ముందుగా ఓ పోలిక పరిశీలించండి:
ఓ యజమాని, ఓ సేవకుడు ఉన్నాడనుకొండి. సేవకుడు, యజమాని కాళ్ళమీద పడటం/దాసోహం అనటం సహజం. అలాంటి సహజ సంఘటనని యజమాని కూడా వీలయినంత ఎక్కువగా ప్రదర్శించుకుంటాడు. ఎందుకంటే అలాంటి సంఘటనలు తమ పరపతినీ, గొప్పదనాన్నీ చాటుతాయి గనక! అలాగాక….యజమానే, సేవకుడి కాళ్ళమీద పడ్డాడనుకొండి/దాసోహం అన్నాడనుకొండి! దాన్ని పరమ రహస్యంగా ఉంచుకుంటాడు. తాను యజమాని అయి ఉండీ, ఏ కారణం చేతనైనా కానివ్వండి, సేవకుడి కాళ్ళు మీద పడాల్సివస్తే/దాసోహం అనాల్సివస్తే, అది మరెవ్వరి కంటాపడకుండా ఉండాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు. సేవకుడు, యజమాని కాళ్ళ మీద పడటం/దాసోహం అనటం సహజం [normal]. యజమాని సేవకుడి కాళ్ళమీద పడితే/దాసోహం అంటే, అది అసహజం [Abnor mal].

ఈ పోలిక, కాంగ్రెస్ అధిష్టానం అయిన సోనియాగాంధీకీ, కాంగ్రెస్ లోని ఇతరులందరికీ వర్తిస్తుంది.

ఇప్పుడు మరో వార్త పరిశీలించండి. అక్టోబరు 23, 2009: ఈనాడు పేజీ నెం. 1

>>>రాజశేఖర్ రెడ్డి దివంగతులైన తర్వాత తొలిసారి ఢిల్లీకొచ్చిన జగన్ గురువారం ఉదయం 10:30 గంటలకు కెవిపి రామచంద్రరావుతో 10 – జన్ పథ్ లో అడుగుపెట్టారు. తర్వాత ఒక్కరే సోనియాను కలిశారు. సుమారు 50 నిముషాల పాటు జరిగిన ఈ భేటిలో జగన్ తనపై పడ్డ మచ్చలను చెరిపేసుకొనేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి తాను వివిధ కోణాల్లో చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆయన అధినేత్రిని శాంతపరిచి ప్రసన్నం చేసుకోడానికే అధికసమయం కేటాయించారు. సంతకాల సేకరణ, ఇతరత్రా ఆందోళనలతో తనకు ఎలాంటి సంబంధంలేదని, తన ప్రమేయం లేకుండానే వివిధ సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. తన కుటుంబం మొత్తం పార్టీకి విధేయంగా ఉందని, తాను అందుకు భిన్నం కాదని సోనియాకు విజ్ఞప్తి చేసుకున్నట్లు సమాచారం. జగన్ చెప్పినవన్నీ సావధానంగా విన్న సోనియాగాంధీ ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే “అన్నీ నాకు విడిచిపెట్టు. నేను చూసుకుంటా” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. తక్షణ కర్తవ్యంగా రోశయ్య ప్రభుత్వ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు వినికిడి. అధిష్టానానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులను సవరించాలని సోనియాగాంధీ జగన్ కు నర్మగర్భంగా ఆదేశించినట్లు తెలిసింది. అందుకు సమ్మతి వ్యక్తం చేస్తూ జగన్ బయటికి వచ్చేసినట్లు సమాచారం. సోనియా – జగన్ ల సమావేశంలో తొలుత 15 నిముషాలు అహ్మద్ పటేల్ కూడా ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరే ముఖాముఖి మాట్లాడుకున్నారు. కెవిపి రామచంద్రరావు బయటే ఉన్నారు.

దాదాపు గంట పైగా [ఇతర పత్రికలలో 50నిముషాలపైగా పైగా అని వార్తలొచ్చాయి. జగన్ కూడా గంటసేపు మాట్లాడుకున్నాం అనే చెప్పాడు.] జరిగిన ఆ ఏకాంత సమావేశంలో, ఏం జరిగిందో, జగన్ కీ, సోనియాగాంధీకే తెలియాలి. వాళ్ళు చెబితే ఇతరులకి తెలియాలి. జగన్ తన తండ్రి మిత్రుడు కేవిపీ కీ, ఇతర అనుచరులకి చెప్పి ఉండొచ్చేమో! సోనియాగాంధీ ఎవరికైనా చెప్పిందో లేదో మనకైతే తెలియదు.

అయితే, మరోసారి ఈనాడు వార్తని పరిశీలించండి. ప్రతీ వాక్యం చివరా…. తెలిసింది, సమాచారం అంటూ, ఏకాంత సమావేశంలో ఇద్దరి మధ్యా ఏం జరిగిందో వివరంగా వ్రాసి పారేసింది.

అందులోనే సమావేశంలో మొదట 15 నిముషాలు ఉన్న అహ్మద్ పటేల్ కూడా బయటికి వెళ్ళి పోయాడనీ, కేవిపీ అసలు బయటే ఉండిపోయాడనీ వ్రాసారు. మామూలుగా ఇతర కాంగ్రెస్ అనుచరులంతా [పూర్వ హోంమంత్రి శివరాజ్ పాటిల్, అర్జున్ సింగ్ గట్రాల్లాగా] తనకి దాసోహం అన్నట్లే, జగన్ తనకు దాసోహం అంటున్నప్పుడు, అహ్మద్ పటేలో, కేవిపీనో ఉంటే నష్టమేమిటి?

పైగా జగన్ అన్నట్లుగా ఈనాడులో అక్టోబరు 24, 2009, పేజీ నెం.2 లో వ్రాసిన వార్త చూడండి.

>>> ’ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడిన నేపధ్యంలో పత్రికల్లో వివిధ వార్తలొచ్చాయి. ఇది నాకు బాధ కలిగించింది. నాకు, పార్టీ అధ్యక్షురాలికి మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా వ్యక్తిగతం. జెంటిల్ మెన్ గా చర్చల గురించి చెప్పడం సరికాదు’ అని జగన్ పేర్కొన్నారు. సంయమనం పాటించాలని ఆయన పత్రికలను కోరారు. తాను ఏదైనా చెబితే, ఆ విషయం వ్రాస్తే పద్దతిగా ఉంటుందని తెలిపారు. పార్టీ అధ్యక్షురాలిపై సంపూర్ణమైన నమ్మకం తనకు ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరైన విధంగానే తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

>>>’రోశయ్య గారికి….లేదా అధిష్టానం నిర్ణయంతో ఏ వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా ఆ వ్యక్తికి సంపూర్ణంగా నామద్దతు, ప్రతి కార్యకర్త మద్దతూ కచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను’ అని స్పష్టంచేశారు.

విలేఖరి ప్రశ్న, జగన్ సమాధానం.
>>>విలేఖరి: మీకు, సోనియాగాంధీ మధ్య జరిగిన చర్చల గురించి మీ ఎం.పీ.లు, మంత్రులే చెప్పారు?

జగన్: నా నోటి నుండి వస్తే తప్ప చెప్పినట్లు కాదు. మేడంకు, నాకు మధ్య చర్చ జరిగింది. పార్టీ ఎంపీగా పార్టీ అధ్యక్షురాలితో మాట్లాడా. నేను జంటిల్ మెన్ గా మౌనంగా ఉండాలి. ఏం జరిగింది అనేది చెప్పకూడదు. అందులో కార్నర్ చేయవద్దు. మీరంటే నాకు ఎంతో సదభిప్రాయం ఉంది, దయచేసి ఊహాగానాలు చేయవద్దు. గంటపైగా సుదీర్ఘంగా మాట్లాడాం. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను వదిలిపెట్టండి.

ఇదంతా గమనిస్తే ఎవరికైనా వచ్చే సందేహం – ఎవరు ఎవరికి దాసోహం అన్నారు? సేవకుడు, యజమానికి దాసోహం అన్నాడా? యజమాని సేవకుడికి దాసోహం అన్నాడా?

ఈ సంఘటనలే కాదు, అక్టోబరు 22, 2009 నాడు జరిగిన ఏకాంత భేటీ తదుపరి సంఘటనలనీ, వాటిని దాచో,పెంచో,తగ్గించో లేక వక్రీకరించో ప్రచారిస్తున్న మీడియానీ చూస్తే, ఇదే సందేహం వెయ్యింతలౌతోంది.

ఇంతకీ లోపలేం జరిగిందో సామాన్యులెవరూ తొంగి చూడలేరు కదా? జరుగుతున్న సంఘటనలని బట్టి, వ్యక్తుల ప్రవర్తనలని బట్టి విశ్లేషించుకోవలసిందే మరి!

నిజానికి ఏకాంత భేటికి ముందు జరిగిన సంఘటనలనీ, తర్వాతి పరిణామాలనీ కూడా పరిశీలిస్తే మరింత ఆసక్తి కరమైన అంశాలు, వాస్తవాలు గోచరిస్తాయి.

అక్టోబరు 22న జరిగిన ఆ ఏకాంత సమావేశంలో ఒకరు మరొకరికి దాసోహం అనటం గాక, మరింకేదో రాజకీయ చర్చ జరగలేదనటానికి తగినన్ని సంఘటనాత్మక తార్కాణాలున్నాయి. వాటిని పరిశీలించేందుకు – ఓ నెల రోజుల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

:-) బావుంది, మీ విశ్లేషణ.

ఇంత అమ్మగారూ గన్నుకి దాసోహం అని ఉండచ్చా! :O

ఇలా తెలిసింది, తెలియవచ్చింది, అభిజ్ఞ వర్గాల భోగట్టా, సమాచారం, ఇలాంటి పదాలు ఈ నాటి వార్తా పత్రికల్లో సర్వ సాధారణమైపోయాయి. నేనైతే ఇవన్నీ గాలి వార్తలుగా భావించి వదిలేస్తా. వార్తాపత్రికలు ఇంకా నిజాలే రాయాలంటూ ఎవరైనా ఆశిస్తే అది అత్యాశే అవుతుంది.

Me visleshana chala bagundandi .Nenu chala rojula nunchi ,almost meru start chesinappati nunchi chaduvutunnanu.

Ilanti visleshana artham kavalante entho kontha
Rajakeeya gnanam kavali.Nenu rajakeeya kutumbam nunchi(prajalaku vupayogapade) kavatamto ,na avagahana valana naku chala tondaraga paristithulu artham ayyayi.

Melanti vallu endaro enta cheppina ,kulam mattulono ,matam mattulono ,abhimanam to no vatini pattinchukoru.

Mana lanti vallu anta kalisi vere rakamga debba teyali ani kasi pudutundi.Kani danni operate cheyatam Indira,PVNR lanti vallake kudaraledo.
Meru cheppe nakili kanika vargame enno desalalo
vallu mottukune corporate agents.
Dabbu kosam vallu edina chestaru.
Mussolini CIA agent ani bayatapadinatte edo oka roju e Italy nagamma kuda CIA ani bayatapadutundi.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu