గత కొన్ని రోజులుగా నేను వ్రాస్తున్న టపాలు చదువుతున్న బ్లాగు మిత్రులలో, కొందరికి కొన్ని సందేహలూ, సంశయాలూ ఉండటం గమనించి సందేహనివృత్తిగానూ, వివరణ కోసమనీ ఇది వ్రాస్తున్నాను.

ముందుగా ఒక మాట ఖరాఖండిగా వ్రాస్తున్నానండి. నేనిది ఊహాగానాలు చేసో, ఊబుసుపోని ముచ్చట్లుకోసమో, ఊకదంపుడు ఉపన్యాసాలు గానో వ్రాయటం లేదు. అంతేకాదు, ఏదీ ఆశించి కూడా వ్రాయటం లేదు. ఈవిషయం ముందుగానే స్పష్టం చేశాను.

ఇకపోతే ……….

ఒకదేశం మీద, ఒక జాతి మీద, ఒక మతం మీద, ఒక సమాజం మీద – మరో దేశం కాని వ్యవస్థ కాని నడిపే కుట్రకు పలు కోణాలుంటాయి. పలు పార్శ్యలుంటాయి. అంతే కాదు. అది చాలా సుదీర్ఘమై ఉంటుంది. ఎన్నో దశాబ్థాలకు ముందే పధకం రచింపబడుతుంది. చాప క్రింద నీరులా, చాలా మామూలుగా ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేయబడుతుంది. గూఢచార చరిత్రలో ఇది చాలా సార్లు నిరూపించబడిన సత్యం.

ఎందుకంటే, సామాన్యుడి జీవితంలో దశాబ్థం అంటే ఎక్కువ కాలమే. అదే ఒక దేశపు జీవితంలో ఒక దశాబ్థం అంటే ఎక్కువకాదు. సామాన్యుడి దశాబ్థ కాలం ఒక దేశానికి శతాబ్థకాలంతో సరిపాటి అయినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

అంతే కాదు, చిన్న స్థాయిలో జరిగే దానిని మోసం అంటాం. అదే దేశపు స్థాయిలో జరిగే మోసాన్ని కుట్ర అంటాం. కుట్ర అంటేనే రహస్యంగా, నిగూఢంగా చేసేది. కుట్రప్రణాళిక లెవరూ బహిరంగంగా, అందరికీ తెలిసేటట్లు, వీడియో కెమోరాలు, సిసి కెమేరాలో పెట్టుకొని లైవ్ టెలికాస్ట్ అయ్యేట్లు కూర్చోని రచించరు. ఇంకా చెప్పాలంటే కుట్రనెవరూ కనిపెట్టలేనంతగా పకడ్బందీగా చేస్తారు. ఎంత పకడ్బందీగా చేయగలిగితే అంతగా సఫలీకృతం కావచ్చన్నది గూఢచార కళలో చెప్పకోబడే నానుడి. దేశపు మీద కుట్రని దేశం మీద జరిగిన, జరుగుతున్న సంఘటనల బట్టే మనం తెలుసుకోగలం. ఆ సంఘటనని ఒక రోజుకో, ఒక నెలకో, ఒక సంవత్సరానికో పరిమితి చేసి చూస్తే కనిపెట్టలేము. సంఘటన స్థాయిని బట్టి పూర్వాపరాలనూ జాగ్రత్తగా గమనిస్తే మాత్రమే మనం కనిపెట్టగలం.

ఒక ఉదాహరణ చూడండి. మనం ‘9’ అని వ్రాసాం అనుకొండి. అటు నుండి చూసేవారికది ‘6’ లాగా కన్పించడం సహజం. ఎందుకంటే – ఇంటర్ పిల్లలకి మాధ్స్ లో మేం చెప్పే క్యాలిక్ లెస్ [calculus] పాఠంలాగా ఏ విషయానైనా[ w.r.t. some parameters] కొన్ని ప్రామాణికాలతో పోల్చి తీసికోవటం అన్నది సహజం గనుక. కాబట్టే మనం ’తొమ్మిది’ అన్న అంకెని మన వైపు నుండి చూస్తాం. దాన్నే 180 డిగ్రీల ఆవలి నుండి చూస్తే అది ’ఆరు’ లాగా కన్పిస్తుంది. మరికొన్ని తమాషాలు పరికించండి. క్రిందినుండి చూస్తే బొమ్మ ఒకలాగా, అదే బొమ్మని తలక్రిందులు చేసి చూస్తే మరోలా ఉంటాయి.

క్రింది చిత్రాలను పరిశీలించండి.











దేశాల మీద జరిగే కుట్రలు కూడా అంతే. సరైన కోణంలో నుండి చూస్తేనే సరిగ్గా కన్పిస్తాయి. లేకపోతే వేర్వేరు రూప గుణ రంగుల్లో కన్పిస్తాయి.

నా బ్లాగు వ్యాఖ్యలో ఒకరు “1992 లో ఏదో చేసి భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసాననుకొంటున్న మీకు నేనేం చెప్పగలను, నాపిచ్చి గాకపోతే” అన్నాడు. [ అలా అడిగింది ఒక్కరే అని చెప్పడం కోసం ఏకవచనం క్రియ వాశాను.]

నిజంగానే 1992 తర్వాత భారత ముఖ చిత్రం కాదు, ప్రపంచ ముఖ చిత్రమే మారిపోయింది.

ఖచ్చితంగా మారిపోయింది.

దానికి కారణం కూడా చెబుతాను.

1992లో ప్రపంచాన్నంతా ఆడిస్తూ, పైకి ఇంకెవరినో చూపిస్తూ – శతాబ్థాలుగా కుట్రలు నడిపిస్తోన్న ఓ గూఢచార వంశం గురించి [ఒక వంశం నిర్వహిస్తూన్న కార్పోరేట్ కంపెనీలకే [టాటాలూ, లేమాన్ బ్రదర్స్, వగైరా] 150 సంవత్సరాల చరిత్రలు ఉన్నప్పుడు, టెక్నాలజీ గ్రిప్ చేసి గూఢచర్యం చేయగలిగిన వంశం ఉండదా? అలాంటి వంశం గురించి నా తెలుగు టపాలోనూ, ఆంగ్ల బ్లాగులోనూ వివరించాను] అందులోని ముఖ్యడు, రామోజీరావు గురించి నేను ఆనాటి భారత ప్రధాని పి.వి.నరసింహారావుకి రహస్య ఫిర్యాదు ఇచ్చాను. అప్పటిదాకా కనబడిన దేశముఖ చిత్రం, ప్రపంచ ముఖ చిత్రం తిరగేసి చూసి, అసలు నిజం తెలుసుకోవడానికి అది ఉపయోగపడింది. ఆనాటి నుండి మార్పులెన్నో సంభవించడం మీరు వెనక్కి పరిశీలించి గమనించవచ్చు. అదే నేను వివిధ శీర్షికల క్రింద, ఆంగ్లంలో [Coups On World] లో ఆయా తేదేల వార్తలు, ఆయా సంవత్సరాల్లో జరిగిన సంఘటనలూ, వాటి మధ్య కార్యకారణ సంబంధాలతో సహా వివరించాను. దఫాలు వారీగా తెలుగులోకి అనువదిస్తాను.

“1992 తర్వాత దేశముఖ చిత్రమూ, ప్రపంచ ముఖ చిత్రమూ మారిపోయింది” అని నేను అనడంలో ఏమాత్రం నా అహంకారం గానీ, అతిశయంగానీ లేవని స్పష్టంగా చెబుతున్నాను.

ఎందుకంటే – ఫిర్యాదు చేసే నాటికి ఈనాడు రామోజీరావు ఇంతటివాడని నాకూ తెలీదు. ఆ నాటికి కనీసం నాకు వివిధ దేశాల గూఢచారుల్ని, గూఢచార సంస్థల్ని ఏమంటారో కూడా తెలీదు. నాకు తెలిసిన విషయాలు – అతడు చేస్తోన్న కుట్రలు – అతడి గూఢచార కలాపాలు…….[అవి నాకెలా తెలిసాయి, అసలేమేమి తెలిసాయి, ఎలా నిర్ధారించుకొన్నాను అన్న విషయాలు Coups On World లోని Coup on Indian politics లో వివరంగా వ్రాసాను. తెలుగులోకి అనువదించే పనిలో ఉన్నాను.]

ఆవిధంగా నేను ఓ సామాన్యవ్యక్తిని కావచ్చు. కానీ నేను ఎవరి గురించి ఫిర్యాదు చేసానో ఆ రామోజీరావు నాలాంటి సామాన్య వ్యక్తికాడు. అలాగే నేను ఆ నాటి ప్రధాన మంత్రి దృష్టికి రామోజీరావు గూఢచార కార్యకలాపాల గురించి ఫిర్యాదు చేయటం గొప్పవిషయం కాకపోవచ్చు. కానీ దేశానికి సంబంధించి, దేశప్రధానికి ఒక ప్రధాన గూఢచారి ఆచూకీ తెలియటం పెద్ద విషయమే.

అది చాలు దేశ ముఖ చిత్రాన్ని, ప్రపంచముఖ చిత్రాన్ని మార్చడానికి. ఎందుకంటే నేను మామూలు వ్యక్తిని కావచ్చుగానీ, నేను ఎవరికి ఫిర్యాదు చేసానో, ఆ పి.వి.నరసింహారావు మామూలు వ్యక్తి కాదు. రాజకీయ దురంధరుడిగా, రాజనీతిఙ్ఞనిగా, అపరచాణక్యునిగా, బహూభాషాకోవిదుడిగా పేరుగాంచిన వ్యక్తి. అంతే కాదు, అప్పడు [అంటే 1992లో] ఆయన కూర్చొని ఉన్న కుర్చీ కూడా సామాన్యమైనది కాదు. అది భారతదేశపు ప్రధాన మంత్రి కుర్చీ. ఒక్క కలంపోటుతో దేశ ముఖ చిత్రాన్ని మార్చగల శక్తిఉన్న కుర్చీ.

ఆ రోజు ఫిర్యాదులో నేను స్పష్టంగా వ్రాసిన విషయం ఏమిటంటే – “ఇదంతా నిజం కాకపోతే ఇంతకంటే ఆనందించగలిగే విషయం మరొకటి లేదు. అలా గాక ఇది నిజమే అయితే? నిజం కాదనుకొని నిర్లక్యంగా వూరుకొంటే – దేశానికి ఎంత ప్రమాదం? అందుచేత దయచేసి -

‘ఈ దేశపు మారుమూల పల్లెలో ఓ చిన్న పరిశ్రమ నడుపుకొనే ఓ అమ్మాయి అత్యంత రహస్యమూ, అత్యంత ప్రమాదకరమూ అయిన విషయాన్ని తీసికొని ఈ దేశపు అత్యున్నత వ్యక్తి అయిన ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చే సాహసం చేసిందంటే ‘నేను తెచ్చిన విషయం నిజమే అయిఉండవచ్చేమో అన్న దృష్టితో చూడండి. రామోజీ రావు [రాజీవ్ గాంధీ హత్య, మతఘర్షణలు, ఇతర కార్యకలాపాలు] చేస్తోన్న కుట్రలకు నేను తార్కిక నిరూపణ తప్ప డాక్యుమెంట్లో, ఫోటోలో, వీడియోలో, ఇతర సాక్ష్యాలో తేలేను. ఎందుకంటే ఈ దేశపు ఒక ప్రధానికి మనుమడు, మరో ప్రధానికి కొడుకూ, తాను స్వయంగా ప్రధాని అయిన, రాజీవ్ గాంధీని హత్య చేయించగలవారికి వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలు నాలాంటి సామాన్యులు తేగలరా?" అని వ్రాసాను.

చాలా చిన్న రిపోర్టు అది. పది, పదకొండు పేజీల్లో, తెలుగులో, స్వదస్తూరితో వ్రాసాను. దాని ముందు వెనుకల వై.ఎస్. రాజశేఖర రెడ్డినీ, రాయపాటి సాంబశివరావునీ, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషిని కలిసాను. ఆ వివరాలన్నీ ఆంగ్లబ్లాగులో పొందుపరిచాను. తెలుగులోకి అనువదిస్తాను.

నేను చేసిన చర్య చాలా చిన్నది కావచ్చు. కానీ దాని పర్యవసానం మాత్రం పెద్దది.

కాబట్టే 1992 జూన్ నాటికి పి.వి.నరసింహారావుగారి మైనారిటిప్రభుత్వం అప్పటిదాకా ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు తెరమరుగైపోయాయి. కాబట్టే అప్పటిదాకా భగ్గున మండుతున్న పంజాబ్ ఖలిస్తాన్ వేర్పాటు ఉగ్రవాదం చల్లారిపోయింది. మండల్ రిజర్వేషన్ల సమస్య ఆత్మహుతులతో అట్టుడుకుతున్నది కాస్తా ఆవిరైపోయింది. మందిర్ సమస్య బాబ్రీ మసీదుతో పాటే కూలిపోయింది. [ కాబట్టే తర్వాత ఐదేళ్ళూ, పూర్తికాలం అధికారంలో ఉన్నా కూడా బి.జే.పి. అయోధ్య మందిరం విషయంలో ఏమీ చేయకుండా గమ్మునుండి పోయింది. కాబట్టే అశోక్ సింఘాల్, గోవిందచార్య, వినయ్ కతియార్, సాధ్విరితిభరల సింహాగర్జనలు మౌనం దాల్చాయి. ఉమాభారతిల కథ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నది. ]

పై సమస్యలన్నిటి పరిష్కారాలకి వేర్వేరు పైకారణాలున్నాయి. ఐతే ఏకైక అంతర్గత కారణం ఏమిటంటే ప్రధాన గూఢచారి అయిన రామోజీ రావు ఉనికి బయలుపడటమే! 1992 జూన్ లో రామోజీ రావు ఉనికి తెలిస్తే డిసెంబర్ కల్లా దాదాపు అన్ని సమస్యలు పరిష్కరింపబడినవి. రోజు పంజాబ్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల హత్యల కౌంట్ ఎంత అన్న స్థితి నుండి ఈ రోజు ఖలిస్తాన్ ఉగ్రవాదుల లొంగుబాటు కౌంట్ ఎంత అన్న స్థితి కి వచ్చి పూర్తిగా ఖలిస్తాన్ ఉద్యమం నిర్వీర్యం అయ్యింది. అలాగే కాశ్మీర్ కూడా దాదాపు అలాంటిస్థితికి వచ్చింది. [అదే ఇప్పుడు మళ్ళీ ఒక్క పంజాబ్ తప్పించి మిగతా అన్ని సమస్యలు యధాతధంగా వచ్చికుర్చున్నవి. తేడా అల్లా ఒక్కటే, ఏమిటంటే ప్రధానులు, కుర్చీవ్యక్తులు బయటి నుండి భారత్ కు వలస వచ్చిన వారే కావటం.]

ఇదంతా నాగొప్పని నేను చెప్పడం లేదు. అయితే దేశం పట్ల నిబద్దత ఉన్నట్లయితే ఒక దేశపు ప్రధానమంత్రికి, దేశ నిఘా సంస్థలకి ఒక ప్రధాన గూఢచారి ఉనికి గురించి తెలిస్తే ఇన్ని మార్పులు రావడం అసహజం కాదు అని చెబుతున్నాను.

మనందరికీ తెలిసిన ఒక వ్యాపార ప్రకటన -

"ఒక ఐడియా! జీవితాన్ని మార్చేస్తుంది.”

అలాగే నా ఫిర్యాదు – ఒక్క ఐడియా! దేశపు ముఖ చిత్రాన్నే కాదు, ప్రపంచ ముఖ చిత్రాన్నే మార్చేయచ్చు కదా.

అంతమాత్రం చేత – ఆ ‘గొప్పదనం’ నా ఐడియాది అని నేను అనను. అయితే ఆ ‘ఐడియా’ దేశముఖచిత్రాన్ని, ప్రపంచముఖచిత్రాన్ని నియంత్రిస్తున్న ‘రామోజీరావు’ లాంటి గూఢచార వంశానికి లేదా వలయానికి ‘కేంద్రబిందువు’కి సంబంధించినది అయినప్పుడు ఆ ముఖ చిత్రాలు మారిపోవడం సహజమే కదా.

ఇకపోతే……..

కొందరు బ్లాగు మిత్రులు నా కేసునీ, దానికై నేను పొందుపరిచిన సాక్ష్యాధారాలకి లింకులేస్తూ, టూకీగా వ్రాయమని సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే చేద్దామనుకున్నాను. అయినా ఎంత టూకీగా చెప్పినా సమగ్రంగా కూడా చెప్పవలసిన అవసరం ఉన్న విషయం అది. ఎందుకంటే నా కేసులో వ్యక్తిగతంతో పాటు ఇంటర్ మార్కుల కుంభకోణం దగ్గర నుండీ, ఎంసెట్ ర్యాంక్ ఫిక్సింగ్ [క్రికెట్టులో మాచ్ ఫిక్సింగూ, గుర్రాల రేసుల్లో జాకీల ఫిక్సింగూ విన్నాము, అలాంటిదే ఇది] ల దాకా చాలా విషయాలు, పార్టీల కతీతంగా ప్రభుత్వాలు [తెదేపా సి.ఎం. చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు సి.ఎం. వై.ఎస్.రాజశేఖర రెడ్డి, ఎన్.డి.ఏ. మరియు యూ.పి.ఏ. ప్రభుత్వాలతో] ముడిపడి ఉన్నాయి. అందుచేత కొంచెం వివరంగా, సాక్ష్యాధారాలనీ [enclosed i.e. typed and scanned copies of originals], తార్కిక నిరూపణలనీ, దృష్టాంత సంఘటనలనీ [సర్కంస్టాన్షీయల్], ఆయా కాలమాన పరిస్ధితులనీ, ఆయా వార్తలనీ, అవసరాన్ని బట్టి జత చేస్తూ వివరించాను ఆంగ్ల బ్లాగులో]

తదుపరి టపాలో అది అనువదించి ప్రచురించే ప్రయత్నం చేస్తాను.

చివరిగా ఒక మాట........

నేను చెబుతోంది నిజం. చదవక ముందే ఇది అబద్దం అని నిర్ధారించుకొనేవారిని ఉద్దేశించి నేనిది వ్రాయలేదు. ఇది నిజమే అయి ఉండవచ్చు, పరిశీలించి చూద్దాం, నిజమో కాదో, అనుకొనే వారికి వివరంగా చెప్పడానికి వ్రాసాను. అవ్వడానికి ఇది సామాన్యుడి కథే అయినా, మీవి నావి భారతీయ మూలాలు. ఆ జీన్స్ ని అర్ధంచేసుకోవాలంటే మనం ఓసారి మన చరిత్రనీ, రాజకీయాలన్ని తిరగేయక తప్పదు.

ఎందుకంటే ఈ కేసులో నేను సామాన్యరాలిని. నా చోట్లో ఎవరున్నా జరిగేది ఇదే.

కాబట్టి ఇది నా కథ.

ఓ సామాన్యుడి కథ.

మీ కథ, మన కథ.

నిజమైన కథ.

ఇది నిజం కానిదే – ఓ సామాన్యుడు ప్రధాన మంత్రులతో పరిహాసాలాడడు కదా! అబద్దాలు చెబితే ఎవరూ ఆ సామాన్యుణ్ణి ఉపేక్షించరు కదా! ప్రధాన మంత్రి ఆఫీసులోని O.S.D. appointment ఇచ్చి మరీ ‘ఇది నిజమేననీ’ confirm చేయరుకదా. [ఆ వివరాలు కూడా Coups On World లో ఉన్నాయి. తెలుగులోకి అనువదిస్తాను ] ఆనాడు IB Officers వచ్చి confirm చేయరు కదా! నిజం కాని దానికి, ఆనాటి కేంద్ర హోంమంత్రి యస్.బి.చవాన్ [నేటి మహారాష్ట్ర సి.ఎం.కి తండ్రి] “ప్రతికాధిపతులలో సి.ఐ.ఏ. ఏజంట్లు ఉన్నారని”, నేను ఫిర్యాదు ఇచ్చిన తరువాత, అది confirm అయిన తరువాత, ప్రకటించరు గదా.నిజం కాని దానికి అబ్దుల్ కలాం లాంటి భారత రాష్ట్రపతి స్పందించరు కదా! ఈ వరుస ఫిర్యాదులకి కేంద్రప్రభుత్వ కుర్చీవ్యక్తి ఎలా స్పందించారో క్లుప్తంగా Events List, నా మరో ఆంగ్ల బ్లాగు FIRE POT లో పొందుపరిచాను.

పదహారేళ్ళుగా అనివార్య పోరాటం [కొందరి సలహా ప్రకారం ‘పనికొచ్చే పని’ చేసుకోగలిగిన అవకాశం ఇవ్వని అనివార్య పోరాటం ఇది] నాజీవితంగా ఎందుకు మారిందో, ప్రధాన మంత్రుల్ని హత్యలు చేయించగల ఈ నకిలీ కణికుడి వ్యవస్థకి చెందిన రామోజీ రావుకీ నాపీక కోయటం పెద్ద సమస్యే కాదు. అది వదిలేసి నన్ను organized గా ఎందుకు harass చేస్తున్నాడో నాకు తెలీదు. ఈ గూఢచర్యపు ఆటలో నా జీవితం ఎందుకు ఫణంగా పెట్టబడిందో నాకు తెలియదు. తెలిసి ఉంటే – తెలిసిన ఇన్ని విషయాలు చెప్పిన నేను ఇదీ చెప్పిఉండేదాన్ని. నా చుట్టు ఒకవేళ ఆ నాటి ప్రధాని పి.వి.నరసింహారావో లేక మరెవరైనా ఏదైనా మాజిక్ సర్కిల్ పరచి ఉంటే అందుకు నా బాధ్యత లేదు.

1992 తర్వాత మళ్ళీ నా జీవితం నేను కొనసాగించ ప్రయత్నించాను. ‘దేశానికి సంబంధించిన సమస్యలు పరిష్కంచేటంత గొప్పవాళ్ళం కాదు. తెలిసిన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చాం. అంతటితో మన బాధ్యత తీరిపోయింది. ఫలితాన్ని ఆశించి మనం ఈ పని చేయనిదే నిజమైతే, ఇదా ఫలితం?’ అని మనం బాధపడకూడదు. [అప్పటికి ఫ్యాక్టరీ కొల్పోయాను]. ఇతరులకి కీడు చేయకపోతే మంచి చేసినట్లే. మన బ్రతుకు మనం బ్రతుకుదాం’ ఇదే నేనూ, నా భర్త నిర్ణయించుకున్నది.

అప్పటి నుండి నా జీవితంలో ఎన్ని అసాధారాణాలు జరిగినా నేను అదంతా నా నుదిటి వ్రాత అనుకొన్నాను. 2005 లో నా పదేళ్ళ కూతురు మీద అత్మహత్య ప్రయత్నం చేసుకొనేటట్లు ప్రణాళిక అమలు చేయబడినప్పుడు తొలిసారిగా ‘దీనంతటి వెనుకా రామోజీ రావు, అతడి గూఢచర్యం, అతడిపై నేను అప్పటి కేంద్ర ప్రభుత్వానికిచ్చిన ఫిర్యాదు తాలూకూ ఫలితం ఉన్నట్లున్నాయి’ అని సందేహించాను. అప్పటికి పి.వి.నరసింహారావు లేరు. ఆయన జీవించి ఉండగా నాకీ సందేహాం వచ్చి ఉంటే ముందుగా ఆయన్నే కలిసి అడిగి ఉండేదాన్ని.

దానితో 2005 లో ఢిల్లీ వెళ్ళి నేటి ప్రధాని మన్మోహన్ సింగు కార్యాలయంలో ఫిర్యాదు దాఖలు చేశాను.[కలిసే ప్రయత్నం ఫలించక Dock Section లో దాఖలు చేసాను]

దానిపైన CID, IG కృష్ణరాజ్ ఫోన్ Enquiry చేసినప్పుడూ, అది కర్నూలు ఆనాటి SP మల్లారెడ్డి Office, నుండి శ్రీశైలం సి.ఐ. కరుణాకర్ [మా స్కూల్ ను ఊడగొట్టి, మమ్మల్ని ఆ ఊరినుండి పకడ్పందీగా డ్రైవ్ అవుట్ చేసిన తరువాత ఈయనికి డి.యస్.పి.గా ప్రమోషన్ వచ్చింది. ఆయనకే కాదు వెనక్కి తిరిగి చూసుకొంటే నా కేసులో నాకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళకు చాలా మందికి ప్రమోషన్ వగైరా వగైరాలు వచ్చాయి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. ] పూర్తి ఎంక్వరీ చేస్తున్నానంటూ నా దగ్గర నుండీ, నా భర్తా, కుమార్తెల దగ్గర నుండీ, ఇంకా నేను ఎవరెవరి వెనుక రామోజీ రావు ఉండి నన్ను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసానో వాళ్ళందరి నుండీ 2007, మార్చిలో స్టేట్ మెంట్లు వ్రాయించుకొన్నప్పుడూ, నేను ఒకటే చెప్పాను.

"ఇప్పటికీ 1992 నాటి నా ఫిర్యాదుకి కట్టుబడి ఉన్నానని”.

“అతడి మీదే ఎందుకు కంప్లైట్ చేశారు” అని సి.ఐ. రెట్టించి అడిగాడు. ’తప్పా’ అని నేను రెట్టించి అడిగాను. “తప్పు కాదు, మీకేమైనా వ్యక్తిగతమైన కారణాలున్నాయా” అని అడిగాడాయన.

"వ్యక్తిగత కారణాలుండటానికి రామోజీరావుది నా లెవల్ కాదు, నాది అతడి లెవల్ కాదు. అంతేగాక అతడి స్థానంలో మరేవరున్నా నేనిలాగే స్పందిస్తాను. ఓ హత్య జరిగితే, లేదా ఓ నేరం జరిగితే, నేరస్తుడి గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయటం తప్పకాదు కదా! అంతే కాదు, 1992 లో చేసిన దానికి నేనేం పశ్చాత్తాప పడటం లేదు. ఎందుకంటే అది తప్పని నేను అనుకోవటం లేదు. మరో 100 సార్లు అదే చేయవలసి వచ్చినా నేను వెనుకాడను” అని చెప్పాను.

దాని పర్వవసానంగా జరిగిన నాటకీయ పరిణామాలు, శ్రీశైల దేవస్థాన అధికారులు నాకు ఇచ్చిన abnormal notice లు, నేనిచ్చిన ఫిర్యాదులు అన్నీ అవసరమైన చోట scanned copies కూడా జతచేసి ఆంగ్లబ్లాగు Coups On World లో ఉంచాను. అదంతా, ఎంతో టూకీగా చెప్పినా, మరికొంచెం వివరంగా కూడా చెప్పాల్సిన సంక్లిష్టత ఉన్న విషయం.

కనుక తదుపరి టపాల్లో అది వివరిస్తాను.

అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

5 comments:

great writing, we are here to know the truths, dont stop writing for one's criticism, somany of us are following you, we belive in your writings, so please writing atleast for those who believe these all true..

తమచుట్టూ ఇరుకైన ప్రపంచాన్ని సృష్టించుకుని అదే సమస్త ప్రపంచం గా భ్రమిస్తుంటారు కొందరు జనం. సహజంగానే ఈ ఇరుకు బుర్రలకు అర్థం కాని విషయాలన్నిటిని ఎద్దేవా చేయటమో లేక చురకలు వేయటమో చేస్తుంటారు. ఇలాంటి విషయాలు మీరు పట్టించుకోకండి.

వాదన కోసం ఎద్దేవా చేస్తున్న వారి మాటలే నిజమనుకున్నా... అంటే అంతా ఊహాగానాలే అనుకున్నా, ఎవరికైనా ఎందుకు నష్టమో నాకు అర్థం కాదు. ఇక్కడ చూడాల్సినది, స్పూర్తినిచ్చేదీ దేశం కోసం కనీసం ఒక మనిషి ఈ రకం గా ఆలోచిస్తున్నారన్న విషయం.

I know you are strong enough to not seek any advise, but yet here it goes: Do not feel obliged to respond to nonsense, which the blog world is filled with. March on!

నమ్మకశ్యంకాని విషయాలెన్నో నిజాలుగా మనముందుకొస్తున్న రోజులివి. మీ టపాల్లోని ఏ విషయాన్ని కొట్టిపారేయలేం.
మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.

pichandi meeku ekkadaina choopinchukondi ...
as a psychology student .. meeru oka mental imbalance tho badhapaduthunaru...

me chuttu jarigey vishayalani mee burralo matrame unna oka theory ki link cheskuntunnaru ... mimmalni support chesevallaki kooda idey chepthunna ... evaranna psycholgist daggara counscelling cheyinchukondi

nijamga ramoji rao ki antha seen unte, athanu support chese TDP govt 2 times enduku odipoyindi. Atanu margadarsi kumbakonam lo enduku irukkuntadu. rajiv gandhi murder cheste, sonia gandhi ki inka aa vishayam tliyada??? ramoji rao ni champadam sonia gandhi ki pedda vishyama???

But only thing appreciable here is, what ever may be the content u got good no of advertisers and u r doing enough business. but these tactic s will never generate a permanent source for money. better change u r attitude.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu