గత టపాలోని ఎన్టీఆర్ సువర్ణముఖి పరిశీలిస్తే మనకి కొన్ని విషయాలు సుస్పష్టంగా అర్ధమౌతాయి. సువర్ణముఖిలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే – ఏ వ్యక్తి లేదా ఏజంట్ అయినా, వ్యవస్థ లేదా సంస్థ అయినా, దేశాలైనా, రంగాలైనా…. తాము చేసిన కర్మ తాము అనుభవించటం ఒక అంశం. ఆ క్రమంలోనే ఆయా వ్యక్తుల లేదా ఏజంట్ల, వ్యవస్థల, సంస్థల, రంగాల, దేశాల [ఏదయినా సరే] నిజ స్వరూపం, నిజమైన వ్యక్తిత్వం, తేటతెల్లం [Expose] కావటం రెండో అంశం.

ఇందుకు ఏ వ్యక్తీ, ఏ సంస్థా, ఏ రంగమూ, ఏ దేశమూ అతీతం కావు. రామోజీరావు నుండి అతడి సోదరీతుల్య సోనియాగాంధీ వరకూ, రాజశేఖర రెడ్డి నుండీ చంద్రబాబు, చిరంజీవిల వరకూ, అమెరికా నుండి పాకిస్తాన్, ఐరాస ల వరకూ…… ఎవరూ, ఏదీ అతీతం కాదు.

ఈ ’సువర్ణముఖి’ కాన్పెప్ట్ అర్ధంచేసుకోవడానికి, సత్యాసత్యాలని పరిశీలించటానికీ మరో ఉదాహరణ చూద్దాం. అది –

మీడియా సువర్ణముఖి:

ప్రాచీన కాలంలో ప్రజలు మునులని “ఇతడు స్వార్ధరహితుడు, ప్రజాహితుడు. మనం వెళ్ళలేని ప్రదేశాలకు వెళ్ళగలిగిన వాడు. మనం చూడలేని సంఘటనలు చూడగలిగిన వాడు. మీదుమిక్కిలి ప్రజాహితం కోరేవాడు. ఇతడు ఏది చెప్పినా మనం నమ్మితీరాలి” అని గౌరవించేవారు. మునులు ఏది చెప్పినా నిస్సంశయంగా నమ్మేవారు.

ఆధునిక కాలంలో ప్రజలు మీడియాకి అంతటి స్థానం ఇచ్చారు. ఏదేశంలో అయినా, ఏ కాలంలో అయినా మీడియా, ప్రారంభదినాలలో స్వార్ధరహితులు, ప్రజాహితుల చేతే ప్రారంభింపబడి, నడిపింపబడింది. క్రమేణా నకిలీకణిక వ్యవస్థ, మీడియా మహత్తు, శక్తిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోనేందుకు, ఆయా మీడియా సంస్థల నుండి స్వార్ధరహితులని తప్పించి తమ ఏజంట్లని ప్రతిష్ఠించింది. నిరాటంకంగా ప్రపంచాన్ని శాసించింది. తమకు అనుకూలమైన దేశాలకూ, సంస్థలకూ, నేతలకూ, వ్యక్తులకూ తిరుగులేని ఇమేజిని ఇవ్వడం, తము గురిపెట్టిన దేశాలకు, మతాలకు, సంస్థలకు, వ్యక్తులకు ’డామేజ్’ కలిగించడం, తమకు అనుకూలంకాని ప్రభుత్వాలని ప్రజాభిప్రాయం పేరిట శాసించటం – ఎంతో నేర్పుగా, పటిష్ఠంగా అమలుజరిపింది. ప్రజాభిప్రాయం ముసుగులో, తము ఏది కోరుకుంటే అది జరిగేలా పరిస్థితులనీ, ప్రభుత్వాలనీ కూడా నకిలీ కణిక వ్యవస్థ నిర్దేశించింది.

కావాలంటే ఓ తాజా ఉదాహరణ పరిశీలించవచ్చు. ఈనాడు 1992 లో సారావ్యతిరేక ఉద్యమాన్ని స్ఫూర్తిదాయకంగా నడిపించింది. ప్రజా ఉద్యమాన్ని నడుం కట్టి, పేజీలకు పేజీలు కేటాయించి మరీ ఉధృతంగా నడిపింది. సారా నిషేధం వచ్చేవరకూ నడిపింది. అది మీడియా చెయ్యవలసిన పని. శ్లాఘనీయమైన పని. అయితే ఇప్పుడూ లిక్కర్ తో జనజీవితం కకావికలం అవుతుంది. మరి ఇప్పుడు, ఎందుకు, ఏ ఉద్యమాలు చేయటం లేదు? పేజీలకు పేజీలు కేటాయించటం లేదు? అలాగే…. సారా రక్కసి మాత్రమే ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నదీ, కుటుంబాలకు కుటుంబాలను కూల్చివేస్తున్నదీనా? ధరల పిశాచపు కోరల్లో, ప్రజల జీవితాలు, కుటుంబాలకు కుటుంబాలు దీనావస్థలో లేవా? మరి ఇప్పుడు పేజీలకు పేజీలు కేటాయించి బియ్యం, కందిపప్పుల వంటి నిత్యావసరాల ధరల నియంత్రణలకు ఉద్యమం చేపట్టదేం? ఏదో నామామాత్రంగా ఓ వార్త, ఓ ఉపసంపాదకీయం, ఓ కార్టూన్, ఓ ప్రధాన సంపాదకీయం! ఇంతేనా? ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేటట్లూ, ప్రజలంతా తమ ప్రతిఘటనని చూపించేటట్లుగా ఎందుకు motivate చెయ్యటం లేదు. మీడియా బాధ్యత ‘వార్త వ్రాయటం అదీ అలా అలా వ్రాయటం’ – ఇంతవరకేనా? మరి ఏ పేపరూ, ఏ టీవీ ఛానెలూ ఏ ఉద్యమాన్ని స్ఫూర్తింపచెయ్యటం లేదేం? ప్రతిపక్షాలూ చేయవు. మీడియా కూడా చేయదు. ఎందుకంటే తమ వాటా తమకు వస్తోంది గనుక. అసలుకే ప్రతిపక్షాలన్నీ ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకుని, EVM ల మాయాజాలంతో మట్టిగొట్టుకుని, కరువు పట్టి ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షనేతలు ఓ ధర్నా చేసి గమ్మున ఉండిపోతున్నారు. సామాన్యుడి పరిస్థితి మాత్రం పప్పూ, ఉప్పూ ఏదీ కొనలేని స్థితే. మార్కెట్లో సరుకు లేక ఖరీదు పెరగటం లేదు. ఖరీదు పెడితే ఎంత సరుకు కావాలంటే అంత [కందిపప్పుతో సహా] అందుబాటులోనే ఉంది. ధరకీ, వస్తు లభ్యతకీ సంబంధం లేకపోవటం ఇప్పుడే చూస్తున్నాం. ద్రవ్యోల్బణం రేటుకీ, ధరలకి సంబంధం లేకపోవటం వంటిదే ఇది కూడా! మరి ఇప్పటి వరకూ నడిచిన ఆర్ధిక శాస్త్ర సిద్ధాంతాలూ, ఆర్ధికవేత్తలూ ఏమంటారో?

సరుకులు దొరకక, ‘బ్లాక్ మార్కెట్’ కూడా కాదిది. పబ్లిగ్గా, ప్రభుత్వం సాక్షిగా, ప్రభుత్వమే చేస్తున్న, వైట్ మార్కెట్టే, రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు! మరి ఎందుకు మీడియా నోరు విప్పటం లేదు? ఈనాడుతో సహా! ఎందుకంటే…. డబ్బు తమకీ అవసరం గనుక! రిలయన్స్ ఫ్రెష్ ల లాంటి కార్పోరేట్ సంస్థలు, చిల్లరకొట్టు వ్యాపారాలలోనికి వచ్చినప్పుడే చెప్పారు, ధరలకి అదుపు ఉండదని. కావాలంటే అవి వచ్చిన మొదట్లో, చిల్లర వ్యాపారులు, రాజకీయ నాయకుల ప్రకటనలు పరిశీలించి చూడండి.

ఇలాంటి ఈ మీడియా, ముఖ్యంగా ’ఈనాడు’ - పత్రికా నైతికవిలువల గురించి ఎన్ని కథలు చెప్పింది? ఎన్ని సంపాదకీయాలు వ్రాసింది? అందునా, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది, రామోజీరావుకి పరమ శతృవు లాగా వ్యవహరించి కోర్టుల చుట్టూ తిప్పించిన రాజశేఖర్ రెడ్డి కదా? మరెందుకు గమ్మున ఊరుకుంటున్నాడు రామోజీరావు? ’ముద్దబంతి పెళ్ళికూతురు’ సానియా మీర్జా కోసం, నిరంతరాయంగా, రోజులపాటు పేజీలు కేటాయించగలిగిన రామోజీరావుకు, కందిపప్పు, బియ్యం,[35/- రూపాయల రేటుకు అలవాటుపడిపోయాం], ఇతర నిత్యావసరధరల మంట గురించి, పేజీలు కేటాయించటం అసాధ్యమా? కష్టమా?

పైపెచ్చు, ఈ పత్రికావిలువల నేతిబీరతనం ఎంతంటే – ఓ పత్రిక వ్రాసిన దాన్ని విమర్శిస్తూనో, లేక వానికి విరుద్ధంగానో మరో పత్రిక వ్రాయకూడదట. ఈవిషయం ఈనాడు Vs సాక్షి పత్రిక మధ్యజరిగిన యుద్ధంలో బయటపడిన విషయం. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు, పత్రికల మధ్య ఎంత చక్కని ఒడంబడిక? దాన్ని బయటపెడుతూ సాక్షి పత్రిక, ఈనాడు మీద యుద్దం ప్రకటిస్తూ, అదే చేత్తో అంటే అదే కలంతో, దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమం [1992 లోది] ప్రజల మీద ప్రేమతో కాదు, ప్రత్యర్ధి పేపరుని తొక్కేయడానికి స్ఫూర్తింపచేశాడు రామోజీరావు, అని కూడా ప్రచురించి మరీ, నిరూపించింది. అంటే ‘ఈ విషయం బయటకు రావడానికి దాదాపు 16 సంవత్సరాల పైనే పట్టింది.’

ఆ విధంగా, మీడియా, తమతో తాము కొట్టుకుని, తమ అసలు రంగు బయట పెట్టుకుంది. తానేమిటో తనే Expose చేసుకుంది. ఈరోజు ప్రజలందరికీ, ఓ విషయం స్పష్టపడింది – ఏ పత్రికా నిజం వ్రాయదని, ఏ టీవీ ఛానెలూ నిజం చూపించదనీ, అన్నీ తమకి కావలసినట్లు ప్రచారిస్తాయనీ! ఏ మీడియా సంస్థకైనా, ఊపిరి ‘విశ్వసనీయత.’ ఆ విశ్వసనీయతనే పోగొట్టుకుంటే, ఇక అది జీవశ్చవంతో సమానమే! క్రమంగా కృశించి, ఆర్ధికంగా కూడా నశించిపోతుంది. ఆ బాటలో ఈనాడు కూడా, ప్రస్తుతానికి, ’పైకి కనబడుతూ’ ఉంది. అందుకే గుట్టుచప్పుడు కాకుండా, శనివారం అందించే ప్రతిభ సంచికని, శుక్రవారంకి మార్చింది. మెల్లిగా మూసేసుకుంది. ఈ జాబితాలో మరికొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. కాకపోతే వీటి ఆర్ధిక కృంగుబాటు ’పైకి కబడుతూ’ కాదు. వాస్తవంలో కూడానన్నమాట. ఆ విధంగా మీడియా తన ‘సువర్ణముఖి’ని తాను అనుభవిస్తోంది. అంతర్జాతీయ మీడియా నుండి ప్రాంతీయ మీడియా వరకూ అబద్ధాలు ప్రచారిస్తాయని దానంతట అదే నిరూపించుకుంది. అంతర్జాతీయ మీడియా, కార్పోరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ వాటిని నిలబెడటానికి ప్రయత్నిస్తూ ప్రజలకి Expose అయ్యాయి. ఆ విధంగా వాటి విశ్వసనీయత పోగొట్టుకున్నాయి. జాతీయ మీడియా, రాజకీయనాయకుల మధ్య గొడవులతో, ఒకరిమీద ఒకరు ఆరోపణలతో, జాతీయ మీడియా విశ్వసనీయతనీ పోగొట్టుకున్నాయి. ఇలాంటి రకరకాల కారణాలతో ప్రజల పక్షం, ఈ మీడియా వహించవన్న సంగతి ప్రజలందరికి అర్ధమయ్యింది. ఆ విధంగా మీడియా విశ్వసనీయతని పోగొట్టుకున్నాయి. అందుచేత ఈ టపాకి ‘మీడియా సువర్ణముఖి’ అని శీర్షిక వ్రాసాను.

అయితే ఇందులో ఓ విశేషాంశం ఉంది. మీడియా నవాబు రామోజీరావు ’సువర్ణముఖి’ తాలూకూ ఓ కోణం కూడా ఇక్కడ ప్రాధాన్యత కలిగి ఉంది. రామోజీరావుని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిజంగానే అన్నిరకాలుగా ముప్పతిప్పలు పెట్టాడా? ‘రాజ – రామోజీల యుద్ధం నిజమా, నాటకమా’ అన్న నా గతటపాలో దీని పూర్వాపరాలు వివరించాను. వాళ్ళయుద్ధం నిజం కాదు నాటకం అనటానికి కావలసిన దృష్టాంతాలని చూపించాను. అయితే ఆ నాటకానికి కారణాలేమిటో ఆ టపాలో వ్రాయలేదు. రాజ, రామోజీల యుద్ధ నాటకానికి కారణం రామోజీరావు సువర్ణముఖి తాలూకూ ఓ కోణమే! అదిప్పుడు వివరిస్తాను.

ఒకప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావు, భారతదేశంపట్ల నిబద్దత గల కేంద్రప్రభుత్వాలని, శాస్త్రీజీ దగ్గరనుండి పీవీజీ దాకా [మధ్యలో తనకి అనుకూలమైన ప్రధాన మంత్రులు – మొరాజ్జీ దేశాయ్, వీపీసింగ్ ఇత్యాదులు సీట్ ఎక్కినా, ఎక్కువ రోజులు నిభాయించుకోలేక పోయారు లెండి] ప్రధాన మంత్రుల్నీ, తమ గూఢచర్య తంత్రాలతో ముప్పతిప్పలు పెట్టారు. దేశప్రగతి సంగతి దేముడెరుగు, నిరంతరం దేశ భద్రత, రక్షణలతో పాటు, వ్యక్తిగత, ఆత్మరక్షణ [భౌతికంగానే కాదు, వ్యక్తిత్వపరంగా కూడా] లో ఉండేవిధంగా, నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావుల పట్టు ఉండేది. నాటి భారత ప్రభుత్వానికి, నిఘా సంస్థలకీ, తమ శతృవర్గాల పట్ల ఓ అంచనా మాత్రమే ఉండేది. [ఇందిరాగాంధీ విదేశీ ’కుట్ర’, భారతదేశంపై జరుగుతుందని ప్రకటించినప్పుడూ, దాని మీద ’ఈనాడు’ కుళ్ళు జోకులు వేసినప్పుడూ, ఇప్పటి బ్లాగర్లలలో చాలా మంది పుట్టి ఉండరు] ఐ.ఎస్.ఐ. బదులు సి.ఐ.ఏ.నీ, పాక్ బదులు అమెరికానీ, రామోజీరావుకు బదులు రామ్ నాధ్ గోయంకా వంటి వారినీ, చూపటం వల్ల ఎప్పుడూ ’నిజం’ నుండి హైజాక్ చెయ్యబడేవాళ్ళు. కాబట్టి శతృవు ఉన్నాడన్నది తెలుసు. ఎవరో తెలీదు. ఎక్కడుంటాడో తెలీదు. ఇక ఏం చేస్తున్నాడో తెలిసే అవకాశమే లేదు. కుట్రదారులే తెలియనప్పుడు కుట్రస్వరూపం ఎలా తెలుస్తుంది? చీకట్లో తడుముకున్నట్లు, ఆనాటి, వారి ‘యుద్ధం’ ఉండేది.

ఆ పరిస్థితుల్లో కూడా నాటి భారత ప్రభుత్వాలూ, నిఘాసంస్థలూ అలుపెరగని పోరాటం చేశాయి.

అయితే, ఇప్పుడు, నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావుల పరిస్థితి తిరగబడింది. 1992 లో పీవీజీ, మరియు నెం.5 వర్గం ఇచ్చిన హెచ్చరికతో, నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావుకీ తమ అంతుచూసేందుకు తమ వైరివర్గం నెం.5 ఉందని ఖచ్చితంగా తెలుసు. అంచనా ఎంతమాత్రం కాదు. అంతేకాదు, తాము నాటి భారత ప్రభుత్వాల మీదా, భారతీయ నిఘాసంస్థల మీదా చేసినట్లు, నమ్మించి మోసం చెయ్యటం, దొంగచాటుగా సమాచారం సేకరించటం, తెరచాటున వ్యవహారాలు నడపటం వంటిది కూడా కాదు, ఇప్పటి యుద్దరీతి! పీవీజీ, నెం.5 వర్గం ఇచ్చిన సవాలుతోనే యుద్దరీతి చెప్పబడింది. ’కన్నా? కాలా?’ అన్న స్ట్రాటజీ ప్రకారం, తమ వ్యవస్థనీ, నెట్ వర్కునీ, తమచేతే కూల్పిస్తామన్న సవాలు అది! అది – ‘చెప్పి మరీ తన్నటం’, ‘ప్రకటించి యుద్ధం చెయ్యటం’ వంటిది.

అయితే నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావుకీ చేసిన కర్మ అనుభవించటం ఒకటుంది. అదేమిటంటే – నెం.5 వర్గం ఉందని తెలుసు. అది తమ అంతు చూస్తుందనీ తెలుసు. తమనీ, తమ ఏజంట్లనీ కూడా ఆత్మహత్యా సదృశ్య Assignments తో [గూఢచార పరంగా కుక్కచావు] చంపుతోందనీ తెలుసు. అయితే ఈ నెం.5 వర్గం ఎక్కడి నుండి పనిచేస్తుందో, ఎవరి నేతృత్వంలో పనిచేస్తుందో, ఎవరెవరు అందులో ఉన్నారో తెలియదు. సరిగ్గా 1992 కు ముందర తామెవ్వరో, తము ఎక్కడి నుండి పనిచేస్తున్నారో, ఎవరెవరు తమ వారో, నాటి భారతప్రభుత్వాలకీ, భారత నిఘాసంస్థలకీ తెలియనట్లుగానే! ఇదీ రామోజీరావు ’సువర్ణముఖి’లోని ఓ కోణం.

ఈ నేపధ్యంలో – చంద్రబాబుతో ప్రపంచవ్యాప్తంగా లాబీయింగ్ చేయించుకున్న రామోజీరావు, తిరిగి తిరిగి మళ్ళీ యధాస్థానంకు వచ్చి భారతదేశంలోనే వెదుక్కునే ప్రయత్నం చేసాడు. నెం.5 ని, వై.యస్. రాజశేఖర్ రెడ్డి తనకు శతృవనీ, తనని ముప్పతిప్పలు పెడుతున్నాడనీ, పెట్టగలుగుతున్నాడనీ, నమ్మించేందుకు యమా నాటకం వేసాడు రామోజీరావు! ఇందులో మరికొందరు చిన్నాచితక నటులు, రాజమండ్రి ఎం.పీ. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్ళు ఉన్నారు. [ఇతడు 2006 లో ’వారంరోజుల్లో రామోజీరావు దేశద్రోహి’ అని నిరూపించబడుతుంది అంటూ రామోజీరావుకి సవాలు విసిరాడు. అప్పటి నుండీ ఇప్పటివరకూ, పాపం, ఈ ఎం.పీ. దృష్టిలో వారంపూర్తి కాలేదు. మధ్యలో అంబేద్కరు విగ్రహాన్నీ, దళితుల్నీ అవమానించాడంటూ గొడవల్లో చిక్కుకున్నాడు. అంబేద్కరు విగ్రహానికి క్షీరాభిషేకాలూ, పాదాభివందనాలు చేసి ’బ్రతుకుజీవుడా’ అనుకున్నాడు. దాని వెనుక రామోజీరావు పధకం ఉన్నట్లుగా పరోక్షంగా ఆయాసపడ్డాడు.] ఇక వై.యస్.రాజశేఖర్ రెడ్డి అయితే, రామోజీరావు ఇచ్చిన స్కీప్టు ప్రకారం నాటకాన్ని చాలా రక్తికట్టించాడు. మంత్రిరోశయ్య కూడా తన డైలాగులతో తన పాత్రకి తాను న్యాయం చేసాడు. ఏమాత్రం నెం.5 వర్గం నమ్మినా, వై.యస్.రాజశేఖర్ రెడ్డిని ఉపయోగించి మరికొన్ని కూపీలు లాగి తమనుతాము రక్షించుకోవచ్చన్నది… నకిలీ కణికవ్యవస్థ, రామోజీరావూ పన్నిక పధకం. అది బెడిసి కొట్టిందేమో మరి, ప్రస్తుతం ఇద్దరూ గమ్మున ఉన్నారు. ’అతడు మాజోలికి వస్తే మేము ఊరుకోము’ అన్న డైలాగ్ తో వై.యస్.రాజశేఖర్ రెడ్డి, రామోజీరావు మీద యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చాడు. అలాగే పాపం, పనిలో పనిగా, ఎన్నికలకు ముందు రామోజీరావు పత్రికకి, ప్రభుత్వసొమ్ము భారీగా వెచ్చించి మల్టీపుల్ పేజీలు ప్రకటనలు కూడా ఇచ్చాడు.

‘రామోజీరావు కూడా, తాను ముసలి వాడవ్వటం చేతా, జవసత్వాలు కొంతతగ్గి, కొంత పరిస్థితులకు తలొగ్గాడట [?]. కొడుకులు అప్రయోజకులవ్వటం చేతా, మీడియా రంగంలో పోటీపెరగటం వల్లా, వై.యస్.రాజశేఖర్ రెడ్డి విషయంలో వెనక్కి తగ్గుతున్నాడట’ – ఈ వాదన ఈమధ్య వినబడింది. ఇందిరాగాంధీకి, అందునా ఆవిడ హవా బాగా నడుస్తున్నా రోజుల్లో కూడా వెనక్కి తగ్గని రామోజీరావు, వై.యస్.రాజశేఖర్ రెడ్డిని చూసి గజగజలాడి పోతున్నాడన్న మాట. పోనీ అలాగే అనుకుందామన్నా, శతృశేషం లేకుండా ఉతికి పారేయాలన్న ఫార్ములాతో చంద్రబాబునీ, ఇతరప్రత్యర్ధుల్నీ నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఈ కడప ఫ్యాక్షనిస్టూ, చితికిపోయిన పార్టీలని, తెదేపా, ప్రరాపాలని మరింత చిదిమేయడానికి ’ఆకర్ష, ఆకర్ష’ అంటూ ఆపరేషన్లు చేపడుతున్నాడని, స్వయంగా ’ఈనాడే’ ఘోషపెడుతున్న ఈ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, ’పోనీలే పాపం! కొంత విరామం తీసుకుని, ఎదుటివాడు బలం పుంజుకున్నాక, మళ్ళీ యుద్ధం చేద్దాం’ అనుకుని ’అతడు మళ్ళీ మా జోలికి వస్తే మేమూ ఊరుకోము!’ అంటూ రామోజీరావుకి యుద్ధవిరామం ఇస్తాడా? తనకు నడుస్తున్నప్పుడే ఎదుటివాణ్ణి మరింత తొక్కేస్తే, భవిష్యత్తు భద్రం అనుకునే కాదా ఇతర ప్రత్యుర్ధుల్నీ, ప్రత్యర్ధి పార్టీలని చిత్తుచేస్తున్నాడు? మరి ‘ఈనాడు రామోజీరావు’కి మాత్రం, ఎందుకు మినహాయింపు ఇచ్చినట్లు? ఇదంతా నాటకమని ఇక్కడే స్పష్టం కావటం లేదా?

అందునా ఈ నాటకీయవైరం ఎంతదూరం పోయిందంటే, రామోజీరావుతో గొడవపడ్డ అతడి చిన్న కుమారుడు ’సుమన్’ తన ప్రత్యేక ఇంటర్యూని సాక్షికి మాత్రమే ఇచ్చేటంతగా! అయినా ఫలితం దక్కలేదు కాబోలు, మళ్ళీ రామోజీరావు, గమ్మున కొడుకుని వెనక్కి తెచ్చుకున్నాడు. ఆ విధంగా తన స్వంత స్ర్కిప్టు, తన స్వంత Assignments తోనే, తన కుటుంబాన్ని తానే రోడ్డున పడేసుకున్నాడు. ఒకప్పుడు గురిచూసుకుని మరీ, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలలో ’తరాల అంతరం’ పై కారణంగా చూపెడుతూ, వాళ్ళ కుటుంబపు పరువునీ రోడ్డున పడేసిన ‘కర్మ’ని, ఇప్పుడు, సుమన్ మరియు ప్రభాకర్ ల అంకంగా, అనుభవించాడు. ఇది రామోజీరావు ’సువర్ణముఖి’ తాలూకూ శత సహస్ర కోణాల్లో మరొకటన్నమాట.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

Very interesting!

అమ్మా,
మీకు ఆంధ్రా ఆర్ధిక,సామజిక,రాజకీయ చరిత్ర గురించి మంచి అవగాహన ఉన్నట్లుంది. మీరు ఈ హేతువాదుల గురించి కూడా రాస్తారని ఆశిస్తాను. ఈ హేతువాద ఉద్యమం ఆంధ్రాలో మంచి మార్పులు ఎమైనా తీసుకు వచ్చిందా ? వారు అందరు తాము చెప్పిన దానికి కట్టుబడి ఉద్యమించారా? లేక తెలంగాణా రాష్ట్రీయ సమితి లా కొన్ని రోజులు వెలిగి ఆరి పొయిదా? మీరు గుంటూరు జిల్లాకు చెందిన వారు కనుక అక్కడె ఈ ఉద్యమాలు మొదలు అయ్యాయి గాబట్టి మిమల్ని అడుగుతున్నాను. మీరు చెప్పినట్లు చాలమంది బ్లాగర్లు వారు ఆ సమయంలో పుట్ట లేదు కూడాను. అదేకాక మీకు తెలిసె ఉంటుది తెలుగు బ్లగులో కొన్ని హేతువాద బ్లుగులు ఉన్నయి కదా వారు రాసినవి ఎంత వరకు నిజమో బేరిజు వేయడానికి మీవ్యాసాలు ఉపయొగ పడతాయి.

mee yokka alochana sakthi ki joharlu.

ippudippude ilaanti kutradaarula vishayalu bayata paduthunnai.

meeru chaala samgranga maaku teliya chestunnanduku chaala manchidi.

ilantivi telusukovatam valla, maaku chetaninantalo meemu ee kutralanu andariki artham chesi, manchiga jarigela prayathnistam.

meeru cheppe amsyalanni, krindi cheppina booklo kutradaarulaki saayam chesina vyakthe ceppadu. veelupadite chadavanti. anni nijalatho sahaa niroopinchabaddayi.

Confessions of an Economic Hit Man
by John Perkins

అజ్ఞాత గారు,

హేతువాద సంఘం గురించి నాకు కొంత తెలుసండి. నా అంగ్లబ్లాగ్ Coups on World లో దాని గురించి పొందుపరిచాను. తెలుగులో వీలుచూసుకుని వ్రాస్తాను. నెనర్లు.

అజ్ఞాత గారు,

మీరు చెప్పిన పుస్తకం నేను చదవలేదండి. దాని గురించి మరికొన్ని వివరాలు ఇవ్వగలరు. మీరు ఇచ్చిన సమాచారం నాకు ఉపయుక్తమైనది. నెనర్లు.

please go through the following links...,

http://www.democracynow.org/2004/11/9/confessions_of_an_economic_hit_man

http://en.wikipedia.org/wiki/Confessions_of_an_Economic_Hit_Man

http://www.economichitman.com/

good observation

45 lakhs worth company owner is not a small person.... as u said.....

so can this be believed that Ramoji is not a hindu... and related to nizam's or salar jang...

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu