మొన్న ముషారఫ్

ఈ రోజు ముబారక్

ఇలా… ఒక్కో స్థంభమే కూలిపోతుంటే

దోపిడిని ప్రతిఘటిస్తూ

ప్రజా ఉద్యమాలు ఎగుస్తుంటే

ప్రస్తుతం దూరదేశాల్లో… ప్రతిధ్వనిస్తున్న ఉద్యమహోరు

రేపు ఇంటి ముంగిటికి రావా!

ఇలా…యముని మహిషపు లోహ ఘంటలు

వీనుల కంటకంగా వినిపిస్తుంటే

గణగణమని సమీపిస్తుంటే

కళ్ళ క్రింద వలయాలు

కళ్ళు మూస్తే కనబడే ప్రళయాలు

నిద్ర రాకుండానే పలకరించే కలవరాలు

ప్చ్!

ఎంత కష్టం!?

మీడియా కింగులకీ

రాజకీయ రాణులకీ

ఎంత కష్టం! ఎంత కష్టం!?

8 comments:

సొనియా డైనాష్టికి కి కూడా రొజులు దగ్గర పడ్డాయా?

Can Indians replicate what others are doing?

లేదండీ - మీరు "నిజంగా" అనుకునే "ఆ" రోజు రాదు....ముబారక్ అయినా, ముషార్రఫ్ అయినా - దానికి "మిత్ర" దేశ రాజకీయం, "మిత్ర" దేశ ధనసహాయమే కారణం. మనవాడనుకునేదాకానే ప్రేమ, తర్వాత పగేగా.

పిచ్చివెధవలు, సామాన్య జనమూ సమిధలు.

గుండం మటుకు బ్రహ్మాండంగా రగులుతూ ఉంటుంది చలి కాచుకోడానికి...

మనదగ్గర కడుపులో కుండ ఎప్పుడూ చల్లనే - ఇప్పుడే కాదు, భవిషత్తులో కూడా అని చరిత్రపుటల్లో స్వర్ణాక్షరాలతో రాసుకోవచ్చు. చెరిగిపోతాయనుకుంటే ఏకంగా శాసనాలే చెక్కించొచ్చు. అలాగని మీబోటి వారు పోరాడకుండా ఉండనూ కూడదు...మాలాటివాళ్లు ఓ సారి చదివి, భలే రాసారే అని చప్పట్లు కొట్టకుండానూ ఉండకూడదు...ప్రయోజనం సిద్ధించిందా అంటే వేచి చూడటమే! నేనేదో పెసిమిస్టుననుకునేరు.... :) అలాటిదేమీ లేదిక్కడ!

yes, that is exactly what I was thinking.
Unfortunately, the systems that replaced these despots did not turn out to be particularly people friendly. Moreover, I have a suspicion that Indian people in general are in a sort of a lull - I am not seeing any kind of wide spread rage against the variety of govt. sponsored scams being revealed.

@ఆదిలక్ష్మి గారు
బాగా రాసారు.

ఇలా ఉంటే బావుండేది
"
మీడియా ముద్దుగుమ్మలకి
రాజకీయ రావణులకీ
"
ఏమో! నీరా రాడియా/బర్ఖా దత్ /సాగరిక ఘోష్ ల పైత్యం చూసిన తర్వాత మీడియాలో ముద్దుగుమ్మలదే రాజ్యం అనిపించింది :))

అసలు టపాకి వస్తే

ముషారఫ్ కానీ, ముబారక్ కానీ అక్కడ కూలింది/కూలుతుంది మతమౌడ్య౦ కునారిల్లుతున్న మూర్ఖపు ప్రభుత్వాలు. అయితే చిత్రం, మళ్ళీ అదే లేదా అంతకన్నా మతమౌడ్య౦ఉన్న రాజ్యస్తాపన జరుగుతుంది. మరి పోరాటం ఎందుకో!

మనకి అలా వద్దులెండి!

దోపిడిని ప్రతిఘటిస్తూ

ప్రజా ఉద్యమాలు ఎగుస్తుంటే

ప్రస్తుతం దూరదేశాల్లో… ప్రతిధ్వనిస్తున్న ఉద్యమహోరు

రేపు ఇంటి ముంగిటికి రావా!

త్వరగా జరిగితే బాగుండు.కానీ యథారాజా తథాప్రజ అన్నట్లుగా ప్రజలుకూడా

ఎవడికి అందినది వాడు దోచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు.ఇలాంటి స్థితిలో

ఉద్యమించేవాళ్ళుంటారా అని అనుమానం

అమ్మా మీరు ఛెప్పినట్టు అంత త్వరగా ఆ పరినామాలు సంబవిస్తాయంటారా

@చిలమకూరు విజయమోహన్: ఎవడికి అందినది వాడు దోచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు.ఇలాంటి స్థితిలో ఉద్యమించేవాళ్ళుంటారా అని అనుమానం)

మౌనంగా గమనిస్థున్న వారు ఎంతొ మంది దేశ భక్తులను నేను చూసాను, మీరు కూడా అందరిలాగా మీడియా దృష్టితొ చూస్తే ఎలా...

- రేణూ కుమార్

అవును ధరలు, అవినీతి పోటీపడి పెరుగుతున్నాయి
అయినా ప్రజలు, ప్రతిపక్షాలు మొద్దునిద్రపోతున్నారు.

అజ్ఞాత గారు, కొత్తపాళీ గారు, చిలమకూరి విజయమోహన్ గారు, రాజేష్ గారు : మీరు లేవనెత్తిన అంశాలకు ఒక్క వ్యాఖ్యలో వివరణ ఇవ్వడం కష్టమండి. నడుస్తున్న ప్రపంచ రాజకీయాల నేపధ్యంలో ఒక టపాల మాలికని ప్రారంభించాలనుకుంటున్నాను. అందులో మీ సందేహాలకు సమాధానాలు, మీరు లేవనెత్తిన అంశాలకు వివరణలూ నా శక్తి మేరకు ఇస్తాను. నెనర్లు.

వంశీ మోహన్ గారు: మీరు ‘నిరాశా వాది’ అని నేను అనుకోనండి. నిజం మాట్లాడితే...స్క్రిజోఫినియా అనీ, వాస్తవంలోని ప్రతికూలతలని గురించి మాట్లాడితే...పెసిమిజమ్ అనే కుహనా భావనలని కుట్రదారులూ, మీడియా ప్రచారించారు. అంతే! ఇక మీరు లేవనెత్తిన అంశాలకు సంబంధించి...తర్వాతి టపాలలో వివరిస్తాను. నెనర్లు!

రేణూ : మనకు కావాలనుకుంటే ముందుగానూ జరగవు, వద్దనుకుంటే ఆగనూ ఆగవు. :)
కాంగ్రెస్ అధిష్టానం తరహాలో చెప్పాలంటే..."సరైన సమయంలో సరిగ్గా జరుగుతాయి." :))

bonagiri గారు: తెల్లారాలే గానీ అందరూ నిద్రలేస్తారు. :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu