ఈనాటి[Dec,2] వార్తల్లో రెండు అంశాలు మనస్సుని కుదిపేస్తుంటే ఇది వ్రాస్తున్నాను.

మొదటి వార్త: అది సందీప్ ఉన్ని కృష్ణన్ ఇల్లు గాకపోతే అటువైపు కుక్కకూడా వెళ్ళదు – అచ్యుతానందన్, కేరళ ముఖ్యమంత్రి

రెండవ వార్త: నారిమన్ హౌస్ లో యూదు దంపతులు రబ్బీ గాబ్రియల్, హోట్జ్ బర్గ్ రివికా, టెర్రరిస్టుల చేతుల్లో హతమవ్వగా వారి రెండేళ్ళ పసిబిడ్డ, మోషేని కాపాడిన వంటమనిషి భారతీయ మహిళ సాండ్రా శామ్యూల్.

ముందుగా మొదటి వార్తని విశ్లేషిస్తాను. కేరళలో పుట్టిన సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబం బెంగుళూరులో స్థిరపడింది. ఆ ధీరుడు మొన్నటి ముంబాయి ముట్టడిలో గాయపడిన సహచరుల్ని కాపాడటానికి తాను టెర్రరిస్టులకు అడ్డంగా కొండలా నిలబడి ప్రాణాల్ని, తెలిసీ, తృణప్రాయంగా, దేశంకోసం, కర్తవ్యం కోసం అర్పించాడు. ఏకైక పుత్రుణ్ణి కోల్పోయిన ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి గార్ల దుఃఖాన్ని, వారి పుత్రుడి త్యాగాన్ని, పుత్రుణ్ణి అలా తీర్చిదిద్దిన తల్లిత్రండ్రుల ఔన్నత్యాన్ని యావద్భారత దేశమూ గుర్తించింది. కుళ్ళు రాజకీయవాదులు తప్ప!

అలాంటి వారి ఇంటికి, అలాంటి తల్లితండ్రుల్నీ పరామర్శించడానికి శ్రీమాన్ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు గనుక ముందస్తు రక్షణ ఏర్పాట్ల కోసం పోలీసు జాగిలాలతో రక్షణ బృందం తనిఖికి వచ్చింది. సదరు ముఖ్యమంత్రి గారి ప్రాణాలు అంత విలువైనవి.

పాపం భారతీయుల ప్రాణాలు పుట్టలోని చెదలు ప్రాణాల్లాంటివి. పుట్టవా? గిట్టవా?

‘ఈ మంత్రుల, ముఖ్యమంత్రుల, రాజకీయ నాయకుల ప్రాణ రక్షణకి తీసుకుంటున్న శ్రద్దలో వెయ్యోవంతు శ్రద్ధ సామాన్య ప్రజల ప్రాణ రక్షణకు తీసికొన్నా, ఢిల్లీ పేలుళ్ళు ముంబాయి పేలుళ్ళు జరగవు కదా! అప్పడు తమ బిడ్డలాగా ఎవరి ప్రాణాలూ అనంత వాయువుల్లో కలవవు కదా’.

ఈ భావన ఉన్ని కృష్ణన్ లాంటి పుత్రశోకంతో తపిస్తున్న దశరధ హృదయాల్ని కలచివేయదా? ఆయనకాదు, ఆ స్ధానంలో ఏమానవ హృదయం ఉన్నా అంతే బాధతో జ్వలిస్తుంది. అలాంటి పరిస్ధితిలో “అది సందీప్ ఇల్లుకాకపోతే అటువైపు కుక్క కూడా వెళ్ళదు” అనేంతగా రాజకీయ పరిణామాలు దాపురించడాన్ని, అచ్యుతానందన్ లాంటి రాజకీయ వేత్తల సంస్కారాన్ని యావత్ భారతజాతి నివ్వెర పడి చూస్తోంది.

అవును! ఈ దేశంలో రాజకీయనాయకుల, ప్రభుత్వకార్యదర్శుల్లాంటి పెద్దపదవుల్లో ఉన్న బ్యూరాక్రాట్ల, పెద్ద పారిశ్రామిక వేత్తల ప్రాణాలు మాత్రమే విలువైనవి. సామాన్యుడి ప్రాణాలు ఇక్కడ టైమ్ పాస్ బఠాణీ ధరల కంటే కూడాచౌక.

కానీ ఇలాంటి ధూర్తుల్ని చూసి మనం బెంగ పడక్కర లేదు. ఎందుకంటే ఈ దేశంలో రాజకీయాధికారం మొత్తం దాదాపు 500 కుటుంబాలకి పరిమితమై పోతుందని నీరజ చౌదరి లాంటి ప్రఖ్యాత కాలమిస్టు విశ్లేషించారు. ఆ లెక్కన చూసుకున్నా మహా అయితే ఈ అతి ఖరిదైన ప్రాణాలు గల రాజకీయ నాయకులు పదివేల మంది కంటే ఎక్కువలేరు. బ్యూరాక్రాట్లునీ, పారిశ్రామికవేత్తల్నీ, వ్వాపారవేత్తల్నీ అందర్నీ లెక్కగట్టుకున్నా లక్షమందికి మించరు. మనం సామాన్యులం 102 కోట్లమందికి పైనా ఉన్నాం.

ఇందులో ప్రతీ భారతీయుడి ఆత్మా సందీప్ ఉన్నికృష్ణన్ కి తీసిపోదు. అవసరం వస్తే ఆనాడు ప్రతీ భారతీయుడూ ఒక ఎన్.ఎస్.జీ. కమెండోనే. ఎందుకంటే విశ్వనాధ వారన్నట్లు ’ఇక్కడ బుట్టిన చిగురు కొమ్మైనా చేవ!’ దాన్ని మొన్న [అంటే అక్టోబర్ 2008లో] మన రాష్ట్రంలో జరిగిన భైంసా మతఘర్షణల్లో ముస్లిం కుటుంబం ప్రాణాలు కాపాడిన తుల్జాబాయి లాంటి మాతృమూర్తి మనకళ్ళముందు నిరూపించింది.

కాబట్టి అచ్యుతానందన్ లనీ, శివరాజ్ పాటిళ్ళనీ, మన్మోహన్ సింగుల్ని, రాజశేఖర్ రెడ్డిలనీ, చంద్రబాబు నాయుళ్ళనీ వగైరాలని చూచి మనం ‘అందరూ ఇంతే’ అనుకోనక్కరలేదు.

ఎందుకంటే రెండో వార్త చూడండి:

నారిమన్ హౌస్ లో కాపురం ఉంటున్న యూదు జంట రబ్బీ గాబ్రియల్, హోట్జ్ బర్గ్ రివికా ల బిడ్డ మోషేని కాపాడిన వారి ఇంటి వంట మనిషి, భారతీయ మహిళ మెట్ల మీద పడున్న పసివాణ్ణి చంకన వేసికొంది. అప్పటికే టెర్రరిస్టుల చేతిలో సూటిగా, గురిచూడ బడ్డట్లుగా యూదు జంట హతలైనారు.

పెంచిన ప్రేమ ఆ మహిళని బిడ్డని వదలి తనప్రాణం కాపాడు కోమనలేదు.

నేవిక గా ’తన ధర్మం తాను పాటించడం’ అనే భారతీయ అత్మ అలాంటి ఆపత్సమయం లోనూ ఏమరుపాటుగా లేదు. ‘యూదుల బిడ్డని కాపాడే ప్రయత్నంలో టెర్రరిస్టులు తననీ చంపేస్తే’ అనే భయాన్ని భారతీయ రక్తం దగ్గరికి రానీయ లేదు.
ఎదురైన టెర్రరిస్టుల ముఖాన తలుపులు వేసి ఎన్.ఎస్.జీ. కమెండోల దగ్గరికి బిడ్డతో సహ పరుగుతీసింది.

ఆ తెగువ, కర్తవ్య నిష్టా భారతీయుల స్వంతం.

ఈ బిడ్డ యూదువాడనో, ముస్లిం అనో, సిక్కులనో, క్రిస్టియన్ అనో ఆలోచించని మానవత్వం భారతీయుల స్వంతం.
ఏ భీభత్సమూ, ఏ టెర్రరిజమూ భారతీయుల రక్తంలోని ఆ ధైర్యాన్నీ, పౌరుషాన్ని, తెగువనీ, దయనీ, మానవత్వాన్ని రూపుమాప లేదు.

సేవికగా యజమానికి వంట చేసి పెట్టే ఆ భారతీయ మహిళకు ఏ రాజకీయ ఉపన్యాసాలూ తెలియవు. ఓ ప్రక్క రాజ్ ఠాక్రే లాంటి రాజకీయ నాయకులు మహరాష్ట్ర హద్దులు దాటవద్దుంటూ బ్రతకడానికొచ్చిన ఇతర రాష్ట్రాల యువకుల్ని చావదన్నమన్నాడు. దానికి ప్రతీకారంగా లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ భరద్వాజ, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి ఇతర నాయకులంతా తమ రాష్ట్రాలకు పరిమితమై రాజీనామా బెదిరింపులతో సహ నానా రాజకీయ డ్రామాలు వేసారు.

కానీ ఈ పేద భారతీయ మహిళ సాండ్రా శామ్యూల్ కి ఇవేవి తెలియదు.

ఈ తల్లిప్రేమ దేశపు ఎల్లలు దాటి ఓ ఇస్రాయల్ పసివాణ్ణి కాపాడింది.

ఎందుకంటే ఆ సేవకురాలికి ఏ గూఢచర్యపు ఎత్తుగడలూ తెలియవు.

ఏ వ్వాపర లావాదేవీలు తెలియవు.

తెలిసిందొక్కటే మానవత్వం.

ఇదీ మన రక్తం.

ఇదీ మన వారసత్త్వం.

ఇదీ మన తత్త్వం.

ఏనాటికైనా గెలిచేది మానవత్వమే.

కుటిలమైన రాజకీయాలు, కుట్రలూ కాదు.

ముగించే ముందు ఓ చిన్న విశేషం - రాజ్ ఠాక్రే మరియు భారతీయ మహిళ సాండ్రా శామ్యూల్ విషయం, రాజకీయ నాయకులు, మీడియా తమ స్వార్ధపు స్ట్రాటజీ ని ప్రజాభిప్రాయమంటూ జనం నెత్తిన రుద్దడాన్ని మరోమారు మన కళ్ళముందు ఆవిష్కరించడం లేదూ!

3 comments:

Really a good post !

గుడ్డలూడదీసి నడిరోడ్లో ఊరకుక్కలచేత కరిపించాలి కుక్కల కొడుకుల్ని(అచ్యుతానంద్,కారత్,అంజూ గాళ్ళని).బహుశా అవి కూడా సిగ్గుపడతాయేమో కరవడానికి ఈ చెత్తగాళ్ళని..

ఇకపోతే శాండ్రా శామ్యూల్ కి శతకోటి వందనాలు.చెప్పండి మనం చెయ్యగలిగిన సాయం ఏమన్నా ఉందేమో(పిల్లవాడి పెంపకానికి వగయిరా,అందరం తలా ఒక చేయి వేసి ఆమెకి సాయం చెయ్యలేమా?)..
pappusreenu@gmail.com

ఇప్పుడే తెలిసిన తాజా వార్త. అసలు తాను 'అది సందీప్ ఉన్ని కృష్ణన్ ఇల్లు గాకపోతే అటువైపు కుక్కకూడా వెళ్ళదు' అన్న వ్యాఖ్యలే చెయ్యలేదని సదరు మహానుభావులు సెలవిచ్చారు. ఇదంతా మీడియా సృష్టేనట. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు.

@శ్రీనివాస్ పప్పు గారూ!
బాబుతో సహా శాండ్రా శామ్యూల్ ని ఇజ్రాయిల్ తీసుకువెళ్ళటానికి ఆ దేశపు అధికారులు అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టారు. మనవాళ్ళు ఆవిడని గుర్తించకపోయినా విదేశీయులు మాత్రం కృతజ్ఞత బానే చూపిస్తున్నారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu