ఇలాంటి ఆర్ధిక నేపధ్యంలో నరసింహమూర్తిగారు ఆంధ్రజ్యోతికి వ్రాసిన ఈ దిగువ వ్యాసం ఒకసారి పరిశీలించండి.

>>>10/11

పాఠం నేర్వకపోతే ప్రమాదం
- కె.నరసింహమూర్తి
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన తాలూకూ రాజకీయ, ఆర్థిక పర్యవసానాలు, ఫలితాలు ఎలాగైనా ఉండనీ, ఈ పర్యటనలో ఆయన చేసిన రెండు మూడు వ్యాఖ్యలు మాత్రం సగటు భారతీయులందరికీ మోదం కలిగిస్తాయి. స్వదేశంలో ఉపాధి అవకాశాల కల్పన కోసం భారత్ అండ కావాలని ఒబామా కోరడం, అంతర్జాతీయ సంక్షోభం దెబ్బకు తట్టుకుని నిలిచిన దేశంగా భారత్‌ను ఆయన శ్లాఘించడం... మన ఆర్థిక రంగం పటిష్ఠతకు నిదర్శనం.

ప్రపంచదేశాలన్నీ సంక్షోభంతో అల్లాడిపోతున్న సమయంలో భారత ఆర్థిక రంగం తట్టుకుని నిలబడటం సాధారణ విషయం కాదు. ఈ బలం మనకు ఎక్కడిది? దీన్ని మనం కాపాడుకుంటున్నామా? లేక చేజేతులా ధ్వంసం చేస్తున్నామా..? ఈ కీలక ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసియా దేశా ల చేయూత, మరీ ముఖ్యంగా భారత్ వంటి దేశాల అండ చాలా అవసరం. అమెరికా వెన్నంటి నడిచే యూరప్ దేశాలు సైతం కోలుకోలేని సంక్షోభంలో ఉన్నాయి. ఇటీవల నేను మాక్స్ బూపా బీమా కంపెనీ బోర్డు సమావేశం కోసం లండన్ వెళ్లాను. ప్రపంచ ప్రఖ్యాత హిత్రో విమానాశ్రయం పరిస్థితి, లండన్ ప్రధాన వీధుల్లోని పరిస్థితి నన్ను ఆశ్చర్య చకితున్ని చేసింది.

హిత్రో అంతర్జాతీయ విమానాశ్రయమైనప్పటికీ పెద్దగా జనసందడి కానరాలేదు. మాసిన గోడలు, నీరసమైన వాతావరణం కనిపించాయి. అక్కడున్న లగేజ్ ట్రాలీలు సైతం పాతబడిపోయి లాగడానికి నానా ఇబ్బందిపడాల్సి వచ్చింది. రోడ్లపై ఒకటి రెండు టయోటా ఇన్నోవాలు, లాండ్‌రోవర్లు మినహాయిస్తే అన్నీ పాతకార్లే. ఇక మంచినీళ్ల సీసా ఒక్కటి ఒక్క పౌండ్ (71 రూపాయలు).. అంతర్జాతీయ కాల్ ఒక్కటికి నిమిషానికి 6-7 పౌండ్లు, ఆడవాళ్ల హ్యాండ్‌బాగ్ ఇండియాలో 1000 రూపాయల ఖరీదు ఉండేది.

అక్కడ 600-700 పౌండ్లు ఉంది. సరుకులు ఏవీ ముట్టుకున్నా భగ్గుమంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ అత్యంత వ్యయభరితంగా తయారైంది. బ్రిటన్ రుణభారం జిడిపిలో 78 శాతానికి చేరింది. ఏటా రుణ సమీకరణ మెనెస్ 11.5 శాతం ఉంది. అంటే అప్పులు తీర్చడానికి మాత్రమే కాకుండా ఇతర ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తున్నదన్న మాట.

సంక్షోభం దెబ్బతో బెంబేలెత్తిన ప్రభుత్వం ఇప్పటికే విద్య, ఆరోగ్యం, రక్షణ వ్యయాల్లో కోతపెట్టింది. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఎదురవుతున్న నిరసనను చవిచూస్తున్నది. యూర ప్‌లో కేవలం ఇంగ్లాండ్ పరిస్థితి మాత్రమే ఈ విధంగా లేదు. ఫ్రాన్స్ రుణాల మొత్తం జిడిపిలో 85 శాతం ఉండగా గ్రీస్ రుణభారం 125 శాతానికి చేరింది. ఇటలీ అప్పుల మోత జిడిపి లో 119 శాతం. ఇక బెల్జియం 100 శాతం ఉండగా, పోర్చుగల్ 85 శాతం, జర్మనీ 78 శాతం, ఫ్రాన్స్ 76 శాతం, ఆస్ట్రియా 70 శాతం రుణభారంతో అల్లాడిపోతున్నాయి.

ఈ దేశాల నికర రుణ సమీకరణ మైనస్‌లోనే ఉంది. అంటే అప్పు చేసి పప్పుకూడు తినక తప్పని స్థితిలో ఈ దేశాలు ఉన్నాయి. అమెరికా, యూరప్‌లను కుంగదీసిన ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలు ఏవైనా, సంక్షే మం పేరుతో దుబారా, రాబడిని మించి ఖర్చు చేయడం, వినియోగ సంస్కృతి పతాక స్థాయికి చేరడం... ఈ దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.

యూరప్ దేశాల్లో ఉచిత వైద్యం, మధ్యా హ్న భోజనపథకాలు, నిరుద్యోగ భృతి...ఇలాంటి సామాజిక భద్ర త ఏర్పాట్లపై భారీ వ్యయం కారణంగా భవిష్యత్‌కు సంబంధించిన భయాలు లేకపోవడంతో సాధారణ ప్రజలు విచ్చలవిడి వినియోగ సంస్కృతికి అలవాటు పడ్డారు. పని సంస్కృతిని దెబ్బతీసే విధానాలు, ప్రజలను సోమరులుగా మారుస్తాయి. పాత సోవియె ట్ యూనియన్ దేశాలు 22 ఏళ్లు గడిచినా ఇంకా ఒడ్డుకు చేరలేదంటే కారణం అదే.

గ్రీస్, ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్, పోర్చుగల్, బ్రిటన్, జర్మనీ... యూరప్‌లో ఒకదాని తర్వాత ఒకటి పేకమేడల్లా కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న దేశాలు. సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ దేశాల ప్రభుత్వాలు శాయశక్తుల ప్రయత్నిస్తున్నా యి. అయితే ప్రజల ధోరణిలో మార్పు రాకుండా ఈ ప్రయత్నాలు ఫలించడం కష్టం. ఈ సంక్షోభం భారత్‌ను అంటకపోవడానికి ప్రధాన కారణం మన పొదుపు సంస్కృతి.

ఇది ప్రభుత్వాలు అలవాటు చేసింది కాదు. రేపటి కోసం ఆదా చేసుకోవడం మన సంస్కృతిలో ఒక భాగం. భారత్ బలం దాని సేవింగ్స్ కల్చర్‌లో ఉంది. నిజానికి మన రుణభారం మొత్తం కూడా జిడిపిలో 80 శాతం ఉంది. అయితే మన అప్పంతా అంతర్గత రుణం. యూరప్ దేశాల అప్పు అంతా విదేశీ రుణం. అత్యధిక స్థాయి సేవింగ్స్ రేటు వల్ల భారత ప్రభుత్వం అంతర్గతంగానే రుణాలను సమీకరించగలుగుతున్నది.

అందువల్ల అంతర్జాతీయ సంక్షోభంలోనూ మన ఆర్థికరంగం భద్రంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ సేవింగ్స్ రేటు తగ్గుతున్నది. అది ఆందోళనకర విషయం. సేవింగ్స్ రేటు 2007లో 37 శాతం ఉండగా 2010లో 34 శాతానికి తగ్గింది. వ్యయానికి సంబంధించి పశ్చిమదేశాల అలవాట్లు మన యువతను లొంగదీస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరుగుతున్నాయి.

ఆదాయా న్ని మించి వ్యయానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం రకరకాల సబ్సిడీలపై భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది. వినియోగసంస్కృతి విస్తరిస్తున్నది. ఇవన్నీ మంచి సంకేతాలు కావు. ఈ రోజు అమెరికా, యూరప్ ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి మనం గుణపాఠాలను నేర్చుకోకుండా అవే తప్పులను చేస్తున్నాం.

ఉదాహరణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీని వల్ల గ్రామీ ణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు, పరిశ్రమలకు కూలీల కొరత ఏర్పడింది. మూడు రోజులు ఎన్అర్ఇజిఎస్ కింద పనిచేస్తే ఆరు రోజులు హాయిగా తినవచ్చన్న ధీమాతో పనుల్లోకి వెళ్లడం లేదు. ఇందుకు కారణం నిత్యవసరాలన్నీ చౌకగా పిడిఎస్ వ్యవస్థ ద్వారా లభించడమే.

ఈ పిడిఎస్ ప్రభుత్వ సబ్సిడీ వ్యయం కూడా భారీ గా పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పని సంస్కృతి దారుణం గా దెబ్బతింటున్నది. మరోవైపు ఉత్పాదకత కుప్పకూలుతున్నది. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి వ్యయా న్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

లేని పక్షంలో అంతర్జాతీయ రంగంలో మనం పోటీపడే సత్తా దెబ్బతింటుంది. రుణభారం, సేవింగ్స్ రేటు తగ్గడం, అనుత్పాదక వ్యయం, సబ్సిడీల భారం... ఇవి భారత ఆర్థిక రంగం ముందున్న సవాళ్లు. వీటి పరిష్కారంపై తక్షణం దృష్టి సారించాలి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రుణభారాన్ని జిడిపిలో 60 శాతంకంటే తక్కువస్థాయికి తగ్గించుకోవాలి. అనుత్పాదక వ్యయా న్ని, అనవసర సబ్సిడీలను తగ్గిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎన్ఆర్ఇజిఎస్‌ను సార్వత్రకంగా కాకుండా అవసరమైన ప్రాంతాల్లో అంటే ప్రత్యామ్నాయ ఉపాధి వ్యవసాయం పరిశ్రమలు లేని మండలాల్లో మాత్రమే అమలు చేయాలి. ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో అమలు చేయడం వల్ల ఉత్పాదకతకు నష్టం వాటిల్లుతున్న విషయం గమనించాలి.

వ్యవసాయం ముమ్మరంగా సాగుతున్న ప్రాంతాల్లో ఈ స్కీమ్‌వల్ల లేబర్ దొరకడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సబ్సిడీలను ఆరోగ్యంగా, సంపాదించగల వయస్సులో ఉన్న వారికి ఇవ్వకూడదు. అనారోగ్యంతో ఉన్న వారికి వికలాంగులకు, వృద్ధులకు మాత్రమే పరిమితం చేయాలి. స్వయం సహాయక బృందాలకు సామర్థ్యం మెరుగుకోసమే సబ్సిడీలు ఇవ్వాలి తప్ప బియ్యం రూపంలో కాదు. సేవింగ్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు ఉండాలి. సేవింగ్స్‌ను ప్రోత్సహించాలి. విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని నియంత్రించాలి.

మరి ముఖ్యంగా ఎఫ్ఐఐ నిధులపై కన్నేసి ఉంచాలి. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. జిడిపి వృద్ధిలో వ్యవసాయం వాటాను పెంచనిదే, సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు. స్వదేశంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్న కారణంగా బ్రిటన్ రెండేళ్ల నుంచి స్విట్జర్లాండ్ నుంచి పాలను దిగుమతి చేసుకుంటున్నది. భారత్‌కు అలాంటి పరిస్థితి రాకూడదు. రెండేళ్లు గా గరిష్ఠ స్థాయిల్లో ఉన్న ద్రవ్యోల్బణం వల్ల ఉత్పత్తి వ్యయం భారీ గా పెరిగే ప్రమాదముంది.

వ్యయం తక్కువగా ఉన్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మన కంపెనీలు పోటీ ఇవ్వగలుగుతున్నాయి. తాత్కాలికంగా విమర్శలు వచ్చినా దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంతో గట్టి చర్యలకు శ్రీకారం చుట్టనిదే మనం కూడా యూరప్ తరహా అనుభవాలను చవిచూడాల్సి వస్తుంది.

రేపటికోసం ఆదా చేసుకోవడం మన ఆర్య సంస్కృతిలో భాగం.

- కె.నరసింహమూర్తి
బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/nov/10/edit/10edit3&more=2010/nov/10/edit/editpagemain1&date=11/10/2010

అది బ్రిటన్! డబ్బున్న ఆసామీ. ఒకప్పుడు [అంటే 1450ల తర్వాత] సాంస్కృతి పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవాలతో, ఒక్కసారిగా ఆర్ధికంగా దూసుకెళ్ళిన యూరప్ కి అగ్రగామి అది! దోపిడికి పుట్టినిల్లు కూడా! దోచుకోవడానికి విదేశీయులింకా దొరకని దశలో స్వదేశీయుల్ని దోచుకున్న ప్రభువంశాలు, కులీనులు కుప్పులుగా ఉన్న దేశం!

అక్కడి రాజవంశ బంధువులే ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ గట్రాలకు రాజు, రాణీలుగా ఉండేవాళ్ళు. అప్పట్లో రోజుకి 16-18 గంటల పాటు పదిహేనేళ్ళ పసిపిల్లల చేత కూడా ఫ్యాక్టరీలలో పని చేయించే వాళ్ళు. పని చెయ్యలేక అలిసి కునికిపాట్లు పడిన పసివాళ్ళని కొరడాలతో కొట్టేవాళ్ళు.

ఆ విధంగా శ్రమ దోపిడితో సృష్టించుకున్న సంపదని ఒక్కసారి భోజనానికి కూర్చుంటే నాలుగు సార్లు పింగాణీ భోజన సామాగ్రినీ, టేబుల్ క్లాత్ లనీ కూడా మార్చేంత ఆర్భాటంగా ప్రదర్శించుకునే వాళ్ళు. ఇక వాళ్ళ జల్సాలకి ఆకాశమే హద్దు!

ఆ దెబ్బలకీ, ఆ దోపిడికీ విసిగిన మధ్య తరగతి ప్రజలు తిరగబడితే… గిలెటిన్ యంత్రాలతో కులీనుల, రాజవంశీయుల తలకాయలని, ఉల్లిపాయలని తరిగినట్లు తరిగారు. చెమటనీ, రక్తాన్నీ ఏరుల్లా ప్రవహించిన దేశాలు అవి!
[ఇప్పుడెన్ని నీతులు చెబుతాయో? మానవతా వాదానికి తామే ఆద్యులం అన్నట్లు ముఖం పెట్టి మరీ నీతులు చెబుతాయి ఈ యూరప్ దేశాలన్నీ! అమెరికా కూడా అంతే! ఆఫ్రికాలో నల్లజాతి వారిని, అడవిలో మృగాలని వలవేసి పట్టుకున్నట్లు పట్టుకుపోయి, మన పశువుల దొడ్లో పశువుల చేత చాకిరీ చేయించుకున్నట్లు చాకిరీ చేయించుకున్న వాళ్ళు… ఈ రోజు పెద్దన్నలై ప్రపంచానికి మానవతా పాఠాలనే నేర్పారు!?]

అలాంటి బ్రిటన్, దాని పరిసర దేశాలు… సముద్రమార్గాలు కనుక్కొని వలస రాజ్యాలు స్థాపించుకున్నాక… విదేశాల నుండి తెచ్చిన దోపిడి సొమ్ముని, తమ దేశీ జనాలకి కూడా పంచారు. వలస రాజ్యాలలో ఉన్నత ఉద్యోగాల పేరిట, వ్యాపార సంస్థలని అనుమతించటం ద్వారా… వలస రాజ్యాలలో దోపిడికి మార్గాలు చూపారు, దోచుకోనిచ్చారు.
దాంతో అంతకు ముందు వరకూ… రాజుల ధన సహాయంతో భారత్ వంటి దేశాలకూ సముద్ర మార్గం కనుకొనడానికి బయలు దేరిన నావికుల గుంపుల్ని సముద్రపు దొంగల గుంపులుగా ఎగతాళి చేసిన బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్ గట్రా యూరోపియన్ దేశీయులు, క్రమంగా… దోపిడి అవకాశాలు తమ దాకా వచ్చేసరికి, తమ తమ ప్రభువుల్ని కొనియాడటం మొదలెట్టారు. ఆ విధంగా ‘వర్గం మారితే వైషమ్యం మారుతుంది’ అనే కారల్ మార్క్స్ మాట అక్కడ నిజమైంది.

ఆ విధంగా ఆయా ప్రభువంశీయులు కూడా, తమ చుట్టూ పరిస్థితుల్ని తమకి అనుకూలంగా చక్కబెట్టుకున్నారన్న మాట!

దరిమిలా, దాదాపు రెండు మూడు శతాబ్దాలుగా ఆర్ధికంగా వెలిగిన యూరప్ దేశాలు… మధ్యలో ప్రపంచ యుధ్దాల కారణంగా ఒడిదుడుకులకు లోనైనా, డబ్బున్న ఆసాములు గానే కొనసాగ గలిగారు. ఎందుకంటే వాళ్ళకి గూఢచర్య లాబీయింగ్ కొనసాగింది.

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికి, ఆయా దేశాల్లో రాజకీయ, కార్పోరేట్ వ్యాపార ఏజంట్లున్నారు మరి! వాళ్ళని పచ్చగా ఉంచారు, తదనుగుణంగా ఆయా దేశాలూ బాగానే రెపరెపలాడాయి. అందునా కాగితపు సంపదతో, ఆర్ధిక అసత్య సిద్ధాంతాలతో, అర్ధం కాని నిర్వచనాలతో, అయోమయపు లెక్కలతో, దోపిడిని ప్రశ్నించలేని విధంగా ప్రచ్ఛన్నంగా దాచి ఉంచి, ఏవేవో పైకారణాలని ప్రచారించారయ్యె!

అది ఇప్పుడు బద్దలవుతుండే సరికి… మెల్లిగా అసలు వాస్తవాలు బయటికొస్తున్నాయి. ఓ ఉదాహరణ చూడండి. పేదవాడు తన ఇంటికి సున్నం కొట్టించుకోవాలనుకున్నా… ఏ పెళ్ళో పేరంటమో అయితే గానీ, అందుకు నడుం కట్టలేడు. అదే ఓ ధనిక ఆసామీ అయితే – తన భవంతిని తళ తళలాడేలా ఉంచుకోవటం తన ప్రిస్టేజ్ కి సంబంధించిన విషయంగా చూసుకుంటాడు. కాబట్టి రంగు వెలసినట్లు అనిపించక పోయినా, వెలుగు తగ్గిందనుకోగానే కొత్తరంగులు వేయించేస్తాడు.

అలాగ్గాక మెల్లిగా ధనికుడి భవంతికి రంగు వెలసిందనుకొండి. ఇంకా మెల్లిగా పెచ్చులూడిందను కోండి! ఏమనుకుంటాం? ‘సదరు ఆసామికి కానికాలం వచ్చినట్లుంది’ అనుకుంటాం.

ఉన్న కార్లు సొట్టలు పడి, కొత్తకార్లు కొనటం సంగతి దేవుడెరుగు, సొట్టల కార్లకి రిపేర్లే చేయించడం లేదనుకొండి! ఏమనుకుంటాం? ‘తొందర్లో ఈ కార్లూ మూలన పడేయటమో, అమ్ముకోవడమో జరుగుతుంది’ అనుకుంటాం.

ఇది దేశాలకైనా, కార్పోరేట్ కంపెనీలకైనా వర్తిస్తుంది. అదే బ్రిటన్ లోని హిత్రూ విమానాశ్రయంలో కన్పిస్తోంది.


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu