దృగ్గోచరమౌతుంది.

ఒక్కసారి మనం తెలుగు సినిమా రంగాన్ని, కధాక్రమాన్ని పరిశీలిస్తే – భారతదేశంలోనూ, తెలుగు సీమలోనూ తొలినాళ్ళలో అప్పటికి విస్తరించివున్న జానపద, ఇతర కళారూపాలతో పోటీ పడేందుకు ‘సినిమా’ తెగ పెనుగులాడ వలసివచ్చింది. భాగవత కథకులూ, హరికథకులూ, బుర్రకథకులూ, తోలు బొమ్మలాటలూ, యుద్ధవిద్యాక్రీడా ప్రదర్శనలూ, కోలాటాది ఇతర సంగీతాధారిత కళారూపాలూ, పద్యనాటకాలూ తదితర కళారూపాలు అప్పటికే ప్రజల్లో వేళ్ళునుకొని ఉన్నాయి. ఈ కళాకారులంతా రైతుల ఇంటి గుమ్మాలను చేరగలిగే వారు. గ్రామాల్లో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళు. రైతులే కళారూపాలకు ప్రధాన పోషకులు. కళాకారుల బృందాలు గ్రామాలలో పర్యటిస్తూ, పొద్దంతా వ్యవసాయపనులతో అలసిన రైతుకుటుంబాలకు, సాయంత్రం వేళ, భోజనానంతరం, గ్రామాల్లోని గుడి దగ్గరో, కూడళ్ళ దగ్గరో ప్రదర్శనలు నిర్వహించి తమ ప్రతిభతో, వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచేవాళ్ళు. ఆ రసాస్వాదనలో భావవాదపు పాళ్ళు, సంస్కృతీ, సాంప్రదాయాల భావాలూ, దృక్పధపు మూలాలు ఉండేవి. కళాకారులు ఈ విధంగా ప్రజలని సేదతీర్చి, వాళ్ళ తృష్ణ తీర్చి మెప్పించేవాళ్ళు. సంతృప్తి చెందిన రైతులు పండగ పబ్బాలప్పుడు, తమ ఇంట పెళ్ళి పేరంటాలప్పుడూ, పంట చేతి కొచ్చినప్పుడు, ఈ కళాకారుల కుటుంబాలను సత్కరించేవాళ్ళు. ముందుగా కళాకారులు రైతులకి తమ సేవలందించేవాళ్ళు. ఆ సేవలతో సంతృప్తి చెందిన రైతులు ధాన్యం కొలవటంతో కళాకారులకి చెల్లింపులు చేసేవారు. ఇది ఒక్క కళారంగంలోనే కాదు, ప్రతీ రంగంలోనూ ఉండేది. చివరికి విద్యారంగంలో కూడా! ప్రతిరంగంలోనూ ముందుగా సేవల్ని అందించిన తదుపరే చెల్లింపులు ఉండేవి. చివరికి క్షవరం చేయించుకోవటంతో సహా! టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళి, బార్బరు సరిగా జుత్తు కత్తిరించలేదని విసుక్కుంటు బయటకి రావలసిన అవసరం లేదు. ఈ సెలూన్ కున్న పేరు ప్రఖ్యాతులు చూసి మోసపోయామని నిట్టూర్చనక్కర్లేదు. ఇదే సూత్రం కళారంగానికీ అనువర్తింపబడేది.

ఇప్పుడు సినిమా పేరు చూసో, టీవీలో వాళ్ళిచ్చిన ప్రచారపు హోరుని చూసో, టిక్కెట్టు కొనుక్కోని ధియేటర్ లోపలికి వెళ్ళి నష్టపోయామన్న ఉక్రోషంతో బైటకి రావలసిన పని లేదు. అందుచేత, తొలినాళ్ళలో సినిమాకి వెళ్ళటం అంటే రైతులూ, ప్రజలూ కదిలి ధియేటర్ కి రావాలి. అది కొంత అవరోధంగా[Disadvantage గా] ఉండేది. మరో అవరోధం ఏమిటంటే నాటకాలు అయితే తెల్లవారుజాముదాకా నడిచేవి. సినిమా కూడా మూడుగంటలు పైగా చూపినా జనంకి నచ్చేది కాదు. అలాగే ఇంకో అవరోధం సినిమా యంత్రం చూపెట్టేది. Projector అన్నమాట. అప్పట్లో ఇది కొంత కొత్తగానూ, అసంతృప్తిగానూ ఉండేదిట. అప్పటివరకూ వాళ్ళకి ఎప్పుడు తాము కోరితే, అప్పుడు, మళ్ళీ తమ ప్రదర్శనని నిర్వహించే కళాకారులే తెలుసు. నచ్చినపాట, పద్యం మరోసారి పాడమంటే పాడటమే తెలుసు. నచ్చిన నృత్యం మరోసారి ప్రదర్శించమంటే ఆయా కళాకారులు సంతోషంతో మళ్ళీ ప్రదర్శించటమే తెలుసు. ఆయా కళా ప్రదర్శనలో, ఆయా భావాల్ని, కళారూపాల్ని కళాకారుడితో సమంగా, అదే పౌనఃపున్యంతో, వీక్షకులుగా, శ్రోతలుగా అందుకోవటమే తెలుసు. ఫిజిక్స్ లో చెప్పుకునే resonance వంటిది ఈ ప్రక్రియ. కళను సృష్టించే కళాకారుడూ, దాన్ని అందుకునే ప్రేక్షకుడూ – రెండూ ఆత్మలు కూడా ఒకే భావాన్ని, ఒకే సమయంలో, అదే శృతిలో పంచుకోవటం, అందుకోవటం, కళాస్ఫూర్తిని, కళకి ఉన్న ఉతృష్టమైన లక్ష్యాన్ని నెరవేర్చేవి. ఒక అలౌకిక ఆనందాన్ని, ఆ క్షణమే, కళాకారుడూ వీక్షకుడూ కూడా పొందేవారు. అది ఒకోసారి లయించిపోయేంత ఆనందపు అగ్రస్థితికి, బ్రాహ్మీస్థితికి, తీసుకుపోయేది. ఈ అనుభూతి ధియేటర్ లో ప్రేక్షకులకి లభించేది కాదు.

ఇక్కడో ఉదాహరణ చెబుతాను. ఇది మా నాన్న చెప్పారు. ఆయన చిన్నతనంలోని సంఘటన. ఓ సారి సినిమా హాల్లో ‘షావుకారో’, ‘బ్రతుకు తెరువో’ ఏదో సాంఘీక సినిమా ప్రదర్శన జరుగుతోందట. హీరో పదిమందితో ఫైటింగ్ చేస్తున్నాడు. ఆ క్షణం సీన్ లో అతడిది దిగువ చెయ్యిగా, రౌడీలది పైచేయిగా ఉంది. ప్రేక్షకుల్లో నుండి ఒకతను లేచి భుజమీది కండువా నడుంకి చుట్టుకుంటూ “ఒరే రండిరా! ఒక్కణ్ణి చేసి పదిమంది కొడుతున్నారు. అన్యాయం గదా. రండి. ఆపండి!” అన్నాడట. మిగిలిన వాళ్ళు నవ్వుతూ “నాయనా అది నిజం కాదు. అది సినిమా! అంతా నటన. కెమెరా మాయ. కూర్చో” అని కూర్చోబెట్టారట. ఇది విన్నప్పుడు నాకు “ఎంత నిష్కల్మష హృదయం. ముక్కు ముఖం తెలియని వాణ్ణయినా, ఒక్కణ్ణి చేసి పదిమంది తన్నడమంటే అన్యాయం! జరగనీయకూడదు. ఆపాలి” అన్న ఆలోచన అది. ఇప్పుడో! కళ్ళముందు అంతకంటే ఎన్నోదారుణాలు జరుగుతున్నా స్పందించటం మానేసారు. స్పందించిన వాడు, ఊబిలో పడిన చందం అవుతున్నాడు. సరే, ఈ విషయం వదిలేద్దాం!

అప్పట్లో అయితే, కళా ప్రదర్శనల్లో అంతగా భావోద్రేక పూరిత రసాస్వాదన ఉండేది. అంతేగాక అన్ని కాన్సెప్టులు పురాణాకధలతో, భక్తి భావంతో నిండిఉండేవి. లేదా చారిత్రక కథలతో! జానపదుల ఊహలతో! పక్క ఊళ్ళలో ఎవరైనా ప్రజలకోసం త్యాగనిరతి, ధైర్యసాహసాలు చూపిస్తే, వాళ్ళ కథలు కూడా క్రమంగా ఈ కళాప్రదర్శనల్లో చేరేవి. ఉదాహరణకి, అనంతపురం జిల్లాలో గ్రామదేవతగా రూపాంతరం చెందిన ఊరిపెద్ద కోడలు ముసలమ్మ తల్లి కథ చెప్పుకోవచ్చు. అనంతపురం జిల్లాలో, ఇప్పటికీ, దాన్ని ముసలమ్మ కట్టగా పిలుస్తారట. ఆ పల్లెలో చెరువుకట్టకి గండిపడగా, అర్ధరాత్రివేళ, వర్షపు ఉధృతిలో ఊరు మునిగి పోతుందన్న ఆతృతతో, ఊరివాళ్ళంతా కలిసి, గండిపూడ్చే ప్రయత్నం చేస్తున్నారట. గండిపెద్దది. వీళ్ళు మట్టి, రాళ్ళూ వేసినా నీటి ఒరవడిలో కొట్టుకుపోతున్నాయి. అది చూసిన కొందరు, ‘గండి సరిగ్గా మనిషంత ఉంది. ఎవరైనా అందులో కూర్చుని గట్టిగా పట్టుతో కూరుకుంటే మిగిలిన స్థలాన్ని రాళ్ళు, మట్టి, వాళ్ళ శరీరం ఆధారంగా నింపి గండిపూడ్చ వచ్చన్నా’రట. చూస్తూ చూస్తూ ప్రాణాలెవరు వదులుకుంటారు? కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన ఊరిపెద్ద కోడలు ‘ముసలమ్మ’ అనే యువతి ఊరి బాగుకోసం, పదిమంది ప్రాణాల కోసం తన ప్రాణాలు అర్పించటానికి సిద్ధపడిందట. ఊరి ప్రజలంతా కన్నీటితో వీడ్కొలివ్వగా ఆమె వరదనీటి ఉధృతికి తన శరీరాన్ని అడ్డుగా పెట్టి గండి పూడ్చడానికి తన ప్రాణాలని బలి ఇచ్చిందట. గండి పూడింది. ఊరు సురక్షితంగా ఉంది. ఇప్పటికీ ఆ ఊరి ప్రజలంతా ముసలమ్మని తమ గ్రామదేవతగా ఆరాధించి, ఆమెని పార్వతీదేవి అవతారంగా కొలుస్తారట. పసుపు కుంకాలిచ్చి పూజిస్తారట. మన్నవ గిరిధర రావు గారి కాంతిరేఖలులో చదివాను. ఇలాంటి పుణ్యమూర్తుల కథలు కూడా ఆనాటి జానపద కళారూపాల్లో కథాంశాలుగా ఉండేవి. [గ్రామదేవతగా ఆమెని పూజించటం మూఢత్వం అనుకునేవారిని మనం ఏమి చేయలేము. ఆమె ఈ గండి ఎలా పూడిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని చర్చకార్యక్రమాలు చేయలేదు. తన పరిధిలో ఏంచేస్తే గ్రామం ఈ కష్టం నుండి బయటపడుతుంది అని ఆలోచించి, తన శరీరాన్ని, ప్రాణాన్ని తృణపాయంగా ఆర్పించింది. తాము చేయలేకపోయిన పని ముసలమ్మ చేసింది కాబట్టి ఆవిడని అందరు దేవతగా పూజించారు.]

అటువంటి కథలని, చక్కని సాహిత్యవిలువలతో కూడిన స్ర్కిప్టుతోనూ, సంగీతంతోనూ అలంకరించి, తమ అభినయాన్ని జోడించి కళాకారులు ప్రజలకి ప్రదర్శించేవారు. వాస్తవానికి కళారూపమేదైనా ఈ అలంకారాలు తప్పనిసరి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఇటీవల పార్లమెంటులో దాదాపు ప్రతిపక్ష నాయకులందరు దేశంలో కరువు పరిస్థితి గురించి గొడవపెట్టారు. దక్షిణాదిన, ఉత్తరాదిన వర్షాభావం కారణంగా ఇంత వరకూ వ్యవసాయపనులు సరిగా ప్రారంభం కాని స్థితి గురించి పార్లమెంటు సమావేశంలో గందరగోళం చెలరేగింది. అంతే!..... సాయంత్రానికి మాయావతి Vs రీటాబహుగుణల వివాదం పతాకశీర్షికల కెక్కింది. కరువు గొడవ కాస్తా ఎక్కడికో…. వెళ్ళిపోయింది. చాలా పకడ్బందీగా… ప్రతిపక్షనాయకులు తమ బాధ్యత ప్రకారం ’కరువు’ గురించి గొడవపెట్టినట్టుగానే ఉంది. విషయం మామూలుగా ప్రక్కదారిపట్టించబడింది. [రాష్ట్రంలో కూడా ఇదే స్ట్రాటజీ ప్రయోగిస్తున్నారు. వై.ఎస్. Vs చంద్రబాబునాయుడులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత సవాళ్ళు విసురుకుంటూ, ఇలాగే ప్రజాసమస్యలను ప్రక్కదారి పట్టిస్తున్నారు.] అధికారపక్షమైన యూ.పి.ఏ.కీ, కాంగ్రెస్ కీ నిబద్దత లేదు, సరే! ప్రతిపక్షాలకైనా నిబద్దత, నిజాయితీ ఉంటే ఇద్దరు స్త్రీల గొడవతో ’కరువు’ అనే జాతీయ సమస్యనీ, ప్రజల బాధని మరిచిపోతారా?

ఈమొత్తం నాటకాన్ని పరిశీలించే ముందు అసలు ఆ ఇద్దరు స్త్రీల వివాదాన్ని పరిశీలిద్దాం. ఉత్తరప్రదేశ్ లో అత్యాచారానికి గురైన మహిళలకు నష్టపరిహారం 25,000/-రూ. లు ముట్టజెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందట. ఆ విషయాన్ని ఎద్దేవా చేస్తూ రీటా బహుగుణ [ఈవిడ యూపిలో పిసిసి అధ్యక్షురాలు] యూ.పి. ముఖ్యమంత్రి మాయావతిని వ్యక్తిగతంగా దూషించిందట. ఆ దూషణలో భాగంగా “అత్యాచారానికి గురై 25,000/-రూ. పరిహారంగా తీసుకోవలసిందిగా చెప్పబడుతున్న మహిళలు, ఆ పాతిక వేలనీ, మాయావతి ముఖాన కొట్టి ’అదే విధంగా మాయావతి తమలాగే అత్యాచారానికి గురైతే పాతిక వేలు కాదు కోటిరూపాయలు నష్టపరిహారంగా తామే ఇస్తాం’ అని చెప్పవలసింది” అన్నదట. దానికి మాయావతి మండిపడుతూ “అసలా పధకం యూపిఏ ప్రభుత్వం మొదలుపెట్టిందే. మేం కొనసాగిస్తున్నాం. అంతే.” అన్నదట. ఆపైన కోర్టు కేసు, రీటా బహుగుణ కస్టడీ, బెయిలూ, షరామామూలే!

ఇందులో ఎవరి తప్పొప్పులు ఎంత? ఓ మహిళ అత్యాచారానికి గురైతే ఆమె క్షోభనీ, గౌరవగ్లానినీ డబ్బుతో కొలుస్తారా? అత్యాచారానికి గురైతే పాతికవేల నష్టపరిహారం ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తుందా? అత్యాచారానికి గురైన మహిళ గౌరవాన్ని, శీలాన్ని, మానాన్ని వెలకట్టటం ఎంత హేయం? ఆమెతో ’అనుభవానికి’ డబ్బు చెల్లించేందుకు ఆమె వెలయాలు కాదే? స్త్రీ ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ విషయంలో, యూపిఏ ప్రభుత్వం మొదలెట్టగా యూపి ప్రభుత్వం కొనసాగిస్తుందో, ఎవరు మొదలెట్టినా ఎవరు కొనసాగించినా ఇంత బాహాటంగా నీతి బాహ్యతా? భారతదేశమేనా ఇది? శీలరక్షణకై ప్రాణత్యాగం చేసిన పతివత్రల గురించి పురాణాల్లో చదువుకోవటమేకాదు, శీల రక్షణ కోసం శరీరాన్ని దగ్ధం చేసుకున్న రాణీ పద్మిని, కర్ణావతి వంటి రాజపుత్రస్త్రీలున్నారు ఈ దేశ చరిత్రలో! [చిత్తోడ్ రాణి కర్ణావతిని జయించడానికి, గుజరాత్ రాజు సుల్తాన్ బహుదూర్ షా సేనల్ని పంపించాడు. రాణి కర్ణావతి ఢిల్లీ రాజు హుమాయూన్ కి తమకి సహాయం చేయవలసిందిగా అర్దిస్తూ, రాఖీ పంపిందట. రాఖీని అందుకున్న హుమయూన్ ఆమెను చెల్లెలిగా భావించి రాజ్యాన్ని కాపాడటం కోసం తన సేనలతో బయలుదేరి వెళ్ళాడట. [ఇదీ ఉద్దేశపూరక ఆలస్యం కావచ్చు. ఢిల్లీ సుల్తానులకు ఇమేజ్ ఇస్తూ చరిత్రను వక్రీకరించటం మనకి తెలిసిందే!]. కాని అప్పటికే చిత్తోడ్ సుల్తాన్ వశం అయిపోతుంది. రాణి కర్ణావతితో పాటు రాజ్యంలోని లక్షా ముప్పైవేల మంది స్త్రీలు ఆత్మాహుతి చేసుకున్నారు.] శీల రక్షణ కోసం ప్రాణం తీయాటానికైనా, ప్రాణం తీసుకోవటానికైనా వెనుకాడని ధీరవనితల కన్నభూమి ఇది. ‘When the rape is unavoidable, enjoy it’ అనుకోగలిగే సంస్కృతిని ఎంతగా మీడియా ప్రవేశపెట్టప్రయత్నించినా ప్రయోజనం సిద్ధించింది తక్కువే. అటువంటి సున్నితవ్యవహారాన్ని, భావోద్వేగ మిళితమైన విషయాన్ని, డబ్బుతో ముడిపెట్టటం ఎంతో నీచంగా ఉంది. ఇప్పటికే నేతకార్మికుల ఆత్మహత్యలకీ, రైతుల ఆత్మహత్యలకీ నష్టపరిహారం చెల్లిస్తూ ప్రాణాలకి విలువకట్టిన ప్రభుత్వసరళిలో, ఆ నష్టపరిహారపు చెక్కు కుటుంబసభ్యులకు చేరాలంటే, అక్కడక్కడా చేతులు తడపవలసి రావటం గురించి వింటూనే ఉన్నాం. అటువంటప్పుడు అత్యాచారానికి గురైన మహిళకు చెల్లించే నష్టపరిహారం 25,000/-Rs. చెల్లించడానికి అవినీతి అధికారులు లంచమే అడుగుతారో మరింకేమైనా అడుగుతారో? ఎటూ ఓసారి పోయిన శీలమూ, పడిన అల్లరే కదా అంటే? అసలే అవినీతికి ఎల్లలు లేనిచోట, ప్రభుత్వమే అవినీతి కీ, అవినీతి అధికారులకీ, అన్నిరకాల సహాయసహకారాలూ ఇస్తున్న చోట, అలా జరిగే అవకాశం లేదనగలమా? అత్యాచారానికి గురైన మహిళ దీనత, నిస్సహాయత, అవమానం, ఆక్రోశం…. ఇదేదీ ఎవరికీ పట్టటం లేదు. శీలానికి ఖరీదు కట్టటం, అది భారతీయ సంస్కృతికి అవమానం అన్న విషయం కూడా ఎవరికి[భాజపాకి కూడా] పట్టటం లేదు. రేపిస్టులకి ఏ శిక్షలు విధించారో ఎవరికీ తెలీదు. అది చర్చకి రావటం లేదు కానీ, బాధితురాలికి నష్టపరిహారం గురించి నానారగడా అవుతోంది. ఓ నిస్సహాయ మహిళ అత్యాచారానికి గురై, ఆపైన అల్లరి పాలైతే ’పాతికవేల రూపాయలతో’ అన్నీ సరైపోతాయనే యూపి ప్రభుత్వాధినేత మాయావతి స్త్రీకాదా? ఆవిడ గౌరవం అంత గొప్పదా? అదే ఆవిడ ఆత్యాచారానికి గురైతే, కోటిరూపాయలు నష్టపరిహారంగా ఇవ్వచ్చునన్నందుకు అంతగొడవ జరుగుతోందే? BSP పార్టీ సభ్యులూ, ఇతరులూ, అందరూ గొడవ పెట్టేస్తున్నారు. అవును, నిజమే! ఒక స్త్రీని అలాంటి మాటలతో అగౌరవపరచకూడదు. మరి ఇంతటి రగడలో అసలు విషయం… అత్యాచారానికి గురైన మహిళల గౌరవం, బాధల సంగతి ఏమిటి? వాళ్ళు స్త్రీలు కాదా? మాట అంటేనే మండిపడ్డ మాయావతి లాగే, వాళ్ళూ ఆత్మగౌరవం ఉన్న స్త్రీలే కదా? అంటే ఈ దేశంలో డబ్బులేని పేద స్త్రీలకీ, సామాన్య స్త్రీలకీ ఆత్మగౌరవాలూ, తొక్కలూ ఎక్కడనా? అసలు స్త్రీలు అత్యాచారానికి గురయ్యేంత అభద్రత సమాజంలో ఉండటం, అంతగా నేరప్రవత్తి పెరిగిపోవటం…. ఈ విషయాల మీద ఏ చర్చా జరగడం లేదు.

దాదాపు పేరున్న రాజకీయనాయకులంతా[సుష్మాస్వరాజ్ దగ్గర నుండి రాహుల్ గాంధీ తదితరుల వరకూ అందరూ] రీటాబహుగుణ అరెస్టు, మాయావతి పై విమర్శల గురించి తమ అమూల్య అభిప్రాయాలనీ, స్పందననీ తెలియచేసారు. టీవీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చిత్రీకరించి మరీ చూపెట్టారు. అధికారంలో ఉన్న స్త్రీలకీ, సామాన్య స్త్రీలకీ ఆత్మగౌరవం, శీలరక్షణ విషయాల్లో ఇంతగా అంతరం ఉంటుందని దృష్టాంతపూరితంగా నిరూపిస్తూ, రాజకీయ నాయకులూ, మీడియా, అన్నీ, అందరూ సలక్షణంగా ’కరువు’ పరిస్థితిని తెరమీది నుండి తప్పించేసారు.

నిజంగా ప్రతిపక్షాలకి ప్రజల బాధల పట్లా, కరువుపట్ల నిబద్ధత ఉంటే ’కరువు’ మీద ఏమారకుండా ఉంటారు కదా? అదేం లేదు. తామూ అందుకే ఎదురుచూస్తున్నాం అన్నట్లు, అవకాశం దొరికింది చాలన్నట్లు, హాయిగా ’కరువు’ సమస్యని ప్రక్కన పెట్టేసారు. చెప్పుకునేందుకు తమ బాధ్యత తాము నెరవేర్చాం అన్నట్లు ఓరోజు సమస్య ఎత్తారు, మరో వివాద నేపధ్యంలో ఎంచక్కా పక్కన పెట్టేసారు. ఎంతో నాటకీయంగా ఎవరి పాత్రవారు నిర్వహించేస్తున్నారు. Off course, ప్రజలు కూడా తమ ప్రేక్షక పాత్రనీ అలాగే నిర్వహిస్తున్నారనుకొండి.

ఇక ఈ రీటాబహుగుణ గొడవ తరువాత రాహుల్ గాంధీ యూపి సందర్శనకు వెళ్ళి “యూపిలో విగ్రహాలూ, ఏనుగులూ తప్ప అభివృద్ధి కనబడటం లేదు” అన్నాడు. అంతే మాయావతి కయ్యానికి కాలుదువ్వుతూ “అభివృద్ధి చూడటానికి కళ్ళుండాలి. ఆమాట కొస్తే రాజ్ ఘాట్ లో విగ్రహాలకి మీరు పెట్టిన ఖర్చుతో పోలిస్తే యూపిలో విగ్రహాల ఖర్చు చాలా తక్కువ” అన్నది. ఆవిడ రాహుల్ గాంధీని, యూపిఏ ప్రభుత్వాన్ని ఎత్తిపొడవాలనుకుంటే నేరుగా వాళ్ళనే అనవచ్చుగానీ మధ్యలో బాపూజీ గొడవెందుకు? నిజానికి బాపూజీ సమాధి ఉన్న రాజ్ ఘాట్ కీ ఈ యూపిఏ ప్రభుత్వానికీ ఏం సంబంధం ఉంది? నాటి దేశభక్తి కాంగ్రెస్ కీ, నేటి దేశద్రోహా కాంగ్రెస్ కీ అసలు పోలికే లేదయ్యె. బాపూజీ అసలు రాజకీయనాయకుడు కాదయ్యె. ఎన్నికల్లో నిలబడి, పదవుల వెంటబడిన వాడూ కాదయ్యె. ఆయన స్వాతంత్రసమరయోధుడు. భారతదేశం గౌరవించుకున్న జాతిపిత. వీళ్ళ రచ్చలో మధ్య ఆయన ఊసెందుకు? మళ్ళీ ఈ మాయావతి ఇంతగా నోరు పారేసుకుంటుందా? పెద్దగా చప్పుడు చెయ్యకుండా, మొన్న 2009 ఎన్నికల తర్వాత ‘బేషరతుగా యూపిఏ కు మద్దతులు’ వంటివి ఇచ్చేస్తుంటుంది. అదొక్కటే కాదు…. అవసరమొచ్చినప్పుడు నోరుమూసేసుకుని మరీ, ఆ ఇటలీ నాయకి సోనియాగాంధీకి అనుకూలమైన చర్యలు తెరవెనకా, తెరమీదా కూడా చేపడుతుంది. అదీ కుమ్మక్కు సాంద్రత!

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే – ఇలాంటి లజ్జాపూరితమైన పధకాన్ని యూపిఏ ప్రభుత్వం ప్రారంభిందట. యూపిఏ అధినేత్రి సోనియాగాంధీ స్త్రీయే! అదేపధకాన్ని యూపిలోని BSP ప్రభుత్వం కొనసాగిస్తుందిట. ఈప్రభుత్వ అధినేత్రి మాయావతి కూడా స్త్రీయే! ఇద్దరికే భారతీయ స్త్రీలు తమ శీలానికీ, గౌరవానికి ఎంత విలువ ఇస్తారో, గౌరవగ్లాని ఏర్పడితే, శీలరక్షణ కోసం ప్రాణాలు సైతం వదులు కుంటారని అర్ధం కాలేదు కాబోలు. ఎందుకంటే సంవత్సరం పాటు వేధించినా, రావణుడినీ, అతడి సంపదనీ తృణము కంటే హీనమన్న సీతాదేవిని ఆరాధ్యదేవతగా కొలిచే గడ్డ ఇది! పరస్త్రీలని, [తనతో కలిపి] కాముకదృష్టితో చూసినందుకు మహిషాసురుణ్ణి చీల్చి చెండాడిన దుర్గాదేవిని, జగన్మాతగా ఆరాధించే గడ్డ ఇది! అధికారాన్ని అడ్డదారిలో అనాయాసంగా అందుకునేందుకు మాయావతి కాన్షీరాంతో కొనసాగించిన అనుబంధం గురించి అతడి తల్లీ, చెల్లి కోర్టుకెక్కి, మరీ వెల్లడించారు. కాన్షీరాం అవసానదశలో ఉండగా, ఆసుపత్రిలో ఉన్న అతడిని తాము వెళ్ళి చూసేందుకు కూడా మాయావతి అడ్డుపడుతోందనీ వాళ్ళు ఆక్రోశించారు. అతడితో గల సన్నిహిత సంబంధాలతోనే ఆమె BSP లో అగ్రనాయకత్వానికి ఎదిగిందనీ, కాబట్టి అవలీలగా రాష్ట్రముఖ్యమంత్రి అయిపోయిందనీ విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సోనియాగాంధీ అయితే గురిచూసి మరీ ఓ దేశప్రధాని కుమారుడితో వివాహ సంబంధం ఒనగూడెలాగా ప్రయోగించబడింది. అంతే! మెట్టినింటి గడపతొక్కాక ఒకొక్కరినే అడ్డుతొలగించుకుంటే అనాయాసంగా దేశాధినేత అయిపోయింది. ఈ విషయం గురించి ‘విపులమైన టపా’ గతంలోనే వ్రాసాను. కెరీర్ కి వివాహసంబంధాన్నో, వివాహేతర సంబంధాన్నో సోపానంగా గ్రహించగల వాళ్ళకి శీలం విలువ తెలియటం కలలోని మాట కాబట్టే శీలానికి నష్టపరిహారంగా వెలకట్టగలిగారు.


మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu