ఇకపోతే... చంద్రబాబు మా పరంగానే కాదు, జనం పరంగా కూడా.... సువర్ణముఖిని అందుకున్నాడు.

పరిశీలిస్తే...

చంద్రబాబు... ఈ దేశం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల చేసిన కర్మల ఫలం, అంటే - జనం పరంగా సువర్ణముఖిని కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. అధికారంలో ఉన్న రోజుల్లో, అతడికి, కన్నూ మిన్నూ కాన రాలేదు. ‘హైటెక్ ముఖ్యమంత్రి’ అంటూ మీడియా ఇచ్చిన బిరుదు, ఇతడికి చాలా తల బిరుసునే ఇచ్చింది.

అవినీతిని సెంట్రలైజ్ చేయటమే కాదు, పార్టీలోకి కూడా కార్పోరేట్ సంస్కృతిని తెచ్చి పెట్టాడనే పేరు తెచ్చుకున్నాడు. ఇతడికి ప్రజలంటే చులకన ఉండటమే కాదు, అప్పట్లో పార్టీ కార్యకర్తలంటే కూడా చులకనే ఉండేడి. [కాబట్టే... పదవి పోయి, పరిస్థితులు అడ్డం తిరిగాయని అర్దమైన తర్వాత... ‘నా మైండ్ సెట్ ను మార్చుకున్నాను. ఇక నుండి పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉంటాను" అంటూ నెత్తీనోరూ బాదుకున్నాడు.]

ఎంత చులకనంటే.... తాను అంతర్జాతీయ ఫేం ని అయిపోయాననుకున్నాడు. అమెరికా ప్రెసెడింట్లు తనకు కితాబులిచ్చే స్థాయి తనది! సత్యం రామలింగ రాజులూ, ఐటీ దిగ్గజాలూ, వివిధ దేశాల ప్రతినిధులూ - ఇలాంటి వాళ్ళతో తను వ్యవహరిస్తుంటాడు! సామాన్య ప్రజలూ, వాళ్ళ కడగళ్ళ వివరాలూ... ఎంత న్యూసెన్సు, ఎంత నాన్సెన్సూ!?

అందుకే... 2001లో అనుకుంటా! తమ గౌరవ వేతనాలు పెంచమంటూ, ఆందోళనకి దిగిన అంగన్ వాడీ కార్యకర్తలని, ఆడవాళ్ళని కూడా చూడకుండా, రోడ్డెక్కినందుకు లాఠీలతో కొట్టించాడు. ఆడవాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చి, పోలీసులు తన్నటం, ఉధృతంగా నీటి పంపులతోనూ, భాష్పవాయు ప్రయోగంతోనూ... వాళ్ళని చెల్లా చెదురూ చేయటమూ, అప్పట్లో టీవీ వార్తల్లో వీడియో క్లిప్పింగు చూసి నోరెళ్ళ బెట్టాను.

ఆడవాళ్ళని అలా కొట్టటం, అదీ బహిరంగంగా.... అప్పుడే తొలిసారిగా చూడటంతో, ఎంతగా విస్తుపోయానంటే... తేరుకోవటానికి కొంత సమయం పట్టింది.

అందునా వాళ్ళు అంగన్ వాడీ టీచర్లు! వాళ్ళ గౌరవవేతనాలేమీ వేల రూపాయలుండవు. అందునా అప్పట్లో మూడు వందలో, అయిదొందలో ఉండేది. ఇంకా బడిలో చేరే వయస్సు రాని, పసిపిల్లల ఆలనాపాలనా చూసేవాళ్ళు! తమ వేతనాన్ని మరికొంత పెంచమనీ, ఇంకొన్ని సౌకర్యాలు ఇమ్మని[వీలైతే తమ ఉద్యోగాలని పర్మినెంటు చెయ్యమని] రోడ్డెక్కి ఆందోళన చేపట్టినందుకు, వాళ్ళని చితక్కొట్టించాడు చంద్రబాబు! అప్పడతడికి ఏ‘సెంటిమెంటూ’ అనిపించలేదు.

బషీర్ బాగ్ కాల్పుల ఘటకైనా అంతే! పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటూ ఎర్రపార్టీల వాళ్ళు, జనాలని సమీకరించి ఆందోళన చేపడితే.... బ్రిటీషు వాళ్ళ స్థాయిలో కాల్పులు జరిపించాడు. వాళ్ళు కూడా... నిన్నటి తన బాబ్లీయాత్ర లాగే, శాంతియుతంగా, గాంధీ మార్గంలో ఆందోళన చేస్తున్న వాళ్ళే! అప్పుడూ చంద్రబాబుకి ఏ ‘సెంటిమెంటూ’ అన్పించలేదు.

"వాళ్ళూ గౌరవనీయులైన కుటుంబాల నుండి వచ్చారు. వాళ్ళేం టెర్రరిస్టులు కారు!" అనిపించలేదు చంద్రబాబుకి. ఇవి మచ్చుకి ఒకటి రెండు సంఘటనలే! తన హయాంలో ఎందరు అమాయకులు, ఎంత నిస్సహాయతకు, ఎంత పోలీసుల జులుంకు, ఎంతగా అధికారుల అవినీతికి బలయి, అసహయంగా కన్నీళ్ళు పెట్టుకున్నారో, ఇతడికి, అప్పట్లో అయితే, ఆలోచించే తీరిక లేదు. ఇప్పుడైతే కనీసం అవి గుర్తుకు కూడా ఉన్నట్లు లేవు.

"తనది కాకపోతే కాశీదాకా డేకమన్నాడట" అనే సామెతని, పెద్దలు, ఇలాంటి వాణ్ణి చూసే చెప్పి ఉంటారు.

అదే తమకైతే... నాలుగు రోజులకే... తమని మర్యాదగా డీల్ చెయ్యలేదని, కనీసం మనుష్యుల్లాగా కూడా చూడలేదని, అన్నం నీళ్ళు ఇవ్వలేదని.. ఎంత ఆక్రోశపడ్డాడో! కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు! మరి తాము రాజకీయ నాయకులు. తమవైతే ప్రాణాలు! ప్రజలవి? నిరర్దక జీవితాలు కాబోలు. తమకైతే మాన మర్యాదలు, మనోభావాలు? ప్రజలకైతే...? "సామాన్య ప్రజలకు కూడా మనోభావాలూ, మానమర్యాదలూ ఉండటమేమిటి? నాన్సెన్స్!" అనుకున్నాడు కాబోలు!

అతడొక్కడికే కాదు. డబ్బూ, అధికారం ఉన్నాయనుకునే రాజకీయ నాయకులూ, అధికారులూ... అందరిదీ దాదాపు ఇలాంటి ఆలోచనా సరళే! కాబట్టే... రాజకీయ పార్టీలలో గానీ, అధికార యంత్రాంగంలో గానీ ‘సేవా భావం’ కాగడా పెట్టి వెదికి చూసినా కనిపించడం లేదు.

ఈ విధంగా జనాల పట్ల తాను వ్యవహరించిన తీరునే, చంద్రబాబు బాబ్లీ యాత్రలో అనుభవించాడు.

అదొక్కటే కాదు, జనం పరంగా అతడి సువర్ణముఖి లో మరో కోణం ఏమిటంటే...

అప్పట్లో అతడికి జనం అంటే ‘nothing' అన్న భావం ఉండేది. అందునా మామ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారాని కొచ్చాక... 1999 లో, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక, అతనికి జనం పట్ల మరింతగా ‘జాగ్రత్త’ పోయింది. ‘తొక్కలో జనం! గూఢచర్యం వెంట ఉండాలే గానీ, ఎన్నికలలో గెలవటానికి జనం అక్కర్లేదు" అనుకున్నాడు. [నిజానికి గూఢచర్యపు లోతు తెలిసిన రాజకీయ నాయకులు ఏ దశకి చేరతారో చంద్రబాబూ, అదే స్థితికి చేరాడు.]

కాబట్టే... ఇప్పుడు చంద్రబాబు, జనాలకి ‘Nothing' అయిపోయాడు. అతడికే కాదు, అతడి లాంటి చాలామందికి కూడా! కాబట్టే... ఇప్పుడు తమ రాజకీయ అవసరాలకి, బలం చూపెట్టుకోవాలన్నా, ధర్నాలు ర్యాలీలు బంద్ లూ సభలూ నిర్వహించాలన్నా.... డబ్బులిచ్చి జనాన్ని సమీకరించుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఓట్లు వేయటానికి కూడా... ఎక్కువమంది విషయంలో... డబ్బులిచ్చి ఓట్లేయమని అడుక్కోవాల్సి వస్తోంది! ఇంతా చేసి డబ్బులిచ్చినా, పుచ్చుకున్న వాళ్ళంతా ఓట్లేస్తారనే గ్యారంటీ లేని రాజకీయ వ్యాపారం చేయాల్సి వస్తోంది.

అయితే, ఆ విధంగా సభలకి జనాలని సమీకరించుకొని బలం చూపెట్టుకోక పోతే... రాజకీయంగా అదే పైకారణం [over leaf reason] అయిపోతుంది. జనంలో ‘ఫలానా వాళ్ళకి, వాళ్ళ పార్టీకి పట్టులేదు, ఆదరణ లేదు’ అన్న ప్రచారంతో మట్టి కలిసిపోతారు. దాంతో, జనాలని సమీకరించి సభలు నిర్వహించుకోక పోతే, అదే Disadvantage అవుతుంది.

అలాగని డబ్బులు ధారాపాతంగా ఖర్చు చేసి, జనాలని తెచ్చుకుని... రోడ్ షోలు, ధర్నాలు, సభలూ నిర్వహించినా.... అవి Advantage ఏం కావటం లేదు.

"ఇవ్వాళా రేపు, డబ్బు ఖర్చు బెడితే, జనాలని సమీకరిస్తే... సభలూ, యాత్రలూ జయప్రదం కావటం పెద్ద విషయ మేమీ కాదు. సభలకి వచ్చిన వాళ్లంతా ఓట్లేస్తారను కోలేం" అనే విమర్శలు బిగ్గరగానే విన్పించాయి. "చిరంజీవిని చూడటానికీ జనం వచ్చారు. అలాగని ప్రరాపా గెలచిందా? జూనియర్ ఎన్టీఆర్ ని చూడటానికీ జనం వచ్చారు. అలాగని తెదేపా 2009 ఎన్నికల్లో గెలిచిందా?" అంటూ దృష్టాంతాలు చూపేవాళ్ళూ ఉన్నారు.

‘జన సమీకరణ చేయకపోతే నష్టం. అలాగని చేస్తే లాభం లేదు!’... అనే ఈ పరిస్థితి, ఎవరూ ఎక్కడా చూసి ఉండరు. అసలిలాంటి స్థితి వస్తుందని ఈ రాజకీయ నాయకులెప్పుడూ ఊహించి కూడా ఉండరు.

ఇక చంద్రబాబు విషయంలో మరో సువర్ణముఖ విన్యాసాన్ని పరిశీలించండి.

రామోజీరావు దర్శకత్వంలో, 1995 లో మామ ఎన్టీఆర్ ని, ‘లక్ష్మీ పార్వతి జోక్యం’ అనే పైకారణంతో [over leaf reason] వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి అయిపోయాడు.

‘నమ్మకద్రోహం చెయ్యగలిగే నైపుణ్యం[Talent] ఉండటమే తన గొప్పతనం, సామర్ద్యం’ అనుకున్నాడు. అది తన ‘లౌక్యం’, ‘తెలివితేటలు’ గట్రా! అదే పని, ఇప్పుడు మరాఠా పోలీసులు "బాబ్లీ చూపెడతాం రమ్మని’ నమ్మించి తీసికెళ్ళి అరెస్టు చేస్తే.... ఎంత అంగలారుస్తున్నాడో? ‘ద్రోహం అనీ, ఘోరం అనీ, నీచం అనీ’ అలిసిపోయే దాకా అరిచి తిట్టాడు. ‘తాను చేస్తే లౌక్యం, ఎదుటి వాడు చేస్తే మోసం!’ అనటం అంటే ఇదే కాబోలు!

అయితే ఇక్కడ ‘మెదళ్ళతో యుద్దం’లో ఓ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే - నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, చాలా మంది మీద ప్రయోగించిన తంత్రం ఈ ‘నమ్మక ద్రోహం’.

మన పురాణాలలో, మత విశ్వాసాలలో, పెద్దలు చెప్పే మాట ఒకటి ఉంటుంది. ‘మాట ఇచ్చి తప్పడం మహా పాపం’ అనీ! దాని [విపర్యయ] మరో రూపమే నమ్మక ద్రోహం. మాట ఇవ్వడమంటేనే నమ్మించడం. ఇచ్చిన మాట తప్పడమంటే ద్రోహం చేయడమే! కాబట్టే "నమ్మక ద్రోహం చేస్తే పుట్టగతులుండవు" అంటారు!

మన స్వాతంత్ర పోరాట చరిత్రలో... కట్టబొమ్మన, ఝాన్సీరాణి ఇత్యాది చాలామంది యోధుల చరిత్రలో, బ్రిటీషు వాడి తరుపున పనిచేసిన నమ్మకద్రోహుల ప్రమేయం లేకపోతే, ఆయా యోధులు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు.

దరిమిలా, సినిమాలలో, సాహిత్యంలో, జోకుల రూపేణా "నీచుడా! నమ్మించి ద్రోహం చేస్తావా?" అంటే... విలన్ నవ్వుతూ "నమ్మకపోతే ద్రోహమెలా చెయ్యటం?" అనే జవాబులుండేవి.

ఆ విధంగా నమ్మకద్రోహమే ప్రధాన ఆయుధంగా... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులు, నెరపే గూఢచర్యం ఉంది. చివరికి ‘కోడల్ని కాదు, కూతుర్ని’ అన్నంతగా... ఇటలీ సోనియా ఇందిరాగాంధీని నమ్మించింది. ‘జీవిత భాగస్వామిని’ అంటూ రాజీవ్ గాంధీని నమ్మించింది.

అలాంటి చోట... అదే ‘నమ్మక ద్రోహాన్ని’ చంద్రబాబు రామోజీరావుకీ, వై.యస్. సోనియా+రామోజీరావు లకీ చూపించారు. గూఢచర్య గుట్టుమట్లు అందరికీ పంచడం ద్వారా చంద్రబాబు, గారెల వంట వంటి సందట్లో సడేమియా గూఢచర్యం నడపటం ద్వారా వై.యస్.!

ఆ లోతట్టు కారణాలతోనే, ఇప్పుడు ఇలా పైకి కనబడే రాజకీయ పోరాటాలు జరుగుతున్నాయి. అవి బాబ్లీ యాత్రలు కావచ్చు, ఓదార్పు యాత్రలు కావచ్చు. పేరేదైతేనేం? లేకపోతే, యాత్రలు జరుపుకోనివ్వటం వలన కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చే నష్టం ఏమిటి? యాత్రలు అడ్డుకోవటం ద్వారా వచ్చిన నష్టమే ఎక్కువ కదా?

ఆ విధంగా తాము జరిపించిన ‘నమ్మకద్రోహం’ రీత్యా, అదే సువర్ణముఖిని... సోనియా, రామోజీరావులు అనుభవిస్తున్నారు. అయితే ఇందులో కేవలం ‘సువర్ణముఖ’ మాత్రమే లేదు. మరో ఆసక్తికరమైన ఆకర్షణీయమైన అంశం ఉంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

http://www.eenadu.net/story.asp?qry1=13&reccount=31

బాగుంది, బాగా విశ్లేషిస్తున్నారు. చిక్కేమంటే .. విభిన్నకోణాలు అంటూ 360 డిగ్రీలూ కవర్ చేసేస్తున్నారు. అసలుకోణం ఏమిటొ అంతు చిక్కడంలేదు. :)

*గూఢచర్య గుట్టుమట్లు అందరికీ పంచడం ద్వారా చంద్రబాబు, గారెల వంట వంటి సందట్లో సడేమియా గూఢచర్యం నడపటం ద్వారా వై.యస్.!*
అమ్మా, ఎమీ గుట్టుమట్లు అందరికీ పంచడొ రాసి ఉంటె బాగుండేది. అలాగే వై.యస్. ఎమీ నడిపాడొ వివరిస్తె బాగుండేది. ఇంతకు ముందు టపాలో కూడా మిరు రాసినా పెద్ద అర్థం కాలేదు. మీ ఉద్దేశం లో
గూడ చర్యం అంటె పైకి ఒకటి లోపల మరొకటనా లేక వేరే విధమైన అర్థం ఉందా? ఆ రోజు బాబు గారి వ్యుహాలన్ని ఇప్పుడు ప్రజలకు తెలిసి పోయినాయి, అలాగె వై.యస్. గారి కాలం లో జరిగిన వన్ని ఇప్పుడిప్పుడె బయటకు రావటం మొదలింది కదా అదేనా మీ ఉద్దేశం.

చంద్ర బాబుకి July 29th "ఈనాడు"లో 8వ పేజీలో బెదిరింపు వచ్చింది "బాబూ పద్దతి మార్చుకో" అని. శీర్షికకూ అందులోని విషయానికీ పొంతన లేకుండా రాసారు.

:-) well said

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu