ఎప్పటిలాగా ముందుగా ఓ కధవ్రాసి, దాని విశ్లెషణా, మనజీవితాల్లో కధాసారపు అనువర్తనా మీకు వివరించాలనుకొన్నానండి!
కానీ చిన్న బిర్రే....క్!
ఈలోగా సరదాగా కాసిన్ని కబుర్లు!
*** *** ***
సాక్షిలో రామోజీ రామాయాణం చదివి ఇది వ్రాస్తున్నాను.
అది రామాయణం కాదండీ! రామోయణం!
అసలింతకీ ఏం జరుగుతోంది ఆరెఫ్సీలో?
స్వయంగా రామోజీరావు కుమారుడే చ్చెప్పినట్లుగా డబ్బుతో ఎవరినైనా కొనేయవచ్చు ఏమైనా చేసేయవచ్చు అని రామోజీరావు ప్రగాఢ విశ్వాసం. అసలు దేవుణ్ణే నమ్మని, తానే స్వయంగా చెప్పుకున్న కొండంత వ్వవస్థ వంటి వ్వక్తి. తండ్రి దెవుణ్ణి నమ్మని నాస్థికుడైతే,ఆయన పెద్దకుమారుడు ముస్లీం గడ్డం, గుండూ పెట్టుకొని తండ్రి వెనకాలే తిరుగుతుంటాడు.
రెండో కుమారుడు శ్రీహరిస్వరాలు, సుమనోహరాలూ అంటూ కృష్ణుడి వేషం వేసికొని తండ్రికి ఎదురుతిరుగుతుంటాడు.
అసలేం జరుగుతోంది ఆరెఫ్సీలో?.... నాకు తెలియాలి! నాకు తెలియాలి! నాకు తెలియాలి!......ఇట్లు సీతమ్మ.
ప్లీజ్! ప్లీజ్! మీకు తెలిస్తే చెప్పరూ!
*** *** ***
సినిమారంగం నుండి రాజకీయ రంగంలోకి కోత్తగా అడుగుపెట్టిన నాయకులు ఇంద్ర, సమరసింహ రెడ్డిల్లాంటి సినిమాలని గుర్తు చేసి, మీసం మెలేసి తొడ గొట్టారట.
అది చూసి, ప్రజలెక్కడ ఆకర్షించ బడీపోతారోనని భయపడి పోయారో ఏమో, మరో అధికార రాజకీయ నాయకుడు చలన చిత్ర కధా నాయికల్లాగా (పేదలకి ప్రేమని పంచుతున్నారట) గాల్లోకి ముద్దులు విసిరాడట.
వీళ్ళంతా మరికొంచెం ముందుకిళ్ళి, ప్రజల్ని ఆకర్షించడానికి సినిమా హిరోయిన్లలాగా కురచ దుస్తులేసుకుని ప్రజలముందుకు వస్తే?
పాపం! ప్రజల గతేం కాను?
*** *** ***

5 comments:

అదిరింది :)

"రామోజీ రామాయణం " అని సాక్షిలో వచ్చినది ఈ మధ్య కాలంలో అన్నిటి కన్నా పనికిమాలిన విషయం అనుకుంటుంటే, ఇప్పుడు మీరు రాసిన ఇది ""స్వయంగా రామోజీరావు కుమారుడే చ్చెప్పినట్లుగా డబ్బుతో ఎవరినైనా కొనేయవచ్చు ఏమైనా చేసేయవచ్చు అని రామోజీరావు ప్రగాఢ విశ్వాసం. అసలు దేవుణ్ణే నమ్మని, తానే స్వయంగా చెప్పుకున్న కొండంత వ్వవస్థ వంటి వ్వక్తి. తండ్రి దెవుణ్ణి నమ్మని నాస్థికుడైతే,ఆయన పెద్దకుమారుడు ముస్లీం గడ్డం, గుండూ పెట్టుకొని తండ్రి వెనకాలే తిరుగుతుంటాడు.రెండో కుమారుడు శ్రీహరిస్వరాలు, సుమనోహరాలూ అంటూ కృష్ణుడి వేషం వేసికొని తండ్రికి ఎదురుతిరుగుతుంటాడు."
దానికన్నా పరమ పనికిమాలిన విషయం! సాక్షి చదివిన తరవాత జగన్ మీద ఎంత చెత్త అభిప్రాయం కలిగిందో ఇది చదివిన తరవాత కూడా అంతే చెత్త అభిప్రాయం కలిగింది....

"వీళ్ళంతా మరికొంచెం ముందుకిళ్ళి, ప్రజల్ని ఆకర్షించడానికి సినిమా హిరోయిన్లలాగా కురచ దుస్తులేసుకుని ప్రజలముందుకు వస్తే?" - మీ సెన్సాఫ్ హ్యూమర్ బాగుంది. ప్రజలు ఆకర్షించబడతారు అంటే అలానూ వస్తారేమో!

బాగున్నాయండీ మీ చెణుకులు. మరీ ముఖ్యంగా కురచదుస్తుల నాయకుల విషయం చదువుతూంటే ఏదో కార్టూను చూస్తున్న అనుభూతినిచ్చింది. భలే!

చదివి వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu