ప్రజలు ఏ వినిమయ వస్తువుల నైనా… కొనడానికి గానీ, ప్రదర్శనలని తిలకించడానికి గానీ (ప్రదర్శనలకి రుసుముల వంటి వ్యాపార ఇంద్రజాలలు కూడా దోపిడి మాయలో ఓ భాగం మరి!) ఇతరత్రా ఏ లావాదేవీలకి గానీ… స్పందించలేదనుకొండి. అప్పుడేమౌతుంది? ఏ అవసరం రీత్యానైనా… ఒక వేళ ఏ ధనికుడైనా… తన హారాన్నో, ఇంటినో అమ్మాలనుకుంటే… కొనే వాడేవడూ రాడు. తోటి ధనికులదీ తన స్థితే కదా!? స్థిరాస్థులు కదలని స్థితి!

కాగితం మీద దాని ఖరీదు లక్షల్లో లేదా కోట్లలో ఉంటుంది. కాని విక్రయం జరిగితే కదా, అది ధనమై చేతిలోకి వచ్చేందుకు? ఇతరత్రా ఉపయోగ పడేందుకు?

చెప్పుకోవడానికి ఉండాల్సిందే… ‘ఫలానా వారి దగ్గర లక్షల ఖరీదు చేసే ఇన్ని హారాలున్నాయి, కోట్ల ఖరీదు చేసే ఇన్ని భవనాలున్నాయి!’ … అని! ఉపయోగ పడేది మాత్రం శూన్యం. రియల్ ఎస్టేట్ బూమ్ డప్పయిపోయినప్పుడు ఏర్పడింది ఇలాంటి స్థితే! [అలా ‘స్టక్’ అయిపోయిన భూ వ్యాపారానికి తిరిగి ప్రాణం పోసేందుకే… ‘తెలంగాణా ఉద్యమం’ పేరిట… విజయ వాడ వంటి కోస్తా, సీమ నగరాలలో భూముల విలువలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వేర్పాటు ఉద్యమంలో ఇదో కోణం.]

వినిమయంలోకి రానిది, విలువ ఎంతని చెప్పబడినా… విలువలేని వస్తువే అవుతుంది. అది కెంపుల హారమైనా, భవనాలైనా! అవసరమైనప్పుడు ధన రూపంలోకి బదలాయింపబడితేనే, సంపదకి విలువ! ధన రూపం గాకపోతే మరోరూపం! ఏ రూపమైనా సరే! పరస్పర మార్పిడితో ఇతర వస్తువుల్ని, సేవల్ని, సుఖాలని అందివ్వగల రూపం!
ఆ విధంగా బదలాయింపబడనప్పుడు అవి మణిమాణిక్యాలైనా చిల్లపెంకులతో సమానమే! బంగారు బిస్కట్లయినా కుక్క బిస్కట్లకి సమానమే!

ఈ స్థితి కొన్నేళ్ళుగా (దాదాపుగా దశాబ్దం పైగా) నెలకొంది. వ్యాపార రంగంలో, షేర్ మార్కెట్ లో, కార్పోరేట్ సంస్థల్లో! పైకి మేక పోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తోన్నారు. మరోప్రక్క నిభాయించుకో ప్రయత్నిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను వెదుకుతున్నారు.

వ్యాపార లావాదేవీల్లో సామాన్యుల ప్రమేయం కనిష్ఠ స్థాయికి చేరిన స్థితికి పర్యవసానమే… అమెరికా లో గృహ ఋణాలకి, ఇండియాలో సూక్ష్మ ఋణాలకి దారి తీసింది.

మార్కెట్ లో డబ్బు సంక్రమణం (Rotate) కావాలి. లేకపోతే స్తంభించి పోతుంది. దాన్ని మందగమనం అన్నా, మాంద్యం అన్నా ఒకటే! ఆ మందగమనాన్ని తగ్గించటానికి, అమెరికాలో స్వంత ఇంటి ఋణాలు ఆశగా చూపబడ్డాయి, భారత్ లో సూక్ష్మ ఋణాలు ఇవ్వబడ్డాయి.

ఇందుకు కొన్ని దృష్టాంతాలు చూడండి. ఇటీవల ఆంధ్రజ్యోతిలో జాహ్నవి గారు ఓ వ్యాసం వ్రాసారు. అందులో నుండి కొన్ని విషయాలు క్రింద ఉటంకిస్తున్నాను.

>>> 31/10

మేధో మథనం

ఆహార్రాజకీయ భద్రత
-జాహ్నవి

>>>ఆహార భద్రత పథకం ద్వారా ప్రభుత్వం పండించిన పంటంతా లెవీ, కంట్రోళ్ల రూపంలో ఎఫ్‌సిఐ ద్వారా లాక్కుంటుంది. ఉచితంగా ప్రజల్లోని అత్యధిక శాతానికి పంచిపెడుతుంది. అలా పంచిపెట్టిన తిండిగింజలు తిన్నవాళ్లు తమ కు ఓట్లేయకపోతారా? యువరాజు పట్టాభిషిక్తుడు కాకపోతాడా? ఇది ఆహారభద్రత కాదు.


>>>ఒకటి రెండు సంవత్సరాలు ఇప్పుడున్న అధిక నిల్వలతో, పన్నుల డబ్బు తో, రుణాలతో నడిపిస్తారు. ఈ లోపల ఎన్నికలు, గెలుపు, పట్టాభిషే కం అయిపోతాయి. ఆహార భద్రత కల్పించడం పేరుతో పన్నులు పెంచుతారు. లోటుబడ్జెట్‌తో రూపాయలు ముద్రకొడతారు. దాంతో ద్రవ్యోల్బణం, అన్ని రేట్లూ పెరుగుతాయి. ధాన్యం రేట్లు పెరగాలి. ఖజానాలో డబ్బుకు కొరత. దాంతో తక్కువ రేట్లకే ఆహారధాన్యాలు సేకరించే ప్రయత్నం చేస్తారు. రైతులు తీవ్రంగా నష్టపోతారు, వ్యతిరేకిస్తారు, ఆందోళనలు చేస్తారు.

ఆఖరుకు గిట్టుబాటుకాక ధాన్యం పండించడం తగ్గించేస్తారు. ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఎదురవుతుంది. అయినా సరే, ప్రభుత్వం తల్చుకుంటే చేయలేనిదేముంది? ఖర్చెంతయినా సరే, విదేశాల్నుంచి దిగుమతి చేసుకుంటారు. వ్యవసాయం కుంటుపడి కూలీలకు పనులు దొరకవు. పెరిగిన రేట్లతో పాటు కూలీల వేతనాలు పెరగవు. పనిచేయకుండానే కూలీ గ్యారం టీ పథకం, దాదాపు ఉచిత ఆహార పథకాలతో, కష్టించి పనిచేసే వాళ్లని హేళన చేసే పరిస్థితి వస్తుంది.

ఈ లోపల వ్యాపారుల్ని, మిల్లర్లను, విదేశీ శక్తుల్ని, మావోయిజం, టెర్రరిజాల్ని నిందిస్తూ అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మరలుస్తారు. యువరాజు పాలనలో స్థిరపడే దాకా మడమ తిప్పరు, వెన్నుచూప రు. వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయిన తర్వాత మెల్లగా పంపిణీ చేసే ఆహారధాన్యాల రేట్లు పెంచవలసి వచ్చినప్పుడు ఎవరు పాలిస్తారో, వాళ్లని బ్రతికినన్నాళ్ళూ రాజకీయంగా నిందించొచ్చు. ఏది ఏమైనా ఒకసారి తీవ్రం గా గాడి తప్పిన వ్యవస్థ మళ్లీ కుదురుకోవడం చాలా కష్టం.

అయితేనేం? గొప్పగొప్ప ఆర్థిక వేత్తలు ప్రధానమంత్రులయితేనేం? ఉచితాలు,సబ్సిడీలు పేదరికాన్ని తగ్గించవనీ, పెంచుతాయ ని ఎన్నో సార్లు నిరూపితమయితేనేం? ఇదే దారిలో ఇంతకు ముం దు ప్రయాణించి ఎదురు దెబ్బలు తింటేనేం? రాజ కుటుంబంలో తరం మార్పుసందర్భంగా ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు అవసరం మరి! దేశం ఎటుపోతేనేం? ప్రజలేమయిపోతేనేం? ఆర్థిక వ్యవస్థా? ఎవరమె? రాజకీ వ్యవస్థ ఇంట్లో పని మనిషి కాదూ?!

-జాహ్నవి

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/oct/31/edit/31edit3&more=2010/oct/31/edit/editpagemain1&date=10/31/2010
~~~~~~~~
దీన్నే మరో కోణం నుండి విశ్లేషిస్తూ పి. ప్రసాద్ గారు ఈ విధంగా వివరించారు.
>>> 16/11

కార్పొరేట్ ఆలోచనే 'ఆహార భద్రత'
-పి. ప్రసాదు

'ఆహార్రాజకీయ భద్రత' శీర్షికతో జాహ్నవి రాసిన వ్యాసంలో విషయం కుడి ఎడమైపోయింది. 'ఆర్థిక వ్యవస్థా? ఎవరామే? రాజకీయ వ్యవస్థ ఇంట్లో పని మని షి కాదూ'? అనే ప్రశ్నతో జాహ్నవి తన వ్యాసాన్ని ముగించారు.

ఈ ప్రశ్న వేసి పాఠకులతో తాను చెప్పించదలుచుకున్నదీ లేదా తానే పరోక్షంగా చెప్పదలుచుకున్నదీ 'ఔను మరి, మన రాజకీయ వ్యవస్థ చెప్పుచేతుల్లో మన ఆర్థిక వ్యవస్థ బానిసరాలిగా వుంది కదా!' అనే జవాబునే ఎవరు గద్దెనెక్కాలో, ఎవరు ఎక్కకూడదో గద్దెనెక్కినోళ్లు ఏ రాజకీయ విధానాలను అవలంబించాలో స్టాక్‌మార్కెట్ ఉత్థానపతనాల సంకేతా ల ద్వారా ఆదేశిస్తున్న మన ఆర్థిక వ్యవస్థను ఓ ఆటబొమ్మగానో, ఓ కీలు బొమ్మగానో పరిగణించడం ఓ సాహసమే మరి'! ప్రభుత్వాలకు రాజకీయ దిశానిర్దేశనం చేస్తున్న బడా కార్పొరేటు వ్యవస్థను రాజకీయ వ్యవస్థ ఇంట్లో పని మనిషిగా వర్ణించడం జాహ్నవికే సాధ్యమైంది.

నేటి కుళ్లు రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చక్కగా, తెలివిగా వినియోగించుకున్నారు. రాజకీయ వ్యవస్థను తూర్పారాపట్టిన జాహ్నవి ప్రతిభ అద్భుతంగానే ఉంది. అయితే లాజిక్కు ఎక్కడుందంటే దాని అస్తవ్యస్థతలన్నింటికి మూల కారణమైన ఆర్థిక వ్యవస్థను 'రాజకీయ బాధితురాలి'గా చిత్రించడంలోనే ఉంది. చీము, రసిలతో ఒంటి మీద కంటికి కనిపించే పుండును అద్భుతవర్ణనలతో తూర్పారపట్టారు.

కానీ అందుకు కారణమైన లోపాలున్న వ్యాధిగ్రస్థ క్రిమికారకాల జోలికి వెళ్లలేదు. పైగా వాటికి శస్త్ర చికిత్సేతర తాత్కాలిక మందు బిళ్లలు సౌతం అక్క ర లేదంటున్నారు. కనీసం పెయిన్ కిల్లర్‌లను కూడా వాడనివ్వకుండా చేసి, శరీరంలోని రోగ క్రిములు మరింత రెచ్చిపోవడానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలుండాలని జాహ్నవి చెప్పదలిచారు.

జాహ్నవి దృష్టిలో 'ఆహార భద్రత అనేది దాదాపు ఉచిత ఆహార పథకం'గా మారుతుందనేదే! దానివల్ల 'కష్టించి పనిచేసే వాళ్లని హేళనచేసే పరిస్థితి వస్తుందన్న'దే! అలాగే ఉపాధి హామీ పథకమంటే కూడా 'పని చేయకుండానే కూలీ గ్యారంటీ పథకం'గా మారుతుందనేదే! ఫలానా పరిస్థితులలో ఇలా దారితీస్తుందని చెబుతున్నా తన వైఖరి మాత్రం సుస్పష్టమే!

ఈ తాత్కాలిక ఉపశమనమిచ్చే పరిమి త సంక్షేమ చర్యలమీద తన అక్కసును వెళ్లగక్కారు. వాటిని సోషలిస్టు పథకాలుగా వర్ణించి, అమలు చేస్తున్నవి సోషలిస్టు పథకాలుగా నామకరణం చేశారు. అందువల్ల ఆర్థిక వ్యవస్థ తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయి దేశాభివృద్ధి నాశనమవుతుందని చెప్పదలిచారు.

నిజానికి మొన్నటి పాత 'పనికి ఆహార పథకమూ', నేటి కొత్త 'ఆహార భద్రతా పథకమూ' బడా కార్పొరేటు ఆర్థిక వ్యవస్థ బుర్రలో పుట్టిన పథకాలే! ఇవేవీ సోషలి స్టు లేదా సోషలిస్టు తరహా భావాల నుంచి పుట్టినవి కావు. 'పెట్టుబడిదార్ల కోసం, పెట్టుబడిదార్ల చేత, పెట్టుబడిదార్ల యొక్క' పథకాలివి. విస్తృతమైన మన గ్రామీణ వ్యవస్థను కార్పొరేటు వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థ అనుసంధానం చేసే ప్రణాళిక లో భాగంగా రూపొందిన పథకాలివి.

దాని మార్కెట్ విస్తరణలో భాగంగా అది సూచిస్తున్న ఇలాంటి పథకాలకోసం మాత్రం కొన్ని వేలకోట్లను మాత్రమే వెచ్చిస్తున్నది. ఈ నగ్న సత్యాలను జాహ్నవి గుర్తించనంత మాత్రాన అవి సత్యాలు కాకుండా బోవు. సంక్షోభం తర్వాత బడా కార్పొరేటు కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై దృష్టిని కేంద్రీకరించాయి. నిపుణుల బృందాలతో సర్వేలు చేయించాయి.

అంతకుముందున్న పనికి ఆహార పథకం తమను సంక్షోభం నుంచి కాపాడిందని నిర్ధారించుకున్నాయి. దానివల్ల గ్రామీణ ప్రజల చేతికి అందిన సొమ్ముతో సాగించిన అదనపు కొనుగోళ్లు కష్టకాలంలో తమకు ఒకింత చేయూతనిచ్చినట్టు కార్పొరేటు కంపెనీలు గుర్తించా యి. ఆ స్ఫూర్తితో అలాంటి మరికొన్ని సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశాయి. అందులో భాగమే తాజా ఆహార భద్రత.

పట్టణ మధ్య తరగతి కుటుంబం తమ ఆదాయంలో 20-30 శాతం సొమ్మునే ఆహారావసరాలకు ఖర్చు చేస్తున్నది. మిగిలిందే ఆహారేతర వస్తు సామాగ్రికి, ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నది. కానీ కోట్లాది గ్రామీణ పేదలు తమ అల్ప రాబడిలో సగానికిపైగా ఆహారావసరాలకే ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదల విషయంలో ఉపాధి హామీ సొమ్ములో తొంభై శాతం ఆహారావసరాలకే మళ్లించబడుతున్నదని అవి నిర్ధారించాయి.

గ్రామీణ పేదల ఆహార బడ్జెట్ వ్యయాన్ని తగ్గిస్తే తప్ప తమకు తగినంత లాభం చేకూరదని కూడా అవి గుర్తించాయి. అందుకే తమ ఇంట్లో మనిషి వంటి రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజాధనంతో తక్కువ ధరలకు పేద ప్రజల ఆహారావసరాలను తీర్చదలిచింది. తద్వారా వారి డబ్బును ఆహారేతర ఖాతాలోకి మళ్ళించి పథకం పన్నింది. జాహ్నవి గుర్తించినా, గుర్తించకపోయినా పచ్చినిజమది.

ఐ.ఎం.ఎఫ్ మానసపుత్రుణ్ని ప్రధానిని చేయడానికి కార్పొరేట్ వ్యవస్థ స్టాక్ మార్కెట్ ద్వారా దేశంలో రాజకీయ ప్రకంపనాన్ని సృష్టించగలిగింది. 'ఫండ్-బ్యాంకు' మేథోత్రయం (మన్మోహన్, చిదంబరం, అహ్లువాలియా) ద్వారా రాజకీయ వ్యవస్థను శాసించగలుగుతున్నది. గ్రీన్‌హంట్, కోస్టల్ కారిడార్, సెజ్‌ల ద్వారా లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొట్టగలుగుతున్నది. సంక్షోభం నుంచి రక్షణ పేరిట ఐదారు లక్షల కోట్లాది రూపాయల పన్నురాయితీలను పొందగలిగింది.

అణు ఒప్పం దం పేరుతో లక్షల కోట్ల లాభాలు గడించగల వాణిజ్య అవకాశాలను పొందగలిగిం ది. వీటి కోసం మన రాజకీయ వ్యవస్థను ఇంట్లో పని మనిషిగా వాడుకోగలుగుతున్నది. అంతటి బ్రహ్మాండమైన శక్తి సామర్థ్యాలు గల ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయిన బానిసరాలిగా జాహ్నవి సూత్రీకరించారు. ఇది పొరపాటు చిత్రీకరణలో, ఉద్దేశపూర్వక వక్రీకరణలో పాఠకులే నిర్ణయించుకోవాలి.

ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దేశ సంపదనంతా యథేచ్ఛగా కొల్లగొడుతున్నా, రాజకీయ వ్యవస్థను ఆటబొమ్మగా వాడుకుంటున్నా జాహ్నవికి అదో బానిసరాలిగా కనిపిస్తుం ది. రైతాంగానికి న్యాయంగా రావాల్సిన డబ్బును కబళిస్తున్నా జాహ్నవికి కోపం రాదు.

కానీ తన లాభాల కోసం పేదలకు అది విసిరేయించిన పట్టెడుమెతుకుల్లో మాత్రం 'సోషలిస్టు' ప్రమాదాన్ని చూస్తున్నారు. తల వంటి ఆర్థిక వ్యవస్థను తోకగా చూపించారు. తోకవంటి రాజకీయ వ్యవస్థను తలగా చిత్రించారు. తోకను తల ఆడిస్తుందన్న భౌతిక సత్యాన్ని తిరగేసి పాఠకుల ఎదుట జాహ్నవి ఆవిష్కరించజూశారు. దానిని తలకిందులు చేసి చూస్తే సరిపోతుంది.

-పి. ప్రసాదు
సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/nov/16/edit/16edit3&more=2010/nov/16/edit/editpagemain1&date=11/16/2010
~~~~~~~~

వెరసి డబ్బు సంక్రమణం (Rotate) అయ్యి, కంపెనీలు నిలబడాలి. అందుకోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆహార భద్రత, జాతీయ ఉపాధి పధకం, xyz పధకం పేరుతో పందారం చేస్తుంది. ఇలాంటిదే ఆరోగ్యశ్రీ పధకమైనా! అంతిమంగా డబ్బు ప్రవహించింది కార్పోరేట్ ఆసుపత్రులకే మరి! ఆ రూపంగా ఓ ప్రక్క ఓట్లు కొనుగోలు చేసుకుంటుంది. మరో ప్రక్క కార్పోరేట్ కంపెనీలకి చైతన్యానిచ్చే వ్యాపారాన్ని ప్రవహింప చేస్తున్నది. బదులుగా కంపెనీల నుండి భారీ మొత్తాలని పార్టీ ఫండులుగా, వ్యక్తిగత కానుకలుగా లేదా లంచాలుగా రాబట్టు కుంటుంది. ఇలా ఇదో వలయం, దోపిడి వర్తులం Robery cycle).

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

మీరు చాలా కష్టపడి ఇంత సమాచారం సేకరించి రాస్తున్నారు. కారల్ మార్క్స్ కూడా ఇలానే చాలా అనాలిసిస్ రాసేవారు కదా.ఆయన ప్రశ్నిచాలి అని, ఊర్లో ఉండే ప్రశ్నలన్ని వేసుకొని పుస్తకాలు రాస్తే, పెట్టు బడి దారుడు వాటిని బాగా ఉపయోగించుకొన్నాడు. ఇతను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం నేర్పిం నేర్చాడు/ఇతరులకి నేర్పించాడు. ఈ పెట్టుబడి దరుడే ప్రభుత్వానికి అధిపతి అయ్యాడు. ఆ దృష్హ్టితో చూస్తే కారల్ మార్క్స్ గారి వలన పెట్టుబడీదారుడు ఇంకా బాగు పడ్డాడు. మార్క్స్ గారు చేసిన ఇంకొక మహోపకారం పేద వర్గాలనుంచేదోపిడి దారులను సృష్టించాడు. మొదట అంతా సమానత్వ సిద్దాంతం చదువుతారు. తరువాత కొంతమంది నాయకులు తయారవుతారు. కొన్ని రోజులు పోరాడి, ఉన్నవారి తో లాలుచి పడి డబ్బులు/అధికారం దిగమింగి తనకు బాగా తెలిసిన పేదవారిని, పెద్ద వారికన్నా ఎక్కువ దోచుకొంటారు.
------------------------------------------
మనిషిని బాగు పరచటం అనేది రాతలతో జరిగే పని కాదు. జీవితం లో నాలుగు ఎదురు దెబ్బలు తిన్నప్పుడు మాత్రమే వాడు మారుతాడు. లేక పోతే ఒక్కసారి వరదలు, భూకంపం, సునామీలు, యాక్సిడేంట్ళొ భందువులో, మిత్రులో పైకి పోవటాలు జరిగితే కొంచెం వాడు అప్పుడు దారికి వస్తాడు. మీరు చెప్పండి బ్లాగులు రాసే వారు ఇప్పుడే మధ్యతరగతి నుంచి ధనవంతుల జాబితాలో చెరుతూ ఆనందం తో అమేరికా- ఇండియా, ఇండియా లో ఉండే గుళ్ళు, గోపురాలు తిరుగుతూ, పండగ వంటలు బ్లాగుల్లో రాసుకొంట్టూ ఆనందం గా గడుపుతుంటె మీ బ్లాగు ఎప్పుడు చూసిన దేశం ఎమో ఐపోతున్నాది అనేవిధం గా రాస్తూ ఉంటారు. దేశం గురించి ఎప్పుడో రోడ్లో పోతుంటే కారు గుంటలో పడితే ఇదే అమేరికాలో నైతేనా అని ఒకసారి మనం ఉండేది ఇండియా అని గుర్తు చేసుకొవాలి. అప్పుడు హూ ఇంకా ఈ దేశం మారలేదు అని అనుకోవాలి కాని, మీలా ఇదే పనైతే ఎలా? అసలికి దేశానికి ఎమైనా జలుబు , దగ్గు, తుమ్ము చేసిందా? చూడండి ఎంత అవినితి ఉంటె అంత వ్యాపారం, వ్యాపారం ఎంత ఎక్కువైతే అంతగా జీవనోపాధి పెరుగు తుంది.అందువలన అవినీతి కూడా డబ్బు మార్కేట్ లో తిరగటానికి ఎంతో ఉప యోగ పడుతుంది. ఇక్కడే మీడీయా వారి అవసరం ఉన్నది. మంత్రి వర్గం లో ఒకడు ఇన్ని కోట్లు తిన్నాడు అని రాస్తే ఆమంత్రి నిజంగా ఇన్ని కోట్ళు తిన్నాడు అని చెప్పటానికి మీడీయా వాడు మంత్రిగారి కోట్ల రూపాయలను లెక్కించాడా? అలా రాయలి అది చదివి పక్క మంత్రి అతను అంత సంపాదిస్తే నేను ఇంకేంత సమపాదించాలి అని అనుకొంటాడు. పోటిపడి ఎంతో కొంత డబ్బులు వ్నక వేస్తారు, అది గమనించిన పేపర్ వాడు రాయకుండా ఉండాటానికి కొంత డబ్బు, ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరు కోర్ట్ లో కేసు వేస్తారు కనుక లాయర్లకి కొంత, పోలిసులకి కొంత, ఇలా అందరికి కొంత ఇచ్చుకొంట్టూ పోతే ఎంత వ్యాపారం అభివృద్ది చెందింది.ఇంత అనాలిసిస్ చేస్తారు ఈ మాత్రం మీకు తెలియదా?

SRI

<<బ్లాగులు రాసే వారు ఇప్పుడే మధ్యతరగతి నుంచి ధనవంతుల జాబితాలో చెరుతూ ...

SRI గారూ, కాస్త ఆ జాబితా ఇస్తారా? మేము కూడా ప్రయత్నిస్తాం.

SRI గారు, అవినీతిపరులను సమర్దించే మీ తెలివితేటలకు జోహార్లు. ఈ ప్రపంచం లొ నీతివంతులు, నిజాయితీపరులు కూడా ఉంటారు. కాదనగలరా?

దేశం గురించి ఏమి వ్రాస్తున్నారు ? ఎందుకు వ్రాస్తున్నారు ? అనేది ప్రక్కన పెడ్తే ఈ బ్లాగ్ చాలా విషయాల్లో బెటర్ . వంటలు ,సంతోషించే విషయాలు మంచివే కాని మనిషి ఎదుగుదలకి ఆలోచన ,ప్రశ్నించే తత్త్వం ఎప్పుడు వస్తుంది ?
ఇప్పుడంతా పచ్చగా కన్పిస్తుంది నిజంగా అబివ్రుద్దేనా ? ఒకవేళ మధ్య తరగతి ప్రజలు ఖర్చు చేయడం తగ్గిస్తే ఏమి అవుతుంది ?ఇప్పటికి ,ఎప్పటికి ఇండియా సంపద పల్లెల మీద ఆధార పడవలసినదే . అవినీతి వలన వచ్చిన డబ్బు
ఎ రూపంలో ప్రజల మధ్య కి వస్తుందో తెలుసా ?ఒక్కసారి ఎ సి బి వాళ్ళు పట్టుకునే ఆస్తులు చుడండి .స్విస్స్ బంకుల్లో మూలిగే సొమ్మంతా ఈ దేశంలో నుండి పుట్టిన మనుషుల కష్టం నుంచి రాలేదా ? వాటి వలన ఎవరికీ సుఖం ?
పేదవాడు అంటే చేతకాని వాడు అని కాదు .ఆర్ధిక కారణాల వలన ఆత్మహత్యలు చేసుకునేవాల్లకి ఎ దారి లేకపోవడం ఎందుకు ? పెట్టుబడి దారి విధానం మంచిదే మనిషి సుఖం గా బ్రతకడానికి ఎన్నో అవకాశాలని అది ఇచ్చింది.
కాని ఇప్పుడు ఎందుకు ఇంతగా అవినీతి మయమైపాయింది? ప్రజల్లో ప్రశ్నించే తత్త్వం ఎందుకు తగ్గింది ? ఆర్టీసీ బస్సు దగ్గరనుండి అన్నీ దోపిడైనా ఎందుకు ఎవ్వరు అడగడం లేదో ?ఈ రోజు ఇండియా కాకుండా ఎక్కడో వున్నా వాళ్ళు
నలుగు రోజులు గతుకులు చూసి అమెరికా కాదు ఇది ఇండియా అని హేళన గా అంటే మరి ఇక్కడ ప్రజలేమి బాధపడరు .ఎవరైనా నేను పైకి వెళ్లాను ,అదంతా నా తెలివితెతలేనని అనుకొంటే అది తప్పే .మీకు చదువుచేప్పిన గురువులది .తల్లితండ్రులది
,ఇక్కడ వున్నా విద్యాలయాలది ,అవన్నీ వున్నా ఈ దేశం గొప్పతనం .ఆఫ్రికా వాడికి లేని తెలివితేటలు(ఉద్యోగార్హత కు ) మనకి వచ్చాయంటే కారణం మన దేశం లో మనం పుట్టాం కనుక .అవినీతి ఎక్కడా మంచిది కాదు .ఉదాహరణకి మీరు ఎక్కే
ఫ్లైట్ చెక్ చేయవలసిన ఇంజనీరు ,పైలట్ ఇద్దరు మందేసుకుని సరిగా నిద్రపోక ,వాళ్ళ ఫీట్ నెస్ చెక్ చేసే వాళ్ళకి ఏదో ఆశ/లంచం ఇచ్చి విధులు చేస్తే ఏమవుతుంది .మీరే ఆర్మీ(వాయుసేన) లో చేరి మిగ్,లేకపోతే మరేదో అవినీతి తో తడిసిన విమానాన్ని
నడిపారనుకోండి ,అప్పుడు ఎలా వుంటుంది ?అవినీతి వలన మనకేం కాదు అనుకోకండి .

శ్రీనివాస

*అవినీతిపరులను సమర్దించే మీ తెలివితేటలకు జోహార్లు.*
అవినీతి నీతి కి అమ్మ వంటిది. అవినీతి పదం లో నీతి ఉంది. నీతి పదం లో అవినీతి లేదు. :-).
నేను అవినీతిని సమర్ధిస్తున్నాని ఎందుకు అనుకొంటారు?
SRI

good post..

SRI గారు మీ ప్రశ్న
**నేను అవినీతిని సమర్ధిస్తున్నాని ఎందుకు అనుకొంటారు?**

నా జవాబు,

క్రింది కారణాల వల్ల.

**మీరు చాలా కష్టపడి ఇంత సమాచారం సేకరించి రాస్తున్నారు....**
(నిజం చెప్పారు. సంతోషం. )


**మనిషిని బాగు పరచటం అనేది రాతలతో జరిగే పని కాదు.**
(అనుకొంటే పొరపాటు. చెడగొట్టవచ్చా? )


**కాని, మీలా ఇదే పనైతే ఎలా?**
(ఇదే పని అని, ఆదిలక్ష్మి గారు మీకు చెప్పారేమో!)


**అసలికి దేశానికి ఎమైనా జలుబు , దగ్గు, తుమ్ము చేసిందా?** (అంతకంటే పెద్దజబ్బే చేసింది. అవినీతి)


**ఇంత అనాలిసిస్ చేస్తారు ఈ మాత్రం మీకు తెలియదా?**
(తెలియదని నేను అనుకోవడం లేదు.)

-----------

**అవినీతి నీతి కి అమ్మ వంటిది. అవినీతి పదం లో నీతి ఉంది. నీతి పదం లో అవినీతి లేదు. :-). **

తేనెకంటే తీయని పలుకులు,సారీ, రాతలు ,మీకు మరోసారి, జోహార్లు.:-)
(నేతి బీరకాయలో నెయ్యి లాగ)

----------------

(ఆదిలక్ష్మి గారు, ఆమెతృప్తి కోసం రాస్తున్నారు అని నేను అనుకొంటున్నాను. మీవ్యాఖ్య, ఆమెను,చదివేవారిని కూడా నిరుత్సాహపరచడానికి, అనిపించేదిగా ఉంది.)

----------------

SRI గారు మీరు 'కాంప్లిమెంట్' కు ప్రతిస్పందించారు. ప్రశ్నకు కాదు.

- అజ్ఞాత (నాకు నచ్చని నాపేరు, ఐనా మీ కొసం.) "SRI"- నాకు ఎంతొ ఇష్టమైన పేరు. ఆ పేరుతో ఉన్న మిమ్మల్ని భాదించి వుంటే క్షమించండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu