నిన్న కార్తీక శనిత్రయోదశి! ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, జన బాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న శనీశ్వరుని కథనీ, సమకాలీన రాజకీయాలలో దాని అనువర్తనకి జోడించి ఈ టపా వ్రాస్తున్నాను.

కొంతమంది ఈ కథని దేవేంద్రుడి పరంగానూ, కొందరు మహాశివుడి పరంగానూ చెబుతారు. దేవేంద్రుడు దేవతలకు రాజు. అది ఒక పదవి మాత్రమే! అందుచేత దేవేంద్రుడికి అరిషడ్వర్గాలని ఆపాదించినా సబబేమో గానీ, మహాశివుడికి అరిషడ్వర్గాలనీ ఆపాదించటం దురుద్దేశపూరితమే! అందుచేత ఈ కథని మానవ మాత్రుడైన ఓ మహారాజుకు ఆపాదించి చెబుతున్నాను. ఇక కథలోనికి వస్తే…..

అనగా అనగా…..
ఓ సువిశాల సామ్రాజ్యాన్ని ఓ మహారాజు పరిపాలిస్తుండే వాడు. తాత తండ్రులు విస్తరించిన విశాల రాజ్యం. వంశపారంపర్యంగా సంక్రమించిన పరిపాలనా వ్యవస్థ. పెద్దగా కష్టపడక్కర్లేకుండానే అంతా గడిచిపోతోంది. మహారాజుగా సర్వసౌఖ్యలూ అనుభవిస్తున్నాడు. తెల్లవారిలేస్తే విందువినోదాలు, సభలూ సమావేశాలు. తనని నిత్యం పొగిడే వందిమాగధులు, ప్రయోజనాలు ఆశించే ఆశ్రితజనులూ, నిత్యం తననే కీర్తించే కవిగాయకులు, వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించే నటినర్తకీమణులు. జిహ్వకి ఊరించే వంటకాలు. వేటికీ ఏ ఇబ్బందీ లేకుండా అంతా హాయిగా గడిచిపోతోంది.

ఓరోజు రాజు సభలో కొలువుతీరి ఉన్నాడు. యధాప్రకారం రాజుకి పొగడ్తలు నడుస్తున్నాయి. పోటాపోటీగా పొగిడిన వాళ్ళు, వినయవిధేయతలు చూపి పాదాభివందనాలు ఆచరించిన వాళ్ళు, యధాశక్తి బహుమానాలు పట్టుకుపోతున్నారు. ఇంతలో ఓ బక్కపలచటి వ్యక్తి రాజు ముందుకు వచ్చాడు. వేషధారణ చూస్తే బ్రాహ్మణుడిలా ఉన్నాడు. రాజు అతణ్ణి ఏంపనిమీద వచ్చావని అడిగాడు.

దానికా విప్రుడు “రాజా! నేను శనీశ్వరుణ్ణి! విధివ్రాత ప్రకారం నేను నిన్ను ఆవహించవలసి ఉంది. నేటికి సరిగ్గా నెల రోజుల నుండి ఏడేళ్ళపాటు ఏలిననాటి శనిగా నిన్ను పీడింపనున్నాను” అన్నాడు.

రాజుకు ఛర్రుమంది. నడుస్తున్న భోగభాగ్యాలూ, తలకెక్కిన పొగడ్తలూ అతడి అహంకారాన్ని హద్దులు దాటించాయి. దాంతో, ఎదుటి నున్న శనీశ్వరుణ్ణి గ్రహదేవతగానూ, దిక్పాలకుని గానూ గాక, కనబడుతున్న బాహ్యరూప బడుగు బాపడిగా పరిగణించాడు.

"నేను మహారాజుని! సామాన్య ప్రజలని పీడించినట్లుగా నువ్వు నన్ను పీడించలేవు” అన్నాడు దర్పంగా.

శని చిరునవ్వు నవ్వి “ఎంతటి వాడికైనా విధి వ్రాత తప్పని సరి! నా విద్యుక్త ధర్మం ప్రకారం నేను నడుచుకుంటాను.[అంటే చట్టం తనపని తను చేసుకుపోయినట్లన్న మాట] కాబట్టి నా ప్రభావం నీమీద ఉండితీరుతుంది” అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

సభలోని వారంతా నివ్వెర పడి చూశారు. ’రాజుకు శనిపడుతుందట’ అని గుసగుసలు పోయారు. ‘రాజు, శనీశ్వరులలో ఎవరి మాట నెగ్గుతూందో’ అన్న ఉత్కంఠ ప్రజలలో కనపడింది. దాంతో రాజుకు చాలా ఉక్రోషంగా అన్పించింది. ఎలాగైనా సరే, శని తనని పట్టలేకపోయాడనిపించుకోవాలన్న పట్టుదలకు పోయాడు. తనకు అంతరంగికులైన మంత్రి సేనాపతులలో, ఇతరులతో మంత్రాంగం నడిపాడు. ఎంతో ఆలోచన, ఎన్నో తర్జనభర్జనల తర్వాత, అంతా కలసి ఒక ప్రణాళిక పన్నారు.

ఆ ప్రకారం రాజ్యమంతా వెదికి రాజుకు బాగా దగ్గర పోలికలున్న వ్యక్తిని పట్టుకొచ్చారు. వేషభాషలు నేర్పగల శిక్షకులతో బాగా శిక్షణ నిప్పించి, వాడిని రాజులాగా వేషం వేసారు. అతికొద్దిమందికి తప్ప, ఇతరులెవ్వరికీ తెలియకుండా రాజు నలుగురు సేవకులతో కలిసి అడవికి బయలుదేరాడు. రాజు స్థానంలో తము శిక్షణ నిచ్చిన వ్యక్తిని రాజుగా మంత్రి సేనాపతులు కూర్చోబెట్టారు. నెల గడిచింది. యధాప్రకారం రాజుకు అన్నీ నడుస్తున్నాయి.

సభలో శనీశ్వరుడికీ రాజుకీ మధ్య సంవాదం నడిచిన నాటి నుండి ప్రజలంతా ’ఏం జరగనుందా?’ అని వేచి చూస్తున్నారు. నెలరోజులు గడిచినా ఏమీ కాలేదు. పైపెచ్చు రాజుకు పొగడ్తలు మరింత పెరిగి పోయాయి. క్రమంగా ప్రజలంతా అన్నీ మరిచిపోయారు.

అడవికిపోయిన అసలు రాజు ఓ కొండగుహలో రహస్యంగా ఉండసాగాడు. వెంటనున్న నలుగురు సేవకులు అడవిలో వేటాడి, పండుఫలాలు సేకరించి తెచ్చిన ఆహారంతో సరిపెట్టుకుంటూ కాలక్షేపం చేయసాగాడు. అడవిలో సంచరించే ఆటవికుల కంట కూడా పడకుండా ఎలాగో కాలం నెట్టుకొస్తున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, విషయమంతా ఆనోటా ఆనోటా పడి బయటకు పొక్కుతుందేమోనన్న అనుమానంతో గుహ విడిచిపెట్టి బయటకు వచ్చేవాడు కాదు.

ఇలా ఏడేళ్ళు గడిచిపోయాయి. రాజు సంతోషంతోనూ, విజయగర్వంతోనూ రాజధాని కేసి బయలు దేరాడు. నగరం సమీపిస్తుండగా శనీశ్వరుడు పూర్వంలాగే విప్రుడి రూపంలో ఎదురు వచ్చాడు. రాజు శనీశ్వరుడి వైపు కళ్ళెగరేస్తూ, దర్పంగా “ఏం శనీశ్వరా! ఏడేళ్ళు నన్ను పట్టి పీడిస్తా నన్నావుగా! చూడు, నువ్వు నన్నేం చెయ్యలేక పోయావు” అన్నాడు.

శనీశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ “పిచ్చివాడా! నేను నిన్ను పట్టి పీడించక పోవటం ఏమిటి? శని పట్టబట్టే గదా నువ్వు రాజధానికి, రాజ ప్రాసాదానికి, భార్యబిడ్డలకీ, రాజ్యాధికారానికీ దూరంగా, అడవిలో కొండగుహలో ఈ ఏడేళ్ళు ఉన్నావు? మృష్టాన్నానికి బదులు అడవి దుంపలు తిన్నావు? కవిగాయక వందిమాగధుల పొగడ్తలకు బదులు అడవిజంతువుల అరుపులు విన్నావు. వింజామరలు వీస్తుండగా పట్టుపరువు మీద నిద్రించే నువ్వు క్రిమి కీటకాలు తోలుకుంటూ కటిక నేలమీద కునికిపాట్లు పడ్డావు. ప్రజలని నువ్వు మభ్య పెట్టగలవేమో గానీ, విధివ్రాతను తప్పించుకోలేవు” అన్నాడు.

దెబ్బకి రాజు కొయ్యబారి పోయాడు.

ఆ తర్వాతైనా రాజుకు జ్ఞానోదయమైందా లేదా అన్న విషయం వదిలేసి ఇక్కడితో కథ ముగిస్తున్నాను.

ఇక ఈ కథ అనువర్తన పరిశీలించాలంటే……

ఈ కథలోని రాజు వంటి వాళ్ళు నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీ తదితరులు.

ఈ కథలోని శనీశ్వరుడి వంటిది నెం.5 వర్గం.

నెం.5 వర్గపు పనితీరు కారణంగా నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుల గూఢచర్య తంత్ర వలయమూ, స్ట్రాటజీలూ బహిర్గతమవటం శని ప్రభావం వంటిదే!

తాజా రాజకీయ సంఘటనల నేపధ్యంలో నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, అతడి సోదరతుల్య సోనియా, అద్వానీ, మీడియా, ప్రభుత్వ అధికారుల అవినీతి, వాటి తాలూకూ స్ట్రాటజీ ఏవిధంగా బహిర్గతం [Expose] అయ్యిందో వివరంగా చెప్పాలంటే…..ఓబుళాపురం గనుల వ్యవహారాన్ని ఉదాహరణగా తీసుకుందాం.

గతకొన్నిరోజులుగా రాజకీయ నాయకులు ఘర్జనల్లో ‘గనుల మాఫియా’ అనేమాట మారుమ్రోగుతోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంలో భాగమైన గాలిసోదరులు, మన రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన జగన్ శిబిరంలోని వారు.

కర్ణాటక ప్రభుత్వాన్ని, భాజపా పార్టీని ఒక వూపు వూపిన గాలి సోదరులకు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇనుపఖనిజపు గనుల అవకతవకల గురించిన సంచలనాలు చెలరేగుతున్నాయి. ఈ నేపధ్యంలో, గాలి జనార్ధన రెడ్డి, హైదరాబాదులో విలేఖరుల సమావేశం నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షపార్టీ తెదేపా నాయకుడు చంద్రబాబునాయుడినీ, ఈనాడు రామోజీరావుని కలేసి తిట్టిపారేసాడు. ఎవ్వరూ రామోజీరావుని కాపాడలేరని కుండబద్దలు కొట్టినంత ఖరాఖండిగా ప్రకటించేసాడు.

ఈ సంఘటనకి పరిణమించిన పూర్వపరిస్థితులని పరిశీలిస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వై.యస్. మరణానంతర సంఘటనలని విశ్లేషిస్తూ, గతటపాలలో జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య నడుస్తున్న అంతర్లీన పోరు గురించి వివరించాను.

ఆ నేపధ్యంలో జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య జరగగల సంభావ్యతలని ఓసారి పరిశీలిద్దాం. కాంగ్రెస్ అధిష్టానపు గుట్టు జగన్ చేతిలో ఉందనీ, ఆరీత్యా కాంగ్రెస్ అధిష్టానం అద్దాల మేడలో ఉన్నట్లుగానూ, జగన్ చేతిలో రాయి ఉన్నట్లుగానూ పరిస్థితి ఉందని గతటపాలలో వ్రాసాను.

నిజం చెప్పాలంటే చేతిలో రాయి ఉన్నంత మాత్రానా సరిపోదు. చేతిలో రాయి ఉన్నవ్యక్తికి, ఆ రాయిని విసర గలిగినంత భుజబలమూ, సాహసించగల గుండెధైర్యమూ ఉండాలి. నైతిక స్థైర్యం లేని వాడికి [అంటే సైతికత లేనివారికి] గుండెధైర్యం ఉండదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెస్ అధిష్టానాన్ని, జగన్ శిబిరాన్ని, పరిశీలిస్తే వారిమధ్య ఏం జరిగి ఉండాలి? జరుగుతూ ఉండాలి? కొన్ని సంభావ్యతలు పరిశీలిద్దాం.

1]. కాంగ్రెస్ అధిష్టానం జగన్ శిబిరానికి లొంగిపోయి ఉండాలి.
[ప్రచారం ఈ విధంగానే ఉంది గానీ, జరుగుతున్న సంఘటనలు ఇందుకు కొన్ని విరుద్దాలు ఉన్నాయి.]
2]. జగన శిబిరం కాంగ్రెస్ అధిష్టానానికి లొంగిపోయింది.
[దాంతో….. గతంలో రామోజీరావు, వై.యస్.రాజశేఖర్ రెడ్డి కలిసి ఆడిన నాటకం తిరిగి పునరావృతం చేస్తూన్నారు. అప్పట్లో నెం.5 వర్గాన్ని నమ్మించడానికి ‘రాజ రామోజీల యుద్ధం’ అన్న నాటకాన్ని రక్తికట్టించారు. అందులో రామోజీరావు స్థానంలోకి కాంగ్రెస్ అధిష్టానమూ, వై.యస్. స్థానంలోకి జగన్ వచ్చారు. అంతే! అయితే ఈ విషయంలో పరిస్థితి ఇంకా స్పష్టపడవలసి ఉంది.]
ఈ రెండు సంభావ్యతలలో ఏది జరిగింది? ఏది జరుగుతూ ఉంది?
ఇక్కడ ఓ ఉదాహరణ చూడండి.

చిన్నప్పుడు మనం ఆడుకున్న ’అచ్చూబొమ్మా’ ఆటలో నాణెం పైకి ఎగరేస్తే, అచ్చో బొమ్మో పడటానికి ఉన్న సంభావ్యతని Theory of probability ప్రకారం ½ అని చెబుతాం. [1:1 నిష్పత్తి, 50% సంభావ్యత]. అందులో అచ్చో, బొమ్మో గాక, నాణెం నిలబడే సంభావ్యత కూడా ఉంది.

ఏవిధంగా అయితే, నాణెం ఎగరేస్తే, మనకి తెలిసిన బొమ్మో బొరుసో పడటం అనే సంభావ్యతలతో పాటుగా, మరో సంభావ్యత నాణెం నిలబడటం ఉంటుందో, అదేవిధంగా, ఏ సంఘటనలో అయినా, మనకి తెలిసిన సంభావ్యతలలో పాటుగా, మనకి తెలియని మరికొన్ని సంభావ్యతలు కూడా ఉండవచ్చు. అందుచేత, ఏమి జరిగిందో స్పష్టపడేవరకూ వేచి చూడవలసిందే! ఎందుకంటే జరిగినవి విశ్లేషించగలమే గానీ, జరగపోయేవి విశ్లేషించలేం కదా?

అందుచేత కాంగ్రెస్ అధిష్టానం, జగన్ శిబిరానికి లొంగిపోవడానికి ఎంత అవకాశం ఉందో, జగన్ శిబిరం కాంగ్రెస్ అధిష్టానానికి లొంగిపోవడానికీ అంతే అవకాశం ఉంది. ఇది రెండూ కాని సంభావ్యతలకి కూడా అంతే అవకాశం ఉంది.

అయితే ఏది జరిగినా, జరగకపోయినా, ఈ గనుల సందర్భాన్ని పురస్కరించుకొని నకిలీ కణికవ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, సోనియాగాంధీ, అద్వానీ, మీడియా, ప్రభుత్వాధికారుల అవినీతి మాత్రం అనుశృతంగా బహిర్గతమౌతూనే ఉంది.

అదెలాగో పరిశీలించండి:

నవంబరు 13 వ తేదీన గాలి జనార్ధన రెడ్డి, చంద్రబాబునాయుడిని విమర్శిస్తూ…..
[తరువాయి భాగం…..]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu