టపా చదివే ముందు ఈ పర్సనల్ ప్రోఫైల్ తిలకించండి! [ఈనాడు ఆదివారం సంచికలోనిది]



మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. దాదాపు దేశవ్యాప్తంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లు ప్రచారం చేసారు. ఎక్కువగా ప్రచార కార్యక్రమంలో సోనియా, రాహుల్ గాంధీలే పాల్గొన్నారు. EVM Tampering తో కాంగ్రెస్ గెలిచింది. సోనియాగాంధీని ఎదిరించిన ప్రత్యర్ధులందరూ మట్టికరిచారు. కొత్తప్రభుత్వం పునఃప్రతిష్ఠ జరిగింది. రాహుల్ గాంధీ భావిప్రధానిగా ప్రచారం జరిగినా, సోనియా, రాహుల్ గాంధీలు మన్మోహన్ సింగే మా నాయకుడని, తమ ప్రధాని అభ్యర్దని ప్రచారం చేసారు. గెలిచిన తరువాత తము చెప్పిన మాట ప్రకారం మన్మోహన్ సింగే ప్రధానిగా పీఠం అధిష్టించాడు. మంత్రివర్గంలో రాహుల్ గాంధీకి చోటుందని మన్మోహన్ సింగ్ చెప్పాడు. రాహుల్ గాంధీ మంత్రివర్గంలో చేరటంపై ఏమాటా చెప్పలేదు. మంత్రివర్గం నియామకం అయిన తర్వాత మాత్రం, రాహుల్ గాంధీ “మంత్రివర్గ నియామకంలో నాముద్ర ఉందని” చెప్పుకున్నాడు. ఇలా చెప్పటం ద్వారా తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నాను గానీ, మంత్రిపదవిరేసులో లేనని పరోక్షంగా చెప్పినట్లయింది.

ప్రధానమంత్రి రేసులో ఉన్నాను అన్న అభ్యర్ధులందరూ [అద్వానీ, లాలూ, మాయావతి, రాంవిలాస్ పాశ్వాన్, వామపక్షాలు, జయలలిత గట్రాలు] ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో సోనియాగాంధీ కోపంతో “ప్రధాని పదవిరేసులో ఉన్నాననడం ఫ్యాషన్ అయిపోయింది” అంటూ ప్రత్యర్ధుల ప్రచారాన్ని తిప్పికొట్టింది. అయితే ప్రియాంక వాద్రా మాత్రం “తన అన్నకు భారత ప్రధాని కావలసిన లక్షణాలు ఉన్నాయని, అతడిలో మేధావి లక్షణాలున్నాయని” అన్నది. బహుశః ప్రధానమంత్రి పదవి తమ కుటుంబానికి మాత్రమే చెందిందన్న భావన సోనియాగాంధీ కుటుంబంలో నరనరాన ఉన్నట్లుంది.

ఇంతకీ భారత ప్రధానికి, మేధావికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? సిక్స్ ఫ్యాక్ బాడినా, బాక్సింగ్ మరియు తైక్వాండాలో ప్రావిణ్యమా? యమహా ఆర్-1, కావాసాకి నింజా… లాంటి బైకులు నడపటమా? రైఫిల్ షూటింగ్, గోల్ఫ్, గోకార్టింగ్ లలో ప్రవేశమా? రాక్ మ్యూజిక్, యు2, పింక్ ప్లోయిడ్, రాక్ బ్యాండ్స్ పాటలంటే ఇష్టపడటమా? ఏవి ప్రధాని లేదా మేధావికి ఉండవలసిన లక్షణాలు? రాజకీయ అర్ధశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదవట మంటే ఇష్టమట, వాటిపై తన అభిప్రాయాలను బ్లాగులలో వ్రాయడం మరో హాబీ అట. ఇది క్రొత్తగా ప్రచారంలోకి వచ్చింది. ‘పుస్తకాలు చదువడం, బ్లాగులో వ్రాయడం’ అన్న విషయం ఇంతక్రితం ఎప్పుడు వినలేదు. బహుశ ఈ మధ్యకాలంలో ప్రచారం చేసుకుంటూ ఉండి ఉంటారు. ఇంతక్రితం ఆఫ్ఘాన్ పర్యటనలో, సమావేశాలు నడుస్తున్నప్పుడు, ఈ మేధావి, కరినా కపూర్ తో SMS ఛాటింగ్, విడియో గేములతో కాలక్షేపం చేసాడు. రాజకీయ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలంటే ఇష్టపడే మేధావికి, రాజకీయ సమావేశాల కంటే ఒక సినిమా నటికి SMS పంపటం ఎక్కువ ఆసక్తికరం ఎలా అయ్యిందో?

నాయకుడికి భావప్రసార శక్తి అతిముఖ్యమైనది. అలాంటి శక్తి ఈ మేధావి దగ్గర ఏ కోశానా కనపడదు. ఎందుకంటే, ఇతడు ప్రసంగించిన ఏ సభలోనూ ప్రజలు ఉర్రూతలూగిన సందర్భంగాని, ప్రజలు బ్రహ్మరధం పట్టింది గానీ లేదు. కాంగ్రెస్ యువజన నాయకులు మాత్రమే అతడిని పొగడుతుంటారు గానీ , సభకు వచ్చే ప్రజలందరూ వీళ్ళు ఇచ్చే డబ్బులకో, డబ్బుతో పాటు ఇచ్చే బిర్యానికో, సారాకోసమో వస్తున్నారు. అంతేగాని అభిమానంతో కాదు. క్రితం ఎన్నికలలో మా నంద్యాలలో రాహుల్ గాంధీ సభ జరిగినప్పుడు, డ్రమ్ముల్లో సారా ఉంచి తాగినోడికి తాగినంత సారా ఇచ్చారు. ఆడవాళ్ళకు డబ్బులిచ్చారు. అలాగయ్యీ సభలో జనాలు పలచగా ఉన్నారు. ఇదీ అతడి భావ ప్రసార శక్తి!

ఇంతక్రితం వరకు రాహుల్ గాంధీ పర్యటించిన నియోజక వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్ధులే ఓడిపోతారని ప్రచారం ఉండేది. తదుపరి పరిణామంలో అతడిని తమ నియోజకవర్గాలలో పర్యటించమని అడగటానికి అభ్యర్ధులే భయపడేస్థితి వచ్చింది. అంటే ఇతడు ప్రజలను ఆకట్టుకోలేకపోయాడు.

నాయకత్వ లక్షణాలలో కావలసిన ఇంకొక లక్షణం దార్శినికత. ఇప్పటివరకూ అటువంటి లక్షణం రాహుల్ గాంధీలో కనపడలేదు. అణు ఒప్పందం నేపధ్యంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని గొప్పగా చెప్పాడు. ఇప్పుడు చూస్తే లక్షల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. మొన్ననే ఎగుమతిరంగంలో పదమూడులక్షల ఉద్యోగాలు ‘హాంఫట్’ కాబోతున్నాయని వార్తలు వచ్చాయి. జాతీయ గ్రామీణ ఉపాధి పధకంలో ఇచ్చేవి దినసరి కూలిపనులే! అంటే తుమ్మితే ఊడే ముక్కులాంటివే ఈ ఉద్యోగాలు, ఉపాధులు! ఉద్యోగాల మాటే తప్పితే, స్వయం ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలు, చిన్నపరిశ్రమల గురించిన ఊసే ఇతడు ఏనాడూ ఎత్తలేదు. అది ఇతని దార్శనికత. దార్శనికత అనే పదం ఇతనిపట్ల చాలా పెద్దదనుకుంటా.

కనీసం నాయకుడిగా చైతన్యవంతంగా[Active] ఉంటాడా?... అంటే అదీ ఏంలేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటాడు. ఇక మూడిగా ఉంటే ఎవ్వరు పలకరించటానికి ధైర్యం ఉండదని, చెల్లెలు ప్రియాంక వాద్రా మాత్రమే పలకరిస్తుందని చెప్తారు.

ఆహారం విషయానికి వస్తే ఎలాంటి కార్యక్రమాలు లేకపోతే రెస్టారెంట్లకి వెళ్తాడట. అది ఏఢిల్లీలో మాత్రమే పరిమితం కాదు, నియోజక వర్గాలలో పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో పేరున్న [క్రేజీ] రెస్టారెంట్ కు వెళ్ళటం కూడా ఒక కార్యక్రమమే. ఈ మోజులు కూడా దాటలేని వాడు ప్రధాని స్థాయికి అర్హుడా?

అంతేకాదు, ‘రాజకీయాలు, అర్ధశాస్త్రాలంటే ఎంతో ఇష్టం అన్నాడు కదా! మరి దాంట్లోనయినా ప్రతిభ చూపించాడా?’ అంటే… ఎప్పుడూ పార్టీలో విస్తృత చర్చలు జరిపిన దాఖాలాలు లేవు, యువజన కాంగ్రెస్ సభ్యులతో ఢిల్లీలో క్రికెట్ ఆడటం మీద ఉన్నంత శ్రద్ధా, ఉత్సాహం చర్చల మీద ఉండదు. వామపక్షాల ప్రోదల్భంతో పెట్టిన పధకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం. దానిని కాంగ్రెస్ తన పధకంగా ప్రచారించుకోవటమే గాక, ఆ పధకాన్ని రాహుల్ గాంధీ మానస పుత్రికగా అభివర్ణిస్తారు. ఇక్కడా ప్రక్కవాడి ఆలోచనను దోచుకోవటమే! అలాగయ్యీ ఆ పధకం సరిగ్గా అమలయ్యేటట్లు చూస్తారా అంటే అదీ అవినీతిమయమే.

నాయకులలో ఉండవలసిన మరో ముఖ్యలక్షణం ప్రజలమీద ప్రేమ! ఆ విషయంలో ఇతడిది ఎప్పుడూ వైఫల్యమే. ఎందుకంటే బాంబుదాడులు జరిగినప్పుడు హుటాహుటినా ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలకు ధైర్యం చెప్పటంగానీ, ఆ దాడులలో బంధువులను కోల్పోయిన వాళ్ళకు సానుభూతిని తెల్పటంగానీ ఎప్పుడూ చెయ్యలేదు.

‘ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో పేదల ఇళ్ళల్లో తిని, అక్కడే నిద్రపోయి వారి కష్టనష్టాలు తెలుసుకున్నానని, తాను గాంధీ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఎం.పి.గా ఉన్నానని, ఈరోజులలో సామాన్యుడు ఎవ్వరూ రాజకీయాలలో ఈ స్థితికి చేరుకునే పరిస్థితి లేదని’ ఉపన్యాసాలు ఇచ్చాడు. అణు విద్యుత్ విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు, విశ్వాసపరీక్ష సమయంలో విచారంగా ముఖం పెట్టి కళావతి గురించి, ఆవిడ పేదరికం గురించి ఉపన్యసించాడు. తర్వాత ఇతడి ఉపన్యాసానికి స్పందనగా అన్నట్లు సులభ్ సంస్థ ‘ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆమెని, ఆమె కుటుంబాన్ని అదుకోవటం కోసం పెద్దమొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తామని, ఆ డబ్బుపై వచ్చేవడ్డితో ఆమె పిల్లలను చదివించుకోవచ్చని’ ప్రకటించింది.

ఇప్పుడేం జరిగిందో ఆవిడ [కళావతి] మాటల్లోనే చూద్దాం!

“కళావతి కల భగ్నం

న్యూఢిల్లీ, జూన్‌ 11: ఆశలన్నీ ఆవిరి కావడంతో.. కళావతి నిస్పృహతో వెనుదిరిగింది. ఇక రాహుల్‌ను కలిసే ముచ్చటే లేదని పేర్కొంది. ఆమెకు 'మెరుగైన జీవితం' ప్రసాదిస్తామని రాహుల్‌ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. కళావతి దీనగాథను రాహుల్‌ గత ఏడాది పార్లమెంట్‌ సమావేశాల్లో వినిపించారు. రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదైన విదర్భలోని.. యావత్మాల్‌ జిల్లా జల్కా గ్రామవాసి అయిన కళావతి పేరు అప్పట్నుంచీ మారుమోగిపోయింది.

ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడంతో.. 9 మంది పిల్లలతో బతుకీడుస్తున్నదామె. ఆమె ఇంటికి స్వయంగా వెళ్లిన రాహుల్‌.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. ఏడాది గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో నేరుగా ఆయననే కలిస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందేమోననే ఆశతో ఇక్కడకు వచ్చింది. మళ్లీ ఆశాభంగమే. రాహుల్‌ ఢిల్లీలో లేకపోవడంతో కలవలేకపోయింది. కళ తప్పిన మొహంతో ఇంటి ముఖం పట్టింది.

'రాహుల్‌ గాంధీ చాలా పెద్ద వ్యక్తి. ఆయన మాకు ఎక్కడ సమయం కేటాయిస్తారు?' అని నిరాశగా చెప్పింది. తనకు కొత్త ఇల్లు మంజూరు చేస్తానని రాహుల్‌ హామీ ఇచ్చారని చెబుతోంది. స్థానిక నేతలు ఆమెకు నగదు ఇచ్చారు. ఇంటి సామగ్రి కొంత సమకూర్చారు కూడా. ప్రభుత్వమైతే ఏకంగా విద్యుత్‌ కనెక్షన్‌నే మంజూరు చేసింది. అయితే కళావతి నివసిస్తున్న ఇల్లు.. ఇప్పటికీ అక్రమ కట్టడమే! 'రాహుల్‌ నాకు ఇల్లు ఇస్తామన్నారు. అది జరగలేదు. ఇక నేను ఆయనను కలవను' అని కళావతి తెగేసి చెప్పింది.

Pasted from http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fwww.andhrajyothy.com%2Fmainshow.asp%3Fqry=%2F2009%2Fjun%2F11main4 “

అంటే ఇమేజ్ కోసం పార్లమెంట్ లో ఉపన్యాసం ఇచ్చాడు. అతడికి వాళ్ళ పేదరికమే పట్టి ఉంటే, follow up కూడా చేసి ఉండేవాడు. అదే చేసి ఉంటే కళావతి ఎందుకు ఢిల్లీ వస్తుంది?

ఇలా ఏవిధంగా చూసినా, నాయకుడిగా ఇతడిలో వైఫల్యమే కన్పిస్తూంది.

భారతదేశాన్ని పాలించటానికి భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు కనీసపాటి తెలియాలి. ఆ తెలిసినతనం రాహుల్ గాంధీలో ఏమాత్రం కన్పించదు. ఇండియాలో, ఏరాష్ట్రం వాళ్ళయినా, పరాయి రాష్ట్రంలో గాని, పరాయి దేశంలో గానీ ఉంటున్నప్పుడు, బయట ఆ రాష్ట్ర భాషా, లేదా ఆ దేశ భాష [వస్తే] మాట్లాడినా, ఇంటికి వచ్చిన తరువాత మాత్రం, తమ మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ ఈ గాంధీల కుటుంబం మాత్రం తమ ఇంట్లో ఇటాలియన్ భాషనే మాట్లాడతారట. అంటే వాళ్ళకు ఇటాలియన్ భాషే మాతృభాషగా అన్పిస్తున్నదన్న మాటే కదా! ఇక వాళ్ళు ఈదేశంతో మమైక్యం అవుతున్నదెక్కడ? భారతీయ సంగీతం అంటే ఇష్టం లేదు, భారతీయ దేవుళ్ళ పట్ల నమ్మకం లేదు. భారతీయత సంస్కృతి, సంప్రదాయల పట్ల నమ్మకం లేదు. కాని భారతదేశాన్ని మాత్రం పాలిస్తారట! భారతీయ పేదల ఇళ్ళల్లో తింటారు, అక్కడే నిద్రిస్తారు, వాళ్ళ గురించి సభలలో ఉపన్యాసాలిస్తారు గానీ, వాటి పరిష్కారాలు మాత్రం చెయ్యరు. మంత్రివర్గంలో యువకులకు ప్రాధాన్యం ఇచ్చామని, అదీ తను పట్టుబట్టి ఇప్పించానని గొప్పగా చెప్పుకున్నాడు ఈ రాహుల్ గాంధీ! ఎవరికి ఇప్పించాడు? డబ్బు, పలుకుబడి ఉన్న రాజకీయనాయకుల వారసులకు పదవులు ఇప్పించాడు గానీ, సామాన్యప్రజలలో నాయకులను గుర్తించారా? పదవులు ఇప్పించారా?

‘తాగితే తప్పులేదన్నాడు’ రాహుల్ గాంధీ. ఆ మాటలతో ఉత్తేజం పొందిన వై.యస్. రాజశేఖర్ రెడ్డి జనాలందరికి అందుబాటులో బారు-బీరు ఉంచాడు. జనాలు అనారోగ్యం పాలవుతున్నారన్న విమర్శ నుండి రక్షణగా, కార్పోరేట్ ఆసుపత్రులకు దోచి పెడుతూ ఆరోగ్యశ్రీ పధకం గురించి చెప్తాడు. నీరురాని గ్రామమయినా ఉందేమో గానీ, సారా లేని గ్రామం మాత్రంలేదు. అంతేకాదు అన్నిగ్రామాలలో మినరల్ వాటర్ మాత్రం దొరుకుతుంది, ఉచితంగా కాదులెండి డబ్బులిస్తేనే! సారా అందుబాటులో తెచ్చి, బాగా అలవాటు చేసారు కదా, ఇప్పుడు వాటి రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. ఇక్కడా దోపిడీయే!


కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహారిస్తూన్నారే గానీ, సామాన్య ప్రజలు తామే యజమానులు అయ్యే విధంగా ఏపాలసీలు తీసుకురావటం లేదే? స్వయం ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలని ప్రోత్సహించటం గాని, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను యువకులు స్థాపించేదిశగా ప్రోత్సహకాలు గానీ ఏవీ ఇవ్వటం లేదు. చివరికి డిగ్రీ చేసిన వాళ్ళు చిన్న ఇల్లు తీసుకుని స్వంతంగా ఒక చిన్నస్కూలు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. కిరణాషాపులను దెబ్బకొట్టే విధంగా సూపర్ మార్కెట్లు వచ్చాయి. రేపు అంబానీలు మంగలి షాపులు పెడతారట. వ్యవసాయంలోకి కార్పోరేట్ కంపెనీలు వస్తాయంటున్నారు. అప్పుడు కిలో బియ్యం 40/-Rs. నుండి 140/-Rs. వచ్చినా ఆశ్చర్యలేదు. అప్పుడు ఇండియా కాస్తా జింబాబ్వే అయిపోతుంది.

ఇలాంటి విషయాలు ఏవీ ఈ మేధావికి కన్పించటం లేదనుకుంటా? మరి మీడియా, కాంగ్రెస్, ఇతడి చెల్లెలు ప్రియంకా వాద్రాలకు అతడిలో మేధావి లక్షణాలు, భారత ప్రధాని లక్షణాలు ఎలా కన్పించాయబ్బా?

సోనియాకాంగ్రెస్ మాత్రం ఒక విషయంలో బాపుజీ మాటను గౌరవిస్తుంది. అది ఏమిటంటే “మొదట నిన్ను లెక్కచేయరు, తరువాత నవ్వుతారు, ఆ తరువాత నీపై పోరాడతారు, తరువాత నీదే విజయం”. ఈ సూత్రాన్ని వందశాతం ఆచరణలో పెడుతున్నారు. సెజ్ లు ఇచ్చిన కొత్తలో, బియ్యంరేట్లు పెరిగిన కొత్తలో, సారా అమ్మకాలు విపరీతంగా పెంచిన కొత్తలో, అవినీతి భయంకరంగా ఉందన్న రోజులలో, ఇలా అన్ని విషయాలలో మొదట ఇదీ అభివృద్ది మంత్రం, పట్టించుకోనవసరం లేదన్నారు. ప్రజలు ప్రశాంత పడ్డ తరువాత, ఆ చర్యల వేగం పెంచారు. ప్రజలు పోరాడటం మొదలుపెట్టిన తరువాత మౌనం వహించి, ప్రజలే ఓపిక నశించి పోరాటం ఆపేవరకూ చూస్తూ ఉంటున్నారు. క్రమంగా ప్రజలు అలవాటు పడుతున్నారు, అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా విజయం సోనియాకాంగ్రెస్ దే అయ్యింది. అలాగే రేపు రాహుల్ గాంధీని కూడా భావి భారత ప్రధానిగా అలవాటు చెయ్యొచ్చు అన్నదే సోనియాగాంధీ భావన! మొత్తానికి, బాపూజీ చెప్పిన సూక్తిని, సందర్భాన్ని ‘శీర్షాసనం’ వేయించిన సోనియాగాంధీకి దండేసి, దండం పెట్టాలి!!!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

11 comments:

manakai manachi naayakudi kante manchi palakudu kaavaalemo.......

Very nice posting.

కాంగ్రెసు గురించి ఒక్కమాటలో తెలుసుకోవాలంటే, కొందరు నాయకుల పేర్లు చాలు. అర్జున్ సింగ్, సుఖ్ రాం, పాటిల్, రాహుల్ గాంధీ...

మీరన్నట్టు దేశం జింబాబ్వే గా మారటానికి ఎంతో కాలం పట్టేట్టు లేదు.

మీరు చెప్పే విషయాలన్నీ చూస్తుంటే భయమేస్తుంది. మన వంతుగా మనం ఎమన్నా చెయ్యగలమా అనిపిస్తోంది.
-Anu

భావి భారత ప్రధాని, ఏం చేస్తాం.

http://vinvk.blogspot.com/2009/06/cultural-invasion_07.html

వినోద్ గారు,

మంచి టపా అందించినందుకు నెనర్లు. టూరిజం వాళ్ళ లోగో చూస్తూనే ఉండేవాళ్ళంగానీ, మీరు చెప్పిన తరువాత గుర్తుతెచ్చుకుంటే నిజమే అన్పిస్తుంది. మిగతావి కూడా మీరు చెప్పిన తరువాతే గమనించాను. అవును, ఒక క్రమపద్దతిలో భారతీయతని చెరిపేస్తున్నారు.

అంటే మరి మరి మా యంగ్ డైనమిక్ రాహుల్ గాంధి మీద మీకెందుకు అంత కోపం? ఉత్తముడు కాబట్టే 39 అయినా ఇంక పెళ్ళి చేసుకోలేదు. పెళ్ళి అంటె గుర్తొచ్చింది. ఇతడికి బ్రేజిల్ మాఫియా డాన్ కుతురు తో సంబంధం ఉంది. అలాంటి దాన్ని చేసుకుంటే కూడా మనం భారత ప్రజలు అబ్బో ఎంతో ఉన్నతమైన ఆలోచనలు గలవాడు ఒక దావూద్ కూతురు లాంటి అమ్మాయిని వెతికి మరి చేసుకున్నాడు అని ఆనందించి వోట్లేస్తారు. థు మన బ్రతుకు. అయినా ఇంకో ఐదేళ్ళల్లో భారతవని మొత్తం గుర్తుపట్టని విధం గా అయిపోతుందని నా ప్రగాడ విశ్వాశం.

ఐదేళ్ళ కాంగ్రెస్స్ పాలనలో చిల్లర్ బల్లర్ నాయకులతో బాటూ పెతీఓడు కనిష్టం కోటీశ్వరుడు ఐపోతాడు. దేశ ప్రజలు ఇంకా దరిద్రులౌతారు. అయినా వీళ్ళనే ఎన్నుకుంటాం. సిగ్గులేకుండా. ఏడుకొండల మీద ఒక చెర్చి వస్తుంది. అయినా ఏమి అనము. వాడి పాపానికి వాడే పోతాడు లే అని ఒదిలేస్తాం.

మనదీ ఒక బ్రతుకేనా..

chala bagundi

చాలా అన్యాం జరగబోతుంది అనిపిస్తుంది , భయమేస్తుంది, మరి మన గూఢచరారులు ఏమీ చేయటం లేదా, 2 డేస్ నుంచి బ్లోగ్ చదువుతున్నాను , పిచీ ఎక్కెట్టుండి, నేను మన దేశం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను , అభివృద్ది వైపు పరుగులు తెస్తుంది అనుకుంటున్నాను ఇన్ని రోజులు .........

చూద్దాం , నేనే షూసైడ్ బాంబ్ అవ్వాల్సి వస్తుందేమో..

శ్రీకాంత్ రెడ్డి, నెల్లోర్

శ్రీకాంత్ రెడ్డి గారు,

భరోసా కలిగి ఉండండి. మన గూఢచారులు ఏమి చేస్తున్నారో తెలియాలంటే ఈ బ్లాగులో టపాలన్నీ చదవండి. మీకే అర్ధమవుతుంది. సూసైడ్ బాంబు అవ్వాల్సిన అవసరం లేదు. మన మెదడునే బాంబులా ఉపయోగించి, అవినీతిని, అవినీతిపరులని పేల్చేయవచ్చు. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu