నాబ్లాగు చుట్టాలందరికీ ఒక విషయం స్పష్టపరచాలి. ఇది నేను ఊసుపోకనో లేక కాలక్షేపానికో వ్రాయలేదండి. అలాగే ఏదీ ఆశించి కూడా వ్రాయటం లేదు.

నేను 16 ఏళ్ళుగా పోరాడి, అనుభవించి తెలుసుకున్న నిజాన్ని చెప్పడానికి వ్రాస్తున్నాను.
చాలామంది ఎవరీ నకిలీ కణికుడనీ, అతడికీ మనకీ సంబంధం ఏమిటని అడిగారు. మరికొంత మందికి ’నేనెవరూ, నేను చెబుతున్నది ఎంత వరకూ నిజం?’ అన్న కుతుహలమో లేక సందేహమో కలిగింది.

అందుకే ఈ చిన్న వివరణ.

నా పేరు ఆది లక్ష్మి. నా భర్త పేరు లెనిన్ బాబు. మా పాప పేరు గీతాప్రియ. ఇదీ నా కుటుంబం.

ఇక నా నేపధ్యం -

అదీ 1992 వ సంవత్సరం. అప్పటికి నేను అవివాహితని. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెలూ, ప్రేమాను బంధాలున్న కుటుంబం. అప్పటికి వృతిరీత్యా నేను Lead Acid Batteries Manufacturerని. ఆరోజుల్లో 45 లక్షల రూపాయల విలువ గల చిన్న తరహా పరిశ్రమని నడుపుతుండేదాన్ని.

మహిళా పారిశ్రామికవేత్తగా 1989 లో నాటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీ గారి చేత ప్రారంభించబడిన సంస్థనాది. ఉత్తమ మహిళా జౌత్సహిత పారిశ్రామికవేత్తగా 1990లో నాటి గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ నుండి బహుమతి అందుకున్న కెరీర్ నాది. ఫ్యాక్టరీ నడపడంలో ఒడిదుడుకులెదుర్కొన్న ఇండస్ట్రీయలిస్టుగా నా అనుభవాన్ని COUP ON BUSINESS FIELD లోని ఓ అంశంలో ఆంగ్లంలో ప్రస్తావించాను.

ఈ నేపధ్యంలోనే - అయోధ్య రామమందిరపు వివాదం విషయమై బి.జె.పి. రాజకీయ డ్రామాలు భారీ ఎత్తున నడుస్తున్న నేపధ్యంలో పాతబస్తీ అల్లర్లలో చాలామంది కత్తిపోట్లకు గురయ్యారు. 11 నెలల పసిపాప ముఖం మీద ఎడమ నొసటి దగ్గర నుండి ముక్కు మీదగా కుడి చెంప వరకూ 11 కుట్లు పడిన [కత్తిపోటు బాధితురాలు] ఫోటో ఇండియా టుడే [నాకు గుర్తున్న వరకూ అదే పక్షపత్రిక] కవర్ పేజీగా ప్రింటయ్యింది.

అది చూసి నాకు భరించలేనంత బాధ కలిగింది. మొన్న ముంబాయి ముట్టడి చూసినప్పడు మీరంతా ఎంత రగిలిపోయారో, నేను అప్పడంతగా రగిలిపోయాను. అదే సమయంలో మన దేశం మీద జరుగుతున్న గూఢచార కుట్రలు[నిజానికి అవి గూఢచార కుట్రలని తరువాత తెలిసింది] దైవికంగా నాకు తెలిసింది. అది నా కర్తవ్యాన్ని నాకు తెలిపింది.[పాఠశాలలో ఆదర్శవంతమైన విద్యార్ధిని కదా!]

ఆ వివరాలన్నిటితో నాటి ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు కి ఫిర్యాదు [Confidential Complaint ] ఇచ్చాను. అదీ ప్రారంభం.

అప్పటి నుండి అంటే 1992 నుండీ నేటి వరకూ 16 ఏళ్ళుగా నా జీవితంలో అదే అనివార్య పోరాటం. ఆ పోరాటంలో పారిశ్రామికవేత్తగా నా కెరియర్ పోగొట్టున్నాను. ఎంసెట్ ఫిజిక్సు లెక్చరర్ అవతారం ఎత్తాను. తర్వాత అక్కడ నుండి క్రమంగా చిన్నపిల్లలకు పంతులమ్మ నయ్యాను. కుటుంబం విచ్ఛిన్నమైంది. నా నిజమైన స్నేహితుడు నా భర్త. 16 సంవత్సరాలుగా మేమిద్దరం పోరాటం చేస్తున్నాం.

ఆర్ధిక దృష్ట్యా పై మెట్టు మీద నుండి క్రింది మెట్లకు దిగాను. [అది పూర్తిగా Organized harassment]. ఆత్మోన్నతి దృష్ట్యా లేదా ఙ్ఞానపు దృష్ట్యా అయితే క్రింద మెట్టు పై నుండి పైకి ఎక్కాను.

పదహారు సంవత్సరాల పోరాటం, నాకు జీవితంలో మరింత toughness నీ, పరిశీలననీ నేర్పింది. నిజానికి భగవద్గీతే మార్గదర్శనం చేసింది.

నా పోరాటంలో నేను తెలుసుకున్న కుట్ర స్వరూపాన్ని సాక్ష్యాధారలతో సహా, తార్కికంగా, దృష్టాంత సహితంగా మీముందు ఉంచుతానని గత టపాల్లో వ్రాసాను.

నిజానికి పదహారు సంవత్సరాల పోరాటంలో పరిశోధనల్ని ఆంగ్లంలో అక్షరబద్దం చేయడానికి చాలా సమయం పట్టింది. అలాగయ్యి కూడా నా అలోచనలని సంపూర్ణంగా అక్షరబద్దం చేయలేదు. అలా వ్రాయలంటే నాకు చాలా కాలం పడుతుంది. సాక్ష్యాధారాలు అంటే Documentary Evidence 2000 నుండి సేకరించాను.

`నకిలీ కణికుడెవరూ, మన మీద అతని కుట్ర ఏమిటి అన్న ఆసక్తి తో ఆలోచిస్తూ, తెలుసుకోవాలన్న ఙ్ఙిఙ్ఞాస గల తోటి బ్లాగర్లు నా ఆంగ్ల బ్లాగ్ COUPS ON WORLD లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

దాన్ని దఫాల వారీగా తెలుగులోకి అనువదిస్తున్నాను. నేనిచ్చిన సమాచారం తో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు గారు తీసుకున్న చర్యలు, పర్యవసానంగా మారిన భారతదేశం దిశ, అలాగే నా జీవితంలోని మార్పులు COUP ON INDIAN POLITICS లో వివరంగా వ్రాసాను. అదే విషయాన్ని EVENTS’ LIST లోనూ క్లుప్తంగా అర్ధం చేసుకోవచ్చు.

భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణికుడి కుట్రని తదుపరి టపాల్లో కొనసాగిస్తాను.

అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

15 comments:

భాషించే వస్తువు మీద పట్టులేకపోయినా , భాషణ మీద ఉన్న పట్టుతో త్రాసు తిరగేసి ఆ వస్తువు సిద్ధాంతం మీద రాద్ధాంతం చెయ్యటమే పనిగా పెట్టుకున్నవారికి ఈ మీ టపాలు చెప్పుదెబ్బ కావాలి అను కోరుకుంటూ...

అసందర్భం అనుకోకపోతే ఆ పండితులవారిని, అ పండితుల పక్కన చుట్టలు చుట్టుకున్న మేధావులని చూస్తే ఎందుకో ఇది గుర్తుకు వస్తుంది - ఇదే ఎందుకు ? ఏమో మరి ..:)...వుక్కపెట్టి చెమటలు దిగదూకుతుంటే వొంటి మీదకు శాలువా లేదని ఏడ్చాడట ఆ రాద్ధాంతభాషణ చేసే పండితులవారు...

అది అలా పక్కన బెడితే ...కొన్ని టపాలు చదివితే మెదడు యథాస్థానంలోనే ఉంటుందేమో కానీ మనసుకు , బతుకుకు స్థానచలనం కలుగుతుంది .... అలాంటివే ఈ మీ టపాలు....చదవటానికి అవకాశం కలిగినందుకు సంతోషం...మీ మనోబలానికి మరింత ఆశ్చర్యం, మరింత ఆనందం...

మీ ఆంగ్ల బ్లాగు కు వెళ్ళి చదువుతున్నా. తెలుగు ప్రభావం చాలా ఉంది. మీరు కాస్త డు,ము,వు లు తీసేస్తే బాగుంటుంది. చాలా బాగా వ్రాసారు.

బావుందండి. బహుశా స్వాతంత్రం వచ్చిన సమయం లో పుట్టిన వాళ్ళకి ఈ కుట్ర ల గురించి, శకుని మామ ల గురించి బాగా అర్ధం అయ్యి వుంటుంది. అందుకేనేమో, మా ఇంట్లో ఇలాంటి విషయాలు ఎప్పుడు చెపుతూ వుంటారు మా నాన్నగారు. ఒక్కో వార్తా పత్రిక ఒక్కో భావజాలాన్ని మన మీద రుద్ది మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయి అని. ఆంగ్లం లో బ్లాగు రాసి మంచి పని చేశారు. మీ బ్లాగు ని నా ఇతర భాషా స్నేహితులకి పంపిస్తాను. మీ కృషి ని అభినందిస్తున్నాను. మీ వంటీ వాళ్ళ వల్లే సమాజానికి మంచి, చెడు అంటే ఏమిటో అర్ధం అవుతుంది. మంచిగా వుండటం ఎలానో అర్ధం అవుతుంది. అదర్శాలను వల్లించడం కాక, వాటిని ఆచరించి చూపిస్తున్న మీరు జనులందరికి మార్గదర్శకులు. ఇంకా నా అభిప్రాయాలు చెప్దాం అని ఉన్నా, ఓపిక లేక (వుదయం నుండి మీ ఆంగ్ల బ్లాగు చదువుతునా మరి!:) ) ఇక్కడితో ముగిస్తున్నా.

NAMASTE, IF U DONT MIND, PL TELL, WHERE U R NOW LIVING AND WHAT U R DOING BY PROFESSION.

ఈ రోజు almost all మీ బ్లాగులు చదవడానికే సరిపోయింది. గుంటూర్ జిల్లాలో నాకు తెలిసినంత వరకు మీరే మొట్ట మొదటి మహిళా పారిశ్రామిక వేత్త. అప్పట్లో మీ ఫాక్టరీ ప్రారంబం గురించి అప్పట్లో అన్ని వార్తా పత్రికల్లో విశేషంగా ప్రచురించారు. అవి చదివి నా లాంటి వారు చాలా మంది ఆనందపడ్డారు ఆశ్చర్యం కూడా చెందారు. పత్రికల్లో ప్రారంబోత్సవ ఫోటోలు కూడా పడ్డాయి కాని మీరు గుర్తుకు రావడం లేదు. కొద్ది కాలానికి మీ ఫాక్టరీ మూత పడింది. కారణాలు ఎవరకి తెలియవు. మరల ఇప్పుడు మీ తపాల ద్వారానే మీరు బయటకి వచ్చారు. ఇంత కాలం మీరు ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో, మీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో, అసలు మీరు ఎవరో తెలియదు. (తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు). ఈ టపా ద్వారా చాలా, చాలా విషయాలు, సంగటనలు తెలిసాయి. ఒక్క ఈ డిసెంబర్ నెలలోనే ఇన్ని టపాలు అవి కూడా ఇంత పెద్ద టపాలు ఎలా రాయ గలిగారో అంతుపట్టడం లేదు. విపరీతమైన ఆశ్చర్యం వేస్తుంది. మీ total episodes చదివిన తరువాత, మిమ్ములను, మీ ఓపికను పొగడాలో లేక ఎందుకు, ఎవరకి ఉపయోగ పడని, ఎవర్నీ ఉద్దరించని, యే మాత్రం ప్రాదాన్యత లేని విషయం కోసం అన్ని సంవత్సరాలు, ఎంతో శ్రమ, సమయం, ధనం (పచ్చిగా చెప్పాలంటే - మీ యవ్వనాని ) నిరుపయోగం చేసుకున్నదుకు విమర్శించాలో, జాలి పడాలో అర్థం కావడం లేదు. ఇలా అన్నందుకు మీరు నొచ్చు కుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే.. మీ ఈ విలువైన విజ్ఞానం, సమయం, చదువు, ధనం ఎ అనాధ ఆశ్రమం, వృద్దుల ఆశ్రమం, ఉచిత విద్యాలయం కో వెచ్చించి ఉంటే ఎంత బాగుండేది? ఎంత మంది బాగు పడే వారు? ఎంతో చదువుకున్న ఓ విజ్ఞాన ఖని మీరు. మీ correspondance, తరువాతి టపాలలో మీరు సృసించిన విషయాలు, వొహ్... అద్బుతం, ఎవరి వల్లా కాదు, ఎక్కడా చూడలేదు, ఎక్కడా కాన లేదు. మీ analysis, మీ బాష సౌందర్యం, అన్నన్ని పేజీలు రాసే మీ ఓపిక, మీ అపూర్వమైన ఆలోచనలు, మీ సునిత ద్రుష్టి, ఎవరకి సాద్యం?? మీకు మీరే సాటి. ఇటు తెలుగులోనూ అటు ఇంగ్లిష్ లోను .. మాటలు రావడం లేదు. ఎంతో ఉన్నత చదువులు చదువుకొన్న మీకు తెలియదా?? ఎన్ని సార్లు మీరు చూడలేదు ఈ న్యాయ విచారణలు, కమిషన్లు .. వాటి ఫలితాలు. ఏమయింది అసలు మీకు?? అయ్యో ఎంత సమయాని వృధా చేసారండి?? M.O. MATTAI రాసిన 'MY DAYS WITH NEHRU' 'MY REMINSCES.... NEHRU AGE' చదవ లేదా?? నాటి నెహ్రూ గారి హయాం లో జరిగిన KRISHNA MENON జీపుల కుంబకోణం నుండి నేటి ఎలుగుబంటి సూరి ఘటన వరకు... ఎన్ని కుంబకోనాలు , ఎన్ని మోసాలు, ఎన్ని దోచుకోవడాలు, ఎన్ని కలహాలు, ఎన్ని ద్రోహాలు?? ఏ ఒక్క దాని లో నిన ఒక్కడికి శిక్ష పడిందా?? ఒక్క రూపాయి తిరిగి వచ్చిందా?? మీరు అన వచ్చు... I AM A CITIZEN OF INDIA.. THATS MY DUTY అని. కాదనను... ఆ మాత్రం దానికే మీరు మీ ఇంతటి విలువైన సమయాన్ని, వయసుని, ధనాని వొదులు కోవాలా?? ఇంతగా కాస్త పాడాలా?? మీ DUTY ప్రకారం అప్పటి ప్రదాని నరసింహా రావు గారికి ఉత్తరం రాసారు. సమాదానం రాక పొతే మరో రెండు కాకపొతే ఇంకో మూడు ఉత్తరాలు రాయాలి కాని మరి ఇంతగా వేల్లాడాలా? ఎవరని ఉద్దరించడానికి?? ఏమి సాదించడానికి?? ఇంత పెద్ద త్యగానకి ఏమన్నా అర్ధం ఉందా అసలు?? ఎందుకీ పట్టుదల?? మీ చదువు, అపార విజ్ఞానం, మీ అమూల్య సమయం వృదా అవ్వకూడదు. ఎంతో మందికి ఉపయోగ పడాలి ఇక నుండి అయినా. నా ఈ విమర్శని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ...

keep on writing

At present my system caught virus. I can keep new post within short period.

ఆదిలక్ష్మి గారు ,మీరు పదహారు సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు .యు ఆర్ గ్రేట్ .

సమాజం లో జరగుతున్న అన్యాయాలు ,అక్రమాలు .లంచగొండి తనం ,మీడియా మాయాజాలం ,కుటిల రాజకీయాలు చూస్తుంటే నాకూ ఆవేశం తన్నుకొస్తుంది .కానీ ఎమిచెయగలమని నాకూ నేను సర్ది చెప్పుకుంటాను.మీ లాగా జీవితాన్ని త్యాగం చేసినా పలితం ఉండదనిపిస్తుంది.మీరు స్వార్థం అనొచ్చు కానీ ,నా బార్య పిల్లలను ఎవరు చూస్తారు .మీరు చూడండి .ధనాన్ని,బేబీని, కరీర్ ను పోగొట్టుకున్న్నారు.కాని పలితం లేదు .కథ మల్లి మొదటికి వచ్చింది.

నీను మిమ్మ్మల్ని discourage చేయటం లేదు.మన వఇపునుంచి ప్రయత్నం చేస్తాం కానీ other end లో ఒక్కడైన మంచి వాడు ఉండాలి కదా ?

తప్పు చేసిన వాడికి దేవుడు శిక్ష వేస్తాడు తప్పని సరిగా .నేను వేదాంతం చెప్పటం లేదు .చూడండి రామోజీ కి శిక్ష పడింది కదా !.

మీ బ్లాగ్ వల్ల awarenesss పెరుగుతుంది.
ఎనీ హౌ మీకు జరిగిన అన్యాయానికి చాల బాధగా ఉన్నది.

ఆదిలక్ష్మి గారు,

Recently my computer was affected by Trojan spyware "VIRTUMONDE". I have down loaded MalwareBytes (www.malwarebytes.org) and it cleaned the trojan spyware and cleaned the Windows Registry.

My computer was protected by Maccafe, some how it did not prevented those spywares. I try with Spybot to clean trojans, it only identfy them, but failed to clean them.

I hope MalwareBytes may help to remove those viruses.

ఆదిలక్ష్మి గారూ, You really are born tough!

Suggesting that you shouldn't have acted the way you did, that you shouldn't have done the things you did will be simply making a mockery of your lifelong effort, which I am not going to do. Talk is cheap, talk is easy. It is only those who walk the talk, those who ACT that know the value of a sacrifice.

My respect for you increased thousandfold, I offer you my firm moral support(though its meaningless) to you.

Cheers
Yogi

At present my system caught virus...దీనికి కూడా కారణం రామోజీ రావేనా??

కృష్ణారావు జల్లిపల్లి గారు,

గీతా శ్లోకం

' యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా'

భావం...... మితాహారం, మిత నిద్ర, మిత విహారం, చివరకు కర్మలు చేయడంలోనూ మితం పాటిస్తూ మితమైన మెలకువ కలిగి అభ్యాసం చేసేవాడికే - సర్వదుఃఖ నాశకమైన యీ యోగం సిద్దిస్తూంది.

ఇది మీకెంత తెలుసో లేదో నాకు తెలియదు గానీ, నాకు బాగానే తెలుసండి. దేని లిమిట్ ఎంతో నేను విశ్లేషించుకోగలను. నా కంప్యూటర్ కి వైరస్ ఎక్కడం వెనుక కూడా రామోజీ రావే ఉన్నాడని నేను నిందిస్తే, అప్పుడు మీరీమాట అంటే బాగుండేది!

***************

This comment has been removed by a blog administrator.

సురేష్ గారూ,

మీ వ్యాఖ్యకూ, మీరిచ్చిన మద్దతుకూ కృతఙ్ఞతలు. అయితే ఇతర వ్యాఖ్యాతల మీద వ్యక్తిగత విమర్శలు వద్దని నా మనవి. ఎందుకంటే, మనం చర్చిస్తున్న విషయం ప్రక్కదారి పడుతుంది. అప్పుడు చర్చకు అంతిమ లక్ష్యం అయిన ’నిజాన్ని ఆవిష్కరించటం’ అన్న ప్రక్రియకి అవరోధం ఏర్పడుతుంది. అందుచేత వ్యక్తిగత విమర్శలు వద్దు.

meeru cheppe vishayalu nijamani ela nammamantaru? meeru chala topics lo sakshi ni support chesunnaru. meeru nijayiti parulani ela nammadam. mee peruki, mee mail id ki sambandham ledu. edo address icharu. nijamga meeku ramoji rao gurinchi anni nijalu teliste ... mimmalni meeru disclose chesukoru kada, unless mee venakala pedda support lekunda??? one kind suggestion. Meeru nijayiti parulu aithe .. marokari meeda comment cheyyandi. Otherwise u dont have moral rights to do this.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu