మొదట ఒక విషయం పరిశీలిద్దాం.

చిన్నప్పటి నుండీ…. సామాన్య శాస్త్రంలోనూ, [ఒకోసారి ఆంగ్ల వాచక పుస్తకాల్లో కూడా], అప్పుడప్పుడూ పత్రికల్లో వ్యాసాలు రూపంలోనూ, మనం చాలా సార్లే చీమల పుట్ట గురించీ, చీమల జీవన విధానం గురించీ చదివి ఉన్నాం.

మనకి శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం, సదరు శాస్త్రవేత్తలు చెప్పారని పత్రికలూ, పాఠాలూ చెప్పిన దాని ప్రకారం - చీమల పుట్టలో, [తేనెటీగల తుట్టెలో కూడా] ఒక రాణీ చీమ/ఈగ ఉంటుంది, గుడ్లు పెట్టేది ఇదే! పెట్టిన గుడ్ల నుండి లార్వాలు, వాటి నుండి కొన్ని మగచీమలు, కొన్ని రాణి చీమలు పుడతాయి. మిగిలిన లార్వాలన్నిటి నుండీ శ్రామిక చీమలు/ఈగలు పుడతాయి. జట్లు జట్లుగా పనిచేసి ఈ శ్రామిక చీమలు అనువైన వాతావరణ పరిస్థితుల్లో ఆహారాన్ని సేకరించి, పుట్టలో/తేనెతుట్టెలో నిల్వచేస్తాయి. పుట్టల్ని/తుట్టెల్ని నిర్మిస్తాయి. విపత్కర పరిస్థితులు వస్తే లార్వాలని, గుడ్లని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తాయి. పుట్టనీ, రాణిచీమనీ రక్షిస్తాయి. సకల సౌకర్యాలూ [ఆహారంతో సహా] సమకూరుస్తాయి. మగ చీమల్ని కూడా పోషిస్తాయి. రాణి చీమకి సంతాన సఫలత కలిగాక, రాణి చీమ ఆజ్ఞ ప్రకారం మగచీమల్ని చంపేస్తాయి. మళ్ళీ రాణిచీమ పెట్టిన గుడ్లని వర్గీకరించి, రాణి లార్వాలని, మగ లార్వాలని, శ్రామిక లార్వాలని వేర్వేరు విభాగాల్లో ఉంచి, వాటికి తగిన విధంగా సంరక్షణా, పోషణా చూస్తాయి.

రాణిలార్వాలు ఎక్కువ ఉంటే అప్పటికే పుట్టని ఏలుతున్న రాణి చీమ వాటిని చంపేస్తుంది. ఎప్పుడన్నా ఏదైనా రాణి లార్వాతప్పించుకుని చీమగా పరిణామం చెందితే, అదికొన్ని శ్రామిక చీమలని దండుగా చేసుకుని, మొదటి రాణిచీమని చంపేయ ప్రయత్నిస్తుంది. ఇక పెద్ద యుద్దమే! ఒకోసారి మొదటి [ముసలి] చీమని చంపేసి, కొత్త చీమరాణి అయిపోతుంది. ఒకోసారి కొత్త రాణి చీమ, కొన్ని శ్రామిక చీమల్ని, కొన్ని మగ లార్వాలు లేదా చీమల్ని తీసుకుని, వేరుకుంపటి పెట్టేస్తుంది. అంటే మరో కొత్త పుట్ట లేదా తేనె తుట్టె నిర్మిస్తుందన్న మాట.

పుట్ట లోపల…. శ్రామిక చీమలకి, మగ చీమలకీ వేర్వేరు బారెక్సులూ, చనిపోయిన చీమలకీ బరియల్ బ్యారెక్సులూ ఉంటాయని కూడా చిన్నప్పుడు ఇంగ్లీషు పాఠంలో చదువుకున్నాను. కొన్ని రకాల చీమలు వ్యవసాయం కూడా చేస్తాయని [?] ఓ వ్యాసంలో చదివాను. ఇదంతా మనం చదువుకున్నదే!

ఏమయినా…. చీమల క్రమశిక్షణాయుతంగా, వేసవిలో, వర్షాలు లేనప్పుడూ….. బారులు తీరి, ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటూ, ఆహారం సంపాదించడం చూస్తే, నిబద్దతతో శ్రమించే సైనికుల్లాగే ఉంటాయి.

ఇక చీమల పుట్ట/తేనె తూగల తుట్టె గురించి…. ‘శాస్త్రవేత్తలు చెప్పారని పత్రికలూ, పాఠాలూ చెప్పిన దానిప్రకారం’…... అని ఎందుకన్నానంటే……

ప్రశ్నోపనిషత్తులోని రెండవ ప్రశ్న గురించిన ప్రస్తావనలో….

తాన్ వరిష్ఠః ప్రాణ ఉవాచ మా మోహమాపద్యథ అహమేవై తత్పంచధాత్మానం ప్రవిభజ్యై తద్బాణ మవష్టభ్య విధారయా మీతిః తే౨శ్రద్దధానా బభూవుః

భావం:
అప్పుడు శ్రేష్టతమమైన ప్రాణం ఇలా అన్నది: “భ్రమలో పడకండి. నన్ను‘నేనే’ ఐదు భాగాలుగా చేసుకుని ఈ శరీరాన్ని ధరించి భరిస్తాను”. కాని వారు [పంచేద్రియాలు] ఆ మాటలు విశ్వసించలేదు.

సో౨భిమానా దూర్ధ్యముత్ర్కమత ఇవ; తస్మిన్నుత్ర్కామ త్యథేతరే సర్వ ఏవోత్ర్కామంతే, తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వ ఏవప్రాతిష్ఠంతే! తద్యథా మక్షికా మధుకర రాజాన ముత్ర్కామంతం సర్వా ఏవోత్ర్కామంతే, తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వా ఏవ ప్రాతిష్ఠంత, ఏనం వాజ్మనశ్చక్షుః శ్రోత్రంచ తే ప్రీతాః ప్రాణం స్తున్వంతి!!

భావం:
ప్రాణం అభిమానపడి, శరీరం నుండి నిష్ర్కమించడానికి సిద్దపడగానే, మిగిలిన అందరి పనీ కూడా నిష్ర్కమించినట్లే ఐంది. ప్రాణం స్థిరపడగానే మళ్ళీ అందరూ కదుటపడ్డారు. తేనెతుట్టెలోని రాజు ఈగ వెళ్ళిపోగానే అన్ని ఈగలూ వెళ్ళిపోయినట్లు, అది తుట్టెలోకి రాగానే అన్ని ఈగలూ స్థిరపడినట్లు, వాక్కు మనస్సు కళ్ళు చెవులూ మొదలైనవన్నీ అలాగే చేశాయి. సంతోషపడి ప్రాణాన్ని స్తుతించాయి.
[వివరణ: ఇక్కడ మనస్సు కూడా ప్రాణం మీద ఆధారపడిన వాటిలో చేర్చబడినదన్న విషయం గమనించాలి. అంటే మానసిక వ్యాపారాలు కూడా శరీరమూ ఇంద్రియాల ద్వారా పనిచేసే శక్తియొక్క ప్రకటరూపాలే.]

ఉపనిషత్తులో రాజుఈగ అని ఉంది. చీమల పుట్టలో/ తేనె తుట్టెలో, రాణిచీమ/ఈగల అధిపత్యమే ఉంటుందో, లేక రాజు చీమ/ఈగల ఆధిపత్యమే ఉంటుందో మనకైతే తెలియదు. జీవ శాస్త్రవేత్తలకే తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం పాటు శాస్త్రీయవిషయాల పేరిట కూడా నిజాలని అబద్ధాలు గానూ, అబద్ధాలని నిజాలు గానూ నమ్మించటం కూడా కొన్నిసార్లు జరిగింది.

ఇక ఉపనిషత్తు కథని ప్రక్కన బెడితే ‘చీమలు పుట్ట Concept’ లో మాత్రం ఒక రాణిచీమ, కొన్ని మగచీమలు, చాలా ఎక్కువ శ్రామిక చీమలూ ఉంటాయి.

2]. ఇప్పుడు మరో విషయం పరిశీలిద్దాం:

1980 లలో ‘రోషనార’ అనే నవల బాగా పేరుపొందింది. ఆమె ఔరంగజేబుకు సోదరి. అతడి వెనక మేధస్సు, చోదక శక్తిగా రోషనార పేరుపడింది.[?] ఆ నవలలో, ఢిల్లీ మొగలు చక్రవర్తులు, తమ రాణీవాసాలకి కాపలా కాయవలసిన సైనికులని, హిజ్రాలుగా మార్చటం గురించిన ప్రస్తావన ఉంటుంది.

మనపల్లెల్లో గిత్తలని ’బుడ్డకొట్టటం’ అన్న ప్రక్రియతో ఎద్దులుగా మారుస్తారు. అప్పటిదాకా ప్లేబాయ్ లాగా ఉండే గిత్త కాస్తా, సీరియస్ గా పనిచేసుకుపోయే ఎద్దుగా మారిపోతుందన్న మాట. ఇక గిత్త, ’ఆవు’ గురించిగానీ, ’సంసారం’ గురించిగానీ మర్చిపోతుందన్న మాట.

సరిగ్గా అలాగే!

మొగలు అంతఃపురాల కాపలాకి హిజ్రాలని ఉపయోగించే వారనీ, అందుకు శరీర ధార్డ్యుతగల యువసైనికులకని హిజ్రాలుగా మార్చేవారనీ మరికొన్ని పుస్తకాల్లో కూడా చదివాను. దీనిపైన లోతైన పరిశోధన ’ఏది నిజం’ బ్లాగరు చెప్పగలరేమో! ఇక్కడ కన్పిస్తోందీ శ్రామిక చీమలతో కూడిన చీమల పుట్ట వంటి ఆలోచనా, ఆచరణే!

3]. ఇప్పుడు మరో విషయం పరిశీలించండి:
ఇప్పుడు మనదేశంలో మంత్రిపుంగవులూ, కార్పోరేట్ వృత్తివికాస నిపుణులూ, వ్యాపార కంపెనీల సీఈఓ లూ, ఎంతో విశాలమైన చిరునవ్వుల్ని సమ్మోహనంగా విసురుతూ, చాలా ’కూల్’గా ’30 దాటేవరకూ పెళ్ళిళ్ళు చేసుకోవద్దనీ, 40 దాటే వరకూ పిల్లల్ని కనవద్దనీ’ చెబుతున్నారు. అచ్చం దొడ్డుబియ్యం తినమనీ, ఉపవాసాలు చెయ్యమనీ [పైగా అది ఆరోగ్యానికి మంచిదని కూడా సెలవిస్తున్నారు] చెప్పినట్లే!

ఇది…. ఇప్పుడు, మనదేశ వర్తమానం. అయితే, ఇది…. జపాన్ వంటి దేశాలకి గతం అన్నమాట. అక్కడి వాళ్ళు, ఇప్పటికే, ఈ ‘శ్రామిక చీమ’తనానికి అలవాటు పడిపోయారు. కాబట్టే…. పెళ్ళి, సంసారం, పిల్లల మీద ఆసక్తి తగ్గి, రోజుకు ఆరేడు గంటలు, ఇంటినుండి పనిచేసే ప్రాంతానికి ప్రయాణాలు చేస్తూ, ప్రయాణాల్లోనే నిద్రానిప్పులూ కానిచ్చేస్తూ, బ్రతికి ఉన్న యంత్రాల్లా పనిచేస్తూ, ‘వర్కు హాలిక్’ అన్న బిరుదుల్ని మోసుకుంటూ జీవితాలు వెళ్ళదీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వంధ్యత్వం కూడా ఇందుకు మరోపార్శమే!

ఇక్కడ మరో గమ్మత్తు కూడా ఉంది. కొన్నిదేశాల్లో జనాభా విపరీతంగా పెరగటం! దాంతో ఆహార ఆవాసాది జీవన ప్రమాణాల్లో పోటీపెరిగి, మరిన్ని శ్రామిక చీమలు దొరుకుతాయన్న మాట. ఈ విషయంలో చైనా మనకంటే కొంచెం ముందుంది. కొన్ని మతాల[ఇస్లాం] ప్రజల జనాభా విపరీతంగా పెరగటం, దీనికి భిన్నమైన తంత్రం. దాని గురించి తర్వాత వివరిస్తాను.

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మనస్తత్వం పెంచటం వెనుక ఉన్నది కూడా ఈ తంత్రమే! వ్యవసాయం, చిన్నపరిశ్రమల రంగం, విద్యారంగం – ఈ మూడింటినీ ధ్వంసం చేస్తే…. రైతులుగా, చిన్నవ్యాపారులుగా స్వతంత్రంగా బ్రతికే అవకాశాలు తగ్గిపోతాయి. విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తే, పర్యవసానంగా విద్యార్హతలు లేకుండాపోతాయి. [ఇప్పుడు ఆ దారిలోనే ఉంది.] ఆ వంకతో శ్రమదోపిడి చేయటం చాలా సులభం. నిజానికి చదివే చదువులకీ, చేసే ఉద్యోగ బాధ్యతలకీ ఉండే సంబంధం [చాలామంది విషయంలో] తక్కువే! అయినా ’విద్యార్హత చాలదు’ అన్న వంక శ్రమదోపిడి కి చక్కని సోపానం!

ఇప్పటి జపాన్, చైనాల వర్తమానం, భారత్ వంటి దేశాల భవిష్యత్తు! ఇక్కడ కన్పిస్తోంది కూడా శ్రామిక చీమలతో కూడిన చీమలపుట్ట ఆలోచనే! కాకపోతే…. కొంచెం సుదీర్ఘకాలం పాటు, అంటే రెండు మూడు దశాబ్ధాలపాటు, మెల్లిగా పరిణమిస్తూ….. చివరికి ఏ ఒక్కరూ తప్పించుకోలేనంతగా ఉచ్చు బిగించగల ఆచరణ!

కాబట్టే, చూడండి! ప్రజలలో ఎదురుతిరిగే మనస్తత్వాన్ని నలిపివేసే విధంగానే సినిమాల్లోనూ, కథల్లోనూ, ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ లోనూ, మీడియా ప్రచారంలోనూ అంశాలుంటాయి. మాఫియా లేదా ఫ్యాక్షన్ నేత లేదా విలన్ ల హింసాప్రవృత్తిని భయానకంగా చిత్రించబడంలోనూ, ప్రజాదృక్పధంలో భయాన్ని ప్రవేశపెట్టటమే ఉద్దేశంగా ఉంటుంది. ఇవి చాలక అఘోరాలూ, మంత్రతంత్రలూ ఉండనే ఉంటాయి.

అంతేకాదు, అన్నపూర్ణ ఉప్పుల దగ్గర నుండి ఎన్నో వాణిజ్యప్రకటనల్లో, ‘ఫలానా వస్తువు వాడితే ఉన్నతాధికారి అవుతారు’ అన్న ప్రచారం ఉంటుంది. ఫలానా వస్తువు వాడితే పెద్ద పారిశ్రామికవేత్త అవుతారు అన్న ప్రచారం ఉండదు. ఉద్యోగం సంపాదించటమే జీవిత సాఫల్యం అన్నంతగా ఈ ప్రచారం నడుస్తుంది. విజేత అంటే గ్రూప్ 1 లేదా సివిల్స్ టాపర్సే! ‘ఉద్యోగమే పరమావధి’ అన్నమాట.

దీనికి మరో కోణం: చీమల పుట్టలో శ్రామిక చీమల దండుకు కమాండర్ లు కావాలి కదా? అలాంటి స్థానాల్లో, ప్రపంచవ్యాప్తంగా, ఆయాదేశాల్లో, తమ తమ ఏజంట్లని దేశాధినేతలు గానో, కొన్నిదేశాల్లో సుల్తాన్ లు గానో, పాకిస్తాన్ వంటి దేశాల్లో సైనిక నేతలు గానో, బలంగా వేళ్ళూనుకునేలా చేసింది నకిలీ కణిక వ్యవస్థ. ఇక కార్పోరేట్ కంపెనీ అధినేతలూ ఇలాంటి వారే! ఈ కార్పోరేట్ కంపెనీలకూ, ప్రభుత్వాలకూ లాబీయింగ్ చేయటానికి కన్సల్టెంట్ ఏజన్సీలు మరికొన్ని.

వీళ్ళు 7వ నిజాం నవాబు హయాంలో ఖాసీం రజ్వీ వంటి వాళ్ళన్నమాట. రజ్వీ కనపడేటట్లు కత్తులూ, తుపాకులూ వంటి ఆయుధాలు పట్టాడు. వీళ్ళు, రాజకీయ వ్యాపార విధానాల వంటి ఆయుధాలు పడతారు. [ఉదాహరణకి, అణుఒప్పందం. భారత్, కొన్నిదేశాలతో చేసుకుందని తెలుసుకదా! దానికి లాబీయింగ్ చేసిపెట్టింది మరో కన్సల్టెంట్ కంపెనీ! దానికి ప్రభుత్వం అధికారంగా కొంత ముట్టచెప్పింది. అనధికారంగా ఎంత ముట్టజెప్పిందో? అణుఒప్పంద కంపెనీల నుండి ఆ అనధికార సొమ్ము + తన సొంతలాభం కలిపి ప్రభుత్వంలోని వ్యక్తులు వసూలు చేసుకుంటారు. ఈ లావాదేవీలు కోసం ప్రభుత్వం, “దేశానికి అణుఒప్పందం చాలా చాలా అవసరం” అంటుంది. ఇలాంటివే చాలా ఉదాహరణలు ఉన్నాయి.]

ఇక రాజకీయనాయకులని ’అన్నా’ అని పిలుస్తూ, చెప్పినపని చేసే సహచరులుంటారు. కార్పోరేట్ అధినేతలకు, టేబుల్ ముందు ఫ్యాను క్రింద కూర్చొని పనిచేసే శ్రామిక చీమలతో పాటు, అవసరమనుకుంటే ఎవరి మీదనైనా దాడులు చేయగల భుజబలం ఉన్న ఉద్యోగులూ ఉంటారు. ఇప్పుడు గనుల యజమానుల దగ్గరా, కార్పోరేట్ కాలేజీల యజమానుల దగ్గరా ఉన్నట్లన్నమాట. ఇక దావూద్ ఇబ్రహీం ల అనుచరుల వంటి స్మగ్లింగ్ మాఫియా, హవాలా మాఫియాల సంగతి చెప్పనే అఖ్ఖర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ రంగంలో ఉన్న అన్నలకైనా, క్రింది స్థాయిలో ’హింసాత్మక చర్యలు’ చేసిపెట్టే దళాలన్న మాట. వీళ్ళు రజ్వీ అధ్వర్యంలో పనిచేసిన రజాకార్ల వంటివాళ్ళు.

వెరసి…. ప్రపంచాన్ని చీమల పుట్టగానూ, సామాన్య జనాన్ని శ్రామిక చీమలు గానూ మార్చే ప్రక్రియే, చాపక్రింద నీరులా, చల్లగా మెల్లగా పనిచేస్తోంది. యూరప్ లో పారిశ్రామిక విప్లవం తర్వాత నడిచిన శ్రమ దోపిడికి మరింత మెరుగులు అద్ది, అప్పుడు చెలరేగిన ప్రజావిప్లవాలు పునరావృతం కాకుండా కావలసిన అన్ని జాగ్రత్తలూ తీసుకుని, విప్లవాలకు దారితీసిన పరిస్థితులలోని లోటు పాట్లని సరిచేసి…. మరింత పకడ్బందీగా…..మరింత ప్రణాళికా బద్దంగా…. మరింత వ్యవస్థీకృతంగా!

ఇక్కడ కూడా మన ఇతిహాసాలకు సరిగ్గా శీర్షాసనమే! మనకు మన ఇతిహాసాలు, “యజమానిగా బ్రతుకు, శారీరిక స్వాతంత్రమే కాదు, ఆత్మ స్వాతంత్రము పొందమని చెప్తాయి. దానిని సాధన చేయమని చెప్తాయి. కాని నకిలీ కణిక వ్యవస్థకు అనుచరులైన ఈ ప్రభుత్వాలు, ‘బానిసలాగా ఉద్యోగం చేసుకొండి. జీవిత సాఫల్యం పొందండి’ అనే ప్రచారిస్తాయి.

ఈ చీమల పుట్ట వ్యూహంతో…. తరాల తరబడి, శతాబ్ధాల పాటు పనిచేసిన నకిలీ కణిక వ్యవస్థ…. ‘ప్రపంచాధిపత్యం’ అనే తమ చిరకాల వాంఛని సిద్ధించుకోవాలనుకున్న కుట్రలో…. ఆవిష్కృతమైన భగవంతుడి లీలని వివరించి తీరాల్సిందే.

దాని గురించి చెప్పేముందు, మన చిన్నప్పుడు చెప్పుకున్న చిన్న కథని వివరిస్తాను.

అనగా అనగా…..

ఓ చీమ! దానికి భగవంతుడి సృష్టిమీద ఒళ్ళుమండిపోయింది. సృష్టిలో అన్ని జంతువులకీ ఎన్నో శక్తి సామర్ధ్యాలు ఇచ్చిన భగవంతుడు, తనకి చాలా అన్యాయం చేశాడని, దానికి చాలా ఆక్రోశం కలిగింది. పులిని చూస్తే అందరికీ భయం. సింహం అడవికీ రాజు. ఏనుగు భారీ జంతువు…..ఇలా దేని ప్రాధాన్యత, ప్రత్యేకత దానికుంది. తనకే ఏ గౌరవమూ లేదు. అందరికీ తనంటే చులకనే!

దాంతో క్రుద్ద్రత పొందిన చీమ, దేవుడి గురించి ఘోరతపస్సు చేసింది. దాని ఉగ్రతపస్సుకు మెచ్చిన దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

చీమ ఆక్రోశంతో తన బాధంత చెప్పుకొని, కసిగా, "దేవుడా! నేను కుట్టగానే చావాలి!” అంది. దేవుడు చిరునవ్వు నవ్వాడు. “తధాస్తు” అన్నాడు.

అప్పటి నుండి చీమకుట్టగానే మనం నలిపేస్తాం. దెబ్బకి చీమ ఛస్తుంది.

ఇదీ కథ!

నిజానికి ఈ కథలో ’తను కుట్టగానే మనిషి చావాలి’ అన్నది చీమ వాంఛ. జంతువులన్నిటి మీదా మనిషి అధిపత్యం వహిస్తున్నాడు గనుక, తాను మనిషిని కుట్టగానే మనిషి చచ్చినట్లయితే, అన్ని జంతువులని భయపెడుతున్న మనిషి తనకి భయపడతాడు. అన్ని జంతువుల మీదా ఆధిపత్యం కలిగిన మనిషి మీద తనకి ఆధిపత్యం ఉంటుంది. ఇదీ దాని ఆలోచన. భగవంతుడు తనకి ఇచ్చిన మంచిలక్షణాలని అది పట్టించుకోలేదు. తనకిచ్చిన క్రమశిక్షణాపూరిత శ్రమజీవనం, వాతావరణం పరిస్థితులని బట్టి జాగ్రత్తగా బ్రతికే ఒద్దికతనం తన ప్రత్యేకతగా అది గుర్తించలేదు. తనకి ఇవ్వని లక్షణాల పట్ల కినుక వహించింది. అదీ వ్యతిరేక ఆలోచనా ధోరణి.

అందుకే ’తను కుట్టగానే చావాలి’ అంది. తన క్రోధంలో ’మనిషిని’ అన్నమాట మరిచిపోయింది. సాక్షాత్తూ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోగల ఉగ్రతపస్సు ఆచరించినా, ఈర్ష్య క్రోధం వంటి అరిషడ్యర్గాలని దాటలేకపోయింది. ఉగ్రతపస్సు చేయగల శ్రమించేతత్త్వం ఉన్నా ప్రయోజనం పొందలేకపోయింది. దేవుడందుకే చిరునవ్వు నవ్వాడు. “తధాస్తు” అన్నాడు.

ఈ కథలో చీమ వంటి వాడే తొలితరం నకిలీ కణికుడు. వేశ్యాపుత్రుడైనందున, గౌరవగ్లానితో బ్రతుకు ఈడ్చినందునా, తనలో కలిగిన వ్యతిరేక భావనలని తరతరాలకి నూరిపోశాడు. వారిద్వారా సమాజంలోకి మరిన్ని రెట్లుగా ప్రవేశపెట్టాడు.

ఏనాటికైనా ప్రపంచ సామ్రాట్టుగా establish కావాలనుకున్నాడు. ఆ కాంక్షని తరతరాలకు సంక్రమింప చేశాడు. కాబట్టే, అతడి తరంలో, తానీషా ’రామోజీ’ కల దర్శకత్వంతో మొదలైన గూఢచర్యాన్ని, పకడ్బందీ వలయంగా, ప్రపంచమంతా అల్లే విధంగా, నకిలీ కణికుల అనువంశీయులు తయారయ్యారు.

ఏడెనిమిది తరాల తర్వాత, దాదాపు 350 సంవత్సరాల తర్వాత…. ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్లుగా, ‘ప్రపంచ సామ్రాట్టు’గా Expose or Establish కావడం గాకుండా, ‘ప్రపంచ కుట్రదారులు’గా Expose or Establish అవ్వటమే భగవంతుడి లీల! Expose మాత్రం అవుతున్నారు, కాకపోతే తీరే వేరు! ప్రపంచాధినేతలుగా కాదు, ప్రపంచం మీదే కుట్రదారులుగా బహిర్గతం అవుతున్నారు.

అచ్చం…. తను కుట్టగానే మనిషి చావాలను కున్న చీమ, కుట్టగానే తానే చచ్చినట్లుగా!

అందుకేనేమో, పెద్దలు, “మతిలో ఎంతో గతిలో అంత!” అనీ, "చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!” అనీ అంటారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

అమ్మ గారు,

మీరు మీవ్యాసాలను పి.డి.యఫ్. లోకి మార్చండి. ఈ పని ఎనంత తొందరగా చేస్తే అంతమంచిది. సత్య ప్రకాష్ అరిపిరాల హాస్యదర్బార్ ని అనే ఒక పి.డి,యఫ్. చేసారు. మీరు తోటి బ్లాగర్ల సహాయం తీసుకోనేది.
Watch this video or you can see same video in Histoy channel
http://video.google.com/videoplay?docid=-545930454338776455&ei=jT0JS6uNK5XZlQeU9aS_Dg&q=ascent+of+money#

Aadi lakshmi gaur,

oka nelalo mi blog mottam chadivanu.Chadivaka anipinchindi "Born to fight" tag kuda miku baga saripotundi ani.Roju comment raddamanukuntu ivaltiki rayagaliganu. yi comment evm fraud gudinchi. EVM tampering gurinchi mi blog lo chadivaka naku sandeham kaligindi. nenu chadivina oka blog lo dinigurinchi pedda charche garigindi. andulo oka comment maharastra ennikala gurinchi

1) The COng-NCP has just touched the magic figure of 144/288 and it is not mere coincidence.
2) Sufficient time is allowed between the time of voting date and counting date for manipulation.
3) IBN-Live channel gave it’s exit poll on the evening of election day and the results were exactly matching the actual results. The trend was fixed before actual manipulation was carried out.
4) The Congress funded media has all along been trumpetting during campaigning that MNS will eat away the Sena votes. This trumpetting was very organised propoganda to make every one beleive that the votes to Sena would be transferred to MNS for acheiving the desired results.
5) The Marathi public have very clearly understood from the regular trumpetting that if they wanted to vote for Sena, they should vote only for SS-BJP. They very well know that Raj is planted by Congress to only split the votes. There is no reason for anyone to vote MNS if the electorate is anti-incumbent.
6) The EVM Manipulation was entirely organised and selectively done. The apparent reason for split of opposition vote was demonstrated throughout the electioneering process and the larger public have been convinced that the results are logical.

Yi comment chadivaka naku mana ennikalu maharastra ennikalu oke laga jarigayanipinchindi. Miku kudirite okasari parisilinchandi. ikkada prajarajyam laga akkada MNS(Maharastra Navanirman Sangh) party. okasari parisilinchandi.

Inko vishayam sonia gandhi gurinchi. ame gurinchi janata party site lo information chusanu.
http://www.janataparty.org/sonia.html
mi visleshanalaku vupayogapadutundemo ani pamputunnanu.

Alage yi blog okasari chudandi. Pi comment yi blog lonide.
http://psenthilraja.wordpress.com/

Yi vishayalu comment ga asandarban ani mail cheddamanukunnaku kani mi mail id profile lo ledu. kudirite mi mail id ivvandi.

Kumar

కుమార్ గారు,

మీరు పంపిన సమాచారానికి, మీ అభిమానానికి కృతజ్ఞతలండి. నా బ్లాగు Profile లో మా వారి mail ఉంటుంది. మీరు దానికి నిరభ్యంతరంగా మొయిల్ ఇవ్వవచ్చు. నెలరోజులలో చదివానంటున్నారు, రోజుకు ఎన్ని గంటలు కేటాయించారు? కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. EVM టాంపరింగ్ గురించి నేను పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే వ్రాసాను. నెల రోజుల తరువాత EVM టాంపరింగ్ మీద గొడవ మొదలైంది. మీరు పంపిన లింకులు పరిశీలిస్తాను. నెనర్లు!

శ్రీకాంత్ రెడ్డి గారు,

మీ వ్యాఖ్యలన్నిటికి సమాధానాలు వ్రాస్తాను. కొంచెం ఓపిక పట్టండి. నెనర్లు!

Aadi lakshmi garu,
Mi post koodali lo chusanu. Madyalo artham kaka modatinunchi start chesanu. Office lo work takkuvaga vundatam valla modatlo office lo 10 -15 posts chadivanu.interesting ga vundatam valla weekends lo kuda chadivesariki ipoindandi mi blog.Chinnappudu story books chadavadam alavatu. telugu chadavadam istam. Mi blog chala kottavishayalu vunnai.anduke mi blog antha tvaraga chadivesanu.Mi ammai telugu blog(stories) kuda chadivesanandi. chala baga rastundandi.Miku icchina support ki mi variki hats-off andi.
kumar

కుమార్ గారు,

మీ అభిమానానికి కృతజ్ఞతలు!

టపా ముగించిన తీరు ఆశాజనకంగా హాయిగా అమ్మఒడిలా ఉందండీ :)

శ్రీకాంత్ రెడ్డిగారు, అజ్ఞాత గారు,
పిడిఎఫ్ చేయటానికి ఇవీ ఇంకా పూర్తి కాలేదండి. అదీగాక ఇవి ఒక దానికి మరొకటి అంతర లింకు ఉన్నవి. అందుకని కూడా దీనిని ఎలా చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానండి! నెనర్లు!
~~~~~~
రాఘవ గారు,

నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu