శ్రీరాముడు మనకి చూపిన వారసత్వపు బాటకు చిన్న ఉదాహరణ చెబుతాను. ‘లవకుశ’ చిత్రం చాలామంది చూసి ఉంటారు. తెలుగు వారి గుండెల్లో సీతమ్మ తల్లిగా అంజలీ దేవిని ప్రతిష్ఠించిన, ఘంటసాల సంగీతంతో ఇంటింటా మారుమ్రోగిన రామకథా చిత్రం అది.

అందులో - శ్రీరాముడికి, తాగి వాగిన చాకలి వాడి నిందావాక్యం గురించి గూఢచారి భద్రుడు సమాచారం ఇచ్చాక, శ్రీరాముడు, లక్ష్మణ భరత శతృఘ్నులలో ఒకరిని రాజ్యభారం తీసుకోమనీ, తాను తన ప్రియసతి సీతతో కలిసి అరణ్యాలకు వెళ్తాననీ అంటాడు. వారెవ్వరూ ఒప్పుకోక పోవటంతో సీతని పరిత్యజించే నిర్ణయం తీసుకుంటాడు.

దానికి లక్ష్మణుడు "సీత పరమ పవిత్ర. అగ్నిలో దూకిన ఇల్లాలు. అటువంటి సాధ్విని సందేహించటమూ, పరిత్యజించటమూ పరమ కాఠిన్యం" అంటాడు. శ్రీరాముడు "సీత నా సొత్తు. ఆమెని నేను పరిత్యజించగలను. కానీ ఇక్ష్యాకుడూ, హరిశ్చంద్రుడూ మొదలైన వాళ్ళు సముపార్జించిన ఈ సూర్యవంశ గౌరవం నాది కాదు. దాన్ని పరిత్యజించేందుకు గానీ, కలుషితం చేసేందుకు గానీ, నాకు ఏ అధికారం లేదు" అంటాడు.

తరతరాలుగా తాతతండ్రులు సంపాదించిన యశోసంపదను భ్రష్ఠపరచలేక, తన వ్యక్తిగత సుఖ జీవితాన్ని వదులు కుంటాడు. సీతని అడవికి పంపిన రాముడు, మరో స్త్రీని గ్రహించి సంసార సుఖాన్ని, సంతానాన్ని పొందలేదు. అదీ శ్రీరాముడు తన పూర్వీకులకి ఇచ్చిన గౌరవం, తాను ఆచరించిన వారసత్వం!

అందుకే శ్రీరాముడు, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా భారతీయులకి ఆదర్శం, ఆరాధ్య దైవం!

ఈ భారతీయ వారసత్వాన్నీ తానూ అందుకున్నాడు కాబట్టే.... పీవీజీ, మాతో పాటూ ఈ దేశపు సామాన్యులనీ తన వారసులుగా, నెం.5 వర్గపు సైనికులుగా ఎన్నుకున్నాడు.

అదెలాగో చెప్పేముందు, లోపలి మనిషి నుండి మరికొన్ని అంశాలను సృశిస్తాను.

ముందుగా... భూసంస్కరణల చట్టపు మూసాయిదా తయారు చేయటం అనే సందర్భాన్ని వివరిస్తూ.... ఆనంద్, తన డ్రాప్ట్ మన్ తో అన్నట్లుగా ఉన్న ఈ క్రింది సంభాషణలో
681వ పేజీలో
>>>`నాకీ స్ఫురణ ఎలా కలిగిందో, ఎందుకు కలిగిందో నాకే తెలియదు, తనకు కలలో జరిగిన సముజ్జ్వల సాక్షాత్కారానికి సంబంధిన జ్ఞాపకంలోకి జారిపోతూ ఆనంద్ అనుకున్నాడు. ‘దానికొక పేరు కూడా నాకు స్ఫురించింది. స్ఫురింప చేయబడిందనడం సబబు. ఆ పేరు ’శాసన పూర్వ జాగ్రత్త’. నా అంతట నాకీ ఆలోచన వచ్చి ఉండేది కాదు.... శాసన యుద్దంలో అనుసరించవలసిన ఇటువంటి వ్యూహంలో మనందరం సిద్దహస్తులం కాగలమనిపిస్తోంది!’

శాసనం అంటే చట్టం. చట్టపు యుద్దంలో "మనందరం సిద్దహస్తులం కాగలమనిపిస్తోంది" అన్నమాటలే, పీవీజీ తన పదవీకాలంలో "చట్టం తన పని తాను చేసుకుపోతుంది’గా అన్నాడు. అదే తర్వాత ప్రముఖంగా అందరి నోటా వినబడి సినిమాలలో కూడా ’హిట్ డైలాగ్’ అయిపోయింది. ఒకరకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాలు ఎంత లోపభూయిష్టమో, ఆవే లోపాలను ఉపయోగించుకుని అందరినీ expose చేయడం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. మొత్తంగా.... ‘మనిషి దృక్పధంలో మార్పు రావాలి గానీ, కొత్తకొత్త చట్టాలు ఎన్ని తెచ్చుకుంటే ఏం లాభం?’ అన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం!

ఇక 685వ పేజీలో
భూసంస్కరణల చట్టం గురించి తప్పించుకునేందుకు దొంగ విడాకులు తీసుకున్న భూస్వామ్య దంపతులు, ఆనంద్ జారీ చేసిన ’శాసన పూర్వ జాగ్రత్త’ ఆర్డినెన్స్ కారణంగా, గ్రామాలలో సాంఘిక అమర్యాదకు గురవ్వటం, రకరకాల జోకులతో అపహాస్యానికి గురవ్వటం అనే పరిణామం సంభవించిన నేపధ్యంలో.... పీవీజీ క్రింది విధంగా వ్రాసాడు.

>>>ఈ పరిణామం, ఆనంద్ పై భూస్వామ్యవర్గంలో ఉన్న ద్వేషభావానికి మరింత పదును పెట్టింది. ప్రజల నుండి వచ్చిన అచంచలమైన మద్దతును దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఆ ఆర్డినెన్స్ అధికార పక్షానికి ఆత్మహత్యాసదృశమవుతుందని పత్రికలు చెప్పిన జోస్యానికి ఆస్కారమే కనిపించలేదు.

ఈ ఒక్క సందర్భంలోనే కాదు, చాలా చోట్ల, చాలా సార్లు, ఆనంద్ పైనా, అతడి లాగే ప్రజలకీ, దేశానికీ ఏదైనా మంచి చేయాలనుకునే వారి పైనా, పత్రికలు కత్తిగట్టినట్లు అసత్య సంచలనాలను ప్రయోగించడాన్ని ’లోపలి మనిషి’లో పీవీజీ ఉటంకించాడు. ఆ విధంగా ‘పత్రికలు సంచలన కథాంశాలు, విపరీత ప్రచారాలతో పనిచేయటం’ తన పరిశీలనలో ఉందన్నది స్పష్టంగానే చెప్పాడు. కలప దొంగ రవాణా సంచలనం దగ్గరి నుండి గోడల మీద అసభ్య వ్రాతల వార్తాంశాల దాకా! మీడియా విపరీత ప్రచారాలు బహిర్గతమై ఇప్పుడు మన కళ్ళకి కనిపిస్తూనే ఉన్నాయి కదా!

ఇంత పరిశీలనా, పరిశోధనా.... మీడియా పట్ల ఉంది కాబట్టే, ఇందిరాగాంధీ, పీవీజీలతో సహా, నాడు దేశం పట్ల నిబద్దతా దేశభక్తి గలవారు, దేశం మీద ప్రధాన కుట్రదారుగా మీడియాలోని వ్యక్తే ఉండి ఉండాలని శోధించారు. కాకపోతే జాతీయ పత్రికల నేపధ్యంలో అన్వేషించారు. స్థానిక పత్రికాధిపతిని అనే ముసుగేసుకుని, ఓ మూలన నక్కి ఉండే నకిలీ కణిక వ్యవస్థలోని రామోజీరావు మాయాజాలాన్ని ఊహించలేదు. కాబట్టే - వీపీ సింగ్, కరుణానిధి, అద్వానీ వంటి వారు, ఈ స్థానిక పత్రికాధిపతి చుట్టూ తరచూ తిరుగుతారు వంటి అంశాలతో కూడిన నా రిపోర్టు... పీవీజీకి ముఖ్యమైన ’క్లూ’ని ఇచ్చింది.

ఈ విధంగా మీడియా మాయాజాలాన్నే కాదు, పాకిస్తాన్ పట్ల అమెరికా, రష్యా, చైనాల పక్షపాత ధోరణిని, ప్యాటర్సన్ ట్యాంకుల సాక్షిగా, ఇండో - చైనా, ఇండో-పాక్ యుద్దవ్యూహల సాక్షిగా, వాటిపై అంతర్జాతీయ మీడియా ఆడిన నాటకాల సహితంగా, పీవీజీ తన ’లోపలి మనిషి’లో వివరించాడు.

’లోపలి మనిషి’ లో పీవీజీ, ఆనంద్ ద్వారా మరో ముఖ్యమైన అంశాల్ని కూడా ప్రస్తావించాడు. ఆనంద్ విద్యార్ది దశని వివరిస్తూ ’ప్రపంచం మీద తనదైన ముద్ర వేయాలనే’ తన సంకల్పాన్ని ఆవిష్కరించుకున్నాడు.

ప్రపంచం మీద తనదైన ముద్ర - ఒక ద్రష్ట మాత్రమే చేయగలిగింది. ఒక దార్శినికుడు మాత్రమే వేయగలిగింది. ప్రపంచానికి ఒక దిశను చూపించాలంటే అతడు సత్యదర్శియై ఉండాలి. అలాంటి సత్యాన్వేషి, సత్యదర్శి పీవీజీ.

ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృతి పుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ

అన్న ధీరోదాత్తుడు! అవును. తమోగుణంతో, అవగాహనా రాహిత్యంతో, అసత్యపు టెడారుల వెంట అలుపెరగకుండా పరుగెడుతున్న ప్రపంచాన్ని, రజోగుణం రగిల్చి, జ్ఞానపు కాంతిపుంజాలతో వెలిగించటమే.... పీవీజీ సమీకరించిన నెం.5 వర్గం ‘బహిర్గతాలు-సువర్ణముఖి’లతో నిర్వహించుకుంటూ వస్తోంది. కొద్ది సంవత్సరాల గతంలో ప్రారంభమై, వర్తమానంలో వేగమందుకొన్న ఈ ప్రక్రియ, సమీప భవిష్యత్తులో పూర్తై తీరుతుంది. ఈ నేపధ్యంలో, పీవీజీ సంకల్పాన్ని భగవంతుడు సిద్దింప చేసిందే కన్పిస్తుంది.

ఒక్క పీవీజీ కే కాదు, ఎవరికైనా భగవంతుడు ఆ అవకాశం ఇస్తాడు. సత్సంకల్పమో, దుస్సంకల్పమో - అది మనిషి విజ్ఞత. మన సంకల్పం ఏదైతే, దాన్నే భగవంతుడు సిద్దింప చేస్తాడు. కాక పోతే దుష్ట సంకల్పానికి దుష్పలితం, సత్సంకల్పానికి సత్ఫలితమూ వస్తాయి, అంతే! అందుకే.... నెం.5 వర్గానికైనా నకిలీకణిక వ్యవస్థ, నెం.10 వర్గానికైనా భగవంతుడి ఇచ్ఛానుసారమే సాగుతుంది అని గత టపాలలో వ్రాసాను.

నా స్వానుభవం: అప్పటికి డిగ్రీ చదువుతున్నాను. మా వీధిలో చిన్న టీ కొట్టు ఉండేది. తెల్లవారు ఝామున అయిదింటికే ఆ టీ కొట్టు యజమాని [చిన్నవాడే లెండి.] దుకాణం తెరిచేవాడు. మరుక్షణమే టేప్ రికార్డర్ పేద్ద చప్పుడుతో పెట్టేవాడు. అతడు క్రిస్టియన్! అతడికిష్టమైన భక్తి గీతాలు పెట్టేవాడు.

ఉదయాన్నే

"ఇన్నేళ్ళు మనము
ఉన్నాము ఇలలో
చల్లనీ దేవునీ నీడలో
గతించిపోయే కాలమూ
స్మరించు యేసు నామమూ
సంతోషించుడీ శుభోదయం’ అనే పాట వేసేవాడు.

అప్పుడే నిద్రలేచి, నిద్రకళ్ళతో తూర్పు దిక్కుకు నమస్కరించుకునే నాకు, ఒక్కసారిగా నీరవ నిస్పృహలు వచ్చేవి. పాట చక్కనిదే! సుశీల పాడిన పాట. కానీ, నాకు "అవును... ఇన్నేళ్ళు గడిచాయి....జీవితంలో సాధించింది ఏమీ లేదు" అన్పించేది. ఆ రోజంతా దిగులుగా ఉండేది. ఎప్పుడైనా ఆ పాటకు బదులు మరో పాట వినబడినప్పుడు నా అనుభూతులన్నీ మరోలా ఉండేవి. కొన్ని రోజులు నన్ను నేను పరిశీలించుకునే సరికి, నాకు విషయం బోధపడింది. మా నాన్నని "అతణ్ణి ఉదయాన్నే వేరే పాటలు పెట్టుకొమ్మని చెప్పండి. కాస్సేపయిన తర్వాత ఆ పాట పెట్టుకున్నా ఫర్వాలేదు. క్రైస్తవ గీతాలే మరేవైనా పెట్టుకొమ్మనండి" అని అడిగాను.

మా నాన్న అతడికి అదే చెప్పాడు. అతడూ నవ్వేసి సరేనన్నాడు. మర్నాటి నుండి ఉదయమే మరో క్యాసెట్ పెట్టుకున్నాడు.

అప్పుడే అనిపించేది - "జీవితంలో ఏదో సాధించాలి! పుట్టాం, ఏదో ఉద్యోగం, డబ్బు సంపాదించాం, బ్రతికాం! ఇదే కాదు జీవితం అంటే" అని. నా ఆ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాడనే అనుకుంటాను. ఎవరికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. అందుకే గీత ‘నీ మనస్సే నీ శతృవు, నీ మనస్సే నీ మితృవు’ అంటుంది. మన సంకల్పాన్ని బట్టే మనం కాబట్టి, మన సంకల్పం మన మనస్సుని బట్టే ఉంటుంది కాబట్టి.

పీవీజీ సమీకరించిన నెం.5 వర్గపు పనితీరు కూడా ఈ కాన్సెప్ట్ మీదే ఆధారపడింది. రాజకీయ, కార్పోరేట్, సినిమా, గట్రా రంగాలలోని అగ్రనేతలు, సెలబ్రిటీల దగ్గరినుండి సామాన్యుల దాకా.... వారి వారి సంకల్పాలని బట్టే వారి జీవిత సంఘటనలు [సెలబ్రిటీలకీ, రాజకీయ నేతలకీ వారి ఆసైన్ మెంట్లు] నడుస్తున్నాయి.

కొన్ని ఉదాహరణలు చెబుతాను.

1996 లో పీవీజీ ప్రధాని పదవి దిగిపోయిన నాటి నుండి ప్రధాని పదవి నధిష్టించిన వారిలో....

వాజ్ పేయి - ఈ బ్రహ్మచారి రాజకీయ నాయకుడు, యువకుడిగా ఉన్న రోజుల్లో కూడా.... కెరీర్ కోసం, ఇది రాజకీయ వ్యూహం అంటే ఏది చేసేందుకైనా సిద్దపడే వాడే! అయితే అదీ కొంత పరిధి మేఱకే! దేశ ద్రోహానికి ఒడిగట్టేంతటి వాడు కాదు. 1971 లో ఇండో పాక్ యుద్దానంతరం, బంగ్లా దేశ ఆవిర్భావ నేపధ్యంలో అతడు ఇందిరాగాంధీని ‘అపర చండిక’ అనేసాడు. అతడికి మొదటి నుండీ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇందిరాగాంధీ పట్ల సానుకూలతేమీ లేదు. కానీ, దేశపు విజయాన్ని ఆనందించిన వాడు కాబట్టి, మాట తూలాడు. కాబట్టే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి అద్వానీ తూగినంతగా వాజ్ పేయి తూగలేదు.

1992 తర్వాత.... 1996 నుండీ ఎకాయెకీ అద్వానీ అగ్రసీటులో ఉండటం ఎక్కువ ప్రమాదకరం అనుకున్న గూఢచర్య నేపధ్యంలో, వాజ్ పేయికి అంత ప్రాముఖ్యత ఇచ్చారే గానీ 1992 కు ముందరైతే, అద్వానీతో పోలిస్తే వాజ్ పేయికి ఎక్కువ సీన్ ఇవ్వబడలేదు. మీడియా సైతం ప్రచారం ఇవ్వలేదు.

అతడికి మాతృ దేశంమీద, భాజపాలోని ఇతర నాయకులతో పోలిస్తే ఎంతో కొంత ఎక్కువ ప్రేమాభిమానాలే ఉన్నాయి. కాబట్టే... 1800 కి.మీ. పొడవైన Golden Quadrilateral [స్వర్ణ చతుర్భుజి] నాలుగు లైన్ల జాతీయ రహదారి అతడి మానస పుత్రిక అయ్యింది. అద్వానీలకి అంతటి అవకాశం లేకపోయింది. అలాగే కాందహార్ వ్యవహారం వాజ్ పేయి మెడకి చుట్టలేక పోయారు.

వాజ్ పేయి... అతడి మతిలో ఏముందో అదే గతిలో పొందాడు. అతడి సంకల్పం సిద్ది అది!

అద్వానీ: పాకిస్తాన్ నుండి వచ్చిన, నకిలీ కణిక వ్యవస్థలోని ఈ కీలక వ్యక్తి, కాందహార్ సాక్షిగా, జిన్నా సాక్షిగా తానేమిటో నిరూపించబడ్డాడు కదా! జస్వంత్ సింగ్ మాటల, ఆత్మకథల సహితంగా! రామ మందిరం కోసం గొంతులు చించుకున్న అతడు, భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత రామమందిరం పట్ల తనకు ఎంత నిబద్దత ఉందో నిరూపించుకున్నాడు. అదే అతడి సంకల్పసిద్ది.

చంద్రబాబు నాయుడు: చంద్రబాబు సంకల్పం, ధృక్పధం - ‘ఏం చేసైనా సరే.... నమ్మించి ద్రోహం చేసైనా, వెన్నుపోటు పొడిచైనా సరే...అధికారమే పరమావధి’. ఆ సంకల్పమే సిద్దించింది అతడికి. మొత్తం అవినీతి సొమ్ములో తనదే సింహభాగం కావాలన్నదే అతడి ఆశ! ఆ విధంగానే అవినీతిని వ్యవస్థీకృతం చేసాడు. అతడు రామోజీరావు జేబులో బొమ్మ! రామోజీరావు కోసం ఏంచేయటానికైనా వెనకాడని వాడు. కాబట్టే అతడి తరుపున ప్రపంచం మొత్తం గూఢచర్యం కోసం తిరిగాడు. అతడికి తెలుసు తాను చేస్తున్నది దేశద్రోహమని!

వై.యస్. రాజశేఖర్ రెడ్డి: వై.యస్.కి రామోజీరావుపై ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పం! తనని ఉపయోగించి కొని, అవతల పెడుతున్నాడనే కసి, దుగ్ధ ఉన్నాయి. అవకాశం వస్తే ఒక ఆట ఆడుకోవాలనే సంకల్పం ఉంది. అదే ఫలించింది.

ఆయా వ్యక్తులకి గల సంకల్పాలని బట్టే వారి కర్మలూ [assignments] నడిచాయి. ఆ కర్మలే ఆయా వ్యక్తుల నిజస్వరూపాలని బహిర్గత పరిచాయి. వాటి ఫలితాలే సువర్ణముఖిలయ్యాయి.

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇటీవల వచ్చిన సినిమా ’బంపర్ ఆఫర్’ లో.... ధనమదంతో రెచ్చిపోతున్న హీరోయిన్ తండ్రిని దెబ్బతీసేందుకు, అతడి ఉద్యోగి ధర్మవరపు సుబ్రమణ్యంని హీరో కలుస్తాడు. యజమాని పుట్టి ముంచుతూ తనకు సాయం చేస్తే డబ్బులిస్తానంటాడు.

దానికా ఉద్యోగి - "పాతికేళ్ళుగా వాడి దగ్గర పనిచేస్తున్నాను. వాణ్ణి దివాళా తీయించి రోడ్డుకి లాగితే నేనే మీకు డబ్బులిస్తాను" అంటాడు. అదేమిటీ అని తెల్లబోయిన హీరో బృందానికి అతడు "ఫ్రస్టేషన్ బాబూ! ఫ్రస్టేషన్!" అంటూ ఇన్నాళ్ళు కడుపులో దాచుకున్న మంటని వెళ్ళగ్రక్కుతాడు.

సరిగ్గా ఇప్పుడు ఇదే.... గూఢచర్య నెట్ వర్క్ లో, ఏజంట్లకీ వాళ్ళ బాసులకీ మధ్య నడుస్తోంది. సహజంగానే క్రింది వాడికి తనపై వాడి మీద ఓ ఫ్రస్టేషన్ ఉంటుంది. ఇక తమకి నడుస్తున్న రోజుల్లో తమ పెర్వర్షన్లన్నింటినీ, అందరి మీదా ప్రయోగించిన నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తుల మీద, నెం.10 వర్గంలోని ఏజంట్లకి కడుపుమంట ఉంటుంది కదా! అయితే గూఢచర్య గ్రిప్ నకిలీ కణిక వ్యవస్థ కి ఉందనుకున్నన్ని రోజులూ సదరు కడుపుమంటని కడుపులోనే దాచుకున్నప్పటికీ...

బలవంతమైన సర్పం బలహీన పడిందనుకున్నప్పుడూ, చలి చీమలకి చిక్కి చావగలదని పించినప్పుడూ, తలో రాయి తనలాంటి వాళ్ళంతా వేస్తున్నప్పుడు తానూ ఒక రాయి విసరగలనన్న ఆత్మ విశ్వాసం కలిగినప్పుడూ.... సదరు ఏజంట్ల బాసు గుట్లు బయటపెట్టడం చేస్తారు. క్రమంగా అదే బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చచ్చినట్లుగా పరిణమిస్తుంది. అలాంటి చలిచీమలని ప్రోది చెయ్యటమే నెం.5 వర్గం ఇప్పుడు చేస్తోంది.

ఇంతక్రితం నకిలీ కణిక వ్యవస్థ, ఎవరినీ ఎక్కువ కాలం తన ఏజంట్లని స్థిరంగా ఉండనిచ్చేది కాదు. కొంతకాలం పనిచేయించుకొని తరువాత క్రమంగా వాళ్ళని తెరమరుగు చేసేది. తమకి కావాలనుకున్నవాళ్ళ పనులు మాత్రం నడిచేటట్లు చూసేది. అదే ఇప్పుడైతే.... ఏజంట్లకి నిరంతరం ఫండ్స్ ప్లో చేయాల్సి వస్తోంది. లేదో.... ఎవరు డబ్బులిస్తే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అదే నకిలీ కణిక వ్యవస్థకి ప్రాణాంతకం అయ్యింది.

ఇక్కడ నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు.... కుడితే [మనిషి]చావాలన్న దుస్సంకల్పానికి ఫలితంగా కుట్టగానే తామే ఛస్తున్న చీమలతోనూ.... అదే సమయంలో తమ అనుచరుల చేత, సామాన్యుల చేతా చిక్కి, క్షణక్షణం ఛస్తున్న బలవంతమైన సర్పం తోనూ.... పోలిక కలిగి ఉన్నారు.

నిజానికి ‘యుద్దం అంటే శతృవుని చంపడం కాదు, ఓడించటం’ అన్నమాట గొప్పది. ఎందుకంటే - ఇన్ని పాపాలు చేసిన వాడు ఒక్క క్షణంలో చచ్చి ఊరుకుంటే అది ఖచ్చితమైన శిక్ష కానే కాదు. క్షణ క్షణం ఛస్తూ బ్రతికితేనే.... మరింకెవ్వరికీ ’తగుదునమ్మా’ అని గూఢచర్యంలో దూరి దుష్టపు పనులు చేసే ధైర్యం ఉండదు. అంతేగాక, అలా క్షణం క్షణం ఛస్తూ బ్రతికటమే, ప్రపంచాన్ని తమ కనుసన్నల్లో తిప్పుతున్నామన్న అహంకారికి తగిన శిక్ష! అదీ భగవంతుడిచ్చిన సంకల్ప సిద్దే!

ప్రపంచానికి తామేమిటో తెలియాలి. ప్రపంచాధినేతగా దృగ్గోచరం కావాలి అన్న సంకల్పానికి తగిన సిద్ది! ప్రపంచానికి తామేమిటో తెలుస్తున్నారు, ప్రపంచాన్నే పాదాక్రాంతం చేసుకోవాలన్న వాళ్ళ దురాశా దృగ్గోచరం అవుతోంది. భవిష్యత్తులో మరింతగా, అట్టడుగు పామరుడికి కూడా అర్ధమయ్యేటంతగా ఇది పరిణిమిస్తుంది.

నిజానికి రెండేళ్ళ క్రితం వరకూ కూడా, నకిలీ కణిక వ్యవస్థ లోని కీలక వ్యక్తులు, తరతరాలుగా తము నిర్వహించుకు వస్తున్న అనువంశిక గూఢచర్యం గురించి ఎవ్వరికీ తెలియదనీ, ఎవరూ తెలుసుకోలేరనీ అనుకున్నారు. కాబట్టే.... ఒకవేళ రామోజీరావుని ప్రధాన కుట్రదారుగా ప్రకటించి, శిక్షించినా, అతడి నాశనంతో ఇది ఆగదనే ధీమా ప్రదర్శించారు.

‘ఒక్క విలన్ చచ్చిపోయినా, అతడి ఆత్మసైతం.... బ్రతికి ఉన్న మంచివాళ్ళ కంటే, చచ్చిపోయిన మంచివాళ్ళ అత్మల కంటే బలంగా ఉంటుంది’ - దీన్నే ఎన్నోసార్లు నకిలీ కణిక వ్యవస్థ, నెం.5 వర్గానికి చెప్పింది. అక్స్, 1920 దగ్గర నుండీ అరుంధతి దాకా ఎన్నో సినిమాలలో కూడా ఇదే చెప్పబడింది. ఎందుకంటే నకిలీ కణిక వ్యవస్థ తెలియనప్పుడు "రామోజీరావునో, అలాంటి ప్రధాన కుట్రదారులనో బహిర్గత పరిచి, శిక్షించి నాశనం చేసినా, వాళ్ళ తర్వాతి తరాలు దీనిని కొనసాగిస్తాయి గనుక, కొన్నేళ్ళు నిశ్శబ్ధంగా నడిచినా, మళ్ళీ బలం పుంజుకుని ప్రతీకారం సాధించగలం" అన్న ధీమా అది. అప్పుడు బ్రిటీషు సామ్రాజ్య వాదం, తరువాత సిఐఏ, ఇప్పుడు ఇస్లాం ఉగ్రవాదం మాదిరిగా!

"దుస్సంకల్పంతో మీరు తరతరాలుగా పనిచెయ్యగా లేనిది, ప్రపంచానికి, మానవత్వానికి మేలు కోసం సత్సంకల్పంతో మేము, తరతరాలుగా పనిచెయ్యలేమని ఎలా అనుకుంటున్నారు? మీది రక్త సంబంధమైతే మాది భావ సంబంధంతో కూడిన తరతరాల అనువంశీయమే" అన్న సమాధానాన్ని నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ కీ అందులోని కీలక వ్యక్తులకీ ఇచ్చింది.

ఈ సందర్భంలో మీకు ఓ చిన్న కథ గుర్తు చేస్తాను. మనం చిన్నప్పుడు విన్న కథ, కొసమెరుపు మార్పుతో....

అనగా... అనగా...

ఓ టోపిల వ్యాపారి. ఎండలో వెళ్తూ చెట్టుక్రింద నిద్రపోయాడు. నిద్రలేచి చూస్తే మూటలోని టోపీలన్నీ మాయం. తన నెత్తి మీది టోపీ మాత్రమే మిగిలింది. తలెత్తి చూస్తే చెట్టు మీద కోతులు. వాటి తలలపై టోపీలు. టోపీల వ్యాపారికి తన తాత చెప్పిన విషయం గుర్తొచ్చింది. తాతకి లాగే తనూ, తన నెత్తి మీద టోపి తీసి క్రిందకు విసరి కొట్టాడు. తాత అనుభవం మాదిరిగానే కోతులన్నీ తలల మీది టోపిలని నేలకి విసిరి కొడతాయని, ఏరుకొని మూటగట్టుకు పోవచ్చనీ అనుకున్నాడు. అలా ఆశపడుతూ నిలబడ్డాడు.

ఆశ్చర్యం! ఓ పిల్లకోతి ఛటాలున చెట్టు దిగి వచ్చి, టోపీల వాడు విసరి కొట్టిన టోపిని కూడా తీసుకొని, చెట్టెక్కి చప్పట్లు కొట్టింది. టోపీల వాడు వెర్రి ముఖం పెట్టాడు. అంతలో పిల్లకోతి ఓ చీటీ క్రిందికి విసిరింది. తీసి చూస్తే అందులో "తాత నీకే కాదు. మాకూ ఉన్నాడు" అని వ్రాసి ఉంది.

ఇదీ కథ!

ఈ కథ ఈనాడులోనే బాల వినోదంలో చాలా రోజుల క్రితం ప్రచురితమయ్యింది. అయితే దాని అంతరార్ధం పాపం నకిలీ కణిక అనువంశీయులకీ అప్పుడంతగా అర్ధమయి ఉండదు. ఇప్పుడు బాగానే అర్ధమవుతూ ఉంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

నా అవగాహన మేరకు ఈ దేశంలో అమలుపరచబడిన అభివృద్ధి పథకాలూ, స్కీములూ అన్నింటికంటె గొప్పది భూ సంస్కరణోధ్యమం. ఈ క్రెడిట్ అంతా మన తాతకే చెందుతుంది . కానీ ఇలాంటి గొప్ప చట్టం దారుణంగా విఫలమవ్వడం చాలా దారుణం . ఈ చట్టం విజయవంతమయ్యి ఉంటె సమాజంలోని అసమానతలు చాలా వరకు తగ్గేవి . అప్పుడు ఈ స్యూడో(sudo) కమూనిస్టుల గొడవ దేశానికి తప్పేది. దీని మూలంగానే PV తన ముఖ్యమంత్రిత్వాన్ని వదులుకోవలసి వచ్చింది .నా చిన్నప్పుడు ఈ చట్టం గురించి వినేవాడిని . ఆ రొజుల్లో తమ భూమిని కాపాడు కోవాడానికి ప్రముఖులు, భుస్వాములు పడే పాట్లు , ఫీట్లు అన్ని ఇన్నీ కావు ... భార్యలకు దొంగ విడాకులివ్వడం, లేని సంతానాన్ని సృష్టించడం, ఆ తరువాత వాల్లను చంపేయడం , తమకు నమ్మకస్తులైన పాలేర్లను బినామీలుగా చేయడం అబ్బొ ఒక్కటెమిటి చాలా వేషాలు వేసారు . దీనికి ప్రతీకారమా అన్నట్టు PV ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన స్వగ్రామం వంగరలోని ఆయనకు వందలాది ఎకరాలు ఉన్నాయని వాటిని నక్సలైట్లు ఆక్రమించుకుని పేదలకు పంచిపెట్టారని, ఆయనకి ఎంతో ఇష్టమైన మామిడితోటలను ఆయనకు విడిచిపేట్టారని. భూ సంస్కరణలను ప్రవేశపెట్టిన వ్యక్తే తన దగ్గర వందల ఎకరాలు అక్రమ భుమీ ఉంచుకున్నాడని ' ఈనాడు పేపరు ' కారుకూతలు రాసేది.ఏదిఏమైనా మళ్ళీ భూ సంస్కరణోద్యమ చట్టం అమలు చేస్తే (చిత్త శుద్ధితో) బాగుండును .

ఇది చదివాక కామెంట్ వ్రాయకుండా ఉండలేక పోతున్నాను.... చాలా చక్కగా స్వభావాలను బట్టి వారి వారి భవిష్యత్తు ఇలాగే ఉంటుంది అని చూపించారు... పొతే అందరికీ అమ్మ ఉంది.... కాకపోతే అమ్మ నాకొక్కడికే అమ్మ కాదు... అందరికీ అమ్మే...

అజ్ఞాత గారు: మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తానండి. మనకి ఇప్పుడు కావలసింది చిత్తశుద్ది గల వ్యక్తులే!

వెంకట రమణ గారు: మీ అభిమానానికి నెనర్లు :)

శ్రీరాముడిని గుఱించి మీరు వ్రాసినది చదివాక ఈ లింకు మీకు పంపించాలనిపించింది. ఓసారి చూసి వీలైతే మీ అభిప్రాయం తెలియజేటగలరు . లోపలి మనిషి పుస్తకాన్ని నేను ఇంతవఱకూ చదవలేదు. తొందరలో సంపాదించి చదువుతాను.

నరసింహా[వేదుల బాలకృష్ణమూర్తి] గారు: లింక్ పంపటం మర్చిపోయారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu