267. రాష్ట్రమేదైనా సామాన్యుడు బాగుపడేనా? – 06[సోనియాని పార్టీ, మీడియా ఆదుకునే యత్నాలు] [Dec.16, 2009]



వ్యక్తి జీవితంలో అయినా, జాతి జీవితంలో అయినా ’దృక్పధం’ కీలకమైనది.

అభివృద్ధి చెందినా, వెనకబడినా, దగా చేసినా, దగా పడినా కూడా, అందుకు దోహదం చేసేది ఆయా వ్యక్తుల దృక్పధమే! కొన్ని యదార్ధ సంఘటనలని ఇందుకు ఉదాహరణగా చెబుతాను. గుంటూరులో మా బాల్యం[ మావారు, నేను కూడా] గుంటూరు వారి తోటలో గడిచింది. మాకు బస్టాండు దగ్గర. అప్పట్లో బస్టాండు లోతైన ప్రదేశంలో ఉండేది. వర్షం వస్తే చెఱువే! అప్పుడు ’బస్సుల్లో బదులు పడవ లేసుకు బస్టాండు లో తిరగొచ్చు’ అని జోకులు వేసుకునేవాళ్ళం. తర్వాత కాలంలో దానికి ఉత్తరం వైపున్న విశాల భూభాగంలోకి మార్చి, చక్కని బస్టాండు భవనాలు కట్టారు. అప్పటి వరకూ ఈ ప్రదేశానికి ఎదురుగా, జాతీయ రహదారికి మరోప్రక్క చిన్న చిన్న పెంకుటిళ్ళు, రేకుల ఇళ్ళు, చిన్న మిద్దెలూ ఉండేవి. కొత్తబస్టాండు కారణంగా ఒక్కసారిగా ఈ ఇళ్ళున్న స్థలాలకి అప్పట్లో లక్షల్లో[ఇప్పుడు కోట్లల్లో] ధర పలికింది.

మా వారి పాఠశాల సహాధ్యాయి ఒకరికి అక్కడ పెద్దలిచ్చిన ఓ మాదిరి పెద్ద ఇల్లు ఉండింది. ఒక్కసారిగా వాళ్ళు లక్షలాధికారులు అయిపోయారు. ఇతడు పాఠశాల చదువుతో చదువుకి స్వస్తి చెప్పిఉన్నాడు. తమ భూమికి ఒక్కసారిగా పెరిగిన ధరతో జీవితం మారిపోతుందని అతడూ, అతడి కుటుంబసభ్యులూ సంబరపడ్డారు. అక్కడున్న దిగువ మధ్య తరగతి ప్రజలందరిదీ అదే పరిస్థితి. కొత్తబస్టాండు కారణంగా వాళ్ళ భూములకు విలువ పెరిగేటప్పటికి అతడి పరపతి పెరిగింది. సరే, ఇప్పటికైనా వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని అందరూ అనుకున్నాము.

అయితే రెండేళ్ళు తిరిగేటప్పటికి - మా వారి బాల్య స్నేహితుడికి ఖరీదైన స్నేహితులు ఏర్పడ్డారు. అతడికి తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన తాగుడు అలవాటు మారలేదు గానీ, కలిసి తాగే స్నేహితుల స్థాయి మారింది. ఓ రోజు అలాంటి తాగుడు పార్టీలో ఇజ్జత్ సవాళ్ళు రేగాయట. తాగిన మత్తులో రెచ్చగొట్టిన మాటలకు అతడు తన ఇంటి స్థలాన్ని దాదాపు 25 లక్షల రూపాయలకి అమ్మవలసి వచ్చింది. అప్పటికి దాని విలువ మరికొంత ఎక్కువే! అదీగాక బస్టాండు నిర్మాణం పూర్తయితే ఆ విలువ చాలా ఎక్కువ అవుతుంది. అందునా ఈ విక్రయ ఒడంబడికలో, అతడి ఇంటి స్థలానికి బదులుగా రెండు వీధుల వెనక ఉన్న మరో ఇంటిని 11 లక్షలకీ ఇచ్చేటట్లుగానూ, మిగతాది డబ్బుగా ఇచ్చేటట్లుగానూ జరిగింది. రెండు వీధుల లోపలకి ఉన్న ఆ ఇంటి విలువా, స్థలం విలువా కలిపినా కూడా, 11 లక్షలకి చాలా తక్కువ. వచ్చిన మిగతా డబ్బు అటు ఇటూ ఖర్చయి పోగా, మరో కొన్నేళ్ళు తిరిగేసరికి, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. అప్పటికి వాళ్ళు అమ్ముకున్న ఇంటి స్థలంలో, వాళ్ళ పాత ఇంటిని పడగొట్టి కట్టబడిన లాడ్జింగ్ & హోటల్ వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా నడుస్తోంది. వాళ్ళ చేతికి మాత్రం వంతెన క్రింది నీళ్ళలా డబ్బు వచ్చింది, పోయింది.

ఒకసారి ఆ మిత్రుడు తారసపడగా మా వారికి ఇవన్నీ తెలిసాయి. ’అలాగెలా జరిగింది?’ అన్న వివరాలు ఇతర మిత్రుల ద్వారా తెలిసాయి. ఇదంతా చూసినప్పుడు మేము "ఆ స్థలంని సెక్యూరిటీగా పెట్టి ఏ బ్యాంకులోనో లోన్ తీసుకున్నా, వీళ్ళే బ్యాంకుకో, హోటల్ కో పనికి వచ్చే వ్యాపార భవంతినో, లేదా షాపింగ్ కాంప్లెక్స్ నో కట్టుకో గలిగి ఉండేవాళ్ళు" అనుకున్నాము.

అతడికి బ్యాంకు ఋణాల గురించి ఏ పరిజ్ఞానమూ లేదు. పెద్దగా చదువుకోలేదు. బంధువులూ అంతే! వెరసి, మరో తెలివైన లేదా చదువుకున్న వాడి చేతిలో దగా పడ్డారు. అలాగని అవతల వాడు ఇతణ్ణి బెదిరించలేదు, బలప్రయోగం చేయలేదు. అతడంతట అతడే, స్వయంకృతం అన్నట్లు, తాగిన మత్తులో అవకాశాన్ని చేజార్చుకున్నట్లు అయ్యింది. అవతలి వాడి ’సైకలాజికల్ ప్లే’లో ఇతడు తేలిగ్గా పడిపోయాడు. ఎవరు ఇతణ్ణి దగా చేసారు? మరో తెలంగాణా వాడో, రాయల సీమ వాడో, తమిళుడో కన్నడిగుడో కాడు. తోటి వాడే! ఎవరు దగా చేయనిచ్చారు? ఇతడి తాగుడూ, ఇతడి అవిద్యే! చిన్నప్పటి నుండి తండ్రి ప్రతీరోజూ సాయంత్రం మద్యపు అలవాటు చూశాడు. వయస్సు రాగానే చిన్నప్పటి నుండి చూసి చూసి, అది తప్పని పించలేదు. పైగా ’యద్యదాచరతి శ్రేష్ఠః’ లాగా తండ్రి చేస్తున్న పని, పసితనం నుండీ కొడుక్కి ’గొప్ప’గా, ideal గా అన్పిస్తుంది.

నిజానికి, ఈ కుటుంబానికే సరైన[attitude] దృక్పధం ఉండి ఉంటే - ఆ తండ్రి కొడుకుని కనీస చదువులన్నా చదివించుకుని ఉండేవాడు. జీవితంలో అభివృద్ధి చెందాలన్న కాంక్షని నూరిపోసే వాడు. చదువుల పరంగా, ఆర్ధికంగా, సామాజికంగా కూడా స్థాయి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని, లక్ష్య సాధననీ నేర్పి ఉండేవాడు. ఇంకా అప్పట్లో గుంటూరుతో పాటు అన్నిచోట్ల విద్య ఇలా ప్రైవేటు పరం అయిపోలేదు. సామాన్యుడికి అందుబాటులోనే ఉండింది. ఆరోజు చదువులింత ఖరీదు కాదు. తల్లిదండ్రులు శ్రద్దపెట్టటమే పిల్లలు చదువుకోవటానికి పునాది అయి ఉన్న రోజులు.

ఆ విధంగా - అతడు చదువుకుని ఉంటే, కనీసం, తనకి అభివృద్ది చెందటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని ఉండేవాడు. తన మీద, మద్యం రూపేణా, మాటల తంత్రంతో, తన అహాన్ని రెచ్చగొట్టి తన ఆస్తిని ఊడగొట్టే యత్నం ఎదుటి వాడు చేస్తున్నాడని పసిగట్ట గలిగే వాడు. కనీస విద్య, అవగాహన ఉంటే తనని తాను ఆ ’దగా’ నుండి కాపాడుకుని ఉండేవాడు. ఈ విధంగా అతడి దృక్పధమే అతణ్ణి దగాపడేటట్లు చేసింది. అలాగే అతణ్ణి చట్టబద్దంగా మోసగించిన అతడి స్నేహితుడి దృక్పధం, ఇలాంటి దగాలని చేసేందుకు దోహద పడింది.

నిజం చెప్పాలంటే - ఒక మోసం జరిగిందంటే, మోసగించిన వాడి కుత్సితపు తెలివి తేటలది ఎంత బాధ్యతో, మోసగింపబడిన వాడి అనవగాహన, తెలివిహీనతలది అంతే బాధ్యత! తెలివైన వాడు తన తెలివితో ఇతరులకి సాయపడటం, సమాజ ఉన్నతికి పాటుపడటం గాకుండా, తన కంటే తెలివి హీనులని దగా చేయటానికి, తన స్వార్ధ ప్రయోజనాలకి వాడుకునేటట్లు తయారవ్వటం అంటేనే - ఆ సమాజంలో ధార్మిక దృక్పధం, మంచి దృక్పధం నాశనమైందన వచ్చు. అలాగే ఓ బలశాలి బలహీనుణ్ణి హింసించినా, బాధించినా కూడా! ఈ విధమైన సామాజిక దృక్పధాన్ని ప్రభుత్వమూ, చట్టమూ చేయగలిగిన కట్టడి కొంతే! నమ్మకాలు, మతపరమైన కట్టుబాట్లు, నాయకుల నీతి నిజాయితీ ధర్మబద్దత, మరింతగా కట్టడి చేయగలవు. సరిగ్గా ఇక్కడే మన సమాజం విఫలమైంది. ఈ వైఫల్యాన్నే నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులూ ప్రణాళిక రచించి మరీ నిర్వహించారు, నిర్వహిస్తున్నారు.

ఇది అసలు ప్రారంభమైంది తెలంగాణా లోనే. ఎందుకంటే తొలితరం నకిలీ కణికుడి జన్మస్థానమూ, ప్రారంభస్థానం నిజాం సంస్థానమైన హైదరాబాదు గనక! నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యం, నిజాంల నిరంకుశత్వానికీ, స్వార్ధ పర్వతకీ తోడై, ఖాసీం రజ్వీల అమానుషత్వంతో కలిసి ఎంతగా బరితెగించిందో, అంతగా తెలంగాణా ప్రజలు అణిచివేతకి గురయ్యారు. అంతగా దగా పడ్డారు. అంతగా ఆత్మన్యూనతకి గురయ్యారు. తిరగబడి పోరాడిన యోధులు మినహా, లొంగిపోయిన ’బాంచన్లు’తరతరాలుగా అదే బానిసత్వాన్ని, అలసత్వాన్ని వారసత్వంగా తెచ్చుకున్నారు. ఆత్మన్యూనత, తమ ఈ కష్టాలకి ’పాలకులు’ కారణం అన్న భావన [అది సత్యమే] మనస్సు అట్టడుకు పొరల్లో గడ్డకట్టుకు పోయింది. అది తరతరాలకూ సంక్రమించింది.

ఇప్పటికీ వారిలో, తమని ఏ నాయకులో [వాళ్ళు కేసీఆర్ వంటి తాగుబోతులూ, వదరబోతులూ అయినా సరే] కాపాడాలనుకోవటంలో ఉన్నది ఆ బానిస భావనే! తమ జీవితాలకి తామే నాయకులం అన్న స్పృహ ఉన్నది కొందరిలోనే! ఆత్మన్యూనత కలిగించేది ఈ బానిసత్వాన్నే! తమ మంచికైనా, చెడుకైనా నాయకులే బాధ్యులు అనుకోవటం, తమ పరిస్థితులకి వేరెవ్వరో కారణం అనుకోవటం, ఈ కోవకే చెందుతాయి. [గమనిస్తే, క్రమంగా ఇలాంటి భావనలే ప్యాకింగ్ మార్పుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో చొప్పించబడుతున్నాయి.]

నిజానికి భారతీయులలో కూడా ఇదేరకపు బానిస భావాలని, ఆత్మన్యూనతని చాలా పకడ్పందీగా ప్రవేశపెట్టింది నకిలీ కణిక వ్యవస్థ! ఇందుకే "మీరు గొర్రెలు కారు. సింహాలు మీరు. గర్జించండి" అంటూ వివేకానందస్వామి భారతీయుల ఆత్మని నిద్రలేపారు. గీత చేతబట్టిన తిలక్ మహాశయూడూ ఇందుకే "భారతీయులు బానిసలు కాదు. స్వాతంత్రం నా జన్మహక్కు" అని ఆత్మగౌరవాన్ని తెలుసుకోమని ఎలుగెత్తి చాటారు.

ఇందరు ఇన్నిరకాలుగా చెప్పగా, సాధనతో ఇప్పటికి భారతీయులు ఆ బానిస భావనలని బాగానే విడనాడినా, ఇంకా రాజకీయ నాయకులలో అది మిగిలే ఉండటం, పార్టీల అధిష్టానాల కాళ్ళ మీద ఆయా పార్టీల రాజకీయ నాయకులు పడటం చూస్తూనే ఉన్నాం.

మరో సంఘటన వివరిస్తాను. 2000లో మేం సూర్యాపేటలో చికెను దుకాణ యజమాని ఇంట్లో పైవాటాలో ఉండేవాళ్ళం.[ఈ ఇంటి నుండే మేం 2001 లో కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడ్డాం.] క్రింది వాటాలో వెనక వైపు ఓ కుటుంబం ఉండేది. ఆయన ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో టీచరు. ఆమె గృహిణి. వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు ఉండేవాళ్ళు. పెద్దవాడు మా పాప కంటే ఓ సంవత్సరం పెద్ద, రెండో వాడు ఓ ఏడాది చిన్న. మా పాప, ఆ బుడ్డీలు కలిసి ఆడుకునే వారు. ముగ్గురు పిల్లలు మా ఇంట్లోనో, వాళ్ళింట్లోనో ఆడుకునేవారు.

ఓ సారి గుడికెళ్ళి వస్తుంటే ఆవిడ మా పాపని "మా ఇంటికి రా! నీ పని చెప్తా!" అంటూ బెదిరించింది. మా బుడ్డిది రయ్యిన పైకి ఉరికేసింది. నేను "ఏమైందండీ!" అన్నాను. ఆవిడ నవ్వుతూ "మీ గీత మా చిన్నోడిని కొట్టిందండి. తలపైన బొప్పి కట్టింది. ’మా వాణ్ణి కొడతావా? క్రిందికి రా నీ కాళ్ళిరగ్గొడతా’ అన్నాను. అప్పటి నుండి అసలు కిందికి రావటం లేదు. రయ్యిన పైకి ఉరుకుతోంది" అంది. చూస్తే చిన్నవాడి తలమీద పెద్దబొప్పి కట్టి ఉంది. నేను ఆమెకి సారీ చెబుతున్నట్లుగా "నేను కోప్పడతానండి. నాకసలు తెలియదు" అంటుండగా ఆమె నవ్వేస్తూ "పిల్లలన్నాక కొట్టుకుంటారు. తర్వాత వాళ్ళే కలిసి పోతారు. మరీ బొప్పి కట్టేలా కొడితే బెదిరించాను. అంతే! వదిలెయ్యండి" అంది. నేను నవ్వేసి కాస్సేపు అది ఇదీ మాట్లాడి వచ్చేసాను.

పైకి వచ్చాక మా పాపని "అసలెందుకు వాడిని కొట్టావు నాన్నా? తప్పు కదా?" అని అడిగాము. అప్పటికి తనకి నాలుగున్నరేళ్ళు ఉంటాయి. ఆమె భయభయంగా "అది కాదు డాడీ! ముందు నన్ను వాళ్ళ వినోద్ కొట్టాడు. అందుకని నేను వికాస్ ని కొట్టాను" అంది. నేను ’తనకంటే పెద్దవాడు తనని కొడితే, తనకంటే చిన్నవాణ్ణి తను కొట్టిందా’ అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మా వారు, అసలు తన ఆలోచన ఏమిటో తెలుసుకోవటానికీ అన్నట్లు "నిన్ను కొట్టింది వినోద్ అయితే వాడి తమ్ముడు వికాస్ ని ఎందుకు కొట్టావు?" అని అడిగారు.

తను "అది కాదు డాడీ! వాళ్ళకీ, నాకూ కొట్లాట వచ్చింది డాడీ! వినోద్ నన్ను కొడితా అన్నాడు డాడీ! వికాస్ ’కొట్టన్నా కొట్టు’ అన్నాడు డాడీ! వినోద్ కొట్టాడు డాడీ! అందుకని నేను వికాస్ ని కొట్టాను డాడీ!" అంది. నిజం చెప్పొద్దు, మాకు చాలా నవ్వొచ్చింది. ’కొట్టిన వాణ్ణి గాకుండా, కొట్టమన్న వాణ్ణి కొట్టటం - సమస్యని సమస్యగాకుండా మూలం నుండి చూడటం,’ అనుకుని నవ్వుకున్నాము. ఆమె ముందు నవ్వితే ఇతరులని కొట్టటాన్ని ప్రోత్సహించినట్లుగా ఉంటుందని నవ్వు దాచుకుని "ఇంతకీ దేనితో కొట్టావు నాన్నా?" అని అడిగాము. "చిన్న రోకలి బండతో" అంది. అదిరిపడ్డాను. "ఓర్నాయనో, దేవుడు దయ చూసి రోకలి బండతో కొట్టినా అవతల బుడ్డీగాడికి తలబొప్పి మాత్రమే కట్టింది. గుండు పగిలి ఉంటే ఏం కాను?" అనుకుని, అలాజరగనందుకు దేవుడికి దండం పెట్టుకున్నాము. తర్వాత మా పాపకి ’ఆటల్లో స్నేహితులని కొట్టకూడదని’ కౌన్సిల్ చేసాము. వాడి తల పగిలి ఉంటే ఎంత ప్రమాదమో చెప్పాము.

ఈ సంఘటనని నేను మా పాప గురించి చెప్పుకునేందుకు వ్రాయలేదు. పెద్దలు పాడుచేయకపోతే పిల్లలు సహజత్వానికి దగ్గరగా, సత్యాన్నే చూస్తారని చెప్పటానికి వ్రాసాను. దీనికి మరో ఉదాహరణ చెబుతాను. మేం రోజూ సాయంత్రపు నడకకి వెళ్తుంటాము. మా ఇంటికి రెండు వీధుల అవతల ఓ అక్కాతమ్ముడూ, ఇతరపిల్లలతో కలిసి ఆడుకుంటూ కనబడతారు. అప్పుడప్పుడూ వాళ్ళని పలకరించటం, ముద్దు చేయటం చేస్తూంటాము. అక్కకి నాలుగున్నరేళ్ళు ఉంటాయి. తమ్ముడికి రెండేళ్ళు ఉంటాయి. ఓ రోజు వాళ్ళింటి అరుగు మీద, అక్కా తమ్ముడు కూర్చొని ఏదో ఆటలాడుతున్నారు. అక్క "మళ్ళీ మా తమ్ముడే ఓడిపోయాడు" అంటూ గట్టిగా అరిచి, ప్రక్కనే ఉన్న మరో స్నేహితురాలికి చెప్పింది. ఈ బుడ్డికి అయిదేళ్ళు ఉంటాయి. మేం అటువైపు చూసేసరికి, ఆ చిన్న తమ్ముడు ఎంతో మనోహరంగా నవ్వుతూ ’తాను కాంగా ఓడిపోయాడు’ అన్నట్లు సగర్వంగా చూస్తున్నాడు. వాడికి సంబంధించి గెలుపూ ఓటములకు తేడా లేదు. ఆడటం ముఖ్యం. గెలిచినా ఓడినా అదేదో గొప్ప.అంతే!

అది చూసి మాకు చాలా నవ్వొచ్చింది. ’గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆడటం ముఖ్యం అన్నట్లు ఆడటం! ఎంత నిష్కామ కర్మయోగి రా బాబూ వీడు!’ అనుకుని వాణ్ణి చూసి నవ్వుకుంటూ ముందుకెళ్ళి పోయాం. అదే వాడి తల్ల్లిదండ్రులో మరో పెద్దవాళ్ళో అక్కడే ఉండి ఉంటే "అరే! బడుద్దాయ్! నువ్వు ఓడిపోయావ్ రా! అదేదో గొప్ప అన్నట్లు నవ్వుతున్నావ్! అక్క గెలిచింది. నువ్వు ఓడిపోయావ్" అంటూ ఓడితే ఏడవాలనీ, గెలిస్తే గర్వపడాలనీ నేర్పి ఉండేవాళ్ళు. ఓ రకంగ చూస్తే ’పిల్లల్ని పెద్దలమే చెడగొడతామేమో! ప్రకృతి సహజంగా, పిల్లలు సత్యంతోనే ఉంటారేమో!’ అనిపించింది. అందుకే ప్లేటో యూటోపియాలో, రవీంద్రుడు గీతాంజలిలో పిల్లల్ని స్వేచ్ఛగా, ప్రకృతి సహజంగా పెంచాలంటారు కాబోలు!

దీన్నే తెలంగాణాకి అనువర్తిస్తే... కుటుంబం ఎటువంటిదో, దేశం రాజ్యం అటువంటిదే. కుటుంబంలో తల్లిదండ్రులు ఎటువంటి వారో, రాజ్యంలో దేశంలో పాలకులు అటువంటి వారు. తల్లిదండ్రులు పిల్లల్ని పోషించి, విద్యాబుద్ధులు నేర్పి, మంచిబుద్దిని, దృక్పధాన్ని అలవరచి, వాళ్ళు సుఖంగా జీవించడానికి దోహదం చేసినట్లే, రాజ్యంలో రాజులూ, దేశంలో పాలకులూ చేయాలి. అలాగ్గాక తల్లిదండ్రులే పిల్లల్ని పీడిస్తే, ... హింసిస్తే...?అభద్రతా భావంతో పెరిగిన ఆ పిల్లల్లో ఉండేది అత్మన్యూనత, అనవగాహన రాహిత్యం....దురలవాట్లు! దానికి తోడు తరాల తరబడి దోపిడికి సైతం గురైతే? శారీరకంగా దోపిడి! శ్రమకే గాక, లైంగికంగా కూడా దోపిడికి గురై వెతల పాలైతే....? మానసికంగా భావదారిద్ర్యానికి గురి చెయ్యబడితే? తెలంగాణాలో జరిగింది ఇదే!

’కోటి రతనాల వీణ నా తెలంగాణా’ అన్న దాశరధి కృష్ణమాచార్యలనీ,
’జీవన వేదం’పలికించిన దాశరధి రంగాచార్యనీ,
’మానవుడే నా సంగీతం’ అన్న కాళోజీనీ,
’ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృతి పుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ’ అన్న పీవీజీని,
పేర్లు తెలియని వేలాది తెలంగాణా విమోచన పోరాటయోధుల్నీ,
స్వాతంత్ర సమర యోధుల్నీ మినహాయిస్తే...

నేడు, నిన్నటి దాకా ఒకరిని పొగిడి ఈ రోజు అదే నోటితో వాళ్ళనే తిట్టే కేసీఆర్ లనీ, జి. వెంకట స్వాములని, రాంరెడ్డి దామోదర రెడ్డిలనీ, జానారెడ్డిలనీ, పొన్నం ప్రభాకర్లనీ, సర్వే సత్యనారాయణలనీ, తమ జీవితాలని బాగుచేస్తారనుకుని, తమ నాయకులుగా ఒప్పుకునే తెలంగాణా ప్రజలు [ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారే సుమా] ఈ భావ బానిసత్వానికీ, భావ దారిద్ర్యానికీ అచ్చమైన వారసులే! అలాంటి నాయకులకి మాత్రమే ఇమేజి ఇచ్చే ’ఈనాడు’ అచ్చంగా నకిలీ కణికుల అనువంశీయమే!

కొట్టిన వాణ్ణి మాత్రమే పట్టించుకుని, కొట్టమన్న వాణ్ణి విస్మరించటం అంటే - ఒక సమస్యలో నుండి మరో సమస్యలోనికి ప్రయాణించటం వంటిది. అలాగైతే ఎప్పటికీ సమస్యల మూలం తెలుసుకోలేరు. పరిష్కారాలూ పొందలేరు. ఎప్పటికప్పుడు, నాయకులూ మీడియా కలిసి సృష్టించే హైసర బజ్జాలలో పడి, ఒక సమస్యలో నుండి మరో సమస్యలోకి ప్రయాణిస్తూ, ప్యాకింగు మార్చిన గూఢచర్యపు చదరంగపుటెత్తులలో పావులుగా మారి, ప్రవాహంలో పడి కొట్టుకుపోవటం మినహా, ఏ ఉద్యమాలతోనూ సాధించేది ఏమీ ఉండదు.

అవి సమైక్య ఉద్యామాలైనా...వేర్పాటు ఉద్యామాలైనా....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

The Telangana controversy which has brought the entire Andhra Pradesh into doldrums has posed a straight question – How did UPA give the decision overnight without consulting anyone and taking a proper consensus. Well, the inside sources give an interesting observation.

It is said that some big corporate and industrial giants have figured out that the Telangana is abundant in resources which are yet to be exploited. So forming a separate state would be easier to push the lobby and make things smooth for the expansion of their revenues.

At the end of the day, it is no sentiment or people’s welfare. It is the game of money that the big boys seem to be playing. In between this, the entire state is in shambles and the common man is being treated as nothing but a piece of pawn. Sad but true.

- A.Srirama chandra Murthy
Singapore

Sorce : http://greatandhra.com/ganews/viewnews.php?id=18027&cat=15&scat=16

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu