షిల్లాంగ్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల[EVM] పనితీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలు అర్ధరహితమని ప్రధాన ఎన్నికల కమీషనర్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. మనదేశంలో వినియోగించే EVMలు ప్రత్యేకమైనవని వాటిని ఎవరూ మాయ చేసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. “గతంలో అమెరికా, యూరోపియన్ దేశాల్లో వినియోగించిన EVM లు ఓ ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేసేవి. అయితే మన దేశంలో ఉపయోగించే యంత్రాలు అలాంటివి కావు. ఇక్కడ వినియోగిస్తున్న యంత్రాల్లో ప్రత్యేకమైన చిప్ నిర్మితమై ఉంటుంది. దీంతో యంత్రాలను బయట నుండి నియంత్రించే అవకాశం లేదు. వాటిని మాయ చేసే ప్రశ్నే లేదు” అని చావ్లా వివరించారు. మంగళవారం ఆయన అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికార్లతో సమావేశమయ్యారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ “EVM లను రెండు ప్రభుత్వరంగ సంస్థలు తయారు చేశాయని, ప్రైవేట్ సంస్థలు కాదని” చెప్పారు. – ఈనాడు, జూన్ 24, 2009. పేజీ నెం. 5.

మొత్తానికి నవీన్ చావ్లా EVM లని manipulate చేయగల అవకాశం ఉందని [గతంలో అమెరికా, యూరోపియన్ దేశాల్లో] చెప్పాడు. కాకపోతే అలాంటి అవకాశం ఇండియాలో లేదంటాడు. ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ గాకముందే టాయ్ లెట్ లోనుండి అధికార పార్టీకి సమాచారం అందించాడనే ఫిర్యాదుని, అప్పటి ఇతడి పైఅధికారి గోపాలస్వామి రాష్ట్రాపతికి చేయాల్సివచ్చింది. అందరూ అలాంటి వారే కదా!

“వడ్డించేవాడు మనవాడయితే ఎంత మూలన కూర్చున్నా అన్నీ అందుతాయి” అని పెద్దలంటారు. కాబట్టి అవినీతి అధికారులు సహకరించాలే గానీ ఏ యంత్రాలలోనయినా, ఏ మతలబులయినా చేయవచ్చు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!
***********

1 comments:

మీరింతకుముందు చెప్పినట్టు , సింధియాలు, గజపతిరాజులు నెత్తికెక్క గలిగినప్పుడు, ఈ చావ్లాలు ఎంతలెండి.

ఇంకా ఐదేళ్ళున్నాయి.
వాళ్ళ లక్ష్యం భారతదేశంలో ఒకేఒక్క సాంప్రదాయం (క్రైస్తవం) మిగలడం. అయోధ్యకాండ చివరిలో జాబాలి చెప్పిన సంపూర్ణ పదార్ధ భావాన్ని భారతావనిలో నింపడమే లక్ష్యం.


నిజమైన భారతీయుల లక్ష్యం ఆ పదార్ధ భావాన్ని సమర్ధంగా తిప్పికొట్టగలగడం.

దానికి సరైన పద్ధతి ఎవరి ఇంట్లో వాళ్ళు ఈ విషపూరితమైన భావజాలాన్ని అర్ధమయ్యేట్లు వివరించి , వాళ్ళు ఈ ఉచ్చులో పడకుండా పరిరక్షించుకోవాలి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu