అనుభవమైతేనే గదా అర్ధమయ్యేది మరి!?

ఇందుకు మరో ఉదాహరణ చెబుతాను.


1992 కు ముందర నేను సినిమాలు చూసిన ప్రభావంతో కానివ్వండి, నవలల ప్రభావంతో కానివ్వండి, చుట్టు ప్రక్కల తెలిసిన వాళ్ళ ప్రభావం కానివ్వండి, డబ్బున్న వాళ్ళల్లోనే అవినీతి అన్యాయాలు ఎక్కువగా ఉంటాయనీ, పేదవాళ్ళల్లో నిజాయితీ ఎక్కువగా ఉంటాయనీ అనుకునేదాన్ని. 1993 లో ఫ్యాక్టరీ కోల్పోయి శ్రీశైలంలో గుడిసెలో నివసించిన రోజుల్లో యదార్ధం ఎదుట నిలబడినప్పుడు అర్ధం చేసుకోలేక అయోమయానికి గురయ్యాను. ఈ విషయంలో మా వారు నాకంటే చాలా నయం అన్నమాట. క్రమంగా, మనుషుల్ని అర్ధం చేసుకోవటానికి ధనిక పేద అన్నవి ప్రామాణికాలు కావనీ, భగవద్గీతలో చెప్పినట్లుగా త్రిగుణాత్మక దృష్టితో చూడొచ్చనీ అనుభవంతో నేర్చుకున్నాను. ఆ క్రమంలోనే... నా అజ్ఞానం, అహంకారం గట్టివనీ, అనుభవమైతే తప్ప సత్యం నా కపాలానికి ఇంకదనీ అర్ధమయ్యింది. చుట్టూ పరిశీలిస్తే, అంతటా అందరిదీ అదే స్థితి!?

4]. ఇక ప్రజాదృక్పధాన్ని మార్చే క్రమంలో నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ, అందులోని కీలక వ్యక్తులనీ వారి స్వభావ, కార్యకలాపాల సహితంగా బహిర్గతం చెయ్యటం, వారి వారి సువర్ణముఖిలని అనుభవింప చేయటం అనే ప్రక్రియలు ఎంచుకోవటానికి మరో కారణం చెప్పాలంటే...

ఒక ఉదాహరణ చెబుతాను. మనం ఉండే చోటుని కొందరు దుష్టులు వచ్చి , నానా ఛీదరా చేసి మురికి చేసారను కొండి. మురికి చేసిన వాళ్ళు దర్జాగా వెళ్ళిపోతే, మంచి వాళ్ళు దానిని శుభ్రం చేయాల్సి వస్తే శిక్ష ఎవరికి పడినట్లు? మంచి వాళ్ళకి కాదా?

అందుకే మన ఇతిహాసాలు "నానా చెత్తపనులూ చెయ్యకండర్రా! ఎందుకంటే చేసిన కర్మ అనుభవించాల్సి వస్తుంది" అనే నమ్మకాలతో కట్టడి చేసేవి. పూర్వం "ఏ జన్మలో ఏ పాపం చేసానో! ఇప్పుడనుభవిస్తున్నాను" అనీ, లేక "ఎప్పుడేం పాపం చేసుకున్నానో, ఇప్పుడీ రాత రాసాడు దేవుడు" అని దుఃఖ పడేవాళ్ళు. అదే ఇప్పుడైతే "మాయదారి దేవుడు. పాపిష్టి దేవుడు. నాకే ఈ కష్టాలెందుకు పెట్టాడు?" అని దైవ నింద చేస్తున్నారు. సరే ఈ విషయాంతరం వదిలి మళ్ళీ అసలు విషయానికి వస్తాను.

ఆ విధంగా చెడ్డవాళ్ళు అశుభ్రం చేసి పోతే... మంచివాళ్ళు దాన్ని బాగుచేసుకుంటూ ఉంటే... చెడ్డ వారికి నొప్పి మాత్రం ఏం ఉంటుంది? తానే బాగు చెయ్యాల్సి వస్తే... మరో సారి మురికి చేయాలన్పించినప్పుడు వొళ్ళు దగ్గరుంటుంది. కనుకనే... నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తుల్ని, ముఖ్యమైన వారినీ, హత మార్చటం గానీ, కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్ళటం గానీ చేయటం లేదు. [జరిగినా చాలా అరుదు] అలాంటి శిక్షలు, వాళ్ళు చేసిన కౄర నేర ఘోర కృత్యాలకి చాలా చిన్నవి కూడాను. అందుచేత ఆత్మహత్యాసదృశ్య assignments తో, ’బహిర్గతం చేయటం, సువర్ణముఖి అనుభవింప చేయటం’ వంటి స్ట్రాటజీలతో వారి చేతే తిరిగి శుభ్రం చేయిస్తోంది.

కాబట్టే, తము నాశనం చేసిన ప్రజాదృక్పధాన్ని ఇప్పుడు తామే పునర్నిర్మించాలి. తము ప్రజలకి నూరిపోసిన తామసాన్ని తామే పారద్రోలి, సత్త్వరజోగుణాల్ని ప్రబల పరచాలి. అప్పటి వరకూ వారికి నిష్కృతి లేదు. [చావాలన్నా చావుసైతం రాదు.] అందులోనూ మళ్ళీ వారిది ప్రతికూల పాత్రే! అంటే విలన్ పాత్రే!

ఉదాహరణకి - తెలంగాణా వేర్పాటు ఉద్యమం, సమైకాంధ్ర ఉద్యమాలనే తీసుకొండి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, తెరాస అధినేత కేసీఆర్, కేంద్ర గృహ మంత్రులూ, న్యాయమంత్రులూ నిప్పుముట్టించిన వాళ్ళే. అయితే అటు తెలంగాణా వేర్పాటువాదులు గానీ, ఇటు సీమాంధ్ర ప్రాంతాల్లోని సమైక్యవాదులు గాని, తమ వ్యక్తిగత ప్రయోజనాలని దాటి, తాము పుట్టిన గడ్డ గురించి ఆలోచించటం, ఉద్యమించటం! ’ఏదెలా పోతే నాకేం?’ అనుకునే స్వార్ధపు ఇరుకు నుండి... విడిపోదామనో కలిసుందామనో, పుట్టిన ప్రాంతం గురించి స్పందించటం... సుషుప్తి నుండి జాగృతిలోకి ప్రయాణించటమే!

దీన్నే భౌతిక దృష్టితో చూస్తే... 1992 తర్వాత మనదేశంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు పరిశీలించండి. దేశ వ్యాప్తంగా 18,000 కి.మీ. మేర 25,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించి నాలుగులైన్ల జాతీయ రహదారి[Golden Qudraleteral] నిర్మించారు. దాన్ని వాజ్ పేయ్ మానసపుత్రికగా చెబుతారు. కానీ ఆ కీర్తి ఎన్డీయేని తిరిగి అధికారంలోకి తేలేదు. భాజపా మాత్రం, ఎంతో క్రమశిక్షణ గల పార్టీ అని ఉన్నపేరు కాస్తా, అధికారం వస్తే ఎవరయినా అవినీతిపరులే అని expose అయ్యింది.

చంద్రబాబు నాయుడు కూడా జన్మభూమి పేరుతో చెరువులకీ, రిజర్వాయర్లకీ గట్లు కట్టించటం, దిగువ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సిమెంటు రోడ్లు వేయించటం చేసాడు. ఇంకుడు గుంతల పేరుతో ఎంత మింగేడో స్విస్ బ్యాంకులకి తెలియాలి గానీ, అతడు చేసిన జన్మభూమి పనులు కొన్ని ఇప్పటికీ కనబడుతూనే ఉన్నాయి. అయితే, ఇదీ చంద్రబాబు తెదేపాని తిరిగి అధికారంలోకి తేలేదు.

వై.యస్. కూడా జలయజ్ఞం పేరుతో చిన్నా పెద్దా ప్రాజెక్టులు నిర్మించాడు. నిర్మిస్తున్నానంటూ వేలకోట్లు నొక్కేసాడు. బంధుమిత్రులకీ బాగా దోచిపెట్టాడు. అయితే అతడు చేయించిన నీటి ప్రాజెక్టులు కొన్ని, కొంత వరకైనా ఉపయోగ పడే దశలో ఉన్నాయి. కానీ, ఇదీ వై.యస్. కుటుంబానికి అధికారంలో కొనసాగింపుని ఇవ్వలేదు.

అలాగే... 1992 తర్వాత సెల్ ఫోన్లు, ఇతర సమాచార సౌకర్యాలు భారత్ లో మహా ఊపందుకున్నాయి. అయితే ఇవి తమ చలువేనని చెప్పుకోగల, ఆ కృషి ఫలితాల్ని పొందగల స్థితి మాత్రం ఎవరికీ లేదు. సరళీకృత ఆర్ధిక విధానాల ఫలితంగా, భారత్ మంచి మార్కెట్టుగా కన్పించి సెల్ ఫోన్లు కంపెనీలు పోటాపోటీగా రంగంలోకి దిగటంతో ఇది సంభవించింది అని చెప్పుకోక తప్పలేదు. అంతేకాదు, సెజ్ ల పేరిట పంటభూములు లాక్కుంటూ, పార్టీ ఆఫీసుల కోసం పేదల కొంపలు కూలుస్తూ, ధరల పేరుతో జేబులు కొల్లగొడుతూ మాత్రం, తమ తమ నిజస్వరూపాలు బయటపెట్టుకుంటున్నారు.

ఇక్కడే నెం.5 వర్గపు ’పనితీరు, యుద్దరీతి’ లోని సునిశిత మేధస్సు కనబడుతుంది. అన్నిపార్టీలలో, పార్టీల కతీతంగా రాజకీయ నాయకులలో, అత్యధికులు, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ అనుకూలురూ, అనుచరులే! కాబట్టే, నెం.5 వర్గం... ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వాళ్ళ అసలు రూపాలనీ,కార్యకలాపాలనీ బహిర్గతం చేయటం, వారి వారి సువర్ణముఖిలను అనుభవింప చేయటంతో పాటుగా... దేశాభివృద్ధినీ, ప్రజాదృక్పధంలో మార్పు తేవటాన్నీ సమాంతరంగా నిర్వహించుకు వస్తున్నారు.

నెం.5 వర్గం ప్రయోగించిన గూఢచర్య యుద్దంరీత్యానే... అనివార్యమయ్యీ, పైకారణాలుగా అవసరమయ్యీ, కొన్నిసార్లు ఆత్మహత్యా సదృశ్య అసెన్ మెంట్ల లో భాగమై, దేశాభివృద్ది చేయక తప్పటం లేదు. డ్వాక్రా సంఘాల మాదిరిగానన్నమాట. [నెం.5 వర్గం తాలూకూ ఈ రకమైన పనితీరు మాకెలా అర్ధమయ్యిందో, ఆ నేపధ్యంలో మా అనుభవాలేమిటో తర్వాత వ్రాస్తాను.]

ఆ విధంగా... తమ స్వహస్తాలతోనే, స్వీయ చర్యలతోనో ఇటు దేశాభివృద్ధి, అటు ప్రజా దోపిడీ రెండూ చేస్తున్నారు. ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల లాగా! మరో మాటలో చెప్పాలంటే - తమ స్వీయ చర్యలతోనే, ఓ వైపు తమని తామె బహిర్గతం చేసుకుంటున్నారు, సువర్ణముఖి అనుభవిస్తున్నారు. మరో వైపు, దేశ మౌలిక వసతులూ, ప్రజల మౌలిక భావనల స్థాయీ పెరిగేందుకు దోహద పడుతున్నారు.

ఇదెలా సంభవమో అర్ధం కావాలంటే - ఓ చిన్న కథ చదవండి. ఈ కథ చిన్నప్పుడు చందమామలో చదివాను.

అనగా అనగా...

ఓ పల్లెలో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. ప్రతిరోజు పల్లెలో రైతుల దగ్గర పాలు సేకరించి పట్నంలో అమ్మేవాడు. అయితే, పాలలో సగానికి సగం నీళ్ళు కలిపేవాడు. వినియోగదారులు "ఏమిటయ్యా ఈ దారుణం?" అంటే ’ఈరోజు గేదెలు నీళ్ళెక్కువ తాగేసాయనీ, అదనీ ఇదనీ’ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు. ఇలా కల్తీ వ్యాపారం చేస్తూ గడుపుతున్న ఈ పాల వ్యాపారి, నెలకోసారి వినియోగదారుల నుండి సొమ్ము వసూలు చేసుకునే వాడు. ఓ సారి అలాగే పాలు పోసినందుకు పైకం వసూలు చేసుకుని, పట్నం నుండి పల్లెకు బయలు దేరాడు. దారిలో చిన్న చిట్టడవి ఉంది. పక్కనే చిన్న ఏరు ప్రవహిస్తుంది.

పాల వ్యాపారి అడవిలో నుండి ప్రయాణిస్తూ, కాస్సేపు అలసట తీర్చుకుందామని, ఏటి ఒడ్డున చెట్టు క్రింద చతికలపడ్డాడు. చల్లటి గాలికి నిద్రొచ్చింది. నాణాల సంచి తలక్రింద పెట్టుకుని కునుకు తీసాడు. నిద్రలేచి చూస్తే డబ్బు సంచిలేదు! గుండె గుభిల్లు మంది. అంతలో చెట్టు మీద కిచకిచ విని తలెత్తి చూసాడు. ఏటీ మీదికి వాలుగా పెరిగిన చెట్టుకొమ్మ మీద కూర్చున్న కోతి చేతిలో తన డబ్బు సంచి! వ్యాపారి ఘొల్లుమన్నాడు. కోతి పైకి రాళ్ళు విసిరాడు.

కోతి నింపాదిగా సంచి మూతి విప్పి ఓ నాణెం నీళ్ళలోకి, మరో నాణెం నేలపైకి విసరసాగింది. అలా నాణాలన్నీ , సగం నీళ్ళలోకి సగం నేలపైకి విసిరాక, ఖాళీ సంచిని పాలవ్యాపారి ముఖం మీదికి గిరాటేసి చక్కాపోయింది. పాల వ్యాపారి బావురుమన్నాడు. ఆ నెల సొమ్ముతొ భార్యకు బంగారు నగ చేయించాలనుకున్నాడు. అది గుర్తొచ్చేసరికి మరింత ఏడుపొచ్చింది. అతడి ఏడుపు విని దారిన పోయే వాళ్ళు ఆగి విషయమేమిటని అడిగాడు. పాల వ్యాపారి చెప్పిందంతా విన్న గుంపులోని ఒకడు,

"ఎందుకయ్యా ఏడుస్తావు! నువ్వెటూ పాలల్లో సగానికి సగం నీళ్ళు కలిపే కదా అమ్మావు? అందుకే ఆ హనుమంతుడు, నీళ్ళ డబ్బులు నీళ్ళకీ, పాలడబ్బులు నీకూ ఇచ్చాడు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో ఫో!" అన్నాడు.

అందరూ గొల్లున నవ్వటంతో పాల వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు. దెబ్బతో కల్తీ వ్యాపారం మానేసి నిజాయితీగా బ్రతకసాగాడు.

ఇదీ కథ!

ఇది కథ కాబట్టి, అందునా పిల్లల కోసం చందమామ వేసిన కథ కాబట్టి, పాల వ్యాపారికి బుద్ది వచ్చింది.

నేటి రాజకీయ వ్యాపారులకి అంత తేలిగ్గా బుద్ది రాదు కదా?

ఇక ఈ కథ అనువర్తన ఏమిటంటే - నేటి ఈ రాజకీయ నాయకులంతా గతంలోనూ[1992కు ముందరా], ఇప్పుడూ, చేసిన చేస్తున్న దేశ ద్రోహానికి, ప్రజాద్రోహానికి, పొందాల్సినదే పొందుతున్నారు. అదే వారి నిజరూప బహిర్గతాలు గానూ, సువర్ణముఖిలు అనుభవించటం గానూ ఉంది. అదే సమయంలో, తాము చేసిన మురికిని తామే శుభ్రం చేస్తున్నట్లుగా... దేశాభివృద్దిని, మౌలిక సదుపాయాల ఏర్పాటునీ, తాము నెగిటివ్ రోల్ తీసుకుని మరీ ప్రజాదృక్పధంలో మార్పు తేవటం అనే పనినీ నిర్వహిస్తున్నారు.

దేవుడు పాల వ్యాపారికి, పాలడబ్బులు పాలకీ, నీళ్ళ డబ్బులు నీళ్ళకీ ఇచ్చినట్లుగా... నెం.5 వర్గం, ఈ ప్రక్రియని... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులూ, వారి అనుచరులూ... అందరి చేతా చేయిస్తోంది. ఇదంతా అర్ధమైనా, కాకపోయినా కూడా, ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోక మాత్రం, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ తప్పటం లేదు.

ఈ నొప్పి భరించ లేక... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని వారెవరైనా, ఇందులోంచి తప్పుకుందా మన్నా కుదరదు. ఎందుకంటే - చేసిన వన్నీ చేసి, శిక్ష అనుభవించాల్సి వచ్చేసరికి ’రిటైర్ మెంట్’ అంటే, ఆ రెడ్ టేపిజాన్ని ఒప్పుకోవటానికి ఇదేమీ... పనికిమాలిన చెత్తంతా పోగేసుకొచ్చిన అడ్మినిస్ట్రేషనూ కాదు, అనేక లోపాలతో సంకలించుకున్న రాజ్యాంగ బద్దమూ కాదు. ఇది గూఢచర్య తంత్రం, ధర్మ అధర్మాలకు మధ్య యుద్ధం!

ఏ స్థాయిలోని వారైనా తమ అరిషడ్వర్గాలనీ, భావోద్రేకాలని, అహంకారాలని సమాజం మీద వేయటానికి సమాజమేమీ వారి చెత్తకుండీ కాదు. ఇంట్లో భార్య మీద కోపం వస్తే, కార్యాలయంలోని తమ క్రింది ఉద్యోగుల మీద కేకలు వేయటం అంటే, సమాజం, తమ క్రింది వారు, తమ చెత్తకుండీ అనుకోవటమే!

చిన్నప్పుడు తమపై లైంగిక అత్యాచారం చేయటమో లేక అన్యాయంగా లైంగిక కేసులు బనాయించటమో చేసారని, పెద్దయ్యాక హీరో/హీరోయిన్ వరుస హత్యలు చేయటం వంటి సైకోపాత్ కథలనీ, సినిమాలని ప్రోత్సహించి మరీ, నెం.10 వర్గం దీనికి మరింత ’బూస్ట్ అప్’ ఇచ్చింది. ఈ మానసిక దౌర్భల్యాన్ని, సమాజాన్ని చెత్తకుండీ మాదిరిగా ఉపయోగించడాన్ని , నెం.5 వర్గం అనుమతించదు.

కాబట్టే ఈ ’బహిర్గతం - సువర్ణముఖి’ ల వెత భరించలేక, ఏ రాజకీయ వ్యాపారి అయినా ’చచ్చిపోతే దెబ్బకు పీడా వదులు తుంది’ అనుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే - తాను అనుభవించాల్సింది అనుభవించకుండా అర్ధాంతరంగా చచ్చిపోతే, తరువాయి భాగాల్ని తమ తర్వాతి తరాలు [కొడుకులూ, కూతుళ్ళు, మనుమలూ] అనుభవించాల్సివస్తుంది. ఇందుకే మన పెద్దలు "చేసుకున్న మంచిచెడులు తరతరాలకి చెందుతాయి. మనం మంచి చేస్తే, మనం ఉన్నా లేకపోయినా ఆ పుణ్యం మన పిల్లలని కాపాడుతుంది. వాళ్ళకి మంచి జరుగుతుంది. మనం చెడు చేస్తే ఆ పాపం మన పిల్లలకి కీడు చేస్తుంది" అనే వాళ్ళు. అలాంటి నమ్మకాలతో మనుషుల స్వార్ధాన్ని, అరిషడ్వర్గాలనీ నియంత్రించేవాళ్ళు. దీన్ని చక్కగా, పక్కాగా, అమలులో పెడుతుంది నెం.5 వర్గం. అందుకే తమ మనో దౌర్బాల్యాలని, అరిషడ్వర్గాలనీ సమాజంలో వెదజల్లడానికి, సమాజాన్ని చెత్తకుండీలా వాడటాన్ని నెం.5 వర్గం అనుమతించదని అన్నాను.

ఈ నమ్మకాన్ని బద్దలు కొట్టడానికే, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, కుహనా భావవాదాన్ని, మానవహక్కుల తొక్క లెక్కలని, కుహనా క్షమాగుణాన్ని, కుహనా మానవతా వాదాన్ని ప్రచారించింది. అది ఎలాగంటే - తల్లి/తండ్రి తప్పు చేస్తే వాళ్ల పిల్లలేం పాపం చేసారు? కాబట్టి నేర గాళ్ళ పిల్లలకి మానవహక్కులన్నీ వర్తించాలి అనటం. నిజమే! ఇది మానవతా వాదమే. అయితే ’తము నేరం చేసి, ఖర్మకాలి పట్టుబడి జైలుకెళ్ళినా, తమ పిల్లలకేం ఫర్వాలేదు’ అనుకుంటే, నేరగాడికి అది వెసులు బాటుగానే కన్పిస్తుంది కదా?

అదే... ’తాను నేరం చేసి జైలుకి పోతే తన పిల్లల గతేం కాను?’ అనుకుంటే కట్టడి ఉంటుంది. నిజానికి నేరగాడు చేసే పనుల మూలంగా ఎంతమంది అమాయకుల పిల్లలు నానావెతల పాలవుతున్నారు? అదేమీ పట్టవేం మానవతావాదానికి? నేరం చేసిన వాడి పిల్లల పట్లే అంత ప్రేమ, భద్రత చూపాల్సి ఉంటే, మరి ఇలాంటి నేరగాళ్ళ మూలంగా వెతలపాలు అయిన అమాయకుల పట్ల, వాళ్ళ పిల్లల పట్ల ఇంకెంత ప్రేమ, భద్రత ఉండాలి? అక్కడి కొచ్చేసరికి మానవహక్కుల సంఘాలు నోరు మెదపవు. ఒక్కమాటలో చెప్పాలంటే - అంతర్జాతీయంగా ఈ మానవహక్కుల సంఘలన్నీ నేరగాళ్ళ హక్కుల పరిరక్షణ కోసమే మాట్లాడతాయి, పోట్లాడతాయి. అచ్చంగా మావోయిస్టులు పోలీసుల్ని, అమాయక ప్రజలని చంపినప్పుడు కిమ్మనకుండా, పోలీసులు మావోయిస్టుల్ని చంపినప్పుడు ఖయ్యి మన్నట్లుగానన్నమాట. ఎందుకంటే - ఈ మానవహక్కుల సంఘాలతో పాటు, మరికొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, మానవతా వాదం ముసుగు మాటున చేస్తోంది నకిలీ కణిక వ్యవస్థ కీ, నెం.10 వర్గానికీ గూఢచర్య సర్వీసే!

నెం.5 వర్గం, ఈ మిధ్యా మానవతా వాదాన్ని ఏమాత్రమూ సహించదు. కాబట్టి ఈ ’బహిర్గతం కావటం, సువర్ణముఖి అనుభవించటం’ అన్న వెతలు భరించలేక ఎవరైనా చావుని కోరుకున్నా... ’నీ తర్వాత నీ కొడుకులూ, కూతుళ్ళు, మనమలూ ఇదంతా అనుభవించాల్సి వస్తుంది’ అన్న మెడమీది కత్తి... నకిలీ కణిక వ్యవస్థలో, నెం.10 వర్గంలో గల కీలక వ్యక్తులతో సహా ప్రతీ ఒక్క ఏజంటుకీ ఉంది. దాంతో నడ్డి వంచి, తాము చేసిన సామాజిక మురికిని తామే శుభ్రం చేయక తప్పని స్థితి వారి ఎదురుగా ఉంది.

ఇది వాళ్లకి దృష్టాంతసహితంగా ఇంకించబడింది. ఉదాహరణకి... నటుడూ, రాజకీయ నాయకుడూ అయిన ఎన్టీఆర్ చాలినంత సర్వీసు నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ చేసిపెట్టాడు. నెం.5 వర్గం రంగంలోకి దిగాక, అనుభవించినంత మేరా సువర్ణముఖిని అనుభవించాడు. [దీన్ని గురించి గతటపాలలో వివరించాను.]

తండ్రి ఆస్తుల వారసత్వాన్ని పొందినట్లుగానే, అతడి సంతానం, తండ్రి పాపపుణ్యాల వారసత్త్వాన్నీ పొందింది, పొందుతోంది. తనకుమారుడు బాలకృష్ణ కెరీర్ కోసం నటుడు సుమన్ ని బ్లూఫిల్మ్ కేసులు బనాయించి జైలు పాలు చేసారని అప్పట్లో [నేటి భారతం సినిమా తర్వాత] వార్త బయటికొచ్చింది.[చిత్రంగా తర్వాత బాలకృష్ణ కంటే చిరంజీవి బాగా హిట్టయ్యాడు లెండి.] ఏ కుమారుడి కెరీర్ కోసమైతే, అంతటి కుతంత్రాలు ప్రయోగింపబడ్డాయో, స్వయంగా ఆ కుమారుడు బాలకృష్ణే, బెల్లం కొండ సురేష్ తదితరుల మీద తుపాకి కాల్పులు జరిపి పట్టుబడ్డాడు. తదుపరి అతడి ఇంట్లో పని మనుషుల అనుమానాస్పదమృతులూ సంభవించాయి. ఆ కేసులన్నీ మాఫీ చేసుకునేందుకు బాలకృష్ణ ధనం పంపుధారలా కారింది. అవసరమైనప్పుడల్లా డబ్బులు రాల్చడానికి ఎటీఎం లాగా పనికొస్తున్నాడు/పనికొస్తాడు. చేసుకున్న కర్మ తరతరాలని కట్టి కుడుపుతుందని తెలియచెప్పటం లేదూ ఇది? ఇలాంటి పుత్ర, పుత్రికా రత్నాల ఉపఖ్యానాలు రాజకీయ జీవులకి ఇప్పుడు కొత్తకాదు. ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ దగ్గర్నుండీ, కేకే కుమారుడు వెంకట్రావు వరకూ!

కాబట్టి ఈ రాజకీయ వ్యాపారులకి ’ఆట/యుద్దం’ మధ్యలో డ్రాప్ చేసుకునే అవకాశం లేదు అన్న విషయం ఇంకించబడిండి/బడుతోంది.

5]. ఇక...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

నెం :5 ,నెం:10, సువర్ణముఖి, అనువర్తనం అనే పదాల అర్థమేమిటి?

అజ్ఞాత గారు: నెం.5 వర్గం, నెం.10వర్గం సువర్ణముఖిల గురించి వివరాలు నా పాత టపాలలో ఉన్నాయండి. మీరు కొత్తగా నా బ్లాగులోకి వచ్చినట్లున్నారు. ’అన్ని టపాలు ఒకే సారి చూడలంటే’లో గాని, ’అన్ని లేబుల్స్ ఒకేటపాలో’ గానీ చూడగలరు. ఎందుకంటే ఒక్కమాటలో చెప్పటం సాధ్యం కాదు. ఇక అనువర్తనం అంటే Application అని అర్ధం.

"డబ్బున్న వాళ్ళల్లోనే అవినీతి అన్యాయాలు ఎక్కువగా ఉంటాయనీ, పేదవాళ్ళల్లో నిజాయితీ ఎక్కువగా ఉంటాయనీ "

నేనది నిజంగా నమ్మానో లేదో తెలీదు కానీ, అదేదో యూనివర్సల్ ట్రూత్ లాగా ఎప్పుడూ క్వొశ్చన్ చేయలేదు, అంటే మైండ్ అంతగా రుద్దబడింది. అది పెద్ద క్రాప్ అని కొంచెం లేట్ గా, దేశం వదిలేసాక ఇంక బాగా తెలవడమే కాక, నా అనుభవాలు ఇంకొంచెం ధృఢ పరచాయి.

ఆస్కార్ వైల్డ్ ఓ దగ్గర ఇలా అంటాడు. అది నా ఫేవరేట్ కోట్స్ లో ఒకటి.

"There is only one class in the community that thinks more about money than the rich, and that is the poor. The poor can think of nothing else."

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu