ఈ మధ్య ‘యుగానికొక్కడు’[తమిళ] అనువాద చిత్రాన్ని చూశాను. తమిళ ప్రముఖ హీరో సూర్యా సోదరుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం. రీమా సేన్ తప్ప ఇతర నటీనటుల పేర్లు, సాంకేతిక నిపుణుల పేర్లు, కథా స్ర్కీన్ ప్లే రచయితలూ, దర్శకుడూ గట్రా వివరాలు.... తెర మీద తమిళ అక్షరాలలో ఉండటంతో తెలియలేదు.

ఇందులో చెప్పుకోవటానికి పెద్ద విశేషాలేం లేవు, ఒక్క అంశం తప్ప!

ఈ సినిమాని సాంకేతిక పరంగా చూస్తే....

ఎంతో ఖరీదుగా, వ్యయ ప్రయాసలతో నిర్మించిన సినిమా! హాలీవుడ్ సాంకేతికత, భారీదనంతో పోటీపడుతూ నిర్మించిన చిత్రం. ఒక దీవినీ, అరణ్యాలనీ, సముద్రాలనీ, ప్రమాదాలనీ ధ్వని పరంగానూ, దృశ్యపరంగానూ భారీగా, కొంత భయానకంగా చూపించారు. మొత్తానికీ ఆ దృశ్యాలు చూస్తుంటే ’మజా’ వచ్చింది.

ముఖ్యంగా... టైటానిక్, క్వీన్ విక్టోరియాల కంటే కూడా ఈ సినిమాలోని నౌక గొప్పగా కనబడింది. క్లోజప్ లో,సముద్రంలో ఒయ్యారంగా కదులుతున్న ప్రేం చాలా బాగుంది. నౌక లోపలి భాగం బాగా చూపించి ఉంటే ఇంకా బాగుండేది. అందులో పాట కూడా చాలా బాగుంది. పాత సినిమా, ఎంజీఆర్ నటించిన పాట... సౌదర్య రాజన్ గొంతులో భలే హుషారుగా ఉంది. పాతకొత్తల మిక్సింగ్ తో, చాలామంది నటీనటులతో చిత్రించిన, హుషారు పుట్టించిన తమిళ పాట అది! అందునా సౌందర్యరాజన్ కంఠంలో!

ఆయన గొంతులో సంస్కృత శ్లోకాలు, తమిళ భక్తి గీతాలు నాకు చాలా ఇష్టం! అప్పుడెప్పుడో తెలుగులో ఆయన పాడిన ‘నేలపై చుక్కలు చూడు’ పాటలోని ముద్దుముద్దు యాసతో సహా! ఈ సినిమాలో మరో తమిళ పాట కూడా ఉంది. కొన్ని చోట్ల తమిళ సంభాషణలు ఉన్నాయి. వాటికి కనీసం తెలుగు కాప్షన్స్ చూపించి ఉంటే ఇంకొంచెం బాగుండేది.

సముద్రంలో రెడ్ ఫిష్ [స్టింగ్ రే ఫిష్ ?] వంటి చేపల దాడి, సర్పాలు... గట్రా దృశ్యాల్లో భీభత్సరసాన్ని నింపారు.

కళాపరంగా చూస్తే.....

కథానాయకుడు కార్తీ నటన ఫర్వాలేదు. చోళ రాజుగా పార్తీపన్.... కళ్ళలో పలికించిన భావాలు, నటుడిగా అతడి సత్తా చూపించాయి. మిగిలినదంతా చెత్త! టిక్కెట్లు తెగటం కోసం మసాలా బాగా దట్టించిన చెత్త! ముఖ్యంగా రీమాసేన్ బరితెగించిన నటన జుగుప్స కలిగించింది. అసలు మచ్చుకైనా ఆడతనం లేని పాత్ర అది.

అసలు ఇప్పటి సినిమాలలో దాదాపు హీరోయిన్లందరూ ఆడతనం అడ్రస్ లేకుండానే ఉన్నారులెండి! వేషధారణలో గానీ, సంభాషణల్లో గానీ, దేహ భాష లో గానీ! అలాంటి హీరోయిన్లని చూసి హీరో, అతడి ప్రక్కన చెంచాలు ఎలా చొంగ కారుస్తారో వాళ్ళకే తెలియాలి. అలా చొంగ కార్చేటట్లయితే కథానాయకి [హీరోయిన్] అన్న పేరుకాకుండా ’వాంప్’ అన్న పేరు పెడితే ఇంకా బాగుంటుంది కదా!
దర్శకుడు దృశ్యాల్ని చూపించటం మీద తీసుకున్న శ్రద్ద, కథ చెప్పటం మీద తీసుకోలేదనిపించింది.

కథాపరంగా చూస్తే.....

శతాబ్దాల క్రితం... రెండు రాజవంశాలు.... చోళ, పాండ్యుల వైరం గురించిన కథ ఇది! పరాజితుడైన చోళరాజు తన యువరాజుకీ, రాజగురువు కీ మరికొందరిని తోడుగా ఇచ్చి, పాండ్య రాజుల కులదైవ విగ్రహాన్ని కూడా ఇచ్చి, సుదూర దీవికి పంపుతాడు. వారిని వెంటాడుతూ వెళ్ళిన పాండ్య దళపతి ఒకడు వ్రాసిన తాళ పత్రాల వివరాలు మాత్రమే ఆధారంగా ఒక శాస్త్రవేత్త, అతడి కుమార్తె చోళుల ఆచూకీ తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తారు.

తాము దాగిన దీవి చుట్టూ, తమని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు, ఏడు ప్రమాదాలని [Traps]ని చోళులు ఏర్పాటు చేస్తారు. సాంకేతికంగా వీటిని ఎలా ఏర్పాటు చేయగలిగారో, కథా రచయిత, దర్శకుడూ చెప్పలేదు. సముద్రం, మాంసాహార చేపలు, ఆటవికులు, సర్పాలు, దాహం, ఆకలి, కామం గట్రా! నీడలో పరిగెడితే ఎడారి ఇసుక, నీడదాటితే ఇసుక ఊబి ఉండటం మరో విచిత్రం. అలా ఎందుకుంటుందో దర్శకుడు స్పష్టత ఇవ్వడు.

అలాగే చివర్లో సైనికులు హెలికాప్టర్లలో దిగితారు. అలాంటప్పుడు ‘మొదట్లోనే హెలికాప్టర్లలో గాలిస్తే చోళుల శిధిల కోటల వివరాలు తెలిసేవి కదా?’ అన్నది ప్రేక్షకుడికి మిగిలే ప్రశ్న. అక్కడ శిధిల చిహ్నలు తప్ప చోళులు సజీవంగా ఉంటారని శాస్త్రవేత్త ఊహించదు. పురాతత్త్వ శాస్త్రపరిశోధన అన్నది నెపం మాత్రమే అన్నట్లుగా ఈ రీమాసేన్ పాత్ర ఉంటుంది.

తీరా చోళుల్ని చేరాక, అక్కడో చిన్నపాటి యుద్దం! దాన్ని గెలిచేసిన హీరో! అతడి వీపునా పులి బొమ్మ ఉంటుంది. అది చోళుల గుర్తు! రీమా సేన్ వీపు మీద కనబడి మాయమయ్యే పులిబొమ్మ ఉంటుంది.

రీమా సేన్ పాండ్యుల వంశస్తురాలు. ఆమె తల్లి చిన్నప్పటి నుండి, ఆమెకి చోళుల మీద పగా ప్రతీకారాలు నూరిపోసి, యుద్ద విద్యలూ, ఇతర నైపుణ్యాలు నేర్పి పెంచిందిట. ఆమె లాగే వివిధ పదవులలో, హోదాలలో, ప్రభుత్వ ఉన్నతోద్యోగాలలో పాండ్యులు, గుట్టు చప్పుడు గాకుండా పనిచేస్తుంటారు. వాళ్ళ లక్ష్యం ఒకటే! చోళుల ఆచూకీ కనుక్కొని, వాళ్ళని నాశనం చేయాలి. వాళ్ళెత్తు కెళ్ళిన తమ కులదైవ విగ్రహాన్ని తిరిగి సంపాదించుకోవాలి.

పైకి మామూలుగా చెలామణి అయ్యే పాండ్య వంశీయులు, అంతర్గతంగా ’టచ్’లోనే ఉంటారు. వివిధ ప్రాజెక్టులూ, కార్యక్రమాలు పేర్లు చెప్పి.... ప్రభుత్వ వనరుల్ని, విమానాలు, ఆయుధాలు గట్రా సాధన సంపత్తినీ వాడుకుంటారు. ఇంకా కొన్ని మాయమంత్రాలు కూడా వచ్చి ఉంటాయి.

అలాగే చోళులూ! నేలమాళిగలో ఉన్నట్లుగా బ్రతుకుతూ, దక్షిణ భారతదేశంలో మళ్ళీ చోళ సామ్రాజ్య స్థాపనకి అనుకూల పరిస్థితులు కోసం వేచి ఉంటారు, శతాబ్దాలుగా, తరాల తరబడి! బంగారం గట్రాతో పాటు, మాయమంత్రాది శక్తులూ ఉంటాయి. రీమా సేన్ నీడని ఎత్తితే, ఆమె కూడా గాల్లోకి లేచి గిలగిల కొట్టుకుంటుంది. రామాయణం సుందరకాండలో సురస అనే సముద్ర రాకాసి లాగా!

రీమా సేన్, చోళుల్ని తనే దూతనని నమ్మించి మోసగిస్తుంది. తరువాత రాజగురువు, హీరోని దూతగా గుర్తించి తన శక్తుల్ని హీరోకి[?] ధార పోస్తాడు. పాండ్య వారసులు తుపాకులు గట్రా ఆయుధాలు ఉపయోగించగా, చోళ వారసులు బాణం, డాలు లు ఉపయోగించి యుద్దం చేస్తారు. తాగు నీటిలో రీమా సేన్ విషంతో పాటు, పగతో కూడిన తన రక్తాన్నీ కలిపేస్తుంది. ఆ కుట్రకి చోళ సైనికులు బలవుతారు. చోళ రాజు [పార్తీపన్] మరణిస్తాడు. మరో వారసుణ్ణి తీసుకుని, రాజగురువు నుండి శక్తులందుకున్న హీరో [కార్తీ] మళ్ళీ కనుమరుగు కావటంతో సినిమా ముగుస్తుంది.

మామూలుగా చూస్తే అర్ధం పర్ధం లేని కథ అన్పిస్తుంది. తార్కికంగా ఆలోచిస్తే.... నీడని లేపితె మనిషి గాల్లోకి లేవటం, అసలు నీడని లేపగలగటం ’రబ్బిష్’ గా తోస్తాయి. కానీ గూఢచర్యపరంగా అలాంటివే గాకపోయినా, నమ్మలేనంతటి అసాధారణాలు సాధ్యమే!

ఏమైనా.... ‘శతాబ్దాలుగా, తరాల తరబడి, కొన్ని వంశాలు ఒక లక్ష్యం కోసం రహస్యంగా పని చేయటం’ అనే ప్రక్రియని పరిచయం చేయటానికి మాత్రమే ఈ సినిమా పనికి వస్తుంది. ఏ విదేశీ వంశాలనో, మతపరమైన వంశాలనో చెప్పటం దేనికన్నట్లు, చరిత్రకు చెందిన హిందూరాజ వంశాలు చోళ, పాండ్యులని తీసుకున్నట్లున్నారు.

ఒక సామ్రాజ్య స్థాపనకు చోళ వంశీయులు రహస్యంగా, తమ ఉనికి ఎవరూ కనిపెట్టకుండా చుట్టూ అనేక ప్రమాదాలు[ద్వంద్వాలు వంటి Traps] ఏర్పాటు చేసుకుని ఉండగా.....

పగా ప్రతీకారాలతో, మత విశ్వాసాల కోసం, ప్రభుత్వంలో సమాజంలో పైకి మామూలుగా చెలామణి అవుతూ, అంతర్గత సంబంధం కలిగిన పాండ్య వంశీయులు ప్రభుత్వాన్ని, ప్రజా ధనాన్ని ఉపయోగించుకుంటూ, తమ వంశ ఆశయాన్ని సాధించుకో ప్రయత్నించటం....

వెరసి రెండు వంశాలనీ కలిపితే నకిలీ కణిక గూఢచర్య అనువంశీయులే!

ఇలాంటి చిత్రకథలో ఒక సినిమా రావటం ఇప్పటి వరకూ ఎప్పుడూ జరిగినట్లు తెలీదు. బహుశః ఇదే మొదటిది కావచ్చు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

13 comments:

ఆది లక్ష్మి గారు,
సినిమా రివ్యూలు మొదలు పెట్టారా? స్వాగతం.
ఇలాంటి చెత్త సినిమా లకి ఇంత పెద్ద రివ్యూ రాయటం వసరమా...

తెర మీద తమిళ అక్షరాలలో ఉండటంతో తెలియలేదు
కొన్ని??? చోట్ల తమిళ సంభాషణలు ఉన్నాయి.వాటికి కనీసం తెలుగు కాప్షన్స్ చూపించి ఉంటే ఇంకొంచెం బాగుండేది.

ఇంతకీ సినిమా తమిళం లో చూసినప్పుడు తమిళ సంభాషణలే ఉంటాయి కదా?

నేను చూసానండి....సాంకేతికాపరంగా బాగుంది కాని మిగిలింది ఒక్కముక్క అర్థంకాలేదు.

ee cinema chuddam anukoni, Hyd PVR lo ee cinema chusi oka sthri ki kadupulo devi vanthulu chesukunnadi anna vaartha chadivi ee cinema choodaledhu..

bondalapati గారు: సినిమా రివ్యూలు అన్నిటికి వ్రాయనండి. అప్పుడప్పుడు మాత్రమే! నేను చూసింది తెలుగులోనేనండి. అది చెత్త సినిమానే!

పద్మార్పిత గారు: కథ అర్ధమయ్యేటట్లు ఆ సినిమా తీయలేదులెండి :)

Kishen Reddy గారు : ఆ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలలో అంత జుగుప్స ఉంది.

మీరు గూఢచర్యం గురించి ఎప్పుడూ అలోచిస్తుంటా రనిపిస్తుంది వీలయితే A beautiful mind సినిమా చూడండి.

సినిమాలకు రివ్యూలు రాయడం తప్పు కాదండి ... ఎందుకంటే నకిళీ కనీకుడి ప్రధాన అయుధం మీడియానే కదా. మరి అటువంటి మీడీయాలో ప్రధానమైన సినిమా గురించి తెలుసుసు కొవడం అత్యవసరం. ఈ సినిమా మాద్యమం ద్వారానే నకిలీ కనికుడు జనం (public ) mind set ను Tune చేస్తున్నాడు
- ఆత్మ బంధువు

ఈ సినిమా గురుంచి మా ఆఫీసులో తమిళ సోదరులు ఒక రేంజిలో చెప్పారు.అంత లేదన్నమాట.అయితే ఇంకెందుకు లేండి చూడ్డం.

కొసమెరుపు గారు: ఆ సినిమా నాకు దొరికితే చూసి ఆ తరువాత చెబుతానండి. నెనర్లు!

ఆత్మబంధూ : నా ఆలోచనను సరిగా అర్ధం చేసుకున్నారు. నెనర్లు! :)

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు : ఒకసారి చూసి తేల్చుకోకూడదూ :)

కొసమెరుపు గారు.. ఆ సినిమా నేను చూసాను.. ఎంటట విషయం ???
:-))

మంచు-పల్లకీ గారు: ఇంతకీ A Beautiful Mind సినిమా కథ ఏమిటో చెప్పగలరా? :)

A Beautiful Mind" చాలా మంచి సినిమా అండీ, తప్పక చూడాల్సిన సినిమా. ,మీరు చిరునవ్వుతో సినిమా చూసారా, దానిలో సినిమా ధియేటర్ లోనుండి బయటకు వచ్చి కీ అడగడం, అయిస్ క్రీమ్ అడగడం ఇవన్నీ ఆ సినిమాలోవే,
ఇక కధ విషయానికొస్తే ముందొక లవ్ స్టోరీ, దాని తర్వాత తండ్రీ బిడ్డలిద్దరూ నాజీల కాంప్‍లో చేరతారు(ఎలా అన్నది గుర్తు లేదు),తల్లి విడిగా ఉంటుంది.

Manohar - That is "life is beautiful".

Beautiful mind is about a mathematics prof who suffers from schizophrenia, finally wins nobel prize.

The key word is "schizophrenia" !!

మంచు.పల్లకీ గారు: మనోహర్ వ్యాఖ్యతో నేనూ తికమక పడ్డాను. A Beautiful Mind గురించి నాలుగైదు రోజుల క్రితం నేనూ ఈనాడు హాయ్ బుజ్జీలో చదివానండి. కాకపోతే సదరు గణిత శాస్త్రవేత్తకు మతిస్థిమితం తప్పింది అని వ్రాసారు. Schizophrenia అని ఉటంకించలేదు. :)) సినిమా గురించి వివరాలు చెప్పినందుకు, అజ్ఞాత వ్యాఖ్యని ఖండిస్తూ మాకు నైతిక మద్దతు ఇచ్చినందుకూ కృతజ్ఞతలు. :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu