దోపిడి పందిరికి కనబడని గుంజ కార్పోరేట్ రంగమే అనేందుకు మరొక చిన్న తార్కాణాన్ని పరిశీలించండి. వీలయినప్పుడల్లా మీడియా, ముఖ్యంగా ఈనాడు, తెగ పొగిడి పారేసే వారిలో ధీరూభాయ్ అంబానీ ఒకడు.
చెంపన చెయ్యి జేర్చుకున్న అతడి ఫోటోని తరచుగా ప్రచురిస్తూ, ఆయా పత్రికలు, అవేవో మహత్ముల ప్రవచనాల స్థాయిలో, అతడి స్టేట్ మెంట్లనీ ప్రచురిస్తుంటాయి. అతి సామాన్య స్థాయి నుండి కోట్ల రూపాయల ఆస్థిని సృష్టించిన వ్యాపారవేత్తగా… అతడి గురించి విద్యార్ధులకి పాఠాలు కూడా చెప్పబడ్డాయి.

ఆ so called వ్యాపార దిగ్గజం యొక్క వారసుల విషయం ప్రక్కన బెట్టినా, సదరు ధీరూభాయ్ అంబానీ యే విదేశాల్లో పనిచేస్తూ… వెండి దొంగ రవాణా చేసి డబ్బు సంపాదించడం గురించి గతంలో ‘అమ్మఒడి’ లో వ్రాసాను.
408. అంబానీల ఐశ్వర్యం – వెండి లండన్ కు చేరవేత ! [July 09 , 2010]
http://ammaodi.blogspot.com/2010/07/blog-post_09.html

ఇప్పుడు మన దేశంలోనే, అతడు అడ్మినిస్ట్రేషన్ సాక్షిగా, బ్యూరాక్రాట్లు, మంత్రి మగానుభావుల సహాయసహకారాలతో, ఎంతగా చేతివాటం చూపాడో దిగువ వ్యాసాన్ని ఓ సారి పరిశీలించండి.

>>> 07/12/10

సర్కారుపై వ్యాపారుల పెత్తనమా?
-భరత్ ఝన్‌ఝన్‌వాలా
స్పెక్ట్రమ్ వివాదం సూచిస్తున్నదేమిటి? వ్యాపారులు, మం త్రులు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై సొంత ప్రయోజనాల కోసం చట్టాల నియమ నిబంధనలను మార్చి వేశారనే కాదూ! నిజానికి ఇది పాత కథే.

ఆర్థికవేత్త ఆర్.కె.హజారే (ముంబై విశ్వవిద్యాలయం) 1967లో ప్రణాళికా సంఘానికి ఒక నివేదిక సమర్పించారు. 1957-66 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు జారీచేసిన మొత్తం లైసెన్స్‌లలో 20 శాతం బిర్లా గ్రూపు కంపెనీలకే ఇవ్వడం జరిగిందని హజారే నివేదిక పేర్కొంది.

ఇటీవలి సంవత్సరాలలో అత్యధిక లైసెన్స్‌లను దక్కించుకోవడంలో అంబానీలు అగ్రగాములుగా ఉన్నారు. ప్రభుత్వ వ్యవస్థలోని అత్యున్నత స్థాయి వ్యక్తులపై కార్పొరేట్ సంస్థల ప్రభావానికి దేవెగౌడ ఉదంతం నొకదాన్ని నిదర్శనంగా చెప్పవచ్చు. పద్నాలుగేళ్ళ క్రితం నాటి మాట. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న దేవెగౌడ ప్రధాన మంత్రి పదవికి ఎంపికయ్యారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకై ఆయన బెంగుళూరుకు ధీరూభాయ్ అంబానీ సొంత విమానంలో ప్రయాణించారు! ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ వ్యవహారాలలో బడా పెట్టుబడిదారుల జోక్యం ఉండకుండా ఎలా ఉంటుంది? ఈ చట్ట విరుద్ధ వ్యవహారాన్ని ఎవరూ నిర్ద్వంద్వంగా ఖండించడం లేదు.

ప్రభుత్వం బలహీనంగా ఉన్నప్పుడు, సమర్థ పాలన నందించలేకపోతున్నప్పుడు అవినీతి ద్వారా అవసరమైన పనులను సుళువుగా చేయించుకోవడం సాధ్యమవుతుంది. అయితే అక్రమ ఆర్జనకు, వ్యాపారంలో సమస్థాయిలో లేని పోటీదారులను అణచివేయడానికి కూడా అవినీతి ఉపయోగపడుతుంది. ఇదొక తరహా అవినీతి.

హ్యామిష్ మెక్‌డోనాల్డ్ తన గ్రంథం 'అంబానీ అండ్ సన్స్' లో ఇటువంటి అవినీతికి పలు ఉదాహరణలను పేర్కొన్నారు. సింథటిక్ వస్త్రాలను 'పాలియెస్టర్ ఫిలామంట్ యార్న్' (పిఎఫ్ వై) నుంచి తయారు చేస్తారు. 1970ల్లో మన దేశంలో పిఎఫ్‌వై కొరత తీవ్రంగా ఉండేది. దేశీయ మార్కెట్‌లో దాని ధర అంతర్జాతీయ విపణిలోని ధర కంటే దాదాపు పదిహేడు రెట్లు ఎక్కువగా ఉండేది.

అటువంటి పరిస్థితులలో, నైలాన్ వస్త్రాలను ఎగుమతి చేసి పిఎఫ్‌వై ను దిగుమతి చేసుకోవడానికి అనుమతి జారీ చేసేందుకు ఆర్థిక మంత్రి టి.ఏ.పాయ్‌ను ఒప్పించడంలో ధీరూభాయ్ సఫలమయ్యారు. దరిమిలా ఆయన నైలాన్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేశారు. నిజానికి ఈ ఎగుమతి కాగితాల మీద మాత్రమే జరిగింది. అప్పట్లో నైలాన్ ధర అంతర్జాతీయ విపణిలో మీటరుకు రెండు రూపాయల కంటే తక్కువగా ఉండగా తాను నాలుగు రూపాయలకు అమ్మినట్టు ధీరూభాయ్ పేర్కొన్నారు.

నిజానికి ఆయన నైలాన్ వస్త్రాలను ఓడరేవుల్లోనే ఉంచారు. లేదూ అడిగిన ధరకు విక్రయించారు. ఆయన లక్ష్యం పిఎఫ్‌వైను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన పర్మిట్‌లను సమకూర్చుకోవడమే. నైలాన్ ఎగుమతుల మూలంగా ఆ పర్మిట్లు ఆయనకు మంజూరయ్యాయి. అలా దిగుమతి చేసుకున్న పిఎఫ్‌వైని భారీ ధరకు విక్రయించి భారీ లాభాలను ఆర్జించారు. 'ఎగుమతి' చేసిన నైలాన్ మీద వచ్చిన నష్టం కూడా ఆ లాభాలతో తీరింది.

1982లో అంబానీల పాతాళగంగ ప్లాంట్ ప్రారంభమయింది. ఆ వెంటనే పిఎఫ్‌వై పై ప్రభుత్వం టన్నుకు 15 వేల రూపాయల చొప్పున అదనపు దిగుమతి సుంకాన్ని విధించింది. డంపింగ్ (ఎగుమతి చేసే దేశం తన మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువ ధరకు ఎగుమతి చేయడం) కు వ్యతిరేకంగా ఈ అదనపు సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. నిజానికి అప్పుడు డంపింగ్ అనేది జరగడం లేదు.

అదనపు సుంకాలతో దేశీయ మార్కెట్‌లో పిఎఫ్‌వై ధర విపరీతంగా పెరిగిపోయింది. అంబానీకి లాభాలు మరింతగా పెరిగాయి. అసలే కొరతగా ఉన్న సరుకు దిగుమతిపై అదనపు సుంకాన్ని విధించడమేమిటి? ఈ విషయమై 'ఆల్ ఇండియా క్రింపర్స్ అసోసియేషన్' తీవ్ర నిరసన తెలిపింది. దేశీయ జౌళి పరిశ్రమను ఈ అదనపు దిగుమతి సుంకం దెబ్బతీస్తుందని వాదించింది.

ఈ అదనపు సుంకాన్ని ఉపసంహరించుకోవాలని పలు విధాల అభ్యర్ధించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కారణమేమిటి? ప్రభుత్వంలో రిలయన్స్ (అంబానీ కంపెనీ) కి ఉన్న పలుకుబడి. అయితే ఆ కంపెనీ వాటాదారులు పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. ధీరూభాయ్ చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆవేదన చెందారు. వాటాదారుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిచ్చే వ్యాపార ధర్మాన్ని ధీరూభాయ్ అనుసరించడం వల్లే ఆయన అంతగా ఎంతో మందికి ఆప్తుడయ్యారు.

దేశ ఆర్థికాభివృద్ధికి ధీరూభాయ్ అందించిన సేవలు గణనీయమైనవనడంలో ఎవరికీ సందేహం లేదు. ఆయన ఒక సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడు. స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి. ప్రతిష్ఠాత్మక వ్యాపార, పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నిర్మించిన ప్రతిభావంతుడు. రిలయన్స్ కథలో రెండు పరస్పర విరుద్ధాంశాలు మనకు కన్పిస్తాయి. ధీరూభాయ్ ఒక వైపు ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడితో తన పోటీదారుల అడ్డును తొలగించుకున్నారు. మరో వైపు తన కంపెనీ వాటాదారులకు మరెవరూ ఇవ్వలేని భారీ లాభాలను ఆర్జించి పెట్టారు.

నికర ప్రభావమేమిటి? ధీరూభాయ్ చర్యల వల్ల దేశానికి ఒనకూరిన ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా జరిగి ఉండవచ్చు. ఈ లాభనష్టాలను కచ్చితంగా అంచనా వేయవల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బడా వ్యాపారుల ప్రభావంలో ఉన్న ప్రభుత్వం ఈ బాధ్యతను నిష్పాక్షికంగా నిర్వహిస్తుందా? నిజాయితీగా అంచనా వేయడానికి అనుమతించని వ్యవస్థలో స్వతసిద్ధ లొసుగులు ఉన్నట్టేనని చెప్పక తప్పదు.

ఇది 1950ల్లో బిర్లాలకు, 1980ల్లో అంబానీలకు, 2010లో స్పెక్ట్రమ్‌కు సమానంగా వర్తిస్తుంది. మరి ప్రభుత్వం ప్రజలకు శ్రేయస్సు సమకూర్చేందుకు పారదర్శకంగా ఎలా వ్యవహరించ గలుగుతుంది? సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించేలా వ్యాపారులను ఎలా నిర్దేశించగలుగుతుంది? బిర్లాలు, అంబానీలు ఉద్దేశపూర్వకంగానో లేక కాకతాళీయంగానో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసి ఉండవచ్చు.

అయినంత మాత్రాన ఏకంగా ప్రభుత్వ వ్యవస్థను వారు తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం సమర్థనీయం కాదు.తమ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికై ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని జిడి బిర్లా, ధీరూభాయ్ పూర్తిగా ఉపయోగించుకున్నారు. స్పెక్ట్రమ్ లైసెన్స్‌ల విషయంలో కూడా ఇదే విషయాన్ని చెప్పవచ్చు.

ప్రభుత్వంపై బడా వ్యాపారుల పెత్తనం దేశ శ్రేయస్సుకు ఎంతమాత్రం మంచిది కాదు. కనుక బడా పారిశ్రామికవేత్తలు దేశా ఆర్థికాభివృద్ధికి ఎంతగా తోడ్పడినప్పటికీ ప్రభుత్వ వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వారు చేసే ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా ఖండించాలి. బడా వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు తమ పరిధి మీరకుండా ప్రభుత్వం తప్పకుండా వాటిని నియంత్రిచాలి.

(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/dec/7/edit/7edit2&more=2010/dec/7/edit/editpagemain1&date=12/7/2010

ధీరూభాయ్ అంబానీల వంటి వారు కార్పోరేట్ రంగంలో చాలామందే ఉన్నారు. షేర్ మార్కెటులో వాళ్ళ మాయాజాలంలోని వింతలూ విశేషాలూ ఇప్పుడు మెల్లిమెల్లిగా వెలుగు చూస్తున్నాయి.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే…

పడిపోతున్న షేర్ మార్కెట్లని నిలబెట్టుకోవటానికి తాము నానా నాట్యాలూ చెయ్యవలసి వస్తోన్నందునా, అంత నాట్యం చేసినా ఒకోసారి నిభాయించుకోలేక పోతున్నందునా… కొన్నిసార్లు మార్కెట్లు కూలడాన్ని చూస్తూ ఊరుకుంటూ… అందుకు కారణాలని సృష్టిస్తున్నారు.

ఆ విధంగా మార్కెట్లు కూలడానికి పైకారణాలని (over leaf reasons) ని చూపించి “మొన్నంటే ఫలానా కారణంగా మార్కెట్లు కూలిపోయాయి గానీ, లేకుంటే అదేమంత విషయం కాదు” లాంటి ప్రచారాలు నిర్వహించాలన్న ప్రయత్నం అది.

ఉదాహరణకి మొన్నామధ్యన (22 నవంబరు, 10) మార్కెట్లు కుప్పకూలాయి. కొరియాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటం దానికి కారణంగా ప్రపంచ మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద శతష్నుల దాడి చేసింది. అంతే! మార్కెట్లు కుప్పకూలాయి.

దశాబ్దాలుగా కొరియాల మధ్య శతృత్వం నెలకొనే ఉంది. యుద్ధ భయం పక్కలో బల్లెంలా ఉంది. అదిప్పుడు ఒక్కసారిగా ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద దాడికి దిగబడటంతో… ఇక యుద్ధం రాజుకుంటుందేమోనన్న భయానికి మార్కెట్లు మందగించాయి – ఇదీ హోరెత్తిన ప్రచారం!

ఏదీ… ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మీద, ఒక్కసారి శతష్నుల దాడి చేసినందుకు ఇంత ప్రచారం, ఇంత ఉపద్రవం! మర్నాటి నుండి మళ్ళీ మామూలే! ప్రపంచాన్నంతా నడిపిస్తోంది ఒకే గూఢచార ఏజన్సీ అయినప్పుడు…పడిపోతున్న మార్కెట్లని నిలబెట్టుకోవటం దానికి అవసరమైనప్పుడు… ఆపాటి శతష్నుల దాడిని నిర్వహించటం అసాధ్యమా, అసంభవమా? ఈ యుద్ధ ప్రచారాన్ని అవసరమైనంత మేరకు సాగదియ్యటం అసాధ్యమా?

[కొసమెరుపేమిటంటే – అమెరికా, మద్దతుగా అణు యుద్ధనౌకను తీసుకొని, దక్షిణ కొరియాకు వెళ్ళి సైనిక విన్యాసాలు చేసింది. సవాళ్ళు ప్రతిసవాళ్ళు నడిచినా గానీ… ఆ రోజు గానీ, తరువాత రోజు గానీ మార్కెట్లేమీ పడిపోలేదు.]

ఇలాంటి సర్కస్ ఫీట్లతో కొన్నిసార్లు కూలుతున్న మార్కెట్లని చూస్తూ ఊరుకుంటున్నారు. ఆ విధంగా కనీసం కొన్ని రోజులైనా, గెయిన్ చేసుకోవటమే అది! లేకుంటే మరీ వరస బెట్టి, నిల్వలు కరిగించి తమ షేర్లను తామే క్రయ విక్రయాలు చేసుకోవాలి మరి! అందునా కరిగించుకునేది బంగారు నిల్వలయ్యె!

షేర్ల సహజ క్రయ విక్రయాల పరిమాణం చాలా తక్కువైపోయి చాలా రోజులే అయ్యింది. అది రోజు రోజుకీ మరింత తగ్గిపోతోంది.

కాబట్టే ఇన్ని మోసాలూ, అసత్య ప్రచారాలు! అది ఒక్క షేర్ మార్కెట్ విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో అదే దోపిడి, అదే మోసం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?CatId=61802&Categoryid=1&subCatId=32

అజ్ఞాత గారు: లింక్ ఇచ్చినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu