LTTE ని పైకారణంగా నిలబెట్టి, రాజీవ్ గాంధీ హత్యని 1991 లో నకిలీ కణిక-7 నిర్వహించాడు. అంతకు ఒక సంవత్సరం ముందే ఎంతో గతవైభవం గల USSR ని కుప్పకూల్చాడు. గొప్ప సమర్ధత గల గూఢచార సంస్థగా పేరుప్రఖ్యాతులూ, చరిత్రాగల కె.జి.బి. ఏమీ చెయ్యలేకపోయింది పాపం! దేశం కుప్పకూలుతుందన్న విషయం కనిపెట్టలేకపోయింది కాబోలు! నిజానికి కె.జి.బి. చెయ్యగలిగింది మాత్రం ఏముంది? అది ఎటూ నకిలీ కణిక వ్యవస్థ ఇమేజ్ ఇస్తే వెలిగిపోయిన బొమ్మ మాత్రమేన య్యే! నిజానికి ఏదేశ చరిత్ర చూసినా, ఒకటే శృతి! 1920లో లెనిన్ భావ తీవ్రతతో స్ఫూర్తి పొంది, ఉవ్వెత్తున ఎగసిన విప్లవం, సామ్యవాదాన్ని వాస్తవరూపంలోకి మలచింది. జనచైతన్యానికి గల బలాన్ని నిరూపించింది. అదే కథ భారతదేశానిది కూడా! మహాత్మా గాంధీ భావతీవ్రతతో స్ఫూర్తిపొంది, కదం తొక్కిన ప్రజలు, పెల్లుబికిన జనచైతన్యం భారతదేశాన్ని బ్రిటీషు దాస్య శృంఖలాల నుండి విముక్తం చేసింది. అయితే క్రమంగా రెండుదేశాలలోనూ, నిజాయితీ, నిబద్దత గల నాయకత్వాన్ని నాశనం చేసి, కనుమరుగు చేసి, ప్రజా దృక్పధాన్ని ’స్లోపాయిజన్’ వంటి తమ ప్రచార స్ట్రాటజీలతో నిర్వీర్యమూ, నిష్ప్రయోజనమూ చేసి, క్రమంగా చేవఛస్తూన్న, నీరుగారుతున్న జాతికి తమ ఏజంట్లని నేతలుగా చేస్తూ పరోక్షంగా ఆ దేశం తమ పాలనక్రిందకి వచ్చేటట్లు చేసుకోవడమే నకిలీ కణికుల స్ట్రాటజీ, పనితీరు. కాకపోతే ఈ ప్రక్రియ USSR లో చాలా త్వరగా జరిగిపోయింది. 1917లో ప్రారంభమైన విప్లవం 1920లో USSR గా ఆవిష్కరింపబడ్డాక, నాలుగేళ్ళలో లెనిన్ పరలోకగతుడైనాడు. తర్వాత స్టాలిన్ లూ,... బ్రెజ్నెవ్ లూ, కృశ్చేవ్ లూ… సంస్కరణల పేరిట పెరిస్త్రోయికా అన్న నినాదలతో గోర్పోచేవ్ లూ, ఎల్సిన్ లూ… వెరసి కుప్పకూలిన USSR, అది ఎందుకు కూలింది అన్న విశ్లేషణలు. ఇదంతా పరిశీలించాక, కె.జి.బి. నకిలీ కణికుల చేతిలోని బొమ్మ కాదనుకోగలమా?

అయితే ఈ ప్రక్రియ భారతదేశంలో అంత తేలిక కాలేదు. నకిలీ కణికులకి నాయకత్వాన్ని నాశనం చేసి కనుమరుగు చెయ్యటానికి లాల్ బహుదూర్ శాస్త్రి దగ్గర నుండి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల వరకూ ఎన్నో ప్రయాసతో కూడిన ప్రయత్నాలు చెయ్యవలసి వచ్చింది. అట్లయ్యీ చైనా యుద్దం తర్వాత భారత నాయకత్వం అప్రమత్తం అయ్యింది. కుట్ర గురించి పరిశీలన, కుట్రదారుల గురించి అన్వేషణా ప్రారంభించింది. ఆ పోరాటం ఇందిరాగాంధీ హయాంలో మరింత తీవ్రతని సంతరించుకుంది.

ఈ సంఘలనలన్నిటినీ నకిలీ కణికుల పరంగా చూస్తే…. 1990 లో USSR ని కుప్పకూల్చడంతో వారిలో ముఖ్యంగా నకిలీ కణిక-7 లో అతివిశ్వాసం పెరిగిపోయింది. ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్దానికి ఒక కారణంగా దశాబ్దాలపాటు చూపబడిన USSR! అమెరికాతో పోటాపోటిగా, ఒకోసారి ఓ అడుగు ముందు అంతరిక్ష ప్రయోగాల దగ్గర నుండి అత్యాధునిక ఆయుధాల నిర్మాణం వరకూ…. అత్యంత ప్రబల శక్తిగా వెలిగిపోయిన USSR! చాలా మామూలుగా, ఎంతో సహజంగా, నకిలీ కణికుడి ప్రపంచవ్యాప్త ఏజంట్లు ప్రచారించి చూపెట్టిన పైకారణాలని[overleaf reasons] అందరూ నమ్మేంత సహజంగా కుప్పకూలింది. అటువంటప్పుడు ’అమెరికాని సైతం ఎప్పుడు కావాలంటే అప్పుడు కుప్పకూల్చవచ్చు’ అనుకున్నాడు నకిలీకణిక-7. ఎందుకంటే సి.ఐ.ఏ. సైతం తన చేతిలోని బొమ్మే గనుక. తాను ఇమేజ్ ఇస్తే వెలుగుతున్న బొమ్మే గనుక. అందులో ఉన్న కీలక వ్యక్తుల్లో దాదాపు అందరూ తన ఏజంట్లే. తమ మాతృదేశం అమెరికా పట్ల నిబద్దత గలవారు తను సృష్టించిన ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. ఆత్మరక్షణ సైతం కష్టమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఖచ్చితంగా చెప్పాలంటే ’అమెరికా కంటే పాకిస్తాన్ కే బలమెక్కువ’ అనీ, ’సి.ఐ.ఏ. కంటే ఐ.ఎస్.ఐ. శక్తివంతమైన’దనీ ఇప్పుడందరికీ క్రమంగా కన్పిస్తోంది గానీ, అప్పటికి అంటే – 1991 -1992 ల్లో నకిలీ కణిక-7 కీ, అతడి ఆంతరంగికులైన కొందరికీ తప్ప ఎవరికీ తెలియదు గదా! ’కాబట్టి అమెరికాని ఎప్పుడు కావాలంటే అప్పుడు తను చాలా మామూలుగా కుప్పకూల్చగలడు’ - ఇదీ నకిలీ కణిక-7 కి గల ధృఢమైన అభిప్రాయము. అందుచేత అమెరికా కంటే ముందు తనకి ఎప్పటికీ కొరకరాని కొయ్యగా ఉన్న భారతదేశాన్ని కుప్పకూలిస్తే, ఇక అమెరికాతో సహా ప్రపంచమొత్తం తన గుప్పిటలోకి తీసుకోవటం తన చేతిలోని పని! కాబట్టి తదుపరి లక్ష్యం భారతదేశమే! అందుకు తగిన పధకాన్ని, స్ట్రాటజీని చాలా స్పష్టంగా రచించుకున్నారు నకిలీ కణిక-7, అతడి అంతరంగిక ఏజంట్లు దీని గురించిన పూర్తివివరాలు గతటపాల్లో వ్రాసాను. ఆ ప్రకారమే 1991, మే లో రాజీవ్ గాంధీని హత్య చేసారు. పైకి LTTE నేత వేలుపిళ్ళై ప్రభాకరన్ కనపడ్డాడు. కానీ 18 ఏళ్ళ తర్వాత, నిన్నమొన్న, ప్రభాకరన్ మరణం, లంక సైన్యపు విజయం, ఆ నేపధ్యంలో రాజపక్సే చుట్టు చాలా దేశాల నేతలూ, రాయబారులూ జరిపిన లాబీయింగ్, మనమంతా కళ్ళప్పగించి చూసిందే! కెనడా సైతం కొలంబో చేరి లాబీయింగ్ చేయటం చూశాక, లెబనాన్ వంటి దేశాలు LTTE కి శిక్షణ నివ్వటం గురించి తెలిసాక, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి చాలా దేశాలు రాజపక్సేని ప్రభాకరన్ కోసం వత్తిడి చేయటం గమనించాక, ప్రభాకరన్ మరణానంతరం బయటికొస్తున్న అనుమానాల వార్తలు చదివాక…. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది కదా, వేలుపిళ్ళై ప్రభాకరన్ మరియు LTTE వ్యవహారం కేవలం లంకకీ, సింహళులూ Vs. తమిళుల సమస్యలకీ పరిమితమైనది కాదని, ప్రభాకరన్ కీ మరియు LTTE కీ, ప్రపంచవ్యాప్త గూఢచార వలయానికి సంబంధించినదనీ? ప్రపంచవ్యాప్త గూఢచార వలయమూ, వ్యవస్థా, నకిలీ కణికులది గాక మరెవ్వరిది? అయితే 1991 లో గానీ, 1992 లో గానీ ఈమాట చెబితే నమ్మేవాళ్ళెవరు? అసలు ఆమాట అనేందుకు అలాంటి ప్రపంచవ్యాప్త గూఢచార వలయాన్ని నడపగల వ్యవస్థ ఒకటి ఉందన్న అనుమానమే ఎవరికీ లేదయ్యె! అంతేగాక ప్రపంచవ్యాప్తంగా అన్నీ నడపగల నకిలీ కణిక వ్యవస్థ, పైకి సి.ఐ.ఏ. బొమ్మని నిలబెడుతుందయ్యె!

ఈ నేపధ్యంలో 1991 లో రాజీవ్ హత్యానంతరం, సోనియాగాంధీ స్వయంగా పార్టీ నాయకత్వానికి పీవీ నరసింహారావు పేరు ప్రతిపాదించింది.[నిజానికి సీనియారిటీ ప్రకారం పీవీనరసింహారావు కంటే ప్రణబ్ ముఖర్జీ ముందున్నాడు. కానీ ఒకసారి రాజీవ్ గాంధీని నిరసిస్తూ, పార్టీ నుండి బహిష్కరింపబడ్డాడు. తరువాత తిరిగి పార్టీలో చేరాడు. ఆ విధంగా పార్టీలో తన సీనియారిటీ పోగొట్టుకున్నాడు. పార్టీలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా నడిచి, సీనియారిటీ ప్రకారం పీవీజీ ప్రధానిగా గద్దెనెక్కారు.] 1991 జూన్ లో పీవీజీ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అక్కడి నుండి 1992 జూన్ లోపల ఎన్ని సమస్యలు అగ్ని గుండాల్లా ప్రజ్వరిల్లాయో గతటపాల్లో వివరంగా వ్రాసాను. దేశాన్ని కుప్పకూల్చడానికి అన్నివిధాలా ఏర్పాట్లు జరిగిపోయాయి. గతంలో పనిచేసిన వీపీసింగ్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ కారణంగా, తర్వాత పనిచేసిన చంద్రశేఖర్ ప్రభుత్వం బంగారం ప్రపంచవిపణిలో తనఖా పెట్టింది. తర్వాత వచ్చిన పీవీజీ ప్రభుత్వం, అనివార్యమై, సరళీకృత ఆర్ధిక విధానాలకి తెరతీయాల్సి వచ్చింది. ఇప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి ఆర్ధికమంత్రిగా అందులో కీలకపాత్రే పోషించాడు. అప్పటికే సంసిద్ధం చేయబడిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం ఒక్కసారిగా భగ్గుమంది. స్టాక్ మార్కెట్ కుంభకోణం, లారీల సమ్మె పేరుతో ఆర్ధికపరమైన దెబ్బ, మండల్ పేరుతో కులాల క్కుమ్ములాట, మందిర్ పేరుతో మారణహోమం, నక్సలిజం పేరుతో హింసోన్మాదం, పంజాబ్, కాశ్మీర్, నాగాలాండ్, బోడోలాండ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో టెర్రరిజం పేరుతో వేర్పాటు వాదం… ఎటు చూసినా సమస్యల సుడిగుండాలే!

అన్నిరకాలుగా పీవీజీ పై గురిపెట్టబడింది. ఇన్నేళ్ళుగా తన మేధస్సుతో, పరిశీలనతో, నిబద్దతతో దేశశ్రేయస్సు కోసం పాటుపడినందుకు, ఇందిరాగాంధీకి మద్దతుగా గూఢచార యుద్ధం కొనసాగించినందుకు నకిలీకణిక-7, పీవీజీ కి బాగా ’బుద్ధి’ చెప్పాలనుకున్నాడు. అందుకే దేశనాయకత్వాన్ని ఆయన భుజాన పెట్టి, ఆయన హయాంలో దేశాన్ని కుప్పకూల్చి, ముక్కలూ చెక్కలూ చేసి, ఆ దుష్కర్తీని ఆయన నెత్తిన పెట్టాలనుకున్నాడు.

సరిగ్గా ఇక్కడే నకిలీ కణిక-7 కీ, అతడి అనుంగు సోదరీతుల్యరాలైన సోనియాగాంధీ, ఇంకా నకిలీ కణిక-7 అంతరంగిక ఏజంట్ల విధి వక్రించింది. ఈమాట ఖచ్చితంగా, ఒకటికి పదిసార్లు, ఖరాఖండిగా చెబుతాను. ఎందుకంటే అప్పటికి నకిలీ కణిక గూఢచార వ్యవస్థతో అభిమన్యుడిలా పోరాడుతున్నాడు పీవీజీ. అప్పటికి ఆయనకి 72 ఏళ్ళ వయస్సు ఉన్నా, నకిలీ కణికుల వ్యవస్థకి 340 ఏళ్ళకుపైగా వయస్సున్నది. కాబట్టి నకిలీ కణిక వ్యవస్థతో పోలిస్తే భారతప్రధానిగా పీవీజీ, ఐ.బి., ’రా’ వంటి సంస్థలన్నీ కలిసినా వీరి స్థితి కురసేనతో పోలిస్తే అభిమన్యుడి వంటిదే! గూఢచార పద్మవ్యూహం లోంచి బయటపడే మార్గం కనపడని స్థితి అది.

ఈస్థితిలో పీవీజీ దృష్టికి రామోజీరావు రహస్యకార్యకలాపాల గురించి నేను ఫిర్యాదు చేసాను. అప్పటికి నా వయస్సు తక్కువ. జీవితపు అనుభవం తక్కువ. గూఢచర్యం అన్నపదానికి అర్ధం కూడా తెలియదు నాకు. రాజీవ్ గాంధీ హత్యకు పధకరచనలో రామోజీ రావు ప్రమేయముంది అన్న సమాచారం, నన్ను విభ్రాంతి పరచింది. పాతబస్తీ పసిపాప ముఖంపై మతఘర్షణలు చేసిన కత్తి గాయం నాలో కోపం, దుఃఖం రేపింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయన్న విషయం నాకు భయాన్ని, ఆందోళనని కలిగించింది. ఈనాడులో పనిచేసే నాస్నేహితురాలి నుండి నేను సేకరించిన ఈ మొత్తం సమాచారం నన్ను నిలవనీయలేదు. [దీని గురించి వివరమైన టపాలు మీరు చదివి ఉన్నారు] నా దగ్గర ఉన్న సమాచారంతో సోనియాగాంధీని కలుద్దామా అని కూడా అప్పట్లో ఆలోచించాను. ఎందుకంటే ‘స్వయంగా భర్తను పోగొట్టుకున్నది కాబట్టి ఆమెని ఖచ్చితంగా నమ్మవచ్చు’ అనుకున్నాను. అలా చేసి ఉన్నట్లయితే ఇప్పుడీ బ్లాగు వ్రాయటానికి నేను ఉండి ఉండేదాన్ని కాదు. చివరికి 1992 మే చివరిరోజుల్లో, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నరు కుముద్ బెన్ జోషిని కలిసి, ప్రధానమంత్రి పీవీజీ అపాయింట్ మెంట్ ఇప్పించమన్నప్పుడు, ఆవిడ ‘ఇలాంటివాటిల్లో తలదూరిస్తే నీ జీవితం miserable అయిపోతుంది’ అని హెచ్చరించినపుడు కూడా, మళ్ళీ ఓసారి సోనియాగాంధీని కలిసి రామోజీరావు గురించి, రాజీవ్ హత్యగురించిన సమాచారం గురించీ ఫిర్యాదు చేద్దామా అని ఆలోచించాను. అయితే ఢిల్లీలో సిటిబస్సు డ్రైవర్ ఉదంతం [దీని గురించి గతంలో వ్రాసాను] తో భగవద్గీత నాకు ప్రధానమంత్రిని కలవమనే చెబుతోంది అన్న నిర్దారణకు వచ్చాను. మరింకేమీ ఆలోచించకుండా, నాటి ప్రధాని పీవీజీ నివాసంలో నా రహస్యఫిర్యాదు దాఖలు చేసాను. అప్పటికి నాకు గూఢచర్యం అంటే అర్ధమే సరిగా తెలియదు. అలాంటిది ఆసలు గూఢచార వలయం ఒకటి ఉండగల అవకాశం గురించి ఏం ఊహించగలను? ఇదంతా గమనించినప్పుడు ఖచ్చితంగా ఇది భగవంతుడి లీలగానే కన్పిస్తుంది. భగవద్గీత చెప్పినట్లు ఎవరికర్మని వారు, ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించటంగానే కన్సిస్తుంది. కాబట్టే నకిలీ కణిక-7, అతడి ఆంతరంగికుల విధి వక్రించిందని ఖచ్చితంగా చెబుతానని అన్నాను.

ఈ సందర్భంగా పధ్నాలుగు ఏళ్ళక్రితం పీవీజీ అన్నమాట – “ముందున్న రోజుల్లో మారణాయుధాలతో కాదు, మెదళ్ళతో యుద్దాలు జరుగుతాయి” అన్నవిషయం స్ఫురణకు తెచ్చుకోవచ్చు. పీవీజీ ఉద్గాటించిన ఈమాట గురించి ఈనాడు ఇటీవలే తన సంపాదకీయంలో మరోసారి ఉటంకించింది. ‘మెదళ్ళతో యుద్దం’ ఎలా ఉంటుందో మున్ముందు టపాల్లో చూద్దాం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

hats off for PV's fight and his balance

we should be proud to have persons like PV, patel,...

and we should be pity for inability of saving our culture so as our future generations

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu