ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధులు నాతో పాటు సత్యాన్వేషణ చేయాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా...

ఓ అడవి. అందులో ఎన్నో జంతువులూ ఉన్నాయి.

వాటిల్లో ఓ నక్క.

దాని దురదృష్టం కొద్దీ, దానికి 10 రోజులుగా తిండి దొరక లేదు. నీరసించిపోయింది. డొక్క ఎండి పోయింది.

అలాగే కాళ్ళీడ్ఛుకొంటు ఆహారం వెదకసాగింది.

అదృష్టం!

ఓ చెట్టు తొర్రలో దానికి ఆహారం కన్పించింది.

చెట్లు కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళో, లేక వేటగాళ్ళో లేక యాత్రికులో దాచుకున్న అన్నం మూట దానికి కన్పించింది.

చెట్టు తొర్ర సన్నగా ఉంది.

లోపల తిండి దండిగా ఉంది.

వాసన నోరూరిస్తోంది, ఆకలి ఆగనంటోంది.

ఎండిన డొక్కతో ఉన్న నక్క ఒక్క ఉదుటున తొర్రలోకి దూరింది.

అన్నం పప్పు, కూరలు, అప్పడం, అప్పాలతో కమ్మటి భోజనం.

కడుపునిండా మెక్కెసింది.

పొట్టలావుగా అయ్యింది.

ఇప్పడు ఓ చిక్కొచ్చింది నక్కకి.

దాని శరీరం తొర్ర వెడల్పు కన్నా ఎక్కువలావుగా ఉంది. బయటకి రావడం కుదరటం లేదు.

లోపలే ఉంటే, తిండి దాచుకొన్న మనుషులొచ్చి నాలుగు పీకితేనో?

లేక తన్ని తగలేస్తే నో!

తలుచుకొంటేనే వళ్ళు జలదరించింది దానికి.

కుయ్యోమొర్రో మంటూ మొత్తుకోవటం మొదలుపెట్టింది.

ఆ దారినే పోతున్న ఓ కుందేలు నక్క ఏడుపు విన్నది.

దగ్గరికొచ్చి చెట్టుతొర్ర కేసి చూసింది.

ఏడుస్తున్న నక్కని చూసి, "ఏమిటి సంగతి నక్కబావా" అంది.

నక్క వివరంగా చెప్పింది వెక్కిళ్ళుపెడుతూ.

"మరి లోపలికి వెళ్ళేటప్పడు ఎలా వెళ్ళావు?" లాజికల్ గా అడిగింది కుందేలు ప్రశ్నార్ధకపు ముఖం పెట్టి.

"ఆకలితో డొక్క ఎండి అప్పడు సన్నగా ఉన్నాను" అంది నక్క ఏడుపుముఖపెట్టి.

"అయితే వెళ్ళిన దారిలోనే తిరిగి రా నక్క బావా?" అంది కుందేలు చిరునవ్వుతో కళ్ళు మెరుస్తుండగా.

"అంటే మళ్ళీ 10 రోజులు పస్తుండలా?" భోరుమంది నక్క.

"అంతే మరి! కాకపోతే ఈసారి 10 రోజులు పట్టదులే. పస్తులయితే తప్పదు" అంది కుందేలు నింపాదిగా.

ఇదీకథ!

ఈకథ ఇప్పుడెందుకు చెప్పానంటే నకిలీ కణికుడు, అతడి వంశీయులు 350 ఏళ్ళుపాటు భారతదేశమ్మీద కేంద్రీకరించి, ప్రపంచమ్మీద ప్రయోగించి, మన జీవితాల్లో గత మూడు నాలుగు దశాబ్ధాలుగా తీవ్రతరం చేసిన సుదీర్ఘ కుట్రని మనం తెలుసుకోవడానికి, అర్ధం చెప్పకోవటానికి 350 ఏళ్ళు కాకపోయినా కనీసం కొన్ని రోజులైనా పడుతుంది కదా!

ఈ నకిలీ కణికుడు 350 ఏళ్ళుపాటు చెట్టుతొర్ర లాంటి గూఢచార తంత్రంలో దాక్కొని ఉన్నప్పుడు బయటికి లాగి చూపెట్టడానికి కనీసం కొన్ని రోజులైనా పట్టదా?

ఇప్పటికే నా బ్లాగు చుట్టాల్లో చాలామంది ఉత్కంఠ ఆపుకోలేక ‘ఎవరీ నకిలీ కణికుడు త్వరగా చెప్పండి’ అంటున్నారు. తప్పకుండా చెబుతాను.[ఇన్ స్టంట్ కాఫీ కి, ఇన్ స్టంట్ రిజల్ట్ కి బాగా అలవాటు పడిపోయినట్లున్నాము కదూ!నిజానికి ఈ నకిలీ కణికుడు మన జీవితాల్లో సృష్టంచిన పరుగులో ’ఇన్ స్టంట్’ అన్నదీ ఒక భాగమే. ]

అంతేకాదు, ఈ నకిలీ కణికుడి గూఢచర్యంతో కూడిన కుట్రని, సహేతుకంగా, సాక్ష్యాధారాలతో, దృష్టాంతసహితంగా నిరూపిస్తాను. ఇంకా ఈ నకిలీ కణికుడు కింగ్ మేకర్ అయితే ఇతడి కింగ్ లూ అంటే ఏజంట్లు ఏయే రంగాల్లో, ఎప్పుడెప్పుడు ఏయే అంశాలు [కుట్రలో భాగాలు] నిర్వహించారో, ఇప్పడూ ఎలా నిర్వహిస్తూన్నారో వివరంగా చెబుతాను.

కాకపోతే ఒక్క విషయం గమనించండి.

నేనిది ఊసుబోక వ్రాయటం లేదు.

ఫిక్షన్ కథో, కల్పితమో వ్రాయటం లేదు.

నిజాన్ని వ్రాస్తున్నాను.

నాజీవితంలోని నిజం, మీ జీవితంలోని నిజం, మన జీవితం లోని నిజం.

అయితే ఈ నకిలీ కణికుడెవరో తెలుసుకొనే ముందు అసలు అతడు ప్రయోగించిన కూట నీతి ఏమిటో, కుట్ర స్వరూపం ఏమిటో తెలుసుకోవడం అవసరం. మనమీద జరిగిన కుట్రకి దృష్టాంతపూరితంగా, సమగ్రంగా తెలుసుకొంటే, నేను కాదు మీరే గుర్తించగలరు, ఆ నకిలీ కణికుడెవరో.

అసలు కుట్రస్వరూపం ఏమిటో అర్ధం చేసుకోనిదే ఈ నకిలీ కణికుడి అసలు స్వరూపం తెలుసుకోవటం కష్టం. ఎందుకంటే 350 ఏళ్ళు నిరాఘాతంగా ప్రపంచమ్మీద, భారత దేశమ్మీద కేంద్రీకరించి జరిగిన కుట్రని మన తెలుగు సినిమాల్లో ఒక పాటలో దర్శకుడు చూపినట్లుగా చూడలేం కదా! ఈ నకిలీ కణికుడు కుట్ర తరతరాలుగా గాఢతనీ, పరిపక్వతనీ సంతరించు కొంటూ అన్ని రంగాల్లో అన్ని అంశాల్లో చొచ్చుకుపోయి పట్టు బిగించింది.

ఒక్కోరంగంలో కుట్రని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ, మన జీవితాల్లో అదెంత చొచ్చుకొచ్చి దగా చేసిందో అర్ధం చేసికోవాలి. కాబట్టి మీడియా ముసుగు వెనుకా, రాజకీయం వెనుకా, అవినీతి వెనుకా, కాలం మారిందంటూ మనల్ని భ్రమింపజేస్తూ ఏ రంగంలో ఎంతెంత కుట్ర ఈ నకిలీ కణికుడు చేశాడో మీకు క్లుప్తంగా అయినా స్పష్టంగా, అవసరమైన చోట సవివరంగా తెలియజేస్తాను.

నిజానికి మీడియా మాయాజాలం ఇందులో ప్రధాన భాగం.

తదుపరి టపానుండి విద్య, వైద్యం, వ్యవసాయం, వ్వాపార రంగం, రాజకీయం వగైరా రంగాల్లోని నకిలీ కణికుడి కుట్రని వివరిస్తాను.

7 comments:

bhESh. chaalaa chakkani vislEshanatO kannulu teripimchE prayatanam nidranatistunnavaarini mElkolpemduku.dhanyavaadaalu

ఎదురు చూస్తుంటాం నకిలీ కణికుడి గురించి
అలాగే, మీరు తాజ్ మహల్ పేరుతో ఆరు వందల సంవత్సరాలుగా మరుగున పడ్డ చరిత్ర కూడా మీ శైలిలో చెపితో బాగుంటుందని నా అభిప్రాయం.

ముఖ్యంగా భారతదేశం పేరు చూడండి. భారతదేశం నుంచి ఆంగ్లనామం ఇండియాకి మారింది. దీనిపై కూడా మీరేమైనా పరిశోధాత్మక వ్యాసం రాయగలరా?

you are building up good tempo

I am waiting. [:)]

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

ఆ నకిలీ కణికుడి గురుంచి తెలుసోకావలని ఉంది.ఎంత త్వరగా చెబితే అంత సంతొషం.

నిరంజన్ గారు : నా గత టపాలలో వివరంగా వ్రాసానండి. అన్ని టపాలు ఒకే చోటలో చూస్తే వరుస క్రమంలో సూచిక ఉంటుంది. గమనించగలరు. ఒక్క టపాలో చెప్పగలిగింది కాదు. ఇప్పటికి 335 పూర్తయినా ఇంకా చెప్పాల్సింది మిగిలే ఉన్న విషయం ఇది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu