ఇలా... సహనంగా వేచి ఉండి, దొంగని పట్టుకున్నాక... అప్పటి దాకా దగా పడిన ఆ సామాన్యులు, అతణ్ణి, సూటూ బూటూ విప్పించి, విరగదన్ని తరిమారు.

ఇదీ కథ![http://ammaodi.blogspot.com/2011/02/03_15.html]

ఇది కొత్త కథ కాదు. గతంలో బాపూజీ బ్రిటీషు వాళ్ళ హయాంలో నిజం చేసిన చూపించిన కథ!
వర్తమానంలో పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం నిజం చేసి చూపిస్తున్న కథ!


నాటి స్వాతంత్ర సమరయోధులు..... భారతీయులందర్నీ జాగృతం చేసి, దోపిడి గురించి అవగాహన కలిగించారు. బాపూజీ సత్యాహింసలతో ‘సత్యాగ్రహ’మనే ఆయుధంతో ప్రజలని సహనంగా వేచి ఉండేలా నడిపించారు.


దాంతో.... ఆయుధం చేపట్టని సత్యాగ్రహల మీద తమ దౌష్ట్యానికి..... ఎన్ని రోజులని, ఎన్ని పైకారణాలని బ్రిటీషు వాళ్ళు చూపిస్తారు? మానవత్వం గురించీ, స్వేచ్ఛా స్వాతంత్రాల గురించీ తెగ ఉపన్యాసాలు దంచే బ్రిటీషు వాడి దౌష్ట్యం, కౄరత్వం అమానుష దోపిడి, అక్రమం, ప్రపంచానికి బాగా వెల్లడి అయ్యింది స్పష్టంగా బహిర్గతపడింది ఫలితంగా బ్రిటీష్ వాళ్ళకు తట్టాబుట్టా సర్ధుకు పోక తప్పలేదు.

కాబట్టే – బ్రిటీషు వాళ్ళకీ, వాళ్ళని పైకారణంగా ధరించి గూఢచర్యం నడిపిన నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ బాపూజీ అంటే అంత కడుపు మంట, ద్వేషం.

స్వాతంత్రానంతరం, ఇటీవలి రోజుల వరకూ కూడా, బాపూని తిట్టడం ఓ ఫ్యాషన్ గా నడిపించబడింది. ఇప్పుడంటే చిరంజీవులూ, చంద్రబాబులూ కూడా బాపూ బొమ్మ పెట్టుకుంటున్నారు, నామజపం చేస్తున్నారు గానీ, కాంగ్రెస్ తో సహా అందరూ బాపూని నిర్లక్ష్యం చేసిన వారే!

ఓ సజీవ ఉదాహరణ చెబుతాను.

ఇది నా జీవిత సంఘటన.

అప్పటికి నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఓ రోజు ‘ఈనాడు’ పత్రికలో గుంటూరుజిల్లా, దాచేపల్లి దగ్గర ఓ పల్లెటూరులో బాపూజీ విగ్రహం ఫోటో వేసి ఓ వార్తాంశం వ్రాసింది. చాలా ఏళ్ళయినందున ఆ ఊరి పేరు నాకిప్పుడు గుర్తు లేదు.

ఆ వార్తాంశంలో వేసిన ఫోటోలో బాపూజీ విగ్రహం తలమీద, భుజాల మీద కొంగలూ, కాకులూ రెట్టలు వేసి అసహ్యంగా ఉంది. దుమ్ముధూళి కొట్టుకొని, పరమ నిరాదరణ స్థితిలోనూ, అవమానకర స్థితిలోనూ ఉంది.

సదరు వార్తాంశంలో అదే ఉటంకిస్తూ..... పత్రికా విలేఖరి, బాపూ విగ్రహ దైన్యతని వర్ణించాడు. ఊరివాళ్ళ నిరాసక్తని మాటవరసగా విమర్శించాడు. బాపూ విగ్రహాన్ని అవమానిస్తున్న తీరు గురించి మాత్రం అతిశయించిన ఉపమానాలతో వ్రాసాడు.

వార్త చదివిన నాకు ఒళ్ళు మండి పోయింది. చాలా ఉక్రోషంగా తోచింది. అప్పటికి నేను వక్తృత్వ పోటీలకీ, వ్యాస రచన పోటీలకీ ఆటలకీ వేరే ఊళ్ళు వెళ్ళి ఉన్నాను. ఏపీ దర్శన్ టూర్ లోనూ పాల్గొని ఉన్నాను. అయినా గానీ.... చెబితే నాన్న ఒప్పుకోడని.... ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, ఆదివారం రోజు, క్లాస్ మేట్ ఇంటికని చెప్పి బయలు దేరాను.

నేరుగా బస్టాండు వెళ్ళి దాచేపల్లి బస్సు ఎక్కాను. అక్కడకి వెళ్ళి ఆ పల్లె గురించి వాకబు చేస్తే.... అక్కడికి బస్సులు లేవు. పల్లెల్లో ఆటోలప్పటికి ఇంత ప్రాచుర్యంలో లేవు. సెవెన్ సీటర్స్ అసలెక్కడా లేవు. ఉదయం ఒకటీ, సాయంత్రం ఒకటీ బస్సు వస్తుందనీ, జట్కా బండ్లు దొరుకుతాయని చెప్పారు.

సర్లెమ్మని జట్కా ఎక్కేసి ఆ పల్లెటూరు చేరాను. వాకబు చేసుకుని సర్పంచి ఇంటికి వెళ్ళాను. అతడు లేడు. దాచేపల్లి వెళ్ళాడట. అతడి భార్యాపిల్లలున్నారు. వాళ్ళతో మాట్లాడుతుండగా అతడొచ్చాడు. సర్పంచి యువకుడే! తండ్రి వారసత్వంగా పదవిలోకి వచ్చినట్లున్నాడు.

ఇక అతడితో వాదన పెట్టుకున్నాను.

“దేశ నాయకులేమైనా వచ్చి.... బాబూ! మా విగ్రహాలు పెట్టండి అని మనల్ని బ్రతిమిలాడారా! మన గౌరవం కొద్దీ మనమే పెట్టుకున్నాం. నిజానికి ‘వాళ్ళు చెప్పింది ఆచరించి చూపించటం’ మనం వాళ్ళకి ఇవ్వగలిగిన అసలైన నివాళి. అది చెయ్యటం లేదు. కనీసం మన గౌరవం మనం చూపుకునేందుకు నెలకొల్పుకున్న విగ్రహాలనైనా గౌరవించాలి కదా! బదులుగా ఇంతగా అవమానించటం ఏమిటి?” అని నిలదీసాను.

అతడు ‘ఊరివాళ్ళు కలిసి రానిదే తనేం చెయ్యలే’నని అన్నాడు. రెండు మూడు గంటల్లో ఊళ్ళో వాళ్ళని పోగేసాడు. వాళ్ళ పంచాయితీ భవనంలో చిన్న సభ లాంటిది ఏర్పాటు చేసాడు. నేను ఓ అరగంట పాటు ఆ ఊరి వాళ్ళని వాయించేసాను.

“““‘చేతనైతే గౌరవం చూపండి. లేకపోతే ఆ విగ్రహాన్ని కూలగొట్టి పారేయండి. లేదా గునపం నా చేతికిస్తే నేనే ముక్కలూ చెక్కలు చేసి పోతా”నన్నాను. “కొంగా, కాకి రెట్టలతో అసహ్యంగా కనబడుతున్న బాపూజీ ముఖం ఎలా చూడగలుగుతున్నారు? కనీసం పేపర్లో ఫోటో తో సహా వార్త వచ్చాకైనా సిగ్గని పించలేదా? ఊరి పరువు పోయిందని కూడా తోచలేదా?” అనేసాను.

వాళ్ళంతా ‘తమది తప్పేనని, కనీసం విగ్రహాన్ని శుభ్రపరిచి, షెల్టర్ కడుతామనీ’ చెప్పారు. వాళ్ళ దగ్గర అలా మాట తీసుకుని వచ్చేసాను. నాపేరూ ఊరూ చెప్పాను. అడ్రసు చెప్పలేదు. మా నాన్నకి తెలిస్తే... తిడతాడని భయపడ్డాను. కాకపోతే మా ఇల్లు మాయాబజార్ దగ్గర అని చెప్పాను.

ఓ పదిహేను రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం.... ఆ ఊరి వాళ్ళు ఓ నలుగురు మా ఇల్లు వెదుక్కుంటూ వచ్చారు. మాయా బజార్ లో వాకబు చేసారట. ముందుగా మా నాన్నని షాపులో కలిసారు. జరిగిన విషయాలన్నీ చెప్పి..... ‘నా ఉపన్యాసం మూలంగా తామెంతో స్ఫూర్తి పొందామనీ, ఊరి బాగుకి నడుం కట్టామనీ, బాపూ విగ్రహానికి షెల్టర్ వేసుకుని చుట్టూ గ్రిల్ పెట్టుకున్నామని’ చెప్పారు. నన్నొకసారి కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నారట. మానాన్న వాళ్ళతో మాట్లాడి పంపించి ఇంటికి వచ్చారు.

నన్ను వివరాలు అడిగేసరికి ముందు భయపడ్డాను. నాన్నకి కోపం వస్తే చదువు మానిపిస్తానంటాడేమోనని నా భయం. నాన్న నన్ను “అలా ఇంట్లో చెప్పకుండా వెళ్ళవచ్చా! తప్పు కదా! ఏదైనా ప్రమాదం ఎదురైతే” అని తిట్టారు. అయితే నేను భయపడినంతగా తిట్టలేదు. తర్వాత అమ్మతో చెబుతూ నన్నెంతో మెచ్చుకుని సంతోషించారు. అది తెలిసినప్పుడు నేనూ చాలా సంతోషపడ్డాను.

అయితే.... ఇందులో కొసమెరుపు ఏమిటంటే.... ‘ఈనాడు పత్రిక’లో ‘బాపూ విగ్రహానికి అవమానం’ అంటూ వార్త వచ్చినప్పుడు పెద్ద అక్షరాలలో శీర్షిక, ఫోటోతో, నాలుగు కాలమ్ ల వార్తాంశం వచ్చింది.

నేను ఆ ఊరికి వెళ్ళి, ఊరివాళ్ళతో వాదన పెట్టుకుని వచ్చిన తర్వాత, ఊరి వాళ్ళు, సర్పంచి, అందరూ కలిసి బాపూ విగ్రహాన్ని సంరక్షించుకుని, కలిసికట్టుగా షెల్టర్ గట్రా నిర్మించుకున్నారన్న వార్తాంశం.... సింగిల్ కాలం x 10 సెం.మీ. వార్తగా చాలా చిన్న శీర్షికతో, అప్రాధాన్య వార్తాగానే కాదు, అనాసక్తికర వార్తగా వ్రాయబడింది.

అందులో ‘ఈనాడు వార్తకు స్పందించిన గుంటూరుకు చెందిన ఓ విద్యార్ధిని, ఫలానా ఊరుని దర్శించి, గాంధీ విగ్రహానికి పట్టిన గతిని చూసి ఆవేదన చెందింది’ అని వ్రాసారు. అప్పటికి ఆ ఊరివాళ్ళు మానాన్నని కలుసుకోలేదు. నేను వార్త చదివి “పోన్లే పెద్దగా ఫోకస్ చెయ్యలేదు. నా పేరు వచ్చినట్లయితే నాన్నకి తెలిసి పోయేది” అనుకొని ఊపిరి పీల్చుకున్నాగానీ.... “నేను ఆవేదన చెందానా? ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోయాను. ఇలా వ్రాసారేమిటి?” అనుకొని ఊరుకున్నాను.

కాని ‘తర్వాత ఊరి వారందరు కలిసి బాపూజీ బొమ్మకి షేల్టర్ నిర్మించుకున్నారు కదా! దానినేందుకు పెద్దగా ఫోకస్ చెయ్యలేదో?’ అప్పుడు నాకర్ధం కాలేదు.

చెడుని పెద్దగా ఫోకస్ చేయటం, మంచిన విస్మరించటం ఈనాడు, మీడియా నిర్వహిస్తున్న కుట్రలో భాగమని అప్పుడు నాకు తెలియదు మరి! అలాగే.... బాపూజీని నిర్లక్ష్యం చెయ్యడం, అవమానించడం వాళ్ళకి గొప్ప వార్తలుగా ఉంటాయి తప్ప, బాపూజీ వంటి నాయకులని గౌరవించడం, వారి నుండి స్ఫూర్తి పొందడం కంటగింపు కలిగిస్తాయి.

అంతగా బాపూజీ అంటే కడుపుమంట ఈ నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ!

ఇక పీవీజీ అంటే మరెంతగా అక్కసో ఇప్పుడందరికీ కనబడుతుందే గదా!

ఎందుకంటే.... బాపూజీ, పీవీజీ.... ఇద్దరూ సహనంతో కుట్రదారుల దౌష్ట్యాన్ని కుటలతనీ బహిర్గతం చేసిన, చేస్తున్న వారే గనక!

వర్తమానంలో పీవీజీ ఆయన సమీకరించిన నెం.5 వర్గం నిజం చేసి చూపిస్తున్న కథే గత టపాలో వివరించింది.

నాడు బాపూజీ సత్యాహింసలతో ‘సత్యాగ్రహ’మనే ఆయుధం చేపట్టి నిజం నిరూపించాడు.

నేడు పీవీజీ, నెం.5 వర్గం సత్యం ధర్మాలతో, ‘గూఢచర్య’మనే ఆయుధం చేపట్టి కుట్రదారుల దోపిడి తీరునీ, నిజ రూపాలనీ నిరూపిస్తున్నారు.

ఆ నాటికి ఈ గూఢచర్యపు ఆనుపానులు భారతీయులకి అంతగా తెలియనందున దోపిడిదారులదే పైచేయి అయ్యి.... అర్ధశతాబ్దం పైగా(ఖచ్చితంగా చెప్పాలంటే దాదాపు శతాబ్దం 1857 నుండి 1947 వరకూ) స్వాతంత్ర సంగ్రామం నడిచింది.

విభజించి పాలించే కూటనీతితో స్వాతంత్ర సమర యోధులని రకరకాల వాదాలతో, వర్గాలుగా చీల్చి, ప్రజలలో మత చిచ్చురగిల్చి, దేశాన్ని ముక్కలు కొట్టగలిగారు.

బాపూజీ తర్వాతి తరం.... సహనాన్ని మరికొంత కాలం భరించలేక పోవటంతో, దేశ విభజనకి అంగీకరించారు. ఫలితంగా..... దేశమంతా స్వాతంత్ర వచ్చిందని పండుగ చేసుకుంటుంటే..... బాపూజీ భారమైన హృదయంతో, కన్నీరు నిండిన కళ్ళతో, బెంగాల్ లో మత కల్లోలాల బాధితులని పరామర్శిస్తూ పరితపించారు.

ఎందుకంటే – అప్పటికి మనం కుట్రదారుల మూల బలం ఏమిటో తెలుసుకోలేక పోయాం.

కాబట్టే – ఇప్పుడు పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం – కుట్రదారుల గూఢచర్య వలయాన్ని, గూఢచర్య స్ట్రాటజీని పూర్తిగా బహిర్గతం చేయటంతో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ‘జంబలకిడి పంబ’నే మనం చూస్తున్నాం.

దీన్ని ‘జంబలకిడి పంబ’గా ఎందుకు పోల్చానంటే..... ఇటీవల కీర్తిశేషుడైన ఈవీవీ సత్యనారాయణ గతంలో తీసిన సినిమా ‘జంబలకిడి పంబ’.

అందులో..... ఆడవాళ్ళు మగవాళ్ళులా, మగవాళ్ళు ఆడవాళ్ళలా, మానసికంగా మారిపోతారు, ఆ ప్రకారమే ప్రవరిస్తారు. సినిమా చివరిలో వాళ్ళంతా మరింత మానసిక ప్రకోపానికి గురై, ఒకరినొకరు బాదుకుంటారు. చివరికి మరణిస్తారని చెప్పబడుతుంది.

ఆ సినిమాలో లాగే..... కుట్రదారులు....

చెడ్డవాళ్ళని మంచి వారుగా,

దొంగలని దొరలుగా,

చెంచాగాళ్ళని గొప్ప నాయకులుగా,

అవినీతి పరులని పరమ నిజాయితీపరులుగా.... చెలామణి చేసారు.

ఇప్పుడంతా బహిర్గతమై, జాతర బొమ్మలు ‘చంపు లేదా ఛస్తావ్’ అన్న స్థితికి గురై, ఒకరినొకరు చావబాదుకోవటంతో అంతా ‘జంజలకిడి పంబ’గానే పరిణమించింది.

అది మన రాష్ట్ర, దేశ రాజకీయుల దగ్గరి నుండి, ప్రపంచ రాజకీయాల దాకా పరిణమించిన పరిస్థితీ!

రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, కాంగ్రెస్, కేసీఆర్ లతో....

దేశంలో భాజపా ఎర్రపార్టీలు, కాంగ్రెస్ తో!

అలాగే ప్రపంచంలో అమెరికా Vs అసాంజే/వీకీలీక్స్,

ముబారక్ లు ‘అమెరికా నమ్మక ద్రోహం చేసింది’ అని ఆరోపిస్తూ.... ఉద్యమాలు ఎదుర్కోంటున్న స్థితిలో బహిర్గతమౌతోంది ఈ జంబలకిడి పంబ పరిస్థితే! ఇప్పటికి దేశం విడిచి పరారయ్యి, కోమాలో కెళ్ళిన ఈజిప్టు నియంత! (ఇతడి గురించి తర్వాత)

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇటీవల సంపుటి 23 సంపాదకీయం లో ప్రచురింపబడిన నా వ్యాసం హిందూస్తానీ సంగీత గాత్ర మాంత్రికుడు భీమ్ సేన్ జోషి గురించి!

భీమ్ సేన్ జోషి!

తరలిపోయిన సంగీత తపస్సంపన్నుడాయన!

కర్ణాటకలో పుట్టి, మహారాష్ట్రలోని పుణేలో స్థిరపడినా, భారత దేశమంతటా విస్తరించిన, సంగీత సామ్రాజ్యమాయనది.

సుడులు తిరుగుతూ ఆయన కంఠంలో వొయ్యారాలు పోయిన సంగీత సరస్వతి, శాస్త్రీయ సంగీతాన్నాస్వాదించే రసజ్ఞులనే గాక, ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ అంటూ సామాన్యులను సైతం అలరించి మంత్రముగ్ధుల్ని చేసింది.

గత నెల 24 వ తేదీన… ‘ఇక ఈ లోకంలో సంగీత కచేరీ చాలు, భగవానుడి సమక్షంలో గీతాలాపన సాగిస్తానంటూ’ సెలవు తీసుకు వెళ్ళిపోయిన ఆ గాన గంధర్వుడికి, సరిగమలతో సురాగాల సరాగాలాడిన ఆ గాత్ర మాంత్రికుడికి, సంపుటి సమర్పిస్తున్న అశృవులతో తడిసిన అక్షరాంజలి ఇది!

ఈ సందర్భంలో…ఆ మహా విద్యాంసుడు సెలవిచ్చిన ఉపదేశాన్ని అవగాహన చేసుకోవటమే అసలైన నివాళి అని చెప్పాలి.

‘ఒకప్పుడు గురువుకు ఎప్పుడు స్ఫూర్తి కలిగితే అప్పుడు సంగీత సాధన, అభ్యాసనా చేసేవాళ్ళు. అప్పుడది రసపూరితంగా ఉంటుంది. ఇప్పుడలా కాదు. నిర్ణీత సమయంలో సంగీతం క్లాసు అంటున్నారు. మూడ్ లేనప్పుడు పాడటం, పాట నేర్పడం కష్టం. అలాగే మూడ్ తో సాగుతున్న సాధన ఆపడం అంతకంటే కష్టం’ అంటారు భీమ్సేన్ జోషి.

నిజంగా ఎంతో లోతైన విషయం ఇది.

సంగీతాన్ని నేర్చుకోవాలనే అభిలాష గల ఉత్సాహులు

గురువు ఇంట, గురువు వెంట ఉంటూ…

ఉదయ భానుడి లేలేత కిరణాలకు కుహు కుహు కూజితాలు పలికించే పిక శుకాలను చూచి పరవశించిన రససాధన తోనో…

ప్రచండ భానుడి ఎర్రెర్రని ఎండకి, రివ్వున వీచే గాలి స్పర్శకి పులకరించిన రసావేశం తోనో

చల్లని వెన్నెలలో, విరిసి మెరిసే మల్లెల మధుర పరిమళాలకు మనస్సు కరిగి ప్రవహించిన రసాస్వాదన తోనో

గురువు గానం చేస్తే…అభ్యాసం సాగించే శిష్యులు!

అప్పుడా సాధనలో సరస్వతీదేవి సజీవ స్వరూపం ఉంటుంది.

అలాగ్గాక…‘త్రీ టు ఫోర్, ఫోర్ టూ ఫైవ్, వీక్లీ ట్వైస్ క్లాసు’ల్లో… తమకు ఇష్టత ఉన్నా లేకపోయినా, క్లాసుకు హాజరయ్యే గురుశిష్యులిద్దరిలోనూ… యాంత్రికత తప్ప ‘భావన’ మిగిలి ఉండగలదా?

ఉత్సాహం ఉరిమేవేళ…ఉరికి వచ్చే హృదయగానంలో…ఉవ్వెత్తున ఎగసి పడే కడలి తరంగపు దుడుకుంటుంది.

విషాదం విరుచుకు పడినప్పుడు, ఆ గానంలో ఎడారిలోని ఇసుక తుఫాను హోరు మోగుతుంది.

భావంతో మిళితమైన కళలో జీవం ఉంటుంది.

ఈ సందర్భంలో చిన్న కథ చెబుతాను. డాక్టర్ మహీధర నళినీ మోహన్ గారి బాలగేయానికి అక్షర రూపం ఇది.

అనగా అనగా…

ఓ పిల్లి. కోకిల కంఠం తీయంగా ఉంటుందని లోకులనగా చాలాసార్లు విని ఉంది.

ఓసారి మావి గుబురుల్లో మత్తుగా పాడుతున్న కోయిల, ఆ పారవశ్యంలో పిల్లి దాడిని గమనించలేదు.

గబుక్కున కోకిల పీకని దొరక బుచ్చుకుంది పిల్లి.

“పాడు” అంది అధికార యుక్తంగా.

“కూ కూ” అంది కోయిల. చావుభయంతో దాని గొంతు ‘కీచు కీచు’ మంది.

“ఛీ! ఇలా కాదు. నీ గొంతు తియ్యగా ఉంటుందంటారందరూ. అలా పాడు” అంది పిల్లి శాసిస్తున్నట్లుగా.

మరోసారి ‘కూ కూ’ అంది కోయిల. అయినా అది కీచుమన్నట్లుగానే ఉంది.

“ఛస్! ఈ పాటి దానికి అందరూ కోయిల గొంతుని పొగుడుతారెందుకు? ఇంత కంటే నా పిల్లికూనల ‘మియ్యావ్’ మనే చిరు అరుపులే ఇంకా బాగుంటాయి. అనవసరంగా అందరూ కోయిలని పొగుడుతున్నారు” అనుకుంది పిల్లి.

దాంతో కసుక్కున కోయిల పీక కొరికి చంపేసింది. నింపాదిగా కోయిలని చీల్చుకు తింది.

“నిజంగా కోయిల గొంతు తీపే! చాలా రుచిగా ఉంది సుమా!” అనుకుంది తృప్తిగా నోరు నాలుకతో తుడుచుకుంటూ!

ఇదీ కథ!

ఆకాశం మేఘావృతమై, వానగాలి వీస్తున్నప్పుడు, పురి విప్పి నాట్యం చేసే నెమలిని… పంజరంలో పెట్టేసి, చేతిలో బెత్తం పట్టుకుని నాట్యం చేయమంటే ఎలా ఉంటుంది?

బలవంతంగా కళాభినివేశం అంటే ఇలాగే ఉంటుంది మరి!

ప్రాణమున్న శరీరం చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎంత అందంగా ఉన్నా, విలువైన పట్టు పుట్టాలూ, నగానట్రాలూ అలంకరించినా… బొమ్మ చైతన్యాన్ని చూపించదు.

ఈ రెండింటికీ ఎంత వ్యత్యాసం ఉందో… భావుకతకీ, యాంత్రికతకీ అంత వ్యత్యాసం ఉంది.

భావం మిళితం కాని కళ, సరైన ప్రయోజనాన్ని చేకూర్చలేదు. అందుకే మన పెద్దలు… విద్య… గురుకులాల్లో, గురువుకు అనుగ్రహం కలిగినప్పుడు, శోధించగలదిగా ఉండే విధంగా తీర్చిదిద్దారేమో ననిపిస్తుంది. నిరంతరం గురువు అనుగ్రహం కోసం వేచిచూస్తూ, విద్యాదానం కోసం పాత్రత పెంచుకునే శ్రద్ధతో…శిష్యులు! శిష్యుల వినయం, శ్రద్ధా భక్తులని బట్టి, వాత్సల్యంతో విద్యాబోధన చేసే నిబద్ధతతో గురువులు!

పరస్పర అనుసంధానంతో, సరస్వతీ కటాక్షంతో, సాధన చేసే గురుశిష్యులు! అది ఏ కళ అయినా సరే! ఉపనిషద్విద్యలైనా అనుభవించనిదే అవగాహన కాని జ్ఞానరూపాలే! అందుకే… ‘యాంత్రికతని లోపించి, భావించడాన్ని మేళవించి’ మన విద్యావిధానాన్ని గురుకులాలుగా మలిచి ఉంటారు ఆనాటి ఋషులు!

ఆ విషయాన్ని ఎత్తి చూపుతూ, భీమ్సేన్ జోషి చెప్పిన మాట… ఆలోచించి, అర్ధం చేసుకుని, ఆచరణలో పెట్టాల్సిన నిండు నిజం వంటిది.

ఆ మహా సంగీత విద్వాంసుడి నుండి గ్రహించాల్సిన నిజం మరొకటుంది. భీమ్సేన్ జోషిని ‘ఆధునిక తాన్ సేన్’ గా అభివర్ణించి సత్కరించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిజానికి ‘తాన్ సేన్’ అక్బర్ ఆస్థానంలో ‘రాజ రంజితం’గా గానం చేసిన వాడు.

అన్నమయ్య, త్యాగయ్య, సంత్ హరిదాస్ ల వంటి మహానుభావులు తమ కళని భగవంతునికి అంకితం చేసి ‘దైవరంజితం’గా గానం చేసారు.

తాన్ సేన్ గురువైన సంత్ హరిదాస్ గానం వినాలని కోరుకున్న అక్బరుకి ‘ఆయన బృందావనం వీడి రాడనీ, ప్రభు సమక్షాలలో పాడడనీ’ చెప్పాడట తాన్ సేన్. దాంతో అక్బర్, తాన్ సేన్ శిష్యునిలా వేషం వేసుకుని, తాన్ సేన్ వెంట బృందావనం వెళ్ళి, సంత్ హరిదాస్ ని గానం విని పరవశించి వచ్చాడట.

ఈ కథలో నిజమెంతో తెలియదు గానీ…తమ కళని భగవంతునికి అంకితం చేసిన వారి కళ, కమనీయమై, అజరామరమై, శతాబ్దాలు గడిచినా శాశ్వతమై, నిలిచి ఉంటుందన్నది మాత్రం యదార్ధం.

గీత, కర్మయోగంలో ఓ శ్లోకం ఉంటుంది.

శ్లోకం:
ఇష్టా భోగా హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః
తైర్దత్తా స ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేస ఏవ సః

భావం:
మీరు చేసే యాగాల వల్ల దేవతలు తృప్తి వొంది మీ కోరికలను తీరుస్తారు. వారిచ్చిన ద్రవ్యాలను వారికి నివేదించకుండా భోగించే వాడు చోరుడే అవుతాడు.

ప్రకృతిలో మనకు లభ్యమయ్యే వస్తువులే కాదు, భగవంతుడు మనకు అనుగ్రహించిన నైపుణ్యాలూ, కళలూ కూడా భగవంతునికి అంకితం చేయవలసినవే! భగవదంకితమైన కవిత్వం, పోతన ‘భాగవత’ రూపమై, ప్రజల మనస్సుల్లో నాలుకల పైన నిలిచింది. రాజుల కంకితమైన కవిత్వం శ్రీనాధుడి ‘శృంగార నైషధమై’ చివరికి పక్షుల తినిపోయిన ‘తిలలు పెసలు’గా చరిత్రలో మిగిలిపోయింది.

ఎందరు రాజుల ఆస్థానాల్లో… ఎందరు రాజాస్థాన సంగీత విద్వాంసులు… ఆనాటికి వైభవోపేతంగా, పేరు ప్రతిష్ఠలతో వెలిగిపోయారో! వారి జాడైనా ప్రజలకు గుర్తుండదు, చరిత్ర పాఠ్యాంశ పఠనాసక్తులకి తప్ప!

‘రాచ కీటకాలని పొగడనని’ తెగేసి చెప్పిన అన్నమయ్యలూ, త్యాగయ్యలూ, పోతన్నలూ మాత్రం, ప్రజల గుండెల్లో నిలిచి పోయారు.

ఎందుకంటే – వాళ్ళు భగవంతుడు తమకి అనుగ్రహించిన నైపుణ్యాలని, కళాభినివేశాలనీ భగవంతుడికే అంకితం చేసి ‘జనరంజకం’ చేసారు గనుక!

ఆ దారిలోనే ప్రయాణించిన మరికొందరిలో… భీమ్సేన్ జోషి కూడా ఒకరు!

ఇంట్లో మనం వండుకున్నా రాని రుచి, మాధుర్యం…దేవుడి ప్రసాదమైన పులిహోర, పొంగళి, లడ్డుల్లో లభిస్తుంది.

ఆ తీయదనం వంటలో ఉండదు, భగవంతుని కిచ్చిన నివేదనలో ఉంటుంది.

అలాంటిదే భగవంతుడికి నివేదించ బడిన సంగీతం కూడా!

ఆ మాధుర్యాన్ని ఆస్వాదించగలమే గానీ, అభివర్ణించలేం.

పాప్, జాజ్… అంటూ హోరెత్తుతున్న నేటి రోజుల్లో కూడా, భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని హిమాలయాలంత ఎత్తుల్లో, హిందూ మహా సాగర్ తరంగాలంత చైతన్యంతో నిలిపిన భీమ్సేన్ జోషి… సంగీత సత్యదర్శి.

శ్రోతల చెవుల్లో నిత్యం నిలిచి ఉండే ‘మిలే సుర్ మేరా తుమ్హారా’… గాలి అలల్లో పూల వాసనల్లో… అలా, ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

భారతంలో... ద్రౌపదీ ధర్మరాజుల సంభాషణలో ‘క్రోధం, సహనం... ఎంత మేరకు ఉండాలో’ చర్చింపబడుతుంది. మనకీ జీవితంలో, ఎన్నోసార్లు ఇలాంటి కీలక సంఘటనలు ఎదురౌతాయి. ఎంత వరకూ శాంతంగా, సహనంగా భరించాలో, ఏ మేరకు ప్రతిఘటించాలో, ఒక పట్టాన తేల్చుకోలేం.

ఇక్కడ ధర్మరాజు చెప్పిన ఒకమాట చూడండి. ‘అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి చేసేలోగా తమకు, ఎందరో మిత్రులు సమకూరుతారు’ అంటాడు.

ఇందులోనే నిగూఢమైన అంశం ఉంది. ధర్మరాజుకీ, పాండవులకీ మిత్రులుండవచ్చు. అలాగే దుర్యోధనుడికీ కౌరవులకీ కూడా మిత్రులుండవచ్చు. రాజులకి రాజులైన మిత్రులుండటం ఇక్కడ విషయం కాదు. ప్రజలూ మిత్రులుగా ఉండాలి.

మరోమాటగా చెప్పాలంటే ప్రజా బాహుళ్యం నుండి సంపూర్ణ సహకారం, సానుకూలత కావాలి. దాన్నే ప్రజామైత్రి అనవచ్చు. అందుకు సహనంగా వేచి ఉండాలి. ఎందుకంటే – దుష్టుల దౌష్ట్యం ప్రజలకు బహిరంగ పడాలంటే, అవగాహనకు రావాలంటే, సహనం చూపక తప్పదు. అప్పుడే ప్రజామైత్రీ, సహకారం లభిస్తాయి.

పాండవులని వారణావతానికి పంపి అక్కడ లక్క ఇంటిలో సజీవ దహనం చేయాలని ప్రణాళిక పన్నినప్పుడు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ‘పాండవుల పరోక్షంలో తాను ప్రజలకి దానధర్మాలు చేసి, వారిని తనవైపు తిప్పుకుంటాను’ అని చెబుతాడు.

పాండవులు తమ నడవడితో ప్రజామన్నన పొందారు. దాన్నుండి ప్రజల మనస్సు మళ్ళించి, తనవైపు తిప్పుకునేందుకు ‘దానధర్మాలని’ మార్గంగా ఎంచుకున్నాడు దుర్యోధనుడు. ఈనాటి సంక్షేమ పధకాలు, ఉచిత వరాల కార్యక్రమాలు, ఓట్ల నాకర్షించేందుకు నిర్వహించే ప్రజాకర్షక పథకాలు... ఆనాటి దానధర్మాలకు ప్రతిరూపాలే!

బోరింగు పంపుతో, జలాలు పైకి లాగాలంటే – ముందుగా అందులో ఓ రెండు చెంబులు నీళ్ళు పోయాలి. తర్వాత మనం ఎన్ని బకెట్ల నీటినైనా లాక్కోవచ్చు. అదే విధంగా... దుర్యోధనుడు దానధర్మాలు చేసినా, ఇప్పటి పాలకులు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినా.... తదుపరి ప్రజా దోపిడి యధాతధం. అధర్మ పరిపాలనా యధాతధం!

పర్యవసానంగా తమ బ్రతుకులు తగల బడుతున్నప్పుడైనా, ప్రజలకి ఒక కనువిప్ప కలుగుతుంది. నిజానిజాలు అర్ధమౌతాయి.

భారత గాధలో అయితే...అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తిచేసి ఒప్పందం ప్రకారం తమ రాజ్యం తమకిమ్మని, ముందు రాయబారుల్ని పంపి శాంతంగా అడిగారు పాండవులు. దుర్యోధనుడు కాదన్నాకే యుద్ధానికి దిగారు. అలాగే... అరణ్య అజ్ఞాత వాస కాలాన్ని సహనంగా గడిపారు. దాంతో ఘోష యాత్ర వంటి సంఘటనలతో, కౌరవులు దౌష్ట్యం మరింతగా తేటతెల్లమయ్యింది. ప్రజాభిప్రాయమూ, ఋషుల అభిమతమూ పాండవ విజయం అయ్యేటంతగా, ప్రజామైత్రి పాండవులకి సమకూరింది.

నాడైనా, నేడైనా ప్రజా సహకారం, ప్రభుత్వం నడిపేవారికి తప్పనిసరిగా అవసరం. సైనిక బలంతో ప్రజల మీద పెత్తనం చలాయించ వచ్చుగాక! పన్నులు సమీకరించి ధన సంపాదన చెయ్యాలన్నా, ప్రజలు కష్టించి సంపద సృష్టిస్తేనే అది సాధ్యమౌతుంది. అది పంటలు పండించడం కావచ్చు, వస్తూత్పత్తి చేయటం కావచ్చు, సేవలు అందించటం కావచ్చు. ప్రజలు సహకరిస్తేనే, సహాయ పడితేనే... (అది తెలిసి చేసినా, తెలియక చేసినా, ఎదిరించలేక చేసినా) పాలకులు సంపదని పొందగలుగుతారు.

[కాబట్టే – బాపూజీ సహాయ నిరాకరణని ఉద్యమంగా చేపడితే, బ్రిటీషు ప్రభుత్వానికి జవసత్వాలు జావగారి పోయాయి.]

ఆ విధంగా ప్రజామైత్రి సంపాదించాలంటే – ప్రజలకి అవగాహన కలగటం అవసరం. అందుకే సహనంగా వేచి ఉన్నాడు ధర్మరాజు.

దీనిని ఈనాటి కాలానికి సరిపోల్చే ఓ చిన్న కథ చెబుతాను.

ఒక పళ్ళ వ్యాపారి ఉన్నాడు. చిన్నబండి మీద ఆపిల్ పళ్ళమ్ముకునే చిరువ్యాపారి అతడు. కష్టించి పండించిన రైతు దగ్గర, సరైన ఖరీదిచ్చి, నాణ్యమైన పళ్ళు తెచ్చి అమ్ముకునే వాడు.

అతడి దగ్గరికి ఓ సఫారీ సూటూ వేసుకునే ఘరానా పెద్దమనిషి పళ్ళు కొనేందుకు వచ్చేవాడు. అయితే వ్యాపారి బేరాల్లో తలమునకలై ఉన్నప్పుడు చల్లగా నాలుగు పళ్ళు తస్కరించి జేబులో వేసుకుని వెళ్ళిపోతుండేవాడు.

అంత సఫారీ సూటూ వేసుకున్న డబ్బున్న ఆసామీ, తన వంటి పేదవాడి దగ్గర పళ్ళు దొంగిలిస్తాడని ఊహించని పళ్ళ వ్యాపారి, ‘అతడికి తన పళ్ళు నచ్చలేదో, తాను ఇతర కొనుగోలుదారులతో హడావుడీగా ఉన్నందున కొనకుండానే వెళ్ళిపోయాడో లేక మరో కారణమో’ అనుకునే వాడు.

కొన్నాళ్ళకి అతడికి అనుమానం వచ్చింది, ఈ పెద్ద మనిషి, తన పనిలో తానుండగా మెల్లిగా తన పళ్ళు దొంగిలించుకు పోతున్నాడని. నిఘాపెట్టి గమనించాడు. నిజమని తేలింది. కోపం, ఆక్రోశం కలిగాయి. తన వంటి చిన్న వ్యాపారీ, పేదవాడి కష్టం దొంగిలిస్తున్న ఆ సఫారీ సూటు ఆసామిని తలుచుకోగానే, కడుపు రగిలి పోయింది. రక్తం మరిగి పోయింది. ఏం చేయటం?

గట్టిగా అరిచి నిలదీస్తే, అతడు తననే నిందిస్తాడు. ఎదురు తన మీదే ఏవో నేరాలు బనాయిస్తాడు. కాబట్టి ఏది చేసినా జాగ్రత్తగా చేయాలి. దొంగని పట్టుకుని నేరం ఋజువు చేయాలి. తగిన శిక్ష విధించాలి. ఎలా?

పళ్ళ వ్యాపారి, తనలాంటి మరికొందరికి విషయం చెప్పాడు. అందరూ ఈ సఫారీ సూటు ఆసామి వ్యవహారాల మీద కన్ను పెట్టారు. ఒక్క పళ్ళ వ్యాపారి దగ్గరే గాక, ఆ సఫారీ సూటు ఆసామి, తమ లాంటి చిల్లర వ్యాపారుల దగ్గర దొంగవాటం చాలానే చూపిస్తున్నాడని అర్ధమయింది. దాంతో శాంతంగా ఆలోచించారు. సహనంగా వేచి ఉన్నారు.

ధనికుడు యధాప్రకారం పళ్ళ వ్యాపారి దగ్గరి కొచ్చాడు. వ్యాపారి యధాప్రకారం బేరాల హడావుడీలో ఉన్నాడు. అయితే ఓ కన్ను ఈ సఫారీ సూటు దొరబాబు మీద వేసి ఉన్నాడు.

సఫారీ ఆసామీ పళ్ళ నాణ్యత పరిక్షిస్తున్నట్లు నటించి, ఆ పండు ఈ పండూ కెలికాడు. మెల్లిగా నాలుగు పళ్ళు జేబులో వేసుకున్నాడు. ఆ క్షణమే పళ్ళ వ్యాపారి ఆ సఫారీ ఆసామీ చెయ్యి పట్టుకుని ‘దొంగా దొంగా’ అని అరవలేదు.

అలాగంటే... సఫారీ సూట్ పెద్దమనిషి “నోరు ముయ్యవోయ్! నేను పళ్ళు కొనుక్కుందామని వచ్చాను. ఇవి నచ్చాయి. తీసుకున్నాను. ఇదిగో డబ్బు” అనవచ్చు.

“మరి బేరం ఆడకుండా తీసుకున్నావేం?” అంటే...

“నీలాంటి పేదవాడితో కూడా ఏం బేరం ఆడతాన్లే అనుకొని నువ్వడిగినంతా ఇద్దామనుకునే పళ్ళు తీసుకున్నాను” అనగలడు.

“నాకు చూపించి తీసుకోవద్దా?” అంటే...

“ఇవేమన్నా బంగారమా? ఈపాటి దానికి నేను అబద్దం ఆడతానా? దొంగతనం చేస్తానా? నువ్వెటు బేరాల హడావుడీలో ఉన్నావు. ‘సరే! ఏం పోయింది’ అనుకున్నాను... నాకు సమయం ఎక్కువ లేదు. అందుకే ముందు పళ్ళు జేబులో వేసుకుని డబ్బులిద్దాం అనుకున్నాను. నేను డబ్బు తీసి ఇచ్చేలోగానే గోల చేస్తున్నావే! అసలేమను కున్నావ్ నా గురించి? నా ఇంటి కుక్కకు పెట్టేంత ఖర్చు కాదు నీ బండి మీద సరుకంతా కలిపినా? అలాంటిది నన్ను ‘దొంగా దొంగా’ అంటూ నా పరువు తీస్తావా? చూడు నిన్నేం చేస్తానో! నీ మీద ఫిర్యాదు చేస్తాను” అని ధుమ ధుమ లాడగలడు.

ఇక అలాంటి చోట “నువ్వు రోజూ నా బండి మీద పళ్ళు దొంగతనం చేసావు?’ అని ఎలాగన గలడు ఈ పళ్ళ వ్యాపారి? అంటే మాత్రం ఆ సఫారీ సూట్ పెద్దమనిషి ఊరుకుంటాడా?

“నిజంగా నేను రోజు నీ బండి మీద పళ్ళే దొంగతనం చేస్తూ ఉంటే, అప్పుడే పట్టుకోలేక పోయావా?” అంటూ ‘లా పాయింట్’ లేవనెత్తు తాడు.

అంతటితో ఊరుకోనూ ఊరుకోడు. ఒంటరిగా ఎదిరించిన పళ్ళ వ్యాపారిని వేధించగలడు. అధికారం ఉంటే ఏవో నిందలు వేసి శిక్షించనూ ప్రయత్నిస్తాడు. అందుకోసం కూడా పళ్ళ వ్యాపారి, ఆ సఫారీ సూటు ఆసామి చేతిలో తనలాగే దోపిడికీ, మోసానికీ గురవుతున్న ఇతరులని సమీకరించుకున్నాడు.

అందుకే ఈ పళ్ళ వ్యాపారి ఆ సఫారీ సూటు ఆసామిని చెయ్యి పట్టుకుని ‘దొంగా దొరికావ్’ అన లేదు. వేచి ఉన్నాడు. ఆ ఆసామి చేతివాటాన్ని ఏమాత్రం ఆటంకపరచ లేదు.

ఆసామి పళ్ళు జేబులో వేసుకున్నాక కూడా పళ్ళ వ్యాపారి మౌనంగా వేచి ఉన్నాడు. అతడు రెండడుగులు వేసాక కూడా, వ్యాపారి ఏమీ అనలేదు. ఎందుకంటే - “అయ్యా! ఏమిటీ పని?” అంటే ఆ ఆసామి “అరే! మరిచిపోయాను సుమా!” అంటూ పరమ నిజాయితీ పరుడూ, మతిమరుపు మహారాజులాగా ఫోజు పెట్టి, ఆ నాటికి పైసలిచ్చేస్తాడు. మరోసారికి మరింత పకడ్బందీగా పళ్ళు కొట్టేస్తాడు.

అందుచేత కూడా పళ్ళ వ్యాపారి సహనంగా వేచి ఉన్నాడు. అతడితో పాటు అతడి ఇతర మిత్రులూ వేచి ఉన్నారు. ఆ ఆసామి తర్వాత మరో బండి దగ్గరికి పోయాడు. అక్కడా, ఇక్కడా చేతివాటం చూపించి, నచ్చిన వాటిని జేబులో వేసుకుని వెనుదిరిగాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని వ్యాపారులు ఆ బళ్ళ దగ్గరికి వచ్చిన ఇతర కొనుగోలు దారులకి కూడా చూపించారు.

దాంతో, ఇలా దొంగతనం చేసి సఫారీ సూటు ఆసామీ ఇంటి దారి పట్టేందుకు పది గజాలు నడిచాక, ఈ సామాన్య వ్యాపారులంతా ఆ సఫారీ సూటు పెద్ద మనిషిని పట్టుకుని ఆపారు. దొంగతనం గురించి నిలదీసారు.

జేబులో సరుకులతో దొరికి పోయిన ఆ ఆసామి, ముందు బుకాయించ చూసాడు. కానీ ఒకరి దగ్గర కాదు, నలుగురి దగ్గరా డబ్బివ్వటం మరిచి పోయానంటే... యధాలాపంగా వస్తువులు జేబులో వేసుకున్నానంతే అంటే... దూడ గడ్డి కోసం తాటి చెట్టు ఎక్కానన్నట్లే ఉంది.

వ్యాపారుల ఆ ఆసామి నిర్వాకం మధ్యలో ఉండగా పట్టుకుని ఉంటే – అతడికి విషయాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ద్వంద్వ వాదం ఏదైనా దొరికి ఉండేది. కానీ వ్యాపారులు సహనంగా ఆ సూట్ పెద్దమనిషిని దొంగతనం పూర్తి అయ్యేదాకా వేచి ఉండటంతో, పైకారణంగా చెప్పుకునేందుకు ఏ వాదమూ మిగల కుండా పోయింది. ఆ విధంగా ఆ ఆసామి నేరాలు, అక్రమాలు, అవినీతి... ‘ప్రయత్నపూర్వకం, యాదృచ్చికం లేదా పొరపాటు’ అనే ద్వంద్వం దాటిపోయి, సంపూర్ణ సత్యం బహిర్గత మయ్యింది.
ఇలా... సహనంగా వేచి ఉండి, దొంగని పట్టుకున్నాక... అప్పటి దాకా దగా పడిన ఆ సామాన్యులు, అతణ్ణి, సూటూ బూటూ విప్పించి, విరగదన్ని తరిమారు.

ఇదీ కథ!

ఇది కొత్త కథ కాదు. గతంలో బాపూజీ బ్రిటీషు వాళ్ళ హయాంలో నిజం చేసిన చూపించిన కథ!

వర్తమానంలో పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం నిజం చేసి చూపిస్తున్న కథ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

అరణ్యవాస క్లేశాలు పడలేక, బాధతో చేసిన వాదనలే భీముడివీ, ద్రౌపదివీ! ధర్మాచరణలో కష్టాలు ఓర్చలేనప్పుడు, సహనంగా వేచి ఉండలేనప్పుడు… చేసే వాదనలు అవి!

‘సత్యమూ, ధర్మమూ, శాంతమూ, సహనమూ తొక్కా తోలూ’ అంటూ, ధర్మపన్నాలు చెబుతూ కూర్చుంటే…జీవితం నాశనమౌతుంది. చచ్చేదాకా ఇదే బాధల బ్రతుకు తప్ప సాధించేదేమీ ఉండదు. బ్రతుకంతా ఇలా కునారిల్లి పోవల్సిందే! అంతే! – ఇలాంటి వాదనలు వింటూ ఉంటాం, అంటూ ఉంటాం.

అదే భీమసేనుడూ, ద్రౌపదీదేవీ కూడా అన్నారు.

చూడండి, భీమసేనుడేమన్నాడో…

“మహారాజా! మీరు మరణధర్మం గల మానవులు కాలపాశ బంధితులు. ముగ్గిన పండులా, నీటి బుడగలా, కాలం కూడా నిలబడేది కాదు. జలపాత వేగంతో పోయే కాలాన్ని వృధా చేసి… సమయ, సావకాశాల కోసం నిరీక్షించి, సంధి చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. ఆ కాలం అతి సన్నిహితంగా ఉందని మీరు భావిస్తున్నారు. కంటికి పెట్టుకోవటానికి చేతి మీదికి తీసే కాటుకలా, కాలం హరించిపోతూ ఉంటుంది. ఆయుర్ధాయం క్షీణిస్తుంది. క్షణభంగురమైన జీవితం గల మానవప్రాణి, సమయ నిరీక్షణ చేయడం అర్ధరహితంగా కనిపిస్తోంది.

పదమూడు సంవత్సరాలు నిరీక్షిస్తూ కూర్చుంటే… మృత్యువు మన గుమ్మం ముందు కూర్చుంటుంది. అసలు మృత్యువు దేహధారుల శరీరంలోనే తిష్ఠ వేసుకొని ఉంటుంది. దాని నోట్లో మనం పడకుండానే, మన రాజ్యం మనం సాధించుకోవాలి. తమ శక్తిని అణచి పెట్టుకుని ఉండేవాడు, భువికి భారభూతుడే. శత్రువులను హింసించనివాడు ఎద్దులా బాధలు పడుతూండవలసిందే!” – ఇదీ భీమసేనుడు వినిపించిన వాదన.

అంతేకాదు “మనం… నీతి ధర్మం, సత్యం అని కూర్చున్నంత మాత్రాన, ఎదుటి వాడు చూస్తూ ఊరుకోడు, బుద్దీ తెచ్చుకోడు. అలాంటప్పుడు, మనం సహనం చూపించి ప్రయోజనం ఏమిటి?” – ఈ వాదనా మనం వింటూ, అంటూ ఉంటాం.
ఇదే భీముడూ, ద్రౌపదీ ధర్మరాజుతో అన్నారు.

భీముడంటున్నాడు “ఈ భూమండలంలోని రాజులందరినీ మనం ఓడించాం. దుర్యోధనుడిని ఆశ్రయించి ఇప్పుడు వారందరూ ఉంటున్నారు. అటువంటి వారు, మనని ఆదరించి ఆశ్రయమిస్తారనుకోవటం శుద్ధ భ్రమ. పైగా వారే మన జాడ తెలుసుకుని, దుర్యోధనునికి తెలియజేయడానికి ప్రయత్నిస్తారు.

ఇప్పటికి పదమూడు మాసాలు గడిచాయి. మనం గడపవలసిన సంవత్సరాలు పదమూడు. మానవులు మాసాన్ని సంవత్సరానికి ప్రతినిధిగా గ్రహిస్తారు. యాగాలలో ‘పూతిక’ను, సోమలతకు ప్రతిగా గ్రహించేటట్లు… ఈ పదమూడు మాసాలనే పదమూడు సంవత్సరాలుగా మనం పరిగణించవచ్చు. బరువు మోసే ఎద్దుకు కొరడా దెబ్బలు తప్పనట్లు, మీరు ఎన్ని కష్టాలు పడి మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నా, మీకు లభించే ప్రయోజనమేమీ లేదు. యుద్ధానికి మించిన క్షత్రియ ధర్మం లేదు. కనుక దుర్యోధనాదులపై ప్రతీకార చర్యకు యిప్పుడే కంకణం కట్టండి” అన్నాడు.

[ఇక్కడ భీముడు అన్నట్లే, చివరికి యుద్ధం చేయక తప్పలేదు. కాని, ధర్మరాజు చెప్పినట్లు… ధర్మం పాటించడం వలన, కౌరవుల దుష్టబుద్ది, దుష్టచేష్టలు దృష్టాంతపూరితంగా బహిర్గతం అయ్యాయి. కాలగతిలో ఎవరికి సత్యం, ధర్మం పట్ల నమ్మకం ఉందో, ఎవరు అసత్యం, అధర్మం వెంట పరుగులెత్తారో బహిర్గతం అయ్యింది. ఆ విధంగా చెడు నిర్మూలించబడింది.]

మనం ఓరిమి వహించినా… ఎదుటి వాడు, చెడు తల పెట్టడం మానడు, చెరుపు చేయటం ఆపడు. కాబట్టి మనమూ అదే దారి తొక్కుదాం – అనడమే ఇది.

ఎందుకంటే – అరణ్యవాస కష్టాలు తక్కువేం కాదు. మనం సినిమాలలో చూసినట్లు అమాంతం ఆశ్రమసెట్టింగు (ఎత్నిక్ హోటల్ కి లాగా) ఆకాశం నుండి ఊడిపడదు.

రాజులను జయించిన చేతులతో…

సిరిసంపదలను దానం చేయటం దగ్గరి నుండీ ఆస్వాదించిన చేతులతో…

వెదుళ్ళు కొట్టుకొని, కుటీరాలు నిర్మించుకోవలసిందే!

ఆ పరిస్థితి రావటమంటే భోగభాగ్యాల నుండి పరమ దారిద్ర్యానికి రావటమే!

‘సూర్యభగవాను డనుగ్రహించిన అక్షయ పాత్ర ఉండగా పాండవులేం కష్టపడ్డారు?’ – అనుకుంటూ ఉంటాం. ఆ కథ ప్రక్షిప్తం (అంటే తర్వాత చేర్చబడింది) అని ఓ వాదన ఉంది. వనవాస కాలంలో… కొంత కాలం తర్వాత, ధర్మరాజు సూర్యుని అర్చించి అక్షయ పాత్ర పొందాడనీ, అంతకు పూర్వం కందమూలాలే భక్షించారనీ ఓ వాదన ఉంది.

ఏదేమైనా… వనవాస క్లేశం, రాజమందిరాల్లో దాసదాసీ జన సేవలూ, హంసతూలికా తల్పాలూ, మృష్టాన్న భోజనాలు, చందన కర్పూరాది సైత్యోపచారాలు, మధుర ఫల రసాస్వాదనలూ ఉండే, నగర జీవన సౌఖ్యాలు అనుభవించే వారి పాలిట, ఎంత దుర్భరమో ఊహించవలసిందే!

ఏసీ లోంచి ఓ నిముషం బయటకు రాగానే… ‘హుష్! బాబోయ్!’ అని తపన పడే సందర్భంలో, రాజప్రాసాదం నుండి పర్ణశాలకు పర్యవసించిన జీవన కాఠిన్యం, కొంత అర్ధమౌతుంది.

అంత బాధనీ అనుభవిస్తున్నారు పాండవులు! అందునా అరణ్యవాసంలో ఒకే చోట స్థిరనివాసం వారికి కూడనిది. వ్యాసుడు ధర్మరాజుకి ఏమని బోధించాడో చూడండి.

“మీరు ఈ వనం వదిలి, మరోవనానికి వెళ్ళండి. మీరు ఒకేచోట ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. కొందరు మునులకు తపోవిఘ్నం కలిగి, వారికి ఆగ్రహం కలిగించిన వారవుతారు. ఇక్కడి కౄరమృగాలను సంహరించి ప్రశాంతత ఏర్పరచారు. విద్వాంసులైన విప్రులను పోషిస్తున్నారు. మీ అగ్ని కార్యాలలో యిక్కడి ఓషదులు క్షయమై పోతున్నాయి. త్వరగా వాసస్థలం మార్చాలి” అని పలికి ప్రతిస్మృతి ఉపదేశించి అదృశ్యమయ్యాడు.

[అంటే ఒకే చోట స్థిర నివాసం ఏర్పరుచుకోవటానికి వీలు లేదు. అనివార్యంగా రక రకాల ప్రదేశాలు మారవలసిందే!]

ఇలా… కాల పరిమితులతో నివాస స్థలాలు మారుస్తూ… పాండవులు చేసిన అరణ్యవాసం ఎంత బాధ, ప్రయాసల మయమో
మచ్చుకి ఈ సంఘటన చూడండి.

రోమశ మహర్షి మార్గదర్శకత్వంలో పాండవులు తీర్ధయాత్ర సాగించారు. వాతాపిని జీర్ణించుకున్న అగస్త్యాశ్రమ ప్రాంగణాన్ని దర్శించారు. ఆయా ప్రదేశాల కథలు తెలుసుకుంటూ, ఋష్యశృంగాశ్రమం, పరశురాముని క్షత్రియ సంహార గాధ, సుకన్యా చ్యవనుల ప్రణయ గాధ… ఇలా తెలుసుకుంటూ, దర్శించుకుంటూ… గంధమాదన పర్వతం వైపు ప్రయాణం సాగించారు.

కంటక, శిలామయ మార్గంలో నడిచి, నడిచి, అలసిన ద్రౌపదీదేవి, నడికట్టున చేతులుంచి నాలుగడుగులు వేసి కూలబడింది. అది చూసి భీమసేనుడు ఆమెను రెండు చేతులతో ఒడిలోకి తీసుకున్నాడు. ధర్మరాజు కంట తడి పెట్టి, ముఖాన చల్లని నీరు చిలికాడు. నకుల, సహదేవులు ఆమె పాదాలు ఒత్తుతున్నారు.

అంతగా వన వాస కష్టాలని అనుభవించారు పాండవులు.

ఆ కష్టకాలంలో… వాళ్ళల్లో…

‘ఈ చీకటి తర్వాత వెలుగు వస్తుంది’ అని ఓ నమ్మకం.

‘అరణ్య అజ్ఞాత వాసాల తర్వాత, తిరిగి తమ రాజ్యం, వైభవం తాము పొందగలమని’ ఓ ఆశ!

‘అనుకున్న వన్నీ అనుకున్నట్లు అవుతాయో లేదో నని’ ఓ నిరాశ!

‘తాము ధర్మం తప్ప లేదు. దైవం తోడుంటాడు’ అని ఓ ధైర్యం.

‘ఎన్ని కష్టాలని ఎదుర్కోగలం?’ అని ఓ దైన్యం.

కష్టనష్టాల చీకటిలో ఉన్నప్పుడు, సామాన్య మానవులమైన మనకెన్ని భావోద్వేగాలు కలుగుతాయో… అవన్నీ పాండవులకీ కలిగాయి.
సాక్షాత్తూ శ్రీకృష్ణుడే తోడుగా ఉన్నా, స్వయంగా తాము యోధులైనా…మన కున్నట్లే వారికీ…ఆశ, నిరాశ, ధైర్యం, దైన్యం…భావ సంచలనాలన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించి, వాళ్ళు యుద్ధం చేసారు, విజయం సాధించారు.

రామాయణంలో లంకపై యుద్ధం ప్రారంభమైనప్పుడు, శ్రీరాముడన్నట్లు… ‘ఆరంభానికీ అంతానికీ మధ్య సుదూర సుదీర్ఘ సమయాన్ని’ సహనంతో భరించి మరీ, విజయాన్ని సాధించారు.

అరణ్యవాసం చేసే పన్నెండేళ్ళ సుదీర్ఘ కాలాన్ని, తమకి అనుకూలంగా మలుచుకున్నారు.

ఎన్నో ప్రాంతాలు చూసారు. ఎందరో ఋషులను కలిసి జ్ఞానాన్ని పొందారు. అర్జునుడు తపస్సుతో ఈశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం మొదలు… వరుణ యమ కుబేర ఇంద్రాదుల అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సాధించాడు.

భీమసేనుడు ఆంజనేయుడి అనుగ్రహం పొందాడు. వింధ్య, గంధమాదన, హిమాలయ పర్వతాల ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ…ఋషుల సత్సంగంతో ఆత్మశక్తిని పెంచుకుంటూ, ఆ అరణ్యవాస కాలాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
మార్కండేయ మహర్షి… పాండవుల ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ శ్రీరాముడి ధీర గంభీర విషాద గాధనీ, విజయ గాథనీ వినిపిస్తాడు. బృహదశ్వ మహర్షి… నల చక్రవర్తి కథ చెప్పి ధర్మరాజాదులను ఉత్సాహ పరుస్తాడు.

ఇన్ని రకాలుగా ఊరట పొందీ, ఉత్సాహాన్ని నింపుకునీ, విషయ పరిజ్ఞానాన్ని, ఆయుధ సంపత్తినీ పెంచుకుని సహనంగా కార్యాన్ని సాధించారు పాండవులు.

అందుకేనేమో, మన పెద్దలు ‘భారతంలో లేనిది మరి దేనిలోనూ లేదు’ అంటారు.

అందుకే భారతీయుల నుండి రామాయణ భారతాది ఇతిహాసాలని తుడిచి పెట్టే ప్రయత్నం చేసారు నకిలీ కణిక వ్యవస్థలోని కుట్రదారులు.

ఇక పోతే…

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇక ఈ సందర్భంలో,,, ద్రౌపదీకీ, ధర్మరాజుకీ మధ్య సంభాషణ ఆసక్తి కరమైనదీ, నేటి సామాజిక పరిస్థితులకి అవసరమైనది.

ఒక సారి పరిశీలించండి…

వనవాసం సాగుతోంది.

ఒకనాడు పాండవులందరూ చింతాపూరిత హృదయంతో సంభాషించుకుంటూండగా… ద్రౌపదీదేవి, ధర్మరాజు నుద్దేశించి:

“మహారాజా! దుష్ట దుర్యోధనుడికి మన దుస్థితి ఏమాత్రం పరితాపాన్ని కలిగించదు. నీచుడైన ఆ కౄరుడు మృగచర్మాలు కట్టించి మనలను వనవాసానికి పంపినందుకు ఈషన్మాత్రం పశ్చాత్తాప పడడు. వాడి హృదయం ఇనుముతో చేశారు. కనుకనే నీ వంటి సత్పురుషులను అంత కంఠోరంగా అవమానించి అనుచరసమేతుడై ఆనందడోలికలలో ఊగుతున్నాడు. నీవంటి ధర్మపురుషుడు కూడా వల్కలాజినాలు ధరించ వలసిన స్థితి కలిగిందే అని, కురు సభాభవనమంతా విచారించిందే కాని, దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు మాత్రం విచారరేకలైనా చూపలేదు.

హంసతూలికా తల్పాల మీద, ఆనందభోగాలు అనుభవించవలసిన మీరు, ఈ గడ్డి మీద శయనించవలసి వచ్చింది. రత్నఖచిత దంత వినిర్మిత సింహాసనాల మీద, రాజపరిషన్మధ్యంలో విరాజిల్ల వలసిన మీరు, ఈనాడు ఈ దర్భాసనాల మీద కూర్చోవలసి వచ్చింది. దివ్యచందన చర్చలతో, ఉదయ భానుని వలె ప్రకాశించే మీరు, ధూళి ధూసరిత దేహులై మెలగవలసి వచ్చింది. చీని చీనాంబరధారులు వల్కలాలు కట్టవలసి వచ్చింది. సహస్రాధిక బ్రహ్మవిదుల పంక్తిని, హేమ పాత్రలలో ఆరగించవలసిన వారు, ఈ స్థితిలో ఉండవలసి వచ్చింది. ఎందరో యతులు, బ్రహ్మచారులు, అనుదినమూ అతిధులుగా వస్తూంటే… వారందరికీ స్వాదురసభోజనాలు సమకూర్చే శక్తి కలవారు, అరణ్యాలపాలై కందమూల ఫలాలు ఆరగించవలసి వచ్చింది. ఇంతకంటే విచారించదగ్గ విషయాలేమున్నాయి?

మహాబలసంపన్నులైన నీ సోదరులు కూడా, యీ స్థితిలో ఉండడం అనవసరమేమో అనిపిస్తోంది. ఎటువంటి శత్రువుకైనా వెన్నుచూపని భీమసేనవీరుడు, యిలా విషాదంతో ఉంటే, మీరెలా సహించగల్గుతున్నారు? శత్రువుల మీద మీకు ఈషన్మాత్రమైనా క్రోధం ఎందుకు కల్గటం లేదు? యుధ్దభూమిలో శత్రు వీరులను అవలీలగా చీల్చి చెండాడే మహశక్తి గల భీముడు, మీ మాట దాటలేక, ఈ కష్టాలు పడుతూ శత్రువులను ఉపేక్షిస్తున్నాడు.

కార్తవీర్యార్జునునితో ఉపమింపతగ్గ పరాక్రమం గల సవ్యసాచి కూడా, ఈ అవస్థ పాలు కావలసి వచ్చింది. ఆ మహీవీరుని ధనస్సుకు భయపడి గదా, రాజలోకమంతా, రాజసూయ సమయంలో తలలు వంచింది? దేవ, దానవ, మానవ, నాగజాతులను జయించగల ఆ మహావీరుని శక్తికి తట్టుకోలేక గదా, ఆశ్వ, గజ, రథ, రత్నరాసులు కానుకలుగా పోశారు? ఏకకాలంలో అయిదు వందల బాణాలు విడువగల ఆ మహాశూరుడు, యిలా దుఃఖిస్తూంటే కూడా, మీకు శత్రువుల మీద ఎందుచేత రోషం కలగడం లేదో నా కర్ధం కావడం లేదు.

అసమాన సుందరుడు, శ్యామవర్ణుడు, ఘన కార్యనిర్వహణదక్షుడు, ఖడ్గ యుద్ధ నిపుణుడు అయిన నకులుడు, యింత కష్టపడుతుంటే, మీరెంత మాత్రం శత్రువుల విషయం ఆలోచించటం లేదు. పరమ మోహనాంగుడయిన వీర సహదేవుని విషాద వదనం చూసినా, మీకు శత్రువుల మీద ద్వేషభావం ప్రకోపించడం లేదు. ద్రుపద రాజపుత్రినై, పాండురాజు కోడలినై, ధృష్టద్యుమ్న సోదరినై, పాండవ పత్నినై నేను కూడా, ఈ అవస్థలు పడవలసి వచ్చింది. అయినా మీరు సహనమే ప్రదర్శించడం ఉచితం కాదు. అసలు మీలో క్రోధం ఉన్నదా అని? సోదరులూ, భార్యా యింతటి అవస్థ పడుతున్నా మీకు విచారమే లేదు.

‘క్షరతే ఇతి క్షత్రం’ అని కదా క్షత్రియ శబ్దార్ధం! దుష్ట నాశనార్ధం క్రోధం క్షత్రియుల కవసరం, అది మీలో లేదు, క్రోధం లేని క్షత్రియుడుంటాడా! అవసరం వచ్చినప్పుడు, క్షాత్రధర్మం ప్రదర్శింపని వానికి గౌరవం లేదు. తిరస్కారమే ప్రాప్తిస్తుంది.

క్రోధ సహనాలకు సమయా సమయాలున్నాయి. సమయానుసారంగా వానిని ప్రదర్శించాలి. సహన సమయంలో, సుఖాలకు దూరమైనా, జీవకోటి వైముఖ్యం ప్రదర్శించినా, శాంతంతోనే ఉండాలి.

బలి తన పితామహుడయిన ప్రహ్లాదుని చేరి,

“తాతా! సహన క్రోధాలలో శ్రేష్ఠమయిన దేదో నాకు వివరంగా చెపితే ఆ మార్గాన నడుస్తాను” అన్నాడు.

అప్పుడు ప్రహ్లాదుడు:

“నాయనా! సహనం మంచిదే కాని, సర్వసమయాలలోనూ దానినే అవలంబించడం మంచిది కాదు. అదే విధంగా క్రోధంతోనూ ఉండకూడదు. సర్వవేళలా సహనంతోనే ఉంటే… శత్రువులూ, సేవకులూ, తటస్థులూ నిర్లక్ష్య భావంతో చూస్తారు. అందుచేతనే విజ్ఞులు సమయానుసారం సహనం ప్రదర్శిస్తారు.

నిరంతరం ఓరిమి వహించే చక్రవర్తి యొక్క సేవకులు, అకార్యాచరణకు సంకోచించరు. మహారాజభోగాలను భృత్యులే అనుభవించటానికి ప్రయత్నిస్తారు. వారిలో సేవాభావం నశిస్తుంది. సేవకుల అవహేళనకు పాల్పడవలసి వస్తుంది. అంతకంటే మరణం నయం. రాజస్త్రీలను, నారీ జనాన్నీ అవమానించడానికి కూడా ప్రయత్నిస్తారు. దండనీతిని విడిచి,, సదా క్షమా హృదయంతో ఉండే యజమానికి, అనుచరులు ప్రమాదాలు కలిగిస్తారు. ఓర్పు ఇన్ని అనర్ధాలకు మూలం.

ఇక క్షమారహితుల విషయం – కారణం లేకుండా సదా క్రోధంతో ప్రవర్తించే మానవుడు… మంచి చెడ్డలు ఆలోచించకుండా, దండనీతిని ప్రయోగిస్తూ, దురాగ్రహంతో, ఆప్తమిత్రులకు కూడా దూరమవుతాడు. ఆత్మీయులూ, ఇతరులూ కూడా, వానిని ద్వేషిస్తారు. క్రోధ స్వభావుడు అందరినీ అవమానిస్తూ, శత్రువులను సృష్టించుకుంటాడు. క్రోధ పరవశుడై, కౄర దండనలు సాగిస్తూ, సర్వాన్నీ కోల్పోయి, ఆఖరుకు ప్రాణం కూడా పోగొట్టుకుంటాడు.

హితులతోనూ, అహితులతోనూ కటువుగా భాషిస్తాడు. విషం క్రక్కే పామును చూచినట్లు, క్రోధ స్వభావుని చూస్తారు. సమయం చూసి, వానిపై కసి తీర్చుకుంటారు.

కనక నిరంతరం క్రోధంతో ఉండకూడదు; సహనంతోనూ సంచరించకూడదు. సమయానుసారం ప్రవర్తించాలి” అని చెప్పాడు… అంటూ వివరించిన ద్రౌపదీ దేవి…

“ధర్మనందనా! దుష్టదుర్యోధనుడు ఎప్పుడూ మీకు ద్రోహమే తలపెడుతున్నాడు. కనక వానిపై ప్రతీకారం తీసుకోక తప్పదు. కౌరవుల విషయంలో, సహనం అనవసరం. మృదుస్వభావంతో ప్రజాహృదయాలను ఆకర్షిస్తూ, క్రోధంతో వారి ఆగ్రహానికి గురి కాకుండా, న్యాయంగా పరిపాలించే వాడు ఉత్తమ ప్రభువు” అని పలికి, ద్రౌపది, కొనగోట కన్నీరు తుడుచుకుంది.

అప్పుడు ధర్మరాజు ఆమె వైపు తిరిగి:

“ద్రౌపదీ! మానవులకు క్రోధం మరణహేతువు. దాన్ని జయించిన వానికి అభ్యుదయ పరంపరలు ప్రాప్తిస్తాయి. క్రోధవశులకు పతనమే. సర్వనాశహేతుభూతమైన క్రోధాన్ని ఆశ్రయించి, నేను శత్రువులపై ప్రతీకార చర్య తీసుకోలేను.

ఆగ్రహం కలిగితే గురుహత్యకు కూడా మానవుడు వెనుదీయడు. పరుష వాక్యాలతో పరులను పరాభవింప జేసేదీ, అకార్యాచరణకు ప్రేరేపించేదీ, సజ్జనులను కూడా చంపించేదీ, దుర్మార్గులను పూజింప చేసేదీ, ఆత్మహత్యకు సహకరించేదీ అయిన క్రోధం… యమలోకానికే దారితీస్తుంది.

కనుకనే, ప్రాజ్ఞులు, క్రోధాన్ని పరిత్వజించి, యిహ పరాలలో ఉత్తమ గతులు పొందుతున్నారు. ఎదుటి వాడు ఆగ్రహంతో వచ్చినా, ప్రాజ్ఞుడు సౌమ్య స్వభావంతో ప్రవర్తించి, ఉభయులకూ క్షేమం కలిగిస్తున్నాడు. మనో నిగ్రహం లేక, ఆగ్రహంతో చరించేవాడు, ఇహపరాలకు దూరుడవుతున్నాడు. అసమర్ధులపై క్రోధం ప్రదర్శించని వాడే ఉత్తమపురుషుడు.

అవివేకులూ, మూర్ఖులూ… క్షమను విసర్జిస్తారు.

వారి వలె నేను కూడా, సదాచారాలకు హేతుభూతమైన క్షమను ఎలా విడువగలను? భూదేవితో సమానమైన ఓర్పుగల మానవులే లేకపోతే… ఈ ప్రపంచంలో నిరంతరం యుద్దాలే జరుగుతుంటాయి. అధర్మహేతువైన క్రోధం, పరస్పర దూషణలకూ, హత్యలకూ దారితీస్తుంది. భార్యాభర్తలూ, తండ్రీ కొడుకులూ, తమ సంబంధ బాంధ్యవాలు విస్మరించి, ఒకరి నొకరు చంపుకోడానికి వెనుదీయరు. ఈ స్థితిలో ప్రపంచానికి సుఖమూ శాంతీ ఎలా లభిస్తాయి?

యాజ్ఞసేనీ! ఈ కాలం… భరత వంశ నాశనం కోసం ఎదురు చూస్తోంది. దుర్యోధనునికి సహనం లేదు. సరికదా, దానిని గుర్తించే అర్హత లేదు. నేనో… సదా సహనంతోనే చరిస్తున్నాను. దాని నాశ్రయించే అర్హత నాకున్నది. క్షమ, దయా అనే రెండు గుణాలే, జితేంద్రియులకు ఆవశ్యకమైనవని సనాతన ధర్మవిదులు ఘోషిస్తున్నారు. కనుకనే నేను, దయా క్షమలనే ఆశ్రయించి గౌరవిస్తున్నాను” అని అన్నాడు.

ఇక…

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నడుస్తున్న ప్రపంచ రాజకీయ నేపధ్యాన్ని పరిశీలిస్తే…

‘మానవ జాతి మనుగడ ఎటు వైపుకి దారితీస్తోంది?

మానవ ప్రస్తానం ఏ దిశలో, ఏ దశలో ఉంది?’… అనే ప్రశ్నలు ఉదయించక మానవు.

ప్రస్తుతం ట్యునీషియా, యెమన్, ఈజిప్టు, యూరోపు అరబ్బు దేశాలలో సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తూ…

‘ఈజిప్టులో ఉబికిన ఉద్యమం మన దాకా వస్తుందా? రాదా?

అరబ్బులలో వెల్లువైన చైతన్యం భారతీయుల్లో కరువైందా?

భారతీయులు అంత చేవచచ్చి ఉన్నారా?’ అని… ప్రశ్నించుకుంటున్న వాళ్ళున్నారు.

‘ఆఁ. అదిక్కడ సాధ్యం కాదండీ!’ అని… నిరుత్సాహం పడుతున్న వాళ్ళున్నారు.

‘అదంత తేలిక కాదు’ అని… చిరు ఆశతో చూస్తున్న వాళ్ళున్నారు.

‘అక్కడి ఉద్యమమే అణగారి పోతుంది. ప్రయోజనం పొందకుండానే సమసి పోతుంది. ఒక నియంత పోతే మరొకడొస్తాడు. ఎక్కడైనా ఇంతే! ఈ దోపిడి ఆగదు. ఈ అన్యాయమూ ఆగదు’ అని… నిరాశ పడుతున్న వాళ్ళున్నారు.

ఒకే విషయానికి ఉన్న భిన్న కోణాలివి!

వివిధ కోణాల్లో కనబడుతున్న అసంపూర్ణ సత్యాలివి!

నిజమే!

ఎక్కడైనా…ప్రపంచంలో ఏ దేశమైనా…అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా…రాజరిక బ్రిటన్, సౌదీలైనా… ప్రజాస్వామ్య భారత్, అమెరికా లైనా…అంతటా ఉన్నది ఒకే దోపిడి!

పేదలు మరింత పేదలై, ధనికులు మరింత ధనికులైన, అవుతోన్న దోపిడి!

సుదీర్ఘ కాలంగా, ప్యాకింగ్ మారినా లోపలి సరుకు మారని దోపిడి!

అధికారంలో ముబారక్ ఉన్నా… ముషారఫ్ ఉన్నా… యూపీఏ ఉన్నా… ఒబామా ఉన్నా…

అయితే రిగ్గుంగులూ లేకపోతే ఈవీఎంలతో… తమకి కావాల్సిన వాళ్ళనే గెలిపించుకోగల… తమ వాళ్ళకే సంపదలన్నీ సమకూర్చుకోగల… చట్టబద్ద దోపిడి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సారూప్యతే… ‘ప్రపంచాన్ని ఒకే వ్యవస్థ నడిపిస్తోందన్న’ సత్యాన్ని బహిర్గతం చేస్తోంది. [ఒకప్పుడు దాన్ని బ్రిటన్ అన్నారు, తర్వాత అమెరికా, రష్యాలన్నారు, ఆ తర్వాత సీఐఏ అన్నారు… నేను ‘నకిలీ కణిక వ్యవస్థ’ అంటున్నాను. అంతే తేడా!]

అలాంటి చోట…నిన్న ట్యూనీషియా, యెమన్ లలో, నేడు ఈజిప్టులో… ఇప్పుడు ఎగసిపడుతున్న ఉద్యమం, మరింత ఉధృతం కానివ్వండి లేదా సమసి పోనివ్వండి…ఇందులో ప్రపంచం తెలుసుకోవలసిన ‘పచ్చి నిజాలు’ కొన్ని ఉన్నాయి.

అవేమిటో పరిశీలించే ముందు… నా ఈ టపాల మాలిక ని మహాభారతం నుండి ఓ చిన్న సంఘటనని వివరిస్తూ… ప్రారంభిస్తాను.

ఇది మహాభారతం అరణ్యపర్వం లోనిది.

మాయాద్యూతంలో సర్వం కోల్పోయిన పాండవులు అరణ్యవాసం ప్రారంభించారు. భీమసేనుడు కిర్మీరుని వధించిన అనంతరం… పాండవులు ద్రౌపదీ దేవి సహితంగా, దైతవనం వైపు సాగుతుండగా… పాండవుల వనవాస వార్త విని, దృష్ట అంధక భోజ వంశీయులు, దృష్టద్యుమ్న, ధృష్టకేతు కేకయ రాజనందనులు, ధార్తరాష్ట్రులను (అంటే ధృత రాష్ట్ర పుత్రులైన దుర్యోధన దుశ్శాసనాదులను) నిందిస్తూ, పాండవులను చూడ వచ్చారు. శ్రీకృష్ణుడూ వచ్చాడు.

వారందరి ఎదుటా ద్రౌపదీ దేవి, తన పరాభవాన్ని, అన్న శ్రీకృష్ణుడికి చెప్పుకుని దురపిల్లుతుంది. సంభాషణలూ సంబాళింపుల తర్వాత, శ్రీకృష్ణుడు సుభద్రా అభిమన్యులను తీసుకొని ద్వారకకు బయలు దేరుతాడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపదీదేవికి, పాండవుల వలన కలిగిన అయిదుగురు పుత్రులు, ప్రతివింధ్య, శ్రుతసోమ, శ్రుతకీర్తి, శతానీక, శ్రుత కర్ములను తీసుకొని, పాంచాల నగరానికి ప్రయాణమౌతాడు. ఛేది భూపతి ధృష్టకేతుడు, తన సోదరీ, నకులుని భార్యా అయిన కరేణుమతిని వెంటబెట్టుకు పోతాడు.

ఈ విధంగా బంధుమిత్రులు సెలవు తీసుకుని వెళ్ళాక… దైతవనంలో…

ఒకరోజు, ద్రౌపదీదేవికీ ధర్మరాజుకీ మధ్య ‘మనిషికి సహనం ఎంత ఉండాలి. క్రోధం ఎంత వరకూ ఉండాలి’ అనే విషయమై సంభాషణ నడుస్తుంది. క్రోధశోకాల అతిశయంతో ద్రౌపదీ దేవి, నాస్తిక వాదాన్ని ప్రతిపాదించిందని ధర్మరాజు అంటాడు.

“అసలు దేవుడనే వాడుంటే ఇంత అన్యాయం జరుగుతుందా? మనకి ఇన్ని కష్టాలొస్తాయా?” అనుకుంటాం చూడండి. అలాంటి దన్న మాట!

తదుపరి క్రమంలో భీమసేనుడు, ధర్మరాజుని కొంత నిందాపూర్వకంగా మాట్లాడుతూ ‘క్షాత్రధర్మం ప్రకారం యుద్ధం తగినదే’ అనీ, ‘అధర్మం పాటించిన దుర్యోధనాదుల పట్ల… ధర్మం, సత్యం అంటూ నీతులు అవసరం లేదనీ, కపట ద్యూతం నిర్వహించిన కౌరవులకు ప్రతిగా, 13 నెలల కాలాన్ని 13 సంవత్సరాలుగా జమకట్టి…ఇక అరణ్య వాసాన్ని కట్టిపెట్టి శతృవులని వధించాలి’ అనీ ప్రతిపాదిస్తాడు.

ఆ సందర్భంలో…

“గాండీవం ధరించి సవ్యసాచి నిలబడి ఉండగా దేవేంద్రుడు కన్నెత్తి చూడలేడే. అటువంటిది మీ ప్రమత్తత వల్ల ఈ రాజ్యం పోయింది. గోవులనూ, ఫలాలనూ ఎవరైనా హరించినా వికలాంగులు ఏమీ చేయలేనట్లే, జూదంలో సర్వమూ మీరు ఓడిపోతున్నా, మేము మౌనంగా ఉండిపోవలసి వచ్చింది. మీరు ధర్మతత్పరులు కనుక మీ వాంఛ నెరవేరింది. మీ శాసనాలను పాలించే మాకు దుఃఖమే ప్రాప్తమైంది. దుష్టులయిన ధార్త రాష్ట్రులను ఆనాడు సంహరించకపోవడం వల్ల నేటికీ వారు మనకు కష్టాలు కలిగిస్తూనే ఉన్నారు. మృగాల వలె వనవాసం చేయవలసిన దౌర్బల్యం మనకు లేదే! ఈ వనవాస క్లేశాలను కృష్ణార్జునులు గాని, నకుల సహదేవులు కాని, అభిమన్యుడు కాని, సృంజయవీరులు కాని, నేను కాని, ఆమోదించ లేక పోతున్నాం.

ధర్మ ప్రవచనాలతో, వ్రతాలతో, మీరు మాకు కష్టాలే కలిగిస్తున్నారు. వైరాగ్యంతో సాహస శూన్యత్వం మిమ్ము వరించిందో, నపుంసకుల వలె వ్యర్ధ జీవితం సాగించాలనుకుంటున్నారో… తెలియడం లేదు. అసమర్ధులు, దుర్భలులూ మాత్రమే, తమ సంపదలను సాధించడానికి ప్రయత్నించరు. సర్వశక్తి సంపన్నతకు దూరదృష్టి తోడుపడిన మీ వంటి వారు కూడా, చేజేతులా పురుషార్ధాలను విడిచిపెట్టారు.

ఎన్ని సుగుణాలు ఉన్నా ధనహీనుడు యజ్ఞకర్మ ధర్మాన్ని ఆచరించలేడు. ఈ ప్రపంచానికి ధర్మమే మూలకారణం. దానిని మించింది లేదు. ధర్మకార్యాచరణకు ఆవశ్యమైనది ధనం. భిక్షాటనం చేస్తూనో, నపుంసకత్వంతో చేతులు ముడుచుకు కూర్చుంటూనో, ధర్మం మీద మనస్సుతోనో ఉంటే – ధనం ప్రాప్తించదు. యాచనతో కార్యసాధన చేసే బ్రాహ్మణుల వలె మీరు చరించరాదు. వీరత్వంతో ధనం సంపాదించాలి. దానికి తగిన మార్గం చూడండి. ఉత్సాహ బల పౌరుషాలు క్షత్రియ ధర్మాలు. వానితోనే మీరు శత్రువులను వధించండి”…అన్నాడు.

దీనికి జవాబుగా ధర్మరాజు తన ‘వాదన’ని చెబుతూ

“సోదరా! ఆనాడు అరణ్య అజ్ఞాత వాసాలకు సమ్మతించి, సభ మధ్యంలో ఓడిపోయిన నేను, ధర్మం విడిచి రాజ్యం ఎలా అడగను? ద్యూత సమయంలో రెండు చేతులా దహిస్తానని నువ్వు లేచినపుడు, అర్జునుడు నిన్ను వారించాడు. ఆ సమయంలో గద పైకెత్తి శత్రువుల వైపు సాగబోయావు. అప్పుడే నువ్వు అలా చేస్తే, ఎంతటి ప్రమాదం సంభవించేది? ఒక్క విషయం నువ్వు మరచి పోతున్నావు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగం ఉన్నదే… అది, ఆనాడే సభామధ్యంలో, నా ప్రతిజ్ఞకు పూర్వం చేసి ఉంటే, ఎంతో సమంజసంగా ఉండేది.

ద్రౌపదికి కలిగిన క్లేశం, ఆమె విషాదవదనమూ, నాకూ బాధ కలిగిస్తున్నాయి. విషం త్రాగినంత బాధగా ఉంది నాకు. అయినా నా ప్రతిజ్ఞను ఉల్లంఘించలేను. పొలంలో విత్తనాలు చల్లి, పంటకోసం నిరీక్షించే రైతులా, నువ్వు కూడా ఓపికపట్టు. శత్రువు మోసగిస్తే సమయం వచ్చే వరకూ ఆగి, శత్రువును మూలచ్ఛేదం చేసే వాడే, రాజ్యలక్ష్మిని గ్రహించడానికి అర్హుడు. నీ శౌర్య ప్రతాపాల ముందు, శాత్రవకోటి తలవంచుతుందని నాకు తెలుసు. కాని ఈ లోగా ఎందరో మిత్రులు మనకు సమకూరుతారు. ఇంద్ర సహాయంతో దేవతలు సుఖంగా ఉండేటట్లు, మిత్ర సహకారంతో మనం శత్రువులను జయించి, ప్రశాంతంగా ఉండవచ్చు.
నాయనా! నా జీవితాన్నీ అమరత్వాన్నీ ఉపేక్షిస్తాను. కాని ఉత్కృష్టమైన ధర్మాన్ని విడిచి పెట్టలేను. ఈ రాజ్యమూ, దారాపుత్రులూ, యశోధనాలూ, సత్య ధర్మాలలో షోడశాంశం కూడా కావు. సత్యధర్మ పాలనమే నా జీవిత వ్రతం” అని భీమునికి సమాధాన మిచ్చారు.

[పై సంభాషణలు ఉషశ్రీ మహాభారతం నుండి యధాతధంగా గ్రహించాను.]

ఈ ఒక్కమాటకే ధర్మరాజు…అజాత శతృవనీ, ధర్మనిరతుడనీ,,, శ్రీకృష్ణుడు మొదలు మార్కండేయ మహర్షి వరకూ పొగడటానికి అర్హుడు!

[అలాంటి చోట,,, మన సినిమాలు ధర్మరాజుని ఎంత ‘హిపోక్రెట్’గా చూపించాయో! మన ఇతిహాసాల మీద ఆ రకపు కుట్రతీరు,,, తేలికగా అర్ధం చేసుకోలేనంత సంక్లిష్టమైనది, ద్వంద్వ పూరితమైనది.]

ఇక ఈ సందర్భంలో,,, ద్రౌపదీకీ, ధర్మరాజుకీ మధ్య సంభాషణ ఆసక్తి కరమైనదీ, నేటి సామాజిక పరిస్థితులకి అవసరమైనది.
ఒక సారి పరిశీలించండి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పతాక వార్త – చిరంజీవి ప్రరాపా, కాంగ్రెస్ లో విలీనం కావటం! పొత్తు పెట్టుకుంటూదేమోనని వేచి చూడాల్సినంత అవసరం లేనంతగా, విలీనం వైపు అడుగులు వేస్తూ ప్రజారాజ్యం పార్టీ, దాని నాయకుడు చిరంజీవీ కనబడుతున్నారు.

ఇతర పార్టీలని అప్పుడప్పుడూ విమర్శించినా, ప్రధానంగా కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శిస్తూ…‘సామాజిక న్యాయం కోసం, మార్పుకోసం’ అంటూ ఉద్ఘోషిస్తూ (బహుశః అలా నటిస్తూ) మదర్ థెరిస్సా, జ్యోతిరావు పూలే అంటూ బొమ్మలు పెట్టుకొని… 2008, ఆగస్టులో పురుడు పోసుకున్నది ప్రజారాజ్యం పార్టీ!

సినిమాలలో పేజీల కొద్దీ డైలాగులూ, డిష్యుం డిష్యుం పైటింగులూ చేసిన తమ అభిమాన సినిమా నాయకుడు, నిజ జీవితంలోనూ ధీరోదాత్తుడూ, సాహసికుడూ అవుతాడని నమ్మి…

కాదన్న వాళ్ళని మాటలతో, వ్యాఖ్యలతో కుమ్మి…

గుడ్డి ఆరాధనని పెంచుకున్న అభిమానుల్ని…

ఓట్లేసిన జనాలని వెర్రి వెంగళప్పలని చేస్తూ…పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి ఉత్సాహంగా పరుగులు పెడుతున్నాడు చిరంజీవి!

(విలీనం లేదా పొత్తు పెట్టుకోవటం, ఏదైనా ఒకటే. అది అధికారం కోసం కాంగ్రెస్ తో చేతులు కలపటం తప్ప మరొకటి కాదు.)

ఇది ఎంతగా ప్రజల్ని నధింగ్ చేయటమో ఒక్కసారి పరిశీలించి చూస్తే –

కాంగ్రెస్ లో విలీనం కావాలనే నిర్ణయం తీసుకునేటప్పుడూ, సదరు నిర్ణయాధికారాన్ని పార్టీ అధినేతకి కట్టబెట్టినప్పుడూ వాళ్ళకి జనాలెంత ‘నధింగో’ కుండ బద్దలు కొట్టినట్లు చేతల్లో చూపించి మరీ చెబుతున్నారు.

పాపం, జనాలకే అర్ధం కావటం లేదు. ఇంకా తామేదో ‘సం ధింగ్’ అనీ, తామేదో చేసేయగలమనీ, కనీసం ఎన్నికలప్పుడు ‘ఇరగ దీయ గలమనీ’ భ్రమలు పడుతూ బ్రతికేస్తున్నారు.

ఈ విషయంలో చిరంజీవి, సోనియా, చంద్రబాబు గట్రాలెవరైనా ఒకటే. ఏ పార్టీ అనుచరులైనా… అంతిమ నిర్ణయాధికారం, పార్టీ అధినేతకే నంటూ ఏకవాక్య తీర్మానం చేస్తారు.

సదరు నిర్ణయాలలో, ఏక వాక్య తీర్మానాలలో…

ఓట్లేసిన జనం ప్రమేయం లేదు.

వాళ్ళ అభిప్రాయాలకు విలువా లేదు.

నాయకుల ఉపన్యాసాలని విశ్వసించి, వాల్ పోస్టర్లు అంటించిన వాలెంటీర్ల ప్రమేయం లేదు.

వాళ్ళ విశ్వాసానికీ విలువ లేదు.

నమ్మి జండాలు మోస్తూ, జేజేలు కొట్టిన కార్యకర్తల ప్రమేయమూ లేదు.

వాళ్ళ అభిమానాలకీ విలువ లేదు.

ప్రస్తుతం చిరంజీవి ప్రరాపా, కాంగ్రెస్ లో విలీనం విషయమే తీసుకొండి!

నిన్నటి దాకా కాంగ్రెస్ ని తిట్టిన తిట్లు ఏమయ్యాయి? చేసిన విమర్శలేమయ్యాయి? ‘నిశ్శబ్ద విప్లవం వస్తోంది. మేం మద్దతిచ్చే వాళ్ళం కాదు. మద్దతు తీసుకునేవాళ్ళం. రేపు సీఎం సీటు ఎక్కనున్నది మేమే’ అంటూ అభిమానులకి పెట్టిన ఆశలేమయ్యాయి? కార్యకర్తలకి ఇచ్చిన భరోసాలు ఏమయ్యాయి?

సీఎం అయ్యేటన్ని సీట్లు గెలవకపోయినా, కనీసం అస్తిత్వం మిగులకపోవటం ఎంత నీచం? తాము కాంగ్రెస్ ని తిట్టిన నోటితోనే రేపు జేజేలు పలకటమే గాక, కార్యకర్తలని కూడా జేజేలు పలకమని చెబుతారు కాబోలు!? ఎంత వ్యక్తిత్వ రాహిత్యం ఇది?

ఏ ‘మార్పు’ తెస్తుందనీ, ఏ ‘సామాజిక న్యాయం’ చేస్తుందనీ, కాంగ్రెస్ తో ప్రరాపా చంకలు గుద్దుకుంటూ విలీనమౌతోంది? గత 6 ఏళ్ళ యూపీఏ పాలనలో తేని మార్పునీ, తేలేని మార్పునీ, కాంగ్రెస్…ఈ పురిటి సంధి కొట్టిన ప్రరాపా పార్టీని విలీనం చేసుకునీ, ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు రెండు డైలాగులు కొట్టి, నాలుగు రాళ్ళు జేబులో వేసుకుని, పేకప్ అనగానే పరుగెత్తుకుని ఇంటికెళ్ళిపోయే ఈ రాజకీయ నటుణ్ణి పార్టీలో చేర్చుకుని, ‘హాంఫట్’ అని తెచ్చేస్తుందా?

ఇంకా ‘మేం చిరంజీవి అభిమానులం’ అని చెప్పుకోగలిగిన జనాలుంటే… వారి లజ్జా లేమిని చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే! ఇంతగా పార్టీల నాయకులెంత పనికి మాలిన వాళ్ళో, పచ్చి స్వార్ధపరులో బహిర్గతం అవుతున్నా…కళ్ళు మూసుకుపోయిన జనాలుంటే…వాళ్ళ గుడ్డి అభిమానానికి గుగ్గిలం వేసి అభినందించాల్సిందే!

నిజానికి జనాలంటే ఎంత చులకన లేకపోతే… ఈ పార్టీల నాయకులు తమ భవంతుల్లో కూర్చొని, కాలు మీద కాలేసుకుని, చూపుడు వేళ్ళు చూపిస్తూ తమ నిర్ణయాలు తాము తీస్కుంటారు? ఎంతగా జనాలు ‘నధింగ్’ గాకపోతే… కందిపప్పు కొట్టో లేక చింతపండు కొట్టో పెట్టుకున్నట్లు, ‘మన వ్యాపారం మనది. మన నిర్ణయాలు మనవి’ అన్నట్లు… ‘మన పార్టీ తరుపున అధినేతగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే!’ అంటూ తీర్మానాలు చేస్తారు?

ఇక్కడ ఉన్నదున్నట్లు చెప్పుకోవాలంటే ఓ మాట చెప్పుకోవాలి. అధికశాతం ప్రజలు కూడా, రాజకీయ పార్టీలని ఆయా నాయకుల కుటుంబ ఆస్థులు గానే చూస్తున్నారు. ‘వాళ్ళ పార్టీ వాళ్ళది. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు’ అన్నట్లుగా అన్నిటినీ అంగీకరిస్తూ…నిలదీయటం మరిచి పోయారు. మరో మాటగా చెప్పాలంటే అంతగా అవినీతిని అంగీకరించడానికి అలవాటు పడిపోయారు.

రాజకీయ పార్టీలలో తమ ప్రమేయం ఉంటుందనీ, ఉండాలనీ మరిచిపోయారు. పార్టీ సమావేశాలకీ డబ్బు పుచ్చుకొని వెళ్ళటం, తమ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని పార్టీలకి మద్దతు లివ్వడం గట్రా విధానాలతో ‘అందిన చోట మనమూ నొక్కెయడానికి పాల్పడుతున్నాం కదా!’ అన్నట్లుగా, అవినీతికి అలవాటు పడటం, అవినీతిని అంగీకరించడానికి అలవాటు పడటం…ఇక్కడికే దారితీస్తుంది, తీసింది.

అందునా ఇప్పుడు ప్రరాపా+కాంగ్రెస్ సంయోగం విషయంలో…‘ఆలస్యం చేస్తే…ఆనక కాంగ్రెస్, ప్రరాపా నుండి వలస వచ్చిన వారికి పదవుల సంతర్పణ చేస్తే, తమకి నష్టం వస్తుందేమోనని’… మునుపు పార్టీకి దూరమైన వారు కూడా, దౌడెత్తి మరీ వస్తున్నారు. వేర్పాటు, సమైక్యం, తొక్కా తోలూ…అన్నీ పైకారణాలే!

ఎందుకంటే – అసలు కాంగ్రెస్సే తెలంగాణా మీద ఏదీ ఇదమిద్దంగా చెప్పటం లేదు. ఏదో అనుకొని రేపుకుంటే… ‘కోతిపుండు బ్రహ్మరాక్షసి’ అయ్యిందన్న స్థితిలో తలపట్టుకుని కూర్చుంది. ఒక వేళ తెలంగాణా ఇచ్చినా…తెలంగాణాలో కేసీఆర్ తో పొత్తు, సీమాంధ్రలో చిరంజీవి విలీనంతో కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఢోకా లేదన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయనుకొండి. అదలా ఉంచితే…

ఇంతగా జనాలని నధింగ్ చేసి కూర్చో బెట్టిన ఈ సంఘటనలో, కొన్ని నిగూఢ విశేషాలున్నాయి.

అవి ఒకసారి పరిశీలిస్తే…

ఇటీవల చిరంజీవి ఉపన్యాసం చూడండి.

ఈనాడు ఫిబ్రవరి 04, 2011 ఉటంకింపు ప్రకారం

>>>విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సమావేశాన్ని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ “కాంగ్రెస్ నుంచి మనకు ఆహ్వానం అందింది. పొత్తు, విలీనం అనే ఊహాగానాలున్నాయి. నేను ఓపెన్ గా ఉన్నాను. నా అభిప్రాయాన్ని మీపైరుద్దను. మీరంతా ఎలా చెబితే అలా చేద్దాం.

ఎంత గమ్మత్తో చూడండి. ఇతడింతగా ‘తాను ఓపెన్ అనీ, తన అభిప్రాయాలు పార్టీ అనుచరులపై రుద్దననీ’ అంటే…

ప్రతిగా…
>>> కొందరు నాయకుల ప్రసంగాల అనంతరం… కాంగ్రెస్ తో కలిసి ఏ విధంగా పని చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం లక్ష్యానికి కట్టుబడి, రాజకీయ నిర్ణయం తీసుకునే అధికారాన్ని చిరంజీవికి అప్పగిస్తూ తీర్మానించారు.

ఎంత గొప్పగా నిర్వహించిన రెడ్ టేపిజం ఇది!? పార్టీ నాయకుడూ, అనుచరులూ కలిసి గొప్పగా ప్రజల చెవుల్లో, ప్రరాపా పార్టీ కార్యకర్తల చెవుల్లో పుష్పాలు పెట్టటమే!

ఈ రాజకీయ నట నాయకుడు చిరంజీవికి, సెట్ మీద డైరెక్టర్ చెప్పినట్లు చేయటం బాగా అలవాటు. దాని కొనసాగింపే ఇక్కడా స్పష్టంగా గోచరమౌతుంది.

కావాలంటే పరిశీలించండి.

చిరంజీవి గత శుక్రవారం (28 జనవరి, 2011 )న అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ‘ప్రభుత్వం తప్పు చేస్తే ఊరుకోమంటూనే’ ‘ప్రభుత్వం అయిదేళ్ళు కొనసాగుతుందంటూ’ తమ మద్దతు తాలూకూ భరోసా ఇచ్చాడు. అందులోనే…‘ఓ ఛానెల్ కు తనంటే గిట్టదనీ, మీడియా అంటే ‘ఈనాడు’ లా ఉండాలనీ’ కితాబులిస్తూ, తన గాడ్ ఫాదర్ కి దండాలు పెట్టుకున్నాడు.

[ఈ గాడ్ ఫాదర్ తనని సినిమాలలో మెగా స్టారుని చేసాడు మరి! సమకాలీన నటులలో మరెవ్వరికీ రాని హిట్ సాంగ్స్, డాన్సులూ, పాత్రలూ, ఫైట్లూ, మీడియా కవరేజీ… తనకీ వచ్చి, తాను ఆముదపు మహావృక్షంగా వెలిగి పోవటం అనుభవైకవేద్యం! 1993-94ల్లో ‘ప్రేమికుడు’ సినిమాతో ప్రభుదేవా తెర వెనక నుండి తెర మీదికి వచ్చాక గాని, ఈ మెగా స్టార్ డాన్సుల ప్రాభవానికి గండి పడలేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులతో గానీ సదరు మెగా స్టారుకి పరిస్థితి అర్ధం కాలేదు. ]

మరునాడు (30 జనవరి, 2011) ‘జగన్ తో పోరాటమా?... కాంగ్రెస్ లో చేరడమా? ఉప ఎన్నికల్లో ప్రరాపా వైఖరేంటో? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ’ అంటూ ‘ఈనాడు’ వ్రాసింది.

దాంతో సంచలన వార్తకి దారులు తెరిచింది.

అంతే! మరునాడు (అంటే 31 జనవరి, 2011న) ఆంటోనే చిరంజీవి ఇంటికి రాక – ఆపై సంఘటనలూ చక చకా జరిగిపోయాయి.

ఈ నేపధ్యంలో ప్రరాపా నేత పదే పదే అంటున్న ఓ మాట చూడండి.

>>>సినిమా రంగంలో చాలా ఆటుపోట్లకు గురయ్యాను. పార్టీ పెట్టాక 18 సీట్లకే పరిమితమైనా నేనేమీ మానసిక స్థైర్యం కోల్పోలేదు.

>>>బికాం చదివేటప్పుడు ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాను. ఆ స్పూర్తితో సినీ రంగంలోకి అడుగు పెట్టాను. తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ పెద్దగా విజయం సాధించలేదు. తర్వాత విడుదలైన చిత్రాలు మెగా స్టార్ ని చేశాయి. అదే విధంగా రాజకీయాల్లోనూ స్టార్ నవుతా’ – ఇదీ అతడు ప్రస్తుతం ఉన్న రిఫరెన్స్ ఫ్రేం!

ఇదే అతడికి పెట్టబడుతున్న ఆశ!

మొదట్లో సినిమాలు పెద్దగా హిట్ గాకపోయినా, కొన్ని ఫట్ అయినా, గాడ్ ఫాదర్ల ఆశీస్సులుంటే – జనాల నెత్తిన రుద్దబడి మరీ టాప్స్టార్లై పోవటం ఇతడికి బాగా తెలుసు. గాడ్ ఫాదర్ల మీద అతని కెంతో నమ్మకం! అనుభవపూర్వకంగా పెరిగిన నమ్మకం!

ఎందుకంటే – పదనిసలు కూడా సరిగా పాడలేని గాయకులని గాన గంధుర్వులని చేయగలరు గాడ్ ఫాదర్లు!

శాండో శాల్తీలని కూడా… ముద్దుగుమ్మలు కాదు బొద్దు గుమ్మలంటూ, అగ్రతారలుగా ప్రేక్షకుల నెత్తిన రుద్దగలరు గాడ్ ఫాదర్లు!

కాబట్టే – కెరీర్ గ్రాఫ్… లాబీయింగ్ మీదా, గాడ్ ఫాదర్ల పట్ల విధేయత మీదా ఆధారపడి ఉంటుందన్న నమ్మకం ఈ నటుడిది.

ఇక్కడ మరికొంత వివరణ ఇస్తాను.

ఏ మనిషినైనా పని చేసేందుకు పురికొల్పొవి… ఆశ, భయం!

పని చేస్తే ఫలితం వస్తుందన్న ఆశ!

చెయ్యకపోతే కష్టనష్టాల పాలవుతామన్న భయం!

ఇప్పుడీ రాజకీయ నట నాయకుడికి…”సినిమాలలో మొదట్లో హిట్ గాకపోయినా, తర్వాత్తర్వాత మెగా స్టార్ ని చెయ్యలేదా? అలాగే రాజకీయాల్లోనూ మొదట క్లిక్ అవ్వకపోయినా, ఫ్లాప్ అనిపించుకున్నా…తర్వాత్తర్వాత నిన్ను సీఎం సీటులో కూర్చొబెడతాం” – ఇదీ అతడికి చూపబడిన ఆశ. అతణ్ణి ఉంచిన రిఫరెన్స్ ఫ్రేం అది. అప్పుడన్నీ అతడికి with respective that ఫ్రేం లోనే కనబడతాయి.

“ముందు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యి. కొంచెం సద్దుమణిగాక…కాంగ్రెస్ లో ప్రస్తుతం ప్రజాకర్షక నాయకుడు (క్రౌడ్ పుల్లర్) లేడు. పరిస్థితులు చక్కదిద్దుకోవాలంటే చిరంజీవి వంటి ప్రజాకర్షక నేత అవసరం! అంటూ… మొన్న రోశయ్యని దింపి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం సీట్ ఎక్కించినట్లు, రేపు కిరణ్ ని దించి నిన్నెక్కిస్తాం” అంటే, ఆ పధకం ఎంతో అద్భుతంగా, ఆశాపూరితంగా కనబడుతుంది చిరంజీవికి.

[ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అంతా ముందే ముగిసింది కాబట్టి ఆంటోని వచ్చినప్పుడు ఏకాంత చర్చగాకుండా అనుచర సహిత చర్చ చేసాడు. ఆ తర్వాత మరో పావుగంట ఏకాంత చర్చ నడిపాడు లెండి.]

ఇక భయం ఏమిటంటే – ఇతడికి సినిమా పైరసీని చూపిస్తే చాలు. గజ గజ వణికి పోతాడు. సినిమా ఫ్లాప్ అయ్యిందనగానే డేరా ఎత్తేసుకు పోయే టూరింగ్ టాకీసు వంటి ఈ నట కుటుంబీకులలో, అసలుకే సినిమా నిరుద్యోగులెక్కువ మంది ఉన్నారు. [‘మగధీర’ వంటి ఖరీదైన సినిమా రీలీజ్ అవ్వటానికి ముందు రోజే పైరసీ సీడీ వచ్చింది మరీ!]

నటుడిగా రాణించలేక, తెర వెనక్కి వెళ్ళిన బావమరిది అల్లు అరవింద్ దగ్గరి నుండీ (అవునూ! ఇప్పుడీ కాంగ్రెస్ లో విలీనం విషయంలో అల్లు అరవింద్ గారి అడుగుల చప్పుడు గానీ, అరుపుల చప్పుడు గానీ కనబడటం లేదూ, వినబడటం లేదు. ఎందుకో మరి!?) బయటి సినిమాలు లేక గోళ్ళు గిల్లుకుంటున్న తమ్ముళ్ళు, మేనల్లుడు, కొడుకూ…!

ఎలా నెట్టుకు రావటం? పైరసీ భూతంతోనూ, ఫ్లాపులతోనూ కెరీర్ గుండమై పోదూ! ఇదీ భయం!

మరోభయం ఏమిటంటే పార్టీని కొనసాగించాలంటే కార్యాలయ ఖర్చుల దగ్గరి నుండి అన్నిటికీ సొడ్డు వదులు తుంది. కాంగ్రెస్ లో విలీనం చేస్తే అవన్నీ తప్పుతాయి. అసలే పార్టీ కొత్తదైనా టిక్కెట్లు అమ్ముకునేంత డబ్బు కౌపీనం ఇతనిది. [ఇమేజ్ తనదైనప్పుడు దానికి ఖరీదు ఉంటుంది కదా! ఇదీ అతడి అభిప్రాయం!]

ఇకపోతే… ఇతడికి తెలియని విషయం ఒకటుంది.

కాంగ్రెస్ అధిష్టానం, ఆమెకి అండదండా అయిన ఈనాడు రామోజీరావూ… తమకి అవసరమైనప్పుడు అవతలి వారికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అవసరం తీరాక ఎత్తి అవతల కొడతారు.

ఆ విషయంలో అనుభవజ్ఞులు ఎర్ర పార్టీలూ, అమర్ సింగ్, ములాయం సింగ్ లూ, జగనూ, కేసీఆర్, శిబు సోరెన్…గట్రాలు చాలామందే ఉన్నారు.

పోర్ట్ పోలియో లేకుండానే మంత్రిగా కొనసాగిస్తూ కేసీఆర్ కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో! అడిగిందే తడవుగా అప్పాయింట్ మెంట్లు, పత్రికల్లో ప్రత్యేక వార్తా కధనాలు!

జగన్ కీ అంతే! తండ్రి పోయాక 50 రోజులకి ఢిల్లీ వెళ్తే, మహారాష్ట్ర గట్రా మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్న రోజున కూడా… అన్ని పనులూ పక్కన బెట్టి, ఆఘమేఘాల మీద ఢిల్లీ యేతర పర్యటన ముగించుకు వచ్చి మరీ అధినేత్రి… ఈ జంటిల్ మెన్ కి అప్పాయింట్ మెంట్ ని దాదాపు గంటకు పైగా ఏకాంతంగా మాట్లాడింది. ఇప్పుడు?

ఇదే అనుభవం ములాయం, అమర్ సింగులది కూడా! ముఖ్యంగా వాళ్ళ బ్యాక్ ఫోర్స్ అనిల్ అంబానీ పరిస్థితి మరీ ఘోరం! [అమర్ సింగ్, ములాయంలు ప్రజలను నధింగ్ చేసి, తమ చర్యలకు తమ భాష్యాలు చెప్పి కాంగ్రెస్ అధిష్టానానికి ఉపయోగపడ్డారు. సువర్ణముఖిగా తమ రాష్ట్రంలో తాము నధింగ్ అయ్యారు. ఇది నెం.5 వర్గం ప్రజలతో సహా అందరికి ఎవరి సువర్ణముఖి వారికి వర్తింపచేస్తున్న విధానం!]

ఇతరుల ఈ అనుభవం స్వీయానుభవం అయ్యేటప్పటికి చిరంజీవి ఎక్కడుంటాడో? పులుసులో కరివేపాకుకి తెలియాల్సిందే!

ఇతరులకి ఇంత స్పష్టంగా…కాంగ్రెస్ అధిష్టానంసోనియా ‘ఏరుదాటే వరకూ ఓడమల్లయ్య, ఏరు దాటాకా బోడి మల్లయ్య’ అంటుందని అర్ధమైనా…చిరంజీవికి ఎందుకు అర్ధం కావటం లేదూ? … అంటే…

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనుకోవాల్సిందే!

మరో విషయం ఏమిటంటే – దశాబ్దాల పాటు జీవితం, సినీ మాయ జగత్తులో గడిపినందున, ఇతడికి వాస్తవిక జ్ఞానం యించుక లోపించింది. వృత్తిగత ప్రభావాల వంటిది ఇది. (Professional defect.)

భూమ్యాకర్షణ శక్తికి విరుద్దంగా, నేల మీది నుండి నాలుగంతస్థుల భవంతిపైకి ఝూమ్మని జంప్ చేయటం, అయిదంతస్థుల భవనాల నుండి అమాంతం నేలపైకి దూకినా కాళ్ళు చేతులూ విరక్కుండా ఫైటింగులు చేయటం, ఒక్కడే ఒంటి చేత్తో వంద మందిని విరగ దన్నటం వంటి, అవాస్తవిక సంఘటనలలో నటించీ నటించీ, వాస్తవిక దృక్పధం కొరవడటం ఇది.

ఇక… వీటన్నిటి కంటే…ఇప్పుడు చిరంజీవితో కాంగ్రెస్ అధిష్టానం దూతగా ఆంటోని ఆగమనం, ఆహ్వానం, మంతనాల నాటకాలకి మూల కారణం మరొకటుంది. దాన్ని మరోసారి చర్చిద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

కారణాలేమైనా గానీ…తెలంగాణాలో సీనియర్ నేతా, ‘కాకా’గా పిలవబడే వాడూ, దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ కెరీర్ గల వాడూ అయిన వెంకట స్వామి…ఒక్కసారిగా ‘బ్రేక్’ అయ్యాడు.

దాంతో కాకా…గావు కేక పెట్టాడు.

వాళ్ళనీ వీళ్ళనీ గాక… ఏకంగా, పార్టీ అధ్యక్షురాలికి గురిపెట్టి మాటల తూటాలు పేల్చాడు. తుస్సంటాయో, బుస్సంటాయో తర్వాత విషయం! ముందైతే నోరు విప్పి ‘సోనియా…దిగిపో’ అన్నాడు.

‘ఆమెకి క్షేత్ర స్థాయి అనుభవం లేదు. ఆమె నాయకత్వంలో పార్టీ మట్టి గొట్టుకు పోతుంది. ఈ విదేశీ వనిత వద్దు. దేశీయ అధ్యక్షుడు కావాలి’…అన్నాడు.

ఇక చూస్కోండీ…!

కేకే, వీహెచ్, డీఎస్ వంటి ‘తెలంగాణా’ నేతలు, కాకాని తిట్లు లంకించుకున్నారు.
సిగ్గూ లజ్జా… లేశమాత్రం లేకుండా, తమ కట్టు బానిసతనాన్ని, నిగ్గర్ల నైజాన్ని మరోసారి ప్రదర్శించుకున్నారు.

476. ఈగ – ఇలాంటి నిగ్గర్లు ఇప్పటికీ ఉన్నారు! [10/12/10]
http://ammaodi.blogspot.com/2010/12/blog-post.html

“కాకా స్పృహలో ఉండి మాట్లాడినట్లు లేడు. ఆయనవి నీచమైన మాటలు. సోనియా లాంటి త్యాగమయిని (కొవ్వొత్తిని) విదేశీ వనిత అనొచ్చా? ఆయ్” అంటూ కోప్పడ్డాడు డీఎస్.

కాకపోతే…

“నాకు దేశం ప్రధానం. కుమారుడు కాదు. ఎంపీ అయిన కుమారుడికి ఇబ్బంది వస్తుందని, దేశం ఏమై పోయినా చూస్తూ ఉండాలా?” అంటూ వెంకటస్వామి… తాను స్పృహలో ఉండే మాట్లాడుతున్నానని చెప్పకనే చెప్పుకున్నాడు.

ఇక వీహెచ్… “రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే కాకా నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆయన వాలకం తిని తిన లేదన్నట్లుగా ఉంది. ఆయన వ్యాఖ్యలు చూసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రక్తం ఉడుకుతుంది (తన రక్తం కూడా ఉడుకుతుందట)’ అని సెలవిచ్చాడు.

[కార్యకర్తల రక్తం… మండే ధరలకి ఆవిరై, ఎప్పుడో ఇగిరి పోయింది. ఇంకెక్కడ ఉడుకుతుంది గానీ…అదలా ఉంచండి.]

నిజానికి వెంకట స్వామి పక్కా రాజకీయ నేత. అందరు రాజకీయ రాక్షసుల్లాగే అతడూ… అన్ని దారులా సంపాయించ ప్రయత్నించిన వాడే! కొంత సఫలత, కొంత విఫలతా పడిన వాడే! తన కుటుంబం నుండి ఓ కొడుకుని ఎంపీగా, ఓ కొడుకుని ఎంఎల్ ఏగా, అల్లుణ్ణి మంత్రిగా పదవులు రాబట్టుకున్న పచ్చి స్వార్ధ పర రాజకీయ నాయకుడే!

అదే విధంగా… 2007 జూన్ లో ప్రతిభాపాటిల్ ని రాష్ట్రపతిగా సోనియా ఎంపిక చేసిన తదనంతర కాలంలో… ‘తాను రాష్ట్రపతి పదవికి అభ్యర్ధించినా, తనని కాదని, ఊరూ పేరూ తెలియని ఆమెని తెచ్చి అధ్యక్ష భవనంలో కూర్చొపెట్టారని’ అంగలార్చిన వాడే! అడప దడపా…(తనకి కాంగ్రెస్ అధినేత్రి అపాయింట్ మెంట్ నిరాకరించి నప్పుడల్లా) ఇది గుర్తుకు తెచ్చుకుని… రొప్పుతూ దెప్పి పొడిచిన వాడే!

అయితే…రాష్ట్రపతి పదవి ఆశించి భంగపడీ మూడున్నరేళ్ళయ్యింది. మరో ఒకటిన్నర సంవత్సరం ఓర్చుకుంటే…మరింతగా విధేయత చూపుతూ, అధినేత్రి కాళ్ళుపిసికితే…రాష్ట్రపతి పదవి వరించే అవకాశం ఉంది. అలాంటి చోట…చూస్తూ చూస్తూ చేజేతులా అవకాశాన్ని ఎవరు కాలదన్నుకుంటారు?

అలాంటి చోట… వెంకట స్వామి (కాకా) అంతగా ‘బ్రేక్’ అయ్యాడంటే… ఎప్పుడో రాష్ట్రపతి పదవీ భంగపాటు కారణం కంటే, తాజాగా ‘చిరంజీవి కివ్వబడిన ప్రాధాన్యమే’ (తానే చెప్పుకున్నట్లు) కారణం కావడానికి అవకాశాలెక్కువ.

ఇకపోతే…కాకాని ఇన్ని మాటలంటున్న వీహెచ్ కి, ఇప్పుడున్న రాజ్యసభ సభ్యత్వంతో పాటు, ఇతర ప్రయోజనాలకి గండి కొట్టబడితే…అప్పుడు అతడూ కాకా లాగే పెను కేకలు పెడతాడన్నది ఎవరికైనా అర్ధమయ్యేదే!

ఎవరి ‘బ్రేక్ పాయింట్’ వారిది మరి!

[నిజం చెప్పాలంటే – వీళ్ళందరి ఉమ్మడి నైజం – ప్రజల సొమ్ము ఎలా దోపిడి చేయాలన్నదే గానీ, ప్రజలకి సేవ చేయడం కాదు. సోనియా వీరభక్తుల ఆవేశం, ఆవేదన ఏమిటంటే – తమ దొంగల రాణిని తిడితే, ఎక్కడ తమ గ్రూప్ వీక్ అయి, తమ అవకాశాలు తగ్గి పోతాయోననే బాధ తప్పితే, నాయకురాలి మీద ప్రేమ కాదు. ఎందుకంటే ఇప్పుడు తమ దొంగల రాణిని తిడుతున్న కాకా కూడా ఒకప్పుడు డీఎస్, వీహెచ్, కేకేల్లాగా నాయకురాలికి వీరభజన చేసిన వాడే!]

ఇక సోనియా వీరభక్తుడు కేకే! పదీ జనపథ్ లో తిన్న దోశలూ, పూరీలు అరిగే వరకూ… విధేయత పాఠాలు, ‘సోనియాని ఎవరైనా ఏమైనా అంటే సహించేది లేదన్న’ భక్తి పాటలూ వల్లిస్తూనే ఉంటాడు.

ఇదంతా పక్కన బెట్టినా…

వెంకట స్వామి ప్రశ్నించినట్లు…2009 ఎన్నికలప్పుడే గాక… నిన్న మొన్నటి దాకా,

‘కాంగ్రెస్ పాపపంకిలం’ ’అవినీతి సాగరం’ కాంగ్రెస్ ని భూస్థాపితం చెయ్యాల్సిందే’ అన్న చిరంజీవితో…

‘కాంగ్రెస్సోళ్ళని పంచెలూడేలా కొడతాం’ అని సోదరుల చేత నాలుకలు రువ్వించిన చిరంజీవితో…

కాంగ్రెస్ ఎందుకు, (అతడి ఇంటికి ఆంటోనిని పంపి మరీ) వ్యవహారాలు నడుపుతున్నట్లు?

దశాబ్దాల తరబడి విధేయత చూపిన సీనియర్లకి, చివరికి తెలంగాణా వ్యవహారమై వెళ్ళినా, వై.ఎస్.(అతడు బ్రతికి ఉన్న రోజుల్లో) పై ఆరోపణలతో వెళ్ళినా… రోజుల తరబడి పడిగాపులు పడినా… పదీ జనపథ్ తలుపులు తెరుచుకోలేదు.

అదే చిరంజీవికి… తొక్కలోది పదిహేనుమంది ఎమ్మెల్యేలున్న వాడికి అంత ‘రాయల్ ట్రీట్ మెంటే’మిటి? స్వయంగా అధిష్టానం దూతగా ఆంటోనీ, చిరంజీవి ఇంటికి పోయి మాట్లాడిన ప్రాధాన్యతేమిటి? అణిగి మణిగి ఉన్న వాళ్ళని మరింత నిర్లక్ష్యం చేస్తూ, ధిక్కరించి పోయిన వాణ్ణి బ్రతిమిలాడుతూ, తలెగరేసిన వాళ్ళని బుజ్జగిస్తూ…అసలు కాంగ్రెస్ అధిష్టానం పాట్లేమిటో, పాపం వెంకట స్వామికి అంతు చిక్కనట్లుంది. అందుకే ‘బ్రేక్’ అయిపోయాడు.

దెబ్బతో కాంగ్రెస్ వాళ్ళల్లో కలకలం రేగింది. అంతా కలిసి కాకాని తలో మాట అంటున్నారు. రేపో మాపో…‘వయసై పోయింది రాష్ట్రపతి పదవి ఆశించి భంగపడ్డాడు. నిరాశ ఆవరించి, మతి స్థిమితం తప్పింది’ అని టాంటాం వేసేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆ విషయంలో బాగానే ముందడుగులో ఉన్నారు కాంగ్రెస్ అధినేత్రి విధేయులు.

అయితే ఎంతగా ‘మతిస్థిమితం కోల్పోయాడు’ అందామన్నా, (స్వయంగా అతడి కుటుంబ సభ్యుల చేతే నయానో భయానో అనిపించినా)… అతడి మాటల్లో ఓ ‘లాజిక్’ ఉంది.

అదేమిటంటే – ‘చిరంజీవి స్వయంగా తాను సమైక్యవాదిని అని ప్రకటించుకున్నాడు. తమ పార్టీ, ప్రరాపా కూడా సమైక్యమే నన్నారు. మరి అలాంటి ప్రరాపా, చిరంజీవితో పొత్తు కుదుర్చుకోవాలనో, మరొకందుకో, ఆంటోనీ స్వయంగా వచ్చి మంతనాలాడారంటే – తద్వారా కాంగ్రెస్, తెలంగాణా వాదులకు ఏమని సంకేతాలిస్తోంది? – అని అడుగుతున్నాడు. సబబే కదా!
[కాంగ్రెస్ లో ప్రరాపా విలీనమైతే అది వేరే విషయం. అప్పుడు తెలంగాణా విషయంలో చిరంజీవి, అధిష్టానం మాటే నామాట అంటాడా? నిన్నటి దాకా కాంగ్రెస్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ఇప్పుడు విలీనమైతే… చిరంజీవి తన ‘కమేడియనిజాన్ని’ నిలబెట్టుకున్నట్లే! లాబీయింగ్ తో హీరోగా కొనసాగటానికి, గాడ్ ఫాదర్లు చెప్పినట్టల్లా చేయటం మాత్రమే నేర్చుకున్న చిరంజీవి వంటి నటుల నిజనైజం అది! ]

అలాంటి సబబైన ప్రశ్నకి… డీఎస్, కేకే, వీహెచ్ ల వంటి తెలంగాణా నాయకులు, ఏం సమాధానం చెబుతారు? “తెలంగాణా కోసం ప్రాణాలు లెక్కచెయ్యం. పదవి ఓ లెక్క లేదు. విసిరి అవతల పారేస్తాం” అన్న కేకేల వంటి వాళ్ళు… ఇటీవలి కేంద్రమంత్రి వర్గ విస్తరణ నేపధ్యంలో ‘తెలంగాణాకీ పదవులకీ సంబంధం లేదు. మంత్రి పదవి ఇస్తానంటే తీసుకుంటాం’ అని ప్రకటించటం చూసి, జనం నోళ్ళలెళ్ళ బెట్టి ఉన్నారు.

ఇదంతా పరిశీలించి చూస్తే…ఇంతగా expose అవుతున్నా, తెలంగాణా ప్రజలకి తమ నాయకుల నీచ స్వభావాలు అర్ధంకావటం లేదా?’ అనిపిస్తోంది (ఏ పార్టీ అయినా ఒకటే! ఏ ప్రాంత నాయకులైనా ఒకటే! ఏ ప్రాంత ప్రజలకైనా ఇంతే!) కెరీర్ కోసం ఏ నీచానికైనా వెనుదీయని లజ్జాహీనత చూసి జుగుప్స కలగటం లేదా తెలంగాణా సామాన్యుడికి?

ఇంకా పైగా…సోనియా వీరభక్తులు, వెంకటస్వామిని కోప్పుడుతూ…‘అతడికీ, అతడి కుటుంబానికీ కాంగ్రెస్ ఎన్నో పదవులిచ్చి ఎంతగానో ఆదరించింది. అతడి కుటుంబం కాంగ్రెస్ కి ఋణపడి ఉండాలి’ అని సుద్దులు చెబుతున్నారు.

కాంగ్రెస్ అంటే సోనియానా? ఈమె వచ్చింది 1998లో! ఈ పదమూడేళ్ళేగా! అంతకు ముందు నుండీ, దశాబ్దాలుగా, వెంకట స్వామి, అతడి కుటుంబం రాజకీయాల్లో ఉన్నారు గదా! అయినా…పదవులిచ్చింది కాబట్టి ప్రశ్నించకూడదా! ఇది కాదూ అవినీతి అంటే!?

అదీగాక…కాంగ్రెస్ లో ఎవరు ఎవరిని విమర్శించినా (గతంలో కూడా) ‘తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనీ, అసంతుష్టులు తమ అసంతృప్తిని అలా వెళ్ళగక్కుతారనీ, కనుక విమర్శలు సహజమేననీ!’ బోలెడు ఆత్మసూక్తులు వల్లిస్తారు కదా! మరి అవన్నీ సోనియాకి వర్తించవా!? ఆమెకేం ప్రత్యేకతలున్నాయో మరి! ‘కాంగ్రెస్ ని బండ తిట్లు తిట్టినా ఫర్వాలేదు. సోనియాని అంటే మాత్రం కళ్ళు పోతాయి’ అన్నట్లు గింజుకుంటారెందుకు?

‘గతంలో శరద్ పవార్, సోనియా విదేశీయతని ప్రశ్నించినప్పుడు, అతడి కారణాలు అతడివి. ‘అప్పటి వరకూ, పీవీజీ హయాంలో కూడా నెంబర్ టూ పొజిషన్ గా పేరుబడ్డాననీ, తదుపరి ప్రధాని అవకాశం తనదేననీ’ అనుకుంటూ రాజకీయాలు నడుపుతున్న పవార్ కి, కాంగ్రెస్ పగ్గాలు సోనియా చేపట్టటం అశనిపాతంలా తగిలింది.

దాంతో ఆమె విదేశీయతని ప్రశ్నించి స్వంత పార్టీ పెట్టుకున్నాడు. తర్వాతి కాలంలో గూఢచర్య బలానికి తలొగ్గి పొత్తు పెట్టుకున్నాడు. అయితే పవార్ సోనియాని విమర్శించినప్పుడు, ఈ సోనియా భక్తులు ఇంత వీరంగమూ చేసారో లేదో, ఇప్పుడెవరికీ గుర్తు లేదు.

ఏదేమైనా… కాంగ్రెస్ ని తిట్టు. ‘అది పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం’ అంటారు.

కాంగ్రెస్ లోని గతించిన నాయకుల్ని తిట్టు. అసలు పట్టించుకోరు.

అప్పట్లో ‘ఇందిరాగాంధీ వంటి వాళ్ళనీ విమర్శించారు గదా?’ అని గుర్తు చెయ్యి. ‘పార్టీలో అసమ్మతి ఉన్నప్పుడు అది సహజం’ అంటారు.

అదే… సోనియాని, తిట్టక్కేర్లేదు విమర్శించినా చాలు! గఁయ్యిన లేస్తారు. సదరు సోనియా అంత ప్రత్యేకమైన వ్యక్తి కాబోలు! ఆమెకేమీ రాక్షసుల మాదిరి కొమ్ములూ కోరలూ గానీ, లేక కర్ణుడి మాదిరి సహజ కవచకుండలూ గానీ ఉన్నాయేమో! అలాంటి ప్రత్యేకతలున్నప్పటికి రాక్షసులూ, కర్ణుడూ కూడా మాటలూ పడ్డారు, దెబ్బలూ తిన్నారు గానీ, ఈ ఇటలీ స్త్రీ మాత్రం మరింత ప్రత్యేకం మరి! అంతగా ఆమెని కాపాడుకొంటుంది నకిలీ కణిక వ్యవస్థ!

ఇక… వెంకట స్వామి అన్న మరోమాట!

‘సోనియాకి క్షేత్రస్థాయి అనుభవం లేదు’. అతడికి ఆలస్యంగానైనా గుర్తుకొచ్చిన నిజం ఇది. డీఎస్ గట్రాలకి ఇంకా గుర్తుకు రావటం లేదులెండి!

ఓ చిన్న ఉదాహరణ చూద్దాం!

గత ఎన్నికలప్పుడు, చిరంజీవి కాంగ్రెస్ ని దుమ్మెత్తి పోస్తూన్నప్పుడు, క్రింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలూ… చిరంజీవి అభిమానులూ… ఒకరికొకరు పోటీపడుతూ, ఒకరికొకరు జాతర బొమ్మలై పోయి, తెగ తిట్టుకున్నారు. చెప్పుకోదగినంతగా వైషమ్యం చిమ్ముకున్నారు.
ఇప్పుడు పైస్థాయిలో నాయకులు… వాళ్ళూ వాళ్ళూ రాజీ పడిపోతే… వీళ్ళు వెర్రి వెంగళప్పల్లా, నోట్లో వేలేసుకు చూస్తూ నిలబడటం… ఎంత బాధాకరంగా, ఎంత లజ్జా హీనంగా ఉంటుందో తెలియాలంటే…క్షేత్రస్థాయి అనుభవం ఉండాల్సిందే మరి!

అంతే కాదు, కాంగ్రెస్ కండువా మార్చకుండా క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్యెల్యేలకు పదవులు ఇవ్వకుండా, అవసరార్ధం తెచ్చుకున్న ప్రక్క పార్టీ నాయకులకు పదవులను కట్టబెడితే, పార్టీకి పని చేసిన కార్యకర్తల పరిస్థితి… ఎంత బాధాకరంగా ఉంటుందో తెలియాలంటే…క్షేత్రస్థాయి అనుభవం ఉండాల్సిందే మరి!

ఇంత చేసినా…వెంకట స్వామి మీద చర్య తీసుకునేందుకు సోనియాకి ధైర్యమే చాల్లేదో, పరిస్థితులింకా అర్ధం కాలేదో, లేక పై‘బాసు’ నుండి అసైన్ మెంట్ రాలేదో గానీ…ఇప్పటికీ అవే సన్నాయి నొక్కులు… అరిగి పోయిన రికార్డు లాగా…అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అంటున్నారు పార్టీ అధికార ప్రతినిధులు.

ఆ సరైన సమయం ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే!

[ఇక ఇంత సీనియర్ నాయకుడు ఎందుకంతగా బ్రేక్ అయ్యాడో అన్నది ఆసక్తికరమైన అంశమే! దాన్ని మరోసారి పరిశీలిద్దాం.]
వీటన్నిటిలో ఓ మాంచి మెరుపు తునక ఏమిటంటే…

పది రోజుల క్రితం జగన్ వర్గీయుడు అంబటి రాంబాబు, సోనియాని ‘సైతాన్’ అన్నాడు.

ఆ వ్యాఖ్య పూర్తి పాఠం – “వై.యస్.ని ఇప్పుడు అవినీతి పరుడు అంటున్నారు. అతడు అవినీతి పరుడైతే…అతడి పాలనని ఎప్పటికప్పుడు సమీక్షించిన వీరప్ప మొయిలీ, సోనియాలని కూడా అవినీతిపరులే అనాలి. జగన్ ని అణిచి వేయటానికి ప్రయత్నిస్తున్న నలుగురు సైతాన్ లలో సోనియా ఒక సైతాన్ (దుష్ట చతుష్టయం, సూచనలు సోనియా టు బాబు వయా కిరణ్, రామోజీరావు)” అన్నాడు.

దాంతో కాంగ్రెస్ నేతలు (షరా మామూలుగా హల్ చల్ లు నిర్వహించే ఏక్ దిన్ కా వార్తల కింగులు) గఁయ్యిమంటూ… ‘సోనియాని విమర్శించే పాటి వాడివా?’ ‘సోనియాని సైతాన్ అంటావా?’ అంటూ హుకరించారు. అయితే… గురి అంతా (concentration) కేవలం ‘సైతాన్’ అన్నమాట మీదే ఉంది.

ఆ విధంగా… అసలు వ్యాఖ్య ‘వై.ఎస్.ని అవినీతి పరుడంటే, అతడి పాలనని సమీక్షించిన వీరప్ప మొయిలీ, సోనియాలని కూడా అవినీతి పరులనాలి’ అనేది కాస్తా మరుగున పడిపోయింది.

అలా మరుగున పడేటందుకే…‘సైతాన్ అంటావా?’ అన్న మాట మీద ఫోకస్ చేసారు. అది చల్లారుతూ చల్లారుతూ ఉండగానే కాకా…గావుకేక మొదలైంది.

అందులోనూ ఈ వృద్ధ రాజకీయ నేత…

>>>గతంలో రాష్ట్రం నుండి ప్రతినెలా, దూత కేవీపీ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళి దక్షిణలు ముట్టచెప్పి వచ్చేవాడు. సోనియా అవినీతి గురించి తర్వాత మాట్లాడుకుందాం”… అంటూ విమర్శించడం విశేషం!

మొత్తానికి ‘రాజకీయ జంబలకిడి పంబ’ ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మొన్న ముషారఫ్

ఈ రోజు ముబారక్

ఇలా… ఒక్కో స్థంభమే కూలిపోతుంటే

దోపిడిని ప్రతిఘటిస్తూ

ప్రజా ఉద్యమాలు ఎగుస్తుంటే

ప్రస్తుతం దూరదేశాల్లో… ప్రతిధ్వనిస్తున్న ఉద్యమహోరు

రేపు ఇంటి ముంగిటికి రావా!

ఇలా…యముని మహిషపు లోహ ఘంటలు

వీనుల కంటకంగా వినిపిస్తుంటే

గణగణమని సమీపిస్తుంటే

కళ్ళ క్రింద వలయాలు

కళ్ళు మూస్తే కనబడే ప్రళయాలు

నిద్ర రాకుండానే పలకరించే కలవరాలు

ప్చ్!

ఎంత కష్టం!?

మీడియా కింగులకీ

రాజకీయ రాణులకీ

ఎంత కష్టం! ఎంత కష్టం!?

గతనెల (జనవరి) చందమామలో ప్రచురితమైన నా కథ! ఇంకా చందమామ పుస్తకం(కాంప్లీమెంటరీ కాపీ)అందనందున ఫోటోలతో సహా ప్రచురించలేక పోతున్నాను.

కుందన గిరి గ్రామంలో ఒకప్పుడు సిద్దరాముడు అనే యువకుండేవాడు. వాడు ఆరేళ్ళ వయస్సులో ఉండగా, అంతుచిక్కని జబ్బు చేసి వాడి తల్లి మరణించింది. ఆ బెంగతో మంచం పట్టిన వాడి తండ్రి ఆరునెలలు తిరిగేసరికల్లా కాలం చేసాడు.

అప్పటి నుండి వాడి బాగోగులు, వాడి మేనత్త సూరమ్మ, ఆమె భర్త శంకరయ్య చూసుకునే వారు. సిద్దరాముడు కాస్త అమాయకుడు. కానీ మంచి వాడూ, కష్టించి పనిచేసే వాడు. వాడికి భయం అన్నదే తెలియదు.

వాడి తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుండి సిద్దరాముణ్ణీ వాడి ఆస్థిపాస్తుల్నీ దగ్గరుండి చూసుకునేందుకు సూరమ్మత్త, శంకరయ్య మామలు, వాళ్ళ ఊరు వదిలి కుందరగిరికి వచ్చేసారు. మొదట్లో సూరమ్మత్త సిద్దరాముణ్ణి బాగానే చూసుకునేది. సూరమ్మత్తకు సంతానం కలగలేదు. దాంతో క్రమంగా సిద్దరాముడి మీద తెలియకుండానే ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంది.

ఇరుగుపొరుగు అమ్మలక్కలు "నీకెటూ పిల్లలు లేరు కదా సూరమ్మ! సిద్దరాముడినే నీ కొడుకనుకో!" అనటంతో సూరమ్మకి కడుపు మంట పెరిగిపోయేది.

దాంతో ఎవరూ చూడనప్పుడు సిద్దరాముడి నెత్తి మీద మొట్టికాయలు వేసేది. ఆ వంకా ఈ వంకా పెట్టి తెగ తిట్టేది. భార్యను సంతృప్తి పరవటానికి శంకరయ్య కూడా సిద్ద్రరాముడిని ఈసడించి తిడుతూ ఉండేవాడు.

సిద్దరాముడికి మాత్రం సూరమ్మత్త, శంకరయ్య మామలంటే ఇష్టమూ, గౌరవమూ. తల్లిదండ్రులు లేని తనని, చిన్నప్పటి నుండే వాళ్ళే గనక పెంచి పెద్ద చేయకపోయి ఉంటే తాను ఏమై పోయి ఉండేవాడో అనుకునే వాడు. వాళ్ళ మెప్పుకోసం ఇంటిపని, పెరటి తోట పని, పొలం పని చెప్పక ముందే చేసే వాడు. ఐతే రాను, రాను సూరమ్మ గయ్యాళితనం పెరిగిపోసాగింది. సిద్దరాముడి నెత్తిమీద మొట్టటం సూరమ్మత్త కీ, తిట్టటం శంకరయ్య మామకీ అలవాటై పోయింది.

దాంతో ఒక రోజు ఇదంతా తలచుకుని సిద్దరాముడికి చాలా బాధ కలిగింది. పొలం నుండి ఇంటికి రా బుద్ది కాలేదు. అడవి దారి పట్టి అలా నడుచుకు పోయాడు. సాయంత్రం అయ్యేసరికి ఓ సెలయేరు వద్దకు చేరాడు. నీటిలో కాళ్ళూ చేతులూ కడుక్కుని, దాహం తీర్చుకున్నాడు. ఒడ్డునే ఉన్న చింత చెట్టు క్రింద జారగిల పడ్డాడు. తన స్థితి తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

ఇంతలో చెట్టుపై నుండి భీకర శబ్దం వినిపించింది. వాడి చుట్టూ గులక రాళ్ళు వర్షం కురిసింది. ఒకట్రెండు రాళ్ళు వాడి మీద కూడా పడ్డాయి. ‘శంకరం మామ కూడా, డబ్బాలో గులకరాళ్ళు వేసి గలగల లాడించినట్లుగా తనను తిడుతూ ఉంటాడు’ అనుకున్నాడు సిద్దరాముడు.

అంతలో టపటప చింతకాయలు రాలి వాడి నెత్తి మీద పడ్డాయి. మేనత్త మొట్టికాయలు ఇలానే ఉంటాయి కదా అనుకునే సరికల్లా, అంత బాధలోనూ వాడికి నవ్వు వచ్చింది.

అంతలో చెట్టు మీదినుండి గబిల్లున వాడి ముందు దూకిందో దయ్యం. పొట్టిగా లావుగా ఉన్న ఆ దయ్యం, సిద్దరాముడిని భయపెట్టటానికా అన్నట్టు, వికృతంగా అరుస్తూ వింత చేష్టలు చేసింది.

మన వాడికి అసలే భయం తెలియదయ్యే! దాని వింత చేష్టలు వికృతపు కూతలు చూసి, ఫకాలున నవ్వాడు. అంత సేపు వాడిని భయపెట్టటానికి చిందులు తొక్కిన దయ్యం, ఆయాసంతో రొప్పుతూ "ఒరే అబ్బి! నీకు భయం వేయటం లేదూ?" అంది.

"ఎందుకూ భయం?" అన్నాడు సిద్దరాముడు.

"నీ చుట్టూ రాళ్ళ వర్షం కురిపించాను. నెత్తి మీద చింతకాయలు కురిపించాను"అంది దయ్యం గుడ్లురుముతూ.

"మా శంకరం మామ తిట్ల వాన, నీ రాళ్ళ వాన కంటే పెద్దది. ఇక నా నెత్తి మీద నువ్వు రాల్చిన చింతకాయలు, మా సూరమ్మత్త మొట్టికాయలతో పోల్చితే సుతారంగా ఉన్నాయి. వీటికే భయపడిపోతానా?" అన్నాడు.

లావుపాటి పొట్టి దెయ్యం వాడి పక్కకు జరిగి "ఒరే అబ్బీ! బ్రతికుండగా అందరికీ భయపడుతు బ్రతికాను. చచ్చి దయ్యాన్నై, అందరినీ భయపెడుతూ సంతోషిస్తున్నాను. నాకు తారసిల్లిన వారందరూ నా చేష్టలకు భయపడి పుంజీలు తెంచుకు పారిపోయారు. నీ ధైర్యం చూసి ముచ్చటగా ఉందిరా అబ్బీ! నీ కధేంటో చెప్పు?" అంది.

సిద్దరాముడు తన కథంతా దానికి చెప్పుకున్నాడు. లావుపాటి పొట్టి దయ్యం "ఒరే అబ్బాయ్! నేనూ నీతో పాటు మీ ఇంటికి వస్తాను. సూరమ్మత్త, శంకరయ్య మామలకు బుద్ది చెబుదాం. ఐతే నేను నీకు తప్ప ఎవరికీ కనబడను. అక్కడ సందర్భాన్ని బట్టీ, నేను ఏం చేస్తే నీకు మేలవుతుందో నాకు చెప్పు. నేనెవరికీ కనబడను కనుక, ప్రత్యక్షంగా నాతో చెప్పినట్లుగా కాకుండా, నేనేం చేయాలో అన్యాపదేశంగా చెప్పు!" అంది.

సిద్దరాముడు "సరే" అన్నాడు. ఇద్దరూ కలిసి ఇల్లు చేరారు. సూరమ్మత్త, సిద్దరాముడిని చూడగానే కోపంతో చిందులు తొక్కింది. శంకరయ్య మామ "పొద్దున్నుంచీ ఇంటికి రాకుండా ఎక్కడికి ఊరేగావు. అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి తిరగకపోతే పనిపాటా చక్కపెట్టవచ్చు కదా? బుద్ది లేని గాడిదా!" అంటూ తిట్లు లంకించుకున్నాడు.

శంకరయ్య మామ తిట్లు ఆపగానే "అమ్మయ్యా! రాళ్ళవాన కురిసినట్లుంది మామయ్యా" అన్నాడు సిద్దరాముడు. వెంటనే లావుపాటి పొట్టి దయ్యానికి తనేం చేయాలో అర్ధం అయిపోయింది. అర చేతి మందాన ఇల్లంతా రాళ్ళవాన కురిపించింది. సూరమ్మత్త శంకరయ్య మామలు నోరెళ్ళపెట్టారు.

సిద్దరాముడు నవ్వుతూ "ఓర్నాయనో! ఈ రాళ్ళన్నీ ఊడ్చి పారేయడానికి సూరమ్మత్త చేతిలో చీపుళ్ళెన్ని విరగాలో" అన్నాడు. దిగ్ర్భాంతి పడిన సూరమ్మ చీపురు చేతిలోకి తీసుకుని ఊడ్చపోయింది. అంతే! చీపురు కాస్తా విరిగికూర్చుంది. మరొక చీపురు తీసుకుంటే అదీ అంతే! భార్యాభర్తలిద్దరూ మ్రాన్పడిపోయారు.

సిద్దరాముడు "బెదిరిపోకు అత్తా! ఎలా వచ్చిన రాళ్ళు అలాగే పోతాయిలే!" అన్నాడు. వాడి ఉద్దేశం అర్ధమైన దయ్యం, రాళ్ళన్నిటినీ మాయం చేసేసింది. అయోమయంలో పడిన సూరమ్మతో సిద్దరాముడు "అత్తా! ఆకలేస్తుంది. అన్నం పెట్టవూ?" అన్నాడు. సూరమ్మ అప్రయత్నంగా తలాడించి వంటింట్లోకి దారితీసింది. కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చి సిద్దరాముడు వంటింట్లో పీట వాల్చుకు కూర్చున్నాడు. అన్నం కూర వడ్డించిన కంచాన్ని వాడి ముందుపెట్టి, అలవాటుగా వాడి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది సూరమ్మ.

సిద్దరాముడు "అత్తా! ఈ రోజేమిటి నీ మొట్టికాయ గట్టిగా కాక సుతిమెత్తగా ఉంది? నీ మెడలోనూ, చేతులకీ ఉన్న నూలు దారపు దండలంత మెత్తగా ఉంది" అన్నాడు. కంగారుగా సూరమ్మ చేతులు చూసుకుంది. చేతులకి బంగారు గాజులకు బదులు నూలు దారపు దండలున్నాయి. మెడ తడిమి చూసుకుంటే చంద్రహారంతో సహా బంగారు నగలన్నీ నూలు దండలై పోయాయి. దెబ్బతో కెవ్వునరిచేసి సూరమ్మ స్పృహ తప్పిపోయింది.

ఈ మాయంతా చేసిన లావుపాటి పొట్టి దయ్యం నిశ్శబ్ధంగా నవ్వసాగింది. సూరమ్మ కేక విని శంకరయ్య పరిగెత్తుకు వచ్చాడు. పరిస్థితి అంతా చూసి సిద్దరాముడి చేతులు పట్టుకుని "రాముడు! నువ్వుగానీ మాయ మంత్రాలు నేర్చుకున్నావేమిట్రా? బాబ్బాబు! మీ అత్తని మామూలు మనిషిని చేయరా. మాకు బుద్ది వచ్చింది. నిన్నుప్రేమగా చూసుకుంటాము" అన్నాడు.

దానికి సిద్దరాముడు "అత్తకీ, అత్త నగలకీ ఏమీ కాదులే మామయ్యా!" అన్నాడు. నూలు నగలు మళ్ళీ బంగారు నగలుగా మారిపొయ్యాయి. సూరమ్మ లేచి కూర్చుని, బిత్తర చూపులు చూడసాగింది. శంకరయ్య కూడా సిద్దరాముడిని బెదురుగా చూస్తున్నాడు.

సిద్దరాముడు "మరేం లేదు మామయ్య! నేను పొలంగట్టు మీద కూర్చునుండగా ఒక దయ్యం కనిపించింది. నా కథంతా విని, మీరిద్దరూ, నన్ను తిట్టి కొట్టటం వంటి చెరుపు చేస్తే మీకూ చెరపవుతుంది" అని వరం ఇచ్చింది అని అన్నాడు.

దయ్యం అనే సరికల్లా శంకరయ్య గజగజ వణుకుతూ "నాయన్నాయన! ఇంకెప్పుడూ నిన్ను తిట్టం! కొట్టం!" అన్నాడు.సూరమ్మ మెల్లిగా కూడదీసుకుంటూ "మరి మేమిద్దరమూ నీకు మంచి చేస్తే, మాకూ మంచి జరగాలనే వరాన్ని అడగకూడదూ ఆ దెయ్యాన్ని?" అంది గొణుగుతున్నట్లుగా!

సిద్దరాముడు "నేనూ అదే అడిగానత్తా! దానికా దెయ్యం, నేను దెయ్యాన్ని, దెయ్యాలు చెడ్డవరాలే ఇస్తాయి. మంచి వరాలు కావాలంతే దేవుణ్ణి అడగాల్సిందే అంది" అన్నాడు.

దానికి సూరమ్మత్త, శంకరయ్య మామ "ఆ దెయ్యం గోల మనకెందుకులేరా! మనం మంచిగా ఉందాం!" అన్నారు. సిద్దరాముడు నవ్వుతూ తలూపాడు. ఎవరూ చూడకుండా లావుపాటి పొట్టి దయ్యానికి కృతజ్ఞత చెప్పాడు.

వాడి దగ్గర సెలవు పుచ్చుకుంటూ దయ్యం "సిద్దరాముడు! నువ్వు అమాయకుడివి కాదు. మంచి వాడివి. ధైర్యస్తుడివి. పైగా తెలివిగల వాడివి. మీ అత్తకి నువ్వేసిన మొట్టికాయలు సుతిమెత్తనివి!" అనేసి చక్కా పోయింది.

ఆనాటి నుండీ సూరమ్మ శంకరయ్యలు, సిద్దరాముడిని కన్నకొడుకులా చూసుకున్నారు. మంచి పిల్లను చూసి పెళ్ళి చేసారు. సిద్దరాముడు వారిని కన్నవారిలాగా ఆదరించాడు.

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu